సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీపై అసంతృప్తితో పార్టీ మారబోతున్నారంటూ పచ్చ బ్యాచ్ చేస్తున్న ప్రచారంపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వీధికుక్కల ప్రచారం పట్టించుకోనన్న ఆయన.. సీఎం జగన్ వెంటే తన ప్రయాణమని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారం ఉత్తదే. వీధి కుక్కల ప్రచారం నేను పట్టించుకోను. బాబాయ్ చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ పార్టీని, అలాగే ఇంటి పేరు వదిలేసి వెళ్తే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలిసి వస్తుంది. పార్టీ లైన్ దాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవ’’ని విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు.
అలాగే మేకపాటి కుటుంబం ఎప్పుడూ సీఎం జగన్‌తోనే ఉంటుందని, ఆయన వెంటే నడుస్తుందని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడు.. ఎప్పుడూ.. సీఎం జగన్ తోనే మా ప్రయాణం. ఆయన్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకే టీడీపీ తన అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని ప్రచారం చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా ఎవరు కలిసొచ్చినా సరే.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్న సీఎం జగన్ స్థానాన్ని చెరపలేరు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలితం లేదన్నారాయన. ఇక.. జిల్లా పరిణామాలపైనా స్పందించిన మేకపాటి విక్రమ్‌రెడ్డి.. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పదికి పది స్థానాలు గెలిచి సీఎం వైఎస్ జగన్‌కు కానుకగా ఇస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చంద్రశేఖర్‌రెడ్డి.. నువ్వు మళ్లీ గెలుస్తావా?
Comments
Please login to add a commentAdd a comment