గుంటూరు, సాక్షి: ప్రజారంజకమైన పాలన అందిస్తున్నాం కాబట్టే వైఎస్సార్‌సీపీకి ప్రజల మద్దతు ఉందని.. ఈసారి ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి.. తనపైనా యెల్లో మీడియాలో వస్తున్న కథనాలపైనా ఈ సందర్భంగా ఆయన స్పందించారు.
‘‘ఎవరి కోసమూ నేను షర్మిలతో రాయబారం చేయటం లేదు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం వలన ప్రజలు మాకు నీరాజనం పలుకుతున్నారు. ఇది చూడలేక ఎల్లోమీడియా వారిష్టం వచ్చినట్టు రాస్తున్నారు. రెండు మూడు వారాలకొకసారి నేను హైదరాబాదు వెళ్తుంటా. కుటుంబ సభ్యులను కలుస్తుంటా. విజయమ్మ అమెరికా నుండి వచ్చాక వెళ్లి కలిశాను. కానీ యెల్లో మీడియా రాతలు పరాకాష్టకు చేరాయి. కుటుంబ సభ్యులనూ కూడా బజారుకీడ్చే పని చేస్తోంది. చంద్రబాబు, పవన్ అందరూ కలిసి కుట్రలు పన్ని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారు.
షర్మిళ మూడేళ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టారు. ఈమధ్య కాంగ్రెస్లో చేరుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దానిపై మాకు క్లారిటీ లేదు. షర్మిళ కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. మాకు ప్రజా మద్దతు ఉంది కాబట్టి. ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో పేదల కుటుంబాల్లో మార్పు వచ్చింది. మాకు ప్రజలే దేవుళ్లు అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు.
దాడి అయినా వినలేదు
ఇక.. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున 175 స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి. ‘‘సీట్ల విషయంలో అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కోచోట సీటు ఇవ్వలేకపోతే వేరేది చూస్తామని కూడా చెప్తున్నాం’’ అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్‌సీపీకి దాడి వీరభద్రం రాజీనామా చేసిన పరిణామంపైనా సుబ్బారెడ్డి స్పందించారు.
సీట్ల విషయంలో అందరికీ ప్రాధాన్యతలు ఉంటాయి. అనకాపల్లిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఓపిక పట్టాలని దాడి వీరభద్రంతో మాట్లాడాం. అయినా వినకుండా ఆయన రాజీనామా చేశారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూడా మార్పులు ఉంటాయి అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పిల్లలు తినే తిండిపైనా ఈనాడు విషం!
Comments
Please login to add a commentAdd a comment