ప్రహసనంగా రైతు సమగ్ర సర్వే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించారు... ప్రత్యేకంగా హైదరాబాద్‌కు పిలిపించుకొని మీటింగ్ పెట్టారు. కానీ కొందరు వ్యవసాయాధికారుల తీరు మారడంలేదు. వచ్చే ఏడాది నుంచి రైతుకు ఎకరాకు రూ. 8 వేలు పెట్టుబడి ఖర్చుగా ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకోసం రైతు సమగ్ర సర్వే చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు ఇంటికెళ్లి నమూనా పత్రం ప్రకారం వివరాలు సేకరించాలని కోరారు. కానీ కొందరు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) రైతులనే తమ వద్దకు పిలిపించుకొని వివరాలు సేకరిస్తున్నారని తెలుస్తోంది.
కొందరైతే మండల కేంద్రానికి పిలిపించుకొని వివరాలు నమోదుచేస్తున్నారని తెలిసింది.ఇలా సేకరించడం వల్ల సమగ్రత రాదని అధికారులు అంటున్నారు.ఇందుకు బాధ్యులైన ఇద్దరు ఏఈవోలను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. మరికొందరిని జిల్లా వ్యవసాయాధికారులు తీవ్రంగా మందలించినట్లు సమాచారం. రైతు సమగ్ర సమాచారం సేకరించి వచ్చే జూన్ 10వ తేదీ నాటికి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ ఆ కాపీ అందజేయాలి. అందుకోసం వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఏవో, ఏఈవోలకు వచ్చే వారం నుంచి మూడు విడతల్లో ట్యాబ్‌లను అందజేస్తారు. ప్రత్యేకంగా యాప్‌ను తయారుచేశారు. దాన్ని ట్యాబ్‌ల్లో డౌన్‌లోడ్ చేయనున్నారు. సేకరించిన సమాచారాన్ని యాప్‌లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి చెప్పినా మారరా?
Published Sun, May 14 2017 1:30 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement