Ramoji, RK: సైకోల నుంచి సైతాన్‌లుగా ప్రమోషన్‌! | Ksr Comments On How Eenadu And AndhraJyothi Media Misleading The People | Sakshi
Sakshi News home page

Ramoji, RK: సైకోల నుంచి సైతాన్‌లుగా ప్రమోషన్‌!

Published Wed, Mar 27 2024 12:11 PM | Last Updated on Wed, Mar 27 2024 5:39 PM

Ksr Comments On How Eenadu And AndhraJyothi Media Misleading The People - Sakshi

రోజు-రోజుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దిగజారిపోయి పాఠకులను హింసిస్తున్నాయి. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఈ రెండు సంస్థల యజమానులు రామోజీరావు, రాధాకృష్ణలు సైకోల నుంచి సైతాన్‌ల స్థాయికి ప్రమోషన్ పొందినట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రడ్డిపై విద్వేషంతో ఏపీపై పగబట్టి రాస్తున్న వార్తలు దారుణంగా ఉంటున్నాయి. ఈ శాసనసభ ఎన్నికల వరకు ఈ బాధ తప్పదని తెలిసినా, మరీ నీచంగా మారడం అత్యంత శోచనీయం అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈనాడు పచ్చి మోసపూరిత వార్తలు రాసింది.

రామోజీరావు ఈ విధానం కరెక్టు అని భావిస్తే దానినే ధైర్యంగా రాసి బీజేపీని తీవ్రంగా విమర్శించాలి. కాని అంత ధైర్యం లేదు. పైగా వారు ఈయనకు పద్మ విభూషణ్ బిరుదు కూడా ఇచ్చారు కదా! దానికి సదా కృతజ్ఞతగా లొంగి ఉండాలి కదా! బీజేపీ తనకు ఎన్నికల నిధులు ఇవ్వడం లేదనుకున్నవారిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ వంటివాటిని ప్రయోగిస్తోందన్న ఆరోపణ వస్తోంది. అది నిజమా? కాదా? కొన్ని ఆంగ్ల పత్రికలలో ఏ ఏ కంపెనీలపై దాడులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏ కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయి. వాటిలో అత్యధిక భాగం బీజేపీకే దక్కాయా? లేదా? అన్నది ఆ వార్తల సారాంశం.

బీజేపీకి మొత్తం విరాళాలలో ఏభై శాతం నిధులు దక్కితే ఆ తర్వాత టీఎంసీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, డీఎమ్‌కే వంటి పార్టీలు ఉన్నాయి. తదుపరి వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ విరాళాలపై విశ్లేషిస్తే బీజేపీకి నిదులు ఇచ్చిన కంపెనీలు ఏవి? స్వచ్చందంగా ఇచ్చాయా? లేక భయపడి ఇచ్చాయా? అన్న అంశాలపై పరిశోధన చేయవచ్చు. కొన్ని ఆంగ్ల పత్రికలు ఈ విషయంలో వివరణాత్మక స్టోరీలు ఇచ్చాయి. ఈనాడు మీడియాకు, దాని అదినేత రామోజీరావుకు దేశం అంతా ఎటు పోయినా ఫర్వాలేదు. ఎవరికి ఎన్నివేల కోట్ల రూపాయల నిధులు వచ్చినా ఇబ్బంది లేదు.. కాని ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కు నిదులు వస్తే మాత్రం ఏదో ఒక చెత్తరాసి బురదచల్లుతారు. ఈ కధనంలో అవేవో కంపెనీలకు భూములు ఇచ్చి ఫేవర్ చేసినందుకే అవి విరాళాలు ఇచ్చాయని రాశారు. వైసీపీకి అందుకే ఇచ్చారని అనుకుందాం. మరి తెలుగుదేశంకు ఎందుకు విరాళాలు ఇచ్చారు. అధికారంలో ఉన్న వైసీపీకి 499 కోట్లు విలువైన బాండ్లు వస్తే, తెలుగుదేశంకు 320 కోట్ల మేర బాండ్లు వచ్చాయి.

  • అంటే ఆయాకంపెనీలను తెలుగుదేశం బ్లాక్ మెయిల్ చేసి ఆ డబ్బును సంపాదించిందా?
  • తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలోని కంపెనీలే ఎందుకు వచ్చాయి?
  • చంద్రబాబు అంటే భయపడి ఇచ్చాయా? లేక ఆయన బెదిరించి సంపాదించారా?
  • ఉదాహరణకు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిది అని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు కదా? వారు ఎక్కడ ఏ పరిశ్రమ పెడుతున్నా అటు తెలుగుదేశం కాని, ఇటు ఈనాడు రామోజీరావు కాని దానిని అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేసేవారు కదా! ఎంతో విషం చిమ్మేవారు కదా! అదే కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీకి నలభై కోట్ల విరాళం ఎలా అందింది.

నిజంగానే అది వైఎస్సార్‌సీపీ సంబందించిన వారిది అనుకుంటే టీడీపీ తిరస్కరించి ఉండవచ్చుకదా! అంటే బ్లాక్ మెయిల్ చేసి ఆ కంపెనీ నుంచి విరాళం రాగానే టీడీపీ నోరు మూసేసుకుందా? బీజేపీకి రూ.8,250 కోట్ల బాండ్లు, కాంగ్రెస్‌కు రూ.1,951 కోట్లు, టీఎమ్‌సీకి రూ.1,716 కోట్లు, బీజేడీకి రూ.1,019 కోట్లు, డీఎంకేకి రూ.656 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు రూ.1,408 కోట్ల బాండ్లు లబించాయి. చివరికి ఒక్క అసెబ్లీ సీటు మాత్రమే గెలుచుకున్న జనసేనకు కూడా 21 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి కదా! వీరందరికి ఏ రకంగా వచ్చాయో ఎందుకు విశ్లేషించలేదో రామోజీ చెప్పగలరా! టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన ఒక విశ్లేషణ ప్రకారం డీఎమ్‌కే , వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లకు వాటికి రావాల్సిన వాటా రాలేదని వెల్లడించింది.

వైఎస్సార్‌సీపీ, డీఎంకేల కన్నా చిన్న పార్టీ అయిన బీఆర్‌ఎస్‌కు రెండు, మూడు రెట్ల నిదులు ఎందుకు వక్కువ వచ్చాయి? వైసీపీకి 23 మంది లోక్ సభ, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రావల్సినంత రాలేదన్నది దీని అర్ధం. అదే టైమ్‌లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 లోక్ సభ , ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్న టీడీపీకి 320 కోట్ల బాండ్లు ఎలా దక్కాయో చెప్పాలి కదా! కొన్ని కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు జరిగిన తర్వాతే అవి బీజేపీకి బాండ్ల రూపంలో నిదులు సమకూర్చిన విషయాన్ని కొన్ని ఆంగ్ల పత్రికలు సమగ్రంగా ఇచ్చాయి.

ఇవన్ని పక్కనబెట్టి రామోజీరావు వైసీపీపైనే పడి ఎందుకు ఏడుస్తున్నారు? విశేషం ఏమిటంటే ఒకపక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రడ్డి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను తరిమేశారని పదే, పదే రాస్తుంటారు కదా? అదంతా అబద్దమని శనివారం నాడు రాసిన పత్రికలో రాసిన ఈ బాండ్ల కధనంతో తేలిపోయింది. వైసీపీకి 96 కంపెనీల నుంచి విరాళాలు అందితే అందులో 26 విద్యుత్ కంపెనీలు అని ఈ పత్రిక రాసింది. అంటే కొత్తగా కేవలం విద్యుత్ రంగంలోనే 26 కంపెనీలు వస్తున్నట్లు ఒప్పుకున్నట్లే కదా? వారు విరాళం ఇచ్చారంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెడుతున్నట్లే కదా! 30826 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, ముఖ్యంగా సౌర, పవన, పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారని తెలిపింది. వీటి స్థాపనకు లక్ష ఎకరాలు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీకి ఉపయోగం లేదని మరో దిక్కుమాలిన రాత రాసింది. అదే వార్తలో మెగావాట్‌కు లక్ష రూపాయల చొప్పున గ్రీన్ టాక్స్ వస్తుందని తెలిపింది. విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులు దేనికి కూడా భూమిని ప్రభుత్వం కేటాయించలేదు.

రైతుల నుంచి ఈ పరిశ్రమలవారు లీజుకు తీసుకుని ఏటా ఏకరాకు ముప్పైవేల రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని ఆదేశించింది. దీనివల్ల రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమలో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా రైతులకు మేలు చేస్తే, అదేదో తప్పు అయినట్లు ఈ పత్రిక దరిద్రపు గొట్టు వార్త రాసింది. ఈ భూములు ఇచ్చారు కనుక విరాళాలు పొందిందని నీచమైన విశ్లేషణ చేసింది. గ్రీన్‌కో కంపెనీకి 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇస్తే, ఆ కంపెనీ వైసీపీకి పది కోట్లు ఇచ్చిందట. ఏమన్నా మతి ఉండి ఈనాడు రామోజీ ఇలా రాస్తారా? కొన్ని వేల కోట్ల కంపెనీ కేవలం పది కోట్లు ఇస్తే అది కూడా ఫేవర్ చేసినట్లా? ఇక మెఘా కంపెనీ ఇచ్చిన 37 కోట్ల మీద కూడా ఇలాంటి చెత్తనే రాశారు. ఆ కంపెనీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కలిపి సుమారు 900 కోట్లు ఇచ్చింది. అదే వైసీపీకి 37 కోట్లే. కాని టీడీపీకి 25 కోట్లు ఇచ్చింది. దీనిపై ఈనాడు రాసిన వార్త చదివితే ఎంత బుద్ది, జ్ఞానం లేకుండా ఈ పత్రిక విషం చిమ్ముతోందా అనిపిస్తుంది.

సీలేరు, పోలవరం హైడల్ ప్రాజెక్టులతో పాటు తాజాగా 12 వేల కోట్ల రూపాయల విలువైన ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఇచ్చినందుకే ఈ విరాళం ఇచ్చిందని రాశారు. మరి తెలుగుదేశం కూడా మరి పాతిక కోట్లు ఎందుకు ఇచ్చింది రాయలేదు. ఏమీ లేని జనసేనకు 21 కోట్లు ఎలా వచ్చాయని ఈ పత్రిక ప్రశ్నించలేదు. తెలుగుదేశంకు భారత్ బయోటెక్ పది కోట్లు, పశ్చిమ యుపి పవర్ ఇరవై కోట్లు, నాట్కో పద్నాలుగు కోట్లు, రెడ్డి లాబ్స్ పదమూడు కోట్లు ఎందుకు ఇచ్చాయో విశ్లేషించాలి కదా! అధికారం లేదు కనుక ప్రతిపక్షంగా ఉండి టీడీపీ వారిని బ్లాక్ మెయిల్ చేసిందని రామోజీ ఎందుకు చెప్పడం లేదు? ఇక టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన రాజ్యసభ సబ్యుడు సీఎమ్.రమేష్ కాంగ్రెస్, జేడీఎన్‌లకు కలిపి 40 కోట్లు ఎలా ఇచ్చారు? టీడీపీకి ఐదు కోట్లు ఎలా ఇచ్చారు. అంటే ఈ పార్టీలతో కూడా సంబంధ బాంధవ్యాలు మెయిటెన్ చేస్తున్నట్లే కదా! రామోజీ వికృత రాతలకు, పక్షపాత కధనాలకు ఇదో పెద్ద ఉదాహరణగా తీసుకోవాలి.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
 
Advertisement