'కేసీఆర్ గారు.. మీకో మంచి అవకాశం' | Kcr will have a good chance, says Konda raghava reddy | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ గారు.. మీకో మంచి అవకాశం'

Published Wed, Aug 31 2016 6:01 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

'కేసీఆర్ గారు.. మీకో మంచి అవకాశం' - Sakshi

'కేసీఆర్ గారు.. మీకో మంచి అవకాశం'

హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ప్రశంసించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన 'ఓటుకు కోట్లు కేసులో కూడా ఇలానే ప్రవర్తిస్తే ఇంకా మంచి పేరు వస్తుంది' అని అన్నారు.

'కేసీఆర్ గారు.. ఇది మీకు మంచి అవకాశం'  అంటూ కితాబిచ్చారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement