సాక్షి,హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, మెండం జయరాం, హబీబ్ అబ్దుల్ రెహమాన్లను ఎన్నికల పరిశీలకులుగా నియమించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్ నియమితులవగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డిని నియమించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్యప్రకాశ్, హబీబ్ అబ్దుల్ రెహమాన్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలేరు ఉప ఎన్నిక పరిశీలకులుగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి
Published Mon, May 9 2016 7:16 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement