వడ్డీతో కూడిన రుణమాఫీ చేయాలి | Konda Raghava Reddy comments about Loan waiver | Sakshi
Sakshi News home page

వడ్డీతో కూడిన రుణమాఫీ చేయాలి

Published Thu, Mar 16 2017 4:08 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

వడ్డీతో కూడిన రుణమాఫీ చేయాలి - Sakshi

వడ్డీతో కూడిన రుణమాఫీ చేయాలి

వైఎస్సార్‌ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి

ఇబ్రహీంపట్నం: రైతులకు వడ్డీతో కూడిన రుణమాఫీ చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల మేనిఫెస్టోను పక్కకు పెట్టి ఓట్ల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే వడ్డీతో సహా రుణమాఫీ చేస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసే హామీలు ఏమయ్యా యని ప్రశ్నించారు. మిషన్‌ కాకతీయ, భగీరథకు వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించినా, వాటిల్లోని అవకతవకలపై దృష్టి సారించడం లేదని రాఘవరెడ్డి విమ ర్శించారు. ఆయన వెంట రాష్ట్ర సేవాదళ్‌ అధ్యక్షుడు బి.వెంకటరమణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement