Guntur Assembly Constituencies
-
YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం
వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు. రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా, మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు. ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. జగన్‌ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. -
చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో ‘రా కదలిరా’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన పొగిడారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనేనని ఆలపాటి అన్నారు. దీంతో సభతో పాటు ఒక్కసారిగా చంద్రబాబు అవాక్కయ్యారు. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. ఇదీ చదవండి: జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు -
జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు, పొన్నూరు/చేబ్రోలు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. బొడ్డు వర్గం నిరసన.. కింద పడబోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో జరిగిన సభలో రాజానగరం టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం తగదని బాబు ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలు చేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు కిందకు పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. బాబు తిరిగి వెళ్తుండగానూ బొడ్డు వర్గం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో ఆగ్రహించిన బాబు అసమ్మతి నేతలను, బొడ్డు వెంకట రమణ చౌదరిని బస్సులోకి పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుతోనూ మంతనాలు జరిపినట్టు తెలిసింది. వేషాలు మార్చే మారీచుడు జగన్ : చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు సభల్లో మాట్లాడిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ వేషాలు మార్చే మారీచుడని విమర్శించారు. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, టీడీపీ గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తాను ఐటీని ప్రోత్సహిస్తే, జగన్ ఐదువేలకు వలంటీర్ ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. అమరావతిపై కులం ముద్ర వేసి నాశనం చేశారని పేర్కొన్నారు. ఇది దేవతల రాజధాని అని, దీనిని జగన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. జగన్ సిద్ధం అంటుంటే ప్రజలు ఆయనను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తనపై అమరావతి, రింగ్‌రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశారని, జగన్‌కు ఎంతో నమ్మకస్తుడైన ఆయనే ఇప్పుడు తిరగబడ్డారని చంద్రబాబు విమర్శించారు. మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ సభలకు వచ్చిన కార్యకర్తలకు నిర్వాహకులు మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ చేశారు. బాబు ప్రసంగం జరుగుతుండగానే పొన్నూరు సభా ప్రాంగణంలో కొందరు మద్యం సేవించడంతో మహిళా నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సభకు వాహనాల్లో తీసుకువచ్చి ముగిసిన తర్వాత వదిలేశారని, డబ్బులిస్తామని ఇవ్వలేదని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థతగల నేత జగన్ : ఆలపాటి రాజా పొన్నూరు సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా చంద్రబాబును పొగడబోయి సమర్థత, సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. బత్తులపై బాబు ఆగ్రహం చంద్రబాబు జనసేన రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ సభ వద్దకు వచ్చిన బత్తుల వర్గీయులు జై జనసేన నినాదాలు చేశారు. దీంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. బత్తులను పక్కకు తోసేయమని తన సిబ్బందిని ఆదేశించారు. పిచ్చివేషాలు వెయ్యొద్దంటూ హెచ్చరించారు. దీంతో బత్తుల చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డంగా వెళ్లి మరీ అనుచరులతో నినాదాలు చేయించారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు అయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టిన వ్యవహారంలో సాంబశివరావుపై కేసు నమోదుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాంబశివరావుతోపాటు మరో ఐదుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 ముద్దాయిగా ఎమ్మెల్యే సాంబశివరావు ఉన్నారు. చదవండి: దొంగ ఓట్లు... ‘పచ్చ’ నోట్లు -
‘జగనన్న సామాజిక న్యాయం మొదలైంది ఇక్కడి నుంచే’
సాక్షి, పల్నాడు: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత నియోజకవర్గంలో భావోద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని ప్రసంగించారామె. సోమవారం చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఆపై నిర్వహించిన సభలో మంత్రి విడుదల పాల్గొని మాట్లాడారు. ఒక బీసీ మహిళలైన తనకు చిలకలూరిపేట సీటు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి తమ ప్రభుత్వంలో చిలకలూరిపేటలో జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిపించాలి మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆమె సభకు హాజరైన ప్రజలకు పిలుపు ఇచ్చారామె. కానుక అందిద్దాం.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలు మరే ఇతర ముఖ్యమంత్రి అమలు చేయలేదని చిలకలూరిపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీని గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి కానుక అందిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. దేశంలోనే 30 లక్షల మందికిపైగా నిరుపేదలకు ఇల్లపట్టాలు పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. చదవండి: వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. తమకు అనర్హత వేటు నోటీసులు పంపడాన్ని తప్పుబడుతూ.. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదుల్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూనే.. తదుపరి విచారణను వచ్చే నెల 26వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ -
RS Elections: వేడెక్కిన ఏపీ రాజకీయం
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ పట్టుకుంది. అందుకు కారణం.. పెద్దల సభకు జరగబోయే ఎన్నికలు. తద్వారా రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు అయ్యే అవకాశం. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠా నెలకొంది. సాధారణ ఎన్నికలకు ముందే రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు కానుంది. కారణం ఉన్న ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో ఉన్న ఒక్క సీటు కూడా దూరం కానుంది. ఇక ఎమ్మెల్యే సంఖ్యా బలంతో వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలు దక్కించుకుంటామనే ధీమాతో ఉంది వైఎస్సార్సీపీ. ఈ తీవ్ర ఆందోళనల నడుమే దుష్ట రాజకీయానికి తెర లేపినట్లు స్పష్టమవుతోంది. ఎందుకు.. ఏప్రిల్ 2తో వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీకాలం ముగియనుంది. సంఖ్యాబలాన్ని బట్టి ఈ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్సీపీ పరం కానున్నాయి. తద్వారా రాజ్యసభలో ఉనికే లేకుండాపోనుంది టీడీపీ. అదే జరిగితే.. 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి కానుంది. ఇదీ చదవండి: రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల వ్యూహ-ప్రతివ్యూహాలు రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యే ఓట్లే కీలకం కానున్నాయి. దీంతో ఎన్నికలు జరగనున్న 3 స్థానాలకు షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ-ప్రతివ్యూహాలతో అప్రమత్తమయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలనూ గెలుచుకుంటామని వైఎస్సార్సీపీ ధీమాతో ఉండగా.. ఒక్క సీటుకు పోటీ పెట్టాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. ప్రస్తుతం స్పీకర్ ముందు నలుగురు వైసీపీ రెబల్స్, మరో నలుగురు టీడీపీ రెబల్స్ అనర్హత పిటిషన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక సీటు గెలవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. గంటా రాజీనామా ఆమోదం ద్వారా టీడీపీ కి ఒక సీటు తగ్గింది. మళ్లీ అదే బాటలో బాబు.. తెలుగుదేశం అనగానే గుర్తొచ్చేది పార్టీ ఫిరాయింపులు. తెలంగాణలో ఓటుకు కోట్లు అయినా.. ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీల డబ్బు వ్యవహారం అయినా.. ఫిరాయింపులకు టీడీపీ బ్రాండ్‌గా మారింది. మరోసారి అదే అస్త్రంపై నమ్మకం పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. బలం లేకున్నా... పోటీకి అభ్యర్థిని పెట్టడం.. ఆ పార్టీకి వస్తోన్న అనవాయితీ. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లోనూ ఒక స్థానానికి వర్లరామయ్య, కోనేరు సురేష్ పేరు పరిశీలిస్తున్నట్టు టీడీపీ లీకులిస్తోంది. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి తగ్గే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల ద్వారా నెలపాటు స్పీకర్‌ను గడువు కోరడం వెనుక చంద్రబాబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
‘సోనియా, చంద్రబాబు ద్రోహాన్ని ఎవరూ క్షమించరు’
పల్నాడు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమైందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడారు. గత పాలనలో చంద్రబాబు వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని తెలిపారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఏపీకి చేసిన ద్రోహానికి ఆమెను ఎవరు క్షమించరని అన్నారు. రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని తరతరాలు గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రపుటల్లో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. సామాజిక సాధికార యాత్ర దేశంలోనే ఎవరూ చేయని ఓ అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. వచ్చే ఎన్నికలు ధనికులకు.. పేదవారికి మధ్య జరిగే ఓ రెఫరండమని అన్నారు. ఈ యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదవారి పక్కన వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబడి వారిని గెలిపిస్తారని తెలిపారు. ప్రజల మధ్య సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి మల్లెల రాజేశ్ నాయుడు పోటీ చేస్తారని తెలిపారు. ఇక్కడ రాజేష్ నాయుడును గెలిపించాలని ఆయన కోరారు. చదవండి: వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ -
కులగణనపై కుతంత్రాలెందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనపై కుతంత్రాలెందుకు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బీసీ సంఘాలు సూటిగా ప్రశ్నించాయి. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన కులగణనను అడ్డుకునేందుకు పవన్ కుయుక్తులు పన్నడంపై బీసీల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ కుల గణన ఎందుకంటూ పవన్ ఎక్స్‌లో ఓ లేఖ ఉంచడంపై బీసీ సంఘాల నేతలు శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నప్పటికీ దేశంలో కులగణన చేపట్టలేదని వారు గుర్తు చేశారు. బీసీల ఆవేదనను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కుల గణన చేపట్టారని తెలిపారు. బీసీలకు మేలు చేసేలా సీఎం జగన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పెద్ద మనస్సుతో స్వాగతించాల్సిది పోయి పెడర్ధాలు తీసి అడ్డుకునే కుట్రలు చేయడం తగదని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పలువురు బీసీ నేతలు ఏమన్నారంటే.. వారి మాటాల్లోనే.. పవన్ బీసీ వ్యతిరేకి అని మరోమారు తేటతెల్లమైంది పవన్ కళ్యాణ్ బీసీ వ్యతిరేకి అని మరోమారు తేటతెల్లమైంది. బీసీల మేలు కోరి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనస్సుతో కుల గణన చేపట్టారు. దాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పవన్ అనడం ఆయన సంకుచిత వైఖరికి అద్దంపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల కోసం సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం పెడితే చంద్రబాబు ప్రోద్బలంతో కోర్టులో కేసులు వేయించారు. ఇప్పుడు కుల గణనను అడ్డుకునేందుకు కోర్టులో వేస్తానని పవన్ అంటున్నాడు. అంటే చట్టాలు చంద్రబాబు, పవన్‌కు ఏమైనా చుట్టాలా? పేదలకు మంచి జరిగితే సహించకుండా కోర్టుల్లో వేస్తామనడం సరైనదేనా? మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, నారాయణ గురు, సాహు మహారాజ్, పెరియర్ రామస్వామి వంటి మహనీయుల ఆలోచనలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే తపనతో సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిని చూసి సహించలేక చంద్రబాబు, పవన్ కుట్రలు, కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారు. బీసీల పట్ల దుర్మార్గంగా వ్యహరిస్తున్న చంద్రబాబు, పవన్‌కు తగిన గుణపాఠం చెబుతాం. – చింతపల్లి గురుప్రసాద్, బీసీ కులాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయాలకు అతీతంగా సహకరించాలి జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు విద్య, ఉపాధి రంగాల్లో తగిన వాటా పొంది అభివృద్ధి చెందాలంటే జన గణనలో కులగణన చాలా కీలకం. పదేళ్లకు ఒకసారి నిర్వహించే జన గణనలో కులం కాలమ్ చేర్చి బీసీల లెక్కలు తేల్చాలని దశాబ్దాల తరబడి జాతీయ స్థాయిలో అనేక పోరాటాలు చేస్తున్నాం. దేశంలోని అనేక బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా దేశంలో నిర్వహించాల్సిన జన గణనలో కులం కాలమ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంలేదు. కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించింది. అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు. కేంద్ర నిర్ణయం కోసం చూడకుండా రాష్ట్రంలోనైనా కుల గణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కుల గణన ప్రారంభమైంది. బీహార్ తర్వాత ఏపీలోనే కుల గణన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో పరిణతితో ఈ కార్యక్రమం చేపట్టారు. దీన్ని అభినందించాల్సింది పోయి కోర్టులకు వెళ్లి అడ్డుకుంటామనే తీరు సరికాదు. న్యాయపరమైన సమస్యలు సృష్టిస్తే కులగణన ఆగితే బీసీలకు తీవ్ర అన్యాయం చేసినవారవుతారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి కుల గణనకు సహకరించి బీసీలకు మేలు జరిగేలా చూడాలి. – కేశన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్ దేశానికే ఆదర్శం ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం (సోషల్ జస్టిస్)ను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఆయన చేపట్టిన అనేక విప్లవాత్మక చర్యలు దేశంలోని అనేక రాష్ట్రాలు అనుసరించేలా ఉన్నాయి. దేశంలో కుల గణన చేపట్టకపోవడంతో రాష్ట్రంలో సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సరికాదు. కుల గణనను అడ్డుకునే రాజకీయ పార్టీలు బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. – ఎన్వీ రావు, ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు బాబు, పవన్‌కు బీసీలు బుద్ధి చెబుతారు రాజకీయ దుర్బుద్ధితో కుల గణనను అడ్డుకుంటే చంద్రబాబు, పవన్‌కు బీసీలు బుద్ధి చెబుతారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని చంద్రబాబు దగా చేశాడు. ఇప్పుడు అధికారం లేకుండానే టీడీపీ, జనసేన బీసీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే మాట్లాడుతున్న పవన్ ఇప్పుడు కుల గణనను అడ్డుకునేలా కోర్టుకు వెళ్తానని అంటున్నాడు. కుల గణనతో బీసీలకు మేలు జరగడాన్ని కూడా వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచి సత్తా చూపిస్తాం. – కాసగాని దుర్గారావు, బీసీ నాయకుడు -
బాపట్లలో బాహాబాహీ
బాపట్ల టౌన్: తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. సాక్షాత్తూ జిల్లా కేంద్రం బాపట్లలోని టీడీపీ కార్యాలయంలోనే ఆ పార్టీ ఐ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు బాహాబా హీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. రా తేల్చుకుందాం అంటూ తొడలు చరుచుకున్నారు. మాటల తీవ్రత పెరిగి, దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యకర్తల సమక్షంలోనే కలబడ్డారు. ఇదే అదునుగా పార్టీకి చెందిన కమ్మ, యాదవ సామాజిక వర్గాలు రెండుగా విడిపోయి చెరో పక్షం చేరి సవాళ్లు విసురుకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటన తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేదాలను మరోమారు బట్టబయలు చేసింది. అసలేం జరిగిందంటే.. బాపట్ల మండలంలోని రెండో క్లస్టర్ పరిధి నాయకులతో ఐ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. సమావేశం జరుగుతుండగా అక్కడే ఉన్న పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు ‘‘ఇన్నాళ్లూ ఎక్కడున్నారు? సమావేశాల్లో మినహా గ్రౌండ్ లెవల్లో ఐ టీడీపీ ఎక్కడా పనిచేస్తున్నట్లు లేదు’’ అని అనడంతో ఒక్కసారిగా మానం శ్రీనివాసరావు ఆగ్రహానికి గురయ్యారు. మమ్మల్ని అడిగేందుకు నువ్వెవరు? అంటూ దురుసుగా మాట్లాడుతూ గొలపలపైకి దూసుకొచ్చారు. గొలపల కూడా అంతే స్థాయిలో నేనెవరో నీకు తెలీదా? అంటూ ఎదురుతిరిగారు. ఒక్కసారిగా ఇద్దరూ తన్నులాటకు దిగారు. దూషణలు చేసుకుంటూ, తొడలు చరుచుకున్నారు. వీరు తన్నులాటకు దిగడంతో ఓ వైపు కమ్మ సామాజిక వర్గం నాయకులు, మరోవైపు యాదవ సామాజిక వర్గం నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడికి యత్నించారు. వెంటనే స్పందించిన పార్టీ నాయకులు ఇరువర్గాలకూ సర్దిచెప్పారు. యాదవ నేతపై గతంలోనూ దాడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంతకాలంగా కొనసాగుతున్న ముసలం శనివారంతో బట్టబయలైంది. గతంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ, అతని తనయుడు రాకేష్ వర్మ యాదవ సామాజికవర్గానికి చెందిన మద్దిబోయిన రాంబాబుపై తనకు రావాల్సిన డెకరేషన్ డబ్బులు అడిగాడనే కోపంతో దాడి చేశారు. దీంతో రాంబాబు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం కమ్మ సామాజిక వర్గానికి చెందిన మానం శ్రీనివాసరావు కూడా వర్మ, అతని తనయుడి బాటలోనే యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావుపై దాడికి దిగడంతో ఒక్కసారిగా బీసీ నేతలు భగ్గుమన్నారు. పార్టీకి తమ సత్తా చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీకి ‘తూర్పు’ సెగ
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం సీట్ల పంచాయితీ శనివారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఆ రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్య నేతలను నిలదీశారు. రాజోలు టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో చంద్రబాబు లేకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారితో మాట్లాడారు. రాజానగరం నేతలు అచ్చెన్నకు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు త్వరలో రాజానగరం, రాజోలు నాయకులతో మాట్లాడతారని అచ్చెన్న సర్దిచెప్పారు. కార్యకర్తలు వినకపోవడంతో తర్జనభర్జన తర్వాత అధిష్టానం నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఆ రెండు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు నిరసన తెలిపారు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెగేసి చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అచ్చెన్న వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా కొద్దిసేపు ఉండి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. రాజాన‘గరం’ రాజానగరం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలి ఆది నుంచీ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై గతంలో బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశా వ్. అధికారంలో ఉండగా అనుభవించి, ఇప్పుడు గాలికి వదిలేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారు. బాబు వ్యవహార శైలితో విసుగు చెందిన పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన తర్వాత నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ దుకాణం కొన్నాళ్లు బంద్ అయింది. పెందుర్తి కి అప్రధాన పదవి అప్పగించారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతరం బొడ్డు వెంకట రమణ చౌదరిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. రాజానగరం టికెట్ తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ చౌదరి ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలో పవన్ ప్రకటనతో చౌదరి వర్గంలో ఆగ్రహం పెల్లుబికింది. రాజానగరం టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడికి ఇచ్చిన వినతిపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫేక్ అని ప్రచారం చేసేందుకు టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. -
చంద్రబాబుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. తేడా వస్తే జరిగేది ఇదే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైంది. పార్టీ టికెట్లపై నిర్ణయం తీసుకోలేక తల బొప్పి కట్టిపోతోంది. జనసేనతో పొత్తు నిర్ణయంతో టికెట్ రాదన్న భయంతో టీడీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. తమ టికెట్ సంగతి తేలిస్తేనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఎక్కడికక్కడ నేతలు తెగేసి చెబుతుండటంతో తండ్రీ కొడుకులకు నిద్ర కరువైంది. తెలుగుదేశం పార్టీ అంతర్గత పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఇప్పటికే పాతాళానికి కుంగిన ఆ పార్టీ.. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా లోతుకు కూరుకుపోతోంది. క్షేత్రస్థాయి కేడర్‌లో ఇప్పటికే పూర్తిగా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పార్టీకి ఇన్ఛార్జ్లు లేకపోవడాన్ని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతోంది. నాయకులు ఉన్న చోట కూడా కుమ్ములాటలతో సతమతమవుతోంది. జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉంటూ.. బీజేపీతో కూడా పొత్తు ప్రయత్నాలు చేస్తుండటంతో గందరగోళం ఇంకా పెరిగిపోయింది. టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుందో.. ఏ స్థానంలో తాము పోటీలో ఉంటామో తెలియక టీడీపీ కేడర్ అయోమయంలో మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కీలక నేతలు చంద్రబాబును ధిక్కరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనకుండా తమ సంగతి తేల్చాలని పట్టుబడుతున్నారు. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును చంద్రబాబు గాల్లో పెట్టడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకసారి గెలిచిన చోట మళ్లీ పోటీ చేయని గంటా.. వచ్చే ఎన్నికల్లో తనకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు ఇవ్వాలని కోరుతుండగా, చంద్రబాబు ఎటూ తేల్చడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక గంటా తంటాలు పడుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబం సైతం చంద్రబాబు వైఖరిపై రగిలిపోతోంది. పార్టీకి అండగా ఉన్న తమను దూరం పెడుతున్నారని వాపోతోంది. అయ్యన్న తనకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు, తన కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతుండగా.. ఎవరో ఒకరికి మాత్రమే సీటు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో ఆయన అలక వహించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా.. మౌనంగా ఉంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి సీటు జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండటంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన సీటు జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న ఆయన.. అవసరమైతే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు సీట్లు ఇవ్వకపోతే టీడీపీ సంగతి తేలుస్తామని గాజువాక, అనకాపల్లి నేతలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్‌లు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య జనసేన చిచ్చు పెట్టింది. ఇక్కడ అధిక శాతం సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాకినాడ సిటీ స్థానాన్ని జనసేనకు ఇస్తే తాను మరో దారి చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇప్పటికే బహిరంగంగా తన సీటు జనసేనకు ఇవ్వొద్దని కోరారు. ఒకవేళ ఇస్తే తాను ప్రత్యామ్నాయం చూసుకుంటానని హెచ్చరించారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్ కూడా పార్టీని ధిక్కరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు తనకివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతుండగా, చంద్రబాబు మరో వ్యక్తికి ఇవ్వాలని చూస్తున్నారు. తేడా వస్తే ఆయన జంప్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. కృష్ణా బెల్ట్‌లో విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుతో ఢీకొట్టి మరీ తెలుగుపార్టీకి రాజీనామా చేయడంతో టీడీపీ డిఫెన్స్‌లో పడిపోయింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పడంతో.. అదే బాటలో మరికొందరు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు లేదని చెప్పడంతో ఆయన లోలోన కుంగిపోతూ ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మైలవరం సీటును ఆయనకు కాదని కొత్త వ్యక్తికి ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన తనను మోసం చేశారని వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆయన స్థానంలో బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు ఇస్తుండడంతో ఆయన టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు కూడా సత్తెనపల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడటంతో చంద్రబాబుపై శివాలెత్తిపోవడంతో పాటు టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. మంగళగిరి నుంచి లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తానంటూ శపథం చేశారు. చిలకలూరిపేట సీటు విషయంలో భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మధ్య పోటీ నెలకొంది. సీటు లేకపోతే టీడీపీని వదిలేందుకు పుల్లారావు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సింహపురిలో నెల్లూరు సిటీ స్థానాన్ని వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉండడంతో మొదటి నుంచి అక్కడ పని చేసిన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం దక్కలేదంటూ ఆయన టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కదన్న అనుమానంతో ఆనం రాంనారాయణరెడ్డి ఆఫీసు తీసుకుని మరీ.. మళ్లీ మూసేసుకున్న పరిస్థితులు తలెత్తాయి. ఇప్పుడు ఆనం కూడా ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండిపోయారు. రాయలసీమ ప్రాంతంలోనూ వర్గ విభేదాలతో తెలుగుపార్టీలో అగ్గి రగులుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రస్తుత ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గ్రూపులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. ఎవరికి సీటిచ్చినా రెండో వర్గం తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తుండగా, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సీటు తనదేనని చెప్పుకుంటున్నారు. దీంతో పరిటాల ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తనను నమ్మించి పని చేయించుకుని ఇప్పుడు మాట మారిస్తే ఊరుకోనని ఆయన హెచ్చరిస్తున్నారు. ఒక ఇంట్లో ఒకరికే టికెట్ అని చంద్రబాబు చెప్పడంతో రాప్తాడులో పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ఇన్ఛార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను నియమించడంతో ఆ నియోజకవర్గంలో అసమ్మతి రాజుకుంది. ఇదీ చదవండి: సంగివలసలో సీఎం జగన్ సింహనాదం బ్రహ్మానందరెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆలూరు సీటు ఇవ్వకపోతే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ చంద్రబాబుకు ఝలక్ ఇవ్వనున్నారు. డోన్ అభ్యర్థిగా చంద్రబాబు.. ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించగా, కేఈ ప్రభాకర్ తాను రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుపై కేఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడుతున్నారు. అదే జరిగితే ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. -
అభిమానుల కోసం కొత్త పాట ‘సిద్ధం’ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్సీపీ కొత్త ఊపు తీసుకొచ్చింది. అభిమానుల కోసం కొత్త పాట ‘సిద్ధం’ను విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన, విపక్షాల కుట్రలకు ‘సిద్ధం’ పాట అద్ధం పడుతోంది. ప్రస్తుతం ‘సిద్ధం’ పాట సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఇక.. ఇప్పటికే విడుదలైన ‘జగనన్న అజెండా’ పేరుతో విడుదలైన వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాట యువత, వైఎస్సార్సీపీ శ్రేణులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాట వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై విపరీతంగా షేర్ చేస్తున్నారు. ‘‘మీబిడ్డ ఒక్కడే ఒక వైపు ఉన్నాడు.. చెప్పుకోవడానికి ఏమీ లేని వాళ్లంతా ఏకం అవుతున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి, మీరే సైనికులుగా కదలండి’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాయిస్‌తో మొదలయ్యే ఈ పాటను నల్లగొండ గద్దర్ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. జగనన్న అజెండా సాంగ్….🎵🎶 Jagananna Agenda Full Song…@ysjagan @JaganannaCNCTS#JaganannaAgenda#YSJagan#YSJaganAgain#YSRCPNewSong#YSJaganNewSong pic.twitter.com/dhD4joKIOZ — YSR Congress Party (@YSRCParty) January 13, 2024 -
దొంగ ఓట్లు.. ‘పచ్చ’ నోట్లు
సాక్షి, అమరావతి: ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లతో మోసాలకు పాల్పడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి రుజువైంది! నల్లధనాన్ని వెదజల్లి ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో నెగ్గేందుకు టీడీపీ ఏకంగా ప్రత్యేక కార్యాలయాలనే ఏర్పాటు చేసుకున్నట్లు ఆధారాలతో సహా బట్టబయలైంది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పాల్పడిన అక్రమాలు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) తనిఖీల్లో తాజాగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయం కేంద్రంగా ఎన్నికల అక్రమాలకు తెగబడినట్లు డీఆర్ఐ కీలక ఆధారాలను గుర్తించింది. ఆ వెంటనే ఆ కంపెనీకి చెందిన కీలక వ్యక్తులు పరారు కావడం గమనార్హం. ఆదాయపన్ను (ఐటీ) చట్టం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డట్టు తేలింది. డీఆర్ఐ నివేదిక మేరకు న్యాయస్థానం అనుమతితో టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు, నోవా అగ్రిటెక్ కంపెనీలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం ఇదిగో ఇలా సాగింది.. నోవా అగ్రిటెక్ కేంద్రంగా... పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. గుంటూరు శ్రీలక్ష్మీ నగర్‌లోని ఆ కంపెనీ కార్యాలయంలో ఈ నెల 24న చేపట్టిన సోదాల్లో ప్రధానంగా డీఆర్ఐ అధికారులు స్వా«దీనం చేసుకున్న ఓ డైరీ టీడీపీ ఎన్నికల అక్రమాల గుట్టును విప్పింది. స్వతంత్ర సాక్షులు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగుల సమక్షంలో ఆ డైరీని డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. కీలక అధికారి పరార్ నోవా అగ్రిటెక్‌కు చెందిన ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు ఆ డైరీని ఉపయోగించారని కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతం రిటైరైన పుల్లెల అజయ్ బాబును కార్యాలయానికి రావాలని డీఆర్ఐ అధికారులు సూచించిన వెంటనే ఆయన పరారు కావడం గమనార్హం. తన సెల్‌ఫోన్‌ను సైతం స్విచ్ఛాఫ్ చేసేసి అందుబాటులో లేకుండా పోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాలతోనే ఆయన పరారైనట్లు స్పష్టమవుతోంది. 13 పేజీల్లో నమోదు.. ఆ డైరీని పరిశీలించగా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ ఎలా ఎన్నికల అక్రమాలకు పాల్పడిందో వెలుగు చూసింది. పోలింగ్‌కు ముందు రోజు అంటే 2019 ఏప్రిల్ 11న అక్రమ నిధులను ఎలా తెచ్చారు? ఓటర్లకు ఎలా పంపిణీ చేశారనే వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలను ఏకంగా 13 పేజీల్లో నమోదు చేయడం గమనార్హం. అంతా నల్లధనమే... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీగా నల్లధనాన్ని తరలించినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. అందుకోసం షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులను చేరవేశారు. ఆ డబ్బుల వివరాలేవీ నోవా అగ్రిటెక్ కంపెనీ రికార్డులతో సరిపోలకపోవడంతో అదంతా నల్లధనమేనని రుజువవుతోంది. కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఆ నిధుల జమ, విత్‌డ్రాలకు సంబంధించిన వివరాలేవీ లేవు. అంటే ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో అక్రమాలుకు పాల్పడేందుకు వెచ్చిం చినదంతా నల్లధనమేనని నిర్థారణ అయింది. ఎన్నికల కమిషన్‌కూ బురిడీ... డైరీలో పేర్కొన్న నిధుల వ్యయానికి సంబంధించిన వివరాలను టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎన్నికల వ్యయంలో చూపలేదు. కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పించాల్సిన వ్యయంలో డైరీలో పేర్కొన్న నిధుల వివరాలు లేవు. అంటే టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్‌కు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ఐటీ, ఈడీ, సెబీలకు నివేదిక.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్రమంగా నిధులు తరలించినట్లు ఆధారాలతో వెల్లడి కావడంతో డీఆర్ఐ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. తమ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలను ఆదాయపన్ను శాఖ, ఈడీ, సెబీ దృష్టికి తెచ్చారు. నోవా అగ్రిటెక్ కంపెనీ తమ రికార్డుల్లో చూపని నిధులను వెచ్చించడంతోపాటు పన్ను చెల్లించకుండా ఎగవేసింది. అక్రమ నిధుల తరలింపు ద్వారా కేంద్ర మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించింది. అక్రమ నిధులను తరలించేందుకు కంపెనీని కేంద్ర బిందువుగా చేసుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధం. నోవా అగ్రిటెక్ అక్రమాలపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదాయపన్ను, ఈడీ, సెబీలకు డీఆర్ఐ అధికారులు నివేదిక సమర్పించారు. త్వరలోనే ఆ మూడు సంస్థలు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదుకు సన్నద్ధం అక్రమ నిధుల ద్వారా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ నోవా అగ్రిటెక్ కంపెనీ, కంపెనీ చైర్మన్‌గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై పోలీసు శాఖ కేసు నమోదు చేయనుంది. ఈ అక్రమ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు బాపట్ల జిల్లా పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది. డైరీలో నల్లధనం ♦ పవులూరు అనే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. మొత్తం రూ.2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది. ♦ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ.3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ చేసినట్లు డైరీలో ఉంది. ♦ నోవా అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు ఆ డబ్బులను పంపిణీ చేశారు. ♦ ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు రూ.15 లక్షలు పంపిణీ చేశారు. ♦ పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది. ♦ ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం. -
షర్మిల అబద్ధాలు.. ఇవీ అసలు నిజాలు
షర్మిల వెనుక విష నాగులు ఎవరు?. సొంత అన్నపై ఎందుకు విషాన్ని చిమ్ముతుంది?. విష బీజాలు ఎక్కడ మొలకెత్తాయి?. సీఎం జగన్ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది?. అసలు బ్లాక్ మెయిలింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో ఆధారాలతో సహా తీసుకొస్తానంటూ తేల్చి చెప్పారు వైఎస్సార్టీపీ మాజీ నాయకుడు కొండా రాఘవరెడ్డి. ఆమెను అహంకారపూరిత వ్యక్తిగా అభివర్ణించిన రాఘవరెడ్డి అనేక షాకింగ్ విషయాలు చెప్పారు. షర్మిల అబద్దాలు, నాటకాలు వెనుక దుష్టశక్తులు ఉన్నాయన్నారు. వైఎస్సార్‌ను అభిమానించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలన్నారు. వైఎస్సార్ పేరు పెట్టుకుని ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారంటూ షర్మిల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోనియాగాంధీ లాంటి వారిని ఎదురించి 16 నెలలు జైలుకి వెళ్లి, 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి.. ఎండనక, వాననకా కష్టపడి స్వయంశక్తితో తండ్రి పేరు నిలబెడుతున్న అన్నకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న షర్మిల తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ఎంతో గొప్పగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఊసరవెల్లి కూడా సిగ్గు పడే విధంగా షర్మిల రంగులు మారుస్తోందన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి, తెలంగాణలో ప్రజల్ని మోసం చేసి, కార్యకర్తల్ని నట్టేట ముంచేసి ఏపీకి వెళ్లడానికి కారణం ఆమెలోని కుట్ర పూరిత కోణం, అహంకారమే కారణమన్నారు. సీఎం జగన్ జైలులో ఉన్న సమయంలో తల్లి వైఎస్ విజయమ్మ చేత పాదయాత్ర చేయిద్దామనే ప్రతిపాదన వస్తే.. అమ్మకు మోకాళ్ల నొప్పులు అంటూ షర్మిల చెప్పిందన్నారు. ఆపై సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేత పాదయాత్ర చేయించాలనే ఆలోచన చేస్తే.. షర్మిల అడ్డుకట్ట వేసిందన్నారు. అన్న కోసం తాను ఉన్నానంటూ ముందుకు వచ్చిందని, ఆ సమయంలోనే షర్మిలలో విష బీజాలు పడ్డాయన్నారు కొండా రాఘవరెడ్డి. ఆపై వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి తనకు లాభం చేకూర్చేలా ఒక పని చేసిపెట్టామన్నాడని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే ఆ పనిని చేయనంటూ సీఎం స్థానంలో ఉన్న జగన్ విముఖత వ్యక్తం చేయడంతోనే వారిలో(షర్మిల, అనిల్) ఉన్న విషం ఈ రకంగా బయటకొస్తుందని రాఘవరెడ్డి మండిపడ్డారు. -
పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
గుంటూరు, సాక్షి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోవడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోటీగా.. రెండు స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ పొత్తు ధర్మంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్తుల ప్రకటనతో చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని జనసేనాని అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలి. కానీ, టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. .. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేం రెండు సీట్లు ప్రకటిస్తాం. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది. చంద్రబాబుకు ఉన్నట్లే.. నాకూ మా పార్టీలో ఒత్తిడి ఉంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లోనే మేమూ రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాం. అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా’’ అని పవన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బ్రో.. బాబెప్పుడూ ఇంతే! .. ‘‘కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నాం. ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నాం. టీడీపీ-జనసేన పొత్తులకు ఇబ్బందులు కలిగేలా కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నన్ను వీధి కుక్క అని తిట్టినా భరించా. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా మౌనంగా ఉన్నా. టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం పొత్తు ధర్మం ఎంతమాత్రం కాదు. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది. దీనిపై నన్ను అడిగిన మా పార్టీ నేతలకు నా క్షమాపణలు. .. గత ఐదేళ్లలో జనసేన సమర్థవంతంగానే పని చేసింది. ఈ ఐదేళ్ల పోరాటం 2024లో రాజకీయ బలం కావాలి. పోటీ కోసం 50-70 స్థానాలు తీసుకోవాలని నాకు తెలియనిది కావు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లే వస్తాయిగానీ అధికారంలోకి వస్తామోరామో తెలియదు. పవన్ జనంలో తిరగడు.. వాస్తవాలు తెలియని కొందరు అంటున్నారు. తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను?. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం.. విడదీయడం తేలిక. అందుకే నాకు నిర్మించడం ఇష్టం. ఆటుపోట్లు ఎదురవుతాయి. కొన్నిసార్లు తప్పవు. పొత్తులో భాగంగా మనం మూడో వంతు సీట్లు తీసుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికలతో నేను ఆగిపోవడం లేదు. భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుంది’’.. అంటూ వ్యాఖ్యానించారాయన. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. అలాగే అరకు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు. మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థుల ప్రకటనకు ఆయన సిద్ధమయ్యారు. ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్నే పవన్ ఇప్పడు వ్యతిరేకించారు. రేపు రేపు.. ఇది ఎటు దారి తీస్తుందో అనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైందిప్పుడు. -
ఎవరికి వారే..'బాపట్ల' తీరే !
బాపట్ల తెలుగుదేశం పార్టీలో ఐక్యత కొరవడింది. వర్గపోరుతో అట్టుడికిపోతోంది. ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి చోటా తమ్ముళ్ల తగవులాటే కనిపిస్తోంది. జిల్లా కేడర్ ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తోంది. కారంచేడులో సొంత పార్టీ ఫ్లెక్సీలనే కార్యకర్తలు చింపేయడం... ఎమ్మెల్యేపై దూషణల పర్వానికి దిగడం... అధిష్టానానికి మింగుడుపడటం లేదు. చీరాలలో కొండయ్య నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించడం... వేమూరులో ఓ వర్గానికి నక్కా కొమ్ముకాయడం... బాపట్ల ఇన్చార్జి రోజుకో నాయకుడ్ని వెనకేసుకు రావడం... అక్కడి కార్యకర్తలకు రుచించడం లేదు. రేపల్లె... అద్దంకిలో ఇంటిపోరు తీవ్రరూపం దాల్చడం అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎన్నికల వేళ పచ్చపార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరంటే మరొకరికి గిట్టక వెన్నుపోట్లకు సిద్ధపడుతున్నారు. ఆధిపత్యపోరుతో అమీతువీుకి సిద్ధపడుతున్నారు. రేపల్లెలో సొంత పార్టీనేతనే ఏకంగా హత్య చేసిన ఘటన జరగ్గా మిగిలిన నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు ముదిరి ఘర్షణలకు దిగిన ఘటనలు కోకొల్లలు. ‘ఏలూరి’ తీరుపై కేడర్ విసుగు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీరుపై కేడర్ విసిగెత్తిపోతోంది. ఇటీవల కారంచేడులో మండల టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి సొంతపార్టీ ఫ్లెక్సీలనే చింపేసి, ఎమ్మెల్యేపై దూషణలకు దిగారు. పోపూరి శ్రీనివాసరావు, ద్రోణాల దరశి, ఇంకొల్లులో పార్టీ సీనియర్ నేత కొల్లూరు నాయుడమ్మ ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో టీడీపీ అధికారంలోకి రావాలని ఈయన తిరుపతి వరకూ వెనక్కు నడిచారు. ఇప్పుడు ఆయనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొండయ్యా... ఏందయ్యా ఇది? చీరాల టీడీపీ ఇన్చార్జ్ ఎం.ఎం.కొండయ్యను ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను మార్చాలని చంద్రబాబు, లోకేశ్‌లకు ఫిర్యాదు చేస్తున్నారు. మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, చీరాలకు చెందిన డాక్టర్ సజ్జా హేమలత, సజ్జా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కొండయ్యను వ్యతిరేకిస్తున్నవారిలో ఉన్నారు. మరోవైపు తమ వర్గానికి కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని యాదవ సామాజికవర్గం తేల్చి చెబుతోంది. ‘నక్కా’నూ... పక్కన పెట్టేస్తారా? వేమూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. వేమూరు మండల టీడీపీ అధ్యక్షుడు దండె సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబుల మధ్య విభేదాలున్నాయి. కొల్లూరు మండలంలో మాజీ ఎంపీపీ మైనేని మురళి, మధుసూదనరావుకు, అమృతలూరులో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ జెడ్పీటీసీ చరణ్గిరి, భట్టిప్రోలులో మాజీ ఎంపీపీ తూనుగుంట్ల సాయిబాబు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కరణ శ్రీనివాసరావు మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ మండలాలన్నింట్లో ఓ వర్గానికి ఆనందబాబు కొమ్ముకాయడంతో రెండో వర్గం ఆయనకు దూరంగా ఉంటోంది. ‘వేగేశన’తో వేగలేం ! బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ వైఖరి నచ్చక అన్నం సతీష్ ప్రభాకర్ దూరంగా ఉంటున్నారు. పైగా ఈయన హయాంలో పట్టణ పార్టీ అధ్యక్షునిగా నియమించిన తానికొండ దయాబాబును తొలగించి వడ్లమూడి వెంకటేశ్వరరావును నియమించడం, తర్వాత ఆయన్నూ తొలగించి గోలపల శ్రీనివాసరావును నియమించడం, సతీష్ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కావూరి శ్రీనివాసరెడ్డిని తొలగించి ముక్కాముల శివను నియమించడంపై కేడర్ గుర్రుగా ఉంది. వీరే గాకుండా బాపట్ల మాజీ ఎంపీపీ మానం విజేత, వడ్లమూడి వెంకటేశ్వరరావు, ముక్కాముల శివ, గొలపల శ్రీను, నక్కల వెంకటస్వామి, ఏపూరి భూపతిరావు, కర్లపాలెం మండలంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పమిడి భాస్కరరావు, మాజీ జెడ్పీటీసీ గుంపులకన్నయ్య, మైనారిటీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు మహ్మద్ హజీజుల్లాబేగ్, పార్టీ అధ్యక్షుడు వసంతారెడ్డితో కూడిన ఒక వర్గం వర్మను వ్యతిరేకిస్తోంది. కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నక్కల వెంకటస్వామిని తొలగించి ఏపూరి భూపతిరావును నియమించడం, పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గోకరాజు శ్రీధర్‌వర్మ స్థానంలో కనుమూరి సాంబమూర్తిరాజును నియమించడం, కొన్నాళ్ళ తర్వాత మహ్మద్ అబ్జల్‌ను నియమించడంతో అక్కడ అసంతృప్తి నెలకొంది. ‘అన్నే’ మరణం.. ‘అనగాని’కి శరాఘాతం.. రేపల్లె పట్టణానికి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అన్నే రామకృష్ణను సొంత పార్టీలోని పరిటాల యువసేన నేతలు హత్య చేయడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌పై వ్యతిరేకత చోటు చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టం కానుంది. ఈ సారి ‘గొట్టిపాటి’కి గట్టిదెబ్బే.. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొందరికే ప్రాధాన్యమిస్తుండటం,ప్రధానంగా సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి తదితర మండలాల్లో విభేదాలు అధికంగా ఉన్నాయి. సంతమాగులూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నాగబోతు రామాంజనేయులు, కొరిశపాడు మాజీ జెడ్పీటీసీ ముత్తవరపు రమణయ్య మరికొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడి అధికార వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల సంతమాగులూరు మండలం కొప్పరం, అద్దంకి మండలం మోదేపల్లి, జె.పంగులూరు మండలాల పరిధిలో వందలాది కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రామంటున్న జనం.. టీడీపీలో కలవరం
టీడీపీ సభలకు జనం ‘కదలిరా’వడం లేదు. కార్యకర్తలు నానా తంటాలుపడి బలవంతంగా తరలించినా... చివరి వరకూ ఉండటం లేదు. పసలేని ప్రసంగాలు... అదేపనిగా రాగాలు తీస్తూ జగన్‌పై నిందారోపణలు... జనాన్ని ఆకర్షించని నిర్ణయాలు... సభలను నీరుగార్చేస్తున్నాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక్కోసభ నిర్వహించాలని యోచించినా... పట్టుమని పది సభలే నిర్వహించారు. అవి కూడా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. దత్తపుత్రుడి సాయం తీసుకుందామను కుంటే... ఆయన నుంచి సానుకూల స్పందన రావడం లేదు. సీట్ల సర్దుబాటు తేలకుండా సభలకు వెళ్లేందుకు జనసేన నేతలు కూడా సుముఖత చూపడం లేదు. సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల ‘రా కదలిరా’ పేరిట ప్రారంభించిన సభలు అర్ధంతరంగా ఆపేస్తున్నారా... అంటే తమ్ముళ్లనుంచి ఔననే సమాధానం వస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనం ఏమాత్రం సానుకూలంగా లేకపోవడం... టీడీపీ నేతలు, క్యాడర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముక్కుతూ మూలుగుతూ ఇప్పటివరకు 10 సభలు నిర్వహించినా మిగిలిన జిల్లాల్లో వాటిని నిర్వహించడం కష్టమని చెబుతున్నారు. నెలాఖరులోగా ఎలాగోలా కొన్ని చోట్ల సభలు నిర్వహించి.. మరికొన్ని చోట్ల రద్దు చేసి.. మరో కార్యక్రమం తలపెట్టాలని భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఒంగోలుతో మొదలుపెట్టి 29వ తేదీ వరకూ షెడ్యూల్ ప్రకటించినా... జనం నుంచి స్పందన లేకపోవడంతో కొన్ని సభలు నిలిచిపోయాయి. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడీ నెల్లూరు సభ, బుధవారం జరగాల్సిన రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఉరవకొండ సభలు వాయిదా పడ్డాయి. ఈ నెల 27న రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని గోపాలపురంలో సభ నిర్వహించాల్సి వున్నా అక్కడ రద్దు చేసి 29న రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. సభలన్నీ అట్టర్ ఫ్లాపే ఇప్పటివరకు నిర్వహించిన సభలన్నీ విఫలమవడంతో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. తిరువూరు, కనిగిరి, ఆచంట, ఆళ్లగడ్డ, గుడివాడ తదితర సభలు జనం లేక వెలవెలబోయాయి. సభలు విజయవంతమైనట్లు ఎల్లోమీడియా ఎంతగా బూస్టప్ ఇచ్చినా వాస్తవానికి అవన్నీ ఫ్లాపేనని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అరకులో పెట్టిన సభ తర్వాత ఇక నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రసంగంలో సీఎం జగన్‌పై ఈర్ష్య, ద్వేషంతో తిట్టిపోయడం తప్ప తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమిటి చేశారో చెప్పలేకపోవంతో జనం విసిగెత్తిపోతున్నారు. బాబు ప్రతి ఎన్నికల్లోనూ హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక దానిని బుట్టదాఖలు చేయడంతో ప్రజలు ఈసారి హామీలను ఏమాత్రం నమ్మడం లేదు. కార్యక్రమాలన్నీ విఫలమే... బాబు ఏ కార్యక్రమం చేపట్టినా విఫలమవుతూనే ఉన్నాయి. బాదుడే బాదుడు,, ఆయన కుమారుడు లోకేశ్ నిర్వహించిన పాదయాత్ర ఈ కోవలోకే వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయ్యాక ఆయన సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికీ సరైన ఆదరణ లభించలేదు. బాబుపై నమ్మకం పోయింది జనం తనను నమ్మడం లేదని చంద్రబాబు కూడా గుర్తించారు. అందుకే జనసేనతో కలిసి వారిని నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నా అది కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రా కదలిరా సభలకు పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం దీనికి నిదర్శనం. సీట్లు ఖరారు కాకుండా సభలకు ఎందుకెళ్లాలని పవన్ వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే రా కదలిరా సభలకు ఇక ఫుల్స్టాప్ పెట్టనున్నారు. త్వరలో మరో కొత్త పేరుతో, కొత్త కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నా... అసలు జనాన్నిఆకర్షించలేకపోవడంతో ఏ పేరుతో కార్యక్రమం నిర్వహించినా ఉపయోగం ఏమిటనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. -
చీరాలలో బడుగుల జాతర
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో బడుగు, బలహీనవర్గాల సాధికార జాతర జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తాము సాధించిన సామాజిక సాధికారతను చీరాల పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎలుగెత్తి చాటారు. సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బçస్సు యాత్రలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయంటూ నినాదాలు చేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి ప్రారంభమైన యాత్రకు వీధి వీధిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాత్ర అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ నేతృత్వంలో గడియారం సెంటర్లో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వైఎస్ జగనే మళ్లీ సీఎం అంటూ స్లోగన్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. అంబేడ్కర్, పూలే ఆశయాల సాధకుడు సీఎం వైఎస్ జగన్: మంత్రి నాగార్జున దేశ చరిత్రలో అంబేడ్కర్, పూలే, సాహూ మహరాజ్, పెరియార్, వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక విప్లవం సాధించారని అన్నారు. చంద్రబాబు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగారని, జగన్ మాత్రం అంబేడ్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి పేద పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించి, వారికి విదేశాల్లో చదివే అవకాశాలు కల్పించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశారన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ముళ్లపొదల్లో పడేస్తే వైఎస్ జగన్ విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తల ఎత్తుకునేలా చేశారన్నారు. తెలంగాణలో పార్టీని పెట్టి, ఏపీతో సంబంధం లేదని చెప్పిన షర్మిల.. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చంద్రబాబు కుట్రలో పావుగా మారారన్నారు. సీఎం జగన్ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలను దోషులుగా చిత్రీకరించింది బాబే: ఎంపీ నందిగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై అక్రమంగా కేసులు పెట్టి దొంగలుగా, దోషులుగా చిత్రీకరీంచి చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబేనని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక పదవులిచ్చి దొరలను చేస్తున్నారన్నారు. ఎంపీలను చేసి పార్లమెంటులో ప్రధాని పక్కన కూర్చోబెట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు జగనన్నతోనే: కరణం వెంకటేష్ చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సుపరిపాలన అందిస్తున్న జగనన్నతోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. అర్హతే ప్రామాణికంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ జగనన్నను సీఎంగా ఎందుకు చేయాలంటే..: మోపిదేవి రాష్ట్రంలో సామాజిక న్యాయం, బడుగుల సాధికారత, పేదలకు పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ముందంజలో ఉండాలన్నదే సీఎం జగన్ తపన అని తెలిపారు. 2024 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా నందిగం సురేష్, చీరాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కరణం వెంకటేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
షర్మిల వాడిన భాష, యాస సరికాదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు. కాగా, సజ్జల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘షర్మిల వాడిన భాష, యాస సరికాదు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారు. వైఎస్సార్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసింది. సీఎం వైఎస్ జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్సే. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు?. షర్మిల.. తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా ఎందుకొచ్చారు. ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు?. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదు?. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు?. ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే. అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుంది. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది.. టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. చంద్రబాబుతో కుమ్మకై ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదాను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్చలో పెట్టలేదు. దీనిపై షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే. చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైఎస్ జగన్ రాజీ పడరు. కేంద్రంతో సఖ్యతగా ఉండి సీఎం జగన్ రాష్ట్రానికి మేలు చేస్తున్నారు. చివరగా వైఎస్సార్ తనయురాలిగా, వైఎస్ జగన్ చెల్లెలిగా షర్మిలను అభిమానిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్: అంబటి
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు ఆర్థిక బలంతో చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబుకి మద్దతుగా.. ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. దొరకని దొంగలా ఇన్నాళ్లు చెలామణి అయిన చంద్రబాబు.. స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. రూ. 371 కోట్లు లూటీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. హైకోర్టులో కూడా 17 ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పని వాదించారని ప్రస్తావించారు. ఈ కేసును కొట్టివేయాలని కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారని అన్నారు. వంద కారణాలు చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. చదవండి: రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని కోర్టు చెప్పింది: పొన్నవోలు ‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాగా దిట్ట. దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. జైల్లో ఉంటేనే చంద్రబాబు ఆరోగ్యం బాలేదా? ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డులోనూ వందల కోట్లు కాజేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా బుక్కయ్యారు. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్. వైఎస్సార్సీపీని ఓడించే సత్తాలేక.. ప్రతి ఒక్కరితో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు అవినీతి ప్రజలకు అర్ధమైంది. చట్టం నుంచి ఆయన తప్పించుకోలేరు. పవన్ క్యలాణ్ కుడా అవినీతి పరుడే. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి అనుకూలంగా పవన్ మద్దతు ఇస్తుంటాడు’ అని అంబటి మండిపడ్డారు. చదవండి: -
YSRCP నాల్గో జాబితాపై కసరత్తు
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ మార్పులు చేర్పులు చేస్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు సిట్టింగ్‌ల గెలుపోటములు.. ఇతర పరిస్థితుల్ని బేరీజు వేసుకుని ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో నాలుగో జాబితా ప్రకటనపై ఆసక్తి నెలకొంది. సంక్రాంతి పండుగ కారణంతో.. మూడు రోజులపాటు అభ్యర్థుల మార్పులు-చేర్పుల కసరత్తుకి బ్రేక్ పడింది. తిరిగి ఇవాళ మళ్లీ ఆ చర్చలు కొనసాగనున్నాయి. వాస్తవానికి నాలుగో జాబితా పండుగ ముందే విడుదల కావాల్సి ఉంది. ఐదారు స్థానాలకు మార్పుల విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీంతో నేడో.. రేపో ఆ జాబితా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. సీట్ల మార్పుల విషయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నారు. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్లే క్షేత్రస్థాయిలో సర్వేల ఆధారంగా.. మార్పులతో ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేశారు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు కలిపి ఇప్పటిదాకా 59 స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్చింది వైఎస్సార్సీపీ. తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు.. ఇక మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్‌ఛార్జిలకు మార్చేసింది. పలుచోట్ల సిట్టింగ్‌ల స్థానాల్ని మార్చగా, సామాజిక న్యాయం పాటిస్తూ కొత్త వాళ్లకు అవకాశం కల్పించింది. అలాగే.. యువరక్తాన్ని ప్రొత్సహించే క్రమంలో వారసులకు సైతం జాబితాల్లో చోటు కల్పించింది. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ తొలి జాబితా ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ రెండో జాబితా ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ మూడో జాబితా 25 నుంచి రాష్ట్ర పర్యటన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా.. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరపనుంది వైఎస్సార్సీపీ. కేడర్‌కు ఈ భేటీలో సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో.. నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది. -
చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి సీటు విషయంలో జనసేన, తెలుగుదేశం మధ్య చిచ్చు రాజుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం గుంటూరులో నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, మండల, పట్టణ పార్టీ, అన్ని అనుబంధ విభాగాల నేతల నేతలతో రాజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తెనాలి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించకపోతే ఈ నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిసింది. తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. దీంతో కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న రాజా తర్వాత మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి చర్చలు జరపడం, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం చేశారు. నాదెండ్ల మనోహర్‌ను రాజ్యసభకు పంపించి ఈ సీటు రాజాకు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇటీవల చెప్పారు. దీంతో రాజా ప్రజా పాదయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. రాజ్యసభకు వెళ్లడానికి మనోహర్ ఇష్టపడలేదు. తెనాలిలోనే ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. తెనాలిలోనే ఉంటూ టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కలుస్తూ సీటు తనదేనని చెబుతున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నారు. దీంతో తెనాలి సీటు దక్కదన్న అభిప్రాయానికి వచి్చన ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఇష్టపడటంలేదు. దీంతో రాజా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని, వారితో చర్చలు జరిపారు. పొత్తులో భాగంగా సీటును జనసేన పార్టీకి ఇస్తే సహించబోమని ఈ సమావేశం అనంతరం నేతలు మీడియాకు తెలిపారు. పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఖుద్దూస్, మాజీ ఎంపీపీలు కేశన కోటేశ్వరరావు, సూర్యదేవర వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ శాఖమూరి చిన్నా, వైకుంఠపురం మాజీ చైర్మన్ జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ సోమవరపు నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆడుసుమిల్లి వెంకటేశ్వరరావు, దేసు యుగంధర్, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రావి చిన్ని, రావి సూర్యకిరణ్ తేజ, లాయర్ మద్ది మల్లికార్జునరావు తదితరులతో రాజా ఈ సమావేశం నిర్వహించారు. బుధవారం గుంటూరులో జరిగే సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. -
పొత్తుల పాలిటిక్స్: జనసేనకు షాకులిస్తున్న టీడీపీ నేతలు!
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుల కత్తులు వేళ్లాడుతున్నాయి. అధినేతలిద్దరూ పొత్తులు కుదర్చుకుంటారు. కానీ, నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం కొట్టుకుంటారు. ప్యాకేజీ స్టార్ పార్టీని అన్ని చోట్లా సైకిల్ పార్టీ నేతలు చితక్కొడుతున్నారు. జనసేన పార్టీలో నెంబర్ టూ నేతకే దిక్కులేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొత్తులు పేరుకేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య దిగువ స్థాయిలో ఏం జరుగుతోంది?.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం చేతులు కలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు జైలుకెళ్లగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని ప్రకటించారు. అప్పటినుంచి తరచూ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. అటు పవన్‌ను కూడా చంద్రబాబు కలుస్తున్నారు. ఇక ఇద్దరూ కలిసి సీట్లు పంచుకుని ముందుకెళ్లడమే తరువాయి అనుకుంటున్న నేపధ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన, టీడీపీల మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య రచ్చ రచ్చ అవుతోంది. తాను తెనాలి నుంచి పోటీ చేస్తానని మూడు నెలల ముందే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతేకాదు తెనాలిలో జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయాన్నికూడా ఆయన ప్రారంభించారు. తెనాలి వచ్చినప్పుడల్లా అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, జనసేన నేత నాదెండ్ల కార్యక్రమాల గురించి పట్టించుకోని తెనాలి టీడీపీ నేతలు తమ పని తాము చేసుకుపోతున్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కన్నా స్పీడ్ పెంచారు. ఇక్కడనుంచి జనసేన పోటీ చేస్తుంది కదా.. మనకు సీటు లేదని కొన్నిరోజులపాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలోచించారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను కలిశారు. వారిద్దరితో భేటీ తర్వాత ఆలపాటికి ఏం క్లారిటీ వచ్చిందో బయటకు రాలేదుకానీ.. అప్పటినుంచి తెనాలిలో దూకుడు పెంచారు. టీడీపీ కార్యకర్తలకు మన పని మనదే.. జనసేన పని జనసేనదే.. వారికి మనకు సంబంధం లేదు. ఇక్కడనుంచి టీడీపీ అభ్యర్ది ఎన్నికల బరిలో ఉంటారు. ఆ అభ్యర్థిని కూడా నేనే అని పార్టీ నాయకులకు తేల్చిచెప్పేశారట. ఆలపాటి రాజా వ్యవహారం గురించి తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తుంది కదా.. పవన్ కళ్యాణ్ కూడా తెనాలి సీటు నాదే అని చెప్పారు. ఇప్పుడు టీడీపీ అడ్డం తిరగడమేంటి అంటూ షాక్‌కు గురయ్యారట. అయినా.. సరే మేం కూడా మా పని చేసుకుంటాం.. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకే వస్తుంది. తెలుగుదేశం ఇక్కడ పోటీ చెయ్యదని తన క్యాడర్‌కు చెబుతున్నారట. రెండు పార్టీల నేతల ప్రకటనలతో ఎవరు పోటీ చేస్తారో అర్దంకాని పరిస్థితి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా పాదయాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేద్దామని బయల్దేరారు. ఇది చూసి నాదెండ్ల మనోహర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఒక వైపు సీటు మాదే అంటుంటే.. రాజా పాదయాత్ర ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా పై స్థాయిలో నిర్ణయం జరిగినపుడు టీడీపీ మనకు సపోర్ట్ చెయ్యాలి కదా అని సన్నిహితుల వద్ద వాపోయారట. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ముందుకెళ్దామని అనుకున్నాం.. మేనిఫెస్టోపై రెండు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ తొండాట ఆడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ నేత ఆలపాటి రాజా తీరుపై అమీ తుమీ తేల్చుకునేందుకు పవన్ వద్ద పంచాయితీ పెట్టాలని నాదెండ్ల మనోహర్ నిర్ణయించుకున్నట్లు తెనాలిలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆలపాటి రాజా మాత్రం పొత్తు ఉన్నా.. లేకపోయినా తెనాలిలో పోటీ చేసేదీ నేనే అంటూ ముందుకుసాగుతున్నారు. తెనాలిలో టీడీపీ, జనసేనల మధ్య జరుగుతున్న సీట్ ఫైట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. -
AP: ఆ నలుగురు మోసపోయినట్లే!
బంగారు కడియం ఆశ చూపించి బాటసారులను బురదలోకి దించి వాళ్ళు అందులో చిక్కుకోగానే తన అసలు రూపం చూపించి గుటుక్కున మింగేసే కథను ఎన్నిసార్లు వింటున్నా ఇంకా బాటసారులు అలాంటి పులినోటికి చిక్కుతూనే ఉన్నారు. కాకుంటే వాళ్లంతా నిజమైన పెద్ద పులి నోటికి చిక్కితే ఇప్పుడు కొంతమంది రాజకీయ బాటసారులు ఇలాగే రాజకీయ పులి నోటికి చిక్కుతున్నారు. ఇక్కడ ఆ రాజకీయ పులిగా చంద్రబాబు తనను తాను అనుకోగా.. ఆ బాటసారులు ఉండవల్లి శ్రీదేవి.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఆనం రామనారాయణ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇంకా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. వీళ్లంతా అలా చంద్రబాబు నోటికి చిక్కారు. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు.. ఎండుచేప ముక్కకు ఆశపడి బోనులో ఎలుకలు చిక్కుకున్నట్టు ఆ నాయకులంతా చంద్రబాబు ట్రాపులో పడిపోయారు. ఇప్పుడు బోనులోనుంచి బయటకు రాలేరు.. అందులో ఉంటే బతుకు లేదు. వాస్తవానికి ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఏడాది క్రితమే కసరత్తు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గాల నుంచి నివేదికలు రప్పిస్తూ వారి పనితీరును మదింపు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న అనం రామనారాయణ రెడ్డి ( వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖర రెడ్డి( ఉదయగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( నెల్లూరు రూరల్) ఉండవల్లి శ్రీదేవి( తాడికొండ)లకు టిక్కెట్స్ ఇవ్వలేమని అప్పుడే సూచనప్రాయంగా చెప్పారు. సరిగ్గా ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడే 2023 మార్చిలో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా ఈ నలుగురిలో ఉన్న అసంతృప్తిని గుర్తించిన చంద్రబాబు.. వారిని డబ్బు.. రానున్న ఎన్నికల్లో టికెట్స్ ఇస్తామని నమ్మబలికి తమ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేయించుకుని ఆమెను గెలిపించుకున్నారు. దీంతో సీఎం జగన్ ఈ నలుగురూ పార్టీ నియమావళి ధిక్కరించారు అని గుర్తించి తమ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక వారు వేరే గత్యంతరం లేక టీడీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా రానున్న ఎన్నికల్లో ఈ నలుగురికి టిక్కెట్లు ఇస్తామని అప్పట్లో నమ్మబలికిన చంద్రబాబు ఇప్పుడు వీళ్లకు టిక్కెట్లు లేవని చెబుతున్నారని అంటున్నారు. నెల్లూరు రూరల్ - శ్రీధర్ కి బదులు గిరిధర్ రెడ్డికి.. ఉదయగిరి - మేకపాటికి బదులు రామారావుకి.. వెంకటగిరి - ఆనం ను కాదని రామకృష్ణ కు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. తాడికొండ శ్రీదేవికి సైతం టిక్కెట్ లేదని.. ఇంకోసారి చూద్దాం అని చెప్పినట్లు తెలిసింది. ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్లుగా వాడకం ముగిశాక వీరిని ఎంగిలాకును విసిరేసిన తీరున చంద్రబాబు పక్కన పడేస్తున్నారు. అప్పట్లో సందర్భానుసారం వాడుకున్నాము తప్ప టిక్కెట్లు ఎలా ఇస్తాం అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీంతో మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నం దేవుడా అని కొందరు వాపోతుండగా మిగతావాళ్ళు పోయాం మోసం.. పోయాం మోసం అని నిర్వేదంగా విషాద గీతాలు ఆలపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వీళ్లకు టిక్కెట్లు ఇస్తే ఎన్నాల్లనుంచో పార్టీని కాపాడుతూ వస్తున్న మేమేం కావాలి.. ఎంత ఖర్చు పెట్టాం.. మాకు ఏదీ భరోసా అని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. దీంతో ఈ కొత్త చుట్టాలకు నేల మీద చాపలు వేసి.. ఆల్రెడీ అక్కడున్న తమ పార్టీ సీనియర్లకు పట్టె మంచాలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే మేం పోటీ చేయం.. మరోవైపు రఘురామ కృష్ణంరాజు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీడీపీ వైపు చూస్తూ ఇప్పుడు మళ్లీ తిడుతున్నారు. ఇదంతా టీడీపీ, దాని అనుబంధ మీడియాలో కవరేజీ వరకు బాగానే ఉన్నా ఆయనకూ నరసాపురం టికెట్ దక్కేలా లేదు. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఆ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గోవిందా అయిపోతాయి అని భయపడిన టీడీపీ నేతలు రఘురామకు టిక్కెట్ ఇస్తే మేము పోటీ చేయం అని తేల్చి చెప్పేశారు. దీంతో రఘురామకు సైతం టీడీపీ టిక్కెట్ రావడం లేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు వీళ్లంతా ఎక్కినకొమ్మను నరుక్కుని.. తింటున్న అన్నంలో అగ్గిపోసుకున్నట్లుగా మారిందని అంటున్నారు. ✍️సిమ్మాదిరప్పన్న -
‘అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబే’
సాక్షి, అమరావతి: అప్పులపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండిపడ్డారు. పార్లమెంట్లో పలు సార్లు కేంద్ర ఆర్దిక మంత్రి,తో పాటు ఆర్బీఐ, కాగ్ అప్పులపై గణాంకాలను వెల్లడించినా సరే ఆ గణాంకాలను కాదని లేని అప్పులున్నట్లు ఏ ప్రాతిపదికన, ఏ ఆధారాలతో చంద్రబాబు, ఎల్లో మీడియా చెపుతున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఎల్లో మీడియా వాస్తవాల గురించి వివరణలు తీసుకోకుండా అన్యాయంగా తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర అప్పులతో పాటు అన్ని అనర్దాలకు చంద్రబాబే కారణమని ఆయన స్పష్టం చేశారు. మనసులో మాట పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగులకు, సబ్సిడీలకు వ్యతిరేకంగా రాసుకున్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఇస్తానంటూ ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ‘మోసం నేర్చెన్’.... అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదనే పాటలా బాబు వ్యవహారం ఉందని ఆర్దిక మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. అప్పులపైన గణాంకాలతో పాటు, చంద్రబాబు గత నిర్వాకాలను ఆధారాలతో సహా గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్దిక మంత్రి బుగ్గన వివరించారు. ఆయన మాటల్లోనే.. అప్పులపై నిరాధార ఆరోపణలు: రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల అప్పు చేసిందని ఒకరు.. రూ. 8 లక్షల అప్పు చేసిందని మరొకరు ఇష్టానుసారం ఆరోపిస్తున్నారు. నిజానికి మీరంతా (టీడీపీ నేతలు) గతంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. ఇలా ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు? ‘రుణకంఠుడు’ అంటూ.. సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెచ్చిన అప్పులు రూ. 7.34 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ ఆధారాలతో చంద్రబాబు, మా ప్రభుత్వం రూ. 13 లక్షల అప్పు చేసిందని ఆరోపిస్తున్నారు. ఇదే మాట మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అంటున్నారు. అందుకు ఏ ఆధారాలు ఉన్నాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగాల్సిన స్థాయిలో పెరగలేదని గతంలో నేను స్పష్టంగా చెప్పాను. అందు కోసం కేంద్రం ఇచ్చిన ఆధారాలు, డాక్యుమెంట్లు కూడా చూపాను. పార్లమెంటులో కొందరు సభ్యులు వేసిన ప్రశ్నలకు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా, స్పష్టంగా సమాధానం చెప్పింది. అయినా ఇక్కడ మీడియా దారుణంగా దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కడా వాస్తవాలు రాయడం లేదు. ఇది చాలా అన్యాయం. రాజకీయంగా ఎవరైనా తప్పుడు ఆరోపణ చేస్తే.. అందులో వాస్తవాలను మీడియా బేరీజు వేసుకోవాలి కదా? అప్పటి కంటే ఇప్పుడు బెటర్ చంద్రబాబు పాలన కంటే మా ప్రభుత్వం ఎన్నో విధాలుగా బెటర్. ఎందుకంటే అప్పటి కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరిగింది. అప్పు శాతం కూడా వారి కంటే తక్కువే చేశాం. అయితే రావాల్సినంత ఆదాయం కోవిడ్ వల్ల రాలేదు. అలాగే ఖర్చు కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. వాస్తవాలు మర్చి నిందలు: ప్రభుత్వం ఏకంగా రూ. 10 లక్షల అప్పు చేసిందని ఆరోపించారు. రుణకంఠుడు సీఎం అంటూ రాసిన స్టోరీలో ఆ ఫిగర్ వేశారు. కానీ ఆ స్టోరీలో రాసిన మొత్తం అప్పు చూస్తే.. అ మొత్తం కేవలం రూ. 7,68,641 కోట్లు మాత్రమే. మరి రూ. 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇంకా పెండింగ్ బిల్లులు రూ. 1.70 లక్షల కోట్లు ఉన్నాయని రాశారు. ఆ లెక్కలు మీకు ఎవరు చెప్పారు? ఏ ఆధారాలతో మీరు అది రాశారు? ఇంకా డిపాజిట్లు, ఇతర మొత్తాలు కలిపి రూ. 28,286 కోట్లు అని రాశారు. అది ఎవరు చెప్పారు? ఇలా అన్నీ చూపుతూ.. తప్పుడు ఫిగర్ చెబుతున్నారు. ఆ అప్పుల్లో మీరు చేసినవే ఎక్కువ: మీ ప్రకారం లెక్క వేసుకున్నా.. మీరన్నట్లు రూ. 3.76 లక్షల కోట్లు బహిరంగ రుణాలు ఉంటే.. అందులో పాత రుణం రూ. 2,64,451 కోట్లు ఉన్నాయి కదా? 2019, మే నాటికే ఆ అప్పు ఉంది కదా? అదే విధంగా ఉదయ్ బాండ్స్. రూ. 8,256 కోట్లు అన్నారు. అది తీసుకుంది 2016లో కదా? ఇంకా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల (ఈఏపీ) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 33,118 కోట్ల రుణం. పాత ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టుల కింద అందులో రుణం తీసుకుంది కదా? నాన్ గ్యారెంటీ లోన్ çపవర్ సెక్టర్లో రూ. 95 వేల కోట్ల రుణం అన్నారు. అందులో రూ. 69,596 కోట్ల రుణం.. పాత ప్రభుత్వం తీసుకున్నదే కదా? అ రుణం 2019, మే నాటికే ఉంది. సీఆర్డీఏ బాండ్స్ రూ. 1500 కోట్లు. ఆ అప్పు చేసింది మీరు కాదా? పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ. 50 వేల కోట్ల అప్పు అంటున్నారు. కానీ నిజానికి అందులో రూ. 22 వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణమే. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 50 వేల కోట్ల రుణం తీసుకున్నారని రాశారు. కానీ నిజానికి ఆ రుణ మొత్తం రూ. 36 వేల కోట్లు మాత్రమే. ఇతర కార్పొరేషన్ల ద్వారా రూ. 1.45 లక్షల కోట్ల అప్పు అని రాశారు. ఆ మొత్తంలో పవర్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం రూ. 95 వేల కోట్లు కూడా ఉంది. మరోవైపు ఆ రుణాన్ని కూడా వేరుగా చూపారు. ఇంకా చెప్పాలంటే ఆ రూ. 95 వేల కోట్లలో కూడా దాదాపు రూ. 70 వేల కోట్ల అప్పు గత ప్రభుత్వ హయాంలో చేసిందే. నిజానికి రాష్ట్రానికి ఉన్న అప్పు రూ. 7 లక్షలకు అటు ఇటుగా ఉంటే.. దాన్ని దారుణంగా పెంచి రూ. 10 లక్షల కోట్లు అని రాయడం అంత కంటే తప్పు. ఇంకా చెప్పాలంటే ఆ రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో కూడా దాదాపు రూ. 4 లక్షల కోట్లు గత ప్రభుత్వ హయాంలో చేసినవే. అయినా అన్నీ కప్పి పుచ్చి, మొత్తం అప్పును ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. రుణకంఠుడు సీఎం అంటూ రాయడం చాలా దారుణం. కనీసం జర్నలిజం విలువలు పాటించాలి కదా? ఎంత అన్యాయం? రాష్ట్ర అప్పు అప్పటికి రూ.4.28 లక్షల కోట్లు: గతంలో చాలాసార్లు చెప్పాం. మళ్లీ చెబుతున్నాం. ‘ఎ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్’ అని చెప్పి 15 ఏళ్ల డేటాతో ఆర్బీఐ ఒక్కోసారి డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ)తో పాటు, వివిధ కేంద్ర రంగ సంస్థల నుంచి తీసుకున్న వివరాల (డేటా) ఆధారంగా ఆర్బీఐ ఆ డాక్యుమెంట్ (బుక్) రిలీజ్ చేస్తుంది. ఆ బుక్‌లో 15 ఏళ్ల డేటా ఉంటుంది. ఆ బుక్‌లో ఉన్న వివరాల ప్రకారం.. 2023 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పు రూ. 4,28,715 కోట్లు. ఆ బుక్‌లో ఉన్న వివరాల ప్రకారం 2019, మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 2,64,512 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం ఏర్పడే నాటికి.. అంటే మార్చి 2019 తర్వాత రెండు నెలల్లో గత ప్రభుత్వం చేసిన అప్పు రూ. 7,346 కోట్లు. అంటే గత ప్రభుత్వం దిగి పోయే నాటికి.. అంటే 2019, మే చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 2,71,797 కోట్లు. మరి 2023, మార్చి 31 నాటికి ఉన్న ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 4,28,715 కోట్లలో.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు రూ. 2,71,797 కోట్లు తీసేయాలి కదా? బాబు హయాంలోనే ఎక్కువ అప్పులు వాస్తవాలు ఇలా ఉంటే.. మొత్తం అప్పులను ఈ ప్రభుత్వానికి ఆపాదించి రాయడం అత్యంత దారుణం. ఇక గత ప్రభుత్వ హయాంలో.. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ అప్పు ఎలా పెరిగింది? ఆ తర్వాత 2019 నుంచి నాలుగేళ్లలో ఎంతెంత పెరిగిందని చూస్తే.. -2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న ప్రభుత్వ అప్పు రూ. 1,53,346 కోట్లు కాగా.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి.. అంటే 2019 మే చివరి నాటికి ఆ రుణం రూ. 4,12,288 కోట్లకు చేరింది. అదే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో ప్రభుత్వ అప్పు రూ. 6,38,217 కోట్లు అంటే గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ప్రభుత్వ వార్షిక అప్పు 21.8 శాతం పెరగ్గా.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా పెరిగిన అప్పు కేవలం 12 శాతమే. అది కూడా కోవిడ్ వంటి మహమ్మారి ఉన్నా కూడా.. చేసిన అప్పు తక్కువే. ప్రతి దానికి లెక్క. అన్నీ డాక్యుమెంట్లలో..: మా ప్రభుత్వంలో కార్పొరేషన్ల పేరుతో చెప్పకుండా రుణాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది. ప్రతి దానికి అక్కౌంట్స్, చెకింగ్స్ ఉంటాయి. బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రభుత్వ అప్పులను ఫారమ్ డీ-4లో చూపుతాం. అది పబ్లిక్ డాక్యుమెంట్. మరోవైపు 5వ వాల్యూమ్‌లో అప్పుల గురించి పూర్తి వివరాలు చెబుతాము. ఇది ప్రభుత్వ విధి నిర్వహణలో ఒక భాగం. ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా అప్పు తీసుకునేది ఆర్థిక సంస్థల నుంచే కదా? అది ఆటోమేటిక్‌గా బ్యాంక్ బుక్స్‌లో కూడా ఉంటుంది. పీఏసీ బుక్స్‌లో కూడా ఉంటాయి. ఇంకా డిబెంచర్ల రూపంలో రుణాలు సేకరించాలంటే.. బహిరంగంగానే చేయాలి. ఇందులో ఎక్కడా గోప్యత ఉండదు. ఏదీ రహస్యం కాదు. అప్పులో గోప్యత అసాధ్యం నిజానికి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగితే.. కేంద్ర ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. అయినా దాన్ని రాయరు. చెప్పరు. ఆర్బీఐకి తెలియకుండా, బ్యాంకులకు తెలియకుండా, సీఏజీకి తెలియకుండా, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా ఎక్కడైనా అప్పు చేయడం సా«ధ్యమేనా? బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు కోసం ప్రత్యేకంగా చట్టం కూడా చేశాం. ఆ అప్పును ఎలా వినియోగిస్తామో కూడా అందులో స్పష్టంగా చెప్పాం. మహిళలు, రైతులకు సంబంధించిన నాలుగు పథకాల కోసం అని చెప్పడం జరిగింది. జీడీపీతో పోల్చినా.. అప్పుడే ఎక్కువ అప్పులు -ఇక మన స్థూల ఉత్పత్తి (రాష్ట్ర జీడీపీ)తో పోల్చి గత ప్రభుత్వ హయాంలో చేసిన, పెరిగిన అప్పు చూస్తే..గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఆ 5 ఏళ్లలో చేసిన అప్పు రూ. 2.59 లక్షల కోట్లు. అది రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే 7.45 శాతం . అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు దాదాపు రూ. 2.26 లక్షల కోట్లు. దాన్ని రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే అది కేవలం 5.2 శాతం మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే.. దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ బాండ్లు చాలా గొప్పవని చెబుతారు. అవి ఒకటిన్నర శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయంటారు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బెవరేజెస్ బాండ్స్ 4.5 శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ అయినా.. దాని గురించి రాయరు. చెప్పరు. అనుమతి లేకుండానే నిధుల వినియోగం టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా రూ. 1,10,599 కోట్లు ఖర్చు చేసిందా అని ఆయన అడిగితే.. కేంద్రం ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాసనసభ అనుమతి లేకుండా రూ. 1.62 లక్షల కోట్లు ఖర్చు చేశారని సమాధానం చెప్పారు. అయినా దాని గురించి రాయరు. నోటికి ఏది వస్తే..అదే మాట్లాడతారా? మరో ఎంపీ రాష్ట్ర అప్పుల గురించి సభలో అడిగితే కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానం.. 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం.. ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లు అని చెప్పారు. అదే 2022 రివైజ్డ్ ఎస్టిమేషన్నే తీసుకుంటే, అప్పు రూ. 3,93,718 కోట్లు మాత్రమే. ఆ మేరకు 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం చూసినా, ప్రభుత్వ అప్పు కేవలం రూ. 4.42 లక్షల కోట్లు మాత్రమే అయినా.. ప్రభుత్వ అప్పు రూ. 10 లక్షల కోట్లు అని, రూ. 13 లక్షల కోట్లు అని.. నోటికి ఎంత వస్తే అంత మొత్తం చెబుతున్నారు. ఎంత దారుణం ఇది? -చంద్రబాబు తన పరిపాలన బ్రహ్మాండం అంటారు. ఆయన పరిపాలన హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి సగటు రూ. 6.95 లక్షల కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలో సగటు స్థూల ఉత్పత్తి రూ. 10.84 లక్షల కోట్లు. రెండింటి మధ్య తేడా చూడండి. స్థూల ఉత్పత్తి పెరిగితే రెవెన్యూ కూడా పెరగాలి అంటారు కదా?. దానికి సమాధానం. రెవెన్యూ రాబడి-వాస్తవాలు చంద్రబాబు గతంలో మంత్రిగా, సీఎంగా పని చేశారు. 1999 నుంచి 2004 వరకు చూస్తే అప్పటి ఉమ్మడి రాష్ట్ర రెవెన్యూ రాబడి 12.4 శాతం పెరిగింది. అదే 2004 నుంచి 2009 వరకు వైయస్సార్‌గారి హయాంలో 21.6 శాతం.. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 14.4 శాతం పెరగ్గా.. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రెవెన్యూ రాబడి కేవలం 6 శాతమే పెరిగింది. అదే మన ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలో రెవెన్యూ రాబడి 16.7 శాతం పెరిగింది. ఇవన్నీ లెక్కల్లో స్పష్టంగా ఉంటాయి కదా? ప్రభుత్వానికి ఎలా ఏ రూపంలో ఆదాయం వచ్చిందనేది ఉంటుంది కదా? చంద్రబాబు పాలన బాగుంటే, రెవెన్యూ రాబడి ఎందుకు పెరగలేదు? ఇప్పుడు ఉద్యోగులు పెరిగారు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు.ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే.. 2018-19లో 44.86 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఉంటే.. 2022-23 నాటికి ఆ సంఖ్య ఏకంగా 60.75 లక్షలకు పెరిగింది. అంటే ఉద్యోగుల సంఖ్య పెరిగితేనే ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు పెరుగుతాయి కదా? చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు దాదాపు 20 లక్షల ఉద్యోగులు పెరిగినట్లే కదా? రాష్ట్రంలో నిరుద్యోగులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో 2018-19లో నిరుద్యోగ శాతం 5.3 ఉంటే.. అది 2022-23 నాటికి అది 4.1 శాతానికి తగ్గిందని. అంటే చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య తగ్గింది. ఇవన్నీ పార్లమెంటులో భూపేందర్‌సింగ్ హుడా, కపిల్ సిబల్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు. బాబు మాటలు-నీటి మూటలు 2014లో సీఎం అయిన చంద్రబాబు, ప్రజలను మభ్య పెట్టేందుకు కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన హామీలు.. స్మార్ట్ సిటీగా కర్నూలు, కొత్త విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఔకులో పారిశ్రామిక వాడ, బెంగళూరు పారిశ్రామిక వాడ, టెక్నాలజీ క్లస్టర్, కోయిలకుంట్లలో సిమెంట్ పరిశ్రమ, న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్, సోలార్ అండ్ విండ్ పవర్ స్టేషన్లు.. విత్తనోత్పత్తి కేంద్రం, రైల్వే వ్యాగన్ల పరిశ్రమ.. వీటిలో ఒక్కటైనా ఏర్పాటు చేశారా? ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ తప్ప. ఎందుకంటే వ్యవసాయానికి తగిన భూములు లేవు కాబట్టి. అది కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పంప్డ్ స్టోరేజీ కింద అంత కంటే బాగా చేశాం. విమానాశ్రయాన్ని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవుకులో రామ్‌కో సిమెంట్ కంపెనీ ఇటీవలే ఏర్పాటైంది కదా? ఇప్పుడు మేము కదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తోంది. అంటే, ఆనాడు మీరు ఏమీ చేయకపోగా.. ఇంకా ఏం చెప్పారు. ఆలూరులో జింకల పార్కు. శ్రీశైలంలో పులుల పార్క్.అవి కూడా ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు తన విధానాలు, ఆయన అనైతిక రాజకీయాల వల్ల ఇష్టానుసారం అప్పులు చేశారు. అందుకోసం ఏమేమో చేస్తామని చెప్పారు. బాబు దిగజారుడు మాటలు: ఇప్పుడు ఏవేవో పర్యటనలు చేస్తున్న చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యేలకు ఒక్కో పేరు పెడుతున్నారు. మరి మేము కూడా ఆ పని చేయలేమా? నీకు, నీ కుమారుడికి కూడా పేరు పెట్టలేమా? కానీ మాకు సంస్కారం ఉంది. అందుకే మేము నీలా దిగజారి మాట్లాడం. నీతి లేని నాయకుడు చంద్రబాబు చంద్రబాబు రాజకీయ జీవితం చూస్తే.. ఎక్కడైనా విలువలకు కట్టుబడి ఉన్నాడా? ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు దగ్గరయ్యాడు కదా? 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత వాజ్‌పేయి వేవ్‌లో గెల్చాడు. 2001లో మోదీని గుజరాత్ సీఎంగా దింపాలన్నాడు. 2004 వచ్చే సరికి మళ్లీ యూటర్న్. బీజేపీతో కలిసి ఎన్నికల్లో నిలబడి, ఓడిపోయిన తర్వాత ఓడిపోవడంతో.. తనది హిస్టారికల్ మిస్టేక్ అన్నాడు. మళ్లీ 2009 వచ్చే సరికి మరోసారి యూటర్న్. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంతో మహాకూటమి. ఎన్నికల్లో పోటీ. అప్పుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై నిశిత విమర్శలు చేశాడు. దానిపై ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్.. చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. 2014 వచ్చే సరికి మళ్లా బ్యాక్. బీజేపీ, జనసేన. కాంగ్రెస్‌పై నిశిత విమర్శలు. మన్మోహన్సింగ్ను ఏకంగా సోనియాగాంధీ పెంపుడు కుక్క అన్నాడు. 2016 వచ్చే సరికి డీమోనిటైజేషన్. తానే మోదీకి సలహా ఇచ్చానని అన్నాడు. అది బూమరాంగ్ కావడంతో.. అది చరిత్రాత్మక తప్పిదం అన్నాడు. 2018 వచ్చే సరికి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టాడు. 2019 ఎన్నికలు వచ్చే సరికి మోదీకో హఠావో.. దేశ్‌కో బచావో అన్నాడు. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో.. మోదీ వంటి నేత దేశానికి అవసరం అన్నాడు. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం ఒక్క వైయస్సార్ కాంగ్రెస్‌తో తప్ప.. అన్ని పార్టీలతో రాయబారాలు జరుపుతున్నాడు. జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌తో కూడా మాట్లాడుతున్నాడు. బాబు ఊసరవెల్లి రాజకీయాలపై పాట చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై రూపొందించిన ఒక పాట వీడియో ప్రదర్శించి చూపారు.‘మోసం నేర్చెను.. అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదు’.. అన్న పాట. బాబు మనసులో మాట ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక బుక్ రాశాడు. ‘అది మనసులో మాట’. ఆ బుక్‌లో పేజీ నెం.117లో ఏముందంటే.. మనం అవసరానికి మించి ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. 119వ పేజీ. ఎన్టీఆర్ కిలో బియ్యం రూ. 2 చేశారు. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్లీ రూ. 3.50 చేశాను. సబ్సిడీ ఇవ్వడం అంటే పులి మీద స్వారీ మాదిరిగానే. సబ్సిడీ ఇచ్చినా ఎన్టీ రామారావు, ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఓడిపోయింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న అకాళీదల్ ఎన్నికల్లో ఓడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉద్యోగుల యొక్క, ఉద్యోగుల చేత, ఉద్యోగుల కోసం అన్నట్లుగా మారాయి. పేజీ నెం.124. విద్యుత్ మాత్రమే కాక, ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలో ఎక్కువ భాగం తింటున్నాయి. పేదలకు సబ్సిడీ ఇళ్లు. ఖరీదైన పథకం. కొన్ని వర్గాలకు ఉచిత ప్రయాణం సరికాదు. మరి అదే ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అంటున్నాడు. ఇలా ప్రతిదీ ఫ్లిప్‌ఫ్లాప్. పేజీ నెం.62. ఉద్యోగుల్లో అవినీతి పెరిగింది. వివిధ శాఖల్లో అవినీతి పరులైన ఉద్యోగులు చాలా మంది పెరిగారు ఉద్యోగులు, వారి జీతభత్యాలు. పెన్షన్లు పెరుగుతున్నాయి. దాని కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది ఒక విష వలయం. స్వార్థ రాజకీయాలు: చంద్రబాబు రాజకీయ పొత్తులు చూస్తుంటే.. హాలీవుడ్ యాక్టర్ ఎలిజబెత్ టేలర్ గుర్తుకు వస్తుంది. ఆమె ఏడుసార్లు పెళ్లి చేసుకుంది. అందులో ఒకరిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. చంద్రబాబు రాజకీయ పొత్తులు కూడా అలాగే ఉన్నాయి. కాంగ్రెస్. ఆ తర్వాత బీజేపీ. మళ్లీ కాంగ్రెస్. మళ్లీ బీజేపీ. జనసేన. ఇంకా వామపక్షాలు. నిజానికి ఆ పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వేరు. కానీ చంద్రబాబు మాత్రం అందరితో చర్చలు. విభజనలోనూ చంద్రబాబు అనైతిక రాజకీయాలు: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ. దీనికి చంద్రబాబు కూడా కారణం కాదా? 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశాడు. ఆ తర్వాత 2011లో శ్రీకృష్ణ కమిటి నివేదిక ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేయొచ్చు కదా అన్నారు. 2012లో మరో లేఖ రాసి, తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాడు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పాడు. రాష్ట్రం విడిపోతే, తమ పార్టీ జాతీయ పార్టీ అవుతుందని అన్నాడు. అటు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాడు. ఇటు తెలంగాణ ఏర్పాటు చేయాలని కూడా కోరాడు. ఇన్నిసార్లు ఐడియాలజీ మార్చుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఏనాడైనా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాడా? రాష్ట్ర అప్పులకు ఆయన కాదా కారణం. ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు. స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతానన్నా, తామే కడతామని తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పానన్నాడు. కంప్యూటర్ కనిపెట్టానని చెప్పాడు. రాష్ట్ర విభజన సమయంలో ఉచిత సలహాలు కూడా ఇచ్చారు కదా? విభజన తర్వాత మనకు అన్యాయం జరిగింది. స్థూల ఉత్పత్తిలో సేవా రంగం (సర్వీస్ సెక్టర్) 45 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. వ్యవసాయ రంగం 33 నుంచి 38 శాతానికి పెరిగింది. హైదరాబాద్ మనకు లేకుండా పోవడం వల్ల మనకు దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల ఆదాయం పోయింది. అవన్నీ మీకు తెలియదా? మీరు నిపుణులు కాదా? అప్పులనేమో జనాభా ప్రాతిపదికన చేశారు. కానీ ఆస్తులను లొకేషన్ ప్రకారం విభజించారు. దాని వల్ల హైదరాబాద్ పోయింది. ఇక్కడ జనాభా ఎక్కువ కావడం వల్ల అప్పులు పెరిగాయి. విద్యుత్ రంగానికి వచ్చే సరికి, వినియోగం ఆధారంగా విభజించారు. దాని వల్ల తెలంగాణకు 54 శాతం, ఆ«ంధ్రప్రదేశ్కు 46 శాతం ఇచ్చారు. అంత అన్యాయంగా విభజన చేశారు. మీరు, కాంగ్రెస్ కలిసి చేశారు. రాష్ట్రానికి నష్టం, అన్యాయం చేశారు. మీ లక్ష్యం ఒక్కటే. జగన్‌గారిని ఇబ్బంది పెట్టాలి. విభజన తర్వాతా బాబు అన్యాయమే..: విభజన తర్వాత కూడా మీరు రాష్ట్రానికి అన్యాయం చేశారు. హోదా వద్దన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా తెచ్చుకోలేకపోయారు. వెనకబడిన ప్రాంతాల నిధి కూడా జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున సాధించలేకపోయారు. 2014-17 మధ్య రెండేళ్లు ఆ నిధి తెచ్చుకోలేకపోయారు. ఆ నిధిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించుకుంది. పోలవరం ప్రాజెక్టును 2014-15 నాటి ధరలకు అనుగుణంగా ఎలా పూర్తి చేస్తామని తెచ్చుకున్నారు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తోంది. మీరు ప్రాజెక్టును ప్రొటోకాల్ ప్రకారం చేయలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం స్పిల్‌వే పూర్తి చేయకుండా, కాఫర్ డ్యామ్‌లు కట్టారు. మధ్యలో గ్యాప్ ఇచ్చారు. దాని వల్ల పనులన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. రెవెన్యూ లోటు. దాన్ని కూడా మీరు సాధించలేదు. కానీ మేము రూ. 12 వేల కోట్లు తెచ్చుకున్నాం. మేము వచ్చాకనే రామాయపట్నం, కడప స్టీల్ ప్లాంట్ కడుతున్నాం కదా? పౌరసరఫరాల శాఖ అప్పుల్లో తెలంగాణ తన వాటా రూ.600 కోట్లు కట్టకపోతే.. ఎస్బీఐ కొంపల్లి శాఖలో ఖాతా ఫ్రీజ్ అయితే, మేము వచ్చాక ఆ డబ్బులు కట్టించి, మన వాటా తెచ్చుకున్నాం. ఇది వాస్తవమా? కాదా? ఇప్పుడు వచ్చి ఏదేదో చేస్తామంటున్నారు. మేము కేంద్రంతో మాట్లాడి అన్నీ సాధిస్తే.. కుమ్మక్కు అయ్యామంటారు. మీరు చేయలేదు. మేము చేస్తే.. విమర్శలు. ఇన్ని అనర్థాలకు కారణం బాబే..: ఈరోజు రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది అంటే.. ప్రధాన కారకుడు చంద్రబాబునాయుడు. చంద్రబాబు.. ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఫిలాసఫీ. ఆయన చర్యలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు. అన్నీ రాష్ట్రానికి ఇబ్బంది కలిగించేవే. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. ఉద్యోగుల భవిష్యత్తు కోసమే..: ఉద్యోగులకు సంబంధించి రాబోయే 30 ఏళ్లలో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిర్ణయాలు తీసుకున్నాం. ఓపీఎస్ గురించి నిర్ణయం తీసుకుంటే.. భవిష్యత్తులో అది మరింత భారమై, ఉద్యోగులకే నష్టం చేస్తుంది. ఉద్యోగుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే జీపీఎస్ అమలు చేస్తున్నాం. దాన్ని కేంద్రం కూడా ఆమోదిస్తోంది. మేము వచ్చాకే కొత్త ఉద్యోగాలు: మా ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం. వైద్య ఆరోగ్య శాఖలో ఎందరిని భర్తీ చేశాం. సచివాలయాల ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియడం లేదా? చంద్రబాబు మనసులో మాట పుస్తకం ద్వారా ఉద్యోగులపై తన మాట చెప్పాడు. ఇప్పుడు ఆయనే మళ్లీ ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు. అందుకే చంద్రబాబు మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతారు. మీ లీడర్ చెబితే చేయాలంటారు,..మా లీడర్ చెప్పడమే తప్ప చేయడం ఉండదని టీడీపీ నేతలే అన్నారు. -
రాజమండ్రి రూరల్‌లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై ఎటూ తేల్చకపోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం అది బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. తనకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే టికెట్ దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ ఇటీవల విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దానిని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. ప్రెస్మీట్లు.. సిగపట్లు.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పవన్, చంద్రబాబు కలిసే చేస్తారని, కచ్చితంగా తనకే టిక్కెట్ దక్కుతుందని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన తమ పొత్తు తర్వాత చెల్లదన్నారు. దీంతో తానే పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. దుర్గేష్ ఇలా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేసి.. అది ఇప్పుడు చెల్లదనడానికి జనసేన నాయకుడు ఎవరని దుర్గేష్‌పై శివాలెత్తారు. ఎవరేమన్నా రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూరల్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. బుచ్చయ్యకు కష్టమేనా.. బుచ్చయ్య రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా రాజమహేంద్రవరం సిటీ స్థానంపైనే ఉండేది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెళ్లగక్కారు. ఆయనకు రూరల్ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీగా రంగంలోకి దింపి, సిటీ సీటు బలమైన క్యాడర్ ఉన్న బుచ్చయ్యకు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలం నడిచింది. బాబు ఇక్కడి సెంట్రల్ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం ఇక్కడే ఉండి ఆందోళనల్లో పాల్గొన్నపుడు.. చొరవగా వ్యవహరించిన ఆదిరెడ్డి వాసుకే సిటీ సీటు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బాబు వైఖరితోనే.. చంద్రబాబు వైఖరితోనే రాజమండ్రి రూరల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రూరల్ సీటు తనకే అన్న ధీమాలో బుచ్చయ్య ఉండగా.. పొత్తులో భాగంగా దుర్గేష్‌కు ఇద్దామన్న మరో ప్రతిపాదన సైతం బుచ్చయ్య వద్ద ఉంచారు. ఇలా రెండువైపులా అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇరు వర్గాల మధ్య గొడవలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు. గుంటూరులో సిగపట్లు ♦ గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్ ♦ ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు ♦ కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ♦ గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్ సీటు అంటున్న తెలుగుదేశం సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు తలనొప్పిగా మారుతోంది. టీడీపీకి పట్టున్న రెండు సీట్లను జనసేన డిమాండ్ చేస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్, జనసేన తరఫున మరో రెండుసార్లు ఓటమి చవిచూశారు. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మళ్లీ తెనాలి నుంచి టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా సమ్మతించారు. అయితే, ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మరోసారి పోటీచేయాలని చూస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే గెలుస్తామన్న భావనతో ఆయన పార్టీపరంగా లైన్ క్లియర్ చేసుకునేందుకు లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారు. నియోజకవర్గంలోనూ ఆయన పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జనసేనకు 29 వేల ఓట్లు రాగా టీడీపీకి 76 వేల ఓట్లు వచ్చాయి. తమకు బలమైన సీటును వదులుకోవడానికి సిద్ధంగాలేమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమం కోసం జనసేన పట్టు.. ఇక జనసేన అడుగుతున్న రెండో సీటు గుంటూరు పశ్చిమం. ఈ సీటు 2014, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తమ సిట్టింగ్ సీటును ఇచ్చేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంతో పాటు కాపు ఓటింగ్ కూడా గణనీయంగా ఉండటంతో ఇక్కడ పోటీచేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం కూడా గుంటూరు జనసేన నేతలు పవన్‌ను కలిసి ఈ సీటు కావాల్సిందేనని, ఏ విధంగా గెలుస్తామో ఆయనకు వివరించారు. మరోవైపు.. టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని బరిలోకి దిగడంతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న ఎన్ఆర్ఐలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఏ సీటు వదులుకోవాలో, ఏ సీటు ఉంచుకోవాలో తెలీక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు నీచ రాజకీయాలు
సాక్షి అమరావతి: అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేశ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశామన్నారు. వారు అత్యవసర సర్విసుల కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలింతలు, గర్భిణిలకు సేవల్లో ఇబ్బంది రాకూడదనే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ఆహారం ఇవ్వడం అత్యవసర సేవ కాదా? అందుకే అలా చేశాం. వారి డిమాండ్లలో 90 శాతం నెరవేర్చాం. ఒకటి రెండు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పింది అధికారంలోకి రాగానే అమలు చేశాం. ఇప్పుడు ఎన్నికల తర్వాత మిగతా డిమాండ్లు కూడా కచ్చితంగా అమలుచేస్తామనే చెప్పాం. ఇప్పుడే కావాలని వారు అంటున్నారు. ఆ బరువు ఇప్పుడు ప్రభుత్వం మోయలేదు. ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్‌గా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా?. చంద్రబాబు ఏనాడైనా ఇంత సంయమనంతో ఉన్నాడా? తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు. గుర్రాలతో తొక్కించింది ఎవరు అంటే చంద్రబాబే కనిపిస్తారు. చంద్రబాబు నైజాన్ని పుణికి పుచ్చుకున్న లోకేశ్ మా గురించి సీఎం జగన్ గురించి విమర్శలు చేయడం విడ్డూరం. ఇక అంబటి రాయుడు కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరారు. ఆయన ఏ రీజన్‌తో వచ్చారో, దేనికి రాజీనామా చేశారో అనేది తెలియదు. కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ట్వీట్లో తెలిపారు. పూర్తి వివరాలు తెలిశాక స్పందిస్తాం. -
నారా దారి.. అడ్డదారి: పరాకాష్టకు కుట్రలు, కుతంత్రాలు
నిజం చెప్పడు... నేరుగా పోరాడడు.. అవకాశవాదమే కాదు అలవోకగా అబద్ధాలాడేసే నైజం. ఇచ్చిన మాటంటే లెక్కే ఉండదు. ఏరు దాటాక తెప్పని బూడిద చేసి నీట్లో కలిపేసే రకం. అధికారం కోసం దేనికైనా రెడీ. శత్రువుల కాళ్లు పట్టుకోవటానికైనా... మిత్రుల కాళ్లు నరికేయడానికైనా...!! ఎంతసేపూ... తనకు ఎవరు, ఎలా ఉపయోగపడతారనే యావే. బహుశా! ఆధునిక రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నాయకుడెవరినీ చూడలేం. పురాణాల్లోనూ ఇలాంటి పాత్ర కనిపించదు. ఎందుకంటే వాటిలోని పాత్రల లక్షణం ఒక్కటీ ఈయనలో ఉండదు. ఈయనకున్న అవ లక్షణాలు పురాణాల్లోని ఏ ప్రతినాయకుడికీ ఉండవు. కానీ చంద్రబాబులోని ఈ అవలక్షణాలన్నిటికీ విజన్.. చాణక్యం.. అనే ముసుగులేసి ఆయనో ఘనమైన నాయకుడని నమ్మించింది ఓ వర్గం మీడియా. వీళ్ల దృష్టిలో బాబు ఏం చేసినా... అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా... ప్రజాస్వామ్యం కోసమే!!. ఔరా.. ఇంత దౌర్భాగ్యమా?? నిలువెల్లా దుర్మార్గాన్ని, విషాన్ని నింపేసుకున్న 63 కిలోల.. 73 ఏళ్ల చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోవటానికి కుతంత్రాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రజాబలం లేక ఓటమి తరుముకొస్తుండటంతో వాటిని పతాక స్థాయికి చేరుస్తున్నారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన సీఎం జగన్‌ను తను, తన పార్టీ ఏమీ చేయలేమని తెలుసు గనక జనసేన, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలన్నిటినీ కూడగడుతున్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూడా... తనకు అనుకూలంగానే పనిచేసేలా వాటిలోని తన మనుషుల ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. 2019లో చంద్రబాబు ఓడిపోగానే ఆయన ఆదేశాల మేరకు బీజేపీలోకి ఫిరాయించిన సి.ఎం.రమేశ్, సుజనా చౌదరి ఇప్పటిదాకా బాబు–బీజేపీలను కలపటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సి.ఎం.రమేశ్ ఓవైపు ఆ పని చేస్తూనే మరోవైపు బీటెక్ రవిని రంగంలోకి దించడంతోపాటు వైఎస్ షర్మిలకు ప్రత్యేక విమానాలు సమకూర్చి సేవలందిస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌లోకి పంపిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావటంతో టీడీపీ–కాంగ్రెస్ సంబంధాలు మరింత బలపడ్డాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు బనాయించిన నాటి నుంచి హస్తంతో చంద్రబాబు అక్రమ బంధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహకర్తగా తన సామాజిక వర్గానికే చెందిన సునీల్‌ను నియమించి తెరచాటున పనులు చక్కబెడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఏ దిశగా వెళ్లినా అది తనకే మేలు చేసేలా బాబు ఏర్పాట్లయితే చేసుకున్నారు. కానీ 90ల నాటి కాలం చెల్లిన ఈ పాచిపోయిన ఐడియాలు ఇప్పుడు పనికొస్తాయా? హఠాన్మరణం తర్వాత కూడా దివంగత వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీకి, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన పార్టీకి ఏపీలో ఎవరు నేతృత్వం వహించినా ప్రజలు మద్దతు ఇవ్వబోరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ఎవరెవరిని ఎలా వాడుకుంటున్నారో ఒక్కసారి చూద్దాం... సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటం, గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం గోచరిస్తుండటంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంపై దింపుడు కళ్లం ఆశలతో అరాచకత్వానికి పాల్పడుతున్నారు. గత ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో విడిగా పోటీ చేయించిన చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం అర్రులు చాస్తూ జనసేనతో జత కలిశారు. తెలంగాణలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆపార్టీకి ఇం‘ధనం’ సమకూర్చిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడ టీడీపీ నేతలందరినీ ‘హస్త’గతం చేశారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తనకు అత్యంత సన్నిహితులైన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి వారిని బీజేపీలోకి పంపి అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రమేష్ ద్వారా ప్రత్యేక విమానాలను సమకూరుస్తూ కుట్రలకు పదును పెట్టారు. తన శిష్యుడైన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపి నోట్ల కట్టలు వెదజల్లి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టేలా చేసిన చంద్రబాబు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక మరోసారి ఇం‘ధనం’ సమకూర్చి సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకరించారు. కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పని చేస్తున్న సునీల్ కనుగోలు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. చంద్రబాబు చెప్పినట్లు ఆడేందుకు, వ్యూహాల పేరిట బాబు ప్లాన్‌ను అమలు చేసేందుకు ఆయన సదా సిద్ధంగా ఉంటారు. పరాకాష్టకు కుట్రలు, కుతంత్రాలు.. సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఆదరణ రోజుకు రోజుకు పెరుగుతోందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో ఆపార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ లాంటి జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు పూర్తిగా కోల్పోవడంతో టీడీపీ ఉనికి కూడా చాటుకోలేదని ఆ సర్వేలు తేల్చి చెప్పాయి. గత ఎన్నికల కంటే ఘోర పరాజయం తప్పదని పసిగట్టిన చంద్రబాబు అడ్డదారి పట్టారు. అనాదిగా మైనార్టీలు కాంగ్రెస్ వెనుకే ఉంటారన్న ఓ పాచిపోయిన భావనను తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది ఆయన ఎత్తుగడ. వైఎస్సార్సీపీలో టిక్కెట్ దక్కని వారికి తన శక్తుల ద్వారా కాంగ్రెస్ టికెట్లు ఇప్పించి ఇం‘ధనం’ సమకూర్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది బాబు ప్లాన్. ఒకవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను చీల్చడం.. మరోవైపు బీజేపీ వ్యతిరేక ఓటు వైఎస్సార్సీపీకి దక్కకుండా చేయడం దీని వెనుకున్న మరో ఎత్తుగడ. ఇలా ఓవైపు కాంగ్రెస్‌ను తానే నడుపుతూ స్వార్థానికి వాడుకోవడమే కాకుండా.. ఇంకోవైపు బీజేపీని కూడా తన వైపు తిప్పుకుని అవినీతి కేసుల నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్న తన మనుషులు, తాను సృష్టించిన పాత్రల ద్వారా ఈ ఎత్తుగడలను అమలు చేసే ప్రణాళిక వేశారు. శిథిలమైన కాంగ్రెస్‌తో శూన్యమే.. 2014లో ఇటు రాష్టంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించింది. విభజనతో పూడ్చలేని నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మిగిల్చింది. తరతరాలపాటు రాష్ట్ర ప్రజానీకాన్ని కోలుకోనివ్వకుండా దెబ్బ తీసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి కనీసం విభజన చట్టంలో కూడా చేర్చకుండా మోసం చేసింది. తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకునే అవకాశాన్ని కల్పించింది. ఏపీకి తీరని అన్యాయం చేసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 1.17 శాతం ఓట్లు లభించగా నోటాకు 1.28 శాతం ఓట్లు రావడమే అందుకు నిదర్శనం. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇదీ. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శిథిలమైన కాంగ్రెస్ నుంచి చంద్రబాబు ఆశించే ప్రయోజనం ఒనగూరే అవకాశమే లేదని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. హఠాన్మరణం తర్వాత కూడా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పార్టీకి ఏపీలో ఎవరు నేతృత్వం వహించినా ప్రజలు మద్దతు ఇవ్వరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జనం మెచ్చిన సీఎం జగన్ సామాజిక న్యాయ పాలన ప్రభంజనంలో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు కొట్టుకుపోవడం తథ్యమని తేల్చి చెబుతున్నారు. -
బాబు,పవన్‌లే అలా రాయిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు, సాక్షి: ప్రజారంజకమైన పాలన అందిస్తున్నాం కాబట్టే వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు ఉందని.. ఈసారి ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి.. తనపైనా యెల్లో మీడియాలో వస్తున్న కథనాలపైనా ఈ సందర్భంగా ఆయన స్పందించారు. ‘‘ఎవరి కోసమూ నేను షర్మిలతో రాయబారం చేయటం లేదు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం వలన ప్రజలు మాకు నీరాజనం పలుకుతున్నారు. ఇది చూడలేక ఎల్లోమీడియా వారిష్టం వచ్చినట్టు రాస్తున్నారు. రెండు మూడు వారాలకొకసారి నేను హైదరాబాదు వెళ్తుంటా. కుటుంబ సభ్యులను కలుస్తుంటా. విజయమ్మ అమెరికా నుండి వచ్చాక వెళ్లి కలిశాను. కానీ యెల్లో మీడియా రాతలు పరాకాష్టకు చేరాయి. కుటుంబ సభ్యులనూ కూడా బజారుకీడ్చే పని చేస్తోంది. చంద్రబాబు, పవన్ అందరూ కలిసి కుట్రలు పన్ని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారు. షర్మిళ మూడేళ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టారు. ఈమధ్య కాంగ్రెస్‌లో చేరుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దానిపై మాకు క్లారిటీ లేదు. షర్మిళ కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. మాకు ప్రజా మద్దతు ఉంది కాబట్టి. ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో పేదల కుటుంబాల్లో మార్పు వచ్చింది. మాకు ప్రజలే దేవుళ్లు అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. దాడి అయినా వినలేదు ఇక.. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 175 స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి. ‘‘సీట్ల విషయంలో అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కోచోట సీటు ఇవ్వలేకపోతే వేరేది చూస్తామని కూడా చెప్తున్నాం’’ అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్సీపీకి దాడి వీరభద్రం రాజీనామా చేసిన పరిణామంపైనా సుబ్బారెడ్డి స్పందించారు. సీట్ల విషయంలో అందరికీ ప్రాధాన్యతలు ఉంటాయి. అనకాపల్లిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఓపిక పట్టాలని దాడి వీరభద్రంతో మాట్లాడాం. అయినా వినకుండా ఆయన రాజీనామా చేశారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూడా మార్పులు ఉంటాయి అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: పిల్లలు తినే తిండిపైనా ఈనాడు విషం! -
జగనన్న గోరుముద్ద పైనా విషమేనా రామోజీ!?
గుంటూరు, సాక్షి: పేదలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కానీ, యెల్లో మీడియా మాత్రం విషపు రాతలతో ద్వేషం ప్రదర్శిస్తోందని ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి మండిపడ్డారు. తాజాగా జగనన్న గోరుముద్దపై ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ‘‘జగనన్న గోరుముద్ద మీద విషం చిమ్మడం ఘోరమైన విషయం. గోరుముద్దకు బడ్జెట్ పెంచడంతో పాటు మంచి మెనూను రూపొందించాం. ప్రతీ రోజూ వెరైటీ మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. ఈ మెనూని రూపొందించింది స్వయంగా సీఎం జగనే. ఈ పథకం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. నేను స్వయంగా అనేక గ్రామాల్లో నేరుగా విద్యార్ధులను అడిగి తెలుసుకున్నా.. .. గతంలో వంట ఖర్చులకు రూ. 3.50 పైసలిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.6.50 రూపాయలిస్తోంది. దేశంలో ఎక్కడా ఏ పాఠశాలలోనూ లేనట్లుగా గోరుముద్ద ద్వారా మంచి భోజనం విద్యార్థులకు అందిస్తున్నాం. గతంలో 32 లక్షల మందికి మాత్రమే భోజనం పెట్టేవారు. మా ప్రభుత్వంలో 43 లక్షలకు పైచిలుకు విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. విద్యార్ధులకు మంచి భోజనం అందించేందుకు సంవత్సరానికి రూ. 1,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయినా అసత్యపు రాతలతో విద్వేషం ప్రదర్శించడం సరికాదని అన్నారాయన. ఇంకా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఏమన్నారంటే.. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులు తినే తిండిపైనా రామోజీ విషం చిమ్ముతున్నాడు. మీడియాను అడ్డంపెట్టుకుని వారి కడుపు కొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో విద్యార్థులకు ఖర్చు చేసిన దానికంటే, జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక, 50-60 శాతం నిధులు పెంచి, 16 రకాల మెనూతో 43 లక్షలకు విద్యార్థులకు(గతంలో కంటే11లక్షల మంది విద్యార్థులకు అదనంగా) శుచి, శుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందిస్తుంటే, పనిగట్టుకుని రామోజీ కట్టకథలు రాయడంపై పార్థసారథి తూర్పారబట్టారు. ఎల్లోమీడియా పైత్యపు రాతలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందజేసే జగనన్న గోరుముద్ద కార్యక్రమం చాలా అద్భుతంగా సాగుతోంది. రోజుకో మెనూతో, శుచి, శుభ్రమైన పౌష్టిక ఆహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన మంచి కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని గోరుముద్ద కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మధ్యాహ్నభోజనంగా నూకలతో వండిన అన్నం పెట్టేవారు. ఉడికీ ఉడకని అన్నంతో, సాంబారు పేరుతో పల్చటి నీళ్లచారుతో మమ అనిపించేవారు అలాంటిది, మా ప్రభుత్వం ఇప్పుడు నాణ్యమైన, విట్‌మిన్‌లతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్‌ను వాడుతున్నామని అందరూ గమనించాలి. పిల్లలకు పాఠశాలల్లో బలవర్థకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తుంటే.. ఎల్లోమీడియా మాత్రం ప్రభుత్వంపై పనిగట్టుకుని కల్పిత కథనాల్ని రాస్తుంది. దేశానికే ఆదర్శమైనటువంటి ఒక మంచి కార్యక్రమంపై ఎల్లోమీడియా పైత్యం చూపించే రాతలు రాయడం ఎంతమాత్రం తగదు. 16రకాల మెనూతో వారానికి 5 రోజులు గుడ్డు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగానే ప్రతీ రోజూ రాగిజావతో సహా రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నాం. ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించడం ద్వారా విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు, ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో బెల్లంతో కూడిన రాగిజావను విద్యార్థులకు అందిస్తున్నాము. మిగిలిన మూడురోజులు గోరుముద్దలో భాగంగా చిక్కీలను అందజేయడం జరుగుతోంది. ప్రతీరోజూ స్వీట్, ఆకుకూర పప్పు, సాంబార్‌లాంటి రుచికరమైన పదార్థాలతో పాటు వారానికి ఐదురోజుల పాటు ఉడికించిన కోడిగుడ్డు కూడా విద్యార్థులకు అందిస్తున్నాం టీడీపీ హయాంలో కంటే 50శాతం పెంపు ఖర్చుతో.. కూరగాయల ధరలు పెరిగిన క్రమంలోనూ ప్రభుత్వం మరింత శ్రద్ధగా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా విద్యార్థులకు వడ్డించే పదార్థాల్లో రాజీ పడటం లేదు. గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం విద్యార్థికి రూ.3.50పైసలు ఇస్తే.. మా ప్రభుత్వం మాత్రం దాన్ని రూ.6.50పైసలకు పెంచింది. అదేవిధంగా వంటసిబ్బందికి అందజేసే గౌరవ వేతనం విషయంలో గత ప్రభుత్వం కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చింది. అదే మా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రూ.3వేలు చేసిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక తరగతుల్లో చదివే ప్రతీ విద్యార్థికి భోజన ఖర్చు రూ.11.26పైసల నుంచి 50 శాతం పెంచి రూ.16.07పైసలు ఖర్చు చేస్తున్నారు. అదే ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు గత ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం కంటే 50 నుంచి 60 శాతం పెంచి, ప్రతి విద్యార్థికి రూ. 18.75, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ. 23.40 చొప్పున ఆహార నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అందజేస్తున్నాం. వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు గత ప్రభుత్వహయాంలో వంట ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల నుంచి ఏడాది దాటినా వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించే పరిస్థితిలేదు. అదే జగన్ గారు ప్రభుత్వం వచ్చినదగ్గర్నుంచీ గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మూడురెట్లు అధికంగా వంటసిబ్బందికి గౌరవ వేతనాలు పెంచడంతో పాటు వంట ఏజెన్సీలకు క్రమం తప్పకుండా సకాలంలో బిల్లుల్ని చెల్లిస్తున్నాం 11 లక్షల విద్యార్థులకు అదనంగా.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 32 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అందజేస్తే.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు 43 లక్షల 46వేల 299 మందికి జగనన్న గోరుముద్దను అందజేస్తున్నాం. అంటే, గతం కన్నా 30 నుంచి 40 శాతం విద్యార్థులు పెరిగిన సంగతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి చేసిన సగటు వ్యయం రూ.450 కోట్లు అయితే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులు దాదాపు రూ.7,244 కోట్లకు పైగా ఉన్నాయి.2023-24 బడ్జెట్ లోనూ రూ. 1,689 కోట్లు గోరుముద్ద కోసం ప్రభుత్వం కేటాయించింది. అంటే పేద పిల్లల ఆహారంపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఎల్లోమీడియా రాతల్ని అంతా ఖండించాలి జగనన్న గోరుముద్ద లాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తోన్న ప్రభుత్వాన్ని అభినందించకపోగా.. ప్రభుత్వంపైనే ఎల్లోమీడియా విషం చిమ్ముతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరూ ఇలాంటి రాతల్ని హర్షించరు. అమ్మ ఒడితో పాటు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెనలాంటి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ.. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడంలో జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం అందరి మన్ననలు అందుకుంటోంది. జగన్‌గారు రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా ఇప్పటికే డీబీటీ ద్వారా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ.2.42 లక్షల కోట్లల్లో దాదాపు 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక, మంచి పరిపాలన అందజేస్తోన్న ప్రభుత్వంపై విషం చిమ్మే విధంగా ఎల్లోమీడియా రాతలు రాయడాన్ని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరుతున్నాను. -
మంత్రి రజిని ఆఫీస్‌పై దాడి.. 30 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు. పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్ -
పిట్టల దొర!
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలివ్వడం ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కి ప్రజలను వంచించడంలో మహా నేర్పరిగా పేరు గాంచిన చంద్రబాబు మళ్లీ అదే బాటలో పయనిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఎడాపెడా హామీలు ఇచ్చేస్తూ, ప్రజలను నమ్మించేందుకు మళ్లీ తన విద్యను ప్రదర్శిస్తున్నారు. గతంలో తాను చెప్పి అమలు చేయలేకపోయిన హామీలనే మళ్లీ ఇప్పుడు కొత్తగా ఇస్తుండడం గమనార్హం. ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఆయన అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల భృతి ఇస్తానని ప్రకటించారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. అప్పట్లో రూ.2 వేల భృతి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చివరి వరకు ఆ ఊసే ఎత్తకుండా కాలక్షేపం చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఎన్నికలకు 3 నెలల ముందు తూతూమంత్రంగా వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతిని ఎంపిక చేసిన కొందరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చేసిన మోసాన్ని కప్పి పుచ్చుకునేందుకు చివర్లో ఇలా నాటకం ఆడారు. ఇప్పుడు అవన్నీ మరచిపోయి మళ్లీ నిరుద్యోగులను మాయ చేసేందుకు చంద్రబాబు నిర్భీతిగా అదే హామీని ఇస్తుండడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఇంటికో ఉద్యోగం అని మోసం 2014 ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలుకుతున్నారు. ఈ విషయాన్ని కూడా కుప్పంలో ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం ప్రకటించిన ముందస్తు మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. 2014లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని ఎందుకు అమలు చేయలేదనే దానికి మాత్రం సమాధానం చెప్పడంలేదు. బాబు వస్తే జాబు వస్తుందని నిరుద్యోగులు, యువతను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను సైతం తొలగించారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడంతో ప్రజలు ఛీత్కరించారు. 2014 ఎన్నికలకు ముందు 600కు పైగా హామీలతో 50 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలను మాయ చేశారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాల రద్దు, రైతులు తాకట్టు పెట్టిన బంగారు రుణాల మాఫీ వంటి అనేక హామీలు ఇచ్చినప్పటికీ, ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదు. ఈ హామీలు కనిపించకుండా వెబ్సైట్ నుంచే తొలగించారు. అందుకే ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించి, నమ్మకానికి మరో పేరైన వైఎస్ జగన్‌కు అధికారం ఇచ్చారు. అందువల్లే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా, ఇతరత్రా మేలు చేసే అనేక పథకాలు, కార్యక్రమాలతో చరిత్ర సృష్టించి.. మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. మళ్లీ మోసాల హామీలు చంద్రబాబు మాత్రం తన మోసాలు, అబద్ధాల హామీలు, నయవంచన చరిత్రను మరచిపోయి మళ్లీ అవే హామీలను ఎడాపెడా గుప్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. హామీలను అమలు చేయకుండా చెత్త బుట్టలో వేసి, ప్రజలకు వెన్నుపోటు పొడవడంలోనూ మాస్టర్స్ డిగ్రీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అదే బాటలో పయనిస్తున్నారు. గతంలో 600 హామీల మేనిఫెస్టోను ప్రజలకు కనపడకుండా దాచేసిన ఆయన ఇప్పుడు మళ్లీ కొత్తగా ముందస్తు మేనిఫెస్టోను విడుదల చేసి ప్రజలకు గేలం వేద్దామని బయలుదేరారు. త్వరలో మళ్లీ ఇంకో మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను మాయ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.