ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ చేస్తున్నారే తప్ప ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడంలేదని తెలంగాణ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితారెడ్డి తరఫున ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ...కేసీఆర్కు దమ్ముంటే దళితుడిని సీఎంను చేసి చూపెట్టాలన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీను పాతరేస్తాననడమేనా నీ తెలంగాణ నీతి అని కేసీఆర్ను ప్రశ్నించారు.
'కేసీఆర్ మాటల గారడీ చేస్తున్నారు'
Published Wed, May 11 2016 7:47 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement