Mekapati Vikram Reddy
-
గెలుపు ఓటములు సహజం అంత మాత్రాన..
-
ఈ దెబ్బతో మన బలం ఏంటో వాళ్లకు తెలియాలి
-
ఓటమిపై మేకపాటి విక్రమ్ రెడ్డి రియాక్షన్
-
లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
మేనిఫెస్టో కోసం వెయిటింగ్ ఇక్కడ
-
చేసిన అభివృద్ధి చూపించి ఓటు అడుగుతున్నాం
-
సీఎం జగన్‌పై దాడి: స్పందించిన ప్రధాని మోదీ..వైఎస్సార్సీపీ నేతలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్‌పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగింది. అనంతరం వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్‌నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లికి బయల్దేరారు. సీఎం జగన్‌తో పాటుగా వైఎస్ భారతీ ఉన్నారు. గాయం కారణంగా సీఎం వైయస్ జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగా, సీఎం జగన్‌పై దాడి ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘జగన్ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. సీఎం జగన్‌పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల సంఘం ద్వారా కఠినమైన చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Glad you are Safe. Take care @ysjagan Anna Strongly condemn the attack on AP CM Jaganmohan Reddy Garu. Violence has no place in democracy and I hope strict preventive measures are put in place by ECI pic.twitter.com/fTBTe17I2T — KTR (@KTRBRS) April 13, 2024 మరోవైపు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘సీఎం జగన్‌పై దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు’ అని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం జగన్‌పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. I condemn the stone-throwing on Hon'ble Andhra Pradesh CM Thiru @ysjagan. Political differences should never escalate to violence. Let's uphold civility and mutual respect as we engage in the democratic process. Wishing him a quick recovery. https://t.co/YtYoOJbVy1 — M.K.Stalin (@mkstalin) April 13, 2024 సీఎం జగన్‌పై రాయితో జరిగిన దాడి ప్రధాని నరేంద్ర మోదీ స్పంధించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. I pray for the speedy recovery and good health of Andhra Pradesh CM @ysjagan Garu. — Narendra Modi (@narendramodi) April 13, 2024 అంబటి రాంబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై దాడి చంద్రబాబు పనే అన్నారు. ఈ ఘటన బాబు ప్రోద్భలంతోనే జరిగింది. చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం సరికాదు. చంద్రబాబు, పవన్, బిజెపి ముగ్గురూ కలిసినా జగన్‌ను ఏమీ చేయలేరు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని అంబటి రాంబాబు అన్నారు. పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇలా దాడులు చేయడానికి తెగబడ్డారు. ఎంతమంది కలి వచ్చినా జగన్‌ను ఏమీ చేయలేక రాళ్ల దాడి చేశారు. సీఎం జగన్‌కు లోతుగా గాయమైంది. రెండు కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. తల నుంచి రక్తం కారుతుంటే వైద్యులు ప్రధమ చికిత్స చేశారు. త్వరలోనే సీఎం జగన్‌పై ఎవరు దాడి చేయించారో అన్నీ బయటకు వస్తాయి అన్నారు. మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నా. సీఎంపై టీడీపీ గూండాలు దాడి చేయడం అమానుషం. ఇలాంటి దాడులు చేయడమే టీడీపీ పాలసీ. ఎన్నికల్లో ఓటమి తప్పదని టీడీపీ నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారు అని విక్రమ్‌రెడ్డి అన్నారు. ట్విట్టర్లో రాజ్యసభ సభ్యులు, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి.. ► రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ► చంద్రబాబు నాయుడు ఏనాడు అభివృద్ధి నమ్ముకుని రాజకీయాలు చెయ్యలేదు. ► హింస, కుట్రలు, కుతంత్రాలు నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారు. ► చంద్రబాబు పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని ఇవాళ జరిగిన దాడితో మరోసారి రుజువైంది. నారాయణ స్వామి,డిప్యూటీ సీఎం కామెంట్స్ ► మానవ జన్మ ఎత్తున చంద్రబాబు నాయుడు నరరూప రాక్షసుడు ► సిఎం జగన్ మోహన్ రెడ్డి కు బస్సు యాత్ర లో వస్తున్న ప్రజాభిమానం చూసి తట్టుకోలేక రాళ్ళ దాడి చేయించాడు ► నర హంతకుడు చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు ప్రజాభిమానంతో దూసుకువెళ్తున్న జగన్ యాత్ర పై రాళ్ళ దాడి చేయించాడు ► చంద్రబాబు ను ప్రజలు క్షమించరు, రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ► మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో సహనంతో ఉండమంటున్నారు, చంద్రబాబుకు ప్రజలే మీ అంతుచూస్తారు ► మా ముఖ్యమంత్రి కి ఏదైనా జరిగితే మేమే మీ అంతు చూస్తాం అంటూ హెచ్చరిక మాజీమంత్రి బాలినేని కామెంట్స్ ► విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి హేయమైన చర్య ► దాడి వెనుక కుట్రకోణం ఉంది..పూర్తి స్థాయి విచారణ జరగాలి ► దాడులతో ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు ► దాడులు చేసి వైఎస్సార్సీపీని బయపెట్టాలనేది మీ భ్రమ ► చంద్రబాబు కి మతి భ్రమించింది....ప్రస్ట్రేషన్ లో చంద్రబాబు ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియదు ► బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది ► టీడీపీ సభలకు జనం రాకపోవడం తో చంద్రబాబు కి ఫ్రైస్ట్రేషన్ ఎక్కువైంది సీఎం జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి.. ► పక్క ప్లాన్ ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై టిడిపి గుండాలు రాళ్లతో దాడి చేశారు ► సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి టిడిపి నేతల కడుపు మండుతోంది.. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు సీఎం జగన్ పై దాడిని ఖండించిన ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ► విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాలు దాడి చేయడం దారుణం ► ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక ఇటువంటి దాడులు చేయడం సిగ్గుచేటు ► రాష్ట్రంలో 175 సీట్లకు గాను 175 సీట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటున్నారని అనేక సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వైసిపికి రాబోయే విజయాన్ని తట్టుకోలేకపోతున్నాయి ► ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి దిగిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముఖ్యమంత్రి మీద భౌతిక దాడులు చేసే స్థాయికి దిగజారిపోయారు: హోం మంత్రి తానేటి వనిత ► బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ పై టిడిపి నాయకులు చేసిన రాళ్లదాడిని ఖండిస్తున్నా ► జగనన్న బస్సు యాత్ర ఎంతో ప్రజాధరణ పొందడం చూడలేక దాడికి దిగారు ► ఒంటరిగా జగనన్నను ఢీకొట్టలేక నిన్న మొన్న జనసేన ను తెచ్చుకున్నా ఏమీ చేయలేకపోయారు ► తాజాగా బిజెపితో జతకట్టిన మైలేజ్ సాధించలేకపోయారు ► జగన్‌ను ఏమీ చేయలేని పరిస్థితుల్లో షర్మిలమ్మను ఇంటి నుంచి బయటకు లాగి కాంగ్రెస్‌లో పెట్టారు ► ఎంతసేపు జగన్ మీద రాజకీయంగా కుట్ర చేయాలి అదే వారి ఆలోచన సీఎం జగన్ పై దాడి పిరికిపంద చర్య: అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి ► సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ► దాడులు తెలుగుదేశం పార్టీ సంస్కృతి ► గత కొన్ని రోజుల నుంచి టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు లోకేష్ రెచ్చగొడుతున్నారు ► సీఎం జగన్ కు ప్రపంచవ్యాప్తంగా కరుడుగట్టిన అభిమానులు ఉన్నారు ► వారు కూడా తిరిగి దాడులు చేస్తే టిడిపి నేతలు పరిస్థితి ఏంటి ► దాడులు అనేవి వైఎస్ఆర్సిపి సంస్కృతి కాదు సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: గుడివాడ అమర్నాథ్ ► చంద్రబాబు పాతకాలపు రాజకీయాలను మానుకోవాలి ► సీఎం జగన్ పై దాడి చేస్తే భయపడతారని చంద్రబాబు భ్రమ పడుతున్నారు ► గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు కిరాతకంగా చంపించారు ► నేడు మళ్లీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి చేయించారు ► దాడులు చేయిస్తే సీఎం సభలు సమావేశాలు నిర్వహించరని చంద్రబాబు భ్రమ పడుతున్నారు ► మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు ► ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నారు ► చంద్రబాబు రోడ్లు మీద తిరుగుతున్నారు ► మేము దాడులు చేయాలంటే నిమిషం పని..దాడులు చేయడం వైఎస్ఆర్సిపి సంస్కృతి కాదు ► 2019 ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావతమవుతాయి -
చూసూ ఊరుకోం... టీడీపీ నేతలకు మేకపాటి విక్రమ్ రెడ్డి వార్నింగ్
-
మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీ భవ యాత్ర..
-
Mekapati Goutham Reddy: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
ఒకే భూమి.. ఇద్దరికి డీ ఫారం పట్టాలు
ఆత్మకూరురూరల్(మర్రిపాడు): మర్రిపాడు మండలం చిలకపాడు రెవెన్యూ పరిధిలో రెవెన్యూ లీలలు వెలుగుచూశాయి. సర్వే నంబర్ 682–పీ లోని భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇద్దరికి డీ ఫారం పట్టాలు అందజేశారు. 1997లో రసం రామయ్యకు రెండెకరాలకు పట్టా ఇవ్వగా, అదే భూమిని 2005లో కొక్కంటి పద్మావతి పేరుతో 2.90 ఎకరాలకు డీ ఫారం పట్టాగా ఇచ్చారు. భూమి లబ్ధిదారులు ఇద్దరూ ఏపిలగుంటకు చెందిన వారు కావడంతో నిత్యం ఈ విషయమై ఇరువర్గాల మధ్యన గొడవలు చెలరేగుతున్నాయి. రెవెన్యూ వర్గాలు మాత్రం ముందుగా పట్టా పొందిన వారు భూమిని తమ అనుభవంలో ఉంచుకోలేదని, రెండో వారు గత 19 ఏళ్లుగా వివిధ పంటలు సాగు చేసుకుంటూ అనుభవంలో ఉంచుకున్నారని చెబుతున్నారు. అయితే పట్టా లబ్ధిదారుల కంటే వారి బంధువుల ప్రమేయంతో వివాదాస్పద భూమి సమస్య రోజురోజుకు జఠిలంగా మారి గ్రామస్తులు, రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ విషయమై ప్రస్తుతం సాగులో ఉన్న కొక్కంటి పద్మావతి భర్త శ్రీనివాసులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు తరచూ వినతి పత్రాలు ఇస్తున్నారు. తన పొలంలోకి తనను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డికి సైతం ఫిర్యాదు చేశారు. అలాగే రసం రామయ్య భార్య తమకు ఎఫ్‌డీస్ 16/1407/97 ప్రకారం రెండెకరాలకు పట్టా ఇచ్చారని, అందులో ఉన్న 90 సెంట్లను మాత్రమే కొక్కంటి పద్మావతికి డీ ఫారం పట్టా గా మంజూరు చేసే వీలుందన్నారు. రెవెన్యూ అధికారులను లోబరుచుకుని పద్మావతి భర్త శ్రీనివాసులు 90 సెంట్ల్లకు బదులుగా 2.90 ఎకరాలకు డీ ఫారం పట్టా పొందారని, తప్పుడు ధ్రువపత్రాలతో అధికారులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మర్రిపాడు తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ట్రెయినీ కలెక్టర్ సంజనా సిన్హా శనివారం రెవెన్యూ సిబ్బందితో కలిసి వివాదాస్పద భూమిని క్షేత్ర పరిశీలన చేశారు. ఇరువర్గాలు తమ వద్దనున్న అన్ని ఆధారాలతో సోమవారం మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను కలవాలని ఆదేశించారు. -
పవన్ కళ్యాణ్ పై మేకపాటి సెటైర్లు..
-
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి దిమ్మదిరిగే కౌంటర్
-
వీధికుక్కల ప్రచారం పట్టించుకోను: విక్రమ్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీపై అసంతృప్తితో పార్టీ మారబోతున్నారంటూ పచ్చ బ్యాచ్ చేస్తున్న ప్రచారంపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వీధికుక్కల ప్రచారం పట్టించుకోనన్న ఆయన.. సీఎం జగన్ వెంటే తన ప్రయాణమని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారం ఉత్తదే. వీధి కుక్కల ప్రచారం నేను పట్టించుకోను. బాబాయ్ చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీని, అలాగే ఇంటి పేరు వదిలేసి వెళ్తే ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలిసి వస్తుంది. పార్టీ లైన్ దాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవ’’ని విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే మేకపాటి కుటుంబం ఎప్పుడూ సీఎం జగన్‌తోనే ఉంటుందని, ఆయన వెంటే నడుస్తుందని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడు.. ఎప్పుడూ.. సీఎం జగన్ తోనే మా ప్రయాణం. ఆయన్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకే టీడీపీ తన అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని ప్రచారం చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా ఎవరు కలిసొచ్చినా సరే.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్న సీఎం జగన్ స్థానాన్ని చెరపలేరు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలితం లేదన్నారాయన. ఇక.. జిల్లా పరిణామాలపైనా స్పందించిన మేకపాటి విక్రమ్‌రెడ్డి.. 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని పదికి పది స్థానాలు గెలిచి సీఎం వైఎస్ జగన్‌కు కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రశేఖర్‌రెడ్డి.. నువ్వు మళ్లీ గెలుస్తావా? -
బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు
ఆత్మకూరు : నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అందజేశారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో శనివారం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి చేతుల మీదుగా 38 మంది బాధితులకు రూ.40.17 లక్షల చెక్కులను అందజేశారు. ఓ వైపు ఆరోగ్యశ్రీ పథకంతో ఎందరో పేదలు ఉచిత వైద్య సేవలు పొందుతుంటే, సీఎంఆర్ఎఫ్ కింద మరింత మందికి బాసటగా నిలవడం దేశంలో ఎక్కడా లేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. -
'వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా'
సాక్షి, నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు వద్ద నిర్మించిన నెల్లూరు బ్యారేజీను మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఐదు లక్షలు ఎకరాలకు.. ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజక వర్గాలకు మేలు చేకూరే విధంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడున్నర ఏళ్లుగా ఒక మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదు అని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లను రూ.320 కోట్లతో పూర్తి చేసినట్లు వివరించారు. ''సంగం ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా వేగం పెంచాం, పూర్తి చేశాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసినందుకు గర్వ పడుతున్నా. నాన్నగారి హయాంలో ప్రారంభిస్తే, ఆయన మరణం తర్వాత నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వం సంగం బ్యారేజి కోసం రూ.30 కోట్ల 5 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. బాబు హయాంలో కమీషన్లు దండు కోవడమే వాళ్లు చేశారు. సంగం ప్రాజెక్టుకు మన ప్రభుత్వంలో రూ.200 కోట్లు ఖర్చు చేశాం. కోవిడ్ సమస్య, వరద సమస్య ఉన్న మూడేళ్లలో పూర్తి చేశాం. స్నేహితుడు మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. హఠాన్మరణంతో గౌతమ్ మనకు దూరం అయ్యాడు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతం రెడ్డి పేరు పెట్టాం. గౌతం సంస్మరణ సభలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. 3లక్షల 85 వేల ఎకరాలు అయకటు స్థిరీకరణ జరుగుతోంది. నెల్లూరు ప్రాజెక్ట్ రూ.147 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభిస్తే.. రూ.86 కోట్లు ఖర్చు చేశారు.. ఆయన మరణం తర్వాత వాటిని పట్టించు కోలేదు. జలయజ్ఞంలో పెట్టిన 26 ప్రాజెక్ట్‌లు ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ప్రతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం'' అని సీఎం జగన్ స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (CM Jagan Nellore Tour: దశాబ్దాల స్వప్నం సాకారం) ఆత్మకూరుపై వరాల వర్షం ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ప్రతిపాదనలకు సీఎం జగన్ బహిరంగ సభ వేదికగానే ఆమోదం తెలిపారు. రూ.15 కోట్లతో హైవే నుంచి సంగం బ్యారేజి వరకు రోడ్, రూ. 40 కోట్లతో ఇరిగేషన్ పనులకు కేటాయించారు. 25 గ్రామాలకు రోడ్లు వేయడానికి రూ.14 కోట్లు మంజూరు చేశారు. రూ.12 కోట్లు స్పెషల్ గ్రాంట్‌గా కేటాయించారు. సంగం పంచాయితీకి రూ.4కోట్లు ఇచ్చారు. మొత్తంగా రూ.85 కోట్లు నిధులను అక్కడికక్కడే కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని ఈనెల 30వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని బుధవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బ్యారేజీ నిర్మాణం గురించి, దాని రైతాంగం ఎలా లబ్ధిపొందుతుంది తదితర వివరాలను విక్రమ్‌రెడ్డి సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్పారు. ఇంకా చేయాల్సిన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను నియోజకవర్గంలో తిరుగుతున్న సమయంలో స్థానిక ప్రజల నుంచి వస్తున్న స్పందన, సంక్షేమ పథకాల లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని ముఖ్యమంత్రికి చెప్పారు. త్వరలో బ్యారేజీని ప్రారంభిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్రెడ్డికి విక్రమ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: (సంక్రాంతి నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’) -
ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణస్వీకారం
సాక్షి,అమరావతి: ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌతమ్ అన్న ఆశయాలను నెరవేరుస్తానన్నారు. చదవండి: ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి! కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి కలిశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన విక్రమ్‌రెడ్డిని సీఎం జగన్ అభినందించారు. ఎమ్మెల్యే వెంట మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. చదవండి: జగన్ మావయ్యా.. మీరు మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఇంటికి జగనన్న అండగా నిలిచారని.. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయి అనడానికి ఆత్మకూరు ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రచారం సందర్భంగా గడప గడపకి వెళ్లినపుడు స్పష్టంగా కనిపించిందని.. అందుకే ఇంత పెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారన్నారు. నియోజకవర్గంలో చేయాల్సిన పనుల గురించి సీఎం చర్చించారన్నారు. పారిశ్రామిక ప్రగతి పై దృష్టి పెడుతున్నానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జులైలో అన్న గౌతమ్ రెడ్డి పేరుపై ఉన్న సంగం బ్యారేజినీ సీఎం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలో భాగంగా ఈ నెల 23న పోలింగ్ నిర్వహించారు. 1,37,289 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 64.26 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు ప్రతి రౌండ్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధిక్యత సాధించారు. సరాసరి ప్రతి రౌండ్లో 4 వేల ఓట్ల ఆధిక్యత దక్కించుకున్నారు. అధికార పార్టీకి బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్లో సైతం వైఎస్సార్సీపీ సత్తా చాటింది. 208 పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్సార్సీపీకి 167 ఓట్లు లభించాయి. బీజేపీకి 21, నోటాకు 3, బీఎస్పీకి 7, ఇతరులకు 10 ఓట్లు లభించాయి. ఫ్యాన్ గాలికి బీజేపీ గల్లంతు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ సునామీకి బీజేపీ గల్లంతయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్, కేంద్ర మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ నేతలు ఆత్మకూరులో తిష్టవేసి కోలాహలంగా ఎన్నికల ప్రచారం చేశారు. అధికార వైఎస్సార్సీపీపై అనేక అభాండాలు వేస్తూ ప్రచారం సాగించారు. బీజేపీ ఆరోపణలను ప్రజలు నిర్మొహమాటంగా తోసిపుచ్చారు. కేవలం 19,353 ఓట్లు మాత్రమే దక్కించుకుని 14.1 «శాతానికి ఆ పార్టీ పరిమితమైంది. తిరుపతి పార్లమెంటు, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్టు కోల్పోయిన బీజేపీ.. తాజాగా మూడోసారి ఆత్మకూరులోనూ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా కూర్చొన్నప్పటికీ వారి ఆటలు సాగలేదు. ఓటర్లు ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ.. అనైతిక మద్దతుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఎన్నికల అధికారి హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకుంటున్న మేకపాటి విక్రమ్‌రెడ్డి అపారంగా పెరిగిన ఓటర్ల మద్దతు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటర్ల మద్దతు ఆపారంగా పెరిగింది. పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయినప్పటికీ మంచి మెజార్టీ సాధించడం ద్వారా నేతలు సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో 83.38% పోలింగ్ అయ్యింది. ఈ ఉప ఎన్నికలో కేవలం 64.26 శాతానికే పోలింగ్ పరిమితమైంది. ఓటర్లు పోలింగ్‌కు వెళితే వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తారనే కారణంగా టీడీపీలోని ఓ సామాజిక వర్గం నేత, తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ట్రాక్టర్లలో నెర్రవాడ వెంగమాంబ తిరునాళ్లకు తరలివెళ్లేలా ప్రేరేపించారు. మర్రిపాడు, సంగం, ఆత్మకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున తిరునాళ్లకు వెళ్లడంతో ఓటింగ్ శాతం భారీగా పడిపోయింది. అయినప్పటికీ పోలైన ఓట్లలో 74.47 శాతం వైఎస్సార్సీపీకి దక్కాయి. 2019లో 53.22 శాతం ప్రజలు మద్దతుగా నిలిస్తే, ఇప్పుడు అందుకు అదనంగా 21.25 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌పై 5,337 ఓట్ల మెజార్టీని సాధించారు. ఈ పరంపర తుది రౌండ్ వరకు కొనసాగింది. ఆత్మకూరు పరిధిలోని 6 మండలాల్లో గణనీయమైన మెజార్టీ దక్కింది. గౌతమ్ అన్న పేరు నిలబెడతా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, పేదల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పట్ల ప్రజలు చూపిన ఆదరణే నా విజయానికి కారణం. ప్రణాళికా బద్ధంగా ఆత్మకూరు ఉన్నతికి కృషి చేస్తాను. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. నా విజయం కోసం విశేషంగా కృషి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులకు ధన్యవాదాలు. – మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆత్మకూరు -
గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు. అనంతరం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు -
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం సాధించింది. కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: 82 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ విజయం