
రైతు సమస్యలపై దృష్టి సారించండి
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని టీ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని టీ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మాట్లాడుతూ...తక్షణమే వడ్డీతో సహా రైతుల రుణమాఫీని అమలు చేయాలన్నారు.
రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కొండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ హైటెక్ పోకడలు మాని...రైతు సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.