Yellow media campaign
-
అబద్ధాలను అందంగా అల్లటంలో ఆరితేరారే!
ఆంధ్రప్రదేశ్‌లో పాలన రోజు రోజుకూ అధ్వాన్నమవుతోంది. ఈ మాట ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అధికార పక్షానికి వత్తాసుగా నిలుస్తున్న పచ్చమీడియానే అప్పుడప్పుడూ తన కథనాల ద్వారా చెబుతోంది. చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు కొందరు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న అరాచకాలు, అవినీతికి హద్దుల్లేకుండా పోయాయని టీడీపీ జాకీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు తమ కథనాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వారు తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే.. రింగ్ మాస్టర్లు అదేనండి.. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లకు ఎక్కడ మకిలి అంటకుండా నెపం ఇతరులపైకి నెట్టేయడం!. కిందటేడాది ఆగస్టు 28న చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ఓ మాట్లాడుతూ ఒక మాటన్నారు.. ‘‘ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు తాను ఇటుక ఇటుక పేరుస్తూంటే.. ఎమ్మెల్యేలు కొందరు జేసీబీలతో కూలగొడుతున్నారు. ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నా ఒకరిద్దరి తప్పుల వల్ల పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. బాబుగారి నేర్పరితనం ఏమిటంటే తన వైఫల్యాలు మొత్తాన్ని దారిమళ్లించేందుకు ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులను మందలించినట్లు పోజ్ పెట్టారు. సరే అనుకుందాం కాసేపు. మంత్రులు, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చిందా? ఊహూ అదేమీ కనబడదు. చంద్రబాబు కూడా ఏ చర్య తీసకోకుండా కథ నడుపుతూంటారు. ఈ మధ్యకాలంలో కొందరు మంత్రులు అధికారుల బదిలీలు, పొస్టింగ్లలో భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు... ఒక మంత్రి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో మకాం వేసి మరీ ఈ దందా చేస్తున్నారని టీడీపీ పత్రిక తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి తెలియ చేసిందని కూడా ఆ మీడియా పేర్కొంది. బ్లాక్‌మెయిలింగ్‌లో దిట్టగా పేరొందిన ఆ మీడియా బహుశా ఆ మంత్రిని బెదిరించడానికి ఏమైనా రాశారా? లేక నిజంగానే మంత్రి అలా చేశారా? అన్నది ఇంతవరకు అటు ఏపీ ప్రభుత్వం కాని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాని వెల్లడించలేదు. ఈ రెండు రాష్ట్రాల అధినేతల మధ్య పార్టీలకు అతీతంగా సాగుతున్న బంధాన్ని ఈ విషయం తెలియ చెబుతుంది. సదరు మంత్రి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అని సోషల్ మీడియాలో ప్రచారమైంది. సీపీఎం నేతలు ఓపెన్‌గానే చెబుతున్నారు. అయినప్పటికీ ఆ మంత్రి ఖండించలేదు. చంద్రబాబు కాని, ఆయన పేషీ కానీ వివరణ కూడా ఇవ్వలేదు. పైగా ఈ మధ్య తిరుపతి సందర్శనలో కూడా చంద్రబాబు ఆ మంత్రిని పక్కన పెట్టుకుని తిరగడం విశేషం. మరో కథనం ప్రకారం.. ఆ మంత్రికి హైదరాబాద్ శివార్లలో ఉన్న భూమి విషయంలో ఏర్పడిన వివాదం రీత్యా తరచు ఇక్కడకు వచ్చి పంచాయతీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తున్నది చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరమా?. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో అవినీతి అధికారి అంటూ మరో జాకీ పత్రిక ఈ మధ్య ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే అచ్చెన్నాయుడుకు సంబంధం లేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చినట్లు కనిపించినా, కేవలం ఒక అధికారి సొంతంగా అవినీతికి పాల్పడతారా? అలాగైతే ఆ మంత్రి అంత అసమర్థుడా అన్న ప్రశ్న వస్తుంది. ఈ కథనం ఇచ్చినప్పటికి ప్రభుత్వం పెద్దగా స్పందించినట్లు కనబడదు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పీఏపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ పీఏ ని తొలగించానని, తను ప్రైవేటుగా నియమించుకున్న వ్యక్తి అని అనిత వివరణ ఇచ్చినప్పటికీ, ఆ ఆరోపణలకు మంత్రికి సంబంధం లేదని అంటే ఎలా నమ్ముతారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఈ విషయమై బీజేపీ పెద్దలకు ఢిల్లీలో ఫిర్యాదు చేసి వచ్చారని అంటారు. ఇక లోకేష్ కు అత్యంత సన్నిహితుడునని చెప్పుకుంటూ ఒక ప్రముఖుడు మైనింగ్ కాంట్రాక్టులు, పోస్టింగ్ లలో హవా సాగిస్తున్నారని, తనకు కావల్సింది తనకు ఇచ్చి, మీకు కావల్సింది మీరు తీసుకోండని ఓపెన్ గా చెబుతున్నారంటూ జాకీ పత్రిక చానా ముదురు శీర్షికన కథనాన్ని ఇచ్చింది. 'చానా" అనగానే అది సానా సతీష్ గురించే అని, అతను లోకేష్ తరపున వ్యవహారాలు చక్కదిద్దుతుంటారని టీడీపీలో ప్రచారం అయింది. అది రాజ్యసభ ఎన్నికల సమయం కావడంతో అతనికి టిక్కెట్ రాకుండా ఉండడానికి ఆంధ్రజ్యోతి పత్రిక బ్లాక్ మెయిలింగ్ వార్త రాసిందని కూడా టీడీపీ వర్గాలు భావించాయి. ఈ వార్త లోకేష్ కు తీవ్ర అప్రతిష్ట తెచ్చింది. దాంతో లోకేష్ కు, ఆంధ్రజ్యోతి యజమానికి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే లోకేష్ కు టీడీపీని నడిపే శక్తి ఇంకా రాలేదని వ్యాఖ్యానిస్తూ ఆ ఓనర్ తన వ్యాసంలో రాసి ఉంటారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూటమి నుంచి విడిపోతే టీడీపీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన ఆందోళన చెందారు. విశేషం ఏమిటంటే ఆంధ్రజ్యోతి సానా సతీష్ పై అంత దారుణమైన కథనం ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు కేటాయించారు. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేసినందునే ఆయనకు ఆ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ పేషీ గురించి నేరుగా రాయకపోయినా, అక్కడ జరిగేవి ఇతర మంత్రులకు తెలియవా? అందుకే ఏ మంత్రిని మందలించే పరిస్థితి చంద్రబాబుకు లేదని కొందరి వాదనగా ఉంది. మరికొందరు మంత్రులపై కూడా పలు అభియోగాలు వస్తున్నాయి. చంద్రబాబు స్టైల్ ఏమిటంటే రహస్యంగా ఎవరు ఏమి చేసినా వారి జోలికి పద్దగా వెళ్లరు. అదే మరీ అల్లరైతే, తాను మందలించనట్లు ప్రచారం చేసుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు, కూటమి నేతలు మద్యం, ఇసుకలలో ఎలా దండుకుంది బహిరంగమే. నలభై లక్షల టన్నుల ఇసుక మాయమైపోయినా ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పెదవి కదపలేదు. మద్యం వ్యాపారంలో అనేక మంది ఎమ్మెల్యేలు 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే తండ్రి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి ఏ మాత్రం భయం లేకుండా తనకు నిర్దిష్ట శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మద్యం షాపులకు హెచ్చరిక పంపించారు. అఅంతేకాదు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, జేసీ మధ్య పవర్ ప్లాంట్ బూడిద రవాణాపై చెలరేగిన గొడవ తెలిసిందే. చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేయడానికి యత్నించారు. ఇక ప్రభాకర రెడ్డి కొందరు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి లేదు. కాకపోతే జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మైనింగ్ లీజుల దందాపై సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన చెప్పినట్లు వినాల్సిందేనని టీడీపీ ముఖ్యనేత ఆదేశించడంపై కూడా మైనింగ్ యజమానులు మండిపడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్న అరాచకంపై నిత్యం కథలు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఒక ఎస్టీ కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వార్తలు చెబుతున్నాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టిన రోజు వేడుకకు పోలీసులు హాజరై కేక్ కట్ చేయించడం పై విమర్శలు వచ్చాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య కూడా పోలీసు అధికారులపై రుసురుసలాడిన తీరు అందరికి బహిరంగ రహస్యమే. మదనపల్లె నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే ఒకరికి నెలకు 30 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఒక మహిళా తహశీల్దార్ మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన విషయం సంచలనమైంది. సదరు ఎమ్మెల్యే ఖండించినా నిప్పు లేకపోతే పొగరాదన్నట్లుగా అంతా భావించారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి దౌర్జన్యాలపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడలో ఒక దళిత ఫ్రొఫెసర్ ను ఆయన తన అనుయాయులతో కలిసి వెళ్లి బెదిరించారు. అలాగే ఒక టీషాపు ను కూల్చి వేయించిన విషయం వివాదాస్పదమైంది. వీటిని పట్టించుకోని పవన్ కళ్యాణ్ కడపలో ఒక మండల అధికారిపై వైసీపీ నేత ఎవరో దౌర్జన్యం చేశారంటూ అక్కడకు వెళ్లి హడావుడి చేసి వచ్చారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తాను చెబితే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లేనని, రేషన్ షాపుల వారిని, మధ్యాహ్న భోజనం ఏజెన్సిల, ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించారు. ఇక కాంట్రాక్టర్ లను బెదిరించడం వంటివి నిత్య కృత్యమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఏకంగా అదానీ కంపెనీ సిబ్బందిపైనే దాడి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళా టీడీపీ నేత చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ తీవ్ర కలకలం సృష్టించింది. వారి మధ్య టీడీపీ నేతలు రాజీ చేశారు తప్ప ఆయనపై చర్య తీసుకోకపోవడం విశేషం. కృష్ణపట్నం ఓడరేవు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మద్యం దుకాణాలలో ఎమ్మెల్యేకి వాటా ఇవ్వలేదని నరసరావుపేటలో ఆయన అనుచరులు రెస్టారెంట్ పై దాడి చేసి వధ్వంసం సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. జనసేన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మట్టి దందాకు పాలపడుతున్నాడని కథనాలు వచ్చాయి. రోజూ ఇలాంటి స్టోరీలు పుంఖానుపుంఖాలు గా వస్తున్నా కూటమి అధినేతలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. మరో వైపు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కు ఐదువేల ట్రాన్స్ ఫార్మర్లకు ఆర్డర్లు ఇచ్చారంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఆ కంపెనీ యజమాని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఆర్డర్ ఇవ్వరాదట. ఆ ఆర్డర్ చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చారని ఈ పత్రిక చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. అంత పెద్ద ఆర్డర్ ముఖ్యమంత్రికి తెలియకుండా వెళుతుందా? ఇవన్ని చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఇంత అధ్వాన్నంగా పాలన సాగిస్తోందన్న అభిప్రాయం రాదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సెకి ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పిన వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరుగుతున్న కుట్రలను.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని.. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారాయన. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘రైతులకు ఉచిత కరెంట్ అనేది ఒక కల. దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. బాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్ పవర్ ఒప్పందాలు రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వగలిగాం. ఉచిత కరెంట్ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆ టైంలో యూనిట్‌ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సప్లై సేందుకు 24 బిడ్లు వచ్చాయి. కానీ, చంద్రగ్రహణం(చంద్రబాబును ఉద్దేశించి).. ఆ ప్రక్రియకు అడ్డం పడింది. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం మేం వివిధ కోర్టులో పోరాడాల్సి వచ్చింది. అలాంటి టైంలో.... 2021 సెప్టెంబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం (సెకి) నుంచి తియ్యటి కబురుతో ఓ లేఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పొగుడుతూ.. రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకి అభినందించింది. యూనిట్‌కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్‌ను అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇందులో 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించిన పవర్ ఆఫర్ ఇది... కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ.. ఆ సంకల్పానికి తోడుగా ఉంటామని లేఖ రాసింది. మేమే పవర్ సప్లై చేస్తామని చెప్పింది. ఇక్కడ మూడో పార్టీ ఎక్కడుంది?. రెండోది.. రూ.2.49కి అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించే ఒప్పందం. ఐఎస్టీఎస్ (ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు) ఛార్జీలు లేకుండా(యూనిట్‌కు రూ.1.98పైసా చొప్పున).. స్పెషల్ ఇంటెన్సివ్ ఇస్తానంది. ఇక్కడ.. యూనిట్ రూ.2.61 మనకు కలిసి వస్తుంది. ఏడాది 4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పందం ప్రకారం పాతికేళ్లకు.. లక్షల కోట్లు కలిసి వచ్చేవి... ఏపీ చరిత్రలోనే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇది. లక్షల కోట్లు ఆదాయం ఆదా కావడం సంపద సృష్టి కాదా?. ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం. ఇలాంటి ఒప్పందానికి స్పందించకున్నా.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఊరుకునేవా?. నన్ను ఏమనేవారు.ఇంకా జగన్ ఏమన్నారంటే.. 👉ఆరోజుల్లో దాదాపు 18 లక్షల పంప్సెట్లు. దానికి ఉచిత కరెంటు కోసం దాదాపు రూ.9 వేల కోట్ల ఖర్చు.అలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు 5 ఏళ్ల పాలన చూస్తే.. విద్యుత్ రంగం దారుణం. డిస్కమ్‌లు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. డిస్కమ్‌ల పరిస్థితి చూస్తే, చంద్రబాబు రాకముందు రూ.29 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉంటే, ఆయన దిగిపోయేనాటికి అవి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపు 23.88 శాతం సీఏజీఆర్. డిస్కమ్‌ల నష్ట పరిస్థితి.ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు సపోర్టు చూస్తే.. రూ.13255 కోట్లు మాత్రమే చేయగా, మా ప్రభుత్వ హయాంలో రూ.47,800 కోట్లు. ఆ విద్యుత్‌ను 20 ఏళ్లపాటు ఉచితంగా ఇచ్చేలా, ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది.👉టెండర్లు. చంద్రగ్రహణం2020 నవంబర్ లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, సోలార్ పార్కులు రాష్ట్రంలో పెట్టాలని టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరాకు ఎన్టీపీసీ వంటి పెద్ద సంస్థలన్నీ పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలంటే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి, రకరకాల పద్ధతుల్లో కోర్టుల్లో ఈ ప్రక్రియ అంతా ఆపేసే కార్యక్రమం జరిగింది. కోర్టుల ద్వారా ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి.2020 నవంబరులో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి, ఆ తర్వాత వివిధ కోర్టుల్లో దీని కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.👉సెకి లేఖ రాక. తీపి కబురు2021, సెప్టెంబరు 15న, రాష్ట్ర ప్రభుత్వానికి తీయటి కబురు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి నుంచి లేఖ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి వచ్చిన లేఖ సారాంశం చూస్తే..6400 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ప్రభుత్వానికి వచ్చిన అతి తక్కువ ధర రూ.2.49 చూశాం. మీరు రైతులపై చూపుతున్న శ్రద్ధను అభినందిస్తున్నాం. డిస్కమ్‌ల మీద భారం తగ్గిస్తూ, రైతులను ఆదుకుంటున్న విధానాన్ని, వారికి ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ, ఆ విద్యుత్‌ను తామే రూ.2.49కే ఇస్తామని సెకి వెల్లడించింది.అంతే కాకుండా, వారు చెప్పిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఒక స్పెషల్ ఇన్సెంటివ్‌గా.. ఐఎస్టీఎస్ (ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్)ను 25 ఏళ్లపాటు రద్దు చేస్తామని వెల్లడించారు.అలా 2026 నాటికి మొత్తం మీద 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని సెకి వివరించింది.👉నేను ఒక్కటే అడుగుతున్నాను. ఆ లెటర్లో టేక్ ఎవేస్ చూస్తే..కేంద్ర సంస్థ సెకితో ప్రభుత్వం నేరుగా జరిపిన లావాదేవీ ఇది. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విషయం.యూనిట్ రూ.2.49కే. ఇది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్.ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఐఎస్టీఎస్ (ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్) ఉండదు. ఇది స్పెషల్ ఇన్సెంటివ్‌గా ఇస్తున్నామని చెప్పడం. 👉సంపద సృష్టి అంటే ఏమిటి? మీరే చెప్పండి:గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర రూ.5.10. అదే మనకు 17 వేల మిలియన్ యూనిట్లు కేవలం రూ.2.49కే ఇవ్వడానికి కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది.అంటే ఒక్కో యూనిట్ ధర ఇక్కడ రూ.2.60 తగ్గింది. దీని వల్ల ఏటా రూ.4400 కోట్లు. 25 ఏళ్లలో ఆ మొత్తం దాదాపు రూ.1.10 లక్షల కోట్లు. మరి అది సంపద సృష్టి కాదా?👉అలాంటి ఆఫర్ కాదంటే.. కేంద్రం నుంచి ఇలాంటి ఆఫర్ వస్తే.. అతి తక్కువ ధరకు విద్యుత్. ఐఎస్టీఎస్ మాఫీ. 25 ఏళ్లలో మీకు లక్ష కోట్లకు పైగా ఆదా. రైతులకు మంచి చేసేందుకు మీతో కలిసి వస్తామని అంటే..అలాంటి లెటర్‌ను పక్కన పెడితే, మీరంతా నన్ను ఏమనేవారు? ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏమని విమర్శించేవారు. ఆలోచన చేయమని కోరుతున్నాను. రాష్ట్రానికి మంచి చేయాలని నేను అడుగులు ముందుకు వేస్తే, బురద చల్లుతున్నారు. వారు చేస్తోంది ధర్మమేనా? మనమంతా అడగాలి. చంద్రబాబుకు అన్నీ తెలుసు. అయినా ఆయనే ఆ నింద వేస్తున్నారు.రూ.2.49కే యూనిట్ పవర్. ఇది ఒక చరిత్ర. కేవలం మా ప్రభుత్వం వల్లనే సా«ధ్యమైంది. అది చరిత్రాత్మక ఒప్పందం. అలాంటి ఒప్పందాన్ని తప్పుబడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నారు.👉చంద్రబాబు హయాంలో విద్యుత్ కొనుగోళ్లుచంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014ృ19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ పీపీఏలు గమనిస్తే.. రూ.4.84 నుంచి రూ.4.83 వరకు ఉన్నాయి. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్ కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఏ చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ 6.49కు కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. రూ.5.25 నుంచి 6.99 మధ్య ఒప్పందం చేసుకున్నారు.2015లో రూ.5.96 కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం. 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50 కి కొనుగోలు చేశారు. ఆయన సోలార్ ఎనర్జీని యావరేజ్ గా రూ.5.90కి కొనుగోలు చేశారు.👉అతి తక్కువ రేట్‌కు పీపీఏ చేయడం తప్పా?: చంద్రబాబు హయాంలో విండ్ పవర్ యావరేజ్ యూనిట్ ప్రైస్ రూ.4.63 అయితే.. సోలార్ యూనిట్ రూ.5.90. మరి నేను రూ.2.49కు అంటే చంద్రబాబు పెట్టిన దానిలో సగం రేటుకు కొనుగోలు చేస్తే.. చీపెస్ట్ రేట్ కి పవర్ సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే.. ఐఎస్ టీ ఎస్ చార్జెస్ మాఫీ చేస్తామని చెబితే.. నేను స్పందించకపోయి ఉంటే నన్ను మీరేమని ఏమనేవారు?.స్పందించిన నేను మంచి వాడినా.. అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచి వాడా?👉ఎవరికి సంపద సృష్టి. ఎవరికి ఆవిరి?:చంద్రబాబు హయాంలో సంపద ఎలా ఎరోడ్ (ఆవిరైపోయిందో) అయిందో చెబుతాను.చంద్రబాబు సోలార్, విండ్ పీపీఏలను వైయస్సార్ సీపీ చేసుకున్న సోలార్ ఒప్పందంతో పోలిస్తే.. అవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంపై మోపుతున్న భారం.. రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం ఇది. ఇదే మాదిరిగా చూస్తే.. 3500 విండ్ పీపీఏలకు సంబంధించి ఆయన చేసుకున్న రూ.4.84లు మైనస్ మనం చేసుకున్న రూ.2.49. అంటే రూ.2.35 రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే 9000 మిలియన్ యూనిట్లు..అంటే రూ.2.35 ఇంటూ 9000 మిలియన్ సంవత్సరానికి రూ.2వేల కోట్లు.. 25 ఏళ్లలో రూ.50 వేల కోట్లు కేవలం చంద్రబాబు చేసుకున్న విండ్ యూనిట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం.సోలార్ ఎనర్జీ ఒప్పందాలు చూస్తే.. చంద్రబాబు 2400 మెగావాట్లు ఆయన చేసుకున్న ఒప్పందం.. యావరేజ్ ప్రైస్ రూ.5.90.అదే మేము ఒప్పందం చేసుకున్నది రూ.2.49. అంటే రూ.3.41 ఆయన చేసుకున్న పీపీఏల వల్ల రాష్ట ప్రభుత్వం అదనంగా కట్టాలి కదా? 2400 మెగావాట్లు అంటే.. 4200 మిలియన్ యూనిట్లు ఇంటూ రూ.3.41. ఏడాదికి 1500 కోట్లు సంవత్సరానికి భారం పడుతుంది. 1500 కోట్లు ఇంటూ 25 ఏళ్లు అంటే.. 37500 కోట్లు.. జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరుగుతుంటే.. చంద్రబాబు చేసుకున్న సోలార్, విండ్ ఒప్పందాల వల్ల.. 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల సంపద ఆవిరవుతుంది. తేడా గమనించండి.👉సెకి లేఖ. పరిణామాలు. ఒప్పందం:సెకి నుంచి 2021, సెప్టెంబరు 15న లేఖ రాగా, ఇటువంటి మంచి ఆఫర్ రావడంతో, ఆ మర్నాడే క్యాబినెట్ మీటింగ్ ఉండగా, దాన్ని టేబుల్ ఐటెం కింద పెట్టాం. అంటే సెప్టెంబరు 16న క్యాబినెట్లో చర్చించాం. ృ ఎనర్జీ శాఖ అన్నీ అధ్యయనం చేసి వచ్చే క్యాబినెట్ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాదాపు 40 రోజుల పాటు అన్నీ అధ్యయనం చేసిన ఇంధనశాఖ కమిటీ, 2021, అక్టోబరు 25న నివేదిక సమర్పించారు.ఆ తర్వాత అక్టోబరు 28న క్యాబినెట్ జరగ్గా, ఆ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచడం జరిగింది. అన్నీ చర్చించిన తర్వాత క్యాబినెట్ ఏం చెప్పిందంటే, ఏపీఈఆర్సీ అనుమతి కూడా తీసుకోవాలని నిర్దేశించి, ఆమోదం తెలిపింది.ఆ తర్వాత నవంబరు 11న ఏపీఈఆర్సీ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్రమంలో డిసెంబరు 1, 2021న ప్రభుత్వం, సెకి మధ్య పవర్సేల్ అగ్రిమెంట్ జరిగింది.దాంట్లో ఎవరెవరు సైన్ చేశారంటే.. సెకి, రాష్ట్ర ప్రభుత్వం, నాలుగు డిస్కమ్‌లు సంతకాలు చేశారు. ఇక్కడ ఎక్కడా థర్డ్ పార్టీ లేదు.స్పష్టంగా చెప్పాలంటే.. అది సెకి, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య జరిగిన ఒప్పందం. దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ముందే ఇచ్చింది.👉ఆ ఒప్పందం కనుక చేసుకోకపోయి ఉంటే..:ఒక చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంటే.. రూ.2.49కే విద్యుత్ మన రాష్ట్రానికి దొరుకుతుంటే, ఇంకా స్పెషల్ ఇన్సెంటివ్‌గా ఐఎస్టీఎస్ మాఫీ. అదెంతో తెలుసా? ఒక్కో యూనిట్‌కు రూ.2. అంటే ఒక్కో మెగావాట్‌కు నెలకు దాదాపు రూ.4 లక్షలు. అంటే ఏడాదికి దాదాపు రూ.50 లక్షలు అన్నమాట. అంత తక్కువ ధరకు మనకు సోలార్ విద్యుత్ వచ్చింది. ఆత్మ నిర్బల్ భారత్ కింద, సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తూ, కేంద్రం మనకు ఆ ఇన్సెంటివ్ ఇచ్చింది.అంత మంచి ఆఫర్‌ను నేను పక్కనపడేసి ఉంటే, అదే మీరు ఏమనేవారు? 25 ఏళ్లలో దాదాపు రూ.1.10 లక్షల కోట్లు ఆదా. అంటే అది సంపద సృష్టి కాదా? నిజానికి అది ఒక రోల్‌మోడల్ కేసు.అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధర:ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇదే సెకి, అదే ఆత్మ నిర్బల్ భారత్ కింద.. తమిళనాడుకు కూడా విద్యుత్ సరఫరా చేసింది.చత్తీస్గడ్ రూ.2.61. ఒడిషా రూ.2.61. తమిళనాడు రూ.2.61అదే మన రాష్ట్రానికి 12 పైసలు తక్కువగా రూ.2.49కే తెస్తే, నన్ను సన్మానించాల్సింది పోయి, ఏం విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబు సంపద ఆవిరి చేస్తే, నేను సృష్టించాను. మరి ధర్మం, న్యాయం ఎక్కడుంది?ఎల్లో మీడియా పిచ్చి రాతలు:ఇక ఎల్లో మీడియా రాతలు. వారికి తోడు తానా అంటే తందానా అంటూ, చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, ఇతర పార్టీల్లో ఉన్న ఆయన మనుషులు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ల పిచ్చి విమర్శలు. గుజరాత్లో రూ.1.99కే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే, మనం రూ.2.49కి ఎందుకు కొన్నామని అంటున్నారు.అక్కడి పరిస్థితులు వేరు. ఇర్రేడియేషన్ స్థితి. ఎడారి ప్రాంతాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువ.కానీ, చంద్రబాబు, ఎల్లో మీడియా అతి తెలివి ప్రదర్శిస్తూ.. గుజరాత్, రాజస్థాన్‌లో ఉత్పత్తి వ్యయం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఎంతో తెలుసా? యూనిట్‌కు రూ.1.98.మరి ఈనాడు గుజరాత్ గురించి రాశారు. అక్కడ యూనిట్ ఉత్పత్తి వ్యయం రూ.1.99 అంటున్నారు. మరి ఎక్కడ ఉత్పత్తి? ఎక్కడ వినియోగం? చూడాలి కదా?అంటే గుజరాత్‌లోనే ఉత్పత్తి చేసి, ఆ రాష్ట్రంలోనే సరఫరా చేస్తున్నారు. అంటే మొత్తం అంతా రాష్ట్రంలోనే. అందుకే వారికి ఆ రేట్లు వర్తిస్తున్నాయి.వారికి అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్ వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూ.1.99.రాజస్థాన్‌లో చూస్తే, అదే స్థితి. ఉత్పత్తి, సరఫరా అంతా ఒకే రాష్ట్రంలో. అయినా ఈనాడులో అది రాయరు. కేవలం ఉత్పత్తి వ్యయం తక్కువ అని మాత్రమే చెబుతారు. అక్కడ కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవు. మరి అలా రాయడం వక్రీకరణ కాదా?👉కోవిడ్ తర్వాత, తాజాగా గుజరాత్లో సెకి టెండర్లు చూస్తే.. 2024, మార్చి 15న టెండర్ల బిడ్లు చూస్తే, రూ.2.62 నుంచి రూ.2.67 వరకు ధర. అంటే గుజరాత్‌లోనే ఉత్పత్తి. ధర.రాజస్థాన్‌లో కూడా బిడ్లు చూస్తే.. దాదాపు అవే ధరలు. అంటే ప్రస్తుత రెన్యూవబుల్ ఎనర్జీ రేట్లు ఇలా ఉన్నాయి.👉ఆ లెక్కన రూ.1.50కే రావాలి కదా?:మనకు అక్కడి జనరేషన్ కాస్ట్ కంటే తక్కువకు రూ.2.49కే వచ్చాయని సంతోషపడాలి.ఈనాడులో ఏం రాశారు? ఏళ్లు గడుస్తున్న కొద్దీ కొత్త మోడళ్ల టీవీల ధరలు తగ్గుతాయి. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత తగ్గాలి కదా? అంటున్నారు.ఆ ప్రకారం, ఈనాడు థియరీ ప్రకారం చూస్తే.. అదే గుజరాత్లో సోలార్ పవర్ ఇవాళ రూ.1.50కే రావాలి కదా? మరి రూ.2.67 వరకు ఎందుకు పోయింది? అంటే ఏ స్థాయిలో అబద్ధాలు చెబుతున్నారనే దానికి ఇవన్నీ ఉదాహరణలు.👉మీడియా ప్రశ్నలకు సమాధానంగా..చంద్రబాబు ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటే..ఎవరూ అంత తెలివి తక్కువగా ఆ పని చేయరు. అంత తక్కువ ధరకు విద్యుత్ దొరకదు. పైగా 25 ఏళ్లలో లక్ష కోట్లకు పైగా ఆదా. 2009 నుంచి చూస్తే.. రూ.3.70 మొదలు చంద్రబాబు హయాంలో రూ.6.99 వరకు చేరింది.మా హయాంలో ఒకే అగ్రిమెంట్. యూనిట్ ధర రూ.2.49.అంత తక్కువ ధరకు ఎవరూ కొనుగోలు చేయలేరు. ఇది వాస్తవం.ఇంకా చెప్పాలంటే చరిత్రాత్మకం. డిస్కమ్‌లు కరెంటు కొంటున్నాయి. సెకి సరఫరా చేస్తోంది. మేము యూనిట్‌కు రూ.2.49 చొప్పున సెకికి చెల్లిస్తున్నాం. అది అప్పట్లో చాలా తక్కువ ధర. పైగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీల మాఫీ. అంత మంచి ఆఫర్ ఎవరైనా వదులుకుంటారా? మీరే చెప్పండి. దాని వల్ల ఏటా రూ.4400 కోట్లు ఆదా. అంటే 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా. ఇది ముమ్మాటికీ సంపద సృష్టే.సెకితో ఏపీ ప్రభుత్వ ఒప్పందం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఇంత మంచి చేసిన నన్ను అభినందించి సత్కరించాల్సింది పోయి.. రాళ్లు వేస్తునన్నారు. అయినా.. చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా ఇంతలా వక్రీకరించి మాట్లాడడం ధర్మమేనా?. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఇంతలా వకక్రీకరించాలా?. టీవీ రేట్లు తగగ్గినట్లు కరెంట్ రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. ఇక్కడే వక్రీకరణ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని జగన్ అన్నారు. -
అప్పుడు తప్పుబట్టి.. ఇప్పుడేమో ఆకాశానికెత్తి మరీ!
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ పలు పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఓకే చేయడం, దానికి అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగింది. డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్ ప్రభుత్వ విధానాల ప్రకారం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించింది. అందుకోసం ప్రభుత్వం భూముల కేటాయింపు చేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న ఎనిమిది శాతం వాటాను అదాని గ్రూప్ కొనుగోలు చేసింది. అలాగే ప్రైవేటు రంగంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు కూడా అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చింది. ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఏమని ప్రచారం చేసిందో గుర్తుందా?జగన్ ఏపీని అదానీకి రాసిచ్చేస్తున్నారని.. అదానీకి జగన్ రెడ్ కార్పెట్ వేస్తున్నారని.. ఏపీ అంతా దోపిడీ జరిగిపోతోందని వదంతులు సృష్టించారు. అదానీ పెట్టుబడులను జగన్ స్వాగతిస్తే దారుణమైన వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఎల్లో మీడియా.. ఏదో రకంగా విమర్శలు చేసిన తెలుగుదేశం ఇప్పుడు మొత్తం ప్లేట్ మార్చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంంతోనే అదానీ ఇప్పుడు మంచి పెట్టుబడిదారుడు అయిపోయారు. అదానీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవ్వగానే మొత్తం ఏపీ ముఖచిత్రం మారిపోయినట్లు తెలుగుదేశం మీడియా డాన్స్ చేస్తోంది.ఇక తెలుగుదేశం పరిశ్రమలు పెట్టేసినంతగా ఊదరగొడుతుంది. అదానీ అప్పుడైనా, ఎప్పుడైనా పరిశ్రమలు పెట్టి ఏపీకి ఉపయోగపడితే మంచిదే. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు రాకుండా, వచ్చిన వాటిని భయపెట్టేలా అటు తెలుగుదేశం ప్రచారం చేసింది. ఇటు ఎల్లో మీడియా అడ్డంగా దుష్ప్రచారం చేసింది.అప్పుడు పరిశ్రమల స్థాపనకు భూములిచ్చినా, నీళ్లిచ్చినా, రాయితీలిచ్చినా దోచుకోవడమన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విధానం తయారు చేస్తేనే వరాల వర్షం కురుస్తోందని , స్వర్ణాంధ్ర సాకారం అవుతోందని బాకా వూదుతున్నారు. జగన్ టైంలో షిరిడీ సాయి సంస్థ కొత్త ప్రాజెక్టును చేపట్టడానికి వీలుగా ప్రభుత్వంనుంచి భూమిని తీసుకుంది. అలాగే నెల్లూరు జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూమి తీసుకుంది. రామాయపట్నంవద్ద ఇండోసోల్ అనే సంస్థ సోలార్ ప్యానెల్స్ తయారీకి పూనుకుంటే.. ఈనాడు మీడియా ఎంత విష ప్రచారం చేసిందో చెప్పలేం.కొద్ది రోజుల క్రితం అదానీతో భేటీ సందర్భంగా వచ్చిన కథనాలను గమనిస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్ ను రాసిచ్చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతోందా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఒకటేమిటి !అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలు చేస్తోందని ఈనాడు మీడియా బాజా వాయించింది.ఇవేగాదు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా అదానీ కంపెనీయే నిర్మిస్తుందట. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ప్రాజెక్టులు పెడుతుంటే.. పచ్చి అబద్ధాలను వండివార్చిన ఎల్లో మీడియా ఇప్పుడు మొత్తం ఏపీలో అన్నిరకాల పెట్టుబడులను గుజరాత్ కు చెందిన అదానీ తెస్తే బాగుందన్నట్టుగా రాస్తున్నారు. వారు అడిగినంత మేర వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందట. టెండర్లు లేకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం అదానీకి ఎలా అప్పగిస్తారో తెలియదు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి నీచమైన రాజకీయం జరుగుతున్నదో ప్రజలు ఆలోచించుకోవచ్చు.తమకు నచ్చని పారిశ్రామికవేత్తలపై బురద చల్లడం, తమకు ఇష్టం లేని పార్టీ అధికారంలో ఉంటే వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని అసత్య ప్రచారాలను చేయడం ఇవ్వన్నీ చూస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద మాఫియా గుప్పిట్లో చిక్కుకున్నదనే అభిప్రాయం కలుగుతోంది.జగన్ ప్రభుత్వం రామాయపట్నం , మచిలీపట్నం, మూలపేట పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వపరంగా నిర్మాణం సాగించింది. ఆ పోర్టులను కూడా అదానీకే అప్పజెప్పాలన్న ఆలోచన జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కృష్ణపట్నం, గంగవరం పోర్టులలో అదానీ పెట్టుబడులను పెడితేనే ఏదో ఘోరం జరిగిపోయినట్టు ప్రచారం చేసిన వీళ్లు.. ప్రస్తుతం ఆ పోర్టుల విస్తరణకు అవసరమైన వందల వేల ఎకరాల భూములను కట్టబెట్టి ఆ కంపెనీపోర్టుల విస్తరణకు ప్రతిపాదించింది అని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు.ఇక మంత్రి లోకేష్ అమెరికాలో ఆయా కంపెనీల సీఈవోలను కలవడాన్ని హైలైట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టెస్లా కార్ల కంపెనీకి లోకేష్ ఆహ్వానం పలికారని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో భాగస్వాములు కావాలని కోరారని రాశారు. వీటిలో నిజంగా ఏదైనా జరిగితే మంచిదే. కానీ ఇదే లోకేష్ కొద్ది సంవత్సరాల క్రితం టెస్లా కంపెనీ ఏపీకి వచ్చేస్తున్నదన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు నిజంగానే దాన్ని సాధించగలిగితే స్వాగతించవచ్చు. అలా కాకుండా ప్రచార ఆర్భాటానికి సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి యాత్రలు చేస్తుంటే అది ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది.ఎల్లో మీడియాలో మరో మోసపూరిత కథనం ఇచ్చింది. స్కిల్ హబ్ గా ఏపీ మారుతోందని నైపుణ్య శిక్షణతో ఏడాదికి 1.24 లక్షల ఉద్యోగాలు వస్తాయని 92వేల మందికి స్వయం ఉపాధి కలుగుతుంది సిడాప్ వార్షిక ప్రణాళిక తెలిపిందంటూ ఆహా,ఓహో అంటూ భజనం చేసింది. ఒక వైపు ఉన్న ఉద్యోగాలను ఊడగొడతూ ఇంకోవైపు లక్షల ఉద్యోగాలు వస్తాయని నివేదికలు తయారు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గమనించలేరా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోల
సాక్షి, అమరావతి: తన వంద రోజుల పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో ఆ వ్యవహారం నుంచి వారి దృష్టి మళ్లించడానికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కల్తీ అయిందని చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడనప్పుడు లడ్డూ ఏ విధంగా కల్తీ అవుతుందని.. ఈ లెక్కన ఏ విధంగా అపచారం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు అండ్ గ్యాంగ్ నుంచి సమాధానం లేదు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ మూలాలున్నాయని గుర్తించిన వెంటనే.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించామని, ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమక్షంలో స్పష్టంగా ప్రకటించారు. ఆ ట్యాంకర్లు కనీసం టీటీడీ గోడౌన్ వరకు కూడా రాలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తలకెక్కించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేయడం ద్వారా లబ్ధి పొందాలని కుట్ర పన్నారు. ఆ వెంటనే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందని నింపాదిగా ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పచ్చిగా అబద్ధం చెప్పారు. ఇందుకు కారణం గత ప్రభుత్వమేనని నింద మోపుతూ దుష్ప్రచారం ప్రారంభించారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఎల్లో గ్యాంగ్ ఇదే పాటను అందుకున్నారు. అసలు కల్తీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తు ఈవోనే చెబుతున్నప్పుడు.. కల్తీ అయిన నెయ్యితో లడ్డూ తయారు చేశారని ఎలా చెబుతారంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, కోట్లాది మంది భక్తులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్డు సిటింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానికి లేఖ రాసిన వైఎస్ జగన్ పచ్చి అబద్ధాలు చెప్పే అలవాటున్న సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బ తీసే స్థాయికి దిగజారారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించనప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారు. చంద్రబాబు చర్యలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని, ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్న చంద్రబాబును గట్టిగా మందలించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆదివారం లేఖ రాశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం 100 రోజుల్లో ఇచి్చన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారన్నది స్పష్టమైంది. కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. తద్వారా కోట్ల మంది తిరుమల భక్తుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. వాస్తవానికి ఆలయంలోనికి వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్ నుండి మూడు నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. గతంలో కూడా ఈ వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. వాస్తవంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా ప్రారంభించింది జూన్ 12 నుంచి అని టీటీడీ ఈవోనే చెబుతున్నారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన రెండు నెలల తర్వాత చంద్రబాబు ఆ విషయం గురించి రాద్ధాంతం చేయడాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. ఆ ల్యాబ్ నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి విడుదల చేయడాన్ని బట్టి ముమ్మాటికీ ఇది రాజకీయం కుట్రేనని స్పష్టమవుతోంది. మరో వైపు కల్తీకి ఆస్కారమే లేదని ఆహార రంగ నిపుణులు సైతం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం తన జేబులోని అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. -
ఆ రెండు బోట్లు ఎవరివి? ఏమయ్యాయి?
ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనలో కుట్ర కోణం ఉంది. కావాలనే వీటిని పంపించారు. ఆ బోట్లపై వైఎస్సార్సీపీ రంగులు ఉన్నాయి. కాబట్టి, ఇది ఆ పార్టీ నేతల కుట్రే.. అంటూ గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ నేతలు.. వీళ్లకు తోడైన అనుకూల మీడియా-సోషల్ మీడియా పేజీలు కథనాలను అరిగిపోయేలా ప్రచారం చేస్తున్నాయి. అదే టైంలో బోట్ల యాజమానుల్ని పోలీసులు అరెస్ట్ చేయగానే.. వాళ్లు వైఎస్సార్సీపీ నేతలంటూ ప్రచారం మొదలుపెట్టాయి. అయితే..ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటన కేసులో అరెస్టైన ఇద్దరూ టీడీపీకి చెందినవాళ్లే. ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది వైస్సార్సీపీ. దీంతో ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగిపోయింది. అయినా కూడా వైఎస్సార్సీపీపై బుదర జల్లడం ఆపలేదు టీడీపీ. ఇంకోవైపు.. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు బ్యారేజీని ఢీ కొట్టిన మరో రెండు బోట్ల గురించి మాత్రం పెదవి విప్పడం లేదు.ఆగస్ట్ 30, 31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్ 1 రాత్రి నాటికి ప్రకాశం బ్యారేజీకి దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో 70 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఆ సమయంలోనే ఆ వరద ప్రవాహంలో గొల్లపూడి వైపు నుంచి బోట్లు కొట్టుకుని వచ్చాయి. అందులో రెండు బోట్లు అప్పటికే దిగువకు వదులుతున్న నీటితో పాటు కొట్టుకుపోగా.. మరో మూడు బోట్లు మాత్రం బ్యారేజ్ పిల్లర్లను ఢీకొట్టి అక్కడే పిల్లర్లు, గేట్ల మధ్య ఇరుక్కుపోయాయి. ఆ బోట్లు ఢీకొట్టడంతో పిల్లర్ నెంబర్ 69కి సంబంధించిన కౌంటర్ వెయిట్ (కాంక్రీట్ బీమ్) విరిగింది.ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌ను బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్లే కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలేనికి చెందిన కోమటి రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరూ వైఎస్సార్సీపీ వాళ్లంటూ టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే వైఎస్సార్సీపీ అసలు విషయాన్ని బయటపెట్టింది.కోమటి రామ్మెహన్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధి కోమటి జయరాం బంధువు. రెండో నిందితుడు ఉషాద్రి కూడా టీడీపీకి చెందిన వ్యక్తే. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ గెలిచాక విజయోత్సవ ర్యాలీలు సైతం ఆ బోట్లలో నిర్వహించారు కూడా. అయితే..ఘటన జరిగి ఇన్నిరోజులైనా పోలీసులు, ప్రభుత్వం, టీడీపీ అనుకూల మీడియా.. ఇలా అందరి ప్రకటనలు నిలిచిపోయిన ఆ మూడు బోట్లపైనే నడుస్తోంది. కేవలం వాటి రంగు ఆధారంగా కుట్రకోణంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించాలనే కుట్ర బలంగా నడుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో ఇదే కోణాన్ని హైలెట్ చేస్తున్నారు. మరి బ్యారేజ్ కౌంటర్ వెయిట్స్‌ను ఢీ కొట్టిన ఆ రెండు పడవలు ఎవరివి?.. ఇక్కడ దిగువకు కొట్టుకుపోయిన ఆ రెండు బోట్లను పోలీసులు గుర్తించలేదు. వాటి యాజమానులను అదుపులోకి తీసుకుని విచారించలేదు. వాస్తవానికి వరద ఉధృతిని ఆ బోట్లతో పాటు టూరిజంకు చెందిన చిన్నాచితకా బోట్లు కూడా కొట్టుకుపోయాయి. కానీ, ప్రభుత్వం కళ్లు మాత్రం ఆగిపోయిన ఆ బ్లూ రంగు బోట్ల మీదే ఉండిపోయింది. అందుకే ఇది వైఎస్సార్సీపీ పనేనంటూ అసత్య ప్రచారం చేస్తోంది. దానికి తగ్గ కోణంలోనే.. ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తు సాగింది. మరోవైపు.. వాస్తవాల్ని మరుగున పెట్టి విషప్రచారం కొనసాగిస్తూనే ఉంది ఎల్లో మీడియా. -
సజ్జలపై దుష్ప్రచారం.. తీవ్రంగా హెచ్చరించిన వైఎస్సార్సీపీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించిన మీడియా సంస్థపై, వాటి ఆధారంగా విమర్శలకు దిగిన తెలుగు దేశం పార్టీపై వైఎస్సార్సీపీ తీవ్రంగా మండిపడింది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించింది. ‘‘తనను చూసుకునేవారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే…, ఆ మహిళనుద్దేశించి మీరు నడిపిన కథలు, కథనాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మీ రాజకీయ ప్రత్యర్థులపైన, మీ వ్యతిరేక పార్టీలపైన మీరు ప్రయోగించే అనైతిక సూత్రమే “వ్యక్తిత్వ హననం’’. మీరు నమ్మిన సిద్ధాంతమే ఇది. ఇదీ చదవండి: నారా లోకేష్ లేడుగా.. అందుకే క్యాన్సిల్!.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంపేస్తే దాన్ని ప్రజాస్వామ్యమని రాశారు. బాలకృష్ణ తుపాకీతో కాల్పులు జరిపితే, ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ఫీజులను ఒక పారిశ్రామిక వేత్తతో కట్టించి, అది నారా లోకేష్ ప్రతిభ అన్నారు. మహిళలతో అసభ్యంగా తైతక్కలాడితే అవి చిన్ననాటి సరదాలు అంటారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోతే కనీసం వాయిస్ శాంపిల్ ఇవ్వకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు తప్పించుకున్నారు. మీలో నీతి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు, నైతికత ఇసుమంతైనా మీలో కనిపించడం లేదు అంటూ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచింది.‘‘తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి’’రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలా @JaiTDP?తనను చూసుకునేవారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే…, ఆ మహిళనుద్దేశించి మీరు నడిపిన కథలు, కథనాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మీ రాజకీయ… https://t.co/v8xK6Q3lqe— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
అదేనా మా తప్పు?: టీడీపీకి ఆర్కే రోజా సూటి ప్రశ్న
విశాఖపట్నం, సాక్షి: రుషికొండలో గత జగన్ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు.. అక్రమ కట్టడాలని ప్రచారం చేస్తున్న టీడీపీకి గట్టి ఎదురు దెబ్బలే తగులుతోంది. చంద్రబాబు మాదిరి జగన్ తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయలేదని.. ప్రజా ధనంతో పటిష్టమైన ప్రభుత్వ భవనాలే నిర్మించారని ఇటు వైఎస్సార్సీపీ, అటు నెటిజన్లు కౌంటర్లు ఇస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఈ అంశంపై స్పందించారు. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా.. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని టీడీపీ శ్రేణుల్ని గట్టిగా ప్రశ్నించారు. ‘‘విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా?. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా?’’ అంటూ సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం.. 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..?. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టం...ఇందులో అక్రమం ఎక్కడుంది..?. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...?. ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా..... హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..?. ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..?. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా...ఈరోజు విమర్శలు చేసేది..?. .. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?. జగనన్నపైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు...వెనకడుగు వేసేది లేదు.. జై జగన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. -
నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్ జాగ్రత్త!
పచ్చపార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని వారి సర్వేల్లోనే తేలిపోయింది. జనసేన-బీజేపీలతో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్ తో పరోక్షంగానూ కమ్యూనిస్టులతో సీక్రెట్ ఒప్పందాలతోనూ బరిలో దిగినా లాభం ఉండేలా లేదని తేలిపోయింది. దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటేశాయని అర్ధమైపోతోంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో వలంటీర్లపై కక్షసాధింపు కోసం తాము పన్నిన పాచిక తమనే లాగి లెంపకాయ కొట్టేయడంతో దవడ వాచిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో జనం అంతా జగన్ మోహన్ రెడ్డి యాత్రలోనే ఉన్నారని అర్ధం అయిపోయింది. మరేం చేయాలి? ఈ కష్టాల్లోనే చంద్రబాబు నాయుడికి ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది. దాంతో పాలక పక్షం ఓడిపోతోందంటూ ప్రచారం చేయించడానికి మౌత్ టాక్ మల్లిగాళ్లకు కిరాయి డబ్బులిచ్చి ఊళ్లపైకి వదిలారు. అయితే వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులుగా మాయదారి ముఠాలు ఊళ్లల్లో తిరుగుతున్నాయి స్టూవర్ట్ పురం దొంగల ముఠాలకన్నా ప్రమాదకరమైన ముఠాలవి.చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం..ఆయన రాజకీయ ప్రత్యర్ధులపై విష ప్రచారం చేయడం ఈ ముఠాల పని. దీనికోసం వీరికి కిరాయి చెల్లిస్తున్నారు. ఈ ముఠాల అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందంటే... తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. చంద్రబాబు నాయకత్వానికి కూడా. ఈ ఎన్నికల్లో కూడా ఓడి ఇంట్లోనే ఉండాల్సి వస్తే టీడీపీ దుకాణానికి తాళాలు వేయాల్సిందే. ప్రస్తుత వాతావరణం చూస్తోంటే ఈ సారి కూడా వైఎస్సార్సీపీ విజయమే ఖాయమని రక రకాల సర్వేలు చెబుతున్నాయి. టీడీపీకి ఈసారి మరింత ఘోర పరాభవం తప్పదని క్లారిటీ ఇస్తున్నారు అంతా. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల మనసులు మార్చడం తన వల్ల కాదని తెలిసిపోయింది. టీడీపీ గెలుస్తుందని చెప్పించుకున్నా ఎవరూ నమ్మరని అర్ధమైపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ క్షుద్ర ఆలోచనను మెదడులోంచి బయటకు తీశారు. ఆ ఆలోచన ఏంటంటే.. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుస్తందని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి. వైఎస్సార్సీపీ గెలవదని చెబితే ఏమైనా వర్కవుట్ అవుతుందేమో అని ఓ పుచ్చు ఐడియాను అమలు చేస్తున్నారు. జనం ఎక్కువగా తచ్చాడే కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రైళ్లల్లో కొన్ని గుంపులను పంపిస్తున్నారు చంద్రబాబు. ఈ గుంపుల పని ఏంటంటే.. మేం వైఎస్ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలమే కానీ.. ఈ సారి మా పార్టీ ఓడిపోయేలా ఉంది" అని ప్రచారం చేస్తున్నారు. అంటే మౌత్ టాక్ పబ్లిసిటీ అన్నమాట. దీనికి గానూ ఈ గుంపులకు రోజుకింత అని కిరాయి ముట్టజెబుతున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచులను ఆరు బయట పెయిడ్ ఆర్టిస్టులను మేపినట్లే..ఈ మౌత్ టాక్ మల్లిగాళ్లను ఎన్నికల వరకు మేపాలని డిసైడ్ అయ్యారు. పీకే ఫ్యామిలీపై విషం చిమ్మినోళ్లే.. జనం రద్దీగా ఉండే చోట వీళ్లు అమాంతం వచ్చి.. వాళ్లే మాటలు కలిపి ఈ సారి వైఎస్సార్సీపీ రాదండి అనేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ చచ్చు ఐడియా కూడా వర్కవుట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ గుంపుల్లో ఉండే వారంతా పచ్చ కార్యకర్తలే. గతంలో ఇటువంటి కార్యకర్తలే పవన్ కల్యాణ్ కుటుంబంపైనా విషం చిమ్మారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వచ్చినా మల్లిగాళ్లను పిలిపించి ఇటువంటి అసైన్ మెంట్లు ఇప్పిస్తారు చంద్రబాబు. మౌత్ టాక్‌తోనే పాలక పక్షాన్ని దెబ్బతీయాలన్న పిచ్చి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. అసలింతకీ ఈ అయిడియా రావడానికి కారణాలేంటి? చంద్రబాబు అంతగా ఓటమి భయంతో కుంగిపోడానికి కారణాలు ఉన్నాయి. జనం తమ వైపు లేరు. విజయం తమ వైపు లేదు. అధికారం తమకు దక్కేలా లేదు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ నాటి పూర్వ వైభవం వచ్చేలా లేదు. చంద్రబాబు, లోకేష్ లు సభలు పెడితే జనం కనపడ్డం లేదు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అని సభలు పెడితే ఇసకేస్తే రాలని జనంతో నేల కనపడ్డం లేదు. ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అధిపతులకు కళ్లు బైర్లు కమ్మి కళ్లముందు ఏమీ కనపడ్డం లేదు. తమ ఓటమి ఖాయమని స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా తమ పార్టీ కుప్పకూలిన రోజునే చంద్రబాబుకు అర్ధం అయిపోయింది. పార్టీయే కాదు తన సొంత నియోజక వర్గంలో తనకు కూడా ఓటమి తప్పదన్న భయం చంద్రబాబు గుండెల్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది. గుణపాఠం తప్పదా? పేరుకి ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. కాలం కలిసొచ్చినపుడు..తమ పెంపుడు మీడియా తమకి బాకా ఊదిన రోజుల్లో ఢిల్లీలో చక్రాలు తిప్పామని చెప్పించుకున్న చంద్రబాబు ఇపుడు ఏపీలో కాదు తన సొంత నియోజక వర్గంలోనే సైకిల్ చక్రాన్ని కూడా తిప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు. అది సరిపోదని బిజెపి నేతలు ఛీ ఛీ అంటోన్న కాళ్లబేరాలాడి పొత్తు పెట్టుకున్నారు. తాము ముగ్గురం కలిసి బరిలో దిగినా ఒరిగేదేమీ లేదని తేలడంతో కాంగ్రెస్ తో రహస్య పొత్తు పెట్టుకున్నారు. వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయం ఉండాలని 2014 నుంచి ఏపీలో ఏ ఎన్నికలోనూ బోణీ కొట్టని కమ్యూనిస్టులతో సీక్రెట్ డీల్స్ పెట్టుకున్నారు. అయినా వర్కవుట్ అయ్యే లా లేదని.. స్వయం ప్రకటిత మేథావులను తీసుకొచ్చి వారికి ఓ దుకాణం తెరిచి ఆ దుకాణం తరపున పాలకపక్షంపై విషం చిమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ దుకాణం తరపునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించారు. మండు టెండల్లో అవ్వా తాతలను మంచాలపై తీసుకెళ్లి పింఛన్లు ఇప్పించుకుంటోన్న దృశ్యాలు చూసి యావత్ ఆంధ్ర ప్రదేశ్ ... చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లతో పాటు వలంటీర్లపై ఫిర్యాదు చేయించి పింఛనుదార్ల పొట్ట కొట్టించిన నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు చెరుగుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లోనే విపక్ష కూటమికి గూబ గుయ్యిమనేలా గుణపాఠం చెబుతామని అంటున్నారు. దిక్కుమాలిన ఐడియాలు రక రకాల సర్వేలు ఏపీలో YSRCP అఖండ విజయం ఖాయమని తేల్చాయి. చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ అదే తేలింది. రెక్కలు ముక్కలు చేసుకుని.. సిగ్గు లజ్జ వదిలేసి బిజెపి నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నా తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేలడంతో చంద్రబాబుకు చలి జ్వరం వచ్చేసినట్లయ్యింది. ఏం చేయాలో పాలుపలోలేదు. ఎల్లో మీడియా ఇచ్చిన చచ్చు సలహాతో వాలంటీర్ల పై ఆంక్షలు విధిస్తే ఇపుడు 66 లక్షల మంది పింఛను దార్లు తనపై పీకలదాకా కోపంతో ఉన్నారని తెలిసి చంద్రబాబుకు నవ రంధ్రాల్లోంచి భయం కారిపోతోంది. అయితే కొద్ది మంది మనసుల్లో అయినా విషం చిమ్మితే ఆ మేరకు అయినా వైఎస్సార్సీపీ ఓట్లకు గండి కొట్టచ్చన్న చిల్లర ఐడియాతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు పేద ప్రజల తెలివితేటల ముందు ఎందుకూ పనికిరావంటున్నారు రాజకీయ పండితులు. అయితే ప్రస్తుతం ఏపీలో మెజారిటీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అయిదేళ్లుగా తమ ఖాతాల్లో నేరుగా జమ అయిన సంక్షేమ పథకాల నిధులు తమ ఇళ్లల్లో తెచ్చిన వెలుగులను తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను వారు మర్చిపోలేదు. తమ జీవితాలు ఇలానే హాయిగా కొనసాగాలంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి కొలువు తీరాలంటున్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర లో దారి పొడవునా లక్షలాదిగా తరలి వచ్చిన పేదలు ఈ విషయాన్నే ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టాయి. ఆ తర్వాత ఆయన బస్సుయాత్ర ఆరంభించగానే రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీస్తోన్న భీకర వేడి వాతావరణంలోనూ ఆరేళ్ల కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు మరోసారి జగన్ మోహన్ రెడ్డినే సిఎంని చేసుకోడానికి తామంతా సిద్ధం సిద్ధం అంటున్నారు. చంద్రబాబు నాయుడి తరపున పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరిగినట్లు.. వైఎస్సార్సీపీ విజయంపై దుష్ప్రచారం చేసే ముఠాలు ఎక్కడైనా కనిపిస్తే జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు పాలక పక్ష నేతలు. -
ఈనాడు అత్యుత్సాహం.. లోకేష్ సహా బకరాలైన యెల్లో బ్యాచ్
సాక్షి, గుంటూరు: తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పరు. మంచి చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. గత 58 నెలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఏరకంగా బద్నాం చేయాలి? అనే ఆలోచనతోనే కుట్రలు పన్నుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ తమ అసత్య ప్రచారాల మోతాదును ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది ? అంటూ ఈనాడు తాజాగా ఓ కథనం ప్రచురించింది. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, అలాగే బయటకు వచ్చిందని, భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలంటూ.. రకరకాల డైరెక్షన్లలో కంటెయినర్‌ను హైలెట్ చేస్తూ ఓ గాలి వార్త రాసేసింది. ఇంకేం ఐ-టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. తమకు చెందిన అకౌంట్లతో ఏవేవో ట్వీట్లు వేయించింది. దీనికి తోడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు.. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ సంగతేంటి?’’ అంటూ ఓ ట్వీట్ కూడా వేశారు. దానికి ఆ ఈనాడు పేపర్ కట్టింగ్ క్లిప్పులను జత చేశారు. అయితే.. బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామానులు తీసుకు వచ్చింది ఆ పాంట్రీవాహనం. ఏపీ16జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. పైగా ఈ ఉదయం ఆ వాహనం ఆళ్లగడ్డకు సైతం చేరుకుంది. అసలు అదేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. అత్యుత్సాహంతో ఆ కంటెయినర్ వాహనం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏదో తెచ్చిందంటూ నిస్సిగ్గుగా రాతలు రాయించారు రామోజీ రావు. ఈ క్రమంలో.. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి మకాం వేసిన దృశ్యాలు కనిపించాయి. ఆ పాంట్రీ వాహనం విజువల్స్, ఫోటోలు తీసినట్టు సీసీటీవీ పుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా... సదరు పోటోలను, వీడియోను వాడుకుని.. దురుద్ధేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసిన ఈటీవీపై చర్యలకు అధికారులు ఇప్పుడు సిద్ధం అయ్యారు. -
Ramoji, RK: సైకోల నుంచి సైతాన్లుగా ప్రమోషన్!
రోజు-రోజుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దిగజారిపోయి పాఠకులను హింసిస్తున్నాయి. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఈ రెండు సంస్థల యజమానులు రామోజీరావు, రాధాకృష్ణలు సైకోల నుంచి సైతాన్ల స్థాయికి ప్రమోషన్ పొందినట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రడ్డిపై విద్వేషంతో ఏపీపై పగబట్టి రాస్తున్న వార్తలు దారుణంగా ఉంటున్నాయి. ఈ శాసనసభ ఎన్నికల వరకు ఈ బాధ తప్పదని తెలిసినా, మరీ నీచంగా మారడం అత్యంత శోచనీయం అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈనాడు పచ్చి మోసపూరిత వార్తలు రాసింది. రామోజీరావు ఈ విధానం కరెక్టు అని భావిస్తే దానినే ధైర్యంగా రాసి బీజేపీని తీవ్రంగా విమర్శించాలి. కాని అంత ధైర్యం లేదు. పైగా వారు ఈయనకు పద్మ విభూషణ్ బిరుదు కూడా ఇచ్చారు కదా! దానికి సదా కృతజ్ఞతగా లొంగి ఉండాలి కదా! బీజేపీ తనకు ఎన్నికల నిధులు ఇవ్వడం లేదనుకున్నవారిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ వంటివాటిని ప్రయోగిస్తోందన్న ఆరోపణ వస్తోంది. అది నిజమా? కాదా? కొన్ని ఆంగ్ల పత్రికలలో ఏ ఏ కంపెనీలపై దాడులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏ కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయి. వాటిలో అత్యధిక భాగం బీజేపీకే దక్కాయా? లేదా? అన్నది ఆ వార్తల సారాంశం. బీజేపీకి మొత్తం విరాళాలలో ఏభై శాతం నిధులు దక్కితే ఆ తర్వాత టీఎంసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎమ్‌కే వంటి పార్టీలు ఉన్నాయి. తదుపరి వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ విరాళాలపై విశ్లేషిస్తే బీజేపీకి నిదులు ఇచ్చిన కంపెనీలు ఏవి? స్వచ్చందంగా ఇచ్చాయా? లేక భయపడి ఇచ్చాయా? అన్న అంశాలపై పరిశోధన చేయవచ్చు. కొన్ని ఆంగ్ల పత్రికలు ఈ విషయంలో వివరణాత్మక స్టోరీలు ఇచ్చాయి. ఈనాడు మీడియాకు, దాని అదినేత రామోజీరావుకు దేశం అంతా ఎటు పోయినా ఫర్వాలేదు. ఎవరికి ఎన్నివేల కోట్ల రూపాయల నిధులు వచ్చినా ఇబ్బంది లేదు.. కాని ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కు నిదులు వస్తే మాత్రం ఏదో ఒక చెత్తరాసి బురదచల్లుతారు. ఈ కధనంలో అవేవో కంపెనీలకు భూములు ఇచ్చి ఫేవర్ చేసినందుకే అవి విరాళాలు ఇచ్చాయని రాశారు. వైసీపీకి అందుకే ఇచ్చారని అనుకుందాం. మరి తెలుగుదేశంకు ఎందుకు విరాళాలు ఇచ్చారు. అధికారంలో ఉన్న వైసీపీకి 499 కోట్లు విలువైన బాండ్లు వస్తే, తెలుగుదేశంకు 320 కోట్ల మేర బాండ్లు వచ్చాయి. అంటే ఆయాకంపెనీలను తెలుగుదేశం బ్లాక్ మెయిల్ చేసి ఆ డబ్బును సంపాదించిందా? తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలోని కంపెనీలే ఎందుకు వచ్చాయి? చంద్రబాబు అంటే భయపడి ఇచ్చాయా? లేక ఆయన బెదిరించి సంపాదించారా? ఉదాహరణకు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిది అని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు కదా? వారు ఎక్కడ ఏ పరిశ్రమ పెడుతున్నా అటు తెలుగుదేశం కాని, ఇటు ఈనాడు రామోజీరావు కాని దానిని అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేసేవారు కదా! ఎంతో విషం చిమ్మేవారు కదా! అదే కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీకి నలభై కోట్ల విరాళం ఎలా అందింది. నిజంగానే అది వైఎస్సార్సీపీ సంబందించిన వారిది అనుకుంటే టీడీపీ తిరస్కరించి ఉండవచ్చుకదా! అంటే బ్లాక్ మెయిల్ చేసి ఆ కంపెనీ నుంచి విరాళం రాగానే టీడీపీ నోరు మూసేసుకుందా? బీజేపీకి రూ.8,250 కోట్ల బాండ్లు, కాంగ్రెస్‌కు రూ.1,951 కోట్లు, టీఎమ్‌సీకి రూ.1,716 కోట్లు, బీజేడీకి రూ.1,019 కోట్లు, డీఎంకేకి రూ.656 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. బీఆర్ఎస్కు రూ.1,408 కోట్ల బాండ్లు లబించాయి. చివరికి ఒక్క అసెబ్లీ సీటు మాత్రమే గెలుచుకున్న జనసేనకు కూడా 21 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి కదా! వీరందరికి ఏ రకంగా వచ్చాయో ఎందుకు విశ్లేషించలేదో రామోజీ చెప్పగలరా! టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన ఒక విశ్లేషణ ప్రకారం డీఎమ్‌కే , వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లకు వాటికి రావాల్సిన వాటా రాలేదని వెల్లడించింది. వైఎస్సార్సీపీ, డీఎంకేల కన్నా చిన్న పార్టీ అయిన బీఆర్ఎస్కు రెండు, మూడు రెట్ల నిదులు ఎందుకు వక్కువ వచ్చాయి? వైసీపీకి 23 మంది లోక్ సభ, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రావల్సినంత రాలేదన్నది దీని అర్ధం. అదే టైమ్‌లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 లోక్ సభ , ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్న టీడీపీకి 320 కోట్ల బాండ్లు ఎలా దక్కాయో చెప్పాలి కదా! కొన్ని కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు జరిగిన తర్వాతే అవి బీజేపీకి బాండ్ల రూపంలో నిదులు సమకూర్చిన విషయాన్ని కొన్ని ఆంగ్ల పత్రికలు సమగ్రంగా ఇచ్చాయి. ఇవన్ని పక్కనబెట్టి రామోజీరావు వైసీపీపైనే పడి ఎందుకు ఏడుస్తున్నారు? విశేషం ఏమిటంటే ఒకపక్క వైఎస్ జగన్మోహన్రడ్డి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను తరిమేశారని పదే, పదే రాస్తుంటారు కదా? అదంతా అబద్దమని శనివారం నాడు రాసిన పత్రికలో రాసిన ఈ బాండ్ల కధనంతో తేలిపోయింది. వైసీపీకి 96 కంపెనీల నుంచి విరాళాలు అందితే అందులో 26 విద్యుత్ కంపెనీలు అని ఈ పత్రిక రాసింది. అంటే కొత్తగా కేవలం విద్యుత్ రంగంలోనే 26 కంపెనీలు వస్తున్నట్లు ఒప్పుకున్నట్లే కదా? వారు విరాళం ఇచ్చారంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెడుతున్నట్లే కదా! 30826 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, ముఖ్యంగా సౌర, పవన, పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారని తెలిపింది. వీటి స్థాపనకు లక్ష ఎకరాలు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీకి ఉపయోగం లేదని మరో దిక్కుమాలిన రాత రాసింది. అదే వార్తలో మెగావాట్‌కు లక్ష రూపాయల చొప్పున గ్రీన్ టాక్స్ వస్తుందని తెలిపింది. విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులు దేనికి కూడా భూమిని ప్రభుత్వం కేటాయించలేదు. రైతుల నుంచి ఈ పరిశ్రమలవారు లీజుకు తీసుకుని ఏటా ఏకరాకు ముప్పైవేల రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని ఆదేశించింది. దీనివల్ల రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమలో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా రైతులకు మేలు చేస్తే, అదేదో తప్పు అయినట్లు ఈ పత్రిక దరిద్రపు గొట్టు వార్త రాసింది. ఈ భూములు ఇచ్చారు కనుక విరాళాలు పొందిందని నీచమైన విశ్లేషణ చేసింది. గ్రీన్కో కంపెనీకి 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇస్తే, ఆ కంపెనీ వైసీపీకి పది కోట్లు ఇచ్చిందట. ఏమన్నా మతి ఉండి ఈనాడు రామోజీ ఇలా రాస్తారా? కొన్ని వేల కోట్ల కంపెనీ కేవలం పది కోట్లు ఇస్తే అది కూడా ఫేవర్ చేసినట్లా? ఇక మెఘా కంపెనీ ఇచ్చిన 37 కోట్ల మీద కూడా ఇలాంటి చెత్తనే రాశారు. ఆ కంపెనీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కలిపి సుమారు 900 కోట్లు ఇచ్చింది. అదే వైసీపీకి 37 కోట్లే. కాని టీడీపీకి 25 కోట్లు ఇచ్చింది. దీనిపై ఈనాడు రాసిన వార్త చదివితే ఎంత బుద్ది, జ్ఞానం లేకుండా ఈ పత్రిక విషం చిమ్ముతోందా అనిపిస్తుంది. సీలేరు, పోలవరం హైడల్ ప్రాజెక్టులతో పాటు తాజాగా 12 వేల కోట్ల రూపాయల విలువైన ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఇచ్చినందుకే ఈ విరాళం ఇచ్చిందని రాశారు. మరి తెలుగుదేశం కూడా మరి పాతిక కోట్లు ఎందుకు ఇచ్చింది రాయలేదు. ఏమీ లేని జనసేనకు 21 కోట్లు ఎలా వచ్చాయని ఈ పత్రిక ప్రశ్నించలేదు. తెలుగుదేశంకు భారత్ బయోటెక్ పది కోట్లు, పశ్చిమ యుపి పవర్ ఇరవై కోట్లు, నాట్కో పద్నాలుగు కోట్లు, రెడ్డి లాబ్స్ పదమూడు కోట్లు ఎందుకు ఇచ్చాయో విశ్లేషించాలి కదా! అధికారం లేదు కనుక ప్రతిపక్షంగా ఉండి టీడీపీ వారిని బ్లాక్ మెయిల్ చేసిందని రామోజీ ఎందుకు చెప్పడం లేదు? ఇక టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన రాజ్యసభ సబ్యుడు సీఎమ్.రమేష్ కాంగ్రెస్, జేడీఎన్లకు కలిపి 40 కోట్లు ఎలా ఇచ్చారు? టీడీపీకి ఐదు కోట్లు ఎలా ఇచ్చారు. అంటే ఈ పార్టీలతో కూడా సంబంధ బాంధవ్యాలు మెయిటెన్ చేస్తున్నట్లే కదా! రామోజీ వికృత రాతలకు, పక్షపాత కధనాలకు ఇదో పెద్ద ఉదాహరణగా తీసుకోవాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Shameless TDP: దమ్ముంటే సమాధానాలు చెప్పాలి
ఆంధ్రప్రదేశ్‌లో విద్వేషపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ప్రతిపక్షాలు ఏకమై.. సంక్షేమ ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటున్న వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ, జనసేనకు బాకా ఊదే యెల్లో మీడియా పత్రికలు, పేపర్లు ఈ విషప్రచారానికి తమవంతు కృషి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పచ్చ మంద చేస్తున్న హడావిడికి హద్దు లేకుండా పోతోంది. మరోవైపు మౌత్ టాక్ పేరిట నడుస్తున్న యవ్వారం.. టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో CM జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరిగే కుట్ర.. నీచ రాజకీయాలకు పరాకాష్టగా నిలుస్తోంది. బస్సులు, రైళ్లు, ఆటోలు.. ఆఖరికి జనం గుమిగూడే టీ స్టాల్ లాంటి చోట్లా మౌత్ టాక్ పేరిట హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ మీద లేని ప్రజా వ్యతిరేకత చూపించేందుకు నానా తంటాలు పడుతోంది పచ్చ బ్యాచ్. అయితే ప్రశ్నించే ముందు.. తమ దగ్గరా వాటికి సమాధానాలు లేవనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతోంది. స్టేట్మెంట్ 1 : రాష్ట్రం నాశనం అయ్యిందట! సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని.. అప్పుల ఊబిలో ఉందని.. శ్రీలంక అయ్యిందని.. ఏవేమో ప్రచారాలు చేస్తారు. మరి రాష్ట్రం ఎలా నాశనం అయ్యింది? అది ఎలాగో చెప్పమని అడిగితే మాత్రం మౌనంగా ఉండిపోతారు స్టేట్మెంట్ 2 : ప్రజల్ని సోమరిపోతుల్ని చేశారంట! సంక్షేమ విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలానికి.. సీఎంగా జగన్ అందించిన సంక్షేమానికి అసలు పోల్చడానికి కూడా వీలు లేదు. అన్ని వర్గాలకు ఆసరాగా నిలిస్తే.. ఇదిగో ప్రజల్ని సోమరిపోతుల్ని చేశారనే మాట అంటారు. సంవత్సరానికి నీకు ఒక 15 వేలు ఇస్తా నువ్వు ఏమి పని చెయ్య కుండా ఉంటావా అంటే ఏమి పలకరు. స్టేట్మెంట్ 3 : ఎన్నికల్లో 160 సీట్లు టీడీపీవేనట! ఏపీలో పొత్తు రాజకీయాలకు ఓ నీతి అంటూ లేకుండా పోయింది. జనసేన టీడీపీ పోటీ స్థానాల కోసం కొట్లాడుకునే స్టేజ్‌కి వచ్చేశాయి. కుదరితే ఒకపార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేసైనా పోటీ చేయాలని ఆ రెండు పార్టీల వాళ్లు ప్రయత్నాలు చేయడం కొసమెరుపు. అసలు సైకిల్ సింబల్ మీద ఎన్ని పోటీ చేస్తారు అంటే చెప్పరు, పందెం ఉంటే పెట్టు అంటే పారిపోతారు. స్టేట్మెంట్ 4 : స్కూల్స్‌కి జగన్ రంగులు మాత్రమే వేశాడట! నాడు-నేడు ఆ కళ్లకు కనిపించడం లేదేమో. ఏపీలో స్కూల్ డ్రాపింగ్ సంఖ్య తగ్గి.. కేరళతో పోటీ పడే స్థాయికి చేరిందని గుర్తిండం లేదేమో. ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్లి విజిట్ చేద్దాము అంటే రాడు స్టేట్మెంట్ 5 : రోడ్లు నాశనం అయ్యాయట! గతంలో సంగతి ఏంటి? మరి 2014 - 2019 అంత బాగా రోడ్స్ వేస్తే ఎందుకు నాశనం అయ్యాయి? అసలు ఎవరి హయాంలో రోడ్స్ కోసం ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు? అంటే మాత్రం మాట్లాడరు. స్టేట్మెంట్ 6 : ఉద్యోగాల్లేవ్.. వలంటీర్ వ్యవస్థ దగ్గరి నుంచి పరిశ్రమల స్థాపన దాకా.. ఉద్యోగాల రూపకల్పనలో సీఎం జగన్ చొరవకు దేశమే హ్యాట్సాఫ్ చెప్పింది. అయినా కూడా జాబ్ క్యాలెండర్ పేరిట బాబు అనుచరులు చేసే విమర్శలకు అంతే లేకుండా పోతోంది. వచ్చిన ఉద్యోగాల గురించి మాట్లాడితే.. అక్కడి నుంచి జంప్ అవుతారు స్టేట్మెంట్ 7 : పరిశ్రమలు పారిపోతున్నాయట! ఏ పరిశ్రమలు.. ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాయి? ఎందుకు పారిపోయాయి? అంటే సమాధానం ఉండదు. ఆ సమాచారం ఇవ్వమన్నా.. ఇవ్వరు. తన హెరిటేజ్ మాత్రం పారిపోకుండా అలాగే ఉండిపోతుందా? మరి. స్టేట్మెంట్ 8 : ఐటీ కంపెనీలు రావట! ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ కంపెనీలు 2014-2019 ఎక్కువ వచ్చాయా ? 2019 - 2024 లో ఎక్కువ వచ్చాయా అంటే పలకడు, ఉలకడు, జారుకుంటారు స్టేట్మెంట్ 9 : రాజధాని ఏది? రాజధాని కోర్టులో ఉంది అంటే ఏమి పలకడు, సుప్రీం కోర్టుకి వెళ్లారు వాళ్ళు డిసైడ్ చేస్తారు.. కానీ, మాకు రియల్ ఎస్టేట్ అమరావతి కావాలి అంటారు. స్టేట్మెంట్ 10 : ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందట! 2014-2019లో రాష్ట్రానికి ఏమి చేశారు అంటే మాత్రం పలకరు. ఎందుకంటే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయలేనిది, ఈ ఐదేళ్లలోనే సీఎం జగన్ ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చూపించారు కాబట్టి. ఇదీ చదవండి: కుట్రదారు.. లబ్ధిదారు అంతా చంద్రబాబే! -
బాబు,పవన్‌లే అలా రాయిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు, సాక్షి: ప్రజారంజకమైన పాలన అందిస్తున్నాం కాబట్టే వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు ఉందని.. ఈసారి ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి.. తనపైనా యెల్లో మీడియాలో వస్తున్న కథనాలపైనా ఈ సందర్భంగా ఆయన స్పందించారు. ‘‘ఎవరి కోసమూ నేను షర్మిలతో రాయబారం చేయటం లేదు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం వలన ప్రజలు మాకు నీరాజనం పలుకుతున్నారు. ఇది చూడలేక ఎల్లోమీడియా వారిష్టం వచ్చినట్టు రాస్తున్నారు. రెండు మూడు వారాలకొకసారి నేను హైదరాబాదు వెళ్తుంటా. కుటుంబ సభ్యులను కలుస్తుంటా. విజయమ్మ అమెరికా నుండి వచ్చాక వెళ్లి కలిశాను. కానీ యెల్లో మీడియా రాతలు పరాకాష్టకు చేరాయి. కుటుంబ సభ్యులనూ కూడా బజారుకీడ్చే పని చేస్తోంది. చంద్రబాబు, పవన్ అందరూ కలిసి కుట్రలు పన్ని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారు. షర్మిళ మూడేళ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టారు. ఈమధ్య కాంగ్రెస్‌లో చేరుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దానిపై మాకు క్లారిటీ లేదు. షర్మిళ కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. మాకు ప్రజా మద్దతు ఉంది కాబట్టి. ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో పేదల కుటుంబాల్లో మార్పు వచ్చింది. మాకు ప్రజలే దేవుళ్లు అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. దాడి అయినా వినలేదు ఇక.. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 175 స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి. ‘‘సీట్ల విషయంలో అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కోచోట సీటు ఇవ్వలేకపోతే వేరేది చూస్తామని కూడా చెప్తున్నాం’’ అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్సీపీకి దాడి వీరభద్రం రాజీనామా చేసిన పరిణామంపైనా సుబ్బారెడ్డి స్పందించారు. సీట్ల విషయంలో అందరికీ ప్రాధాన్యతలు ఉంటాయి. అనకాపల్లిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఓపిక పట్టాలని దాడి వీరభద్రంతో మాట్లాడాం. అయినా వినకుండా ఆయన రాజీనామా చేశారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూడా మార్పులు ఉంటాయి అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: పిల్లలు తినే తిండిపైనా ఈనాడు విషం! -
జగనన్న గోరుముద్ద పైనా విషమేనా రామోజీ!?
గుంటూరు, సాక్షి: పేదలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కానీ, యెల్లో మీడియా మాత్రం విషపు రాతలతో ద్వేషం ప్రదర్శిస్తోందని ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి మండిపడ్డారు. తాజాగా జగనన్న గోరుముద్దపై ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ‘‘జగనన్న గోరుముద్ద మీద విషం చిమ్మడం ఘోరమైన విషయం. గోరుముద్దకు బడ్జెట్ పెంచడంతో పాటు మంచి మెనూను రూపొందించాం. ప్రతీ రోజూ వెరైటీ మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. ఈ మెనూని రూపొందించింది స్వయంగా సీఎం జగనే. ఈ పథకం విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. నేను స్వయంగా అనేక గ్రామాల్లో నేరుగా విద్యార్ధులను అడిగి తెలుసుకున్నా.. .. గతంలో వంట ఖర్చులకు రూ. 3.50 పైసలిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.6.50 రూపాయలిస్తోంది. దేశంలో ఎక్కడా ఏ పాఠశాలలోనూ లేనట్లుగా గోరుముద్ద ద్వారా మంచి భోజనం విద్యార్థులకు అందిస్తున్నాం. గతంలో 32 లక్షల మందికి మాత్రమే భోజనం పెట్టేవారు. మా ప్రభుత్వంలో 43 లక్షలకు పైచిలుకు విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. విద్యార్ధులకు మంచి భోజనం అందించేందుకు సంవత్సరానికి రూ. 1,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయినా అసత్యపు రాతలతో విద్వేషం ప్రదర్శించడం సరికాదని అన్నారాయన. ఇంకా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఏమన్నారంటే.. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థులు తినే తిండిపైనా రామోజీ విషం చిమ్ముతున్నాడు. మీడియాను అడ్డంపెట్టుకుని వారి కడుపు కొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో విద్యార్థులకు ఖర్చు చేసిన దానికంటే, జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక, 50-60 శాతం నిధులు పెంచి, 16 రకాల మెనూతో 43 లక్షలకు విద్యార్థులకు(గతంలో కంటే11లక్షల మంది విద్యార్థులకు అదనంగా) శుచి, శుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందిస్తుంటే, పనిగట్టుకుని రామోజీ కట్టకథలు రాయడంపై పార్థసారథి తూర్పారబట్టారు. ఎల్లోమీడియా పైత్యపు రాతలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందజేసే జగనన్న గోరుముద్ద కార్యక్రమం చాలా అద్భుతంగా సాగుతోంది. రోజుకో మెనూతో, శుచి, శుభ్రమైన పౌష్టిక ఆహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన మంచి కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని గోరుముద్ద కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు మధ్యాహ్నభోజనంగా నూకలతో వండిన అన్నం పెట్టేవారు. ఉడికీ ఉడకని అన్నంతో, సాంబారు పేరుతో పల్చటి నీళ్లచారుతో మమ అనిపించేవారు అలాంటిది, మా ప్రభుత్వం ఇప్పుడు నాణ్యమైన, విట్‌మిన్‌లతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్‌ను వాడుతున్నామని అందరూ గమనించాలి. పిల్లలకు పాఠశాలల్లో బలవర్థకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తుంటే.. ఎల్లోమీడియా మాత్రం ప్రభుత్వంపై పనిగట్టుకుని కల్పిత కథనాల్ని రాస్తుంది. దేశానికే ఆదర్శమైనటువంటి ఒక మంచి కార్యక్రమంపై ఎల్లోమీడియా పైత్యం చూపించే రాతలు రాయడం ఎంతమాత్రం తగదు. 16రకాల మెనూతో వారానికి 5 రోజులు గుడ్డు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగానే ప్రతీ రోజూ రాగిజావతో సహా రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నాం. ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించడం ద్వారా విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు, ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో బెల్లంతో కూడిన రాగిజావను విద్యార్థులకు అందిస్తున్నాము. మిగిలిన మూడురోజులు గోరుముద్దలో భాగంగా చిక్కీలను అందజేయడం జరుగుతోంది. ప్రతీరోజూ స్వీట్, ఆకుకూర పప్పు, సాంబార్‌లాంటి రుచికరమైన పదార్థాలతో పాటు వారానికి ఐదురోజుల పాటు ఉడికించిన కోడిగుడ్డు కూడా విద్యార్థులకు అందిస్తున్నాం టీడీపీ హయాంలో కంటే 50శాతం పెంపు ఖర్చుతో.. కూరగాయల ధరలు పెరిగిన క్రమంలోనూ ప్రభుత్వం మరింత శ్రద్ధగా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా విద్యార్థులకు వడ్డించే పదార్థాల్లో రాజీ పడటం లేదు. గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం విద్యార్థికి రూ.3.50పైసలు ఇస్తే.. మా ప్రభుత్వం మాత్రం దాన్ని రూ.6.50పైసలకు పెంచింది. అదేవిధంగా వంటసిబ్బందికి అందజేసే గౌరవ వేతనం విషయంలో గత ప్రభుత్వం కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చింది. అదే మా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రూ.3వేలు చేసిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక తరగతుల్లో చదివే ప్రతీ విద్యార్థికి భోజన ఖర్చు రూ.11.26పైసల నుంచి 50 శాతం పెంచి రూ.16.07పైసలు ఖర్చు చేస్తున్నారు. అదే ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు గత ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తం కంటే 50 నుంచి 60 శాతం పెంచి, ప్రతి విద్యార్థికి రూ. 18.75, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ. 23.40 చొప్పున ఆహార నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అందజేస్తున్నాం. వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు గత ప్రభుత్వహయాంలో వంట ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల నుంచి ఏడాది దాటినా వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించే పరిస్థితిలేదు. అదే జగన్ గారు ప్రభుత్వం వచ్చినదగ్గర్నుంచీ గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మూడురెట్లు అధికంగా వంటసిబ్బందికి గౌరవ వేతనాలు పెంచడంతో పాటు వంట ఏజెన్సీలకు క్రమం తప్పకుండా సకాలంలో బిల్లుల్ని చెల్లిస్తున్నాం 11 లక్షల విద్యార్థులకు అదనంగా.. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 32 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అందజేస్తే.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు 43 లక్షల 46వేల 299 మందికి జగనన్న గోరుముద్దను అందజేస్తున్నాం. అంటే, గతం కన్నా 30 నుంచి 40 శాతం విద్యార్థులు పెరిగిన సంగతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి చేసిన సగటు వ్యయం రూ.450 కోట్లు అయితే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులు దాదాపు రూ.7,244 కోట్లకు పైగా ఉన్నాయి.2023-24 బడ్జెట్ లోనూ రూ. 1,689 కోట్లు గోరుముద్ద కోసం ప్రభుత్వం కేటాయించింది. అంటే పేద పిల్లల ఆహారంపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఎల్లోమీడియా రాతల్ని అంతా ఖండించాలి జగనన్న గోరుముద్ద లాంటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తోన్న ప్రభుత్వాన్ని అభినందించకపోగా.. ప్రభుత్వంపైనే ఎల్లోమీడియా విషం చిమ్ముతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరూ ఇలాంటి రాతల్ని హర్షించరు. అమ్మ ఒడితో పాటు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెనలాంటి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ.. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడంలో జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం అందరి మన్ననలు అందుకుంటోంది. జగన్‌గారు రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా ఇప్పటికే డీబీటీ ద్వారా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ.2.42 లక్షల కోట్లల్లో దాదాపు 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక, మంచి పరిపాలన అందజేస్తోన్న ప్రభుత్వంపై విషం చిమ్మే విధంగా ఎల్లోమీడియా రాతలు రాయడాన్ని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరుతున్నాను. -
‘నా భర్త ఆత్మహత్యాయత్నంపై రాజకీయాలొద్దు’
సాక్షి, అనంతపురం: ఎల్లో మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. జగనన్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాల్లో.. బాబు అనుకూల మీడియా సంస్థలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. తాజాగా టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం కేసును ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశాయి. అయితే ఆ ఆరోపణల్ని బాధిత కుటుంబమే స్వయంగా ఖండించింది. వేతనం రాలేదని.. సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని మల్లేష్ భార్య శివలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ ఖండించారు. ‘‘ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తిలేదు. జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నా భర్త డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశారు. నా భర్త ఆత్మహత్యాయత్నంపై దయచేసి రాజకీయాలు చేయొద్దు’’ అంటూ ప్రతిపక్ష పార్టీలను కోరారామె. మరోవైపు బావ ఆదినారాయణ కూడా సోషల్ మీడియాలో, యెల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం జగన్ (CM Jagan) మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ ఈనాడు, యెల్లో మీడియాలు హైలెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లేష్ కుటుంబం ఈ ప్రచారాన్ని ఖండించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పందేలతో లక్షలు పొగొట్టుకోవడంతో పాటు కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్‌ల్లో, యాప్‌ల్లో రుణాలు తీసుకున్నారు. ఈ రుణ భారాలు భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
చంద్రబాబు, రామోజీ, ఎల్లో బ్యాచ్ సమర్పించు.. 'అసత్యం.. నిత్యావసరం'
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ చేరుతున్న సంక్షేమాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని టీడీపీ–ఈనాడు సహిత ఎల్లో కూటమి సరికొత్త కుట్రలకు తెరతీస్తోంది. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పెరిగిన ధరలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారానికి దిగుతున్నారు. మరోవైపు వారు చేస్తున్న ప్రచారాన్నే ‘ఈనాడు’ కూడా పతాక శీర్షికల్లో అచ్చువేస్తోంది. నిజానికి ధరల పెరుగుదల చాలావరకూ రవాణా రంగంపై ప్రభావం చూపించే ముడి చమురు, బొగ్గు, గ్యాస్ వంటి ఇంధనాలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కేంద్రం నియంత్రణలోనే ఉంటాయి. కొన్నేళ్లుగా వీటి ధరలు అటు అంతర్జాతీయంగా... ఇటు దేశీయంగా పెరుగుతూనే వస్తుండటంతో వీటి ప్రభావం వల్ల నిత్యావసరాల ధరలూ పెరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిణామం. ఇవన్నీ రామోజీరావుకు తెలియక కాదు. ఆయన అజెండా వేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనంలో ఏదో ఒకరకంగా వ్యతిరేకత పెంచేసి... అర్జెంటుగా చంద్రబాబును గద్దెనెక్కించేయాలన్నది ఆయన ముప్పొద్దులా కంటున్న కల. దానికోసమే ఈ ప్రయాస అంతా. వాస్తవానికి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా చాలా సరుకుల ధరలు మన రాష్ట్రంలోనే తక్కువ. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చినా అదే పరిస్థితి. కాకపోతే బాబును గద్దెనెక్కించటమే లక్ష్యంగా రోజూ ‘ఈనాడు’లో ప్రతి పేజీలోనూ విషం కక్కుతున్న రామోజీరావుకు వాస్తవాలతో పనే లేదు. అందుకే ధరల విషయంలోనూ అదే చేశారు. ప్రజాదరణలో ‘ఈనాడు’దీ బాబు పరిస్థితే! అబద్ధాల చంద్రబాబును గత ఎన్నికల్లో జనమంతా ఛీకొట్టి ఓడించినట్లే రామోజీరావు పత్రిక ‘ఈనాడు’నూ పాఠకులు ఛీకొడుతున్నారు. ఈ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో ప్రజలకు మేలు జరుగుతున్న పనులను కూడా వక్రీకరిస్తూ కాలకూట విషం చిమ్మటాన్ని జనం సహించటం లేదు. దీంతో చంద్రబాబు మాదిరిగానే ‘ఈనాడు’ ప్రజాదరణ కూడా దారుణంగా పడిపోయింది. పత్రికను కొనుక్కుని చదివేవారు చాలామంది దాన్ని మానేశారు. ఎన్నికల వేళ పాఠకులు తగ్గిపోతే ఎలాగని మథనపడ్డ రామోజీరావు... చివరకు రాష్ట్రంలో ఇంటింటికీ ‘ఈనాడు’ను ఫ్రీగా పంచిపెట్టడం మొదలెట్టారు. పత్రికను కొనుక్కుని చదివేవారికి ఈ సంగతి తెలిసి... ఎలాగూ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని సబ్్రస్కిప్షన్లకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఈ పరిస్థితి అంతకంతకూ పెరుగుతోందని, కొనుక్కుని చదివేవారంతా మానేసి ఫ్రీగా అడుగుతున్నారని, దీన్ని తట్టుకోవటం కష్టమవుతోందని ‘ఈనాడు’ వర్గాలే వాపోతుండటం గమనార్హం. దేశ సగటు ధరలతో పోలిస్తే ఏపీలోనే తక్కువ.. నిత్యావసర సరుకుల ధరలకు వస్తే... దేశ వ్యాప్తంగా సగటు ధరలతో ఆంధ్రప్రదేశ్‌లోనే రేట్లు తక్కువగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలంగాణలోనూ ఒకటి రెండు మినహా నిత్యావసరాల రేట్లు అధికంగానే ఉన్నాయి. జాతీయ స్థాయిలో కిలో సాధారణ బియ్యం రూ.43.17 ఉంటే ఏపీలో స్థానికంగా 39.84గా ఉంది. జాతీయంగా ధరలు ఏపీ కంటే సన్‌ఫ్లవర్ నూనెపై రూ.11.61, వేరుశనగా రూ.20, పామాయిల్ రూ.10, ఉల్లి రూ.6, టామాటా రూ.10 ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో చూసినా కందిపప్పుపై రూ.14.65, మినపప్పు రూ.11, పెసరపప్పు రూ.5.33, శనగపప్పు రూ.5.42, ఉల్లి రూ.6.74 రేటు ఎక్కువే. కానీ, రామోజీరావు ఈ ప్రభుత్వం వచ్చాకే రేట్లు పెరిగిపోతున్నట్టు తప్పుడు కథనాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డిమాండ్, సప్లై ఆధారంగా మార్కెట్లో రేట్ల హెచ్చుతగ్గులు సహజం. దీనికి తోడు ఏటా పంటలకు మద్దతు ధర పెరుగుతోంది. ఆ ప్రభావం కూడా మార్కెట్‌పై పడుతోంది. ఈ వాస్తవాలను దాటిపెట్టి ‘ఈనాడు’ సోమవారం నాడు ‘నిప్పుల్లా నిత్యావసరాలు’ అంటూ ప్రజలను మభ్యపెట్టే కథనాన్ని వండివార్చటం వెనక పెద్ద కథే ఉంది. ఎందుకంటే ‘ఈనాడు’ కథనానికి ముందే టీడీపీ డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు జనమంతా తమకు అందుతున్న పథకాలపై సంతృప్తిని వ్యక్తం చేయటంతో... పథకాల ద్వారా అందిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరగటం వల్ల కోల్పోతున్నారంటూ వారి మెదళ్లలో విషం నింపే ప్రయత్నం చేశారు ఎల్లో బ్యాచ్. దీన్ని సహించలేక చాలాచోట్ల జనం ఎదురుతిరిగారు. అలాంటి సంఘటనే ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ చోటు చేసుకుంది. దీంతో తమ కుట్రలో భాగంగా సోమవారం ‘ఈనాడు’లో కథనాన్ని రాయించింది ఎల్లో ముఠా. దీన్నే సోషల్ మీడియాలోనూ పలువురు టీడీపీ బ్యాచ్ వైరల్ చేయటం గమనార్హం. అన్ని రాష్ట్రాల్లోనూ ధరలు పెరిగాయనే వాస్తవాన్ని కావాలని మరుగునపరిచి వైఎస్సార్సీపీ విధానాల వల్లే పెరుగుతున్నాయని ప్రచారం చేస్తుండటంపై టీడీపీలోనే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు చెప్పుకునేందుకు తమ పార్టీ తరఫున ఏ అంశాలు దొరక్క చివరికి ఇలాంటి అపోహలపైనే తమవారు ఆధారపడ్డారంటూ ఓ టీడీపీ కార్యకర్తే అసహనం వ్యక్తం చేయటం గమనార్హం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి... ఏ వస్తువు ధరలైనా దెబ్బతింటే రైతును ఆదుకోవటంలోను... ధరలు పెరిగిపోతే వినియోగదారుకు సాంత్వన కలిగించటంలోను దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఏపీ ముందుంటోంది. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే, మార్కెట్లో జోక్యం చేసుకుని ఈ నిధితో వాటిని కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. ఊహించని రీతిలో ధరలు పెరిగినపుడు ఆ సరుకుల్ని అందుబాటు ధరల్లో వినియోగదారుకు అందించటానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వంటనూనెల ధరలు కొండెక్కిన పరిస్థితుల్లో వాటిని రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరలకే విక్రయించింది. ఇక రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి సీఎం యాప్ ద్వారా ప్రతిరోజు గ్రామ స్థాయిలో మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తోంది. ఇలా పొగాకు సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలకు ధరలు పతనమైన ప్రతిసారీ జోక్యం చేసుకుని మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.7712 కోట్ల విలువైన 21.55 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిజానికి టీడీపీ తన ఐదేళ్ల పాలనలో ఇలా ధరలు పతనమైన సమయంలో రైతుల కోసం వెచ్చించింది కేవలం రూ.3322 కోట్లు. ధరల నియంత్రణలో భాగంగా తాజాగా రైతు బజారాల్లో సుపర్ఫైన్ బియ్యం, కందిపప్పు విక్రయాలకు ఈ ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 8,990 క్వింటాళ్ల బియ్యం, 1206 క్వింటాళ్ల కందిపప్పును విక్రయించారు. ఈ మూడేళ్లలో రూ.69.10 కోట్లు విలువైన 9462.49 టన్నుల ఉల్లిపాయలను సేకరించి రైతు బజార్లలో విక్రయించారు. దేశం కంటే మిన్నగా.. ఏపీలోనే మిల్లెట్ల పంపిణీ ప్రస్తుతం రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలకు ఎమ్మెస్పీ కంటే మార్కెట్ రేటు ఎక్కువగా ఉంది. ఆరోగ్య రీత్యా ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు చిరుధాన్యాలను ఆహారం తీసుకోవడంతో డిమాండ్ పెరిగింది. అయితే వినియోగానికి తగినంత పంట ఉత్పత్తులు లేకపోవడంతో చిరుధాన్యాల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పేదలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ ద్వారా జొన్నలు, రాగులు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మే నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రలో పైలెట్ ప్రాజెక్టుగా కార్డుదారులకు గరిష్టంగా రెండు కిలోల చొప్పున జొన్నలు, రాగులను సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 3,303 టన్నుల జొన్నలు, 13,052 టన్నుల రాగులను అందించింది. చిరు ధాన్యాలకు మార్కెట్లో మంచి రేటుండటంతో కావలసిన సరుకును సేకరించడం సవాల్‌గా మారింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం రైతులను చిరుధాన్యాల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోంది. రైతులు పండించిన పంటను స్థానికంగానే పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసి వాటిని పీడీఎస్‌లో ప్రజలు అందించేలా కార్యచరణ రూపొందింది. ఈ ఖరీఫ్‌లో జనవరి నుంచి జొన్నలు, రాగులను నేరుగా రైతుల నుంచి సేకరించనుంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరల జాబితాలో లేని కొర్రలను సైతం రాష్ట్రంలో రైతుల నుంచి సేకరించేలా ప్రత్యేక అనుమతులు సైతం తీసుకుంది. తొలిసారిగా కొర్రలను మద్దతు ధరకు అవసరమైతే మార్కెట్ ధరకు కొనుగోలు చేయనుంది. కిలో రూ.67కే కందిపప్పు.. పేదలకు నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసరాలు అందిస్తోంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రైస్ కార్డులుంటే రేషన్ తీసుకునే వారి శాతం 90కిపైగా చేరింది. మార్కెట్లో లభించే సన్నబియ్యం మాదిరే రేషన్ బియ్యం ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు వాటిని ఆహారంగా వినియోగిస్తున్నారు. దీనికి తోడు కందిపప్పు సైతం సబ్సిడీపై కిలో రూ.67కు పంపిణీ చేస్తోంది. గడిచిన 4 నెలలుగా సరుకు అందుబాటులో లేకపోవడంతో సరఫరాల అవరోధం ఏర్పడింది. తాజాగా హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ ద్వారా పౌరసరఫరాల శాఖ సుమారు 10వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. దశల వారీ సరఫరాలో భాగంగా నవంబర్ నుంచే సరుకును అందించడంతో కార్డుదారులకు ఊరటలభించింది. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కార్డుదారులుందరికీ పంపిణీ చేయనుంది. ఇకపై కందిపప్పు సరఫరాలో జాప్యం లేకుండా డిసెంబర్ చివరినాటికి నుంచి స్థానిక రైతుల ద్వారా కందులు కొనుగోలు చేయడంతో పాటు ప్రాసెసింగ్ చేసి అందించనుంది. అంతేకాక కేంద్రం కంటే మిన్నగా గడిచిన మూడు నెలల నుంచి పౌరసరఫరాల శాఖ ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరాల చేస్తోంది. కేంద్రం మాత్రం తాజాగా భారత్ బ్రాండ్ పేరుతో కిలో గోధుమ పిండిని రూ.27.50 ఇస్తున్నట్టు ప్రకటిచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.16కే అందిస్తోంది. ఇప్పటి వరకు 10,625 టన్నులు పంపిణీ చేయగా డిసెంబర్‌లోనూ 4వేల టన్నులకు పైగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాకపోతే... వైఎస్ జగన్ ప్రభుత్వంపై విష ప్రచారమే నిత్యావసరంగా మారిపోయిన ‘ఈనాడు’కు ఈ వాస్తవాలతో పనేముంది!!. -
ఈనాడు కథనంపై ఏపీ గనుల శాఖ ఆగ్రహం
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై ఈనాడు దినపత్రిక ఇచ్చిన కథనంపై ఏపీ రాష్ట్ర గనుల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఒక పారదర్శక విధానం రూపొందించి అమలు చేస్తుంటే.. అపోహ, అసత్య కథనాన్ని ఈనాడు ఇచ్చిందని పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీ ఇసుక ఆపరేషన్స్‌పై ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంవోనా?’’ అనే శీర్షికన ఓ కథనం ఈనాడులో ప్రచురితమైంది. అయితే అందులో ఉన్నవి అవాస్తవాలేనని వీజీ వెంకటరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థం లేని రాతలు రాయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇసుక విధానాన్ని పారదర్శకంగా రూపొందించి మరీ అమలు చేస్తోందని, పొంతనలేని అంశాలతో ఈనాడు అసత్య కథనాన్ని వండివార్చిందని అన్నారాయన. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు గతంలో టెండర్లు నిర్వహించాం. ఈ టెండర్లలో జెపీ సంస్థ సక్సెస్ ఫుల్ బిడ్డర్ గా ఎంపికయ్యింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇసుక ఆపరేషన్స్ జరిగాయి. తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ చేస్తోంది. మరోవైపు కేంద్రప్రభుత్వరంగ సంస్థ MSTC ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. అప్పటి వరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాం. .. వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఎండాకాలంలో జేపీ సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్‌లలో నిల్వ చేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. అలాగే తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్‌ల్లో పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఇసుక తవ్వకాలకు సిద్దమవుతోంది. కానీ, దీనంతటిని వక్రీకరిస్తూ.. బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంవో నుంచి మాకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు దినపత్రిక కథనాన్ని ప్రచురించడం ఎంత వరకు సమంజసం?’’ అని ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. .. ‘ఇసుక ఆపరేషన్స్‌కు గనులశాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయి. మైనింగ్ రంగంలో ఉన్నప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. అటువంటిది సీఎంవో అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎలా అంటారు?. ఒక అంశంపై వార్తాకథనం ప్రచురించే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇటువంటి అసత్య కథనాలను ఎలా ప్రచురిస్తారు? ’అని ఈనాడుపై ఆయన మండిపడ్డారు. ‘‘గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకుంది. ఆరోజు ఈనాడు దినపత్రికకు ఆ అక్రమాలు కనిపించలేదా? జగన్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఇసుక విధానంను తీసుకువచ్చారు. ప్రజలకు అందుబాటు ధరలో.. పైగా వర్షాకాలంలోనూ ఇసుక కొరత లేకుండా ఇసుకను అందిస్తున్నారు. ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, మినిరత్న గా గుర్తింపు పొందిన MSTC ద్వారా ఇసుక టెండర్లు నిర్వహణ జరగుతోంది. ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అయితే వాస్తవాలు ఇలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, జిల్లా కో ఇంఛార్జిని నియమించారని.. ఈనాడు పత్రిక తన ఊహలన్నింటినీ పోగు చేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించింది. ఇకనైనా మరోసారి ఇలాంటి కథనాలు ఇస్తే.. ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రకటనలో రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. -
జగన్ పాలన చూసి రోజూ ఏడుపేనా?
ఈనాడు మీడియాకు పిచ్చి రోజు రోజుకి ముదురుతోంది. అది పరాకాష్టకు చేరుతోంది. కర్నాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో శ్రీసత్యనాయి జిల్లాకు చెందిన పదిమంది మరణించారు. అది దురదృష్టకరమైన ఘటన. అందుకు ఎవరమైనా బాధపడతాం. కానీ ఈనాడు మీడియా మాత్రం అలాంటి ప్రమాదాలు జరుగుతున్నందుకు రాక్షసానందం పొందుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లను తన దిక్కుమాలిన రాజకీయాలకు, తను జాకీ లేసి లేపుతున్న తెలుగుదేశం పార్టీకి ఎంతోకొంత ఉపయోగపడేలా చేయవచ్చన్నది వారి ఆలోచన. అక్టోబర్ 27వ తేదీన ఇక్కడ ఉపాధి ఉంటే ఈ ఘోరం జరిగేదా! అనే కథనాన్ని ఈనాడు పత్రిక బానర్గా వండి వార్చింది. తద్వారా ఏపీ జనాలు పొద్దున లేవగానే ఇలాంటి చెత్త వార్తలు చూడవలసి వస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగింది డ్రైవర్ పొరపాటువల్ల. నిద్ర మత్తులో ఉండడం వల్ల. ఇందులో ఏపీకి సంబంధించినవారితో పాటు కర్నాటక వాసులు కూడా ఉన్నారు. ఉపాధి లేక వలస వెళుతూ ఏపీవాళ్లు ప్రమాదంలో మరణిస్తే మరి కర్నాటక వారు ఎందుకు మృతి చెందినట్లు? అర్థం,పర్థం లేని వార్తలు రాసి ఏపీ ప్రజలను మోసం చేయాలన్నదే వారి ఉద్దేశం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాలు కరువుకు గురయ్యేవే. కాదనం. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతానికి కొంత మేర నీరు ఇచ్చిన సంగతి మర్చిపోకూడదు. అయినా అది సరిపోకపోయి ఉండవచ్చు. గత నాలుగేళ్లుగా వర్షాలు బాగానే పడ్డాయి. పంటలు పండాయి. అప్పుడు ఎవరూ వలస వెళ్లలేదని ఈనాడు ఎప్పుడైనా రాసిందా? మరి చంద్రబాబు టైమ్ లో దాదాపు ఐదేళ్లు కరువు తాండవించిందే. అప్పుడు ఎందుకు ఇలా రాయలేదు?. హిందుపూర్ తదితర ప్రాంతాల నుంచి ఏదో లెక్కగట్టినట్లు ఇన్నివేల మంది నిత్యం బెంగుళూరు,తదితర ప్రాంతాలకు వెళతారని రాసింది. అంటే ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన విషయమా? ఎప్పటి నుంచో ఉన్నదే కదా!కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ టైమ్ లోనే ఇలా జరుగుతుందని రాయడం ఎంత దుర్మార్గం. ✍️చంద్రబాబు టైమ్ లో కరువు ప్రాంతాల నుంచి వందలాది మంది కేరళలో భిక్షాటనకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని బాధ్యుడ్ని చేస్తూ ఎందుకు వార్తలు రాయలేదు. పైగా అప్పట్లో కరువు వల్ల స్వస్థలాలు వీడినవారిని చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి రప్పించిందని పచ్చి అబద్దం రాయడం. అసలు వారంతా ఎందుకు అప్పుడు వెళ్లవలసి వచ్చింది?. ప్రజలు ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి పనులు చేసుకోవచ్చు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పం నుంచి నిత్యం వేలాది మంది బెంగుళూరు వెళ్తుంటారు. మరి కుప్పంలో ఎందుకు ఉపాధి కల్పించలేకోయారు? చంద్రబాబు వైఫల్యం చెందినట్లు ఎందుకు రాయలేదు. సమస్యను రాయడం వేరు. ఆ ప్రాంతంలో మార్పులు, అభివృద్ది కోరుకోవడం వేరు. కాని ప్రస్తుత ప్రభుత్వంపై దుర్మార్గంగా విషం చిమ్మి, ప్రజల మెదళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని నీచ యత్నాలు చేయడం వేరు. ఈనాడు మీడియా ఆ నీచమైన పని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేస్తోంది కాబట్టి ఈ విషయాలను రాయవలసి వచ్చింది. చంద్రబాబు టైమ్ లో విజయనగరం, శ్రీకాకుళం లకు చెందిన కొందరు భవన నిర్మాణ కార్మికులు తమిళనాడులో స్లాబ్ కూలి మరణించారు. అప్పుడు ఈనాడు మీడియా ఇలాగే ప్రభుత్వాన్ని తప్పు పడుతూ వార్తలు ఇవ్వలేదే!. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనే ఏపీలో ఉంది కదా! అప్పుడు ఎందుకు ఆయన పుట్టపర్తి, గోరంట్ల ప్రాంతాలలో పరిశ్రమలు పెట్టించలేకపోయారు. ఉపాధి అవకాశాలు పెంచలేకపోయారు? అలా చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా! నిజంగానే ఆ విషయాన్ని ఈనాడు రామోజీరావు చిత్తశుద్దితో నమ్మితే ఏపీలో వివిధ ప్రభుత్వాల కాలంలో ఏమి జరిగిందో, ఇప్పుడు ఏమి జరుగుతోందో విశ్లేషణ ఇస్తే తప్పు కాదు. కాని అందుకు విరుద్దంగా జగన్‌పై పడి ఈనాడు నిత్యం ఏడవడమే బాగోలేదు. ✍️ఈనాడు చెప్పేదాని ప్రకారం.. ఎవరూ వేరే చోటకు వెళ్లకూడదు. మరి అమెరికా వెళ్లిన తెలుగువారంతా చంద్రబాబువల్లేనని ఎందుకు ప్రచారం చేశారు?. ఏపీలో ఎందుకు వారందరికి ఉపాధి కల్పించలేకపోయారు. అక్కడ ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలలో తెలుగువారు చనిపోయారే! ఆ మధ్య పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఒక తెలుగు యువకుడిని దుండగులు కాల్చి చంపారు. ఆ యువకుడికి ఇక్కడే ఎందుకు ఉపాధి కల్పించలేకపోయారని ఈ పత్రిక రాసిందా?. నీటి పారుదల ప్రాజెక్టులు కట్టివేస్తేనే వలసలు ఆగిపోతాయా? పోనీ అదే కరెక్టు అనుకున్నా రాయలసీమ నీటి ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నది తెలుగుదేశం, ఈనాడు మీడియానే కదా!. ఏ ప్రాజెక్టును ముందుకు పోనివ్వకుండా రకరకాల పుల్లలు వేస్తోంది వీరే కదా!. కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతం నీటికళతో సస్యశ్యామలంగా ఉంటుంది. అయినా ఆ ప్రాంతం నుంచి వేలాది మంది గల్ఫ్ ప్రాంతానికి ఉద్యోగాల రీత్యా వలస వెళ్లారు. ✍️తెలంగాణలో బొగ్గు గనులు ఉన్న కరీంనగర్ ,ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల ప్రాంతాల నుంచి కూడా అనేకమంది చిన్న,చిన్న పనులకోసం విదేశాలకు వలస వెళ్లారు.నూరు శాతం అక్షరాస్యత ఉన్న కేరళ నుంచి లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు.వారిలో పలువురు అష్టకష్టాలు పడుతున్నట్లు వార్తలు వస్తుంటాయి. మరి వారంతా వెళ్లడం తప్పా?ప్రభుత్వాల వైఫల్యమా? ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేక స్టోరీలు ఇవ్వలేదు! బీహారు, యూపీ, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి వేలాది మంది తెలుగు రాష్ట్రాలలో పనులకు వస్తుంటారు. వారిని ఏమంటారు?ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో ప్రాధమిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు చేపట్టాలని రాయడం తప్ప కాదు .అవి లేనందునే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని, దానికి కారణం ప్రభుత్వాలేనని వార్త ఇవ్వడం కేవలం ఏపీ ప్రభుత్వంపై అక్కసు, ద్వేషం తప్ప మరొకటి కాదు. వచ్చే ఎన్నికల వరకు ఈనాడు మీడియా ఇలాంటి చెత్త కథనాలు ఇస్తూనే ఉంటుంది. తద్వారా ఆ మీడియా తన విశ్వసనీయత కోల్పోతున్నప్పటికీ, ఆ కథనాలకు కౌంటర్ ఇవ్వాల్సిందే!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
వర్షాభావంపై పచ్చ మీడియావి పిచ్చిరాతలు: నాగిరెడ్డి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో వర్షాభావంపై యెల్లో మీడియా రాస్తున్న విద్వేషపూరిత రాతలను వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర అగ్రిమిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఖండించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ వాటిని పిచ్చిరాతలుగా కొట్టేశారాయన. అలాగే.. నాడు చంద్రబాబు హయాంలో ఏర్పడిన కరువు పరిస్థితులను.. నేడు రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ చేస్తున్న కృషిని ఆయన వివరించారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు చూస్తే.. రాష్ట్రంలో నిరంతరం కరువు కాటకాలే కొనసాగాయి. ఆయన ఐదేళ్లలో సరాసరి 273 కరువు మండలాల్ని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. ఆనాడు రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల నుంచి లక్షలాది రైతుల కుటుంబాలు బెంగుళూరు, చెన్నై, కేరళకు దినసరి కూలీల్లా వలసలు పోయారు. అప్పట్లో ప్రభుత్వం కరువు ప్రాంత రైతుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయంటే.. మిమ్మల్ని పంటలు వేసుకోమని ప్రభుత్వం చెప్పలేదుగా.. ఎవరు వేయమన్నారో వాళ్లదగ్గరకెళ్లి సాయం కోరండని .. రైతులకు తగిన శాస్తి జరగాలని ఆనాడు ఎద్దేవా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే, విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపించిన దుర్మార్గుడు చంద్రబాబు. కృష్ణాడెల్టాలోనే నీరులేక ఊడ్చిన పొలాలు ఎండిపోయిన పరిస్థితుల్ని రైతులు ఇప్పటికీ మరిచిపోలేరు. 2018–19లో పది లక్షల ఎకరాల్లో పంటసాగు చేస్తే.. ఆ పంటంతా ఎండిపోయిన పరిస్థితిని అందరూ కళ్లారా చూశారు. అలాంటి దౌర్భాగ్యమైన, నికృష్టమైన పాలన చంద్రబాబుది. చంద్రబాబు, కరువు కవలపిల్లలే! నిత్యం కరువు కాటకాలను అధికారికంగా ప్రకటించుకున్న చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. అందుకే, చంద్రబాబు, కరువు అనేవి కవల పిల్లలంటూ టీడీపీ నాయకులే మనసులో అనుకుంటున్నా.. తమ అధినేత ఎదుట ఏనాడూ బహిరంగంగా అనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే, బాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టులో నీరుండదని వాళ్లకు తెలుసుకాబట్టి. సాగునీటి ప్రాజెక్టులు దండగన్నది చంద్రబాబే! రాష్ట్రంలో ప్రాజెక్టులపై మనసులో మాట పుస్తకం రాసుకున్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులు దండగ అని అన్నది వాస్తవం కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన డబ్బుకు బ్యాంకుల రుణాలు కూడా రావని ఈ చంద్రబాబే అన్నాడు. ఆనాడు తన మనసులో మాట పుస్తకంలో అలా రాసుకోలేదని గుండెలమీద చెయ్యేసుకుని బాబు చెప్పగలడా..? ఆయన్ను భుజానెత్తుకుని మోస్తున్న పచ్చమీడియా సమాధానం ఇవ్వగలదా..? ఉచిత విద్యుత్ సాధ్యంకాదన్న బాబు రైతుల శ్రమ, సాగుపెట్టుబడులపై అవగాహన కలిగిన మహానేత, దివంగత వైఎస్ఆర్ ఆనాడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానంటే.. అది సాధ్యం కాని హామీ అన్నది చంద్రబాబు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలారేసుకోవడమేనని బాబు వేళాకోళమాడింది నిజంకాదా..? వ్యవసాయం దండగమారిదని అన్న వ్యక్తి చంద్రబాబు. నేడు భూగర్భజలాల సద్వినియోగంతో.. సాగు, తాగునీటికి సంబంధించి ప్రకృతివనరులపై ఆధారపడటమనేది సహజం. వర్షపాతంపై ప్రధానంగా చెప్పుకోవాలంటే, ఈ ఏడాది ఆగస్టు మాసంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. సరిగ్గా ఇదే లోటు వర్షపాతం గతంలో 1899, 1913లలో నమోదైనట్లు రికార్డులు న్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లోనూ ప్రభుత్వపరంగా రైతులకు నీటి సౌకర్యం కల్పించే విషయంలో మనం ముందున్నాం. భూగర్భ జలమట్టాలున్న ప్రతీచోటా రాష్ట్రవ్యాప్తంగా 19.7 లక్షల పంపుసెట్లుకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం నిరంతరాయంగా అందిస్తున్నాం. ఇందుకు దాదాపు రూ.1800 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది. అదే సమయంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచిత బీమా పథకం కింద రైతు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనవసరం లేకుండా ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు సాగులో ఉన్న భూమినంతటినీ బీమా పరిధిలోకి తీసుకువచ్చాం. రాష్ట్రంలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా అందించాం. ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో.. అక్కడ సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుంటుంది. రైతుల్ని ఆదుకోవడంలో శ్రమిస్తోన్న జగన్ చంద్రబాబు ఐదేళ్ల హయాంలో అతితక్కువ వర్షపాతం నమోదైనప్పుడు రైతుల్ని మభ్యపెట్టే విధంగా కోతలు కోశాడు. రెయిన్గన్లతో కరువును జయించామనే మాటల్ని ఆనాడు ఆయన వినిపించాడు. అదే సీఎం జగన్ ప్రభుత్వ పెద్దలు గానీ అలాంటి మెహర్భానీ మాటల్ని ఎన్నడూ చెప్పుకోలేదు. వాస్తవ పరిస్థితుల్ని ఎదుర్కొనడంలో ఎప్పటికప్పుడు సమీక్షలతో అహర్నిశం శ్రమిస్తున్నారు. ప్రకృతి సహజసిద్ధ వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ సీజన్ కు తగ్గ పంటలకు అవసరమైన ఇన్‌ఫుట్స్ అందించడంలో ఈ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా పనిచేసింది. ఈఏడాది జూలై మాసంలో అధిక వర్షపాతానికి సంబంధించి కృష్ణాడెల్టాలో దెబ్బతిన్న పంటలకు ఇన్‌ఫుట్ సబ్సిడీనీ కూడా ఇప్పటికే విడుదల చేశాం. రైతుభరోసా సాయం కూడా ప్రకటించిన తేదీనే రైతులకు పంపిణీ చేస్తున్నాం. భేషరతుగా రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని.. బ్యాంకుల్లో కుదువపెట్టిన మీ పుస్తెలతాళ్లు తెచ్చిస్తానని అనంతపురంలో మాట ఇచ్చిన చంద్రబాబు రూ.87వేల కోట్లకు పైగా రుణాలుంటే.. రూ.14వేల కోట్ల మాఫీతో సరిపెట్టాడు. అదే జగన్‌గారు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రైతుభరోసా–పీఎం కిసాన్ కింద రూ.31వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. వ్యవసాయ వృద్ధిరేటులో ముందంజ వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంది. గతంతో పోల్చుకుంటే, ధాన్యం పండించడంలో 7.78 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఆహారధాన్యాల ఉత్పత్తి 153.95 లక్షల టన్నుల నుంచి 165.77 లక్షల టన్నులతో దాదాపు 11.58 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఉద్యానపంటలు 95.55 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగాయి. అలాగే వ్యవసాయ వృద్ధిరేటు బాబు హయాంలో 2018–19లో (మైనస్) – 11.7 శాతం ఉంటే, 2022–23లో (ప్లస్) 22.7శాతంలో ఉంది. 4ఏళ్లలో పోతిరెడ్డిపాడు నుంచి సీమకు 553 టీఎంసీల నీరు సీఎం జగన్ అధికారం చేపట్టాక నాలుగేళ్ల కాలంలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టు జలకళతో తొణికిసలాడుతుంది. రాయలసీమకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిని మనం ఒకసారి పరిశీలిస్తే.. 2014–15లో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59.56 టీఎంసీలు, 2015–16లో 0.95 టీఎంసీలు అంటే, సాగునీటికి కూడా రాయలసీమకు నీళ్లువెళ్లలేని పరిస్థితి అది. 2016–17లో 67.94 టీఎంసీలు, 2017–18లో 91.97 టీఎంసీలు, 2018–19లో 88.87 టీఎంసీలు కాగా, మీ ఐదేళ్లలో 310 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు వెళ్లింది. అదే మా జగన్ గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాలుగేళ్లను చూస్తే.. 2019–20లో 179.29 టీఎంసీలు, 2020–21లో 134.41 టీఎంసీలు, 2021–22లో 111.07 టీఎంసీలు, 2022–23లో 123.44 టీఎంసీలు కాగా ఈ నాలుగేళ్లలోనే 553 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు అందాయి. అంటే, బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే రెండింతల నీరు జగన్‌గారి హయాంలో రాయలసీమకు వెళ్తున్నాయి. పచ్చమీడియా పిచ్చిరాతల్ని రైతులు నమ్మొద్దు రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని.. సీఎం జగన్ ఆ దిశగా సంకల్పంతో ముందుకెళ్తున్నారని మనవి చేస్తున్నాను. చంద్రబాబును మోస్తున్న పచ్చమీడియాలో పిచ్చి రాతల్ని మాత్రం రైతులెవరూ నమ్మరనేది సుస్పష్టం. పట్టిసీమ, పులిచింతల నీళ్లు తాగు, సాగు అవసరాలకు సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోందని, రైతులు కూడా అందుకు సహకరిస్తున్నారని నాగిరెడ్డి అన్నారు. -
చంద్రబాబు, లోకేష్ బాటలోనే నారా బ్రాహ్మణి!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేయడంలో నెంబర్ వన్ అని ఆయన విమర్శకులు తరచూ చెబుతుంటారు. ఆ బాటలోనే ఆయన కుమారుడు లోకేష్ కూడా నడుస్తుంటారు. వారికి తోడుగా ఇప్పుడు లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా అసత్యాలు చెప్పడానికి పోటీ పడుతున్నట్లుగా ఉంది. ఆమె స్వయంగా చేశారో.. లేక ఆమె తరపున ఎవరైనా చేశారో కాని.. ఏపీకి పరిశ్రమలు రావడం లేదని, ఉన్నవాటిని తరిమేశారని ఒక ప్రకటన వచ్చింది. దానికి ఆమె లులూ సంస్థ హైదరాబాద్ లో పెట్టిన ఒక మాల్‌ను చూపుతున్నారు. అలాగే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా సంస్థ తెలంగాణలో పెట్టుబడుల ప్రతిపాదనలు చేయడం. అయితే.. ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉంటే ఆమె చెప్పే విషయాలను వినబుద్ది అవుతుంది. అబద్దాలు ఆడడంలో మామ చంద్రబాబుకు తగ్గ కోడలు అనిపించుకుంటోంది నారా బ్రాహ్మణి. లులూ కంపెనీ విశాఖలో ఒక మాల్ పెడతామని ముందుకు వచ్చినా, చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో ఎందుకు పెట్టలేకపోయారో ఆమె వివరించగలగాలి. ఆ సంస్థవారు ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మాల్ పెట్టుకున్నారా?.. లేదంటే వాళ్ల సొంత స్థలంలో లేదంటే ఒక మూత పడ్డ మాల్ స్థానే పెట్టారా?.. మాల్ పెడితే పరిశ్రమలు వచ్చేసినట్లే చెప్పాలనుకుంటే, జగన్ ప్రభుత్వ హయాంలో.. ఏపీలో రామాయపట్నం వద్ద శరవేగంతో ఒక ఓడరేవు నిర్మాణం అవుతోంది. వేలాది మందికి అక్కడ ఉపాధి వస్తోంది. మరి దానిని ఏమనాలి?. విశాఖపట్నంలో ఒక భారీ డేటా సెంటర్ వస్తోంది. ఇన్ఫోసిస్ శాఖ వస్తోంది. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ , కర్నూలులో గ్రీన్ ఎనర్జీ ..ఇలా అనేకం వస్తుంటే.. బ్రాహ్మణికి హైదరాబాద్‌లో పెట్టిన లులూ మాల్ గొప్పదిగా కనిపిస్తోంది. ఇది.. చూసే కళ్లను బట్టి ఉంటుంది. ✍️ఇక జయదేవ్ కు చెందిన అమరరాజా కంపెనీని ఎవరు ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని చెప్పారు? ఆ మాటకు వస్తే ఆయన చంద్రబాబు టైమ్‌లో ఎందుకు ఏపీలో కొత్త పెట్టుబడులు పెట్టలేదో బ్రాహ్మణి చెప్పగలరా? అంతెందుకు.. అసలు తమ కంపెనీ హెరిటేజ్ ను చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీలో ఎందుకు విస్తరించలేదు?. కొత్త ప్లాంట్లు పెట్టలేదు?. కేవలం అమరావతి రాజధాని లో తమకు అనుకూలంగా రింగ్ రోడ్డును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించి తాము కొన్న భూముల విలువ పెంచుకోవడానికి ప్రయత్నించారే తప్ప.. ఏపీలో ఏమైనా కొత్తగా హెరిటేజ్ పరిశ్రమ యూనిట్ పెట్టారా?. ఆమె అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలలో వచ్చే చెత్త కధనాల ఆధారంగా వ్యాఖ్యానించినట్లు అర్ధం అవుతుంది. ✍️ఆ మీడియానే చంద్రబాబును, లోకేష్ ను ముంచాయి. ఇప్పుడు బ్రాహ్మణి వంతు వచ్చినట్లుంది. ఆమె మేలుకోకపోతే ఆమెకే నష్టం అని చెప్పాలి. బ్రాహ్మణి పేరుతో ఈనాడు మీడియా ప్రకటన రాయడం , ఆ తర్వాత వారి సొంత పైత్యాన్ని జోడించి జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడం చేసేసింది. చంద్రబాబు టైమ్ లో పరిశ్రమలకు స్వర్గమట. ఇప్పుడు కాదట. అప్పుడు వచ్చిన ఒక కియా పరిశ్రమ తప్ప ఇంకో పేరు చెప్పే పరిస్థితి లేదు. కియా కు కూడా టిడిపి ప్రభుత్వం రెండువేల కోట్లకు పైగా రాయితీలు ఇచ్చిన సంగతి మర్చిపోయినట్లు ఉన్నారు. తెలంగాణలో వంద కోట్ల పెట్టుబడి వచ్చినా మొదటి పేజీలో ప్రముఖంగా అచ్చేయడం, ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడి వచ్చినా దానిని కనిపించకుండా రాయడం, పైగా శాపనార్ధాలు పెట్టడం ఈనాడుకు అలవాటైపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పిన చంద్రబాబు వల్ల.. ఏపీకి నష్టం జరగలేదట. అయినా పరిశ్రమలు వచ్చేశాయట. అబద్దాలు రాయడానికి కూడా అంతు ఉండాలి! ✍️విదేశీ పెట్టుబడులకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఈనాడులో వచ్చిన కదనం చదివితే ఆంధ్రప్రదేశ్ పై ఎంత ద్వేషంతో ఈ మీడియా ఉన్నదీ అర్దం అవుతుంది. విదేశీపెట్టుబడులు ఎపి కంటే తెలంగాణకు పది రెట్లు ఎక్కువ అంటూ తాటికాయంత హెడ్డింగ్ పెట్టి ఈనాడు పత్రిక తన వికృతానందాన్ని ప్రకటించుకుంది. ఎంత సేపు ఆంధ్రప్రదేశ్ పై పడి ఏడవడం, శాపనార్దాలు పెట్టడం నిత్య కృత్యాలుగా చేస్తున్న ఈనాడు.. ఈ వార్త రాయడానికి మాత్రం ఎంత సంతోషపడి ఉంటుందో. దీనిలోనే వారి రాక్షసత్యం కనిపిస్తుంది. ఈ వార్తలో నిజం ఎంత , అసలు ఇలా విశ్లేషించవచ్చా? అనేవాటిని పక్కనపెడితే ఆ వార్త రాసిన తీరు చూస్తే ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రజల మెదడులో విషం నింపే యత్నం చేసింది. ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు అంటే కేవలం విదేశీపెట్టుబడులే కాదు. స్వదేశీ పెట్టుబడులు కూడా లెక్కే. కాని ఈనాడు కావాలని ఈ దిక్కుమాలిన వార్త ఇచ్చింది. ఈ మధ్యనే ఒక సమాచారం వచ్చింది. పెట్టుబడుల విషయంలో ఏపీ ముందంజలో ఉందన్నది దాని సారాంశం. తెలంగాణ కన్నా, కొన్నివేల కోట్ల రూపాయల పెట్టుబడులు అధికంగా వస్తున్నట్లు కేంద్రమే తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ లో ఏపీ నెంబర్ ఒన్ స్థానాన్ని గత మూడేళ్లుగా పొందుతోంది.ఈ వార్తను తన మీడియాలో ఎన్నడైనా రాసిందా? అది రాయడానికి చేతులు రాని ఈనాడుకు ఈ విదేశీపెట్టుబడుల గురించి రాసే నైతిక హక్కు ఉంటుందా? కేవలం ద్వేషంతో ఈ వార్త వండారని తెలుస్తూనే ఉంది. ✍️ఇదే వార్తలో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వాటి ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మహారాష్ట్రలో 36634 కోట్ల విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. తెలంగాణకు 6829 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఈనాడు ఎపిపై రాసినట్టుగా ఈ రెండు రాష్ట్రాల పెట్టుబడులను ఎందుకు పోల్చలేదు. తెలంగాణకన్నా ఆరు రెట్లు అదనంగా మహారాష్ట్రకు పెట్టుబడులు వస్తున్నాయని ఎందుకు రాయలేదు. నిజానికి అలాంటి పోలికలు సరికాదు. మొత్తం సంవత్సరం అయిన తర్వాత ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందన్నది రాస్తే రాయవచ్చు. అలాగే మొత్తం అన్ని రకాల పెట్టుబడులు కలిపి ఏ విదంగా ఉన్నాయన్నది కథనంగా ఇవ్వవచ్చు. కాని ఈనాడు మాత్రం ఏపీ ద్వేషంతో ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. మొదటి ఆరు నెలల ప్రతిపాదనలను చూస్తే మహారాష్ట్ర కు 69870 కోట్లు వస్తే, డిల్లీకి 27680 కోట్లు,కర్నాటకకు 25680 కోట్లు గుజరాత్ కు 10702 కోట్లు, హరియానాకు 8904 కోట్లు, తెలంగాణకు 8655 కోట్ల ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు.. ఆ తర్వాత స్థానం తమిళనాడు ఉంది. రాష్ట్రాల మధ్య దీనిని పోల్చి చూస్తే తెలంగాణకన్నా మహారాష్ట్ర ఏడురెట్లు, డిల్లీ మూడు రెట్లు, కర్నాటకకు దాదాపు మూడు రెట్లు అధికంగా విదేశీపెట్టుబడులు వస్తున్నట్లు అంచనా వేశారు. మరి ఆ సంగతిని ఎందుకు పోల్చి చెప్పలేదు. కేవలం తెలంగాణ, ఏపీల మధ్యనే విదేశీ పెట్టుబడులపైనే ఎందుకు పోల్చారు?అంటే దానర్దం జగన్ ప్రభుత్వంపై ఉన్న అక్కసే అని వేరే చెప్పనవసరం లేదు.. ఇక్కడితో ఆగలేదు. టీడీపీ హయాంలో బాగా విదేశీపెట్టుబడులు వచ్చినట్లు కూడా ఈ పత్రిక ప్రచారం చేసింది. తీరా చూస్తే ఆ పెట్టుబడుల వివరాలు ఇవ్వకుండా ఏదో శాతం అంటూ సరిపెట్టింది. అంటే అప్పుడు వచ్చిన పెట్టుబడుల వాస్తవ అంకెను ఇస్తే అసలు విషయం అర్దం అయిపోతుందని, టిడిపి పాలన బండారం బయటపడుతుందని ఈనాడు భావించి ఉండాలి. విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకు ఆ స్థాయిలో రావడానికి, ఇతర రాష్ట్రాలకు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. పారిశ్రామిక వాతావరణం ఉన్న తమిళనాడు కూడా ఎందుకు వెనుకబడిందన్నదానిపై విశ్లేషణ చేయాలి. అవేవి చేయకుండా గుడ్డ కాల్చి ఎపిపై ఈనాడు పడేసింది. ✍️అన్నిరకాల పెట్టుబడులు పరిశీలిస్తే ఏపీకి సుమారు రూ. 25 వేల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు తెలంగాణకు చాలా తక్కువ పెట్టుబడి వచ్చినట్లు ఆ వివరాలు వెల్లడించాయి.అంత మాత్రాన తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని కాదు. తెలంగాణలో హైదరాబాద్ ఉండడం కీలక విషయం. ఆ నగరం చుట్టూరా ఐటి ,ఇతర సాప్ట్ తరహా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి వేయించిన రింగ్ రోడ్డే మూలకారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఏపీలో తీర ప్రాంతం అధికంగా ఉంది. అందువల్ల ఇక్కడకు రెన్యుబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అధికంగా వస్తున్నాయి. ఏపీలో కొత్తగా నాలుగు ఓడ రేవులు నిర్మాణం అవుతున్నాయి. పది ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. వాటన్నిటిని పెట్టుబడుల కింద చూడరా?ఈ ఓడరేవుల ఆధారంగా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. కొత్తగా కొప్పర్తి వద్ద పారిశ్రామిక క్లస్టర్ వస్తోంది. విశాఖలో డేటా సెంటర్ పదిహేనువేల కోట్ల పెట్టుబడితో వస్తోంది.కడప జిల్లాలో 8800 కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి అయింది. శ్రీ సిటీలో ఎసి యూనిట్లు వచ్చాయి. అచ్యుతాపురంలో కొత్త ఫార్మా యూనిట్లు వస్తున్నాయి. మరి ఇవేవి తెలంగాణలో ఏవి అని ఎవరైనా అడిగితే అది తెలివి తక్కువతనం అవుతుంది.ఎందుకంటే తెలంగాణకు తీర ప్రాంతం లేదు. ✍️అలాగే ఏపీకి హైదరాబాద్ వంటి నగరం లేదు. అంత ఖాళీ ప్రదేశం ఉండదు. ఏపీ ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. అయినా దానికి తగిన విదంగానే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి.విశాఖలో ఇన్ ఫోసిస్ తన కార్యకలాపాలు ఆరంభిస్తోంది. అలాగే మరికొన్ని ఐటి యూనిట్లు వస్తున్నాయి. ఐటి రంగం కోసం ఒకప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారు. నిజమే ..ఇంకా ఎక్కువగా ఏపీకి పెట్టుబడులు వస్తే బాగుంటుందని రాస్తే ఫర్వాలేదు. కానీ, ఏపీని అవమానించే విధంగా అబద్దపు వార్తలు రాయడం ఈనాడుకే చెల్లింది. ఇదంతా కక్ష తప్ప ఇంకొకటికాదు. ప్రజలు అర్ధం చేసుకోలేని అమాయకులు కారు. ఈ మీడియాలో వచ్చే వార్తలనే చంద్రబాబు, లోకేష్ లు ప్రచారం చేస్తుంటారు. సరిగ్గా అదేదారిలో బ్రాహ్మణి కూడా నడుస్తున్నట్లుగా ఉన్నారు. భర్త,మామ మాదిరి తన పరువు కూడా పోగొట్టుకుంటారా?లేక హేతుబద్దంగా మాట్లాడి విలువ నిలబెట్టుకుంటారా?అన్నది ఆమె ఇష్టం. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
చంద్రబాబు లూటీకి పాన్ ఇండియా ప్రచారం
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకెళ్లారు. పార్టీ ఇమేజ్ ఢమాల్ మని పడిపోయింది. దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి టిడిపి నేతలు పాలక వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న కుట్రతో ఢిల్లీ సాక్షిగా టీడీపీ నేతలు తవ్వుకున్న గోతుల్లో వారే పడ్డారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. టీడీపీ నేతలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌తో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. తప్పు చేశారు కాబట్టే చంద్రబాబును జైలుకు పంపారని వారికి అర్ధమైంది. మరిన్ని కేసుల్లోనూ చంద్రబాబు పాత్రకు ఆధారాలు ఉన్నాయని తేలడంతో టీడీపీ నాయకత్వానికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. చంద్రబాబు నాయుణ్ని ఏపీ ప్రభుత్వమై వేధించుకు తింటోందని జాతీయ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి.. వైఎస్సార్సీపీ ప్రతిష్ఠ దెబ్బతీయాలని టీడీపీ నేతలు స్కెచ్ గీశారు. ✍️చంద్రబాబు నాయుడి ఆదేశాలతోనే నారా లోకేష్ అమాంతం ఢిల్లీ వెళ్లారు. అక్కడ జాతీయ మీడియాలో మాట్లాడుతూ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. అయితే టీడీపీకి ఎప్పుడూ అనుకూలంగా వ్యవహరించే ఆ జాతీయ ఛానెల్ లోనూ.. షో రన్ చేసే ప్రెజంటర్ అడిగిన ప్రశ్నలు లోకేష్‌కు ముళ్లల్లా గుచ్చుకున్నాయి. ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ముందస్తుగా రూ. 371 కోట్లు ఎందుకు విడుదల చేసింది? అది అక్రమమే కదా అని అర్నబ్ గోస్వామి ప్రశ్నిస్తే లోకేష్ నీళ్లు నమిలారు. అసలు ఈ ఒప్పందం చూస్తోంటే ఇది సజావుగా చేసుకున్నట్లు కనపడ్డం లేదని అర్నబ్ గోస్వామి అనేసరికి లోకేష్‌కు ముచ్చెమటలు పట్టాయి. అనవసరంగా ఢిల్లీ వచ్చి అర్నబ్ ఛానెల్ లో డిబేట్ లో పాల్గొన్నానేమో అని లోకేష్ కుమిలిపోవలసి వచ్చింది. ✍️ఈ భంగపాటు చాలదన్నట్లు అవినీతిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చంద్రబాబు తనయుడే ఢిల్లీ వెళ్లి తమని వేధిస్తున్నారని యాగీ చేయడంతో.. ఏపీ సీఐడీ కూడా ఈ కుంభకోణంలో చంద్రబాబు ఎంత స్కిల్ చూపించారో జాతీయ మీడియా ద్వారా దేశమంతటికీ తెలిసేలా చేయాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ చీఫ్ తో పాటు ఈ కేసులో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి జాతీయ మీడియా కు మొత్తం కుంభకోణాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు. చంద్రబాబు నాయుడు ఎలా షెల్ కంపెనీల ద్వారా డబ్బులు తన ఇంటికి రప్పించుకున్నారో ఆధారాలతో సహా వివరించారు. అప్పటిదాకా ఒకటీ అరా ఆంగ్ల పత్రికల్లోనే వచ్చిన స్కిల్ కార్పొరేషన్ లూటీ గురించి.. ఈ ప్రెస్ మీట్ ద్వారా దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ స్పష్టంగా అర్దమయ్యేలా చెప్పారు. దీంతో టీడీపీ పరువు యమునా నదిలో కలిసిపోయింది. టీడీపీ నేతలు ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచినట్లు.. ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకుంటే.. చేసిన రెండు ప్రయత్నాలూ టీడీపీ ప్రతిష్ఠనే మసకబారేలా చేశాయి. ✍️ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అనవసరంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంను కెలికి.. చంద్రబాబు నాయుణ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. దానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో షెల్ కంపెనీల ద్వారా ఎలా దోచుకున్నారో వివరించారు. గల్లా జయదేవ్ కొన్ని సెకన్లు మాట్లాడితే.. చంద్రబాబు దోపిడీ గురించి మిథున్ రెడ్డి నిముషానికి పైగా వివరించడంతో టీడీపీ పరువు పోయింది. చంద్రబాబు అక్రమాల గురించి జనంలోకి బాగా వెళ్లింది. ఈ మూడు నిర్ణయాలూ కచ్చితంగా సెల్ఫ్ గోల్సే . :::CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు -
‘రామోజీ.. చంద్రబాబులాగా అనుకున్నావా?’
తెలుగుదేశంను భుజాన వేసుకున్న ఈనాడు మీడియా ఎలాగైనా ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని పడరాని పాట్లు పడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేజీల కొద్ది వార్తలను తన పత్రికలోను, గంటల కొద్ది వార్తలను తన టీవీలోను ఇస్తూ జర్నలిజం విలువలను మంటకలుపుతూ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తోంది. ప్రజలలో జగన్‌కు ఉన్న అనుకూలతను తగ్గించాలన్న తాపత్రయంలో అబద్దాలను ప్రచారం చేస్తూ తాను నగ్నంగా తిరుగుతున్నానన్న సంగతిని ఆ మీడియా యజమాని రామోజీరావు మర్చిపోతున్నారు. తామే ప్రధాన ప్రతిపక్షం అనుకుని ఇష్టారీతిన కధనాలు నింపుతున్నారు. ఇది ఇవాళ ఒక్కరోజుది కాదు.. గత నాలుగేళ్లుగా సాగిస్తున్న దందా. కానీ, ఈ మధ్య అది మరింతగా పెరిగిపోయింది. పిచ్చి పతాక స్థాయికి చేరిందన్నట్లుగా నానా చెత్త అంతటిని పోగు చేసి ప్రజలపై కక్కుతున్నారు. ఆ విషపు రాతలను జనం నమ్ముతారా? లేదా? అనే సంబంధం లేకుండా పచ్చి పాపంగా దీనిని సాగిస్తున్నారు. జూలై 20వ తేదీ ఈనాడు పత్రికను పరిశీలిస్తే.. ఆ పత్రికలో రాష్ట్ర ,జాతీయ స్థాయి వార్తలు ఇవ్వడానికి ఆరు పేజీలు కేటాయిస్తే, అందులో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు అరపేజీలో కూడా లేవు. అదే టైమ్ లో నాలుగు పేజీలకు పైగానే జగన్ ప్రభుత్వంపై బురదచల్లే వార్తలతో నింపేశారు. వాటిని జాగ్రత్తగా చదివితే అవన్ని చాలావరకు తప్పుడు రాతలేనని తేలిపోతుంది. ✍️ ఉదాహరణకు ఇసుక మీద ఒక ఫుల్ పేజీ వార్త రాశారు. నిజానికి అంతకుముందు రోజు కూడా ఒక పేజీడు వార్తను ఇసుక అక్రమ తవ్వకాలు అంటూ రాశారు. దానిపై సాక్షి లో ప్యాక్ట్ చెక్ పేరుతో వార్త వస్తుందని తెలుసు కాబట్టి,మళ్లీ మరుసటి రోజు కూడా ఇలా కథనాలు వండి వార్చారన్నమాట. ఒక్కసారి గతాన్ని గుర్తుకు చేసుకోండి. ఇసుకకు సంబంధించి టీడీపీ హయాంలో జరిగిన అరాచకం, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ముఠాలను ఏర్పాటు చేసి ఇసుక దందా సాగించిన రోజుల్లో నూటికి,కోటికి ఒకటో,అరో వార్త రాసి సరిపెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ దందాను తీసేసి, ఒక సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నించగానే.. ఇంకేముంది ఇసుక తవ్వకాలు ఆపేశారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయి అని ప్రచారం చేశారు. ప్రభుత్వం ఒక విధానం ఏర్పాటు చేశాక దానికి వ్యతిరేకంగా వార్తలు ఇచ్చారు. అసలు రాష్ట్రంలో అభివృద్దే ఆగిపోయిందని అన్నారు. ఇటీవలికాలంలో ఏమి రాశారు. ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు.దానివల్ల పర్యావరణం దెబ్బతినిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు సి.ఎమ్.గా ఉన్నప్పుడు ఆయన కరకట్ట ఇంటికి సమీపంలోనే లారీలకు,లారీల ఇసుక తవ్వుతుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా విధించింది. అయినా అప్పుడు ఇలా ఇన్ని పేజీల వార్తలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇసుకను స్టాక్ చేసుకుని ప్రజలకు సరఫరా చేస్తుంటే ,అది కూడా అక్రమంగా తవ్విందేనని తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ఎక్కడైనా ఒకటి,అర చోట అక్రమంగా తవ్వుతుంటే వార్తలు ఇవ్వడం వేరు. ఉన్నవి,లేనివి కలిపి నానా చెత్తంతా రాస్తే,చివరికి ప్రజలు వాటిని నమ్మని పరిస్థితిని ఈనాడు తెచ్చుకుంది. ✍️ అసలు వీరి ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా చేయడమే. తద్వారా ఇసుక కొరతను సృష్టించి, ప్రభుత్వం ఇసుక ఇవ్వలేకపోతోందని దుష్ప్రచారం సాగించాలన్నదే వారి కుట్ర. పోనీ ఇంకో కోణం చూద్దాం. రాష్ట్రంలో అభివృద్దే లేదని,అన్నీ ఆగిపోయాయని వీరే చెబుతారు. కాని ఇసుకను మాత్రం లక్షల టన్నులలో తోడేస్తున్నారని వీరే అంటారు. అంటే ఇంత ఇసుకను రాష్ట్రంలో వినియోగిస్తున్నట్లే కదా?అభివృద్ది జరుగుతున్నట్లే కదా!ఒకవేళ వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటే ఇంకా గగ్గోలు పెట్టేవారు కదా! గత ప్రభుత్వ హయాంలో పేరుకు ఉచితం కాని ప్రజల జేబులకు బాగానే చిల్లు పడేది. నాయకుల జేబులు మాత్రం ఫుల్ అయ్యేవి. ఇప్పుడు దానిని అరికట్టి ప్రభుత్వానికి ఏటా రూ. 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా చేసినందుకు అభినందించవలసింది పోయి,అక్రమ ఇసుక తవ్వకాలు, కోర్టు ఆదేశించినా ఇసుక తవ్వుతున్నారు అంటూ తప్పుడు వార్తలు ఇస్తున్నారు. ఇలాంటి వార్తలు ఇచ్చినా పేజీలకు,పేజీలు ఇవ్వడం ఇటీవలికాలంలోనే చూస్తున్నాం. అదే తెలంగాణలో జరుగుతున్న ఇసుక తవ్వకాల గురించి ఈనాడు మీడియాకు దమ్ముంటే రాయమనండి చూద్దాం. అక్కడ మాత్రం రామోజీ ఎందుకు వణుకుతారో అందరికి తెలుసు. ✍️ మరికొన్ని వార్తలు చూద్దాం. మెడికల్ కాలేజీలలో బి,సి కేటగిరిల సీట్లను అధిక ఫీజులకు ఎన్.ఆర్.ఐలకు, ఇతరులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వైద్య విద్యలో నాణ్యత పెంచాలన్నది ప్రభుత్వ భావన. ప్రభుత్వంలో డబ్బు లేక కాలేజీలు పెట్టినా అవి సరిగా నడవని పరిస్థితులు ఏర్పడరాదన్నది సంకల్పం.కాని ఈనాడు ఈ వార్తను ఎలా చిత్రీకరించి వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారంటూ జగన్ పై విషం కక్కింది. నిజంగానే ఈనాడుకు ఈ విధానాల మీద నమ్మకం లేకపోతే గతంలో జరిగిన వాటి గురించి,ఆయా రాష్ట్రాలలో ఉన్న పద్దతుల గురించి రాయాలి కదా! అసలు మెడికల్ కాలేజీలలో ఎన్.ఆర్.ఐ కోటాను సృష్టించింది. డోనేషన్ సీట్లను కేటాయించడంం మొదలు పెట్టింది తెలుగుదేశం హయాంలోనే. ఎన్.టి.ఆర్.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆరోగ్య యూనివర్శిటీ నుంచి ఈ సిస్టమ్ అమలు చేయడం ఆరంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినప్పుడు ఆయన కాబట్టి విజన్ తో అలా చేశారని రాశారు. అదే అంతకుముందు నేదురుమల్లి జనార్ధనరెడ్డగి ప్రభుత్వం ప్రైవేటు రంగంలో వైద్య ,ఇంజనీరింగ్ కాలేజీలను ఇస్తే ఇదే టిడిపి విద్యను అమ్ముతారా అంటూ కోర్టుకు వెళ్లింది. చంద్రబాబు టైమ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలలో మేనేజ్ మెంట్ కోటాను పెట్టి అధిక ఫీజులను వసూలు చేస్తున్నప్పుడు ఈనాడుకు అది వ్యాపారంగా కనిపించలేదు. ఇలాంటి వార్తలు ఇవ్వదలిస్తే ఏ ప్రభుత్వ హయాంలో ఎలా జరిగింది రాస్తూ విశ్లేషించాలి.అలాకాకుండా జగన్ ప్రభుత్వమే ఇలా మొలు పెట్టిందన్నట్లుగా ప్రజలలో అపోహ సృష్టించడానికి ఈనాడు పాట్లు పడింది. ✍️ తెలుగు భాష కు సంబంధించి హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తే ,అదేదో ఈ ప్రభుత్వ టైమ్ లోనే జరుగుతుందేమోనన్న అనుమానం కలిగించడం కోసం మొదటి పేజీలో అంత ప్రముఖంగా వార్తను ఇచ్చారు.ఏకంగా సంపాదకీయాన్నే ఇచ్చి కన్నీళ్లు కూడా పెట్టేశారు. ఇంత తెలుగుమీద ప్రేమ ఉన్నవారు తమ సొంత స్కూల్ లో ఆంగ్ల మీడియం నే ఎందుకు పెట్టారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. బూ ఆక్రమణ అభియోగంతో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి సంబంధించిన సంస్థలు ఆక్రమించాయని ఎవరో హైకోర్టులో కేసు వేశారు. దానిని వార్తగా ఇవ్వవచ్చు. దానికి పెట్టిన హెడింగ్ చూడండి..175 ఎకరాల భూ ఆక్రమణ అంటూ పెద్ద హెడింగ్ పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేశారు. వీరే తీర్పు ఇచ్చేసిన చందంగా రాశారు. ✍️ ‘‘మా భూమిని అమ్మేశారు..’’ అంటూ వైఎస్సార్సీపీ వాళ్లపై ఆరోపిస్తూ ఇంకో వార్త.. ఏ గ్రామంలో చిన్న ఘటన జరిగినా,దానిని వైసిపికి పులిమి రాష్ట్రస్థాయిలో ప్రచారం చేయడమే పనిగా ఈనాడు మీడియా పెట్టుకుంది.లోకేష్ పాదయాత్రలో ఆయన మాట్లాడిన విషయాలకు తప్పనిసరిగా ప్రధాన్యత ఇచ్చి ఆయనను పెద్ద నాయకుడిగా చేయడానికి ఈనాడు,తదితర ఎల్లో మీడియా పనిచేస్తోంది.ఆయనకాని, మరెవరైనా ఇతర పార్టీల నేతలు కాని జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాటిని భారీగా ప్రచురిస్తారు. బిజెపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అవినీతి, అంధకార,అప్పుల ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానిస్తే మొదటి పేజీతో పాటు చివరి పేజీలో కూడా వార్తను ఇచ్చారు. అదే ఆమె టీడీపీని విమర్శించి ఉంటే దాని జోలికి పోరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటిఆర్, హరీష్ రావు వంటివారు ఎపికి వ్యతిరేకంగా ,వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ప్రకటనలు చేస్తే ఏపీ ఎడిషన్ లోకూడా భారీగా ప్రచురించే వీరు. అదే టీడీపీని, చంద్రబాబును ఉద్దేశించి అంటే మాత్రం ఒక్క ముక్క రాయరు. ఉదాహరణకు కెటిఆర్, హరీష్ రావులు తెలంగాణలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్ అని, వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే, వ్యవసాయానికి విద్యుత్ అక్కర్లేదని రేవంత్ అంటున్నారని విమర్శిస్తే, ఆ వార్తను తెలంగాణ ఎడిషన్ లోనే కనీ,కనిపించకుండా ఇచ్చారు. ఏపీలోకి వచ్చేసరికి అసలు కనిపించలేదు. ఇంత పక్షపాతంగా వార్తలు ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగానే ఎల్లో మీడియా యత్నిస్తోంది. ✍️ ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి, టివి 5వంటివి సరేసరి. ఇంత దారుణంగా ఈనాడు మీడియా తయారైనా,దీనిని ముఖ్యమంత్రి జగన్ ఎదుర్కోగులుగుతున్నారంటే అది ఆయన ధైర్యం. అది ఆయన సత్తా. వీరందరికి దుష్టచతుష్టయం అని ఆయన పేరు పెట్టి ప్రజలలోకి వెళుతున్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ ఎల్లో మీడియా చేస్తున్న దుర్మార్గపు అబద్ధాల వార్తల ప్రచారానికి ఎప్పుడో దెబ్బతినిపోయేవారు. ఏది ఏమైనా ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా, ఇతరత్రా వాస్తవాలు చాలావరకు తెలుసుకుంటున్నారు. అందుకే ఈ ఎల్లో మీడియా పప్పులుడకడం లేదు. ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు?
‘ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అది బయటి వారికి చాలా అసహ్యంగానూ అనిపిస్తోంది. రాజకీయాలు మరీ ఇంతలా దిగజారిపోవాలా? అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. అవినాష్ రెడ్డిని సిబిఐ ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి? సిబిఐ ఇంత బలహీనంగా ఉందా? అంటూ ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. టిడిపి అనుకూల మీడియాల్లో డిబేట్స్ చూస్తోంటే సీబీఐ అరెస్ట్ చేయకపోతే మీడియా ప్రతినిథులే వెళ్లి అవినాష్ ను అరెస్ట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇటువంటి ట్రెండ్ గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.‘ ఏపీలో 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న అయిన వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ హత్య జరిగే నాటికి ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. కొంతకాలంగా ఈ హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితులను విచారించిన సీబీఐ.. ఆ తర్వాత మరి కొందరిని పిలిచి విచారిస్తోంది. ఈ క్రమంలో భాగంగా వివేకా మరో సోదరుడు వైఎస్ భాస్కర రెడ్డి తో పాటు ఆయన తనయుడు.. కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. భాస్కర రెడ్డిని రిమాండ్ లో తీసుకున్న సీబీఐ.. అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలు దఫాలు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు పిలిచింది. అయితే.. అవినాష్ రెడ్డి తల్లికు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించేందుకు వెళ్లాల్సి రావడం.. తాను విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సిబిఐ కి లేఖ రాశారు. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తన బెయిల్ పిటిషన్ ను విచారించాల్సిందిగా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరారు. అవినాష్ రెడ్డి తల్లికి కర్నూలు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు కూడా బులెటిన్ విడుదల చేశారు. ఐసీయూ లో కొద్ది రోజులు చికిత్స అందించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. తన తండ్రి భాస్కర రెడ్డి అరెస్ట్ అయి ఉన్నందున తన తల్లిని తానే చూసుకోవాలి కాబట్టి ఈ నెల 27 వరకు తనకు గడువు నివ్వాలని.. ఆ తర్వాత తాను విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి సిబిఐకి రాసిన లేఖలో కోరారు. అంతే.. ఈ వార్తలు మీడియాలో ప్రసారం అవుతుండగానే అటు టీడీపీ నేతలు, ఇటు టీడీపీ అనుకూల ఛానెళ్లూ కూడా.. ‘‘అదేంటీ?.. అవినాష్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి?.. ఏం! సీబీఐ మరీ అంత బలహీనంగా ఉందా?’’ అంటూ డిబేట్స్ నడపడం మొదలు పెట్టారు. అటు టిడిపి నేతలు అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలంటే డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోగా.. వ్యతిరేకంగా పావులు కదుపుతోందంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీనిపై న్యాయ రంగ నిపుణులు మండి పడుతున్నారు. 👉 ‘అసలు ఎవరిని అరెస్టు చేయాలి?..’ అది చెప్పడానికి మీడియా ఎవరు? సీబీఐ ఎవరిని అరెస్ట్ చేయాలో ఎప్పుడు అరెస్ట్ చేయాలో అసలు చేయాలో చేయకూడదో మీడియా చెప్పడం ఏంటి? దర్యాప్తు సంస్థకు దమ్ము ఉందా లేదా అన్నది కూడా మీడియానే తేల్చేయడం ఏంటి? తమ రాజకీయ ప్రత్యర్ధులు అయితే వెంటనే అరెస్ట్ చేసేయాలి అదే తమపై కేసులు వచ్చి తమని అరెస్ట్ చేస్తే రాజకీయంగా కక్షసాధిస్తారా? అంటూ దబాయింపు సెక్షన్ విరుచుకు పడిపోతారు . ఇదేం పద్ధతి? అంటున్నారు న్యాయ రంగ నిపుణులు. 👉 వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు కారు. ఆయనపై ఉన్న అభియోగం అల్లా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు తారు మారు చేయించారని. అది కూడా ఆయన చేశారని కాదు. అసలు వివేకానంద రెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు దస్తగిరి బెయిల్ పై హాయిగా బయట తిరుగుతున్నాడు. అనుమానాలు మాత్రమే ఉన్న అవినాష్ రెడ్డిని మాత్రం.. తక్షణమే అరెస్ట్ చేసేయాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఓ పత్రిక రాసి పారేసింది. నిజానికి సీబీఐ ఇంత వరకు దీనిపై ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. ప్రభుత్వంపై కానీ అవినాష్ రెడ్డిపై కానీ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. అవినాష్ రెడ్డి అడిగింది కూడా నాలుగు రోజుల పాటు విచారణకు గడువు ఇమ్మనమనే. అది కూడా తల్లి ఆరోగ్యం బాగా లేదు కాబట్టి. అయితే టీడీపీ నేతలు.. వారి అనుకూల ఛానెళ్లు సీబీఐకి ఏదో అపచారం జరిగిపోతోన్నట్లు.. ధర్మాన్ని ఎవరో అడ్డుకుంటోన్నట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. 👉 కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి సహకరించకపోవడం క్షమించరాని నేరం అంటున్న ఆ పత్రిక.. గతంలో చంద్రబాబు నాయుడు, ఇదే సీబీఐ ఏపీలో అడుగు పెట్టనివ్వకుండా ఏకంగా జీవో జారీ చేస్తే అపుడు సిబిఐ దుర్మార్గమైన దర్యాప్తు సంస్థ అన్నట్లు.. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తోందన్నట్లు కథనాలు వండి వార్చింది. అపుడు టిడిపి నేతలు కూడా సీబీఐని పనికిమాలిన సంస్థగా ఏకి పారేశారు. ఇపుడు తాము ప్రతిపక్షంలోకి వచ్చే సరికి తమ ప్రత్యర్ధులపై ఓ కేసు వచ్చింది కాబట్టి టిడిపి నేతలు ఇపుడు సిబిఐని కీర్తిస్తున్నారని న్యాయ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని అవినాష్ అంటోంటే ‘అదంతా నాటకం.. డ్రామా..’ అంటూ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ‘‘2019లో టిడిపి ప్రతిపక్షంలోకి జారుకున్నాక వారి హయాంలో చేసిన అవినీతికి సంబంధించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసే సందర్భాల్లో టిడిపి నేతలు కూడా ఆసుపత్రుల్లో చేరారు. అచ్చెంనాయుడు అయితే తనకి పైల్స్ ఆపరేషన్ అయ్యిందని నెలల తరబడి ఆసుపత్రి బెడ్ దిగలేదు. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోనని చెప్పి టిడిపి అనుకూల వర్గీయులది అయిన రమేష్ హాస్పిటల్ లో ఆయన కాలక్షేపం చేసి విచారణ నుండి తప్పించుకున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి.. టిడిపి తరపున వ్యవహారాలు నడుపుతోన్న రఘురామ కృష్ణం రాజు కులాల మధ్య చిచ్చు రేపేలా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే తనని కొట్టేశారంటూ ఆరోపణలు చేసి బెయిల్ తెచ్చుకుని తనకు అనుకూలంగా ఉండే ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందారే తప్ప ఏపీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందలేదు. మార్గదర్శి చిట్స్ లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సిఐడీ అధికారులు సోదాలకు వెళ్లినపుడు ఆ సంస్థ అధినేత రామోజీ రావు అమాంతం మంచం పై పడుక్కుని ఆరోగ్యం బాగా లేదని చెప్పుకున్నారు. విచారణకు కూడా సిద్ధంగా లేనని చెప్పించారు. అయితే అలాగని లిఖిత పూర్వకంగా రాసి ఇస్తారా అని డాక్టర్లను సిఐడీ అధికారులు అడగడంతో వాళ్లు నీళ్లు నమిలి విచారణకు హాజరు కావచ్చునని ఒప్పుకున్నారు. టిడిపి నేత సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసంలో ఓ సినీ నిర్మాతపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలో బాలయ్యను అరెస్ట్ చేయాల్సి వచ్చినపుడు అమాంతం బాలయ్యకు మానసిక పరిస్థితి బాగా లేదని మతి చలించిందని వైద్యుల చేత సర్టిఫికెట్ పుట్టించుకుని అరెస్ట్ నుండి తప్పించుకున్నారు.’’ ఇపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వీటినే గుర్తు చేస్తున్నారు. అప్పట్లో.. ఆస్పత్రిలో అచ్చెన్న 👉 టిడిపి నేతలను అరెస్ట్ చేసే సందర్భాల్లో వాళ్లకి మాయరోగాలు వస్తాయి.. వాళ్లు తమకు అనుకూలమైన ఆసుపత్రులనే ఆశ్రయిస్తారు.. చివరకు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు.. అదే అవినాష్ రెడ్డి తల్లి పరిస్థితి బాగా లేక విచారణకు సమయం కావాలని అడిగితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరు? అంటూ టిడిపి నేతలు, టిడిపి అనుకూల పత్రికలు ప్రశ్నించడంలో అర్ధం లేదని పాలక పక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్లో విచారణలు జరక్కుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడి పార్టీ నేతలు గురివింద గింజలాగా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు. 👉 ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా తెలంగాణా హై కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. హై కోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాల్సిందిగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను సూచించింది. ఈఘటనలో టిడిపి నేతలతో సమానంగా మీడియా ప్రతినిథులు కూడా తామే న్యాయమూర్తులు అయినట్లు, దర్యాప్తు సంస్థల అధికారులు అయినట్లు విచారించేసి తీర్పులు ఇచ్చేస్తున్నారనే చర్చ కూడా ఒకటి నడుస్తోంది. ఈ పద్ధతి మారాలని అంటున్నారు కొందరు. అసలు సీబీఐని ఏపీలోకి అనుమతించాలా? అడ్డుకోవాలా? అన్న అంశంపై టిడిపి నేతలు తమ వైఖరి ఏంటో ఇప్పటికైనా స్పష్టం చేయాలంటున్నారు పాలక పక్ష నేతలు. అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే అందుకు పూర్తి భిన్నంగా యూటర్నులు తీసుకోవడం చంద్రబాబు నాయుడికి మొదట్నుంచీ అలవాటే అంటున్నారు రాజకీయ పండితులు. ::: CNS యాజులు, సాక్షి టీవీ ఇదీ చదవండి: ఆ టీడీపీ ఎమ్మెల్యే వస్తే ఊరంతా హడల్! -
‘టీడీపీలోకి వెళ్లే ఆలోచనే లేదు’
హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్ నేత రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన సైకిల్ ఎక్కుతారంటూ ఆ ప్రచారంలో ఉంది. అయితే.. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో చేరతానన్న వార్తలు అవాస్తవం. బీజేపీలోనే కొనసాగుతాను. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి పోటీ చేస్తా. నా మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే పార్టీ సెట్ కాదు అంటూ జంపింగ్ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టారాయన. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీడీపీలోకి రాజాసింగ్ అంటూ ఆంధ్రజ్యోతి తాజాగా ఓ కథనం ప్రచురించింది. సస్పెన్షన్ తర్వాత బీజేపీ పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన పార్టీ మారతారని, ఈ మేరకు ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపారంటూ సుదీర్ఘంగా ఆ కథనంలో చర్చించింది. కానీ, ఆంధ్రజ్యోతిది తప్పుడు ప్రచారమేనని రాజాసింగ్ తేల్చేశారు. ఇదీ చదవండి: వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే.. మన ఉద్యోగాలు -
ఆయనే ఓ పెద్ద లాబీయిస్ట్.. దానికి తోడు పిచ్చి రాతలు
కొద్ది రోజుల క్రితం వరకు యెల్లో మీడియా ఏమని ప్రచారం చేసిందో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లారని. ఇప్పుడు ఏమి రాస్తున్నారో చూడండి. కర్నాటకకు చెందిన ఒక స్వామీజీని ఆశ్రయించారని, ఆయన్ని పిలిపించుకుని మంతనాలు జరిపారని. వీటిలో ఏది వాస్తవం? దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది?.. ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రమే కాదు.. ఈనాడు, ఆంద్రజ్యోతి , టీవీ5.. తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. వాళ్లు రాసేవన్నీ అబద్దాలేనని ఈ వార్తలే రుజువు చేస్తున్నాయి. పైగా ఆ స్వామీజీ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వంటివారు తిరుమలకు వచ్చినప్పుడు వాళ్ల పక్కనే ఉంటారని , ఆయన లాబీయిస్టు అని టీడీపీ కోసం బట్టలు ఊడదీసుకుని తిరిగే ఓ పత్రిక ప్రకటించేసింది కూడా. రాష్ట్రపతికి , అలాగే న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నవారికి కూడా ఉద్దేశాలు ఆపాదించడానికి కూడా వీళ్లు బరితెగిస్తారు. అదే వైఎస్సార్సీపీ వాళ్లు ఎవరినైనా ఏమైనా అంటే చాలు.. ఇంకేముంది నానా యాగీ చేస్తారు. మరి ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్‌ను ఉద్దేశించే ఇంత దారుణంగా రాశారంటే వారిది ఎంత తెంపరితనం అనుకోవాలి!. పైగా తిరుమలలో స్వామీజికి ఎవరో సహకరించకపోతే అలా వారి పక్కన ఉండగలుగుతారా అని పిచ్చి ప్రశ్న ఒకటి. రాష్ట్రపతిగాని, అత్యున్నత స్థానంలో ఉన్నవారెవరైనా, తాము ఎవరిని వెంటబెట్టుకుని వెళ్లదలిస్తే వారి జాబితాను పంపితే సరిపోతుంది. అంతే తప్ప తిరుమలలోనో, ప్రభుత్వంలోనో ఉన్నవారు పంపితే వారు అనుమతిస్తారా?. ఈ మాత్రం విజ్ఞత లేకుండా చేతిలో పేపర్ ,టీవీ ఉన్నాయని నానా చెత్త అంతా రాస్తున్నారు. దీనివల్ల వారికే నష్టం జరుగుతోంది. పొరపాటున టీడీపీ అనుకూల మీడియా నిజం రాసినా.. ఎవరూ నమ్మని పరిస్థితిని తెచ్చుకున్నారు. దీనిని గమనించే ముఖ్యమంత్రి జగన్ ఈ పత్రికలను దుష్టచతుష్టయంలో భాగం చేశారు. ఆయన అలా గట్టిగా ఎదిరించి ఉండకపోతే, వీరు రాసే అబద్దాలన్నిటినీ నిజాలని ప్రజలు భ్రమించవలసి వచ్చేదేమో!. 👉 గతంలో తమకు నచ్చని రాజకీయ పార్టీలను ఇలాగే భ్రష్టుపట్టించేవారు. వాటిని ఎదుర్కోలేక అవి నానా తంటాలు పడుతుండేవి. ఇప్పుడు జగన్‌కు ఆ ఇబ్బంది లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి వాటిని ఆయన శత్రుకూటమిలో భాగమనే ప్రజలకు గట్టిగానే చెప్పేశారు. కొంతకాలం క్రితం న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం టాప్ చేస్తోందని ఒక తప్పుడు కధనాన్ని ప్రచారం చేశారు. దానిపై హైకోర్టు కూడా కొంత స్పందించింది. కానీ, ఆ తర్వాత ఆ పత్రిక అవాస్తవాలు రాసిందని అర్ధం చేసుకుని, ఆ గొడవను పక్కనపెట్టేసినట్లనిపిస్తుంది. ఇలా ఒకటి కాదు. ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఎంత వీలైతే అంత అగాధం సృష్టించడానికి ఈ టీడీపీ మీడియా చేయని విష ప్రయత్నం లేదంటే ఆశ్చర్యం కాదు. 👉 దీనికి తోడు అప్పట్లో ఉన్న ఒకరిద్దరు గౌరవ న్యాయమూర్తులు ఏ కారణం వల్లనన్నా కాని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంచెం వ్యాఖ్యానం చేసేవారన్న అభిప్రాయం ఉండేది. ఆ వ్యాఖ్యల్ని ఈ టీడీపీ మీడియా పతాక శీర్షికలలో ప్రచురించడమే కాదు.. ఏదో జరిగిపోతోందన్న భావన కలిగించే యత్నం చేసేది. అలాగే ఇప్పుడు ఏకంగా న్యాయ వ్యవస్థను అప్రతిష్టపాలు చేసేలా ఈ కధనాలు రాశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ కోరిక మేరకు సాయం చేయబోతున్నారని రాసింది వీరే. ఇప్పుడు ఎవరో స్వామీజీ ద్వారా లాబీయింగ్ చేస్తున్నారని రాసింది వీరే. తీరా చూస్తే ఆ లాబియిస్టుగా వీరు చెప్పిన విజయకుమార్ స్వామీజీ వెంట ఉన్న పారిశ్రామికవేత్త చింతా శశిధర్ ఈనాడు అధినేత రామోజీరావు సమీప బంధువని తేలింది. కానీ, ఆయన ఫలానా అని రాయకుండా యెల్లో మీడియా జాగ్రత్తపడింది. కేవలం పారిశ్రామికవేత్త అని రాసి సరిపెట్టింది. 👉 చింతా శశిధర్ అనే ఈ పారిశ్రామికవేత్త నవయుగ కంపెనీ అధినేత విశ్వేశ్వరరావు కుమారుడు. విశ్వేశ్వరరావుకు ఈ కథనాన్ని వండిన మీడియా అధినేతకు మధ్య ఆర్దిక సంబంధాలు కూడా ఉండేవి. అందుకేనేమో టిటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పిన విషయాలలో కొన్నింటిని ఎడిట్ చేసి.. ఆయన ప్రస్తావన రాకుండా వార్త ఇచ్చారు. ఇక్కడ మరో సంగతి కూడా చెప్పాలి. లాబీయిష్టు అంటూ కథనాలు ఇచ్చిన పత్రికాధిపతి కూడా లాబియిస్టే. 👉 గతంలో ఆయా రాజకీయ పార్టీలు బ్రోకర్ అని కూడా ఆయన్ని విమర్శించేవి. దానికి కారణం ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్న టైమ్ లో సచివాలయంలో పైరవీలలో చక్రం తిప్పేవారని అంటారు. అలాగే గత టరమ్ లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు లావాదేవీలలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారని చెబుతారు. మరి అలా చేసిన వ్యక్తిని లాబియిస్టు అంటారా? రాజకీయ బ్రోకర్ అంటారా?. ఎదుటివారిని అనడం కాదు.. తాము ఎలా ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోకూడదు. నీతులు చెప్పేస్తే జనం అంతా చెవిలో పూలు పెట్టుకుని వింటారన్నది కొందరి నమ్మకం. 👉 విజయకుమార్ స్వామీజీ గతంలో రామోజీకి సంబందించిన ఒక ఫంక్షన్ కు కూడా హాజరై ఆశీర్వదించారట. వైవి సుబ్బారెడ్డి చాలా స్పష్టంగా విజయకుమార్ స్వామీజి తమకు తెలుసునని, ఆయనను సీఎంగారికి ఆశీర్వచనం ఇప్పించడానికి ఆహ్వానించామని వెల్లడించారు. ‘‘రామోజీ సమీప బంధువు ఆయన్ని వెంటబెట్టుకు వచ్చారు. కాబట్టి మార్గదర్శి కేసు నుంచి బయట పడేయించడానికే తీసుకు వచ్చారని అనవచ్చా?’ అని వైవీ సుబ్బారెడ్డి ముక్కుసూటిగా ప్రశ్నించారు. ఒక పక్క సీబీఐ తన మానాన తాను ఏకపక్షంగా విచారణ సాగిస్తూ, వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేసి, ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలా అరెస్టు చేయాలా? అనే ఆలోచన చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోపక్క ఈ టీడీపీ మీడియా ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాసి ముఖ్యమంత్రి జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. చివరికి తానే వివేకాను హత్య చేశానని చెప్పిన వ్యక్తితో మాట్లాడి పేజీలకొద్ది వార్తలు ఇచ్చే దుస్థితికి ఈనాడు వచ్చింది. హత్య చేసిన తర్వాత ముందస్తు బెయిల్ పొంది, అప్రూవర్ గా మారి బయట తిరిగి ఎవరో ఒకరిపై ఆరోపణలు చేస్తూ.. మీడియాతో మాట్లాడే సదుపాయం ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి. 👉 ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. నటుడు , టీడీపీ నేత బాలకృష్ణ తన ఇంటిలో కాల్పులు జరిపినప్పుడు ఆయన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి, బావ వెంకటేశ్వరావులు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి సాయం చేయాలని కోరారని చెబుతారు. మరి వారిని లాబియిస్టులుగా ఆనాడు ఈ మీడియా ఎందుకు రాయలేదు?. వివేకా కేసులో అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని కోరుతున్నవారిని ఎలాగోలా బద్నాం చేయాలని వీరు తంటాలు పడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టడానికి సీబీఐని వాడుకున్నట్లు.. ఇప్పుడు అవినాష్‌రెడ్డిని కూడా ఇరుకున పెట్టాలని టీడీపీ, ఆ పార్టీ మీడియా విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. అవినాష్‌కు హైకోర్టులో వారం రోజులపాటు అరెస్టు కాకుండా ఊరట లభించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనలలో వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించి షేడీ వ్యవహారం వెలుగులోకి రావడం ఆయనకు అప్రతిష్ట తెచ్చింది. దీనికి ఆయన కుమార్తె, అల్లుడు కారణం అవుతున్నారా!. పైగా వివేకా కుమార్తె తండ్రి హత్య జరిగినప్పుడు మాట్లాడిన విషయానికి, ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకు ఎంత తేడా ఉంది! మరి దీనికి కారణం ఏమిటో!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
వివేకా కేసు.. ‘టీడీపీ నీచ స్థాయికి దిగజారింది’
సాక్షి, గుంటూరు: వివేకా హత్య కేసులో యెల్లో మీడియా యథేచ్ఛగా ట్రయల్ చేస్తోందని, అధికారం ఉంటే తీర్పు కూడా ఇచ్చేదేమోనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాజా పరిణామాలపై తాడేపల్లిలో ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. వివేకా హత్యపై ఎల్లో మీడియా కల్పితాలు ప్రచారం చేస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే దస్తగిరి మాటల్ని పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. అతని మాటలకు అధిక ప్రచారం కల్పిస్తున్నారు. కానీ, అతని స్టేట్మెంట్లు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే.. కావాలనే దస్తగిరిని ఆర్గనైజ్ చేసి మాట్లాడించినట్లు కనిపిస్తోందని సజ్జల పేర్కొన్నారు. విపక్షాల పొలిటికల్ ఎజెండాలో భాగంగానే అవినాష్‌కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారాయన. బాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే.. వివేకా కేసును రాజకీయ ఎజెండాలో భాగంగానే టీడీపీ వాడుకుంటోందని.. తద్వారా నీచ స్థాయికి దిగజారిందని సజ్జల విమర్శించారు. ‘‘చంద్రబాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే ఇదంతా నడుస్తోంది. ఓ ప్లాన్ ప్రకారమే పొలిటికల్ ఎజెండాగా మార్చుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్రకు తెరలేపారు. నేరం మోపాలని ముందుగానే నిర్ణయానికి వచ్చారు. తమ పాలనలో ప్రజలకు ఏం చేశామన్నది చెప్పుకోవడానికి టీడీపీ దగ్గర ఏం లేదు. అందుకే వివేకా కేసును ఓ ప్రథకం ప్రకారమే వాడుకుని.. సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా కుట్ర చేస్తోంది. జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియకే ఈ నాటకాలు. రాబోయే ఎన్నికల కోసం ఓ కథను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో పని చేస్తుందేమోనని టీడీపీ దురాశ అని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష సాక్షిని పట్టించుకోదా? వివేకా కేసులో టీడీపీ అనుకూల ఎల్లో మీడియా కల్పితాలు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక కుట్రలు చేస్తోంది. కట్టుకథలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఎలా హత్య చేశాడన్నది దస్తగిరి స్వయంగా చెప్పాడు. అసలు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి బెయిల్ ఇప్పించిందెవరు?. ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్ రంగన్న ఉండగా.. అప్రూవర్ మాటల్ని ఎందుకు సీబీఐ పట్టించుకుంటోంది. కేసు తేలని సమయంలోనే అప్రూవర్‌గా మార్చారని, విచారణ పేరుతో ఓ డ్రామా నడిపిస్తున్నారని సజ్జల అన్నారు. వివేకా కేసులో ఇష్టానుసారం సీబీఐ పేర్లు చేరుస్తుంటే.. ఎల్లో మీడియా ప్రింట్లు వేస్తోందని సజ్జల ఎద్దేవా చేశారు. కొత్త బృందం ఏం చేసింది? మరోవైపు ఈ కేసులో సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో హడావిడి చేస్తోందని సజ్జల అసహనం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు పూర్తైనట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ, స్టేట్మెంట్లు తీసుకోవడం తప్ప సీబీఐ దర్యాప్తు చేయడం లేదు. విచారణ పేరుతో డ్రామా జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు పేరుతో ఓ తతంగం నడిపిస్తున్నారు. కీలక విషయాల్ని పట్టించుకోలేదనే దర్యాప్తు అధికారిని మార్చారు. కానీ, కొత్త బృందం ఒక్క ఆధారాన్ని అయినా సేకరించిందా? అని సజ్జల ప్రశ్నించారు. ఊహాజనితంగా మేం ప్రశ్నించడం లేదు. ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారనే మా బాధ. దర్యాప్తు పేరుతో జరుగుతున్న తతంగాన్ని ఎదుర్కొంటాం. వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలపై కేసులు నిలవడవు. కొంతకాలం ఇబ్బంది పెడతారేమో కానీ చివరకు న్యాయమే గెలుస్తుందని సజ్జల అన్నారు.