
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద ధాటికి నష్టపోయిన బాధితులకు సినీతారలు అండగా నిలిచారు. తమవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చిరంజీవి రూ. 50 లక్షలు చెక్ అందించారు. అంతేకాకుండా తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు.
కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment