Konda Raghava Reddy
-
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్ తీసుకుని రండి.. బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తానంటూ సునీత, షర్మిలకు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలన్నారు.‘‘షర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలి. నాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదు. వైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?. వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదు. వివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారు’ అంటూ కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.‘‘షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదు. రూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారింది. వైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోంది. సీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదు. షర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుంది. వైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసింది’’ అని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.‘‘షర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలు. తెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధం. బాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయింది. వైఎస్ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గం. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి. తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండి. షర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది’’ అని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. -
‘తప్పు చేస్తున్నావ్ షర్మిలా’
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికే వైఎస్ అని పేరుపెట్టుకుని ప్రజల ముందుకు వస్తే తమలాంటి అభిమానులు వదిలిపెట్టరని, తస్మాత్ జాగ్రత్త అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను హెచ్చరించారు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి. వైఎస్సార్‌జిల్లాలో పర్యటిస్తున్న కొండా రాఘవరెడ్డి.. షర్మిలపై మండిపడ్డారు. వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చే కుట్రలను ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్ అభిమానిగా షర్మిల చర్యలు తమనెంతో బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మురుసుపల్లి షర్మిలగా నువ్వు ఏ ఫుట్‌పాత్‌పై తిరిగినా మాకు అభ్యంతరం లేదు. మేము రాజశేఖర్‌రెడ్డి గారి వీరాభిమానులము. రాజశేఖర్‌రెడ్డిగారంటే మాకు ప్రాణం. రాజశేఖర్‌రెడ్డిగారు చనిపోయిన తర్వాత రెండు పుష్కరాలు వస్తే.. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో పిండాలు పెట్టినటువంటి బిడ్డలం మేము. మాలాంటి వారు లక్షలమంది తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికి వైఎస్ అని పేరు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నావ్ చూడు. మా లాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి కడప ప్రజలను జాగృతం చేస్తున్నాం. అక్కడ ఉన్నప్పుడు(తెలంగాణలో) ఆడ(అక్కడ) బిడ్డ అని అంటివి. ఇక్కడకొచ్చి(ఏపీ) ఈడ బిడ్డ అంటివి. దానికోసం సామెతలు. రక్తసంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్ కట్టాల్సిన అన్నకు నువ్వు రాక్షస రూపంలో ఆయన స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలివో మాకు అర్థమైతాంది.నేను ఇవాళ జగన్మోహన్రెడ్డిగారిని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవాలి. ఏం తప్పు చేసిండు జగన్మోహన్రెడ్డిగారు. నీకు ఏమి ఎరుక. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావా? నీకు తెలుసా నాడు-నేడు, తెలుసా నీకు అమ్మ ఒడి, తెలుసా నీకు గోరుముద్ద. ఏం తెలుసు నీకు. రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్నప్పుడు 850 రుగ్మతలు ఆరోగ్య శ్రీలో ఉంటే, ఈరోజు రెండు వేల ఐదువందల రుగ్మతలను ఆరోగ్య శ్రీలో పెట్టిన మహానాయకుడు జగన్మోహన్రెడ్డిగారు. నీది నాలుకనా.. తాటిమట్టనా? అని అడగదల్చుకున్నాం. ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖరరెడ్డిగారి కూతురిగా అంగీకరించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తెలుసుకో షర్మిలా. నువ్వు మురుసుపల్లి షర్మిలవు. నువ్వు మురుసుపల్లి అనిల్‌కుమార్ భార్యవు. అసలు నీకు ఏం కావాలి. నీకు ఆశ ఎక్కువ. ఆశయం మాత్రం లేదు. ఓర్వలేని తనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? అని ధ్వజమెత్తారు కొండా రాఘవరెడ్డి. -
చంద్రబాబు స్క్రిప్టునే షర్మిల చదువుతున్నారు
-
టీవీ 5 సాంబా వెధవ, చేసిన పని!.. షర్మిలకు రాఘవ రెడ్డి హిత బోధ
-
షర్మిల అబద్ధాలు.. ఇవీ అసలు నిజాలు
షర్మిల వెనుక విష నాగులు ఎవరు?. సొంత అన్నపై ఎందుకు విషాన్ని చిమ్ముతుంది?. విష బీజాలు ఎక్కడ మొలకెత్తాయి?. సీఎం జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది?. అసలు బ్లాక్ మెయిలింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో ఆధారాలతో సహా తీసుకొస్తానంటూ తేల్చి చెప్పారు వైఎస్సార్టీపీ మాజీ నాయకుడు కొండా రాఘవరెడ్డి. ఆమెను అహంకారపూరిత వ్యక్తిగా అభివర్ణించిన రాఘవరెడ్డి అనేక షాకింగ్ విషయాలు చెప్పారు. షర్మిల అబద్దాలు, నాటకాలు వెనుక దుష్టశక్తులు ఉన్నాయన్నారు. వైఎస్సార్‌ను అభిమానించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలన్నారు. వైఎస్సార్ పేరు పెట్టుకుని ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారంటూ షర్మిల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోనియాగాంధీ లాంటి వారిని ఎదురించి 16 నెలలు జైలుకి వెళ్లి, 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి.. ఎండనక, వాననకా కష్టపడి స్వయంశక్తితో తండ్రి పేరు నిలబెడుతున్న అన్నకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న షర్మిల తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ఎంతో గొప్పగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఊసరవెల్లి కూడా సిగ్గు పడే విధంగా షర్మిల రంగులు మారుస్తోందన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి, తెలంగాణలో ప్రజల్ని మోసం చేసి, కార్యకర్తల్ని నట్టేట ముంచేసి ఏపీకి వెళ్లడానికి కారణం ఆమెలోని కుట్ర పూరిత కోణం, అహంకారమే కారణమన్నారు. సీఎం జగన్ జైలులో ఉన్న సమయంలో తల్లి వైఎస్ విజయమ్మ చేత పాదయాత్ర చేయిద్దామనే ప్రతిపాదన వస్తే.. అమ్మకు మోకాళ్ల నొప్పులు అంటూ షర్మిల చెప్పిందన్నారు. ఆపై సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేత పాదయాత్ర చేయించాలనే ఆలోచన చేస్తే.. షర్మిల అడ్డుకట్ట వేసిందన్నారు. అన్న కోసం తాను ఉన్నానంటూ ముందుకు వచ్చిందని, ఆ సమయంలోనే షర్మిలలో విష బీజాలు పడ్డాయన్నారు కొండా రాఘవరెడ్డి. ఆపై వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి తనకు లాభం చేకూర్చేలా ఒక పని చేసిపెట్టామన్నాడని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే ఆ పనిని చేయనంటూ సీఎం స్థానంలో ఉన్న జగన్ విముఖత వ్యక్తం చేయడంతోనే వారిలో(షర్మిల, అనిల్) ఉన్న విషం ఈ రకంగా బయటకొస్తుందని రాఘవరెడ్డి మండిపడ్డారు. -
షర్మిల ఒక విషం..
-
రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌ది: రాఘవరెడ్డి
చేవెళ్ల: ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్, ముఖ్య అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. తాము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కార్యాలయాన్ని బుధవారం కో-కన్వీనర్ కోరని దయానంద్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 3 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, ఇంకా 34 లక్షల మంది ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌ది అని తెలిపారు. వర్గీకరణ వైఎస్సార్ కల అని చెప్పారు. మంద కృష్ణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకే ఎస్సీ వర్గీకరణ జరిగి ఉండాలని.. కానీ పాలకుల నిర్లక్ష్యంతో జరగలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కోరని ఉదయ్ కిరణ్, పంబాల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ నిర్మాణంపై వైఎస్ షర్మిల దృష్టి
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల త్వరలో ప్రకటించనున్న రాజకీయ పార్టీకి సంబంధించిన నిర్మాణ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని రిజిస్టర్ చేశారు. షర్మిల పార్టీ అధికార ప్రతినిధులుగా కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్‌రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి, బీశ్వ రవీందర్‌లు నియమితులైనట్లు వైఎస్ షర్మిల కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
వైఎస్సార్ అభిమానులను కించపరిచేలా ఆంధ్రజ్యోతి కథనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న కొత్త రాజకీయ పరిణామాలకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలోని విభేదాలే కారణమని ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ న్యూస్ చానల్లో చేస్తున్న ప్రచారాన్ని కొండా రాఘవరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతున్న తమ నాయకురాలు వైఎస్ షర్మిల.. తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న ఆలోచనలకు కుటుంబ విభేదాలను అంటగట్టడం రాష్ట్ర ప్రజలను, వైఎస్సార్ అభిమానులను కించపరచడమే అవుతుందన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల తీసుకోబోతున్న నిర్ణయానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు, వారి కుటుంబ దీవెనలు ఉంటాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
21న భారీ కాన్వాయ్‌తో ఖమ్మంకు షర్మిల
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.. తాజాగా గురువారం ఆమె ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆ జిల్లా నేతల విన్నపం మేరకు ఆమె ఖమ్మంలో పర్యటించనున్నారు. ఆ వివరాలను కొండా రాఘవరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘దివంగత నేత వైఎస్సార్‌కు ఖమ్మం జిల్లా బ్రహ్మరథం పట్టిందని అక్కడి నేతలు షర్మిలకు వివరించారు. ఈనెల 21న ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడి గిరిజనులకు 90 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల్ని కొందరు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధిత గిరిజనులతో ఆమె 45 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమవుతారు. అంతేగాకుండా 500 మంది ముఖ్య నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు..’అని ఆయన వివరించారు. ఉదయం 8 గంటలకు భారీ కాన్వాయ్‌తో.. ఈ నెల 21న ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారని రాఘవరెడ్డి తెలిపారు. ‘హైదరాబాద్ నుంచి హయత్‌నగర్, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, పాలేరు మీదుగా ఆమె ఖమ్మంలోకి ప్రవేశిస్తారు. అందుకు సంబంధించి దారి పొడుగునా భారీగా స్వాగత ఏర్పాట్లు ఉంటాయి. ఖమ్మం చేరుకున్నాక మొదట ఆమె వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఏ జిల్లాకు వెళ్లినా 2004 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ పరిపాలన కాలంలో జరిగిన అభివృద్ధి, తర్వాత అనేక మంది ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులపై షర్మిల సమీక్ష చేస్తారు. వైఎస్సార్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం..’అని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల భేటీ.. షర్మిలతో వైఎస్సార్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారని రాఘవరెడ్డి తెలిపారు. ఆమె పాదయాత్ర చేసినప్పుడు వెన్నంటి ఉన్న వ్యక్తి ఆళ్ల అని.. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని ఆయన వెల్లడించారు. కాగా, షర్మిల హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. మూడ్రోజుల పాటు అమె అక్కడే ఉంటారని.. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చాక పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడ్తారని సమాచారం. -
ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు సీఎంలు
సాక్షి, వరంగల్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. బుధవారం హన్మకొండలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన 125 అంశాల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ నెరవేరలేదని అన్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల్లో చేసిన 600 వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవెర్చలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్‌లు, నీళ్లు, నిధులు, నియామకాల్లో పురోగతి సాధించలేదని.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో చాలా అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాలలో దేశంలో మొదటి స్థానంలో ఏపీ, రెండో స్థానంలో తెలంగాణ ఉంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ రూ.లక్ష వరకు కాగా.. వడ్డీ మాఫీ మాత్రం కాలేదన్నారు. జిల్లాలో బిల్డ్ కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కృషి చేస్తామని తెలిపారు. -
ఏపీలో రాక్షస పాలన
యాదగిరిగుట్ట: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఈనెల 25న హైదరాబాద్‌లో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఆరొందల అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని, నాలుగేళ్లయినా ఇంకా అబద్ధాలతోనే ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. కాగా, యాదాద్రిలో జగన్ పేరు మీద పూజలు చేయించామని, 2019లో ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నట్లు రాఘవరెడ్డి తెలిపారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటరాంరెడ్డి, విజయ ప్రసాద్, చెరుకు శ్రీనివాస్, సీఈసీ సభ్యులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుమ్మ అప్పిరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్, ఆయా జిల్లాల అధ్యక్షులు నాడం శాంత, వడ్లోజు వెంకటేశ్,, భగవంత్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, అప్పం కిషన్, బాన్సువాడ కో ఆర్డినేటర్ రామ్మోహన్, యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి సతీష్‌రాజ్ తదితరులు ఉన్నారు. -
వైఎస్ జగన్‌కు మద్ధతుగా తెలంగాణలో పాదయాత్ర
-
13న వైఎస్ఆర్ సీపీ తెలంగాణ కార్యవర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యవర్గ సమావేశం ఈ నెల 13న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10.30కి జరిగే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, జిల్లా ఇన్చార్జులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. -
రాష్ట్రంలో పాలనను కేసీఆర్ గాలికొదిలేశారు..
గుంటూరు : తెలంగాణలో పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ గాలికి వదిలేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తెలంగాణ సామాజిక, ఆర్థిక అంశాలపై రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, కేసీఆర్‌లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉండడం మన దురదృష్టకరమన్నారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను కేసీఆర్ నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో 600 వందల వాగ్ధానాలు చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కుంటే మూడోకన్ను తెరుస్తానంటూ చెప్పిన కేసీఆర్ ఏమీ చేయకుండా తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని కొండా రాఘవరెడ్డి దుయ్యబట్టారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతోనూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దేశంలో 46 లక్షల ఇళ్లు కడితే ఒక్క ఏపీలోనే 37 లక్షల ఇళ్లు వైఎస్ఆర్ కట్టించారని చెప్పారు. ఏపీ, తెలంగాణలో ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారన్నారు. రాజ్యాంగానికి విలువ ఇవ్వని ఇద్దరు ముఖ్యమంత్రులను, అరాచకాలను, భూదందాలను ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనే పద్ధతిని ఖండిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానం ప్రవేశపెట్టిన... తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండా రెపరెపలాడేందుకు అందరూ కృషి చేయాలని శివకుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ నగేష్ మాట్లాడుతూ 2019లో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు అందరం అండగా నిలుద్దామని ఆయన అన్నారు. -
మూడేళ్ల పాలనపై శ్వేతపత్రం ఇవ్వండి
టీఆర్ఎస్కు కొండా రాఘవరెడ్డి డిమాండ్ షాద్‌నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. గురు వారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇంతవరకు తన మేనిఫెస్టో లోని ఒక్కహామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఈ మూడేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్త య్యాయి. వాటికి చేసిన ఖర్చు ఎంత.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తానని, ఒక్కో జిల్లాకు 5 నియోజకవర్గాలు ఉంటా యని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 31 జిల్లాలు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం 36 లక్షల ఇల్లు నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుకు మూడు దఫాలుగా రుణమాఫీ చేసినా ఇంకా బాకీ తీరలేదన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలిస్తామని కేవలం 250మందికే ఆ డబ్బు అందజేశారన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్‌కార్డులు ఇంకా అమలుకు నోచుకో లేదన్నారు. రాబోయే ఆసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రతి నియోజకవర్గం లో పోటీ చేస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, యూత్ జిల్లా అధ్యక్షుడు శీలం శ్రీను, మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ జహంగీర్, విద్యార్థి విభాగం జిల్లా జనరల్ సెక్రటరీ అఖిల్, యూత్ జనరల్ సెక్రటరీ సంతోష్ పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి అబద్ధాల కోరు
కొండా రాఘవరెడ్డి హైదరాబాద్ :అబద్ధాలకోరు సీఎం పాలనలో రాష్ట్రం దగా పడుతోం దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో విలేకరులతో మాట్లాడారు. డబుల్బెడ్రూం ఇళ్ల పథకం హామీతో అధికా రంలోకి వచ్చిన కేసీఆర్, మూడేళ్లు దాటినా పదుల సంఖ్యలోనే ఇళ్లు నిర్మించి ప్రజలను వంచించారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ విషయంపై నిలదీయటంతో రాష్ట్ర వ్యాప్తం గా రెండు లక్షలు మాత్రమే నిర్మిస్తామని చెప్పారన్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 5 లక్షలకు పైగా ప్రజలు ఇళ్లకోసం దరఖాస్తు చేశారని.. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల వరకు ఆ సంఖ్య ఉంటే సీఎం మాత్రం రెండు లక్షలే నిర్మిస్తామనడం విడ్డూరమన్నారు. దీన్నిబట్టి డబుల్ బెడ్రూం ఇళ్లను ఆశిస్తున్న లక్షలాదిమందిని నిలువునా ముంచేం దుకు కేసీఆర్ సిద్ధమయ్యారని తేలిపో యిందన్నారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లో అప్పటి ఏపీలో ఏకంగా 36 లక్షల గృహాలను నిర్మించారని, అందులో తెలంగా ణలో 16లక్షలు ఉన్న విషయాన్ని కేసీఆర్ గమనించాలని అన్నారు. ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు వచ్చే పథకాలను చేపట్టి, పేదల పథకాన్ని అటకెక్కించారన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని వాగ్దానం చేసిన సీఎం.. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం పదుల సంఖ్యలో రోగులు చనిపోతున్నా చేష్టలుడిగి చూస్తున్నారన్నారు. ఇష్టారాజ్యంగా అబద్ధాలు చెపుతున్న ముఖ్యమంత్రి ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. -
వడ్డీతో కూడిన రుణమాఫీ చేయాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ఇబ్రహీంపట్నం: రైతులకు వడ్డీతో కూడిన రుణమాఫీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను పక్కకు పెట్టి ఓట్ల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే వడ్డీతో సహా రుణమాఫీ చేస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసే హామీలు ఏమయ్యా యని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, భగీరథకు వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించినా, వాటిల్లోని అవకతవకలపై దృష్టి సారించడం లేదని రాఘవరెడ్డి విమ ర్శించారు. ఆయన వెంట రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బి.వెంకటరమణ ఉన్నారు. -
ఉద్యోగాలడిగితే అరెస్టులా..?
⇒ వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ప్రశ్న ⇒ వెయ్యి రోజుల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శ సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ.. అరెస్టులు, దాడులు చేయడమేంటని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కార్ తీరును సహించబోమని హెచ్చ రించారు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహిం చిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిపల్లి మండలా నికి చెందిన పలువురు రాఘవరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీయా లని పిలుపు నిచ్చారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరితే.. అరెస్టులు, దాడులు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాంకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. వెయ్యి రోజుల పాల నలో ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలెక్కడ? నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలు ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణలో వాటి అమ లులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాఘవరెడ్డి విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 36 ప్రాజెక్టులు ప్రారంభించారని, అందులో ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. రీ డిజైన్ల పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. మిగులు రాష్ట్రమని చెబుతున్న పాలకులు.. దాదాపు రూ.600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు, కంది రైతుల సబ్సిడీ, విద్యార్థుల ఉపకార వేతనాలు ఎందుకు చెల్లించడం లేదన్నారు. 108 వాహనాల్లో డీజిల్‌కు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉంద న్నారు. లక్షా తొమ్మిది వేల ఉద్యాగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం పదివేల ఉద్యో గాలూ ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. 12న ఆవిర్భావ వేడుకలు వైఎస్సార్ సీపీ ఆవిర్భవించి ఆరేళ్లు పూర్తి చేసుకుం టున్న సందర్భంగా మార్చి 12న ఆవిర్భావ వేడుక లను ఘనంగా నిర్వహించాలని కొండా రాఘవరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ, మండల, నియోజక, జిల్లా స్థాయిలో జెండాలు ఎగుర వేయ డంతోపాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు బంగారు వెంకట రమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నర్ర భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల ర్యాలీకి వైఎస్సార్సీపీ తెలంగాణ మద్దతు
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవ రెడ్డి ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణకు అప్పటి ప్రభుత్వాలు అనుమతినిచ్చిన విషయాన్ని ఒక ప్రకటనలో గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నిం చారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, ఉద్యమాలతో సాధిం చుకున్న రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదన్నారు. -
‘ఫీజు’ మహాధర్నాకు తరలిరండి
విద్యార్థులకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పిలుపు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ నెల 24న జరిగే మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తరలిరావాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి కోరారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం రూపొందించిన ‘ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం చేపట్టే మహాధర్నాని జయప్రదం చేయండి’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మహానేత దివంగత ముఖ్యమంతి వైఎస్సార్ మానసపుత్రిక అని ఆయన పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో వైఎస్సార్ దీన్ని ప్రవేశపెట్టారన్నారు. వైఎస్సార్ మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు, ఆ తర్వాత విభజన అనంతరం గద్దెనెక్కిన ప్రభుత్వాలు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. ఇప్పటికీ రూ.3 వేలకోట్లు బకాయిలు ఉన్నాయంటే ప్రభుత్వానికి విద్యార్థులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఆందోళనతోనే ప్రపంచ వ్యాప్తం అయిన విషయం, ఉద్యమానికి గుండెకాయగా విద్యార్థులు నిలచారన్నా విషయం టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మరవటం ఆశ్చర్యకర మన్నారు. ఫీజు పోరు వైపు రాష్ట్రంలోని విద్యా ర్థులు, తల్లిదండ్రులు అడుగులు వేస్తే సీఎం కేసీఆర్ పలాయనం చిత్తగించాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హితవు పలికారు. ఈ ఆందోళన ఆరంభం మాత్రమే.. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్య క్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద 24న జరిగే మహాధర్నాకు విద్యార్థులు వేలాదిగా తరలిరావాలని కొండా రాఘవరెడ్డి కోరారు. ఉదయం 11 గంటలకు ధర్నా ప్రారంభమవుతుందన్నారు. ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని.. ప్రభుత్వం కళ్లు తెరవకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శు లు కె. శివకుమార్, మతీన్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు అవి నాష్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథచారి తదితరులు పాల్గొన్నారు. -
అది టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే
♦ ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజం ♦ తెలంగాణ, ఏపీ సీఎంలకు భూమి పిచ్చి పట్టుకుంది: కొండా రాఘవరెడ్డి ♦ భూసేకరణ సవరణ చట్టంపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇద్దరు సీఎం లకు భూమి పిచ్చి పట్టుకుందని దుయ్య బట్టింది. ఇరు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం భూసేకరణకు అనుసరి స్తున్న విధానాలేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 50–70 వేల కోట్ల నుంచి రూ. 2.44 లక్షల కోట్లకు పెరగడానికి ప్రాజెక్టుల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వ జాప్యమే కారణమని ఆ పార్టీ ప్రధాన కార్య దర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఈ అంచనా వ్యయం రూ. 3.44 లక్షల కోట్లకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఇందుకు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. సోమవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జీవో 123 మతలబు ఏమిటో, కేంద్ర భూసేకరణ చట్టం–2013 ఎందుకు వద్దో, రాష్ట్ర భూసేకరణ (సవరణ) చట్టం–2016 అవసరం ఏమిటో వివరిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా దీనిపై అర్థమయ్యేలా ప్రజలకు సీఎం కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు జీవో 123 ప్రకారం ఎంత భూమిని సేకరించారో వెల్ల డించాలని డిమాండ్ చేశారు. కేంద్ర భూసేక రణ చట్టం–2013కు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం సవరణ చట్టాన్ని తీసుకురావా ల్సిన అవసరమేమిటో చెప్పాలన్నారు. ప్రచారార్భాటాల కోసమే కేసీఆర్ ప్రభుత్వం శాసనసభ సమావేశాలను ఉపయోగించు కుంటోందని రాఘవరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో రూ. 23 వేల కోట్ల వరకు కేటాయించి ఇప్పటివరకు కేవలం రూ. 11 వేల కోట్ల మేర మాత్రమే ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 12 ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం, ఇతర అంశాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 75 వేల ఎకరాలను సేకరించాల్సి ఉండగా, కేవలం 5 వేల ఎకరాలే సేకరించినా ఆ ప్రాజెక్టు నుంచి 2018కల్లా నీరిస్తామని సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెద్ద ఎత్తున పెంచేసిన ప్రభుత్వం రైతులు, నిర్వాసితులకు రూ. 10–20 వేల కోట్ల వరకు పరిహారం చెల్లించేందుకు వెనకడుగు ఎందుకు వేస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వాసితులంటే ప్రభుత్వానికి అంత కక్షసాధింపు ఎందుకని వైఎస్సార్ కాంగ్రెస్ నేత నిలదీశారు. -
జగన్ జన్మదినం సందర్భంగా పేదలకు దుప్పట్లు
-
ప్రజా సమస్యలపై పోరాటం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో అన్ని మండల, నియోజవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు త్రీవ సంకట స్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్ అదును దాటుతున్నా.. ఇంతవరకు పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారని చెప్పారు. దీంతో పెట్టుబడులేక పంటసాగు ఎలా చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈనెల 21న వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. షాద్‌నగర్ పట్టణం కేంద్రంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. రక్తదాన శిబిరాల ఏర్పాటు, అన్నదానం, దుస్తుల పంపిణీ తదితర సేవాకార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని సమావేశంలో తీర్మానించారు. జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని బలోపేతం కావడానికి శాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బండారు వెంకట రమణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృతసాగర్, యువజన విభాగం అధ్యక్షులు వి. రామ్మోహన్, మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం, రాష్ట్ర కార్యదర్శి పాప వెంకట్‌రెడ్డి, రమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
60 కోట్లతో సీఎం భవనాలు నిర్మించుకుంటే చాలా?
హైదరాబాద్: సీఎం కేసీఆర్ 60 కోట్లతో ప్రగతి భవన్ కట్టించుకున్నాడు. కానీ, రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం తన కోసం భారీ వ్యయంతో భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ మొదటి కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమైయ్యాయని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై కేసీఆర్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల రైతాంగం అప్పుల ఊబిలో ఉన్నట్లు జాతీయ సర్వేలో వెల్లడైందని చెప్పారు. బ్యాంకులు రుణాలిచ్చి రైతులను ఆదుకోవాలని రాఘవరెడ్డి కోరారు. -
60 కోట్లతో భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందా?
-
'ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'
ఖమ్మం : ఎన్నికల మేనిఫెస్టో అమలుపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. -
రైతుల సమస్యలు పరిష్కరించండి
♦ సర్కారుకు వైఎస్సార్సీపీ తెలంగాణ శాఖ సూచన ♦ వైఎస్ ముందుచూపు వల్లే ♦ తెలంగాణ ప్రాజెక్టుల్లో పురోగతి ♦ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటాల కోసం సమీక్షలతో కాలం గడపకుండా రైతుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది. సీఎం కేసీఆర్ మొదలుకుని హరీశ్‌రావు, కేటీఆర్ ఇతర మంత్రులు సమీక్షల పేరిట కాలం వెళ్లబుచ్చుతున్నారు తప్పించి, ప్రజలు ముఖ్యంగా రైతాంగం సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవా తీసుకోవడం లేదంది. గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... రబీలో 31.90 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ అధికారులతో సమీక్షలో హరీశ్‌రావు హెచ్చరించడం విడ్డూరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో తెలంగాణలో 36 ప్రాజెక్టులను ప్రారంభించారని, ఆయన హయాంలోనే 6 ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు జలకళతో ఉన్నాయంటే గతంలో వైఎస్ చేసిన కృషే కారణమన్నారు. అయితే ఇది తమ ఘనతగా చెప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖరీఫ్‌లో ఏమైంది, ఎంత పంట వేశారు, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటీ అన్న దానిపై సమీక్ష నిర్వహించి ఉండాల్సిందన్నారు. ఖరీఫ్‌లో రైతులకు రూ.17,489కోట్ల మేర కొత్త రుణాలు ఇవ్వాల్సిండగా, రూ.8.60వేల కోట్లు మాత్ర మే రుణాలు ఇచ్చారని చెప్పారు. ఈ కాలంలో 1.08 లక్షల ఎకరాల్లో పంట వేసేందుకు వ్యవసాయ నిపుణులు అంచనా వేసినా, అందులో 45 శాతం కూడా రైతులు పంటలు వేయలేకపోయారన్నారు. దీంతో పాటు రుణమాఫీ జరగక, కొత్త రుణాలు అందక, కల్తీ విత్తనాలతో కుదేలై అధిక వడ్డీతో అప్పులు తెచ్చి వేసిన పంటలు దెబ్బతిని రైతులకు రూ.2 వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఈ అంశాలతో పాటు, కరువు మండలాల జాబితాను కేంద్రానికి పంపించడం, హరితహారం పేరిట పోడు భూముల నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులను వెళ్లగొట్టడంపై ఎలాంటి సమీక్షను ప్రభుత్వం నిర్వహించలేదని విమర్శించారు. మిషన్ కాకతీయపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. -
భద్రకాళి చెంత సీఎం కేసీఆర్ అబద్ధాలు
♦ వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజం ♦ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ♦ 31 జిల్లాలు చేయడంలో ఆంతర్యం ఏమిటి? సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భద్రకాళి అమ్మ వారి దగ్గర పచ్చి అబద్ధాలు మాట్లాడారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో వర్షాలు పడి, చెరువులు నిండి రైతులు సంబరాలు చేసుకుంటున్నారని సీఎం చెప్పడం ఆయన స్థాయికి తగినది కాదని పేర్కొంది. పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగక, బ్యాంకు రుణాలు దొరకక అధిక వడ్డీతో వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని చెల్లించలేక, నకిలీ విత్తనాలతో వేసిన పంటలు నష్టపోయి ైరె తాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే సంతోషంగా ఉన్నారంటూ పేర్కొనడం వాస్తవ దూరమని విమర్శించింది. సోమవారం ఆ పార్టీ ప్రధానకార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాలతో రైతుల పంటలకు తీవ్రనష్టం వాటిల్లినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారమివ్వాలని, అధిక వర్షాల వల్ల జరిగిన నష్టానికి సహాయం చేయాలంటూ ఒకవైపు కేంద్రానికి మంత్రుల బృందం వినతిపత్రాన్ని సమర్పిస్తే, మరోవైపు రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు. కొత్త జిల్లాలపై ఎందుకింత గోప్యత? తాము మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక రాద్ధాంతం చేస్తున్నాయని కేసీఆర్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పుడు 31కి పెంచడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీనితో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, ఎస్సీలతో పాటు ఎస్టీలకు 3 ఎకరాల భూమి పంపిణీ, కేజీ టు పీజీ తదితర పథకాల అమలు ఏమైందని నిలదీశారు. జిల్లాల ఏర్పాటుపై కమిటీల మీద కమిటీలు వీస్తున్నారని, మరి అఖిలపక్షభేటీలో మరో రెండు సమావేశాలను ఏర్పాటు చేస్తామని ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. జిల్లాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేస్తున్నట్లయితే ఇంత హడావుడిగా, అత్యంత గోప్యంగా ఉంచి ఆదరాబాదరాగా ప్రకటించడం ఏమిటని నిలదీశారు. చివరి నిమిషంలో సైతం కరీంనగర్ జిల్లాలోని మంత్రి హరీశ్‌రావు సొంతూరును చీల్చి సిిద్దిపేట జిల్లాలో కలపడమేమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గుళ్లు, గోపురాలు తిరగడాన్ని తాము తప్పుబట్టడం లేదని, అయితే గుళ్లలో ధూప, దీప నైవేద్యాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రకటించిన రూ.రెండున్నరవేల మొత్తాన్ని ఎందుకు నిలిపేశారని నిలదీశారు. -
అనారోగ్యశ్రీగా మారుస్తున్న సీఎం
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: పేదల పెన్నిధిగా ఉన్న ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ పథకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజమెత్తింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక అయిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని ప్రారంభించి, 920 రుగ్మతలకు ఇందులో భాగంగా వైద్యసేవలు అందించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని పేర్కొంది. మంగళవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్సార్ హయాంలో 2007లో మొదట మూడు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అన్ని జిల్లాలకు వర్తింపజేసి పకడ్బందీగా అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు ఆరు సార్లు బంద్ చేశాయన్నారు. ఏటా బతుకమ్మ నిర్వహణకు నిధులు పెంచుతూ పోతున్న ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ అంటే ఎందుకంత నిర్లక్ష్యం చూపుతున్నదో చెప్పాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేసి, భవిష్యత్‌లో మళ్లీ ఈ సేవలు స్తంభించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రైతులపై సీఎం కక్షపూరిత ధోరణి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి కూసుమంచి: ‘రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం ముందుకు సాగవు.. అని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. కానీ, ఆయన మాత్రం రైతాంగం పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలోని ధర్మాతండా వద్ద వర్షాలకు దెబ్బతిన్న పత్తిచేలను ఆయన పరిశీలించారు. గిరిజన రైతులు జర్పుల కృష్ణ, శివతో మాట్లాడారు. పత్తికి పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ‘ఈ ఏడాది పంటలు బాగాలేవు. కల్తీ విత్తనాలు, వర్షాలతో దెబ్బతిన్నాయి. పంటలు పోతుంటే ఏ మంత్రి, అధికారి కూడా వచ్చి చూడటం లేదు’ అని వాపోయారు. తెలంగాణ వస్తే తమ కష్టాలు పోతాయనుకున్న రైతులకు కష్టాలే మిగులుతున్నాయని ఈ సందర్భంగా కొండా రాఘవరెడ్డి అన్నారు. -
శాస్త్రీయత లేకుండా జిల్లాలా..?
► ప్రభుత్వ తీరుపై కొండా రాఘవరెడ్డి ఆగ్రహం సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం శాస్త్రీయత పాటించడం లేదని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంత చరిత్ర, నేపథ్యాన్ని చెరిపేలా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కొత్త జిల్లాతో వచ్చే సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు మెదపడం లేదని, అందరూ అధికారపార్టీ నేతలే కావడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారన్నారు. ఆందోళనలు, ధర్నాలు చేస్తే ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటుందని... శాస్త్రీయత లేకుండా ఏర్పాటు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. వికారాబాద్ జిల్లాలో నోటిఫికేషన్ లో పేర్కొన్న 19 మండలాలు తప్పకుండా ఉండాల్సిందేనని, లేకుంటే ఆ జిల్లా ఉనికికే కష్టమన్నారు. స్వతంత్ర సమరయోధుడైన కొండా వెంకట రంగారెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన జిల్లా స్వరూపాన్ని భంగపర్చేలా ప్రభుత్వ చర్యలున్నాయన్నారు. జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక పద్ధతిగా ముందుకెళ్లాలని, గడియకోమారు మాట మారిస్తే ప్రజలు విశ్వసించరన్నారు. -
పోడు భూములను సొంతదారులకిచ్చేయాలి
వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి సాక్షి, హైద రాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరిట పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురిచే స్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రధానకార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అని ప్రశ్నించారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా 2006 లో అటవీహక్కుల చట్టాన్ని తీసుకొచ్చి, ఖమ్మం జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల్లో పోడుభూముల్లో గిరిజనులు, ఇతర సాగుదారులకు పట్టాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వెంటనే మిగతా వారికి పట్టాలివ్వాలని, వారికి బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఖమ్మంజిల్లాలో పోడు భూములు అన్యాక్రాంతం చేయడాన్ని ఖండించారు. ‘‘పోడుకు రాజకీయ చెర’’ శీర్షికతో సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ ఇటు తెలంగాణలోని అధికారపార్టీ నాయకులు, అటు ఏపీకి చెందిన రాజకీయ నాయకులు అక్రమంగా పోడుభూములను ఆక్రమించుకుని, వాటిని లీజుకు ఇచ్చుకోవడాన్ని తప్పుబట్టారు. వాస్తవంగా ఈ పోడు భూములను సొంతదారులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ పార్టీ పక్షాన ఆ భూములను సందర్శించి సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కాకుండా రకరకాలుగా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ముందుగా ఏదో ఒక డ్రాఫ్ట్‌నిచ్చి దానిపై వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటామని చెప్పి, మళ్లీ ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా వ్యవహరించాలని సూచించారు. -
'ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు'
హైదరాబాద్: ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు' అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదివాసీల పోడు భూములపై ప్రభుత్వ పెద్దలు, టీఆర్ఎస్ నేతలు కన్నేయడం దారణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో గిరిజనులు, ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. గిరిజనులు, ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూములను ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు లీజుకు ఇస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివాసీల జీవనోపాధిని దెబ్బదీయొద్దని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వం పొట్ట కొడుతోంది
-
'కేసీఆర్ గారు.. మీకో మంచి అవకాశం'
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ప్రశంసించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన 'ఓటుకు కోట్లు కేసులో కూడా ఇలానే ప్రవర్తిస్తే ఇంకా మంచి పేరు వస్తుంది' అని అన్నారు. 'కేసీఆర్ గారు.. ఇది మీకు మంచి అవకాశం' అంటూ కితాబిచ్చారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌ది మహా మోసం
- ఆ ఒప్పందాలు ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలు - వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ కుదుర్చుకున్న ఒప్పం దం.. మహా మోసంతో కూడుకున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. తమ్మిడిహెట్టి బ్యారే జీ 152 మీటర్లకు కాక 148 మీటర్లకు తగ్గించి కేసీఆర్ ఒప్పందం చేసుకోవడం మోసంతో కూడుకున్న వ్యవహరమని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీని 102 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉండగా 100 మీటర్ల ఎత్తుకే ఒప్పందం చేసుకోవటం దారుణమన్నారు. ఈ రెండూ చారిత్రక ఒప్పందాలుగా కేసీఆర్ చెప్పటం సరైంది కాదన్నారు. ఈ రెండింటిని కేసీఆర్ సర్కార్ చేసిన చారిత్రక తప్పిదాలుగా తమ పార్టీ భావిస్తోందని పేర్కొన్నారు. మార్చి 8న అంతా అయిపోయిందని మహారాష్ట్ర నుంచి వచ్చిన సీఎం కేసీఆర్, ఆయన భజన బృందం బేగంపేట్ విమానాశ్రయం నుంచి గుర్రాలు, ఒంటెలపై ఊరేగారని, ఇప్పుడు మళ్లీ అదే బేగంపేట్ విమానాశ్రయం నుంచి అదే రీతిలో సీఎంతో పాటు ఆయన భజన బృందం ఊరేగటం చూసి ప్రజలు విస్తుపోతున్నారని చెప్పారు. ప్రచార ఆర్భాటాలకు ప్రజాధనాన్ని నీళ్లల్లా ఖర్చు చేస్తున్నారని, ఆర్భాటాలుమాని ప్రజలకు మేలు చేసే పనిచేపట్టాలని సూచించారు. వర్షాలు లేక రైతులు విలవిలాడుతున్నారని, రైతులకు చేయాల్సిన 25 శాతం రూణమాఫీని ఒకేసారి చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాం డవం చేస్తోందని కేంద్ర జల సంఘం చెప్పిం దని, ప్రభుత్వం ఆ దిశగా ఏ చర్యలు తీసుకుంటుందో వివరించాలని డిమాండ్ చేశారు. విగ్రహం తొలగింపుపై విచారణ జరపాలి వైఎస్సార్ విగ్రహాలు ఉంటే ఆ మహానేత ప్రజల హృదయాల్లో అలాగే ఉండిపోతారని భయపడి టీడీపీ భావజాలం ఉన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని తొలిగించి నీటి లో వేశారని రాఘవరెడ్డి ఆరోపించారు. విగ్రహం ఉన్న ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
కేసీఆర్ ఒప్పందాల మతలబు ఏంటో?
-
కేసీఆర్ ఒప్పందాల మతలబు ఏంటో?
హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ సర్కార్ చేసుకున్న ఒప్పందాల మతలబు ఏంటో బయటపెట్టాలని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలన్నీ బూటకమేనని కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. బ్యారేజీల ఎత్తు ఎందుకు తగ్గించారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏంసాధించారని పటాసులు కాల్చి, సంబరాలు చేసుకుంటున్నారన్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని, వారిని ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు...ప్రత్యేక విమానంలో వెళ్లారని .. ఈ ఒప్పందాల వల్ల ఒరిగిందేమిటో చెప్పాలన్నారు. ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ చేసుకున్నది చారిత్రత్మక ఒప్పందం అని చెప్పడం విడ్డూరంగా ఉందని కొండా రాఘవరెడ్డి అన్నారు. మరోవైపు వరంగల్ జిల్లా పరకాలలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు. దోషులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. వైఎస్ఆర్ విగ్రహం తొలగించడం వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హస్తముందన్నారు. నిందితుల విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని అన్నారు. -
అఖిలపక్షం సీఎం ఇంట్లో దావత్ కాదు కదా..?
* వైఎస్సార్సీపీని అఖిలపక్ష భేటీకి పిలవకపోవడం ఏమిటీ..? * ఏ ప్రాతిపదికన మా పార్టీని ఆహ్వానించలేదు..? * ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతులపై ప్రభుత్వానికి నమ్మకం లేదా? * నేడు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన * వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన తమ పార్టీని.. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఏ ప్రాతిపదికన ఆహ్వానం పంపలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈసీ గుర్తింపు పొందిన పార్టీని పిలవకపోవడం అంటే ఎన్నికల సంఘాన్ని అవమానించడమేనని ధ్వజమెత్తింది. అఖిలపక్ష సమావేశమనేది ముఖ్యమంత్రి ఇంట్లో దావత్(విందు) అయితే కాదు కదా? అని ప్రశ్నించింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థకు లోబడి అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు ఆహ్వానం పంపించాల్సి ఉం డగా, తమ పార్టీకి ఎందుకు పంపించలేదో చెప్పాలని నిలదీసింది. ప్రభుత్వం ఏ ప్రామాణికం ఆధారంగా మిగతా పార్టీలను పిలిచిం దో, ఏ కొలబద్ద ప్రాతిపదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేయదలుచుకుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికారప్రతినిధి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీనే లేదని, విలీనమైపోయిందని ప్రకటించిన అధికార టీఆర్ఎస్.. ఆ పార్టీని అఖిలపక్షానికి ఆహ్వానించగా తమ పార్టీని మాత్రం ఎలా విస్మరించిందని ప్రశ్నించారు. సీపీఐ, సీపీఎంకు అసెంబ్లీలో ఒక్కో సభ్యుడే ఉన్నా అఖిలపక్షానికి పిలిచారని, వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో తెలంగాణలో ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిచిన విషయాన్ని ఎలా విస్మరించారని నిలదీశారు. ఈ అంశంపై తాము రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఇది సీఎంకు తెలియకుండా జరిగితే దానిని సరిదిద్దుకోవాలని సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన దీక్షను చేపడుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుతూ.. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాల సర్కార్‌గా మారిపోయిందని, ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వంటి దుర్మార్గమైన, తుగ్లక్ పాలన ఎక్కడా లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్లు తెరిచి చిల్లర మల్లర రాజకీయాలు చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించేలా అఖిలపక్షానికి తమ పార్టీని ఆహ్వానించాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్ని నిర్ణయాలూ తీసుకుని, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో మొక్కుబడిగా అఖిలపక్షానికి కొన్ని పార్టీలనే ఆహ్వానించిందని విమర్శించారు. -
సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం-కొండా
రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటలే శరణ్యం అని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఆదివారం లోటస్ పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండల కమిటీ అధ్యక్షుల నియామకంతో పాటు కమిటీ సభ్యులను సత్వరమే నియమించుకోవాలని చెప్పారు. ఈ నెల 8 న వైఎస్సార్ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్విహించాలని సూచించారు. జిల్లా ప్రాజెక్టుల నిర్మాణాల్లో సీఎం కేసీఆర్ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని చెప్పారు. మిగతా పార్టీ సరైన రీతిలో ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాయని తెలిపారు. ప్రజల్లో బలపడేందుకు ఇదే సరైన సమయం అని తెలిపారు. కార్యవర్గ సభ్యులు కష్టించి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా పరిశీలకుడు రాంభూపాల్ రెడ్డి, సహయ పరిశీలకులు సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. అది సరైంది కాదని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి హితవు పలికారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైద్యం కోసం పేదలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న వైఎస్సార్ 2007లో మూడు జిల్లాల్లో ఆరోగ్యశ్రీని ప్రారంభించి తొమ్మిది నెలలు తిరగక ముందే మిగతా 20 జిల్లాలకు వర్తింపజేశారన్నారు. 500 రోగాలను అందులో చేర్చడంతో పథకం ద్వారా వేలాది మంది లబ్ధి పొందారన్నారు. వైఎస్సార్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చే శారన్నారు. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీని మూసివేయడానికి కంక ణం కట్టుకున్నట్లు కన్పిస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 450 కోట్లు బకాయి చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. తక్షణమే బకాయిలు చెల్లించి... ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్య శ్రీపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రులు స్పందించాలి... హైకోర్టు రూపొందించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలని, తమకు న్యాయం కావాలని తెలంగాణ న్యాయాధికారులు చేస్తున్న డిమాండ్ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇద్దరు సీఎంలు, గవర్నర్, చీఫ్ జస్టిస్ కూర్చొని తక్షణమే చట్టపరంగా దీనికి పరిష్కార మార్గం వెతకాలన్నారు. -
బంగారు తెలంగాణ అంటే చార్జీలు పెంచడమా?
హైదరాబాద్ : రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీవైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ... బంగారు తెలంగాణ అంటే ఛార్జీలు పెంచడమా...? అని ఆయన ప్రశ్నించారు. రెండేళ్ల సంబరాలంటూ ప్రచారానికి రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలపై చిల్లిగవ్వ కూడా భారం వేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పెంచిన ఛార్జీలకు నిరసనగా శనివారం ఉదయం 10.00 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ధర్నా నిర్వహించనున్నట్లు కొండా రాఘవరెడ్డి చెప్పారు. -
రైతు సమస్యలపై దృష్టి సారించండి
హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని టీ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ...తక్షణమే వడ్డీతో సహా రైతుల రుణమాఫీని అమలు చేయాలన్నారు. రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కొండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ హైటెక్ పోకడలు మాని...రైతు సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. -
వైఎస్సార్ సీపీ కమిటీలో పలు నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో శుక్రవారం పలు నియామకాలు జరిగాయి. రాష్ర్ట పార్టీ ప్రధానకార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డిని ఖమ్మం జిల్లా పరిశీలకునిగా నియమించారు. నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తుమ్మలపల్లి భాస్కర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బెంబడి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రపార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా వెల్లాల రామ్మోహన్,రాష్ట్ర పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా కె.జార్జ్ హెర్బట్‌లను నియమించారు. రాష్ట్రపార్టీ కార్యదర్శులుగా ఎండీ సలీం, దొంతిరెడ్డి సైదిరెడ్డి(నల్లగొండ), కడారి బాలకృష్ణారెడ్డి (మెదక్), చిలకల అరుణారెడ్డి (రంగారెడ్డి), రమణబోయిన బ్రహ్మయ్య (హైదరాబాద్)లు నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆయా నియామకాలను చేసినట్లు రాష్ట్రపార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. -
అమరులను విస్మరించిన కేసీఆర్
రెండేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కొండా రాఘవరెడ్డి సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాష్ట్ర ఏర్పాటు కోసం 1,100 మంది ప్రాణత్యాగం చేస్తే.. ఇప్పటివరకు గుర్తించింది 300 మం దినేనా? పార్టీలో చేర్పించాలనుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల అడ్రస్‌లు దొరుకుతాయి. కానీ.. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న అమరవీరుల అడ్రస్‌లు దొరకవా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా పర్యటన సందర్భంగా బుధవారం ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాటల గారడీతో కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు కలసి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇదెంతో కాలం సాగదని అన్నారు. కేజీ టు పీజీ విద్య, ముస్లింలకు రిజర్వేషన్ హామీలన్నీ అటకెక్కాయన్నారు. వైఎస్సార్సీపీ అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ప్రజలకు అండగా పోరుబాట పడుతుందని అన్నారు. -
వైఎస్సార్సీపీ వెంటే ప్రజలు
ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే.. ప్రజలకు చేసిందేమీ లేదు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఒకరిద్దరు నేతలు పోయినంత మాత్రాన వైఎస్సార్సీపీకి నష్టం లేదని, ప్రజలు పార్టీ వెంటే ఉన్నారని, జిల్లాలో పార్టీ బలంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మంలో ముఖ్య నాయకుల సమావేశానికి హాజరై మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలతో అనేకమంది లబ్ధి పొందారని తెలిపారు. నాటి 108, 104 సర్వీసులు, ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం కావాలనే విస్మరిస్తోందని ఆరోపించారు. కార్యకర్తలంతా ఏకతాటిపై నిలిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరలేదని చెప్పారు. ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూరడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. ఇంకెంతో కాలం ప్రజలను మభ్య పెట్టలేరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెండెం జయరాజు, రాష్ట్రనేత బీవీ.రమణ, జిల్లా నాయకులు జిల్లేపల్లి సైదులు, ఐలూరి మహేష్‌రెడ్డి, గుడిబండ్ల దీపక్, జమలాపురం రామకృష్ణ, ఉదయ్‌కుమార్, కొండపల్లి వెంకయ్య, వాలూరు సత్యనారాయణ, చల్లా శ్రీనివాసరెడ్డి,రాజేష్, ఉండేటి ఏసుపాదం, గుర్రం అన్నపూర్ణ, రుద్రగాని హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం.. బైపాస్‌రోడ్డు రాపర్తినగర్‌లోని వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, మెండెం జయరాజు, బీవీ.రమణ, జిల్లేపల్లి సైదులు పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, శ్రేణులు వైఎస్సార్ అమర్హై.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. -
'కేసీఆర్ మాటల గారడీ చేస్తున్నారు'
ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ చేస్తున్నారే తప్ప ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడంలేదని తెలంగాణ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితారెడ్డి తరఫున ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ...కేసీఆర్‌కు దమ్ముంటే దళితుడిని సీఎంను చేసి చూపెట్టాలన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీను పాతరేస్తాననడమేనా నీ తెలంగాణ నీతి అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. -
పాలేరు ఉప ఎన్నిక పరిశీలకులుగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, మెండం జయరాం, హబీబ్ అబ్దుల్ రెహమాన్లను ఎన్నికల పరిశీలకులుగా నియమించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్ నియమితులవగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డిని నియమించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్యప్రకాశ్, హబీబ్ అబ్దుల్ రెహమాన్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మా పార్టీ విలీనం కాలేదు: కొండా
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి - ఫారంపై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యేలు తక్షణం రాజీనామా చేయాలని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ వేరే ఏ పార్టీలోనూ విలీనం కాలేదని ఆయన స్పష్టం చేశారు. టి - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం గురువారం హైదరాబాద్‌లో సమావేశమై.. ఆరు తీర్మానాలను ఆమోదించింది. ఆ సమావేశం ముగిశాక ఆ తీర్మానాలను టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి విలేకర్ల సమావేశంలో వివరించారు. టీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం రద్దు అయినట్లు ఆయన ప్రకటించారు. నూతన అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. పార్టీ ఫిరాయించిన వారిపై పార్లమెంట్, అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణలో అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలని మరో తీర్మానం చేసినట్లుచెప్పారు. పాలేరు ఉపఎన్నికలో రాంరెడ్డి సుచరితారెడ్డికి మద్దతు ఇవ్వాలని మరో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. టీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనమైందంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ ఇంకో తీర్మానం చేసినట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. -
కరువుతో అల్లాడుతుంటే ప్లీనరీ నా: రాఘవరెడ్డి
రాష్ట్రంలో కరవు పరిస్థితులు తాండవిస్తూంటే ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లీనరీ నిర్వహించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో సాక్షితో మాట్లాడారు. తాగేందుకు నీరు లేక గ్రామాల్లో జనాలు అల్లాడుతున్నారన్నారు. గడ్డి లేక పశువులు ఆలమటిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్లీనరీకి రూ. కోట్లు తగలేసే సీఎంని ఒక్క కేసీఆర్‌ను మాత్రమే చూస్తున్నామని ఆయన విమర్శించారు. ఏదైనా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ స్థానంలో దివంగత నేత కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తున్నప్పుడు ఇతర పార్టీలు పోటీకి దూరంగా ఉండడడం సంప్రదాయంగా పేర్కొన్నారు. కానీ, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయించటం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాధనం వృధాగా ఖర్చు చేయటం ఎందుకు సీఎంను ప్రశ్నించారు. పాలేరు ఎన్నికలకు పెట్టే ఖర్చుతో ఆ జిల్లాల్లోని గ్రామాల్లో తాగునీటి సమస్య, పశువులకు పశుగ్రాసం సమస్య పరిష్కరించవచ్చని చెప్పారు. 15 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో 11 వందల మంది బలిదానం చేస్తే.. ఇప్పటి కేవలం 250 మందికి సహయం చేశారని వివరించారు. డబల్ బెడ్ రూం ఇళ్లు ఒక్క హైదరాబాద్‌లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలేదన్నారు. సీఎం మాటల గారడీ ఎంతో కాలం నడవదని ప్రజలు తిరగబడ్డ రోజు పలాయనం చిత్తగించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ఎన్నాళ్లయినా.. అదే అభిమానం
-
ఎన్నాళ్లయినా.. అదే అభిమానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: పేద ప్రజల పెన్నిధి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఆరేళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ ఎక్కడ చూసినా ఆయన పథకాల ప్రస్తావనే. వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర సందర్భంగా ఏ పల్లెను చూసినా, ఎవరి నోట విన్నా వైఎస్సార్ గొప్పతనం ప్రస్తావనే. ‘మాకు రేషన్ కార్డు వైఎస్సే ఇచ్చిండు.. మా ఇల్లు అప్పుడు కట్టినం.. నాకు పింఛను ఇచ్చిన దేవుడు.. నా గుండెకు ఆపరేషన్ చేయించిండు.. అప్పుడు రైతుల పరిస్థితి బాగుండె.. ఉచిత కరెంటు ఇచ్చిండు, లోన్లు మాఫీ జేసిండు. మా అబ్బాయి ఉట్టిగ ఎంబీఏ చదివిండు...’ ఇలా ప్రజలంతా వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరిస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర శుక్రవారం ముగిసింది. ఈ యాత్రలో పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లోని 30 కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు ఆయా గ్రామాల్లో ఎక్కడ విన్నా వైఎస్ పాలన గురించే చెప్పుకోవడం కనిపించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి విషయంలో అప్పటి, ఇప్పటి పరిస్థితి పోల్చిచూసుకోవడం వినిపించింది. షర్మిల వెళ్లిన ప్రతి చోటా వైఎస్ తనయ వచ్చిందన్న సంతోషం... వైఎస్‌ను, తమవారిని గుర్తు చేసుకున్న ఉద్వేగం కలగలిసి కనిపించింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 77 మంది చనిపోయారు. ప్రస్తుతం ఇక్కడ 73 కుటుంబాలు ఉంటున్నాయి. వారిని ఓదార్చేందుకు పరామర్శయాత్ర చేపట్టిన షర్మిల.. ఆగస్టు 24 నుంచి 28 వరకు మొదటిదశలో 32 కుటుంబాలను, సెప్టెంబరు 7 నుంచి 11 వరకు జరిపిన రెండో దశలో మరో 30 కుటుంబాలను ఓదార్చారు. రెండోదశ యాత్ర భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం ఇసిపేటలో శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. పేరుపేరునా పలకరిస్తూ.. పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలను అందరూ ఆత్మీయతతో ఆదరించారు. రెండు చేతులతో నమస్కరించి పేరుపేరునా షర్మిల పలకరించినప్పుడు వారంతా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. వారి కుటుంబంలో ఒకరిగా కలసిపోయి షర్మిల మాట్లాడుతున్నప్పుడు... ‘రాజన్న బిడ్డ మా ఇంటికి వచ్చింది. ఇది మేం కలలో కూడా ఊహించలేదు. ఆమె మా ఇంటికి వచ్చి వెళ్లిందంటే ఇన్నాళ్ల మా బాధ తీరినట్టే..’’అని వారంతా ఆనందించారు. షర్మిల ప్రతిచోటా ఆయా కుటుంబాల బాధలు, సమస్యలు తెలుసుకుని ఓదార్చారు. వారందరికీ వైఎస్ కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఐదో రోజు నాలుగు కుటుంబాలకు.. వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శయాత్ర చివరి రోజు శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. పరకాల మండలం మల్లక్కపేటలో రాసమల్ల తిరుపతి కుటుంబాన్ని ఓదార్చి... తిరుపతి తండ్రి బుచ్చయ్యను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇదే మండలం నాగారంలో కాంబత్తుల శ్రీహరి భార్య శ్రీదేవిని పరామర్శించి భరోసా కల్పించారు. తర్వాత లక్ష్మీపురం గ్రామంలో చెల్పూరి ఉప్పలయ్య కుటుంబాన్ని కలుసుకుని ఆయన భార్య లక్ష్మికి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. చివరగా మొగుళ్లపల్లి మండలం ఇసిపేటలోని యార రాజయ్య కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. రాజయ్య భార్య కమలమ్మను ఓదార్చారు. మంచి రోజులు మళ్లీ వస్తాయని చెప్పారు. ఇసిపేటలో పరామర్శ ముగిసిన తర్వాత వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎం.విలియం, ఎన్.శాంతికుమార్, ఎన్.భిక్షపతి, జార్జ్ హెర్బర్ట్, షర్మిల సంపత్, కె.నగేశ్, ఎం.శంకర్, టి.నాగరావు, డి.శ్వేత, ఎ.సంతోష్‌రెడ్డి, జి.శివకుమార్, వనజ పాల్గొన్నారు. -
ముగిసిన షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర
వరంగల్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర శుక్రవారంతో ముగిసిందని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. శుక్రవారం వరంగల్ నగరంలో కొండ రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రెండో విడతలో వరంగల్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారని తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో వరంగల్ జిల్లాలో మూడో విడత పరామర్శయాత్రను ఆమె చేపట్టనున్నారని ఆయన వివరించారు. అలాగే ఈ నెల 23 నుంచి కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ప్రారంభంకానుందని చెప్పారు. మహానేత వైఎస్ఆర్ మరణించి ఆరు ఏళ్లు అయినా ప్రజలు ఆయన్ని మరచిపోలేకపోతున్నారన్నారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై ఈ నెల 13,14 తేదీల్లో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. అధైర్యపడవద్దని రైతులకు ఆయన ఈ సందర్భంగా సూచించారు. మీ పక్షాన తమ పార్టీ పోరాడుతుందని వైఎస్ఆర్ సీపీ నేత కొండా రాఘవరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. -
ఇచ్చిన మాట కోసమే..
షర్మిల రెండో విడత పాదయాత్ర 7 నుంచి 11 వరకు.. * 31 కుటుంబాలకు పరామర్శ * వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తొర్రూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని నల్లకాల్వలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట కోసమే ఆయన సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా ఇన్చార్జి కొండా రాఘవరెడ్డి అన్నారు. శనివారం తొర్రూరు మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధిత కుటుంబాల పరామర్శ కోసం వరంగల్ జిల్లాలో రెండో విడత యాత్ర ఈ నెల 7న పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలోని గంట్లకుంట గ్రామంలో ప్రారంభమై, 11న భూపాలపల్లి మండలంలోని ఇసిపేటలో ముగుస్తుందన్నారు. పరామర్శ యాత్రలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు. రాజకీయాలకు అతీతంగా పాల్గొనండి.. షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు మునిగాల విలియమ్స్, గుడూరు జయపాల్‌రెడ్డి, నాడెం శాంతికుమార్, జిడిమేట్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్‌లో షర్మిల పరామర్శ యాత్ర
24 నుంచి ఐదు రోజుల పర్యటన 32 కుటుంబాలకు పరామర్శ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి వెల్లడి హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తట్టుకోలేక వరంగల్ జిల్లాలో అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 24 నుంచి పరామర్శించనున్నారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. యాత్ర మొదటి విడతలో భాగంగా ఐదురోజుల పాటు పర్యటించి 32 కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘24న ఉదయం 9 గంటలకు షర్మిల లోటస్‌పాండ్ నుంచి బయల్దేరుతారు. శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా ఉదయం 11 గంటలకు చేర్యాల చేరుకొని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేరోజు మరో ఆరు కుటుంబాలను పరామర్శిస్తారు. మొదటి రోజు 154 కి.మీ. ప్రయాణం చేస్తారు. 25న రెండోరోజు 78 కి.మీ. ప్రయాణించి ఏడు కుటుంబాలను పరామర్శిస్తారు. 26న ఏడు, 27న ఏడు కుటుంబాలను కలుస్తారు. చివరి రోజైన 28న నాలుగు కుటుంబాలను పరామర్శిస్తారు. మొత్తం 619 కి.మీ. మేర ప్రయాణించి ఐదు నియోజకవ ర్గాల్లో పూర్తిగా, రెండు నియోజకవర్గాల్లో పాక్షికంగా పర్యటిస్తారు’’ అని ఆయన చెప్పారు. పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జె.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ మరణం తట్టుకొలేక అత్యధికంగా వరంగల్ జిల్లాలోనే చనిపోయారన్నారు. షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజ్తబ అహ్మద్ మాట్లాడుతూ.. మైనార్టీ సోదరులందరూ పరామర్శ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
వైఎస్సార్ పథకాలను నిర్వీర్యం చేస్తే సహించం'
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తే తాము సహించమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఆరోగ్యశ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఉంటుందని అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. లక్షకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ అని 15 వేలకు పరిమితం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రకటనలతో కాలం గడుపుతున్నారే తప్పా.. అవి వాస్తవ రూపం దాల్చడం లేదని కొండ రాఘవరెడ్డి విమర్శించారు. -
అడ్డగోలు నిర్ణయాలు ఇంకెంత కాలం: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: మన తెలంగాణ... మన పాలన... అన్నీ అందరి నిర్ణయాలతో సమష్ఠిగా కలసి బంగారు పాలన చేసుకుందామని ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ వాస్తవంగా, క్షేత్రస్థాయిలో చేస్తున్నదేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రశ్నించింది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి.. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్‌లో ఉపాధ్యాయురాలి దండనకు తొమ్మిదేళ్ల ఆశ్రీత బలికావటం తమ పార్టీని కలచి వేసిందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. విద్యా శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరిన మాట నిజమేనని తమ పార్టీ అంగీకరిస్తుందని తెలిపారు. వారంలోనే ఖాళీ చేయిస్తామని సీఎం అత్యవసరంగా ప్రకటించడం ఎంటని ప్రశ్నించారు. అది ఆచరణ సాధ్యమా... ప్రకటించిన కేసీఆర్‌కే తెలియాలని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై సీఎం కమిటీ వేసినా ఇంత వరకు ఒక్కసారన్నా అది సమావేశం కాలేదన్నారు. 13 నెలల్లో సీఎం రకరకాల నిర్ణయాలు తీసుకున్నారని... 18 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు. ఇలాంటి దుందుడుకు నిర్ణయాల సీఎంను తాను ఎన్నడూ చూడలేదని కొండా పేర్కొన్నారు. ఒకే రోజు కేబినెట్ సమావేశంలో 43 నిర్ణయాలపై కేసీఆర్ సర్కారు వైఖరి ప్రకటించిందన్నారు. దాన్ని ఒక రికార్డుగా ఆయన మంత్రి వర్గసభ్యులు ప్రచారం చేసుకున్నా.. వాటిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. తక్షణమే 43 నిర్ణయాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. -
'కేసీఆర్ దుందుడుకు చర్యలు మానుకోవాలి'
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విద్యార్థిని ప్రాణం తీసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి స్పందించాలన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుందుడుకు చర్యలు ఆపి ఆచరణ సాధ్యమయ్యే హామీలు చేసేందుకు దృష్టి సారించాలని సూచించారు. హైకోర్టు నుంచి నోటీసులు రాకముందే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేసీఆర్‌కు కొండా రాఘవరెడ్డి హితవు పలికారు. లేకుంటే వారిని బర్త్‌రఫ్ చేయాలన్నారు. దీనిపై కేసీఆర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. -
'అలా అంటే..ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదు'
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటే ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు, ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు అన్న రీతిలో రాష్ట్రపతి ప్రసంగించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శనివారం కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య సెక్షన్-8 అంశాన్ని ముడిపెట్టే విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలను గౌరవించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని ఆయన తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలసి మెలసి ఉండాలని, రెండు రాష్ట్రాలు సామరస్య వాతావరణంలో పనిచేయాలని, దేశభ్యున్నతికి పాటుపడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆకాంక్షించారు. -
ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదు
-
నాగలిపట్టే రైతు నాగలికే ఉరేసుకుంటున్నాడు
వైఎస్సార్సీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘బంగారు తెలంగాణ నిర్మా ణం అంటూ సీఎం కేసీఆర్ ఆ బంగారు తెలంగాణకు వెన్నెముకలాంటి రైతుల గోడు పట్టించుకోవడం లేదు. నాగలిపట్టే రైతు లు ఆ నాగలికే ఉరేసుకొని చచ్చే దుస్థితి నెలకొన్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. ఆరుగాలం శ్రమించే రైతులకు భరోసా ఇవ్వడంతోపాటు సర్కారు కళ్లు తెరిపించేందుకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో వైఎ స్సార్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహిస్తున్నాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం కామారెడ్డిలో రైతుదీక్ష సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్ద పట్లోల్ల సిద్దార్థరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాం త్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు భీష్మ రవీం దర్, నాయకులు వెకంట్రావ్, గూడూరి జైపాల్‌రెడ్డి, నీలం రమేశ్, జిల్లా నాయకులు విజయలక్ష్మి తదితరులతో కలిసి మాట్లాడారు. నాగలి దున్నే రైతు నాగలికే ఉరివేసుకుంటున్నాడని, పంటకు చల్లే పురుగుమందును తాగుతూ పంటచేనులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో ఏడు వందల మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సీఎం కేసీఆర్ వారి కుటుం బాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతుల సమస్యలు, ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 11న వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణలో 10న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైతుదీక్ష చేపట్టారని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ రైతులు అనేక కష్టాలలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం రైతులను పట్టిం చుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని, కరువు, అకాల వర్షాలతో రైతులు తీవ్ర మనోవ్యధకు గురవుతున్నట్లు తాము గ్రామాలకు వెళ్లిన సందర్భంలో తెలిసిందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను కేసీఆర్ వంచిం చాడని ఆరోపించారు. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు తాము ఈ కష్టాలు పడలేదని రైతులు చెప్పారని రాఘవరెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డిలో జరిగే రైతుదీక్షను విజయవంతం చేయాలని కోరారు. -
వైఎస్సార్ సీపీ యూత్ కమిటీల నియామకం
జిల్లా కమిటీలోకి 23 మంది మండల కమిటీలోకి 13 మంది డివిజన్ కమిటీలోకి 11 మంది సిటీ కమిటీలో ఇద్దరికి స్థానం వెల్లడించిన రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, కళ్యాణ్‌రాజ్ కాజీపేట రూరల్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, టౌన్, సిటీ, డివిజన్ కమిటీలను ఆదివారం ప్రకటించింది. 51 మందితో యువజన, జిల్లా, మండల, నగర కమిటీలను నియామకం చేశారు. ఈ మేరకు వివరాలను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్ ఆదివారం వె ల్లడించారు. జిల్లా యూత్ కమిటీలో జిల్లా యూత్ జనరల్ సెక్రటరీగా బొడ్డు శ్రావణ్, గడ్డం రఘుపతి, దేవర రమేష్, బుర్ర మహేందర్ నియామకమయ్యారు. కార్యదర్శులుగా కల్లాపు ప్రవీణ్, మేకల సిద్దార్థ, సాంబరాజు ప్రవీన్, మహ్మద్ రహమాన్, జాయింట్ సెక్రటరీలుగా టార్జన్ సింగ్, అక్కల అనిల్ కుమార్, జల్లి వేణు, చిర్ర అనిల్, కాయిత కుమార్, బూర సుదర్శన్‌గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గాడిపెల్లి శ్రీను, పెసర్ల రాజు, సంపతి కృష్ణ, సయ్యద్ చాంద్‌పాషా, కోటగిరి కృష్ణమూర్తి, గాదె మహేష్, షేక్ జావీద్, కీసరి రాంబాబు, గండ్ల రాజు నియామకమయ్యారు. జనగాం యూత్ టౌన్ అధ్యక్షునిగా గుగ్గిల్ల శ్రీధర్ నియామకం అయ్యారు. నగర కమిటీలో.. యూత్ నగర ప్రధాన కార్యదర్శులుగా కానుకుంట్ల రమాకాంత్, మోడెం రాజేష్‌గౌడ్ నియామకమయ్యారు. డివిజన్ యూత్ ప్రెసిడెంట్లు వీరే.. మాత్రాసి శ్రీధర్(29వ డివిజన్), పరికి నట్రాజ్(28వ డివి జన్), పల్లె మధు(30వ డివిజన్), ఎండి.అరిఫ్ అలీ(23వ డివిజన్), గొల్లపెల్లి శేఖర్(34వ డివిజన్), కాగితాల శ్రీని వాస్(47వ డివిజన్), అన్వర్ మోహినుద్దీన్(50వ డివిజన్), ఎండి.ఇమ్రాన్(48వ డివిజన్), కందుకూరి ప్రణయ్(36వ డివిజన్), ఎండి.అబ్దుల్ పర్వేజ్(44వ డివిజన్), అబ్దుల్ సమద్(10వ డివిజన్) నియామకం అయ్యారు. మండల యువజన అధ్యక్షులుగా 13 మంది.. రఘునాథపల్లి మండల యువజన అధ్యక్షుడిగా బక్క జంపన్న, మహబూబాబాద్ మండల అధ్యక్షుడిగా నరేందర్‌రెడ్డి, బానోతు వీరన్న(కేసముద్రం), నిమ్మిపోయిన రమేష్(వర్ధన్నపేట), కోతుల మధు (పర్వతగిరి), కోట సోంరాజు(చేర్యాల), రాజ్‌కుమార్‌గౌడ్(నర్మెట),కోల్పుల పురుషోత్తం(మద్దూరు), బుర్ర సుమన్(నర్సంపేట), మడుగుల రాజిరెడ్డి(నల్లబెల్లి), అసోల సురేష్(దుగ్గొండి), బానోతు బాలకృష్ణ(ఖానాపురం), ఎస్కె.గౌస్(ఏటూరు నాగారం)ను నియమించారు. -
కేసీఆర్ మాటలకు, పాలనకు పొంతనేది?
వైఎస్సార్సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్న మాటలకు.. ఆయన పాలనకు పొంతనే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల ప్రాధాన్యత గుర్తించిన కేసీఆర్‌కు.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 24 ప్రాజెక్టులు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. బడ్జెట్లో వీటికి కేటాయింపులు ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే దివంగత సీఎం వైఎస్సార్‌కు పేరు వస్తుందనే వాటిని పక్కన పెట్టారన్నారు. వైఎస్సార్ తెలంగాణ ప్రజల కోసం వేల కోట్లు ఖర్చు చేశారని, వైఎస్ ఐదేళ్ల వంద రోజుల పాలనలో అలీసాగర్, గుప్పా, సుద్దవాగు, రాలీవాగు ప్రాజెక్టులు పూర్తి చేసి లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరు ఇచ్చార ని గుర్తు చేశారు. మాటలతో గారడీ చేస్తూ కేసీఆర్ ఎంతకాలం పాలన సాగిస్తారని ప్రశ్నించారు. ఏపీలో మంచి వ్యవసాయ భూములను మంత్రి నారాయణను అడ్డుగా పెట్టి ట్రాక్టర్లతో దున్నిస్తున్నారని, రైతులు ఏమైపోయినా చంద్రబాబుకు పట్టదన్నారు. అవసరమైతే తాము ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తామని రాఘవరెడ్డి హెచ్చరించారు. త్వరలో రాజధానిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, తమ సత్తా చాటుతామన్నారు. బాబుది క్రిమినల్ మైండ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్.. సేవా పన్ను ఎగవేసినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) గుర్తించిందని రాఘవరెడ్డి చెప్పారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంలో 10.3 శాతం చొప్పున.. 2009 అక్టోబర్ నుంచి 2014 మార్చి వరకు రూ. 70 లక్షలు సేవా పన్ను చెల్లించాల్సి ఉందన్నారు. రూ.50 లక్షలు మించి సేవా పన్ను బకాయిపడిన వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని, దీని నుంచి తప్పించుకొనేందుకు చంద్రబాబు తన క్రిమినల్ మైండ్ ఉపయోగించి రూ.30 లక్షలు చెల్లించారన్నారు. ఆ తర్వాత ఆ పన్ను గురించి పట్టించుకోకుంటే సర్వీస్ ట్యాక్స్ అధికారులు తాఖీదులు జారీ చేశారని తెలిపారు. దీని గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. -
కేసీఆర్ పాలనతో ప్రజలు విస్తుపోతున్నారు
బిల్డు కార్మికుల రోదన సీఎంకు పట్టడం లేదు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలా ‘మిషన్ కాకతీయ’ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి కాజీపేట రూరల్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో ప్రజలు విస్తుపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి అన్నారు. హన్మకొండలో సోమవారం జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కొండ రాఘవరెడ్డి మాట్లాడారు. ఇటీవల జిల్లాలో కురిసిన అకాలవర్షానికి నష్టపోయిన మామిడి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటల రైతులకు ఇన్‌పుట్‌గా సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకోవద్దని... ఏ పంటకు ఎంత నష్టం జరిగిందో పూర్తి స్థాయిలో అంచనా వేసి పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ జిల్లాకు వెళ్లిన అజాంజాహీ మిల్లు, ఆల్విన్, హెచ్ఎంటి, నిజాం షుగర్ ప్యాక్టరీలను ప్రస్తావిస్తూ ప్రజలు, కార్మికుల పక్షపాతిగా ఉన్నట్లుగా నటిస్తున్నారని విమర్శించారు. కమలాపురంలోని బిల్టు కార్మికుల రోదన కేసీఆర్ వినడం లేదని.. సుమారు 30 వేల మంది జీవనోపాధి కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తలుచుకుంటే బిల్డు సంస్థను తెరిపించవచ్చన్నారు. బంగారు తెలంగాణ జపం చేస్తున్న కేసీఆర్ ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ వాస్తవాలకు దగ్గర లేని మాటలు మాట్లాడుతున్నారని, 11 నెలలుగా ఆయన చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమానికి స్పష్టత లేదన్నారు. కేసీఆర్ దుడుదుడుకుల నిర్ణయాల వల్ల చివరకుహైకోర్టు కూడా డజన్ కేసుల్లో అసంతృప్తి వ్యక్తపరిచిందన్నారు. మిషన్ కాకతీయ పథకం మంచిదేనని, అయితే, చెరువులను ఆక్రమించి 100 ఎకరాల చెరువులను 30 ఎకరాలుగా చేయడం ఎంత వరకు సరైందని ప్రశ్నించారు. మిషన్ కాకతీయలో తప్పులు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పిన ప్రభుత్వం... చివరకు మిషన్ కాకతీయను టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా మార్చిందని విమర్శించారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలకు కాంట్రాక్ట్‌ల నుంచి పర్సంటేజీలకు పరిమితమయ్యూరని ధ్వజమెత్తారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, 104, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తు ఆయన చేపట్టిన ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివకుమార్, యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరచారి పాల్గొన్నారు. -
ట్యాక్స్‌పై కేసీఆర్ సర్కార్ ఆలోచించాలి
హైదరాబాద్ : ఏపీ వాహనాలపై ట్యాక్స్ విషయంలో పునరాలోచించాలని కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లో కొండా రాఘవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో ప్రజలపై భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సర్కార్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలకు పన్ను చెల్లించాలనే అంశంపై రెండు ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని కొండా రాఘవరెడ్డి సూచించారు. -
పార్టీలు విలీనం కావాలి.. సభ్యులు విలీనం కావడమేమిటి?
హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. పార్టీలు మాత్రమే విలీనం కావాలని.. ఎమ్మెల్సీలు విలీనం ఏమిటని రాఘవరెడ్డి ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రాఘవరెడ్డి.. మండలి ఛైర్మన్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరగాలని, న్యాయ, రాజ్యాంగ నిపుణులు స్పందించాలని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించినట్లు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ శాసనమండలి సభ్యులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, మహ్మద్ సలీంలు పార్టీలో విలీనం కావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గుర్తించినట్లు సోమవారం మండలి సమావేశాలు సందర్భంగా ఛైర్మన్ స్వామిగౌడ్ పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగం 10 వ షెడ్యూల్ అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. దీనిపై రాజ్యాంగ నిపుణులు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నిరాశపర్చిన రైల్వే బడ్జెట్
వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఏటా రైల్వే బడ్జెట్లో ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడం... ఆ తర్వాత యథావిధిగా మర్చిపోవడం.. ఆనవాయితీగా వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. శుక్రవారం లోటపాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్లో ప్రకటించిన కొత్త రైల్వే లైన్లు, సర్వేలన్నీ అటకెక్కాయని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ తయారీ కేంద్రం.. గతంలో మమతాబెనర్జీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించిన వ్యాగన్ ఫ్యాక్టరీ.. ప్రస్తావన ఈ బడ్జెట్లో లేనేలేదన్నారు. ఖాజీపేటను రైల్వే డివి జన్‌గా ప్రకటించాలన్న కోరికనూ మన్నించలేదని చెప్పారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ లైన్ డబ్లింగ్ పనులకు రూ.1,200 కోట్లు ఖర్చువుతుండగా.. బడ్జెట్లో రూ.27.44 కోట్లు కేటాయించారన్నారు. అయినా సీఎం మాత్రం ఇప్పటికీ స్పందించలేదన్నారు. ఆయన కుమార్తె ఎంపీ కవిత ఫరవాలేదన్నట్లు మాట్లాడటం అర్థరహితమన్నారు. మహానేత దివంగత సీఎం వైఎస్సార్ ఆనాడు కేంద్రమంత్రి పదవులకన్నా బడ్జెట్లో ఏపీకి అగ్రస్థానం ఉండాలని కోరారని గుర్తు చేశారు. ఒకనాడు కేంద్రమంత్రి పదవి త్రుణప్రాయంగా వదిలిన కేసీఆర్ ఇప్పుడెందుకు బడ్జెట్‌పై స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ప్రధానిని కలసి తెలంగాణ ప్రజల రోదన వినిపిస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ మజ్‌తబ అహ్మద్ పాల్గొన్నారు. -
రైల్వే బడ్జెట్ అబద్ధాల పుట్ట
రైల్వే బడ్జెట్ పూర్తిగా అబద్ధాల పుట్ట అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు పూర్తి అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. బడ్జెట్ ఇంత అన్యాయంగా ఉన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో మీ లోపాయికారీ ఒప్పందం ఏంటని నిలదీశారు. తెలుగు రాష్ట్రాలకు అరకొర నిధులు మాత్రమే ఇచ్చినా, రెండు రాష్ట్రాల సీఎంలయిన ఇద్దరు చంద్రులు ఎందుకు స్పందించడంలేదని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. -
'వైఎస్ఆర్ పథకాలను నిర్వీర్యం చేస్తే నిరసన తెలుపుతాం'
వరంగల్: దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత టీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే నిరసన వ్యక్తం చేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొండా రాఘవ రెడ్డి అన్నారు. వరంగల్ లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపుతామన్నారు. ఈ సందర్భంగా 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. -
‘ఫ్యాన్’ స్పీడ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ‘ఫ్యాన్’గాలి ఊపందుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టేవారు. దీంతో చేవెళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొండా రాఘవరెడ్డికి ప్రజల మద్దతు పెరుగుతోంది. వైఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల కు వివరిస్తుండడం.. ఆ పార్టీ మేనిఫెస్టోను విశదీకరించడంతో మంచి స్పందన కనిపిస్తోంది. ప్రచార హోరు.. చేవెళ్ల లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఈసారి సొంత నియోజకవర్గానికి మారారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఎదుర్కొంటున్న జైపాల్ ఈ సారి ఓటమి భయంతో వలస వెళ్లారనే ప్రచారం సాగుతోంది. తాజాగా వైఎస్సార్సీపీ నుంచి పోటీచేస్తున్న కొండా రాఘవరెడ్డి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటుండడం, నిత్యం ప్రజల్లో కనిపించే వ్యక్తి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. మరోవైపు ఇక్కడ వైఎస్సార్ తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ కావడం ఆయనకు కలిసొచ్చే మరో అంశం. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో ఆయనకు మంచి స్పందన వ స్తోంది. తనను గెలిపిస్తే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసకు తీసుకెళ్తానని కొండా రాఘవరెడ్డి స్పష్టం చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ సత్తా చాటుతాం
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ సీపీ సత్తా చాటుతామని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా రాఘవరెడ్డి, తాండూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రభుకుమార్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం తాండూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి, ప్రభుకుమార్ మాట్లాడుతూ.. స్వార్ధపూరిత రాజకీయాలతో పేదల అభివృద్ధిని మరిచిన కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. జిల్లాలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను వైఎస్సార్ సీపీ దక్కించుకుంటుందని వారు ధీమా వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుపరిచిన ప్రజా సంక్షేమ పథకాలు తమ విజయానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారన్నారు. పేదలకు ఇళ్లు, రైతులకు రుణాలు, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజల్లో వైఎస్సార్ సీపీకి ఎంతో ఆదరణ ఉందని పేర్కొన్నారు. అంతకుముందు స్థానిక విలియంమూన్ చౌరస్తా నుంచి ఇందిరాచౌక్, శివాజీచౌక్, మల్రెడ్డిపల్లి, బసవన్నకట్ట, పాతతాండూరు మీదుగా బైక్ ర్యాలీ చేపట్టారు. మల్రెడ్డిపల్లి, పాతతాండూరు, గుమాస్తానగర్తోపాటు పలుచోట్ల పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్, వడ్డెర సంఘం రాష్ట్ర మహిళాధ్యక్షురాలు వరలక్ష్మి, నాయకులు హబీబ్‌ఖాన్, సత్యమూర్తి, మంజుల, ఆనంద్, అమ్జద్, సంతోష్, అఖీల్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీకి ప్రజల అండ
కందుకూరు, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి కుటుంబం వైఎస్సార్ సీపీకి అండగా నిలబడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఆదివారం వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొక్క జంగారెడ్డితో కలిసి మండల పరిధిలోని మురళీనగర్, చిప్పలపల్లి, ధన్నారం, పులిమామిడి, కందుకూరు తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. వైఎస్ అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందని కుటుంబం రాష్ట్రంలో లేదన్నారు. ఎన్నికల అనంతరం తెలంగాణలో పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారడం ఖాయమని చెప్పారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పార్టీ విజయదుందుభి మోగిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంతో సం బంధంలేని వారు కూడా నేడు ఉద్యమ పార్టీల్లో చేరి రాజకీయ క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయాలే పరమావధిగా నేటి నేతల వ్యవహార శైలి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బొక్క జంగారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు చిన్నగళ్ల యాదగిరి, భాగ్యలక్ష్మి, నిర్మల, సభావత్ విజయ, వడ్ల కనకాచారి, నాయకులు ఎస్.వీరారెడ్డి, చెరుకు శ్రీనివాస్, బొక్క సత్యనారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, డి.ప్రతాప్‌రెడ్డి, బి.జగన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదల బతుకుల్లో వైఎస్ వెలుగులు నింపారు
మొయినాబాద్ రూరల్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి పేదల బతుకుల్లో వెలుగులు నింపి చిరస్మరణీయుడిగా మిగిలిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని అలేఖ్య రిసార్ట్‌లో నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫించన్లు, ఉచిత విద్యుత్, రేషన్ బియ్యం, 108, 104, ఆరోగ్యశ్రీ, రుణాల మాఫీ తదితర పథకాలతో రాష్ట్రంలో లబ్ధి పొందని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ చేవెళ్ల నుంచే ప్రారంభించి నియోజకవర్గానికి దేశస్థాయిలో గుర్తింపుతెచ్చిన విషయాన్ని ప్రజలెవరూ మరవలేదన్నారు. వైఎస్ఆర్ పథకాలతో లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ తమ పార్టీకి అండగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ సీపీని గెలిపించి మహానేత రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తపనతోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆలోచించారన్నారు. తెలుగు వారున్న రెండు రాష్ట్రాలనూ సువర్ణ ఆంధ్రప్రదేశ్, సువర్ణ తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు జగన్ తాపత్రయపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి, చైతన్యం కలిగించాల్సిన బాధ్యత పార్టీ నాయకులపైనే ఉందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం.. రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్, చేవెళ్ల నియోజక వర్గ ఇన్చార్జి రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు మహేందర్‌రెడ్డి, బాల్‌రాజ్, ఆయా మండలాల అధ్యక్షులు రాజయ్య, ప్రతాప్‌రెడ్డి, క్రిష్ణ, డి. బల్వంత్‌రెడ్డి, పిఆర్. క్రిష్ణ, నాయకులు కాంతారావు, శంకర్‌నాయక్, రెడ్డియా నాయక్, వెంకటేష్, వడ్డె సత్యయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జొన్నాడ రాజు, ఖాజాపాషా, లకా్ష్మరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పాండు తదితరులున్నారు. -
దమ్ముంటే ఎన్నికలకు అందరూ కలసి రండి: కొండా రాఘవరెడ్డి
చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ సవాల్ కిరణ్ వైఫల్యమే వరుస ఎన్నికలకు కారణం సాక్షి, హైదరాబాద్: అందరినీ కలుపుకొని టీడీపీ అధినేత చంద్రబాబు మహామాయకూటమిగా ఎన్నికల్లో దిగినా తమ పార్టీ ధైర్యంగా ఎదుర్కొంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పేర్కొంది. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ... పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను తనతో కలసి రావాల్సిందిగా చంద్రబాబు చెబుతున్నారని, వారే కాదు నారాయణ, ములాయం, జయప్రకాశ్ నారాయణ్, ఆప్ పార్టీలన్నింటినీ కలుపుకొని వైఎస్సార్ కాంగ్రెస్‌తో పోటీకి రావాలని సవాలు చేశారు. చంద్రబాబు అందరినీ కలుపుకొని ఒక అభ్యర్థిని నిలబెడితే, పోటీగా వైఎస్సార్సీపీ ఒకరిని రంగంలోకి దింపుతుందని, అపుడు ఎవరి సత్తా ఏమిటో బయటపడుతుందని అన్నారు. అసలు కిరణ్‌ను తన వైపు రావాలని చంద్రబాబు కోరడంలోనే వీరిద్దరి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన వీరిద్దరి కుమ్మక్కు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వరకూ కొనసాగిందని గుర్తుచేశారు. ఇది చాలదన్నట్లు చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించే బిల్లుపై రాజ్యసభలో బాహాటంగా కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తూంటే కాంగ్రెస్ తల్లి అయితే, టీడీపీ భర్త అయినట్లుగా వీరిద్దరికీ పుట్టిన అక్రమ సంతానంగా కిరణ్ పార్టీ మిగలబోతోందని కొండా విమర్శించారు. ముఖ్యమంత్రిగా కిరణ్ మూడున్నరేళ్ల పాలనలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేక వైఫల్యం చెందడం వల్లే ఇప్పుడు ఒక్కసారిగా ఆ ఎన్నికలన్నీ వరుసగా వచ్చాయని విమర్శించారు. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డే ఈ విషయంలో కిరణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రానికి ఆరువేల కోట్లు రాలేదు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పాలించానని ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్... స్థానిక ఎన్నికలే నిర్వహించలేకపోయారని రాఘవరెడ్డి విమర్శించారు. ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్రం నుంచి రావలసిన 4 నుంచి 6 వేల కోట్ల రూపాయలు రాకుండా పోయాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శులు ఈ విషయాన్ని చెప్పినా కిరణ్ పెడచెవిన పెట్టారన్నారు. ఎన్నికలు జరగకపోవడానికి చంద్రబాబు మరో కారణమని చెప్పారు. ఏ రోజూ కూడా ఎన్నికలు నిర్వహించాలని కిరణ్‌ను డిమాండ్ చేయలేదన్నారు. ఎన్నికలంటేనే వీరిద్దరికీ ఈ నాలుగేళ్లు లాగులు తడుస్తూ వచ్చాయని, వాటిని ఎదుర్కోలేకనే ఇద్దరూ కూడబలుక్కుని నిర్వహించలేదన్నారు. పంచాయతీరాజ్ మంత్రులుగా ఉన్న ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కె.జానారెడ్డి కూడా ఏ దశలోనూ ఎన్నికల నిర్వహణకు చొరవ చూపలేదన్నారు. ఎన్నికలు నిర్వహించనందుకు కిరణ్, బొత్స, చంద్రబాబు, జానారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో 58 ఉపఎన్నికలు జరిగితే, టీడీపీకి అన్ని చోట్లా డిపాజిట్లు గల్లంతయ్యాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ధాటికి తట్టుకోలేక వీరు ఎన్నికలు నిర్వహించలేక పోయారన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాయని, అవే వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓట్లు కురిపిస్తాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ, వ్యవసాయ బోర్లకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి పథకాలతో లబ్ధ్ది పొందిన విద్యార్థుల నుంచి ఓట్లు తమ పార్టీకి వస్తాయన్నారు. -
మాయకూటమై వచ్చిన జగన్‌ని ఎదుర్కొనలేరు