కిరణ్ కుమార్ రెడ్డి నిర్వాకం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం అయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన వేలకోట్ల నిధులు కూడా రాని దుస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ అక్రమ సంతానమే కిరణ్ కొత్తపార్టీ అని రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒక్కటై మాయాకూటమిగా ఏర్పడినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేరని కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేకే అన్ని పార్టీలు టీడీపీలోకి రావాలనే దుస్థితి చంద్రబాబు నాయుడిదని ఎద్దేవా చేశారు.