షర్మిల వెనుక విష నాగులు ఎవరు?. సొంత అన్నపై ఎందుకు విషాన్ని చిమ్ముతుంది?. విష బీజాలు ఎక్కడ మొలకెత్తాయి?. సీఎం జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది?. అసలు బ్లాక్ మెయిలింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో ఆధారాలతో సహా తీసుకొస్తానంటూ తేల్చి చెప్పారు వైఎస్సార్‌టీపీ మాజీ నాయకుడు కొండా రాఘవరెడ్డి. ఆమెను అహంకారపూరిత వ్యక్తిగా అభివర్ణించిన రాఘవరెడ్డి అనేక షాకింగ్ విషయాలు చెప్పారు. షర్మిల అబద్దాలు, నాటకాలు వెనుక దుష్టశక్తులు ఉన్నాయన్నారు.
వైఎస్సార్‌ను అభిమానించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలన్నారు. వైఎస్సార్ పేరు పెట్టుకుని ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారంటూ షర్మిల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోనియాగాంధీ లాంటి వారిని ఎదురించి 16 నెలలు జైలుకి వెళ్లి, 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి.. ఎండనక, వాననకా కష్టపడి స్వయంశక్తితో తండ్రి పేరు నిలబెడుతున్న అన్నకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న షర్మిల తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ఎంతో గొప్పగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఊసరవెల్లి కూడా సిగ్గు పడే విధంగా షర్మిల రంగులు మారుస్తోందన్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టి, తెలంగాణలో ప్రజల్ని మోసం చేసి, కార్యకర్తల్ని నట్టేట ముంచేసి ఏపీకి వెళ్లడానికి కారణం ఆమెలోని కుట్ర పూరిత కోణం, అహంకారమే కారణమన్నారు. సీఎం జగన్ జైలులో ఉన్న సమయంలో తల్లి వైఎస్ విజయమ్మ చేత పాదయాత్ర చేయిద్దామనే ప్రతిపాదన వస్తే.. అమ్మకు మోకాళ్ల నొప్పులు అంటూ షర్మిల చెప్పిందన్నారు. ఆపై సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేత పాదయాత్ర చేయించాలనే ఆలోచన చేస్తే.. షర్మిల అడ్డుకట్ట వేసిందన్నారు. అన్న కోసం తాను ఉన్నానంటూ ముందుకు వచ్చిందని, ఆ సమయంలోనే షర్మిలలో విష బీజాలు పడ్డాయన్నారు కొండా రాఘవరెడ్డి.
ఆపై వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి తనకు లాభం చేకూర్చేలా ఒక పని చేసిపెట్టామన్నాడని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే ఆ పనిని చేయనంటూ సీఎం స్థానంలో ఉన్న జగన్ విముఖత వ్యక్తం చేయడంతోనే వారిలో(షర్మిల, అనిల్) ఉన్న విషం ఈ రకంగా బయటకొస్తుందని రాఘవరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment