రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటలే శరణ్యం అని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఆదివారం లోటస్ పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండల కమిటీ అధ్యక్షుల నియామకంతో పాటు కమిటీ సభ్యులను సత్వరమే నియమించుకోవాలని చెప్పారు. ఈ నెల 8 న వైఎస్సార్ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్విహించాలని సూచించారు. జిల్లా ప్రాజెక్టుల నిర్మాణాల్లో సీఎం కేసీఆర్ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని చెప్పారు. మిగతా పార్టీ సరైన రీతిలో ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాయని తెలిపారు. ప్రజల్లో బలపడేందుకు ఇదే సరైన సమయం అని తెలిపారు. కార్యవర్గ సభ్యులు కష్టించి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా పరిశీలకుడు రాంభూపాల్ రెడ్డి, సహయ పరిశీలకులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.