సీఎం కేసీఆర్ 60 కోట్లతో ప్రగతి భవన్ కట్టించుకున్నాడు. కానీ, రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం తన కోసం భారీ వ్యయంతో భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.