
సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యవర్గ సమావేశం ఈ నెల 13న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10.30కి జరిగే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.