
యాదగిరిగుట్టకు చేరుకున్న పాదయాత్ర
యాదగిరిగుట్ట: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన కొనసాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఈనెల 25న హైదరాబాద్‌లో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు ఆరొందల అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని, నాలుగేళ్లయినా ఇంకా అబద్ధాలతోనే ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. కాగా, యాదాద్రిలో జగన్ పేరు మీద పూజలు చేయించామని, 2019లో ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నట్లు రాఘవరెడ్డి తెలిపారు.
ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటరాంరెడ్డి, విజయ ప్రసాద్, చెరుకు శ్రీనివాస్, సీఈసీ సభ్యులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుమ్మ అప్పిరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్, ఆయా జిల్లాల అధ్యక్షులు నాడం శాంత, వడ్లోజు వెంకటేశ్,, భగవంత్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, అప్పం కిషన్, బాన్సువాడ కో ఆర్డినేటర్ రామ్మోహన్, యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి సతీష్‌రాజ్ తదితరులు ఉన్నారు.