sekhar goud
-
వైఎస్సార్ సీపీ వెంటే ప్రజలు
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి అహరహం పాటుపడిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, వారి ఆదరణతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం తన స్వగ్రామం ఆదిబట్లలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ప్రదాతగా వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోయారని, అందుకే వైఎస్సార్ సీపీని వారంతా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ అభిమానులు, ఆయన పథకాలతో లబ్ధి పొందిన వారు నియోజకవర్గవ్యాప్తంగా వేలాదిమంది తనను కలిసి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అండగా ఉంటున్నందున వారంతా తనను ఆదరిస్తున్నారన్నారు. సొంత గ్రామమైన ఆదిబట్లలో పార్టీలకతీతంగా ప్రజలు, నాయకులు తనకు మద్దతు తెలుపుతుండటం ఉత్సాహాన్నిస్తోందన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని, పార్టీ అధినాయకులు కూడా ఇబ్రహీంపట్నంలో పర్యటిస్తారని శేఖర్‌గౌడ్ వెల్లడించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమార్తె షర్మిల ఈ ప్రాంతంలో పర్యటించారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన తాగు, సాగు నీరుతో పాటు విద్యుత్, రోడ్లు, పారి శుద్ధ్య సమస్యల పరిష్కారమే తన ప్రచార ఎజెండా అని చెప్పారు. ప్రతి పేదింటి బిడ్డ అభివృద్ధి చెందాలన్న వైఎస్ ఆశయ సాధనకు పాటుపడతానన్నారు. హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. సమావేశంలో గ్రామస్తులు పల్లె శ్రీనివాస్‌గౌడ్, సేగూరి రమేశ్, భూపతిగళ్ల వెంకటయ్య, పల్లె నరేందర్‌గౌడ్, గజ్జెల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీతోనే సంక్షేమ పథకాల అమలు
యాచారం, న్యూస్‌లైన్ : ప్రాంతాలకతీతంగా అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలకూ సక్రమంగా సంక్షేమ పథకాల అమలు వైఎస్సార్ సీపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి, మల్కీజ్‌గూడ, యాచారం గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమవేశాల్లో శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని గెలిపిస్తే రాజన్న సువర్ణ పాలన మళ్లీ ప్రజలకు అందుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వైఎస్ కృషి వల్లే వచ్చిందని, ఆయన ఆనాడు ఎమ్మెల్యేల బృందాన్ని కేంద్రం వద్దకు పంపి ఒత్తిడి తెచ్చారని అన్నారు. దివంగత వైఎస్ రుణం తీర్చుకోవడం కోసం ఆయన ఆశయాల సాధనకు కంకణం కట్టుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని, ఆయన నాయకత్వంలో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత ఏనాడూ ప్రజలు, రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రాదేశిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ నెల 30న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జిల్లాలో పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేసి ఇబ్రహీంపట్నం నుంచి ఈసీ శేఖర్‌గౌడ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ కళాకారుల బృందం ఆటపాటలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ అమృతాసాగర్, పార్టీ మండల కన్వీనర్ మోతీరాంనాయక్, ఎంపీటీసీ అభ్యర్థులు సంధ్యారాణి, మల్లమ్మ, నాయకులు దార నర్సింహ, వరప్రసాద్‌రెడ్డి, సుధీర్ రెడ్డి, వెంకటేష్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
సారథుల సమరం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒకరు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు.. మరొకరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు.. ఇంకొకరు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్.. ఈ ముగ్గురు ఒకే స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దిగితే.. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఇబ్రహీంపట్నంలో నెలకొంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన జిల్లా బాధ్యులు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ ఇప్పటికే భారీ ఎత్తున కార్యకర్తలతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ కూడా అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరగణంతో నామినేషన్ సమర్పించారు. ఈ ముగ్గు రు నేతలు కూడా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన వారే కావడం విశేషం. ప్రధానంగా పోటీ కూడా ఈ ముగ్గురి మధ్యే నెలకొంది. మొత్తంగా పార్టీ జిల్లా సారథులు ముగ్గురూ ఒకే సీటుకోసం పోటీపడుతుండడంతో స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. అంతిమంగా గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా ఎడ్లబండిపై వచ్చి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. అంతకు ముందు శాస్తా గార్డెన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈసీ శేఖర్‌గౌడ్ మాట్లాడారు. అసమర్థ కాంగ్రెస్‌ను, ప్రతిపక్ష పార్టీగా ఘోరంగా విఫలమైన టీడీపీని ప్రజలు ఓడించాలన్నారు. పెద్ద చెరువును కృష్ణా జలాలతో నింపుతానని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నిలబెట్టుకోలేకపోయారని ఆరోపించారు. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫల మైందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు మంచిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నాయిని సుదర్శన్‌రెడ్డి, మూల హరీశ్‌గౌడ్, కె.అమృతాసాగర్, యు.సతీష్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, బొక్క జంగారెడ్డి, పల్లె సాయిబాబాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మోతీరాంనాయక్, ఎం.జంగయ్యగౌడ్, కందాల శ్రీకాంత్‌రెడ్డి, దొండ వినోద్‌రెడ్డి, దంతూరి రంగయ్యగౌడ్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనసంద్రమైన పట్నం.. ఈసీ శేఖర్‌గౌడ్ నామినేషన్ వేయడానికి వేలాది మందితో భారీ ర్యాలీగా తరలిరావడంతో పట్నం జనసంద్రంగా మారింది. ఎడ్ల బండిని నడిపిస్తూ శేఖర్‌గౌడ్ అందరినీ ఆకర్శించారు. శాస్తా గార్డెన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి శే ఖర్‌గౌడ్ పూలమాల వేశారు. ర్యాలీ సందర్భంగా కార్యకర్తలు బాజా భజంత్రీలతోపాటు బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. -
పేదల బతుకుల్లో వైఎస్ వెలుగులు నింపారు
మొయినాబాద్ రూరల్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి పేదల బతుకుల్లో వెలుగులు నింపి చిరస్మరణీయుడిగా మిగిలిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని అలేఖ్య రిసార్ట్‌లో నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫించన్లు, ఉచిత విద్యుత్, రేషన్ బియ్యం, 108, 104, ఆరోగ్యశ్రీ, రుణాల మాఫీ తదితర పథకాలతో రాష్ట్రంలో లబ్ధి పొందని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ చేవెళ్ల నుంచే ప్రారంభించి నియోజకవర్గానికి దేశస్థాయిలో గుర్తింపుతెచ్చిన విషయాన్ని ప్రజలెవరూ మరవలేదన్నారు. వైఎస్ఆర్ పథకాలతో లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ తమ పార్టీకి అండగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ సీపీని గెలిపించి మహానేత రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తపనతోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆలోచించారన్నారు. తెలుగు వారున్న రెండు రాష్ట్రాలనూ సువర్ణ ఆంధ్రప్రదేశ్, సువర్ణ తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు జగన్ తాపత్రయపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి, చైతన్యం కలిగించాల్సిన బాధ్యత పార్టీ నాయకులపైనే ఉందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం.. రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్, చేవెళ్ల నియోజక వర్గ ఇన్చార్జి రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు మహేందర్‌రెడ్డి, బాల్‌రాజ్, ఆయా మండలాల అధ్యక్షులు రాజయ్య, ప్రతాప్‌రెడ్డి, క్రిష్ణ, డి. బల్వంత్‌రెడ్డి, పిఆర్. క్రిష్ణ, నాయకులు కాంతారావు, శంకర్‌నాయక్, రెడ్డియా నాయక్, వెంకటేష్, వడ్డె సత్యయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జొన్నాడ రాజు, ఖాజాపాషా, లకా్ష్మరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పాండు తదితరులున్నారు. -
వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఇరు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్‌చేసిన అనంతరం శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ సీమాంధ్ర, తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ఎన్నటికీ విస్మరించరన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వైఎస్ ఎంతో చేశారన్నారు. ఇటీవలి కాలంలో పార్టీలోకి వలసలు అధికమయ్యాయని, పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతోందని వెల్లడించారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పార్టీ ఆశయాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లె సాయిబాబాగౌడ్, నాయకులు చిత్రం జంగయ్య, ముత్యాల శ్రీహరి, ఉడుతల సతీష్‌గౌడ్, నదీమ్, ఉడుగుల శివకుమార్‌గౌడ్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మేడిబాయి అంజయ్య, పాషా, మల్లారెడ్డి, అంజమ్మ, శోభ, మైసమ్మ, మహేశ్, బస్వాపురం కృష్ణ, సొప్ప రి కరుణాకర్, హరినారాయణ, మైసయ్య, వినోద్, ఎం.నరేశ్, జి.భూపాల్‌రెడ్డి, కుమార్‌గౌడ్, బత్తుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలోనూ అమలుపరిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సామర్థ్యం కేవలం వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఈసీ శేఖర్ గౌడ్ మోమిన్‌పేటకు వచ్చారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌పై ప్రజలు తీవ్ర అగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని శేఖర్‌గౌడ్ దుయ్యబట్టారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ వికారాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి సంజీవరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు హబీబ్ సలాం, మోమిన్‌పేట, మర్పల్లి మండల కన్వీనర్లు అఫ్సర్, మురళీధర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి, ఖాదర్, కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఇక ప్రజా సమస్యలపై ఉద్యమం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు ఖాళీగా ఉన్న కమిటీలను త్వరితగతిన భర్తీ చే యాలని నిర్ణయించింది. అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించడం ద్వారా ప్రజాభిమానాన్ని పొందాలని నిర్ణయించింది. సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ కమిటీల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ఇకపై సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి ఆందోళనలు చేపట్టాలని, ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని నేతలు నిర్ణయించారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి: ఈసీ శేఖర్‌గౌడ్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై పదవులకోసం పాకులాడుతూ ప్రజావసరాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అనుబంధ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు సాధించాలంటే జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. ప్రజలసమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి సమన్వయకర్తలు కష్టపడాలన్నారు. పార్టీతరఫున పదవులు పొందిన నేతలంతా అనుక్షణం ప్రజల్లోనే ఉండాలన్నారు. త్వరలో జిల్లాలో పార్టీ అధ్వర్యంలో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పార్లమెంటు పరిశీలకులు జంపన ప్రతాప్, సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం కన్వీనర్ జి.సురేష్‌రెడ్డి, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, పోచంపల్లి కొండల్‌రెడ్డి, రాచమళ్ల సిద్ధేశ్వర్, కొలను శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రావు, సూర్యనారాయణరెడ్డి, మహిళావిభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, దశరథగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్‌గా శేఖర్‌గౌడ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా ఈసీ శేఖర్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కా ర్యాలయం తెలిపింది. ప్రస్తుతంఇబ్రహీంపట్నం నియోజకవర్గం సమన్వయకర్తగా శేఖర్‌గౌడ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే దిశగా కార్యాచర ణ ప్రణాళికను రూపొందిస్తానని శేఖర్‌గౌడ్ ఈ సందర్భంగా ‘సాక్షి’కి తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. -
జన సంబరం
ఇబ్రహీంపట్నం రూరల్: వైఎస్ జగన్ విషయంలో ధర్మం గెలిచిందని వైఎస్సార్సీపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమన్వయకర్త ఈసీ శేఖర్‌గౌడ్ అన్నారు. మంగళవారం జగన్ విడుదలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈసీ శేఖర్‌గౌడ్ వందలాది కార్యకర్తలతో కలిసి చంచల్‌గూడకు వెళ్లారు. అంతకుముందు ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రల వల్లే జగన్ 16 నెలలు జైళ్లో ఉండాల్సి వచ్చిందన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుట్రలు పన్నారని.. చివరికి ధర్మమే గెలిచిం దన్నారు. జగన్ జైల్ నుంచి విడుదలవుతున్నారని తెలియగానే కార్యకర్తల్లో ఎక్కడలేని ఉత్తేజం వచ్చిందన్నారు. ప్రజలకు ప్రజానాయకుడే కావాలని.. ఆ నాయకుడు జగన్ మాత్రమేనని శేఖర్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు సుదర్శన్‌రెడ్డి, నల్ల ప్రభాకర్, మాదగోని జంగయ్యగౌడ్, మంచిరెడ్డి శేఖర్‌రెడ్డి, దార నర్సింహ, శోభ, సుగుణ, కృష్ణ, స్వామి తదితరులు ఉన్నారు. పండుగ వాతావరణం... జగన్ విడుదల సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కా ల్చి, స్వీట్లు పంచుకున్నారు. మండల పరిధిలోని ఎంపీ పటేల్‌గూడ, పోచారం, ఎల్మినేడు, చర్లపటేల్‌గూడ, తులేకలాన్ గ్రామా ల్లో పండుగవాతావరణం నెలకొంది. తులేకలాన్‌లో పార్టీ నాయకుడు బాసాని రాజిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. వైఎస్‌కు ఘన నివాళి కందుకూరు: మండల కేంద్రంలోని వైఎస్ విగ్రహానికి మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు జలాభిషేకం నిర్వహించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మిఠాయిలు పంచి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరెన్ని కుట్రలు పన్నినా తుదకు న్యాయమే గెలిచిందన్నారు. ప్రజాబలం ఉన్న నాయకుడిని నిలువరించడం ఎవరితరం కాదన్నారు. త్వరలో ఆయనపై ఉన్న కేసులన్నీ వీగిపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎండీ ఆసిఫ్‌జానీ, డి.వెంకట్‌నారాయణరెడ్డి, జి.సుధాకర్‌రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో హర్షాతిరేకాలు ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం జగన్ విడుదల కావడంపై సంబరాలు మిన్నంటాయి. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నృత్యాలు చేస్తూ బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని చాటుకున్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నూకల యాదగిరి, పార్టీ నాయకుడు జమీర్ అహ్మద్ మాట్లాడుతూ .. జగన్ విడుదలతో రాష్ట్ర ప్రజల్లో నూతనోత్తేజం వచ్చిందన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొని జగన్ నేడు జనంలోకి రావడం హర్షించదగిన పరిణామమన్నారు. జగన్ విడుదలతో న్యాయం, ధర్మం గెలిచిందని, కుమ్మక్కు రాజకీయాలు ఓడిపోయాయన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానుల అండదండలు జగన్‌కు ఎల్లవేళలా ఉంటాయన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం. సుమిత్చారి, ఎండీ నదీం, అజ్మత్‌పాషా, యాదగిరి, నజీర్, ముస్తఫా, వినయ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం శంకర్పల్లి: యువనేత జగన్మోహన్రెడ్డి జైలు నుంచి విడుదల కావడం తో మంగళవారం మం డల కేంద్రం లో వైఎస్సార్ సీపీ నాయకులు సం బరాలు చేసుకున్నారు. పార్టీ మం డల కన్వీనర్ బల్వంత్‌రెడ్డి సమక్షంలో ప్రధాన చౌరస్తాలో ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్ అమర్ రహే.. జైజగన్.. జైజైజగన్ అంటూ నినదించారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో టంగటూర్ సొసైటీ డెరైక్టర్ సుధాకర్, నాయకులు లక్ష్మారెడ్డి, షాపుద్దీన్, రంగారెడ్డి, గోపాల్‌రెడ్డి, రామస్వామి, శంకర్‌నాయక్, నర్సింహారెడ్డి(బాబు), బిక్షపతి, యాదిరెడ్డి, మిరాజుద్దీన్, వడ్లరమేష్, కొల్లురిబాలయ్య, చా కలిబాల్రాజ్, సుభాన్, పర్మయ్య, సత్తమ్మ, సంగీత తదితరులు పాల్గొన్నారు. తట్టెపల్లిలో కోలాహలం తాండూరు రూరల్: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మంగళవారం బెయిల్‌పై విడుదల కావడంతో పెద్దేముల్ మండలం తట్టెపల్లిలో సంబరాలు మిన్నంటాయి. వైఎస్ఆర్ చౌరస్తాలోని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో జగన్ బయటికి వచ్చారన్నారు. తెలంగాణలోనై వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు అంజద్, నాయకులు నర్సింహారెడ్డి, హరిసింగ్, ఇస్మాయిల్, నర్సింహులు, హబీబ్, జహీర్, జగన్, భాస్కర్, సత్యం పాల్గొన్నారు.