Atmakur ByPoll Results 2022: Mekapati Vikram Reddy Comments About His Victory - Sakshi
Sakshi News home page

Mekapati Vikram Reddy: గౌతం అన్న పేరు నిలబెడతాను

Published Sun, Jun 26 2022 12:06 PM | Last Updated on Sun, Jun 26 2022 3:03 PM

Comments Of Mekapati Vikram Reddy After Election Victory - Sakshi

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్‌ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు.

అనంతరం.. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్‌ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్ర​ప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు.

రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్‌ఆర్‌ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌. రాష్ట్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్‌ జగన్‌ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement