
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా విభజన హామీల అమలులో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని, కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలన్నీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా భారీ సభ పెట్టాలని సూచించారు.
రాష్ట్ర కాంగ్రెస్‌లో బీజేపీ వైపు చూస్తున్న వారెవరూ లేరని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న నియంత పాలనపై ఢిల్లీలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment