
'వైఎస్ఆర్ పథకాలను నిర్వీర్యం చేస్తే నిరసన తెలుపుతాం'
వరంగల్: దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత టీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే నిరసన వ్యక్తం చేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొండా రాఘవ రెడ్డి అన్నారు. వరంగల్ లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపుతామన్నారు. ఈ సందర్భంగా 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు.