⇒ వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ప్రశ్న
⇒ వెయ్యి రోజుల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ.. అరెస్టులు, దాడులు చేయడమేంటని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సర్కార్ తీరును సహించబోమని హెచ్చ రించారు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహిం చిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిపల్లి మండలా నికి చెందిన పలువురు రాఘవరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీయా లని పిలుపు నిచ్చారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరితే.. అరెస్టులు, దాడులు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాంకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. వెయ్యి రోజుల పాల నలో ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాలెక్కడ?
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలు ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణలో వాటి అమ లులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాఘవరెడ్డి విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 36 ప్రాజెక్టులు ప్రారంభించారని, అందులో ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. రీ డిజైన్ల పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. మిగులు రాష్ట్రమని చెబుతున్న పాలకులు.. దాదాపు రూ.600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు, కంది రైతుల సబ్సిడీ, విద్యార్థుల ఉపకార వేతనాలు ఎందుకు చెల్లించడం లేదన్నారు. 108 వాహనాల్లో డీజిల్‌కు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉంద న్నారు. లక్షా తొమ్మిది వేల ఉద్యాగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం పదివేల ఉద్యో గాలూ ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు.
12న ఆవిర్భావ వేడుకలు
వైఎస్సార్ సీపీ ఆవిర్భవించి ఆరేళ్లు పూర్తి చేసుకుం టున్న సందర్భంగా మార్చి 12న ఆవిర్భావ వేడుక లను ఘనంగా నిర్వహించాలని కొండా రాఘవరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ, మండల, నియోజక, జిల్లా స్థాయిలో జెండాలు ఎగుర వేయ డంతోపాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు బంగారు వెంకట రమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నర్ర భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాలడిగితే అరెస్టులా..?
Published Wed, Mar 1 2017 12:45 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement