మొయినాబాద్ రూరల్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి పేదల బతుకుల్లో వెలుగులు నింపి చిరస్మరణీయుడిగా మిగిలిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని అలేఖ్య రిసార్ట్‌లో నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫించన్‌లు, ఉచిత విద్యుత్, రేషన్ బియ్యం, 108, 104, ఆరోగ్యశ్రీ, రుణాల మాఫీ తదితర పథకాలతో రాష్ట్రంలో లబ్ధి పొందని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదన్నారు.
ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ చేవెళ్ల నుంచే ప్రారంభించి నియోజకవర్గానికి దేశస్థాయిలో గుర్తింపుతెచ్చిన విషయాన్ని ప్రజలెవరూ మరవలేదన్నారు. వైఎస్‌ఆర్ పథకాలతో లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ తమ పార్టీకి అండగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ సీపీని గెలిపించి మహానేత రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తపనతోనే తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించారన్నారు. తెలుగు వారున్న రెండు రాష్ట్రాలనూ సువర్ణ ఆంధ్రప్రదేశ్, సువర్ణ తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు జగన్ తాపత్రయపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి, చైతన్యం కలిగించాల్సిన బాధ్యత పార్టీ నాయకులపైనే ఉందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం..
రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్, చేవెళ్ల నియోజక వర్గ ఇన్‌చార్జి రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు మహేందర్‌రెడ్డి, బాల్‌రాజ్, ఆయా మండలాల అధ్యక్షులు రాజయ్య, ప్రతాప్‌రెడ్డి, క్రిష్ణ, డి. బల్వంత్‌రెడ్డి, పిఆర్. క్రిష్ణ, నాయకులు కాంతారావు, శంకర్‌నాయక్, రెడ్డియా నాయక్, వెంకటేష్, వడ్డె సత్యయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జొన్నాడ రాజు, ఖాజాపాషా, లకా్ష్మరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పాండు తదితరులున్నారు.
పేదల బతుకుల్లో వైఎస్ వెలుగులు నింపారు
Published Sun, Mar 16 2014 11:45 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement