వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి | both areas develop with YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి

Published Wed, Mar 12 2014 10:58 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

both areas develop with YSRCP

 ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఇరు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్‌చేసిన అనంతరం శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ సీమాంధ్ర, తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ఎన్నటికీ విస్మరించరన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వైఎస్ ఎంతో చేశారన్నారు.

 ఇటీవలి కాలంలో పార్టీలోకి వలసలు అధికమయ్యాయని, పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతోందని వెల్లడించారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి పార్టీ ఆశయాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లె సాయిబాబాగౌడ్, నాయకులు చిత్రం జంగయ్య, ముత్యాల శ్రీహరి, ఉడుతల సతీష్‌గౌడ్, నదీమ్, ఉడుగుల శివకుమార్‌గౌడ్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మేడిబాయి అంజయ్య, పాషా, మల్లారెడ్డి, అంజమ్మ, శోభ, మైసమ్మ, మహేశ్, బస్వాపురం కృష్ణ, సొప్ప రి కరుణాకర్, హరినారాయణ, మైసయ్య, వినోద్, ఎం.నరేశ్, జి.భూపాల్‌రెడ్డి, కుమార్‌గౌడ్, బత్తుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement