ఇబ్రహీంపట్నం రూరల్: వైఎస్ జగన్ విషయంలో ధర్మం గెలిచిందని వైఎస్సార్‌సీపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమన్వయకర్త ఈసీ శేఖర్‌గౌడ్ అన్నారు. మంగళవారం జగన్ విడుదలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈసీ శేఖర్‌గౌడ్ వందలాది కార్యకర్తలతో కలిసి చంచల్‌గూడకు వెళ్లారు. అంతకుముందు ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రల వల్లే జగన్ 16 నెలలు జైళ్లో ఉండాల్సి వచ్చిందన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుట్రలు పన్నారని.. చివరికి ధర్మమే గెలిచిం దన్నారు. జగన్ జైల్ నుంచి విడుదలవుతున్నారని తెలియగానే కార్యకర్తల్లో ఎక్కడలేని ఉత్తేజం వచ్చిందన్నారు. ప్రజలకు ప్రజానాయకుడే కావాలని.. ఆ నాయకుడు జగన్ మాత్రమేనని శేఖర్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు సుదర్శన్‌రెడ్డి, నల్ల ప్రభాకర్, మాదగోని జంగయ్యగౌడ్, మంచిరెడ్డి శేఖర్‌రెడ్డి, దార నర్సింహ, శోభ, సుగుణ, కృష్ణ, స్వామి తదితరులు ఉన్నారు.
పండుగ వాతావరణం...
జగన్ విడుదల సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కా ల్చి, స్వీట్లు పంచుకున్నారు. మండల పరిధిలోని ఎంపీ పటేల్‌గూడ, పోచారం, ఎల్మినేడు, చర్లపటేల్‌గూడ, తులేకలాన్ గ్రామా ల్లో పండుగవాతావరణం నెలకొంది. తులేకలాన్‌లో పార్టీ నాయకుడు బాసాని రాజిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
వైఎస్‌కు ఘన నివాళి
కందుకూరు: మండల కేంద్రంలోని వైఎస్ విగ్రహానికి మంగళవారం వైఎస్సార్‌సీపీ నాయకులు జలాభిషేకం నిర్వహించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మిఠాయిలు పంచి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరెన్ని కుట్రలు పన్నినా తుదకు న్యాయమే గెలిచిందన్నారు. ప్రజాబలం ఉన్న నాయకుడిని నిలువరించడం ఎవరితరం కాదన్నారు. త్వరలో ఆయనపై ఉన్న కేసులన్నీ వీగిపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎండీ ఆసిఫ్‌జానీ, డి.వెంకట్‌నారాయణరెడ్డి, జి.సుధాకర్‌రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో హర్షాతిరేకాలు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం జగన్ విడుదల కావడంపై సంబరాలు మిన్నంటాయి. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నృత్యాలు చేస్తూ బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని చాటుకున్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నూకల యాదగిరి, పార్టీ నాయకుడు జమీర్ అహ్మద్ మాట్లాడుతూ .. జగన్ విడుదలతో రాష్ట్ర ప్రజల్లో నూతనోత్తేజం వచ్చిందన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొని జగన్ నేడు జనంలోకి రావడం హర్షించదగిన పరిణామమన్నారు. జగన్ విడుదలతో న్యాయం, ధర్మం గెలిచిందని, కుమ్మక్కు రాజకీయాలు ఓడిపోయాయన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానుల అండదండలు జగన్‌కు ఎల్లవేళలా ఉంటాయన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం. సుమిత్‌చారి, ఎండీ నదీం, అజ్మత్‌పాషా, యాదగిరి, నజీర్, ముస్తఫా, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం
శంకర్‌పల్లి: యువనేత జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదల కావడం తో మంగళవారం మం డల కేంద్రం లో వైఎస్సార్ సీపీ నాయకులు సం బరాలు చేసుకున్నారు. పార్టీ మం డల కన్వీనర్ బల్వంత్‌రెడ్డి సమక్షంలో ప్రధాన చౌరస్తాలో ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్ అమర్ రహే.. జైజగన్.. జైజైజగన్ అంటూ నినదించారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో టంగటూర్ సొసైటీ డెరైక్టర్ సుధాకర్, నాయకులు లక్ష్మారెడ్డి, షాపుద్దీన్, రంగారెడ్డి, గోపాల్‌రెడ్డి, రామస్వామి, శంకర్‌నాయక్, నర్సింహారెడ్డి(బాబు), బిక్షపతి, యాదిరెడ్డి, మిరాజుద్దీన్, వడ్లరమేష్, కొల్లురిబాలయ్య, చా కలిబాల్‌రాజ్, సుభాన్, పర్మయ్య, సత్తమ్మ, సంగీత తదితరులు పాల్గొన్నారు.
తట్టెపల్లిలో కోలాహలం
తాండూరు రూరల్: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం బెయిల్‌పై విడుదల కావడంతో పెద్దేముల్ మండలం తట్టెపల్లిలో సంబరాలు మిన్నంటాయి. వైఎస్‌ఆర్ చౌరస్తాలోని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో జగన్ బయటికి వచ్చారన్నారు. తెలంగాణలోనై వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు అంజద్, నాయకులు నర్సింహారెడ్డి, హరిసింగ్, ఇస్మాయిల్, నర్సింహులు, హబీబ్, జహీర్, జగన్, భాస్కర్, సత్యం పాల్గొన్నారు.
జన సంబరం
Published Wed, Sep 25 2013 4:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement