వైఎస్సార్‌సీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘బంగారు తెలంగాణ నిర్మా ణం అంటూ సీఎం కేసీఆర్ ఆ బంగారు తెలంగాణకు వెన్నెముకలాంటి రైతుల గోడు పట్టించుకోవడం లేదు. నాగలిపట్టే రైతు లు ఆ నాగలికే ఉరేసుకొని చచ్చే దుస్థితి నెలకొన్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. ఆరుగాలం శ్రమించే రైతులకు భరోసా ఇవ్వడంతోపాటు సర్కారు కళ్లు తెరిపించేందుకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో వైఎ స్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహిస్తున్నాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ స్పష్టం చేశారు.
శనివారం సాయంత్రం కామారెడ్డిలో రైతుదీక్ష సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్ద పట్లోల్ల సిద్దార్థరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాం త్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు భీష్మ రవీం దర్, నాయకులు వెకంట్రావ్, గూడూరి జైపాల్‌రెడ్డి, నీలం రమేశ్, జిల్లా నాయకులు విజయలక్ష్మి తదితరులతో కలిసి మాట్లాడారు. నాగలి దున్నే రైతు నాగలికే ఉరివేసుకుంటున్నాడని, పంటకు చల్లే పురుగుమందును తాగుతూ పంటచేనులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో ఏడు వందల మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సీఎం కేసీఆర్ వారి కుటుం బాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతుల సమస్యలు, ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 11న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణలో 10న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైతుదీక్ష చేపట్టారని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ రైతులు అనేక కష్టాలలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం రైతులను పట్టిం చుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని, కరువు, అకాల వర్షాలతో రైతులు తీవ్ర మనోవ్యధకు గురవుతున్నట్లు తాము గ్రామాలకు వెళ్లిన సందర్భంలో తెలిసిందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను కేసీఆర్ వంచిం చాడని ఆరోపించారు. వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్నప్పుడు తాము ఈ కష్టాలు పడలేదని రైతులు చెప్పారని రాఘవరెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డిలో జరిగే రైతుదీక్షను విజయవంతం చేయాలని కోరారు.
నాగలిపట్టే రైతు నాగలికే ఉరేసుకుంటున్నాడు
Published Sun, May 10 2015 2:37 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement