మోమిన్‌పేట, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలోనూ అమలుపరిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సామర్థ్యం కేవలం వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఈసీ శేఖర్ గౌడ్ మోమిన్‌పేటకు వచ్చారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌పై ప్రజలు తీవ్ర అగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని శేఖర్‌గౌడ్ దుయ్యబట్టారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ వికారాబాద్ నియోజక వర్గ ఇన్‌చార్జి సంజీవరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు హబీబ్ సలాం, మోమిన్‌పేట, మర్పల్లి మండల కన్వీనర్‌లు అఫ్సర్, మురళీధర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి, ఖాదర్, కృష్ణ తదితరులు ఉన్నారు.
తెలంగాణ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
Published Mon, Mar 3 2014 11:42 PM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement