
ఆత్మకూరు : నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అందజేశారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో శనివారం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి చేతుల మీదుగా 38 మంది బాధితులకు రూ.40.17 లక్షల చెక్కులను అందజేశారు.
ఓ వైపు ఆరోగ్యశ్రీ పథకంతో ఎందరో పేదలు ఉచిత వైద్య సేవలు పొందుతుంటే, సీఎంఆర్‌ఎఫ్ కింద మరింత మందికి బాసటగా నిలవడం దేశంలో ఎక్కడా లేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment