హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు | tdp Promote murder of politics | Sakshi
Sakshi News home page

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు

Published Thu, Apr 30 2015 1:35 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు - Sakshi

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత కె.శివకుమార్ ధ్వజం
 
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ ధ్వజమెత్తారు. తమ పాలనపై ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక, రాజకీయంగా వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే దమ్ము లేకనే చంద్రబాబు హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు.

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మార్వో ఆఫీస్‌లో వైఎస్సార్‌సీపీనేత ప్రసాదరెడ్డిని హత్య  టీడీపీ నేతల పిరికిపంద చర్య అని అన్నారు . ఈ హత్యను వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement