
'ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'
ఖమ్మం : ఎన్నికల మేనిఫెస్టో అమలుపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.
ఖమ్మంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.