వైఎస్సార్ పథకాలను నిర్వీర్యం చేస్తే సహించం' | will not tolerate to avert the YSR schemes, says Konda raghava reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ పథకాలను నిర్వీర్యం చేస్తే సహించం'

Published Mon, Jul 27 2015 1:51 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

వైఎస్సార్ పథకాలను నిర్వీర్యం చేస్తే సహించం' - Sakshi

వైఎస్సార్ పథకాలను నిర్వీర్యం చేస్తే సహించం'

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తే తాము సహించమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఆరోగ్యశ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఉంటుందని అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు.

లక్షకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ అని 15 వేలకు పరిమితం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రకటనలతో కాలం గడుపుతున్నారే తప్పా.. అవి వాస్తవ రూపం దాల్చడం లేదని కొండ రాఘవరెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement