K. Sivakumar
-
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకొన్న తెలంగాణలో ఇప్పుడు తుగ్లక్ పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే నీళ్లు, నియామకాలు అని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉద్యోగ నియామకాలు జరపకుండానే 31 కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే పాలన ఏ విధంగా సాగిస్తారని ప్రశ్నించారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దసరా నాడు జిల్లాల ప్రారంభం పెట్టుకుని ఉద్యోగులను పండుగకు దూరం చేశారన్నారు. శాస్త్రీయత ఏదీ?: పరిపాలన కోసం జిల్లాలు పెంచడం మంచిదే అయినా.. అది శాస్త్రీయంగా లేకపోవడం పైనే తమ పార్టీ స్పందిస్తోందని శివకుమార్ తెలిపారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నెల న్నర తర్వాత అధికారులను అధ్యయనం కోసం ఇతర రాష్ట్రాలకు పంపడం సమంజసంగా లేదన్నారు.గద్వాలను జోగులాంబ జిల్లాగా ప్రకటిస్తూ, అలంపూర్ మండలాన్ని వనపర్తి జిల్లాలో చేర్చడం ఏంట న్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పెట్టకుండానే గద్వాల, జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌లను జిల్లాలుగా ప్రకటించారన్నారు. నాలుగు జిల్లాల ఏర్పాటుపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదిక సమర్పించక ముందే సీఎం ఆ నాలుగింటినీ జిల్లాలుగా ప్రకటించారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఎమ్మార్వో పేరు తొలగించి, దాని స్థానంలో తహసీల్దార్ పేరు తీసుకువచ్చారన్నారు. ఇప్పుడు కేసీఆర్ తానే తహసీల్దార్ పేరును కనుగొన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. -
జిల్లాల విభజనపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించాలన్నారు. జిల్లాల పెంపు అశాస్త్రీయంగా ఉందని అన్నారు. 10 జిల్లాల తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఒకటి రెండు జిల్లాల కోసం దీక్ష చేయడం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ఠ అని అన్నారు. రాష్ట్రాల మధ్య చిచ్చు ఆరకముందే సీఎం కేసీఆర్ జిల్లాల మధ్య చిచ్చు రగిల్చారని అన్నారు. 27 నెలలుగా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని వాపోయారు. -
20న జరిగేది అఖిలపక్షమా.. ఏకపక్షమా?
అఖిలపక్ష భేటీకి వైఎస్సార్సీపీని పిలవకపోవటం పెద్ద తప్పు జిల్లాల విభజనలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం ప్రకటనలకే పరిమితమైన బంగారు తెలంగాణ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ధ్వజం హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం.. కేవలం ఏకపక్ష సమావేశం లాగా కనపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్సీపీని పిలవకపోవటం పెద్ద తప్పు అని ఆయన పేర్కొన్నారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై 10 జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, అది గుర్తించిన సీఎం కేసీఆర్ కంటితుడుపు చర్యగా, ఒక పద్ధతి అంటూ లేకుండా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీకి చెందిన 58, 59 జీవోలకు సంబంధించి గత ఏడాది అఖిలపక్షానికి వైఎస్సార్సీపీని పిలిచిన ప్రభుత్వం.. ఇప్పుడు పిలవకపోవటంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. సీపీఐ, సీపీఎంను పిలిచి వైఎస్సార్సీపీని మాత్రం విస్మరించారన్నారు. అఖిలపక్షానికి పిలిచినా, పిలవకపోయినా జిల్లాల విభజనలో ప్రజల కోరికకు మద్దతుగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ జిల్లాలను విభజిస్తే వైఎస్సార్సీపీకి అభ్యంతరలేదని, సీఎం సొంత రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చేస్తే మాత్రం ప్రజల పక్షాన నిలిచి ఆందోళనలు సాగిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ గెజిట్ పత్రికలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలను అఖిలపక్షానికి ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని, వైఎస్సార్సీపీ తప్ప మిగతా పార్టీలన్నింటినీ ఆహ్వానించారని చెప్పారు. ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైఎస్సార్సీపీ మూడో స్థానంలో ఉందంటూ.. అందుకు సంబంధించిన ఆధారాలను శివకుమార్ మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఆగస్టు 15 వేడుకలకు కూడా వైఎస్సార్సీపీని పిలవలేదని ఆరోపించారు. 26 నెలల్లో పూటకో మాట, వారానికో ఒక నిర్ణయం లాగా సీఎం కేసీఆర్ పాలన సాగిందని, ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ పత్రికా ప్రకటనలకే పరిమితమైందని చెప్పారు. బంగారు తెలంగాణలో ముఖ్యమంత్రికి సమర్పించాల్సిన వినతిపత్రాల్ని, ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోవటంతో గవర్నర్‌కు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇప్పటికే 16సార్లు మొట్టికాయలు వేసిందని శివకుమార్ గుర్తుచేశారు. పార్టీ ఫిరాయిం చిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు.. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, 3 వారా ల్లో సమాధానం చెప్పాలని నోటీసులు ఇవ్వటం సరైం దేనన్నారు. సుప్రీం నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు పార్టీ కండువలు కప్పినంత మాత్రా న సరిపోదని, ఎన్నికలకు వెళ్లే దమ్ము ధైర్యం ఉండాలని చెప్పారు. ఆహ్వానం అందకుంటే 20న ఆందోళనలు నాగర్‌కర్నూల్: పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తజిల్లాల ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ స్వాగతిస్తుందని, కానీ ఈనెల 20న నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీకి ఆహ్వానం అందించకపోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంతర్యమేమిటని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీ ఎంగిలిమెతుకులకు ఆశపడి వెళ్లారని, అంతమాత్రాన పార్టీ విలీనమైనట్లు కేసీఆర్ భ్రమపడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రజలు గుర్తించిన పార్టీ అని పేర్కొన్నారు. గురువారం సాయంత్రంలోగా ఆహ్వానం అందకుంటే హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి తరువాత రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు, పార్టీ ఫిరాయించిన వారికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చి మూడువారాలలో స్పందించాలని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తన మేనిఫెస్టో భగవద్గీత అని, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ఒకప్పుడు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు రైతులను ఏడిపిస్తున్నారని అన్నారు. మూడో దఫాలో రూ. 25 వేలు రుణమాఫీ చేయాల్సి ఉండగా, రూ. 12,500 మాత్రమే చేశారని, 60 శాతం రైతుల పాస్‌బుక్కులు బ్యాంకుల్లో ఉన్నాయని, రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. పాలమూరు జిల్లాలో రైతులకోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులు చేపట్టి 90 శాతం పనులు పూర్తి చేశారని, మిగతా పనులు పూర్తి చేస్తే వైఎస్‌కు పేరొస్తుందనే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుందని ఎద్దేవా చేశారు. పాల మూరు ప్రాజెక్టుల సందర్శనపై ఈనెల 24న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీ స్థలంలో వద్దు:వైఎస్సార్సీపీ
హైదరాబాద్: విశ్వవిద్యాలయం స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించాలన్న ఆలోచనను విరమించుకోవాలని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే విద్యార్థులతో కలసి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టితో సీఎం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మంగళవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అందుకోసం యూనివర్సిటీ స్థలాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే పలు యూనివర్సిటీల స్థలాలను పలు సంస్థలకు అప్పగించారని, మిగిలిన భూములను కోల్పోతే విశ్వవిద్యాలయాల విస్తరణ కష్టమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
నాగలిపట్టే రైతు నాగలికే ఉరేసుకుంటున్నాడు
వైఎస్సార్సీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘బంగారు తెలంగాణ నిర్మా ణం అంటూ సీఎం కేసీఆర్ ఆ బంగారు తెలంగాణకు వెన్నెముకలాంటి రైతుల గోడు పట్టించుకోవడం లేదు. నాగలిపట్టే రైతు లు ఆ నాగలికే ఉరేసుకొని చచ్చే దుస్థితి నెలకొన్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. ఆరుగాలం శ్రమించే రైతులకు భరోసా ఇవ్వడంతోపాటు సర్కారు కళ్లు తెరిపించేందుకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో వైఎ స్సార్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుదీక్ష నిర్వహిస్తున్నాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం కామారెడ్డిలో రైతుదీక్ష సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్ద పట్లోల్ల సిద్దార్థరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాం త్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు భీష్మ రవీం దర్, నాయకులు వెకంట్రావ్, గూడూరి జైపాల్‌రెడ్డి, నీలం రమేశ్, జిల్లా నాయకులు విజయలక్ష్మి తదితరులతో కలిసి మాట్లాడారు. నాగలి దున్నే రైతు నాగలికే ఉరివేసుకుంటున్నాడని, పంటకు చల్లే పురుగుమందును తాగుతూ పంటచేనులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో ఏడు వందల మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సీఎం కేసీఆర్ వారి కుటుం బాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతుల సమస్యలు, ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో 11న వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణలో 10న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైతుదీక్ష చేపట్టారని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ రైతులు అనేక కష్టాలలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం రైతులను పట్టిం చుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని, కరువు, అకాల వర్షాలతో రైతులు తీవ్ర మనోవ్యధకు గురవుతున్నట్లు తాము గ్రామాలకు వెళ్లిన సందర్భంలో తెలిసిందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను కేసీఆర్ వంచిం చాడని ఆరోపించారు. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు తాము ఈ కష్టాలు పడలేదని రైతులు చెప్పారని రాఘవరెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డిలో జరిగే రైతుదీక్షను విజయవంతం చేయాలని కోరారు. -
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత కె.శివకుమార్ ధ్వజం హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ ధ్వజమెత్తారు. తమ పాలనపై ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక, రాజకీయంగా వైఎస్సార్సీపీని ఎదుర్కొనే దమ్ము లేకనే చంద్రబాబు హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మార్వో ఆఫీస్‌లో వైఎస్సార్సీపీనేత ప్రసాదరెడ్డిని హత్య టీడీపీ నేతల పిరికిపంద చర్య అని అన్నారు . ఈ హత్యను వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.