
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత దొరికిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు(వీహెచ్) ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నయీమ్ కేసుపై తాను గతంలోనే సిట్ అధికారులకు, రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. కానీ, ఇంతవరకు ఏ చర్యలు చేపట్టలేదని, కేసును ప్రభుత్వం కావాలనే నీరుగార్చుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలన్నింటిలో కేసీఆర్ కుటుంబసభ్యుల పాత్ర ఉండటంతోనే ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు
Comments
Please login to add a commentAdd a comment