cheques
-
బ్యాంక్ చెక్కుపై బ్లాక్ ఇంక్ నిషేధమా?: ఇదిగో క్లారిటీ..
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ''బ్యాంక్ చెక్కులను బ్లాక్ ఇంక్ (Black Ink)తో రాయకూడదు'' అని. ఇంతకీ ఈ వార్తలో నిజమెంత? 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) నిజంగా ఈ ఆదేశాలను జారీ చేసిందా అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.బ్యాంక్ చెక్కులపై బ్లాక్ ఇంక్ ఉపయోగించకూడదని వస్తున్న వదంతుల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలను జారీచేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పేర్కొంది. అంతే కాకుండా.. ఎలాంటి ఇంక్ వాడాలి అనేదానికి సంబంధించి తాజాగా ఎలాంటి ఆదేశాలు వెల్లడికాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్నవి కేవలం పుకార్లు మాత్రమే. కాబట్టి బ్యాంకులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ సంస్థలు కూడా బ్లాక్ ఇంక్ ఉపయోగించవచ్చని పీఐబీ వివరించింది.సాధారణంగా బ్లూ లేదా బ్లాక్ వాడొచ్చని చెబుతారు. ఎందుకంటే ఇవి రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. చదవడానికి కూడా బాగుంటుంది. చెక్కులపై, బ్యాంక్ సంబంధిత డాక్యుమెంట్లను రాయడానికి బ్లాక్ లేదా బ్లూ వాడొచ్చు. అయితే రెడ్ కలర్ లేదా ఎరుపు రంగు ఇంక్ వాడకం నిషేధం. ఎందుకంటే దీనిని అనధికారికంగా గుర్తిస్తారు. అంతే కాకుండా పెన్సిల్ లేదా తుడిచిపెట్టగలిగే వాటిని కూడా ఉపయోగించడం నిషేధం. ఎందుకంటే వీటిని చెరిపేసి.. మార్చేసే అవకాశం కూడా ఉంది.ఇదీ చదవండి: బ్యాంక్ చెక్‌పై 'ఓన్లీ' అని ఎందుకు రాస్తారో తెలుసా?బ్యాంక్ చెక్ రాయడానికి బ్లాక్ ఇంక్ నిషేధం అనే వార్తను ఎవరూ నమ్మకండి. ఎందుకంటే ఆ వార్తలో నిజం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా పీఐబీ వెల్లడించింది. ఏదైనా ఒక వార్తకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా.. సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా మంచి పద్దతి కాదని పేర్కొంది.It is being claimed in social media posts that @RBI has issued new rules prohibiting the use of black ink on cheques.#PIBFactCheck▶️This claim is #FAKE▶️Reserve Bank of India has not prescribed specific ink colors to be used for writing cheques🔗https://t.co/KTZIk0dawz pic.twitter.com/vbL3LbBtFs— PIB Fact Check (@PIBFactCheck) January 17, 2025 -
సీఎంకు చెక్కులు అందజేసిన మెగాస్టార్ చిరంజీవి
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద ధాటికి నష్టపోయిన బాధితులకు సినీతారలు అండగా నిలిచారు. తమవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చిరంజీవి రూ. 50 లక్షలు చెక్ అందించారు. అంతేకాకుండా తన కుమారుడు రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షలు అందజేశారు.కాగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
జగన్ వచ్చారు.. చెక్కులు అందాయి
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో దుర్ఘటన జరిగి 17 మంది మృత్యువాత పడితే 24 గంటల వరకు కనీసం ఘటనా స్థలానికే వెళ్లని అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మాజీ సీఎం వైఎస్ జగన్ రాకతో ఆగమేఘాల మీద చెక్కులు సిద్ధం చేశారు. గడువులోగా పరిహారం అందకుంటే ధర్నా చేస్తామన్న వైఎస్ జగన్ హెచ్చరికలతో అప్పటికప్పుడు 17 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు స్థానిక తహసీల్దారుల చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. -
‘నీట్’లో అక్రమాల ఆరోపణలు..
పట్నా: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బిహార్ పోలీసుల దర్యాప్తు మరింత పురోగతి సాధించింది. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న బిహార్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) పోలీసులు ఆరు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన మాఫియా ముఠా సభ్యులకు చెందాల్సినవిగా వీటిని భావిస్తున్నామని ఈఓయూ డీఐజీ మానవ్‌జీత్ సింగ్ ధిల్లాన్ ఆదివారం చెప్పారు. సంబంధిత బ్యాంకుల నుంచి ఆయా ఖాతాదారుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా, పట్నాలో ప్రశ్నాపత్రాన్ని, జవాబులను అభ్యర్థులకు మాఫియా సభ్యులు వెల్లడించిన ఇంట్లో పాక్షికంగా కాల్చివేసిన ప్రశ్నాపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఎన్టీఏ నుంచి రిఫరెన్స్ ప్రశ్నాపత్రం కోరామని, అది అందాక రెండింటిని సరిపోల్చుతామని డీఐజీ చెప్పారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 9 మంది అభ్యర్థులతోపాటు నలుగురు ఎగ్జామినర్లున్నారు. వీరంతా బిహారీలే. అదేవిధంగా, ఈ లీకేజీ వ్యవహారంతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న బిహార్‌కే చెందిన మరో ఏడుగురు, యూపీ, మహారాష్ట్రలకు చెందిన ఓక్కో అభ్యర్థికి కూడా పోలీసులు నోటీసులు పంపారు. -
సీఎం సాయం.. శరవేగం
అనంతపురం: మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్ధం సభ కోసం ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. ఈ క్రమంలో పలువురు బాధితులు సీఎంను కలిసి తమను ఆదుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. దీంతో బాధితులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ కలెక్టర్ గౌతమికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు 24 గంటలు గడవకముందే బాధితులకు చెక్కులు అందించారు. ► అనంతపురం నగరంలోని కమలానగర్‌కు చెందిన పర్లపాటి సుజాత తన భర్త చనిపోయాడని, తనకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సీఎం వైఎస్ జగన్ ఎదుట వాపోయింది. ఇద్దరు పిల్లలున్నారని, ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించింది. సమస్యను సావధానంగా విన్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ గౌతమిని పిలిచి వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్లో బాధితురాలు సుజాతకు రూ.2 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. బాధితురాలికి ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు, పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ► అనంతపురం రూరల్‌లోని విద్యారణ్య నగర్‌కు చెందిన దివ్యాంగురాలు రాచూరి ఝాన్సీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలికి రూ.లక్ష చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఆర్వో రామకృష్ణారెడ్డి అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తామని భరోసా ఇచ్చారు. సీఎంకు తమ సమస్యలను చెప్పుకుని 24 గంటలు గడవక ముందే ఆదుకోవడంపై బాధితురాలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
ఆపన్నులకు ప్రభుత్వం ఆర్థిక సాయం
గుంటూరు వెస్ట్: ఆపన్నుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో గురువారం జరిగిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో కొందరు బాధితులు ముఖ్యమంత్రికి తమ బాధలను చెప్పుకున్నారు. దీంతో వారిలో ఆరుగురికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను శనివారం గుంటూరు కలెక్టరేట్లో జేసీ జి.రాజకుమారితో కలిసి కలెక్టర్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ బాధితులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోపే చెక్కులను అందజేశామన్నారు. అలాగే వారికి కావాల్సిన వైద్య సేవలు కూడా అందిస్తామని తెలిపారు. పేదల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వంలో ప్రజలకు ఏ అవసరమొచ్చినా తక్షణ సాయం లభిస్తుందన్నారు. అలాగే తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఆరుగురు తమ చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మొత్తం రూ.9.90 లక్షలు మంజూరు చేస్తూ సీఎంవో కార్యాలయం చెక్కులు పంపింది. ఈ చెక్కులను కూడా ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, కలెక్టర్, జేసీలు అందజేశారు. మట్టుకొయ్య కోటేశ్వరరావుకు రూ.60 వేలు, నిలకుదిటి రఘుపతమ్మకు రూ.40 వేలు, మర్రి వెంకటేశ్వరరావుకు రూ.3 లక్షలు, ఇట్ల కుసుమసాయికి రూ.1.60 లక్షలు, అజీ్మర్ దివ్యకు రూ.4.30 లక్షల చొప్పున మొత్తం రూ.9.90 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా బాధితులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
ఆసరా వేడుక.. పుట్టింటి కానుక
రాష్ట్రవ్యాప్తంగా ఆసరా సంబరాలు పండుగలా సాగుతున్నాయి. పుట్టింటి నుంచి వచ్చిన కానుకలా భావిస్తూ అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెక్కులు తీసుకునేటప్పుడు వారి మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. పండుగ వాతావరణవంలో ప్రజాప్రతినిధులు చెక్కుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇంత పెద్ద మనస్సుతో ఆర్థికంగా ఆదుకుంటారని తాము కలలో కూడా ఊహించుకోలేదని మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా నిధులు తమ అకౌంట్లో జమ అవుతుంటే అక్కచెల్లెమ్మల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. – సాక్షి నెట్వర్క్ పండ్ల వ్యాపారం ఫలించింది నేను డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా చాలా కాలంగా ఉన్నాను. గతంలో రుణం తీసుకున్నప్పటికీ తిరిగి కట్టడానికి మాత్రమే అవి సరిపోయేది. సీఎం జగన్ దయ వల్ల ఆసరా ద్వారా నాలుగు విడతలుగా, విడతకు రూ.16,200 చొప్పున మొత్తం రూ.64,800 రుణమాఫీ అయ్యింది. వాటితో అప్పటి వరకు చిన్నగా చేస్తున్న పండ్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాను. బ్యాంకు అధికారులు మరో రూ.2 లక్షల రుణం ఇచ్చారు. వ్యాపారం కోసం ఇప్పుడు వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది. – ముచ్చర్ల సత్యకుమారి, రేలంగి, ఇరగవరం మండలం, పశ్చిమగోదావరి జిల్లా చీరల వ్యాపారం చేస్తున్నా.. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మా గ్రూపునకు రూ.5.68 లక్షలు రుణమాఫీ అయ్యింది. మాకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.14,200 చొప్పున నాలుగేళ్లకు 56,800 వచ్చింది. దీంతో నేను చీరల వ్యాపారం చేస్తున్నా. అప్పులు తెచ్చి వ్యాపారం చేద్దామంటే వడ్డీలకే సరిపోతుంది. కానీ సీఎం వైఎస్ జగన్ పొదుపు సంఘాల్లో ఉన్న మాకు రుణ మాఫీ చేసి నిలబెట్టారు. – ఉప్పర ఉమాదేవి, మద్దికెర, కర్నూలు జిల్లా టైలరింగ్ ద్వారా ఇద్దరికి చేయూత నేను టైలరింగ్ చేస్తాను. నా భర్త కార్పెంటర్. జగనన్న అందించిన ఆసరా ఒకటి రెండు విడతలు డబ్బులతో కుట్టు మిషన్ కొనుగోలు చేశాను. తర్వాత అందించిన డబ్బులతో ఒక ఎలక్ట్రికల్ మిషన్, ఒక జిగ్‌జాగ్ మిషన్ కొనుగోలు చేశాను. మరో ఇద్దరు మహిళలను సహాయకులుగా పెట్టుకుని వారికి కూడా చేయూతనిస్తున్నాను. పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలి. – ఎన్.స్వాతి, సింగుపురం, సాయిరాం స్వయం శక్తి సంఘం, శ్రీకాకుళం ‘ఆసరా’ ఆదుకుంది ఈమె పేరు ఏకుల వాణి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోని అనంతరాయయేని గిరిజన కాలనీలో ఉంటారు. ఈమెకు ఇద్దరు కుమారులు. భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందారు. సరస్వతి పొదుపు గ్రూపు సభ్యురాలిగా ఉన్న ఈమెకు గతంలో సక్రమంగా రుణాలు వచ్చేవి కావు. ఈమె గ్రూపునకు 2019లో రూ.3 లక్షల రుణం మంజూరైంది. వాటితో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నారు. నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా నగదును ఆమె ఖాతాలో జమ చేశారు. మొత్తం రూ.32 వేలు ఆమె ఖాతాలో జమైంది. దీంతో ఆమె నిర్వహిస్తున్న బడ్డీకొట్టును ఫ్యాన్సీ దుకాణంగా మార్చుకుని సంతోషంగా వ్యాపారం సాగిస్తోంది. ‘సొంత అన్న’లా ఆదరిస్తున్నాడు ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు అంతపు లీల. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం. సరస్వతి డ్వాక్రా గ్రూపు సభ్యురాలిగా ఉంది. ‘వైఎస్సార్ ఆసరా’ పథకంలో భాగంగా డ్వాక్రా రుణ మాఫీ కింద ఈమెకు ఏడాదికి రూ.12,600 ప్రకారం నాలుగేళ్లకు రూ.50,400 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యింది. అంతేకాకుండా పావలా వడ్డీతో రూ.లక్ష రుణం తీసుకున్న ఈమె కుటుంబ పోషణకు చేదోడుగా ఉంటోంది. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం జగన్ చేస్తున్న కృషి మరువలేమని, అన్నలా ఆదరిస్తున్న ఆయనకు అండగా ఉంటామని ఆనందంగా చెబుతోంది. ఈ ప్రభుత్వ మేలు మరువలేం ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మాదాసు జమున. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు. ఈమె భర్త నాగబాబు లారీ క్లీనర్. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తొలుత జమున ఓ దుకాణంలో పని చేసేది. ఈమె సభ్యురాలిగా ఉన్న ‘వెలుగు దీపం’ గ్రూపునకు ఆసరా ద్వారా రుణ మాఫీ వర్తించింది. వరుసగా మూడు విడతల్లో సుమారు 40వేలు లబ్ధి చేకూరింది. డ్వాక్రా గ్రూపు ద్వారా రూ.4 లక్షలు రుణ సహయం పొందింది. దీంతో టిఫిన్ బండి పెట్టుకుంది. చిరు వ్యాపారులకు సీఎం జగన్ అందించే రుణ సహయం కూడా తోడైంది. ఇప్పుడు ఆసరా ద్వారా వచ్చే రూ.12 వేలతో వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని చెబుతోంది. -
ప్రాణాలకు తెగించి పనిచేశాం.. కానీ!’ ర్యాట్ హోల్ మైనర్ల ఆవేదన
ర్యాట్ హోల్ మైనర్స్.. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదానికి ముందు ఈ పేరును ఎవరూ ఎక్కువగా విని ఉండరు. కానీ టన్నెల్లో ఇరుకున్న కార్మికులను రక్షించడంలో వీరు చేసిన కృషి తర్వాత అందరికీ సుపరిచితులుగా మారారు. కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకురావడంలో ర్యాట్ హోల్ మైనర్లది కీలక పాత్ర. ఈ క్రమంలోనే వీరి సేవలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గురువారం 12 మంది ర్యాట్ హోల్ మైనర్లను ఒక్కొక్కరికి రూ. 50,000 చెక్కులతో సత్కరించారు. అయితే ర్యాట్ హోల్ మైనర్స్.. తాజాగా తమ నిరాశను వ్యక్తం చేశారు. సీఎం తమకు ఇచ్చిన రూ. 50 వేల చెక్కులను క్యాష్‌గా మార్చుకోవడానికి నిరాకరించారు. కార్మికులను రక్షించడంలో తాము పడ్డ కష్టానికి ప్రభుత్వ సాయానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల విషయంలో తాము నిరాశ చెందినట్లు తెలిపారు. ఆ చెక్కులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. యంత్రాలు కూడా చేయని పనిని తాము పూర్తి చేశామని.. ఎటువంటి షరతులు పెట్టకుండా మా ప్రాణాలను పణంగా పెట్టి శిథిలాలను మాన్యువల్‌గా డ్రిల్ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన పనిని అభినందిస్తున్నాము కానీ మాకు అందించిన మొత్తంతో సంతృప్తి చెందలేదని ర్యాట్ హోల్ మైనర్ల బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ర్యాట్ హోల్ మైనర్ల పాత్ర వీరోచితమైనదని, కానీ వారు ప్రభుత్వం నుంచి పొందిన డబ్బు సరిపోదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్మానించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు.. తమకు అందించిన చెక్కులను క్యాష్ చేయకూడదని సమిష్టిగా నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. ‘చెక్కులు అందజేసిన రోజే ముఖ్యమంత్రికి మా అసంతృప్తిని తెలియజేశాను. మా విషయంపై రెండురోజుల్లో ప్రకటన చేస్తానని అధికారులు హామీ ఇవ్వడంతో తిరిగివచ్చాం. ఆ హామీ నిలబెట్టుకోకుంటే.. చెక్కులను తిరిగి ఇస్తాం. ఆపరేషన్‌లో సహకరించిన మైనర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాశ్వత ఉద్యోగాలు తాము ఆశిస్తున్నాం’ అని చెప్పారు. కాగా ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి నవంబర్ 12వ తేదీన 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయాత్నాలు చేసినా.. విదేశాల మిషన్లతో ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగి వారిని రక్షించారు. -
60 పైసల చెక్ ఇచ్చిన బ్యాంకు.. ఇదా అసలు విషయం!
నంగునూరు (సిద్దిపేట): ‘చారాణా కోడికి బారాణా మసాల’ అనే సామెత నిజం చేస్తూ 60 పైసల బ్యాంక్ చెక్కును చూసి ముక్కున వేలు వేసుకున్నారు ప్రజలు. సిద్దిపేట జిల్లా నర్మేటకు చెందిన దాచవరం రాజశేఖర్‌కు రెండు రోజుల కిందట స్పీడ్‌పోస్ట్ ద్వారా కవర్ వచ్చింది. అందులో కేరళలోని సౌత్ ఇండియా బ్యాంక్ త్రిసూర్ బ్రాంచ్ నుంచి అకౌంట్‌పే ద్వారా 60 పైసల చెక్కు రావడంతో రాజశేఖర్ అవాక్కయ్యాడు. చెక్కు ఎవరు పంపారు.. తనకు డబ్బులు ఎందుకు వచ్చాయో.. తెలియక జుట్టు పీక్కున్నాడు. రెండు రోజులపాటు కష్టపడి విచారిస్తే గతంలో క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న లోన్ క్లియరెన్స్ చేయగా 60 పైసలు ఎక్కువ కట్టినట్లు తేలగా చెక్కు పంపారని తెలుసుకున్నాడు. రాజశేఖర్‌కు చెల్లించే డబ్బులకంటే చెక్కు ఓచర్, స్పీడ్ పోస్ట్‌కు అయ్యే ఖర్చులు ఎక్కువైనా న్యాయ బద్ధంగా చెక్కు పంపినందుకు లోన్ ఇచ్చిన కంపెనీ వారిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇంతకీ 60 పైసల చెక్కు తన అకౌంట్లో వేసుకోవాలా.. వద్దా అని రాజశేఖర్ డైలమాలో పడిపోయారు. -
Rega Kantha Rao Vs Podem Veeraiah: స్టేజీపైనే బాహాబాహీ.. నీకు మైండ్ ఉందా.. నువ్వు నోర్మూసుకో..!
దుమ్ముగూడెం: తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఒకరిపైకి ఒకరు దూసుకురావడంతో పాటు గల్లాలు పట్టుకునేందుకు రెడీ అయ్యారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో అక్కడే ఉన్న కలెక్టర్, ఎస్పీ, అటవీ అధికారులు సర్దిచెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడులో బుధవారం తునికాకు బోనస్ చెక్కుల పంపిణీకి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ కాంతారావు, ఎమ్మెల్యే వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ మూడో సారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని, రాబోయే ఎన్నికల్లో భద్రాచలం నుంచి గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థేనంటూ తన ప్రసంగం కొనసాగించారు. దీనికి వేదికపై ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య(కాంగ్రెస్) జోక్యం చేసుకుని ఇది ప్రభుత్వ కార్యక్రమమని..ఇక్కడ రాజకీయాలెందుకంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కాంతారావు మరింత దూకుడుగా ప్రసంగం కొనసాగిస్తూ ప్రతిపక్షాలనుద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రసంగం ముగించి తన సీట్లో కూర్చునే సమయంలోనూ ప్రభుత్వ పథకాల గురించి చెబుతుంటే బాధెందుకు అంటూ పోదెంను ఉద్దేశించి అన్నారు. ఇందుకు వీరయ్య ‘నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి ఇష్టం వచ్చి నట్టు మాట్లాడితే కుదరదంటూ’హెచ్చు స్వరంతో బదులిచ్చారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నీకు మైండ్ ఉందా అంటూ పోదెం అనగా.. నువ్వు నోర్మూసుకో అంటూ విప్ అన్నారు. ఇలా అభ్యంతరకమైన పదాలతో దూషించుకుంటూనే ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు. వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిశ్చేషు్టడై చూస్తుండిపోయారు. ఇద్దరూ భౌతికదాడులకు దిగే విధంగా పరిస్థితి నెలకొనడంతో అక్కడే ఉన్న కలెక్టర్ అనుదీప్, పీసీసీఎఫ్ డోబ్రియల్ కల్పించుకుని రేగా చేయి పట్టుకుని వెనక్కి తీసుకెళ్లి కూర్చోబెట్టగా ఎస్పీ వినీత్ ఎమ్మెల్యే పొదెంను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. -
ఆత్మకూరు PACS బ్యాంక్ డిపాజిట్స్ గోల్ మాల్ బాధితులకు చెక్కుల అందజేత
-
ఫిలిం అవార్డు చెక్స్ బౌన్స్ గందరగోళం: విజేతలకు చేదు అనుభవం
గువహటి: అసోం రాష్ట్ర చలనచిత్ర అవార్డు విజేతలకుచేదు అనుభవం ఎదురైంది. వారికిచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో గందరగోళం నెలకొంది. ఎనిమిది మంది విజేతలకు ఇచ్చిన చెక్కులను క్లియరెన్స్ కోసం బ్యాంకుకు సమర్పించినప్పుడు అవి బౌన్స్ అయ్యాయి. సాంస్కృతిక వ్యవహారాల డైరెక్టర్ మీనాక్షి దాస్ నాథ్ సంతకంతో జారీ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కులు మార్చి 17న బౌన్స్ అయ్యాయి. దీంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లు వెత్తాయి. ఈ వ్యవహారంపై సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బిమల్ బోరా తక్షణ విచారణకు ఆదేశించారు. వివరాలను పరిశీలిస్తే చలన చిత్ర రంగానికి చెందిన ఎనిమిది మందికి స్టేట్ ఫిల్మ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ASFFDC సోమవారం అవార్డులను ప్రదానం చేసింది దీంతో అవార్డు గ్రహీత రచయిత అపరాజిత పూజారి చెక్కును డిపాజిట్ చేశారు. అయితే అది బౌన్స్ అయిందని బ్యాంకు నుండి కాల్ రావడంతో నిర్ఘాంతపోయి, నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. (ఐఫోనా మజాకా? మైనర్ కిడ్నాప్ డ్రామా...కట్‌చేస్తే..!) పూజారి ఉత్తమ రచయితగా అవార్డును గెలుచుకున్నారు. అయితే పూజారితోపాటు, అమృత్ ప్రీతమ్ (సౌండ్ డిజైన్), దేబజిత్ చంగ్మాయి (సౌండ్ మిక్సింగ్), ప్రాంజల్ దేకా (దర్శకత్వం), దేబజిత్ గయాన్ (సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్) బెంజమిన్ డైమరీ (నటన) వంటి ఇతర ప్రముఖ సినీ ప్రముఖులకు అందజేసిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయట. (ఇదీ చదవండి: రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?) అయితే సాంకేతిక కారణాల వల్ల చెక్కులు బౌన్స్ అయ్యాయని సంబంధిత అధికారి వెల్లడించారు. మొదటి రోజు రూ.18 లక్షల విలువైన చెక్కులు క్లియర్ చేశామనీ, రెంcy రోజు తొమ్మిది చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు. సమస్యను పరిష్కరించామని, తమ చెక్కులను డిపాజిట్ చేయాలని, ఈసారి క్లియర్ అవుతాయంటూ మొత్తం ఎనిమిది మందికి శనివారం వ్యక్తిగతంగా సమాచారం అందించినట్టు తెలిపారు. ఇది మాత్రమే కాదు ఈ అవార్డుల్లో మరో తప్పిదం కూడా చోటు చేసుకుంది. ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్ అవార్డును నహిద్ అఫ్రిన్‌కు ఆమె పాడని పాటకు స్వీకరించారంటూ వివాదం రేగింది. అయితే అఫ్రీన్ 'నిజానోర్ గాన్' చిత్రంలో పాడిన ఆఫ్రీన్కే అవార్డు వచ్చిందని, తప్పిదం జరిగిందని సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రకటించడం గమనార్హం. -
పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు
ఖమ్మం మయూరిసెంటర్: పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో 64మందికి రూ.6.40కోట్ల విలువైన కల్యాణలక్ష్మి పథకం చెక్కులను మంత్రి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంలో 7,515 మందికి రూ.70.21 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఇక రైతులకు 24 గంటల విద్యుత్, సాగునీరు, పేద ఆడపడుచులకు కేసీఆర్ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. అనంతరం లబ్ధిదారులు, వారి కుటుంబీకులతో కలిసి పువ్వాడ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ధ్రువపత్రాలు సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోయినా, గాయపడినా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి ప్రమాద బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కార్యకర్తల కుటుంబాలను కోరారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో 9 మంది సభ్యుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. రేవంత్ మాట్లాడుతూ పార్టీలో సభ్యులుగా చేరిన వారందరికీ బీమాసౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. బీమా సదుపాయం ఉన్నవారిలో ఇప్పటివరకు 427 మంది సభ్యులు చనిపోయారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శు లు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావెద్, నేతలు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, రాజనర్సింహ, అంజన్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. బూర్గులకు నివాళి: గాంధీభవన్‌లో మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నేతలు షబ్బీర్‌అలీ, సీతక్క పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
వెనుకబడిన రాష్ట్రాలకు సాయం చేయకపోతే దేశం అభివృద్ధి చెందదు: సీఎం కేసీఆర్
-
CM KCR: లాలూను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన అప్డేట్స్ ► బీహార్ పర్యటనలో భాగంగా.. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను పరామర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. CM #KCR meets Former CM #laluprasadyadav @yadavtejashwi also present in the meeting pic.twitter.com/karFMn7igX — Sarita Avula (@SaritaTNews) August 31, 2022 ► తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్‌తోనే సాధ్యమైందన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీ విమర్శలు పట్టించుకోకుండా ముందుకు సాగాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూచించారు. ► బీజేపీ వ్యతిరేక పోరాటంలో.. మాతో కలిసి వచ్చేవాళ్లతో ముందుకు వెళ్తాం. కలిసి రానివాళ్లను పక్కన పెడతాం: తెలంగాణ సీఎం కేసీఆర్ ► దేశంలో గుణాత్మక మార్పు అవసరం అన్న సీఎం కేసీఆర్.. బీజేపీ ముక్త్ భారత్‌తోనే అది సాధ్యమని, ఇప్పటికే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, అయితే ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై తొందర అవసరం లేదని ఆయన అన్నారు. ► శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశాలు. సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లోకి జొరబడడం ఏంటని సీఎం కేసీఆర్.. దర్యాప్తు సంస్థల తీరును ఉద్దేశించి విమర్శించారు. ► ఇచ్చిన ఏ హామీ నెరవర్చలేదని ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ► బీజేపీ హయాంలో గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని దేశం ఎదుర్కొంటోంది. అన్ని రంగాలు ఇబ్బంది పడుతున్నాయ్. అప్పులు పెరిగిపోవడంతో పాటు రూపాయి విలువ పడిపోయింది. ► ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ దేశానికి చేసింది ఏం లేదని.. పైగా వినాశక పరిస్థితులు సృష్టించిందని మండిపడ్డారు కేసీఆర్. ► బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అనంతరం.. జాతీయ మీడియాతో మాట్లాడారు తెలంగాణ సీఎం కేసీఆర్. ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో భేటీ కానున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం. ► పాట్నాలో ముగిసిన చెక్ పంపిణీల కార్యక్రమం ► కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో బీహార్‌కు తెలంగాణ మేలు చేసింది. ఇప్పుడు అమరుల కుటుంబాలకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ప్రయత్నానికి అభినందనలు: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ► బీహార్ అమర వీరులకు, కార్మికుల కుటుంబాలకు చేయూత ఇచ్చే ఈ చెక్ పంపిణీ కార్యక్రమం.. తెలంగాణ- బీహార్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. అన్ని రాష్ట్రాలు ఇలా కలిసి కట్టుగా ముందుకెళ్తే.. దేశం పురోగతి సాధించడం ఖాయం.. : డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ Bihar | Today's program by CM Nitish Kumar & Telangana CM KCR is in view of honouring the soldiers who lost their lives in Galwan Valley & the people who died in a recent accident in Hyderabad... if all states cooperate like this, the country will succeed: Dy CM Tejashwi Yadav pic.twitter.com/9achheQfk9 — ANI (@ANI) August 31, 2022 ► కేంద్రం కరోనా టైంలో వలస కూలీలను, కార్మికులను ఇబ్బంది పెట్టింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక రైళ్ల ద్వారా వాళ్లను స్వస్థలానికి తరలించింది: సీఎం కేసీఆర్ ► గాల్వాన్ వీరుల త్యాగం మరువలేనిదని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్, పాట్నాలో ఇవాళ అమర వీరుల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ ప్రమాద బాధితుల కుటుంబాలకు చెక్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. వెనుకబడిన రాష్ట్రాలకు సాయం చేయకపోతే దేశం అభివృద్ధి చెందదు. బీహార్ లాంటి రాష్ట్రానికి సాయం చేయాల్సిందే. దేశం సురక్షితంగా ఉందంటే అందుకు సైనికులే కారణం. అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ► బాధిత కుటుంబాలకు చెక్‌లను పంపిణీ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్.. కార్యక్రమంలో పాల్గొన్న బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ► చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పాటు హాజరైన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. ► తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సాదర స్వాగతం పలికిన బీహార్ సీఎం నితీశ్ కుమార్. Telangana CM K Chandrashekar Rao meets Bihar CM Nitish Kumar at Patna airport. pic.twitter.com/LrD550wWP3 — ANI (@ANI) August 31, 2022 ► పాట్నాలో గాల్వాన్ అమర జవాన్లతో పాటు హైదరాబాద్‌లో మరణించిన వలస కూలీల కుటంబాలకు చెక్కు పంపిణీ కార్యక్రమం వేదిక వద్దకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. Telangana CM K Chandrashekar Rao met CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav in Patna today. pic.twitter.com/lfw8DhBGnS — ANI (@ANI) August 31, 2022 పాట్నా/హైదరాబాద్: బీహార్ పర్యటనలో భాగంగా.. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాట్నాకు చేరుకున్నారు. బీహారీలకు చెక్ పంపిణీల కోసం ఆయన ఇవాళ అక్కడికి వెళ్తున్నారన్నది తెలిసిందే. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన భారత సైనికులు ఐదుగురు బీహార్‌కు చెందడం, జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. అమరులైన ఒక్కో సైనిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించనున్నారు. అలాగే.. సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు. మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును సీఎం కేసీఆర్ అందజేస్తారు. చెక్‌ల పంపిణీ అనంతరం.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో లంచ్ కార్యక్రమం.. ఆపై జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించనున్నారు. వీళ్ల భేటీ నేపథ్యంలో జాతీయ మీడియా ఫోకస్ ఇప్పుడు పాట్నా వద్దే ఉంది. #WATCH | Telangana CM K Chandrashekar Rao arrives in Patna, Bihar. pic.twitter.com/VMcgI9iGoE — ANI (@ANI) August 31, 2022 ఇదీ చదవండి: ఆ ముగ్గురు మినహా మంత్రులంతా జీరోలే! -
కస్టమర్ల ధ్రువీకరణ తర్వాతే చెక్కులకు ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రూ.10 లక్షలు అంతకుమించిన చెక్కుల ఆమోదానికి కస్టమర్ల ధ్రువీకరణను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పేసిస్టమ్ (పీపీఎస్)ను అమలు చేయనుంది. రూ.10 లక్షలకు మించిన చెక్కు క్లియరెన్స్ కోసం వచ్చినప్పుడు కస్టమర్ ధ్రువీకరణను తీసుకోనుంది. తద్వారా చెక్కుల రూపంలో భారీ మోసాలకు చెక్ పెట్టొచ్చన్నది పీఎన్బీ అభిప్రాయంగా ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ విధానంలో రూ.50,000, అంతకుమించిన చెక్కులకు పీపీఎస్‌ను పీఎన్బీ అమలు చేస్తోంది. ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారుల ఇష్టానికి వదిలేయాలని, రూ.5లక్షలకు మించిన చెక్కులకు బ్యాంకులు తప్పనిసరి చేయవచ్చని గతంలో ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలి
సాక్షి,సిటీబ్యూరో: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు అందరు విరాళాలిచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. బుధవారం రెడ్ క్రాస్ ప్రతినిధులు కలెక్టర్ ను కలిసి బ్లడ్ సెంటర్ ఏర్పాటు, పనుల పురోగతిపై వివరించారు. ఈ సందర్భంగా దాతలు లారెన్స్ మాయో ఆప్టికల్స్ ఆఫీస్ కంప్యూటర్లను విశాల్ పెరిఫెరెల్స్, కలర్ ప్రింటర్ ను, డా. శ్యాంకాంత్ బసాకే రూ. 7500 చెక్కులను రెడ్ క్రాస్ సొసైటీకి విరాళంగా కలెక్టర్ కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ సూర్యలత, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీం రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, రాధా కృష్ణ,, డా. సిసా తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
మీకు ఈపీఎఫ్ ఖాతా ఉందా? అయితే, వెంటనే మీ ఖాతాను ఆధార్ నెంబర్ తో లింకు చేయండి లేకపోతే వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబందనలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి ఆధార్, పాన్ లింకింగ్, ఎల్పీజీ ధరలు, జీఎస్టీ నిబంధనలు, గూగుల్ యాప్స్ పర్మిషన్ లకు మార్పులు చోటు చేసుకోనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. (చదవండి: అవును 'నేను ఏలియన్ని' : ఎలోన్ మస్క్) కొత్త పీఎఫ్ రూల్ సెప్టెంబర్ 1 వరకు పీఎఫ్ ఖాతాతో ఆధార్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల మీరు లింకు చేయకపోతే మీకు అందించే ఈపీఎఫ్ ప్రయోజనాలు తగ్గించవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆధార్ కార్డును పీఎఫ్ ఖాతాతో లింక్ చేయాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. మీ ఈపీఎఫ్ ఖాతాలో సంస్థ జమ చేసే నగదు జమ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆధార్ - పాన్ లింకింగ్ మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేగాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ ఆధార్ లింక్ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధర ఎల్పీజీ సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి మారనున్నాయి. ముఖ్యంగా, గత రెండు-మూడు నెలలుగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. జీఎస్టీ కొత్త నిబంధన జీఎస్టీఆర్-3బీ రిటర్న్స్ ఫైల్ చేయని ట్యాక్స్‌పేయర్స్ జీఎస్టీఆర్-1 రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఆంక్షలు విధించే సెంట్రల్ జీఎస్టీ రూల్స్‌లోని రూల్ 59(6) సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. వ్యాపారులు ఈ నెలకు సంబంధించిన జీఎస్టీఆర్-3బీ వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఫైల్ చేయాలి. ఆ తర్వాతి నెలలో జీఎస్టీఆర్-1 ఫైల్ చేయాలి. చెక్స్ క్లియరెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చెక్స్ క్లియరెన్స్ కోసం పాజిటీవ్ పే సిస్టమ్ అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిస్టమ్ సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది యాక్సిస్ బ్యాంక్. భారీ మొత్తంలో చెక్స్ ఇచ్చేముందు కస్టమర్లు సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ మోసాలను అరికట్టడానికి పాజిటీవ్ పే సిస్టమ్ తీసుకొచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. సెబీ కొత్త నిబంధన స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి పీక్ మార్జిన్ నార్మ్స్ అమలు చేస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నాలుగో దశ నియమ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 80మంది టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ రూ.2 లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ఏడాదికాలంలో సుమారు 950 మంది పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, వారికి బీమా మొత్తం అందజేస్తామని తెలిపారు. కుటుంబంలో ఆదరువును కోల్పోయినవారికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు కేవలం బీమా పరిహారంతో సరిపెట్టకుండా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలు అందేలా పార్టీ తోడుగా నిలుస్తుందని చెప్పారు. కేటీఆర్ బీమా చెక్కులు అందుకునేందుకు వచ్చిన కార్యకర్తల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
మరణించిన జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య :కేటీఆర్
ఖమ్మం సహకారనగర్: చనిపోయిన, అచేతనావస్థకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించారు. హైదరాబాద్ జలవిహార్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 8 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ.8 లక్షల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలలో పదోతరగతిలోపు చదివే పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదని, రాబోయే మూడేళ్లలో అందరికీ స్థలాలు ఇచ్చి తీరుతామని అన్నారు. అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. టీయూడబ్ల్యూజే ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్, టెంజూ అధ్యక్షుడు అడపాల నాగేందర్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్, చండ్ర నరసింహారావు, వట్టికొండ రవి పాల్గొన్నారు. -
గ్యాస్ లీక్ : సీఎం జగన్ సహాయం ఓ నిదర్శనం
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతి చెందినవారికి సంబంధించి ఎనిమిది కుటుంబాలకు మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్య నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌లు చెక్కులు అందించారు. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విధంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందించామన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, సీఎం జగన్ వారికి రాసిన లేఖతో పాటు అందించామని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది కుటుంబాలకు చట్టపరమైన వారసులను గుర్తించామని, మిగిలిన నాలుగు కుటుంబాల వారసులు గుర్తించిన వెంటనే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. (విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు చెక్కుల పంపిణీ) చెక్కల పంపిణీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘బాధితులను తక్షణమే ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని భావించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటిరూపాయల పరిహారం ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో మంత్రులు, అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయమే మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. మనస్సున్న మనిషిగా ఆయన స్పందించిన తీరుకు ఈ సహాయం ఓ నిదర్శనంగా చెబుతున్నాం. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి సమీక్షించాం. డిశ్ఛార్జ్ చేయాల్సిన వారిని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతానికి పంపిస్తాం. రేపు ఎక్కువ మందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని వైద్య అధికారులు తెలియచేశారు. ఎవరైతే పూర్తిగా కోలుకుని ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యాధికారులు ధృవీకరిస్తారో వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసిన అనంతరం వారికి కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారాన్ని అందిస్తాం. ఐదు గ్రామాలలో బాధితులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం అందిస్తామని సీఎం చెప్పారు. ఆ ప్రకారం గ్రామాలలోకి ప్రజలు తిరిగి వెళ్లిన వెంటనే వాలంటీర్లను ఇంటికి పంపించి పెన్షన్ మాదిరిగా ఇస్తున్నారో అదే విధంగా ఇంటివద్దకే పంపిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పకుండా సహాయం అందించడం వైఎస్ జగన్ మార్క్. అందుకే వారందరికీ సేవలు తక్షణం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. సంఘటన ఏడో తేదీ జరిగితే కేవలం మూడురోజుల వ్యవధిలో బాధిత కుటుంబాలకు కోటిరూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన దృష్ట్యా పారిశ్రామిక భద్రతకు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని అన్నారు. బాధితులకు అండగా ఉంటాం : అవంతి శ్రీనివాస్ ‘ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీలో ఉన్న స్టైరిన్ గ్యాస్ పూర్తి అదుపులో ఉంది. దయచేసి సోషల్ మీడియా రూమర్స్ గాని, వదంతులు గాని ఎవ్వరూ కూడా నమ్మద్దు.ఐదు గ్రామాలలో రసాయనాలతో క్లీన్ చేసే కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది ద్వారా జరుగుతోంది. సోమవారం రాత్రికి ప్రజలకు ఇబ్బంది లేకుండా భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడ గ్రామాలలోకి వచ్చిన తర్వాత మెడికల్ క్యాంపులు కూడా పెట్టమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. అన్నిరకాల హెల్త్ చెకప్‌లు చేయించి వారికి పూర్తి అండగా ఉంటాం’ అని అన్నారు. ప్రగాఢసానుభూతి : మంత్రి ధర్మాన కృష్ణదాస్ ‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సంఘటన చాలా దురదృష్టకరం. బాధితులు, చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం.ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వం మాది. రాష్ర్టంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అనేకమంది నిపుణులతో కమిటీలు వేసి నివేదికలు తెప్పించుకున్న తర్వాత తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాధిత ఐదు గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారుల అండగా ఉంటారు’ అని పేర్కొన్నారు. కంపెనీపైన మాకు ప్రేమలేదు: బొత్స సత్యన్నారాయణ ‘నిపుణుల సూచనల మేరకే ఐదు గ్రామాలలో శానిటైజ్ చేస్తున్నాం. సాయంత్రం నాలుగు గంటల తర్వాత మేం కూడా గ్రామాలకు వెళ్లి గ్రామస్తులను ఇళ్లల్లోకి తీసుకువెళ్తాం. కంపెనీ మెయింటెనెన్స్‌కు జిల్లా కలెక్టర్ మూడుషిఫ్ట్ లలో 15 మంది చొప్పున 45 పాసులు జారీచేశారు. ప్రమాదం జరిగినప్పుడు 15 మంది ఉన్నారు. కంపెనీపైన మాకు ప్రేమలేదు. ఇక్కడ ఉన్న ప్రజలపైన, వారి సంక్షేమం, ఈ ప్రాంతం భద్రత పైన మాత్రమే మాకు ప్రేమ ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దాలనే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎల్జీ పాలిమర్స్ కు ఎటువంటి నూతన అనుమతులు ఇవ్వలేదు. పాత అనుమతులతోనే పనిచేస్తోంది.’ అని స్పష్టం చేశారు. -
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు చెక్కుల పంపిణీ
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. సోమవారం మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి నష్ట పరిహారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన జరిగిన ఐదురోజుల వ్యవధిలోనే రూ. కోటి పరిహారం బాధితులకు పంపిణీ చేయటం జరిగింది. చదవండి : ఆ అనుమతులిచ్చింది చంద్రబాబే -
రూ. 24 లక్షలు గోవిందా! బ్యాంకు అధికారులు బుక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఖాతానుంచి రూ. 24 లక్షలు మోసపూరితంగా దారి మళ్లాయి. ఢిల్లీలోని కేజీ మార్క్‌వద్ద ఉన్న ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో బీఎస్ఎన్ఎల్ చెక్కుల పేరుతో అక్రమంగా నగదు విత్ డ్రా అయింది. తద్వారా నకిలీ చెక్కులతో అక్రమార్కులు, అటు బ్యాంకునకు, ఇటు బీఎస్ఎన్ఎల్ సంస్థకు కుచ్చు టోపీ పెట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బీఎస్ఎన్ఎల్ అధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారికంగా తాము ఎలాంటి చెక్కులు జారీ చేయకుండానే తమ ఖాతా నుంచి రూ .24 లక్షలకు పైగా నగదును తప్పుగా డెబిట్ చేశారనే డీప్యూటీ మేనేజర్ లీలా రామ్ మీనా ఆరోపించారు. ఈ విషయమై బ్యాంకు అధికారులను సంప్రదించి, తమ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాల్సిందిగా కోరామని దీనికి బ్యాంకు తిరస్కరించిందని తెలిపారు. నవంబర్ 21న రూ. 66,505 విలువైన చెక్‌తోపాటు మొత్తం మూడు చెక్కులిచ్చామని, అయితే అవి సంబంధిత లబ్దిదారులకు చేరింది, కానీ తాము జారీ చేయని (బీఎస్ఎన్ఎల్) మరో మూడు చెక్కులను అనధికారింగా బ్యాంకు క్లియర్ చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రూ .24,25,635 నష్టాన్ని చవిచూశామని బీఎస్ఎన్ఎల్ ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ప్రాథమిక విచారణ తరువాత, అదే నెంబర్‌తో మరో మూడు చెక్కులను బ్యాంకుకు సమర్పించినట్లు నిర్ధారించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
మాజీ మంత్రి పరిటాల నిర్వాకం; నకిలీ చెక్కులతో..
సాక్షి, అనంతపురం : నకిలీ చెక్కులు పంపిణీ చేసి రైతులను మోసం చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. రైతులు ఆ చెక్కులను మార్చకోవడానికి బ్యాంక్‌కు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాల కోసం రాప్తాడు రైతుల వద్ద నుంచి 13.20 ఎకరాల భూమిని సేకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక్కో బాధిత రైతుకు దాదాపు రూ. 29 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించగా, వాటిని మార్చి 2వ తేదిన రైతులకు స్వయంగా చెక్కులను పంపిణీ చేసింది. మంత్రి ఇచ్చిన చెక్కులను మార్చుకునేందుకు రైతులు బ్యాంక్‌కు వెళ్లగా, చెక్కులు చెల్లవని బ్యాంక్ అధికారులు చెప్పడంతో సునీతపై రైతులు మండిపడుతున్నారు. నకిలీ చెక్కులు ఇచ్చి మాజీ మంత్రి మమ్మల్ని మోసం చేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘మా పార్టీకి ఓటేయ్యకపోతే మీ సంగతి చెప్తాం’
కోల్‌కతా : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడేక్కుతోంది. ఈ పాటికే అభ్యర్థులు ప్రచారాలతో హోరేత్తిస్తూ.. అలవికానీ హామీలతో మభ్యపెడుతూ.. డబ్బులు, మద్యం పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతటితో ఆగక డబ్బులు తీసుకున్నారు.. ఓటేయ్యకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమబెంగాల్లో చోటు చేసుకుంది. తృణమూల్ పార్టీకి చెందిన ఓ నాయకుడు రైతులకు చెక్కులు పంచుతూ.. తమ పార్టీకి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. కెమరాకు చిక్కాడు. పైగా ఏ మాత్రం భయం లేకుండా ఇందులో తప్పేం ఉంది. మేం డబ్బులిచ్చాం.. బదులుగా ఓట్లు అడుగుతున్నాం అంటూ ఎదురు ప్రశ్నించాడు. మోదాసూర్ అనే వ్యక్తి రూ. 2 - 5 వేలు విలువ చేసే చెక్కులను రైతులకు పంచాడు. అంతేకాక ‘ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. దీదీనే ఈ చెక్కులిచ్చింది. కాబట్టి మీరు మా పార్టీకే ఓటు వేయాలి. ఒకవేళ మీరు గనక మా పార్టీకి ఓటు వేయకపోతే.. మీ మీద చర్యలు తీసుకుంటామ’ని రైతులను హెచ్చరించాడు. అంతేకాక మీ ఒరిజన్‌ల ఓటర్ ఐడీ కార్డులు మా దగ్గరే ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకొండి అంటూ బెదిరింపులకు దిగాడు. ‘మన అభ్యర్థి మిమి చక్రవర్తి.. మన పార్టీ గుర్తుకే ఓటు వేయాలి. ఈ గురువారం మేళా గ్రౌండ్లో మిమి చక్రవర్తి మీటింగ్ ఉంది. దానికి మీరంతా తప్పక హాజరవ్వాలి’ అని తెలిపాడు. చెక్కుల పంపిణీ గురించి ప్రశ్నించగా.. చెక్కులు పంచి ఓట్లు అడుగుతున్నాను ఇందులో తప్పేం ఉంది అని ప్రశ్నించాడు. -
‘పసుపు–కుంకుమ’ తెచ్చిన తంటా
అనంతపురం, ముదిగుబ్బ : ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘పసుపు – కుంకుమ’ పేరుతో ప్రవేశపెట్టిన పథకం అబాసుపాలవుతోంది. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు..నాలుగున్నరేళ్లుగా హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఎన్నికల తాయిళంలో భాగంగా డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్క సభ్యురాలికి రూ.10వేలు చొప్పున చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పిన చంద్రబాబు..ఆమొత్తాన్ని మూడు దఫాలుగా ఇచ్చేందుకు పన్నాగం పన్నారు. మొదటి విడతగా రూ.2500 ఫిబ్రవరి నెలలో, మిగతా రెండు నెలలు మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికల సమయానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు. కాగా మొదటి విడత చెక్కు మార్చుకునేందుకు మహిళలు నానాతంటాలు పడాల్సి వచ్చింది. సంఘంలోని సభ్యులందరూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో రెండు, మూడు రోజులుగా ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆవరణ అంతా కిక్కిరిస్తోంది. సాయంత్రం వరకు మహిళలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. మండలంలో ఉన్న సంఘాలు – సభ్యులు మండంలో మొత్తం 1,186 గ్రూపులు ఉండగా 12,120 మంది సభ్యులు ఉన్నారు. వీరికి‘పసుపు –కుంకుమ’ పేరిట రూ.12.11 కోట్లు మంజూరైంది. ఈనగదు మండలంలోని ఏడు బ్యాంకుల పరిధిలో సంఘాల సభ్యులకు పంపిణీ చేయాల్సి ఉంది.గొడవలు తెస్తున్న ‘పుసుపు– కుంకుమ’పసుపు–కుంకుమ చెక్కులతో డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల మధ్య గొడవలవుతున్నాయి. కొందరు సభ్యులు సంఘాల్లో అధిక వడ్డీ చెల్లించలేక సంఘాల నుంచి తొలగిపోయారు. మరికొందరు సభ్యుల్లో ఐక్యత లేకపోవడంతో మరో సంఘంలోకి మారిపోయారు. కొందరు ఆన్లైన్లో పాత గ్రూపులో సభ్యులుగా ఉన్నట్లు నమోదై ఉండడంతో ఆపేరుతోనే చెక్కులు వచ్చాయి. దీంతో పాతవారికి ఇవ్వాలని కొందరు.. కొత్త సభ్యులకే దక్కుతుందని మరికొందరు గ్రామాల్లో గొడవ పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నాం పుసుపు– కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ రోజూ తిరగాల్సి వస్తోంది. పొద్దున వస్తే సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నాం. బ్యాంకులో నగదు లేదని ఒకసారి, పదిమంది సభ్యులు కలిసి రావాలని మరోసారి తిప్పుకుంటున్నారు. ఇచ్చే రూ.2500 కోసం అవస్థలు పడాల్సి వస్తోంది.– నారాయణమ్మ, ఈదులపల్లిపెద్దమ్మస్వామి మహిళా సంఘం సభ్యురాలు పావలా వడ్డీ ఎగ్గొట్టే ప్రయత్నం మూడేళ్ల పాటు సకాలంలో బ్యాంకుల రుణాలు చెల్లించిన వారికి పావలా వడ్డీ గతంలో వచ్చేది. కానీ టీడీపీ ప్రభుత్వం పావలావడ్డీని ఎగ్గొట్టేందుకే పసుపు–కుంకుమ పేరుతో చెల్లని చెక్కులు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం మహిళలను అష్టకష్టాలు పెడుతోంది. – పద్మావతి, నాగారెడ్డిపల్లి,గణేష్ మహిళా సంఘం సభ్యురాలు -
రైతుబంధు.. గందరగోళం!
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు పెట్టుబడి డబ్బులకు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం జిల్లాలో గందరగోళంగా మారింది. లెక్కలు అంతా గజిబిజిగా ఉండడంతో ఏమి చేయాలో తెలియక అటు రెవెన్యూ, ఇటు వ్యవసాయశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాస్థాయిలో జరిగే సమావేశాల్లో మాత్రం అధికారులు కాకి లెక్కలు వేసుకుని సమాధానాలు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 4,38,154 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంకింద రూ.467.19 కోట్ల విలువ చేసే చెక్కులను అందజేసింది. తిరిగి రబీలో కూడా ఎకరానికి రూ.4వేల చొప్పున పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా రైతుల బ్యాంక్ ఖాతా ల్లో నేరుగా నగదు జమచేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వారీగా బ్యాంక్ ఖాతానంబర్లను సేకరించి ఆన్లైన్లో ఎంటర్ చేసే ప్రక్రియను గత ఏడాది సెప్టెంబర్ మాసంనుంచి చేపట్టారు. ఆన్లైన్లో ఖాతాలను న మోదు చేసిన వెంటనే డబ్బులు పడుతాయని చెప్పారు. ఈ ప్రక్రియను ప్రారంభించి ఏడు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు స గం మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం పడని పరిస్థితి నె లకొంది. రబీలో పెట్టుబడి సాయం కోసం 4,14,477 మంది రై తుల పాస్‌బుక్కులు ఎలాంటి తిరకాసులు లేకుండా క్లియర్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి పాస్‌బుక్కులు, బ్యాంక్‌ఖాతాలను తెప్పించుకునే పనిలో జిల్లా వ్యవసాయశాఖ ఏడు నెలలుగా కసరత్తు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు 3,45,925 మంది రైతుల ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేశారు. 68,552 మందివి నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్లో నమో దు చేసిన రైతుల్లో ఇప్పటివరకు కేవలం 2,24,571 మందికి మాత్రమే న గదు జమయ్యాయి. ఇంకా 2,13,583 మంది రైతులు రబీ పెట్టుబడి నగదు కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. 23,677మంది రైతుల లెక్క ఎక్కడ? గత ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం అందుకున్న రైతుల్లో రబీలో 23,677 మంది పేర్లు లెక్కలనుంచి గల్లంతయ్యాయి. కేవలం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులను, భూములు తక్కువ, ఎక్కువ వాటిని సరిచేయాలని, పేరు మార్పిడి తదితర అంశాలను సరిచేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్న పాపానికి వారు నగదు సాయానికి నోచుకోవడం లేదు. దీనికితోడు సరిచేసిన పాస్‌పుస్తకాల కోసం పడిగాపులు కాస్తున్నారు. కొందరి రైతుల పాస్‌పుస్తకాలను సరిచేసిన తహసీల్దార్ డిజిటల్ సంతకం పెట్టినప్పటికీ వారి పేర్లు ధరణి వెబ్సైట్లో చూపడం లేదు. రెవెన్యూ అధికారులు సరిచేసిన పాస్‌పుస్తకాల వివరాల ఆన్లైన్లో, ధరణిలో నమోదు చేయడంతోపాటు వెంటనే వాటికి సంబంధించిన సాఫ్ట్‌కాపీలను రాష్ట్ర వ్యవసాయశాఖకు పంపించడంలో జరిగిన జాప్యంతో వారి పేర్లు ధరణిలో చూపడం లేదు. దీంతో వారందరికీ ప్రస్తుత రబీ పెట్టుబడి సాయం వస్తుందా.. రాదోననే ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని స్థితిలో అధికారులు జిల్లావ్యాప్తంగా సగం మంది రైతులకు రబీ పెట్టుబడి సాయం జమకావాల్సి ఉంది. అసలు వారికి డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా సమాచారం చెప్పలేని స్థితిలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్లైన్లో నమోదు చేయాల్సిన రైతుల వివరాలు కూడా ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. . ట్రెజరీలకు పంపించారు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,35,749 మంది పేర్లు ట్రెజరీకి పంపించారు. 2,24,571 మందికి మాత్రమే డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. మిగతా వారికి రావాల్సి ఉంది. పాస్‌పుస్తకాలు, ఖాతా నంబర్లను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ప్రతి రైతుకు రబీ డబ్బులు వస్తాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ రబీ పెట్టుబడి సాయం అందలేదు మాకు ఎకరం ఇరువై గుంటల భూమి ఉంది. కాని ఇప్పటివరకు రబీ పెట్టుబడి సాయం అందలేదు. ఎందుకు రాలేదో ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అధికారులను అడిగితే తప్పక వస్తాయని చెబుతున్నారు. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వెంటనే పెట్టుబడి సాయం డబ్బులు జమ చేయాలి. -బచ్చలకూరి భద్రమ్మ, త్రిపురారం రెండో విడత రైతు బంధు అందలేదు నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. మొదటి విడతలో రైతుబంధు చెక్కు వచ్చింది. రెండో విడత మాత్రం ఇప్పటికీ అందలేదు. ఇప్పటికే రెండు, మూడుసార్లు అధికారులకు జీరాక్స్‌లు ఇచ్చా. ఎప్పుడు అడిగినా వస్తాయిలే అని అంటున్నారు. కొంత భూమి చేర్చాల్సి ఉన్నా అదీ జరగలేదు. – కుప్ప శ్రీకాంత్ రైతు, గుర్రంపోడు ఇంకా పెట్టుబడి డబ్బులు రాలేదు మా నాన్న పేరున రెండున్నర ఎకరాల భూమి ఉంది. అయితే ఒక సర్వేనంబర్‌లో మా నాన్న పేరుతో ఇంకొకరు కూడా ఉండడంతో సరిచేయమని దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు సరిచేయలేదు. ఖరీఫ్‌లో, రబీలో కూడా పెట్టుబడి సాయం రాలేదు. ఎప్పుడు సరిచేస్తారో, ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎవరూ చెప్పడం లేదు. -మాచర్ల పాండు, కుమ్మరిగూడెం, కనగల్ మొదటి విడత లేదు.. రెండో విడత లేదు నాకు చేపూరు గ్రా మ శివారులో మూ డు ఎకరాల భూ మి ఉంది. రెండేళ్ల క్రితమే మ్యూటేషన్ కోసం డ్యాకుమెంటు ఇచ్చా. ఇంతవరకు నాకు పాస్‌పుస్తకం రాలేదు. ముగు ్గరు వీఆర్ఓలు మారడంతో మారినప్పుడల్లా ఆన్లైన్లో మ్యుటేషన్ చేసినా ఇం తవరకు అతీగతీ లేదు. మొదటి విడత, రెండో విడత రైతుబంధు అందలేదు. – చేగొండి లక్ష్మీపతి, రైతు, గుర్రంపోడు పాస్‌పుస్తకం రాలేదు..రైతుబంధు అందలేదు మొదటి విడతకు ముందే మూడు ఎకరాల భూమి కొన్నా. అప్పుడు అమ్మిన రైతు పేరు మీదే డబ్బులు రావడంతో అతనే తీసుకున్నాడు. రెండో విడత అందలేదు. ఆన్లైన్లో ఉన్నా పాస్‌పుస్తకం రాలేదు. పాస్‌పుస్తకం లేక డబ్బులు అందలేదు. -వడ్డగోని గంగాధర్ గౌడ్, రైతు, నడికూడ -
గిఫ్ట్ కాకపోతే.. బుక్కయినట్లే....
విజయనగరంఅర్బన్: సొమ్ములు ఉచితంగా ఇస్తున్నారని... చెక్ అయితే ఏమిలే తీసుకుంటే పోలా.. అనుకుంటే బుక్కయినట్టే. ఉచితంగా ఇస్తే.. ఏదైనా తీసుకోవచ్చు... కానీ బ్యాంక్ చెక్ రూపంలో సొమ్ము తీసుకున్నపుడు జాగ్రత్తగా నిబంధనలు పరిశీలించాలి.. లేకపోతే ఆ ఉచితమే అప్పై కూర్చుంటుందని చెక్కు సంబంధించిన హక్కుల చట్టం చెబుతోంది. ‘నెగోషిబుల్ ఇన్స్ట్రుమెంట్’ చట్టంలో ఉన్న నిబంధనలు పరిశీలిస్తే పలు అంశాలు తెలుస్తాయి. చెక్ రూపంలో చేసిన లావాదేవీలకు చట్టపరంగా భద్రతతో పాటు మోసగాళ్లకు వెసులుబాట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఎవరైనా ఉచితంగా సొమ్మును చెక్ రూపంలో ఇచ్చి అది చెల్లుబాటు కావాలంటే ‘గిఫ్ట్ చెక్’ అథారిటీగా ఇవ్వాలి. అలా ఇవ్వకుండా సాధారణ చెక్‌గా ఇస్తే ఎన్ఐ చట్టం ప్రకారం ఆ సొమ్ము ఉచితంగా పరిగణలోకి రాదు. చెక్ ఇచ్చే వారు ఎప్పుడైనా ఆ సొమ్మును తిరిగి ఇమ్మని చట్టబద్ధంగా క్లైమ్ చేసుకోవచ్చు. అనుమానాలెన్నో..? తాజాగా టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సభ్యులకు చెక్‌లు మంజూరు చేసింది. చెక్ ఇష్యూయింగ్ ప్రక్రియ అంతా స్థానిక బ్యాంక్ అధికారులకు తెలియకుండా ఆయా బ్యాంకుల రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బ్యాంకుల్లో ఇలాంటి ఉచిత సొమ్ముల చెక్‌లను మంజూరు చేసిపుడు సంబంధిత ప్రొసీడింగ్‌లో ‘గిఫ్ట్ చెక్’ అని తప్పనిసరిగా రాసుకుంటామని పట్టణానికి చెందిన ఒక బ్యాంక్ అధికారి తెలిపారు. ఈ పరిస్థితిలో పొదుపు సంఘాలకు పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్న ఉచిత సొమ్ము చెక్‌లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్‌ల ప్రధాన కార్యాలయాల్లో సామూహికంగా మంజూరు చేసిన ఆయా చెక్కులకు ‘గిఫ్ట్ చెక్’గా ప్రొసీడింగ్స్ చేశారో లేదోననే ఆందోళనలో పొదువు మహిళల్లో నెలకొంది. -
ఇదెక్కడి చెక్కుముడి
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు: పసుపు – కుంకుమ పేరుతో ఇచ్చిన చెక్కులను పాత బకాయిలకు జమ చేయడంపై మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల పొదుపు డబ్బుల్లో చెక్కులు జమ చేసుకోవాలంటూ బ్యాంకర్లు సూచిస్తున్నారు. డబ్బులు సభ్యులకు ఇస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపై డ్వాక్రా సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014 ముందు రుణాలు ఎవ్వరూ చెల్లించవద్దు. మొత్తం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. బాకీ రద్దు అవుతుందన్న నమ్మకంతో మహిళలు బ్యాంకు రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకర్లు ఆ అప్పు తీర్చాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మధ్యమధ్యలో కొత్త రుణం ఇచ్చినట్లుగా చూపించి ఆ డబ్బులను పాత బకాయికి జమ చేసుకుంటూ బుక్ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పసుపు–కుంకుమ పథకంలో బాగంగా తొలివిడతగా ఒక్కో గ్రూపునకు రూ.25 వేల చెక్కును ఇస్తోంది. దీనినిపాత బకాయికి బ్యాంకర్లు జమ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పసుపు కుంకుమ డబ్బులు అప్పులో వేయకపోతే ఊరుకోబోమంటూ సీసీలపై ఒత్తిడి తెస్తున్నారు. కామయ్యపాలెంలో ఆందోళన తాజాగా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం ఆంధ్రాబ్యాంక్‌లో మహిళలకు ఇస్తున్న పసుపు కుంకుమ సొమ్ములు బాకీలకు జమచేయడంపై వెయ్యడంపై మహిళలు ఆగ్రహించారు. బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన రుణ మాఫీ హామీ వల్ల మోసపోయామని మాఫీ సొమ్ములు కాని, పసుపు కుంకుమ సొమ్ములు కానీ ఒక్క రూపాయి కూడా తాము తీసుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క జీలుగుమిల్లి మండలంలో 794 డ్వాక్రా గ్రూపులు ఉండగా, చంద్రబాబునాయుడు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీ దెబ్బకు జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం ఆంధ్రాబ్యాంక్ పరిధిలోని సుమారు 3 వందల గ్రూపులు మూలనపడ్డాయి. తీసుకున్న రుణాలు తిగి చెల్లించలేక డీఫాల్టర్లుగా మారాయి. ఇదే బ్యాంక్ పరిధిలో గత ఏడాది డ్వాక్రా మహిళల ఇళ్లకు సైతం బ్యాంక్ అధికారులు తాళాలు వేశారు. రుణామాఫీ కింద ఇచ్చిన రూ.పదివేల సొమ్ములు, పసుపు కుంకుమ సొమ్ములు మొత్తం పాత అప్పుకే చాల లేదు. మిగిలిన బాకీని వన్‌టైం సెటిల్మెంట్ æ చేసుకోవాలని బ్యాంక్ అధికారుల చెబుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణం ఐదురెట్లు పెరిగింది ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట నమ్మి తీసుకున్న అప్పు తిరిగి కట్టలేదు. ఈ ఐదేళ్లలో తీసుకున్న రుణం వడ్డీతో కలిపి మూడు రెట్లు పెరిగింది. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ సోమ్ము, పసుపు కుంకుమ సొమ్ము తీసుకున్న అప్పుకి పెరిగిన వడ్డీకి చాలలేదు. చంద్రబాబు మహిళలను రుణమాఫీ పేరు చెప్పి అప్పులపాలు చేశారు.– జి.కోరమ్మ. కనకాపురం. జీలుగుమిల్లి మండలం. ఎన్నికల ముందు మహిళలు గుర్తుకు వచ్చారు ఎన్నికల ముందు చంద్రబాబుకు మహిళలు గుర్తుకు వచ్చారు. ఐదేళ్లలో మహిళలకు పైసా ఇవ్వని చంద్రబాబు ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్య పెడుతున్నారు. ఇచ్చిన చెక్కులను బ్యాంక్ అధికారులు పాత బాకీలకు జమ వేసుకుంటున్నారు.– సున్నం వరలక్ష్మీ.రాచన్నగూడెం.జీలుగుమిల్లి మండలం -
పైసలు రాలే సారూ?
సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతుబంధు’ పథకం కింద పెట్టుబడి సాయం రైతులకు ఇంకా చేరలేదు. 2018–19 రబీ సీజన్ ముగింపునకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నా.. ఇంత వరకు సొమ్ము చేతికి అందలేదు. ఈ నెలాఖరు వరకు రబీ పంట వేస్తేనే సరైన సమయానికి పంట చేతికి వస్తుంది. ఇందుకు రైతులు భూములను చదును చేసి సిద్ధంగా ఉంచగా, కొందరు పంటలు కూడా వేశారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తోంది. రబీ సీజన్ ముగుస్తున్నా ఆ డబ్బులు ఇంతవరకు బ్యాంకు ఖాతాలకు చేరకపోవడంతో రైతులు ఆయోమయానికి గురవుతున్నారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల పనుల్లో ఉండడం, ఒక్క వ్యవసాయ శాఖనే పెట్టుబడి సాయంపై దృష్టి సారించడంతో రైతుబంధు సొమ్ము రైతులకు సరైన సమయానికి పనికొచ్చేట్లు కన్పించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,11,164 మంది రైతులు ఉండగా, అధికారులు ఇప్పటివరకు 1,00,456 మంది రైతుల నుంచి ఖాతాల వివరాలు సేకరించారు. ఇంకా 10,708 ఖాతాలను రైతుల వద్ద నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించాల్సి ఉంది. సేకరించిన వాటిని పైస్థాయి అధికారులకు అప్లోడ్ చేయాల్సి ఉంది. 33 వేల మంది రైతులకు నగదు జమ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 1,11,164 మంది రైతులు ఉన్నారు. ఇప్పటిదాక 33 వేల మంది రైతులకు పెట్టుబడి అందగా, ఇంకా 78,164 మంది రైతులకు పెట్టుబడి సొమ్ము రావాల్సి ఉంది. జిల్లాలో గత నెల రోజులుగా వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) 1,00,456 మంది రైతుల ఖాతాలు సేకరించారు. ఆ వివరాలను మండల వ్యవసాయ అధికారుల(ఎంఏవో)కు అందజేశారు. ఎంఈవోలు 88,012 ఖాతాలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించారు. అందులో నుంచి 33 వేల మంది రైతులకు మాత్రమే ‘రైతుబంధు’ కింద పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. వివరాలు పంపినా ఇంకా 55,012 మంది రైతుల ఖాతాలకు నగదు చేరలేదు. ఇదిలా ఉండగా, జిల్లా రైతులకు మొత్తం రూ.178 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.55 కోట్లు మాత్రమే వచ్చింది. మిగతా రూ.123 కోట్ల నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కొనసాగుతున్న ఖాతాల సేకరణ.. జిల్లా వ్యాప్తంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ గత నెల రోజుల నుంచి కొనసాగుతోంది. జిల్లాలో 1,11,164 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 1,00,456 మంది రైతుల ఖాతాలను సేకరించారు. మిగతా 10,708 మంది రైతుల ఖాతాలు తీసుకోవాల్సి ఉంది. కాగా, ఏఈవోలు గ్రామాల వారీగా వెళ్లి రైతుల ఖాతాల వివరాలు సేకరించి, ఆ ఖాతా పని చేస్తుందా.. లేదా అనేది సరి చూడాల్సి వస్తోంది. ఒకవేళ రైతు ఇచ్చిన బ్యాంకు ఖాతా పనిచేయకపోతే నగదు అందులో జమ కాదు. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతోపాటు అధికారులను రైతులు నిలదీసే అవకాశాలు లేకపోలేదు. ఇందుకు అధికారులు ముందే జాగ్రత్త పడుతూ ఖాతాలను పరిశీలన చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ‘అందరికీ పెట్టుబడి’.. జిల్లాలోని రైతులందరికీ ఈ నెలాఖరులోగా రైతుబంధు సాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున యాభై ఎకరాల వరకు పరిమితి లేకుండా ఇస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి యేడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం చేస్తోంది. మొదటి విడత ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయం ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ కాగా, రెండో విడత రబీ సీజన్ పెట్టుబడి పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నందున రైతులకిచ్చే పెట్టుబడి సాయాన్ని వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు మొదటి విడత చెక్కులు పొందిన రైతులే రెండో విడత నగదు పొందడానికి అర్హులుగా గుర్తించారు. ఆన్లైన్ ద్వారా నగదు జమ చేసేందుకు మొదటి విడత చెక్కులు పొందిన రైతుల వద్ద నుంచి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పెట్టుబడి నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు సగం మంది రైతులకు కూడా సాయం అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. -
నేటినుంచి ‘రైతుబంధు’
నల్లగొండ అగ్రికల్చర్ : నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కోసం అమలుచేస్తున్న రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీకి బదులు రైతుల ఖాతాల్లో నగదును జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10నుంచి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వద్దను నుంచి వారి బ్యాంకుఖాతా నంబర్లను సేకరించే పనిలో తలమునకలయ్యారు. రబీ రైతుబంధు పథకం పెట్టుబడి సాయం అందుకోనున్న రైతులు జిల్లా వ్యాప్తంగా 3,59,496 మంది ఉన్నారు. అయితే ఈ నెల 22 నాటికి రైతుల నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు 42 వేల ఖాతాలను సేకరించాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ప్రక్రియ వేగవంతంగా సాగడంతో ఇప్పటి వరకు 77,821 ఖాతానంబర్లు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్ నంబర్లను సేకరించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర వ్యవసాయ శాఖకు అనుసంధానం చేశారు. దీని ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో సోమవారం నుంచి నగదు జమ చేయనుంది. ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండో దశ పెట్టుబడి సాయం రైతులకు అందునున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రైతుల ఖాతా నంబర్లను దశల వారీగా సేకరించి రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయాన్ని జమచేయడానికి జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఏఈఓలు లక్ష్యానికి మించి రైతుల నుంచి వివరాలు సేకరించడంపై జిల్లా వ్యవసాయాధికారి జి.శ్రీధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచిసేకరించిన వివరాలు ఇలా.. మిర్యాలగూడ మండలంలో 17,306 మంది రైతులకు గాను 4,709 ఖాతాలు, దేవరకొండలో 11,930 మందికి 4,248, చింతపల్లిలో 13,132కు 4205, మునుగోడులో 13,562కు 3,704, పెద్దవూరలో 13,380కి 3,639, నల్లగొండలో 16,740కి 3,607, కనగల్‌లో 14,122కు 3,329, నిడమనూరులో 14,316కు 3,122, అడవిదేవులపల్లిలో 4,063కు 3,088, చండూరులో 12,713కు 2,953, నార్కట్‌పల్లిలో 12,943కు 2,664, వేములపల్లిలో 8,469కు 2,606 ఖాతాలను సేకరించారు. గుర్రంపోడులో 16,414కు 2,603, కట్టంగూరులో 11,507కు 2,592, తిరుమలగిరి(సాగర్)లో 9,782కు 2,530, దామరచర్లలో 8,500కు 2,423, కొండమల్లెపల్లిలో 8,074కు 2,358, పీఏపల్లిలో 11,157కు 2,344, నకిరేకల్‌లో 8,448కు 2,322, శాలిగౌరారంలో 12,912కు 2,155, అనుములలో 11,188కు 2,106, చిట్యాలలో 13,035కు 2,065, మర్రిగూడలో 11,715కు 1,976, తిప్పర్తిలో 10,696కు గాను 1,794 రైతుల ఖాతాలను సేకరించారు. కేతేపల్లిలో 9,106కు 1,590, మాడుగులపల్లిలో 10,969కు 1,540, గుండ్లపల్లిలో 11,648కి 1,362, నాంపల్లిలో 15,070కి 1,224, చందంపేటలో 9,083కు 944, త్రిపురారంలో 12,042కు 925 మంది రైతులనుంచి ఖాతాలను సేకరించారు. వీరందరికీ సోమవారం నుంచి ఆన్లైన్ ప్రక్రయ ద్వారా రబీ పెట్టుబడి సాయం డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాగానే వెంటనే ఆ బ్యాంకు నుంచి రైతుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. అనిరంతరం కొనసాగుతుంది రైతులందరికీ రబీ పెట్టుబడి సాయం ఖాతాల్లో జమచేసే వరకు ఖాతా నంబర్ల సేకరణ, ఆన్లైన్ ద్వారా డబ్బులు వేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి రైతు విధిగా తమ పాస్‌పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్‌ను వ్యవసాయ విస్తరణాధికారులను అందించాలి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొదటిదశలో వచ్చిన వారందరికీ ఖాతాల్లో డబ్బు జమచేస్తారు. జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ -
ఖాతాల్లోకి ‘సాయం’
సాక్షి, వరంగల్ రూరల్: ఉత్కంఠకు తెరపడింది.. రైతుబంధు పెట్టుబడి పంపిణీకి ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలో రబీలో అందించే రెండో విడత రైతు పెట్టుబడి సాయం అందజేసేందుకు మార్గం సుగమమైంది. మొదటి విడతలో అందించిన విధంగానే రైతులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వచ్చిన కోడ్ ప్రభావంతో హడావిడి లేకుండానే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని నిర్ణయించా రు. రైతుకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఖరీఫ్‌లో రూ.4 వేలు, రబీలో రూ.4 వేలు ఇలా ఏడాదికి రూ.8 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఖరీఫ్ సాయం అందించారు. ఈ నెల 5 నుంచి రబీ సాయం చెక్కులు పంపిణీ జరగాల్సిండగా శాససభ రద్దుతో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పథకం అమలుకు ఎన్నికల సంఘం పలు షరతుల విధించింది. తొలి విడతలో అందుకున్న వారికే.. జిల్లాలో ఖరీఫ్‌కు 1,69,731 మంది పట్టాదారులుండగా రూ.130,02,09,000 విలువ చేసే 1,70,292 చెక్కులు వచ్చాయి. అందులో రూ.119,79,62,250 విలువ చేసే 1,50,224 చెక్కులు రైతులు అందుకున్నారు. రూ.10,09,98,410 విలువ చేసే 20,068 చెక్కులు రైతులు తీసుకోలేదు. మొదటి విడతలో చెక్కులు అందుకున్న వారికే రబీలో సాయం అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న వారిలో పలువురు రైతులు మరణించారు. దీంతో రబీలో 1,48,581 మంది పట్టాదారులకు రూ.118,99,94,630 విలువ చేసే 1,49,095 చెక్కులు మంజూరయ్యాయి. ఆరు బ్యాంకులు.. జిల్లాలో ఆరు నోటిఫైడ్ బ్యాంకులను ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఐఓబీ, ఏపీజీవీబీ, సిండికేట్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను గుర్తించారు. ఆయా బ్యాంకుల చెక్కులు జిల్లాకు రానున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు సంబంధించిన నెక్కొండ, నర్సంపేట, పర్వతగిరి, ఆత్మకూరు మండలాలకు చెందిన రైతుల 50,573 చెక్కులు జిల్లాకు శనివారం హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు తీసుకొచ్చారు. వీటిని ఆయా మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో భద్రపరచనున్నారు. ఆంధ్రాబ్యాంకుకు నల్లబెల్లి, పరకాల, గీసుకొండ, సంగెం, శాయంపేట మండలాలు, ఎస్బీఐకి దామెర, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాలు కేటాయించగా సిండికేట్ బ్యాంక్‌కు రాయపర్తి, కార్పొరేషన్ బ్యాంక్‌కు ఆత్మకూరు, ఏపీజీవీబీకి ఖానాపూర్ మండలాలకు ఆయా బ్యాంకుల చెక్కులు త్వరలో తీసుకురానున్నారు. మార్గదర్శకాల కోసం.. పెట్టుబడి సాయాన్ని రైతులకు నేరుగా చెక్కులు రూపంలో అందించకుండా ఖాతాలో జమ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. దీంతో చెక్కుల పంపిణీని వ్యవసాయ అధికారులు నిలిపివేశారు. రైతుల బ్యాంక్ అకౌంట్ నంబర్లు సేకరించి ప్రభుత్వం అందించిన చెక్కులను వారి ఖాతాల్లో జమ చేస్తారా, చెక్కులు బ్యాంకులో వేయకుండా నేరుగా రైతు ఖాతాలోకి ఆర్టీజీఎస్ చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో స్పష్టత రాగానే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆదేశాలు రాలేదు రైతుబంధు సాయం అందించేందుకు రైతుల నుంచి బ్యాంకు అకౌంట్ నంబర్లు సేకరించాలని ఆదేశాలు రాలేదు. చెక్కుల పంపిణీ మాత్రం నిలిపివేయాలని చెప్పారు. ఉన్నతాధికారులు ఎలా చెప్పితే అలా పాటిస్తాం. కొన్ని చెక్కులు జిల్లాకు చేరుకున్నాయి. – ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి -
రైతు ‘చి’క్కులు
సాక్షి, నాగర్‌కర్నూల్: రైతుబంధు పథకం ద్వారా ఖరీఫ్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. కానీ ఈ రబీలో మాత్రం చెక్కుల పంపిణీకి ఎన్నో చిక్కులు ఎదురవుతున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. సర్వత్రా అయోమయం పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేస్తారనే విషయం తెలుసుకున్న రైతులు అయోమయంలో పడ్డారు. బ్యాంకుల్లో ఖాతా ఉన్న రైతులు కుదుటగా ఉండగా ఖాతాలు లేనివారు ఆందోళన చెందుతున్నారు. సాగులో పెట్టుబడి అధికమవడం, ఎరువుల ధరలు పెరగడం, చీడపీడల ఉధృతి పెరుగుతుడడంతో ఎకరాలకు రూ.4వేల సాయంతో కొంత ఊరట లభిస్తుందని రైతులు ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలేలా ఉంది. మొదటి విడతలో జిల్లాలోని తిమ్మాజీపేట మండలం కొడుపర్తి, అప్పాయిపల్లి గ్రామాల్లో చెక్కులను పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు పూర్తిచేశారు. శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాల్సి వచ్చింది. ఆందోళనలో రైతులు రైతుబంధు పథకం కింద జిల్లాకు వచ్చిన చెక్కులను వ్యవసాయాధికారులు భద్రపరిచి పంపిణీకి సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే పంపిణీ నిలిపి వేయాలని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఖరీఫ్‌లో తీసుకున్న రైతుల ఖాతాలోకే నేరుగా జమచేయాలని నిర్ధేశించారు. ఈ రబీ సీజన్‌కు జిల్లాలోని 352 గ్రామాల్లోఉన్న 2,30,766 మంది రైతులకు రూ.266 కోట్ల 91 లక్షల 22వేల 820 లను 2,33,719 చెక్కుల రూపంలో అందించడానికి అధికారులు సిద్ధమయ్యారు. మొదటగా 1,49,800 చెక్కులను పంపిణీ చేయడానికి జిల్లాలోని ఆయా వ్యవసాయ కార్యాలయాలకు చెక్కులు చేరుకున్నాయి. అయితే గతంలో చెక్కులు పొందిన రైతులు ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకం చూపితే బ్యాంకులో నగదు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు ఖాతాలో జమచేయాలంటే ప్రతీ రైతుకు ఖాతా ఉండాల్సిందేననే నిబంధ ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఖాతాలేని రైతులు వేలల్లో ఉన్నారు. వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఎవరివద్ద కూడా సమాధానం లభించడంలేదు. అధికారుల్లోనూ అస్పష్టత చెక్కుల రూపంలో కాకుండా నేరుగా రైతులు ఖాతాలో డబ్బులు జమచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందించాలనే అంశంపై అధికారుల్లో కూడా స్పస్టత లేకుండా పోయింది. ఖాతాలోనే డబ్బులు జమ చేయాలంటే ప్రతీ రైతు నుంచి ముందు ఖాతా నంబర్‌ను సేకరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియకే చాలా సమయం పడుతుంది. ఇకపోతే ఖాతాలేని రైతులకు కొత్త ఖాతాలు తెరిపించి పాస్‌బుక్కులు ఇచ్చేవరకు చాలా సమయం పడుతుంది. జిల్లాలోని 2,30,766 మంది రైతుల ఖాతా నంబర్లను సేరించాలంటే అధికారులకు తలకు మించిన భారం. సమయం కూడా తక్కువగా ఉండటం, ప్రస్తుతం అధికారులంతా ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడంలతో ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తయ్యేలా కనిపించడంలేదు. ఒకవేళ శరవేగంగా పనులు ప్రారంభించినా ఎంతవరకు సాధ్యమైతుంది.. అనే అంశంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖాతా నంబర్లు సేకరించి వారి ఖాతాలో డబ్బులు జమచేసే వరకు రైతులు పొలం పనుల్లో బిజీగా ఉండే రోజులు వస్తాయి. గత ఖరీఫ్‌లో అనుకున్న సమయానికి రైతులకు పెట్టుబడి సాయం అందగా ఈ సీజన్లో మాత్రం అందుతాయో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్పష్టమైన ఆదేశాలు రాలేదు రబీ సీజన్‌కు సంబంధించి రైతుబంధు చెక్కులనుశనివారం నుంచి పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రస్తుతం నలిపివేశాం. నేరుగా రైతుల ఖాతాలో జమచేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ ప్రక్రియను ఎలా కొనసాగించాలనే అంశంపై ఇంకా స్పష్టమైన వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1,49,800 చెక్కులు సిద్ధం చేశాం. తదుపరి ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. – బైరెడ్డి సింగారెడ్డి,జిల్లా వ్యవసాయాధికారి -
రైతుబంధు షురూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: యాసంగి పంట సాగుకు పెట్టుబడిని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ‘రైతుబంధు’ రెండో విడత కింద ఎకరాకు రూ.4 వేల పంపి ణీని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించింది. తొలివిడతగా కొత్తూరు మండలం తీగాపూర్‌లో ఈ పథకం కింద రైతులకు చెక్కులను అందజేసింది. పంట పెట్టుబడి కింద ఏటా ఎకరాకు రూ.8 వేల నగదును ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా రబీ సీజన్‌కు సంబంధించిన సొమ్మును పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రైతుబంధు పథకం అమలుపై నీలినీడలు నెలకొన్నా.. కేంద్ర ఎన్నికల సంఘం పంపిణీపై ఆంక్షలు విధించకపోవడంతో రబీ సాయాన్ని అందజేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే, జిల్లా పరిధిలోని రైతులందరికీ సంబంధించిన చెక్కుల ముద్రణ ఇంకా పూర్తికాకపోవడానికి ప్రస్తుతానికి పరిమిత స్థాయిలో చెక్కులను పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ భావించింది. అందుకనుగుణంగా తొలు త తీగాపూర్‌లో ఈ పథకానికి శ్రీకారం చుట్టినా.. దశలవారీగా మిగతా గ్రామాలకు కూడా విస్తరించనున్నారు. ఈ గ్రామ ంలోని 269 మంది రైతులకు రూ.18.71 లక్షల సాయాన్ని పంపిణీ చేశారు. తగ్గిన రైతుల సంఖ్య గత ఖరీఫ్‌లో రైతుబంధును ప్రవేశపెట్టిన సర్కారు అన్నదాతలకు చెక్కులను అందజేసింది. తొలి విడతలో భాగంగా మే నెలలో 2.87 లక్షల మందికి రైతుబంధు కింద చేయూతనివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 2.42 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేసింది. ఆక్షేపణలు, వివాదాస్పద భూములకు పాస్ పుస్తకాలను జారీ చేయకపోవడంతో ఈ భూములకు సంబంధించిన చెక్కులను పక్కన పెట్టింది. కాగా, వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టిన వాటిలో సుమారు 15 వేల పాస్‌పుస్తకాలను కొత్తగా జారీ చేశారు. దీంతో రైతుబంధు కింద మూడు లక్షల మందికి ఈసారి సాయం అందుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. అయితే, అనూహ్యంగా ఈ సంఖ్య భారీగా తగ్గిపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలోకంటే ఈసారి తక్కువ మంది రైతులకు సాయం అందజేయాలని నిర్ణయించినట్లు సంకేతాలు అందడం విస్మయపరుస్తోంది. జిల్లావ్యాప్తంగా 2.68 లక్షల మందికి మాత్రమే సాయం అందించనున్నట్లు తెలిసింది. ఏఏ మండలాల్లో రైతుల సంఖ్య తగ్గిందనే అంశంపై వ్యవసాయశాఖ ఆరా తీస్తోంది. ఇదిలావుండగా, ఖరీఫ్‌లో ఏడు బ్యాంకుల ద్వారా రైతులకు చెక్కులను అందజేసిన యంత్రాంగం.. ఈసారి 8 బ్యాంకుల ద్వారా రైతుబంధు సాయా న్ని తీసుకునే వెసులుబాటు కల్పించింది. కార్పొరేషన్ బ్యాంకు స్థానే కొత్తగా ఐడీబీఐ, టీజీవీబీ బ్యాంకులను చేర్చింది. అయితే, ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈసారి రైతులకు చెక్కుల స్థానంలో వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేయ నున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
యాసంగికి చేయూత
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబంధు పథకాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరోసారి రైతుబంధు చెక్కుల ద్వారా యాసంగి పంటకు రైతులకు చేయూత అందించనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్‌లో రైతులకు చెక్కులు అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టాదారులైన రైతులందరికీ యాసంగి పంట పెట్టుబడి సాయం చెక్కులను సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని 16 మండలాల్లో 1,43,281 చెక్కుల రూపంలో రబీ సీజన్‌కు రూ.126.54 కోట్లు పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో చెక్కుల వెరిఫికేషన్ పూర్తిచేశారు. కోడ్ నుంచి మినహాయింపు... రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే చెక్కులకు ఎన్నికల కోడ్ అడ్డువస్తుందని ముందుగా భావించినా.. ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చెక్కుల పంపిణీని పూర్తిచేయాలని భావిస్తున్నారు. రబీ సీజన్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే మొదలెట్టారు. జిల్లాలో 3,23,031 ఎకరాల భూమి సాగవుతుండగా.. ఎకరానికి రూ.4 వేల లెక్కన యాసంగి పంటకు రూ.126.54 కోట్లు పంపిణీ చేయనున్నారు. అసైన్డ్ భూముల లబ్ధిదారులు, ఆర్వోఆర్, పట్టాదారులు, ఏజెన్సీ ఏరియాలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ పంట పెట్టుబడి కింద ఆర్థిక సహాయం చెక్కులు అందనున్నాయి. చెక్కుల పంపిణీకి ప్రత్యేక బృందాలు... చెక్కుల పంపిణీలో రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు కీలకంగా వ్యవహరించనున్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామాలవారీగా ఆర్ఐలు, వీఆర్వో, వీఆర్ఏలు, ఏఈవోలు, మండల వ్యవసాయాధికారులు సమన్వయంతో చేపట్టనున్నారు. సహకార, ఇతరశాఖలను వినియోగించుకోనున్నారు. ఇప్పటికే చెక్కుల వెరిఫికేన్ను పూర్తిచేసి ట్రెజరీల్లో భద్రపరిచిన అధికారులు శనివారం అన్ని తహసీల్, వ్యవసాయశాఖ కార్యాలయాలకు పంపించి, సోమవారం నుంచి గ్రామాల వారీగా పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులు చెక్కులను సరఫరా చేశాయి. రైతు ఖాతాకలిగి ఉన్న సంబంధిత బ్యాంకు బ్రాంచితోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా సంబంధిత బ్యాంకులో నగదు తీసుకునే వెసులుబాటు కల్పించారు. రైతులకు పెట్టుబడి సాయం చెల్లించేలా బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉంచేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గతంలో మాదిరిగానే చెక్కులు విత్‌డ్రా చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. చెక్కులు పంపిణీకి సిద్ధం రైతు బందు చెక్కులు పంపిణీకి సిద్ధమయ్యాయి. రైతులకు అందించాల్సిన చెక్కులన్నింటిని వెరిఫికేషన్ చేసి పంపిణి చేస్తాం. శుక్రవారం తిమ్మాపూర్ మండలం మల్లాపూర్‌లో లాంఛనంగా ప్రారంభించాం. సోమవారం నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం రైతులందరికీ పంపిణీ చేస్తాం.– జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ -
రుణాలు లేనట్టే..!
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: రైతుబంధు పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంపై అయోమయం నెలకొంది. శనివారం నుంచి జిల్లాలో ప్రారంభం కావాల్సిన చెక్కుల పంపిణీపై సందిగ్ధత ఏర్పడింది. అధికారులు చెక్కులు పంపిణీ చేయాలా లేదా అనే అయోమయంలో ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ఎన్నికల సంఘం నిబంధనలు విధించడంతో పంపిణీ కార్యక్రమం ముందుకు సాగుతుందోలేదోనని సందేహం వ్యక్తం అవుతోంది. రైతులు శనివారం నుంచి చెక్కులు పంపిణీ చేస్తారనే సంతోషంలో ఉన్నప్పటికీ శుక్రవారం ఎన్నికల సంఘం పలు నిబంధనలు విధించింది. జాబితాలో కొత్త రైతుల పేర్లు చేర్చవద్దని, ప్రచారం ఆర్భాటాలు, బహిరంగ సభలు నిర్వహించి చెక్కులను పంపిణీ వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీపై రుణాలు అందజేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీడీఏ నుంచి స్వయం ఉపాధి రుణాల కోసం ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడంతో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఈ ఏడాది రుణాలు రావడం కష్టమేనని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం అంతంత మాత్రంగానే నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో కనీసం స్వయం ఉపాధి రుణాలను పొంది కుటుంబాన్ని పోషించుకుందామని ఆశలు పెట్టుకున్న గిరిజన నిరుద్యోగులకు ఈ ఏడాది నిరాశనే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017–18లో 300 మందికే.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేటగిరీల్లో 1,274 మంది నిరుద్యోగులు వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి రుణాలు మంజూరు కాగా వీరికి రూ.13.75 కోట్లు అవసరమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో కేటగిరి 1లో 506 మంది లబ్ధిదారులు, కేటగిరిలో 2లో 621 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి 3లో 147 మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేవలం 300 మందికి రూ.3కోట్ల వరకు సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 974 మంది లబ్ధిదారులు సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారు. 2018–19లో నిరాశే..? 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకం కింద రుణాలను అందించేందుకు వార్షిక ప్రణాళికను తయారు చేసి కమిషనరేట్‌కు పంపించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1915 మంది లబ్ధిదారులకు రూ.18.44 కోట్లు అందించేందుకు ప్రణాళికను రూపొందించారు. కానీ ఇటీవల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొత్త వారికి ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు మంజూరు కావడం కష్టమేనని పలువురు గిరిజనులు పేర్కొంటున్నారు. అధికారులు సంబంధిత వార్షిక ప్రణాళికలను ముందస్తుగా ప్రభుత్వానికి పంపించి ఉంటే కోడ్ అమలు కంటే ముందుగానే గిరిజన నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగేదని పలువురు నిరుద్యోగులు పేర్కొంటున్నారు. తప్పని నిరీక్షణ.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఐటీడీఏలో స్వయం ఉపాధి రుణాల కోసం గిరిజన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికేట్లను సిద్ధంగా చేసుకున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. తీర ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిరాశ చెందుతున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రుణం మంజూరైన వారికి సబ్సిడీ ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో సబ్సిడీ రుణాలను జమా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. దరఖాస్తులు స్వీకరిచాలి ఎస్సీ కార్పొరేషన్లో ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఐటీడీఏలో స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు కనీసం దరఖాస్తుల స్వీకరణ కోసం కనీసం నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. దీంతో జిల్లాలోని గిరిజన నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. – కుమ్ర రాజు, కుంమ్రంసూరు యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్ రుణాల కోసం ఎదురుచూపు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగాలు రాక చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం స్వయం ఉపాధి పథకం కింద రుణాలకు దరఖాస్తు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుదామంటే 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి రుణాల కోసం ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా సబ్సిడీ జమ కాలేదు. అధికారులు స్పందించి సకాలంలో సబ్సిడీ నగదు జమ అయ్యేలా చూడాలి. – ఆత్రం వెంకటేశ్, ఆదివాసీ యువజన సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు -
‘రెండో’ చెక్కు రెడీ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత రైతుబంధు చెక్కుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వ్యవసాయాధికారులు మండలాలవారీగా రైతులకు చెక్కులు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి.. మొదటి విడతగా రైతులకు చెక్కులు పంపిణీ చేసిన విషయం విదితమే. అందులో కొన్ని లోటుపాట్లు జరగగా.. ఈసారి పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు.. కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు చెక్కుల పంపిణీపై వివరించారు. పాలనాపరమైన అనుమతుల కోసం సంబంధిత అధికారులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆయా బ్యాంకులకు రైతులకు సంబంధించిన చెక్కులు అందుతుండగా.. వీటిని వ్యవసాయాధికారులు పరిశీలించే పనిని ప్రారంభించారు. జిల్లాలోని 379 రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 2,85,348 మంది రైతులు ఉన్నారు. వారికున్న భూముల ఆధారంగా ఖరీఫ్‌లో రూ.275.01కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రబీలో కూడా ఇదే మొత్తంలో చెక్కుల రూపంలో రైతులకు అందించనుంది. దీనికి సంబంధించి గ్రామాల్లో ముందస్తుగా టమకా వేయించాల్సి ఉంటుంది. ఏఓలు, ఏఈఓల ద్వారా రైతులకు తెలియజేసి.. నిర్ణయించిన తేదీల్లో చెక్కులు అందజేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. బ్యాంకులకు చేరుతున్న చెక్కులు రబీ సీజన్ ప్రారంభమవుతుండడంతో రైతుబంధు చెక్కులను రైతులకు పంపిణీ చేయనున్నారు. ఐదు మం డలాలకు చెందిన చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. ఖమ్మం రూరల్ మండలానికి రూ.12.99కోట్ల విలువైన 13,436 చెక్కులు, నేలకొండపల్లికి సంబంధించి రూ.13.26కోట్ల విలువైన 16,203 చెక్కులు, తల్లాడకు సంబంధించిన రూ.12.31కోట్ల విలువైన 12,688 చెక్కులు, వేంసూరుకు సంబంధించి రూ.15.09కోట్ల విలువైన 15,227 చెక్కులు, ఎర్రుపాలెంకు సంబంధించి రూ.13.51కోట్ల విలువైన 13,439 చెక్కులు ఆంధ్రా బ్యాంకుకు చేరాయి. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు కూడా చెక్కులు చేరుతున్నాయి. మధిరకు సంబంధించి 16,407, ముదిగొండ 15,404, సత్తుపల్లి 11,004, తిరుమలాయపాలెం 16,774, ఖమ్మంకు సంబంధించి 10,975 చెక్కులు ఐఓబీకి చేరాయి. ఆయా చెక్కులను వ్యవ సా య శాఖ శుక్రవారం నుంచి పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయి లో చెక్కులు మంజూరైన రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఖరీఫ్‌లో పంపిణీ కాని 20,274 చెక్కులు గత ఖరీఫ్‌లో 379 రెవెన్యూ గ్రామాల్లోని రూ.15.63కోట్ల విలువైన 20,274 చెక్కులు పంపిణీ కాలేదు. మొత్తం 2,83,756 చెక్కులను పంపిణీకి సిద్ధం చేయగా.. వాటిలో 674 చెక్కులలో తప్పులు దొర్లాయి. 2,68,499 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. అలాగే అటవీ భూములకు సంబంధించి 5,691 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఇక పంపిణీ కాని 20,274 చెక్కులలో మరణించిన రైతులు.. రెండు ఖాతాలున్నవి.. తమకు సాయం అవసరం లేదని వెనుకకు ఇచ్చినవి.. ప్రభుత్వ భూమికి సంబంధించినవి.. భూ వివాదాలు నెలకొన్నవి.. భూమి లేకపోయినా చెక్కులు జారీ అయినవి.. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లినవి.. చెక్కులలో తప్పులు ఉన్నవి.. ఉన్న భూమి కంటే ఎక్కువ నిధులతో ఉన్న చెక్కులు.. సాగులో లేని భూమికి వచ్చిన చెక్కులు.. ఆధార్ లేని చెక్కులు.. గ్రామాల్లో లేని రైతుల చెక్కులు.. విదేశాల్లో ఉంటున్న రైతులకు సంబంధించినవి.. అమ్మిన భూములకు సంబంధించిన చెక్కులు.. ఆర్ఓఎఫ్ఆర్ పెండింగ్ ఉన్న చెక్కులను పంపిణీ చేయలేదు. విదేశాల్లోని రైతులకూ.. గత ఖరీఫ్‌లో విదేశాల్లో ఉన్న రైతులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయలేదు. అయితే ప్రభుత్వం వీరికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయా రైతులకు కూడా చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి పంపిణీ కూడా కొనసాగనున్నది. జిల్లాలో మొత్తం 744 చెక్కులకు సంబంధించి రూ.60లక్షలు రైతులకు అందజేయాల్సి ఉంది. చాలా సంతోషం.. తెలంగాణ ప్రభుత్వం అందించే వ్యవసాయ పెట్టుబడి రెండో విడత చెక్కులు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. మొదటి విడతలో నాకు రూ.14వేలు వచ్చాయి. రెండో విడత కూడా రూ.14వేలు వస్తాయి. ప్రస్తుతం వ్యవసాయం పనులకు చాలా ఉపయోగపడతాయి. – ఎనికె జానకిరామయ్య, రైతు, అప్పలనర్సింహాపురం రైతుకు భరోసా.. ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు పెట్టుబడి పథకం ఇవ్వడం భరోసా కల్పించింది. నాకు మూడున్నర ఎకరాలకు పెట్టుబడి అందింది. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా సాగు చేశాను. ఇప్పుడు వ్యవసాయ పనులకు సరైన సమయంలో రైతుబంధు ఇస్తుండడం మంచి పరిణామం. – అమరగాని వెంకయ్య, రైతు, చెరువుమాదారం పంపిణీకి చర్యలు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతుబంధు చెక్కుల పంపిణీకి సంబంధించి చర్యలు చేపట్టాం. గతంలో ఖరీఫ్‌లో నిర్వహించిన విధంగానే చెక్కుల పంపిణీ చేపడతాం. ఇప్పటికే చెక్కులు బ్యాంకులకు చేరుతున్నాయి. వచ్చిన చెక్కులను సంబంధిత మండలాల అధికారులతో పరిశీలించే పనిని చేపట్టాం. – ఎ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారిణి -
‘రైతుబంధు’కు ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న 'రైతుబంధు' చెక్కుల పంపిణీకి అడ్డంకి తొలగింది. రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం షరుతులతో అనుమతినిచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన నేపథ్యంలో ఈసీ శుక్రవారం స్పందించింది. ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల నిబంధనల పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. అయితే చెక్కులు రైతుల చేతికి నేరుగా కాకుండా బ్యాంకుల ఖాతాల్లో జమ చేయాలని సూచించింది. మొదటి విడత రైతుబంధులో ఇచ్చినవారికే రెండో విడతలో నగదు చెల్లించాలని, అదనంగా కొత్తవారికి ఇవ్వకూడదని నిబంధన పెట్టింది. అదేవిధంగా రైతుబంధులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూదని తేల్చి చెప్పింది. ఈసీ నిర్ణయంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4వేల చొప్పున సంవత్సరానికి రూ.8 వేలు ఇస్తుంది. తొలి సీజన్లో రూ.4వేలు ఇచ్చిన ప్రభుత్వం.. రెండోదఫా రూ.4వేలు ఇవ్వనుంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, రైతుబంధు చెక్కుల పంపిణీ చేయొద్దంటూ ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ఆడపడుచులకు కాలం చెల్లిన చెక్కులు!
తాండూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతున్నాయి. గతంలో జరిగిన మాదిరిగానే తాండూరులో మరోసారి లబ్ధిదారులకు కాలంచెల్లిన చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన వారికి గత 2వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా 149 చెక్కులు అందజేశారు. ఇందులో 63 కల్యాణలక్ష్మి, 86 షాదీముబారక్ చెక్కులు ఉన్నాయి. వీటిని పొందిన లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని కోరగా.. చెక్కుల గడువు ముగిసిందని చెప్పడంతో ఖంగుతిన్నారు. దీంతో చేసేదేమీ లేక మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆడపడుచులకు కట్నంగా సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక సాయం.. కేవలం అధికారుల నిర్లక్ష్యంతో అపహాస్యమవుతోందని మండిపడుతున్నారు. -
‘రైతుబంధు’ మాయం.!
అశ్వారావుపేటరూరల్ : అశ్వారావుపేటలో సుమారు 228 ఎకరాలకు సంబంధించిన 14 రైతుబంధు చెక్కులు మాయమయ్యాయి. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా.. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయని రెవెన్యూ అధికారులు పేర్కొంటూ తప్పించుకుంటున్నారు. పెట్టుబడి సాయం కోసం రైతులు నెల రోజుల నుంచి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పాస్ పుస్తకాలిచ్చారు కానీ.. అశ్వారావుపేట రెవెన్యూలోని ఊట్లపల్లి సమీపంలో శీమకుర్తి సాయిబాబా అనే రైతుకు ఖాతా నంబరు 154లో.. సర్వే నంబరు 302/ఆ/1లో 2.03 ఎకరాలు, 303/ఆ సర్వే నంబర్లో 6.10 ఎకరాలు, 304అ/1 నంబర్లో 3–39 ఎకరాలు, 306 సర్వే నంబర్లో 2–16 ఎకరాలు, 307/ఆ నంబర్లో 1–12, 339/1 సర్వే నంబర్లో 2–39 ఎకరాలతోపాటు మరికొన్ని నంబర్లలో మొత్తం సుమారు 28 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూములకు సంబంధించిన రైతుబంధు చెక్కులు అందలేదు. శీమకుర్తి చక్రధరరావు, శీమకుర్తి రామలింగం, శీమకుర్తి కైలాస్‌నా«థ్, జల్లిపల్లి నారాయణరావు, జల్లిపల్లి లక్ష్మి, కొనకళ్ల నాగేశ్వరరావులకు చెందిన సుమారు 200వందల ఎకరాలకు సంబంధించి సుమారు రూ.7లక్షల పెట్టుబడి సాయం చెక్కులు గల్లంతయ్యాయి. వీళ్లందరికీ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం కింద చెక్కులు మంజూరు కాగా వీటిని ఆయా రైతులు తీసుకునేందుకు గత నెల 10న అశ్వారావుపేటలో జరిగిన పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులు మంజూరైనట్లు అధికారులు రైతులకు చూపించి, పాస్ పుస్తకాల్లో పొలాలకు సంబంధించిన చిన్న పొరపాటు ఉందని చెప్పి పంపిణీ చేయకుండా నిలిపి వేశారు. దీంతో రైతులు తమ వద్ద ఉన్న పాత రికార్డులు, ఆధారాలతో స్థానిక రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా అందించారు. విచారణ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి పొరపాట్లు లేవని ధ్రువీకరిస్తూ పత్రాన్ని ఇచ్చారు. ఆ పత్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు సమర్పించగా కేవలం పాస్ పుస్తకాలు పంపిణీ చేసి, పెట్టుబడి సాయం చెక్కులు మాత్రం ఇవ్వలేదు. అప్పటి నుంచి రైతులు అటు రెవెన్యూ, ఇటు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ చెక్కులు మాయమయ్యాయని, అందుకే ఇరు శాఖల అధికారులు తేల్చిచెప్పడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రైతుబంధు సాయాన్ని స్వాహా చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నెల రోజులుగా తిరుగుతున్నా నాకు పెట్టుబడి సాయం కింద చెక్కులు మంజూరయ్యాయి. వాటి కోసం గడిచిన నెల రోజులుగా కార్యాలయాల చూట్టు తిరుగుతున్నాను. వ్యవసాయ కార్యాలయానికి వెళ్తే, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమని, ఇక్కడికి వెళ్లితే అక్కడికే వెళ్లమని తిప్పుతున్నారు. గట్టిగా నిలదీస్తే చెక్కులు గల్లంతైనట్లు చెప్పారు. వికలాంగుడైన నేను 70 ఏళ్ల వయసులో ఇంకా ఎన్ని రోజులు తిరగాలి. –శీమకుర్తి సాయిబాబా, బాధిత రైతు, అశ్వారావుపేట చెక్కులు కనిపించడం లేదు కొందరు రైతులకు మంజూరైన పెట్టుబడి సాయం చెక్కులు కనిపించని మాట వాస్తవమే. తొలిరోజు పంపిణీ కార్యక్రమంలో ఈ చెక్కులు గల్లంతైనట్లు గుర్తించాం. ఉన్నతాధికారులకు లేఖ రాసి, ఆయా రైతులకు తిరిగి చెక్కులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించి చెక్కుల గల్లంతుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – నవీన్, ఏవో, అశ్వారావుపేట మాకు సంబంధమే లేదు పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ బాధ్యత వ్యవసాయ శాఖదే. కనిపించకుండా పో యిన చెక్కులకు, రెవెన్యూ శా ఖకు సంబంధం లేదు. వ్యవసాయ శాఖ నుంచి కూడా ఎ లాంటి నివేదికా రాలేదు. చెక్కులు మాయమైన విషయం శనివారమే నా దృష్టికి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధ్యుడైన వ్యవసాయాధికారికి సూచించాను. –యలవర్తి వెంకటేశ్వరరావు, తహసీల్దార్, అశ్వారావుపేట -
రైతుల అభ్యున్నతికే ‘రైతు బంధు’
మహబూబ్‌నగర్ రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం అర్బన్ మండలంలోని ఏనుగొండ రెవెన్యూ గ్రామంలో రైతుబంధు పథకం చెక్కులను రైతులకు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు అప్పులపాలు కాకుండా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందజేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల శ్రేయస్సుకు ఎకరానికి రూ.4వేలు సాయం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే చేసి రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తుందని అన్నారు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వా త సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ మహాయజ్ఞంలో భాగంగానే రైతులకు ఆర్థిక సాయం అందించే విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రైతుల పేర్లు తప్పొప్పు లు ఉంటే సవరించడానికి వీలుగా ప్రత్యేక అధికా రులను నియమించడం జరిగిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెట్టుబడి సాయం పొందాలని కోరారు. కార్యక్రమంలో త హసీల్దార్ ఎంవీ ప్రభాకర్‌రావు, డీటీ కోట్ల మురళీధర్, ఎంఆర్ఐ క్రాంతికుమార్‌గౌడ్, కౌన్సిలర్లు వ నజ, శివశంకర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాములు తదితరులు పాల్గొన్నారు. -
25 రోజుల్లో 100%
సాక్షి, హైదరాబాద్: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 25 రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఇన్చార్జులుగా నియమిం చాలని నిర్ణయించారు. పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకో ఐఏఎస్ అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమించారు. ఈ నెల 24 నుంచి జూన్ 20 వరకు 25 రోజుల పాటు అధి కార యంత్రాంగమంతా ఇదే కార్యక్రమంలో నిమగ్నం కావాలని చెప్పారు. బుధవారం ప్రగతిభవన్‌లో బుక్కులు, చెక్కుల పంపిణీపై సీఎం కేసీఆర్ ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘ఈ రోజు వరకు జరిగిన భూముల అమ్మకం, కొనుగోలు వివరాలన్నీ నమోదు చేయాలి. అన్ని రకాల మ్యుటేషన్లు చేయాలి. వారసత్వ హక్కులు తేల్చాలి. కొత్తగా నమోదైన వివరాలతో పాస్ బుక్కులు ముద్రించి పంపిణీ చేయాలి. ఇప్పటికే జారీ చేసిన పాస్ పుస్తకాల్లో తప్పులుంటే వెంటనే వాటిని సవరించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. గుంట భూమికి కూడా యజమాని ఎవరో తేల్చాలి. జరిగిన ప్రతీ అమ్మకం, కొనుగోలును నమోదు చేయాలి. వారసత్వ హక్కులను తేల్చాలి. భూ యాజమాన్యానికి సంబంధించిన అన్ని మార్పులను నమోదు చేయాలి. పెండింగ్‌లో పెట్టొద్దు. జూన్ 20 నాటికి వివరాల నమోదు కార్యక్రమం పూర్తి కావాలి. ఆ వివరాలను పొందు పరుస్తూ ‘ధరణి’వెబ్సైట్ రూపొందించాలి. భూమికి సంబంధించి ఇకపై ఒకటే లెక్క ఉండాలి’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. ఆన్లైన్ ఫ్రీజింగ్ ఎత్తివేత భూమి వివరాలను నమోదు చేయడానికి ఆన్లైన్ ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫ్రీజింగ్ ఎత్తివేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడానికి తహసీల్దార్లకు అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వంద రోజుల పాటు భూరికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, కొన్నిచోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలుండటం పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతోపాటు మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని, దీనివల్ల రైతులకు కొంత అసౌకర్యం కలిగిందని, కొందరికి పాస్ పుస్తకాలు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, ఈ పరిస్థితిని సవాల్‌గా తీసుకుని, మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సూచించారు. కొత్త జిల్లాలతో కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమైందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకుని మరింత చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. వచ్చేనెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానంతోపాటు రైతులకు జీవిత భీమా పథకం అమల్లోకి వస్తుందని, ఇవి సవ్యంగా సాగాలంటే భూరికార్డులు సరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రక్షాళన విజయవంతం భూముల సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వాలు ఎన్నడూ శ్రద్ధ పెట్టలేదని సీఎం అన్నారు. ‘‘ప్రభుత్వ శాఖల మధ్య కూడా భూ వివాదాలున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖ మధ్య గొడవలున్నాయి. భూరికార్డులు సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వీటన్నింటికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ సాహసానికి పూనుకోలేదు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమైంది. అధికారులు ఎంతో శ్రమకోర్చి రికార్డుల ప్రక్షాళన చేశారు’’అని చెప్పారు. ప్రతి రైతుకు బీమా పట్టా ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తామని సీఎం చెప్పారు. ‘‘రైతులు భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. చాలామంది చిన్న, సన్నకారు రైతులే. ఒక్క ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. అలాంటి పేద రైతు చనిపోతే వారి కుటుంబం ఉన్నట్టుండి అగాథంలో పడిపోతుంది. కాబట్టి మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఐíసీ ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తాం. రైతులు కోరుకున్న వారినే నామినీగా చేర్చాలి. బీమా పథకం అమలుకు సంబంధించి ఎల్ఐసీ అధికారులతో చర్చలు జరుపుతున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఆయన కుటుంబానికి పరిహారం అందేలా రూపకల్పన చేయాలి’’అని అధికారులకు సూచించారు. కల్యాణలక్ష్మికి కుల ధ్రువీకరణ వద్దు రంజాన్ పండుగ ఏర్పాట్లు, రాష్ట్రావతరణ వేడుకలు, కల్యాణలక్ష్మి, హరితహారం తదితర కార్యక్రమాలపై సీఎం కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. రంజాన్ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ముస్లింలకు దుస్తుల పంపిణీ చేయాలన్నారు. పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నందును కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని పేర్కొన్నారు. జూన్ 1 నుంచే పాఠశాలల ప్రారంభం అవుతున్నందున జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని సూచించారు. సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలివీ.. – అసైన్డ్ భూములు కొన్న వారు పేదలైతే వారి పేరిటే యాజమాన్య హక్కులు కల్పించాలి. వారికి రైతు బంధు పథకం వర్తింపచేయాలి – స్వస్థలానికి రాలేకపోతున్న ఎన్నారైలకు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం అనుసరించాలి – ఆధార్ నంబరు అనుసంధానం చేయడానికి ముందుకు రాని వారి పాస్ పుస్తకాలను పక్కన పెట్టాలి – భూమికి సంబంధించిన అన్ని వివరాలతో ‘ధరణి’వెబ్సైట్ నిర్వహించాలి – భూరికార్డులను నిర్వహించే విషయంలో అవినీతికి పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలి. తప్పులు చేసిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి – పాస్ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమం వంద శాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతో పాటు మంత్రులు స్వీకరించాలి – ప్రతీ మండలంలో వందశాతం బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యతను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించాలి. జిల్లాలో మంత్రి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. చెక్కుల పంపిణీకి స్పెషలాఫీసర్లు వీరే.. పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ఆ వివరాలివీ.. ఆదిలాబాద్– వికాస్‌రాజ్, భద్రాద్రి కొత్తగూడెం–అధర్ సిన్హా, జగిత్యాల–సందీప్‌కుమార్ సుల్తానియా, జనగామ–అజయ్‌మిశ్రా, జయశంకర్ భూపాలపల్లి–అరవింద్‌కుమార్, జోగులాంబ గద్వాల–రజత్‌కుమార్ సైనీ, కామారెడ్డి–టి.కె.శ్రీదేవి, కరీంనగర్–స్మితా సబర్వాల్, ఖమ్మం– నీతూకుమారి ప్రసాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్–టి.చిరంజీవులు, మహబూబాబాద్–క్రిస్టినా చోంగ్తు, మహబూబ్‌నగర్–దానకిశోర్, మంచిర్యాల–నవీన్‌మిట్టల్, మెదక్–రంజీవ్ ఆర్.ఆచార్య, మేడ్చల్ మల్కాజ్గిరి–జయేశ్ రంజన్, నాగర్ కర్నూల్–వి.అనిల్‌కుమార్, నల్లగొండ–సోమేశ్‌కుమార్, నిర్మల్– శశాంక్ గోయల్, నిజామాబాద్–రామకృష్ణారావు, పెద్దపల్లి–ఎన్.శ్రీధర్, సిరిసిల్ల–సునీల్‌శర్మ, రంగారెడ్డి– శైలజ రామయ్యర్, సంగారెడ్డి–మాణిక్ రాజ్, సిద్దిపేట– చిత్రా రామచంద్రన్, సూర్యపేట– వై.శ్రీలక్ష్మీ, వికారాబాద్–ఎన్.శివశంకర్, వనపర్తి–అనితా రాజేంద్ర, వరంగల్ అర్బన్– ఎం.వీరబ్రహ్మయ్య, వరంగల్ రూరల్– ఎం.జగదీశ్వర్, యాదాద్రి భువనగిరి– శాంతికుమారి. -
కాంగ్రెస్ హయాంలో అంతా అవినీతే
హత్నూర(సంగారెడ్డి) : కాంగ్రెస్‌లో హయాంలో అంతా అవినీతేనని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్కామ్‌లు చేసి జైలుకు వెళ్ళారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం హత్నూర మండలం పన్యాల గ్రామంలో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి ఆయన రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశ్యంతో దేశానికే ఆదర్శంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన కేసీఆర్‌కి రావడంతోనే రైతుబంధు, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, కళ్యాణలక్ష్మి, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్బుక్లో ప్రచారం చేస్తామని చెప్పడం కాదు దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న రైతుల సంక్షేమం కోసం పాస్‌పుస్తకాలు ఇచ్చిన ప్రభుత్వం మాది అని తేల్చి చెప్పారు. గత పాలనలో లంచం లేనిదే ప్రజలకు పనులు జరగలేదన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ పాలనలో నిజాయితితో పనిచేస్తున్నారన్నారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు రైతులకు పెట్టుబడి చెక్కులు ఇస్తుంటే విమర్శించటం ఏమిటని ప్రశ్నించారు. రైతు పక్షపాతిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 24గంటలు ఉచితకరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ది అన్నారు. కాంగ్రెస్ పాలనలో నాయకులు హైదరాబాద్‌లోని క్లబుల్లో ఉంటూ రాష్ట్రాన్ని అధోగతి చేశారని ఎద్దేవా చేశారు. ఆరునెలల క్రితం జైలులో ఉండివచ్చిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు సీఎం సీటు కోసం తహతహలాడుతున్నారని వారి కలలు కలలాగే మిగిలిపోతాయన్నారు. బ్రహ్మదేవుడు దిగివచ్చినా టీఆర్ఎస్ను కదిలించలేరని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎత్తిపోతలతో రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంపై చెక్‌డ్యాంలు కట్టి ఎత్తిపోతల ద్వారా గొలుసుకట్టు చెరువులను నింపి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పన్యాల గ్రామానికి రూ. 20 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. రైతుబంధు దేశానికే ఆదర్శం : కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. అనంతరం చెక్కులను వ్యవసాయ సాగు కోసమె వినియోగిస్తామని రైతులచేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతులను రాజును చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ పల్లె జయశ్రీ, మార్కెట్ కమిటీ చైర్మన్ హంసీబాయి, మండల రైతుసమన్వసమితి కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు అక్బర్, ఎల్లదాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శివశంకర్‌రావు, నీరుడి అశోక్, నరేందర్‌తోపాటు రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికా>రులు తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీ చాటుకున్న మహిళ
జనగామ : తాను అమ్ముకున్న భూమికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంలో మంజూరు చేసిన పెట్టుబడి చెక్కును ఓ మహిళ అధికారులు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన సీహెచ్ లీలాకుమారి తనకున్న 7.10 ఎకరాల భూమిని పదేళ్ల క్రితం అమ్ముకున్నారు. అయితే భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని, రెవెన్యూలో కన్వర్షన్ చేసుకోకపోవడంతో నేటికీ పట్టాదారు కాలంలో లీలాకుమారి పేరు ఉంది. అయితే భూ ప్రక్షాళన పూర్తి చేసుకుని, రైతు బంధు చెక్కులను సిద్ధం చేయగా, అందులో పెట్టుబ డి సాయం కింద లీలాకుమారికి రూ.32,700 చెక్కు మంజూరు చేశారు. కాగా, రెవెన్యూ అధికారులు ఆమెకు చెక్కు వచ్చిందని సమాచారం అందించగా, అమ్ముకున్న భూమికి పెట్టుబడి అవసరం లేదని అధికారులకు తేల్చి చెప్పారు. తనలోని నిజాయితీని చాటుకుంటూ.. చెక్కును తహసీల్దార్ రమేష్‌కు అప్పగించారు. ఆమెను అధికారులతో పాటు జిల్లా ప్రజలు అభినందించారు. -
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
-
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే కస్టమర్లను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న బ్యాంకులు ఇపుడు వారినెత్తిన మరో బాంబు వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అతి త్వరలో ఏటీఎం లావాదేవీలు, చెక్కుల జారీ, డెబిట్ కార్డుల లావాదేవీలు తదితర లావాదేవీల పై సర్వీస్ ఛార్జి విధించాలనే సంచలన నిర్ణయం దిశగా కదులుతున్నాయి. ప్రధానంగా ఇకపై ఉచిత సేవలపైన కూడా పన్నులు కట్టాలన్న జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో ఇకపై ఉచిత సేవలకు శుభం కార్డు వేయనున్నాయని తెలుస్తోంది. మే నెలలో దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రానున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా బ్యాంకులు ఉచితంగా అందించిన సేవలకు కూడా.. సర్వీస్ ఛార్జీ వసూలు చేసినట్లు పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఎస్టీ) ఈ నోటీసులు అందించటం విశేషం. బ్యాంకులు ఉచితంగా అందించే సేవలపై.. సర్వీస్ ఛార్జీ విధిస్తున్నట్లుగా భావించి ఈ పన్నులు చెల్లించాలని జీఎస్టీ ఇంటలిజెన్స్ కోరింది. ఈ మేరకు ప్రధాన బ్యాంకులకు నోటీసులు అందాయి. అంతేకాదు ఈ సంవత్సరానికే కాకుండా.. గత ఐదేళ్లుగా ఖాతాదారులకు బ్యాంకులు అందించిన అన్ని ఉచిత సేవలపైనా ట్యాక్స్ కట్టాలని ఈ నోటీసుల్లో తెలిపింది. ఈ పన్నుల భారం మొత్తం విలువ సుమారు రూ.6వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే ఉచిత సేవలకు బదులు బ్యాంకులు ఇక సర్వీస్ చార్జీ బాదుడుకు తెర తీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు, చెక్ బుక్కుల జారీ, లావాదేవీలు, కార్డుల ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై సర్వీస్ ఛార్జీ భారం తప్పదంటున్నారు. ఇప్పటివరకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్ర బ్యాంకులకు నోటీసులు అందాయి. త్వరలోనే ఇతర బ్యాంకులకు నోటీసులు అందే అవకాశం ఉంది. -
పకడ్బందీగా పంపిణీ!
సాక్షి, హైదరాబాద్ : రైతులకు కొత్త పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 58 లక్షల మందికి పంపిణీ చేయనున్నందున ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టదారులైన రైతులతోపాటు అసైన్డ్ భూముల లబ్దిదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు, ఏజన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే గిరిజనేతర రైతులకూ కొత్త పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ చేయాలని సూచించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల అధికార యంత్రాంగమంతా పూర్తి శక్తిసామర్థ్యాలు కేంద్రీకరించి.. మే 10 నుంచి వారం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి.. ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. శనివారం ప్రగతిభవన్‌లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు బంధు పథకం చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. జాగ్రత్తగా వ్యవహరించాలి.. ‘‘దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూ ఎత్తుకోని భారం మనం ఎత్తుకున్నాం. భూరికార్డులను సర్వే చేసి, కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం, రైతులకు పెట్టుబడి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు గతంలో ఎవరూ నిర్వహించలేదు. ఈ కార్యక్రమాలను మనమే రచించుకుని, అమలు చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలి. 58 లక్షల పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంది. నెలాఖరు వరకు పాస్ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బుక్కులు, చెక్కులు వస్తాయి. వాటిని జిల్లాల్లో భద్రపరిచి, గ్రామాలకు చేర్చాలి. వెంటనే నగదు అందేలా ఏర్పాట్లు.. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల నుంచి నగదు పొందేందుకు ఏర్పాట్లు చేశాం. పంట పెట్టుబడి మద్దతు పథకం కోసం రూ.12 వేల కోట్లను బడ్జెట్లో పెట్టుకున్నాం. మొదటి దఫా వర్షాకాలం పంట పెట్టుబడి కోసం రూ.6 వేల కోట్లు సమీకరించాం. ఈ డబ్బులు బ్యాంకుల్లో సిద్ధంగా ఉన్నాయి. రైతులు చెక్కు ఇచ్చిన వెంటనే బ్యాంకులు నగదు చెల్లించాలి. ఇందుకోసం కలెక్టర్లు వెంటనే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి. చెక్కులిచ్చిన రైతులకు వెంటనే నగదు ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు ముందుగానే స్పష్టం చేయాలి. పక్కా ప్రణాళిక ప్రకారం.. జిల్లాలకు వచ్చే పాస్ పుస్తకాలు, చెక్కులను కలెక్టర్లు పరిశీలించాలి. అన్ని గ్రామాల బుక్కు లు, చెక్కులు వచ్చాయో లేదో సరి చూసుకోవాలి. ప్రతి 300 పాస్ పుస్తకాల పంపిణీకి ఒక బృందం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2,762 బృందాలను ఏర్పాటు చేయాలి. ఆయా గ్రామ రైతుల సంఖ్య ఆధారంగా ఎన్ని బృందాలు వేయాలనే విషయాన్ని కలెక్టర్లు నిర్ధారించాలి. ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులుండాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. పంపిణీ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి. ఏ రోజు ఏ గ్రామంలో పంపిణీ ఉంటుందో ముందే నిర్ణయించి.. ప్రజలకు సమాచారం ఇవ్వాలి. పేపర్లలో ప్రకటనల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఈ వివరాలు తెలపాలి. గ్రామంలో పంపిణీ చేపట్టినప్పుడు ఎవరైనా చెక్కులు, పాస్‌బుక్‌లు తీసుకోకుంటే వారు తహసీల్దార్ కార్యాలయంలో పొందేలా ఏర్పాట్లు చేయాలి. ఇబ్బందుల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్.. పంపిణీ సందర్భంగా ఎక్కడైనా, ఏమైనా పొరపాట్లు జరిగినా, ఇబ్బందులు తలెత్తినా... వారి బాధ, సమస్య వినడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో పంపిణీ కార్య క్రమం నిర్వహించాలి. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఇక కొంత మంది రైతులు పెట్టుబడి సాయం వద్దని స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. ఆ సొమ్మును రైతు సమన్వయ సమితి మూలధనంగా మార్చుకోవాలి’’. రైతులందరికీ పెట్టుబడి చెక్కులు పట్టాదారులైన రైతులతోపాటు పేదలకు పంపిణీ చేసిన భూములను సాగుచేసుకుంటున్న రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు, ఏజన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే గిరిజనేతరులకు కూడా పెట్టుబడి సాయం చెక్కులు అందివ్వాలి. ఎవరైనా రైతుకు రూ.50 వేలకన్నా ఎక్కువ సాయం అందించాల్సి వస్తే.. వారికి రెండు చెక్కులు ఇవ్వాలి. రూ.50 వేలలోపు మొత్తానికి ఒక చెక్కు, ఆపైన మొత్తానికి మరో చెక్కు ఇవ్వాలి. పాస్ పుస్తకాలు, చెక్కులు పొందిన వారి నుంచి రసీదు తీసుకోవాలి. నిస్పృహలో ఉన్న రైతులను ఆదుకొనేందుకే.. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రైతులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. గిట్టు బాటు ధర రాక పంటలను రోడ్లపై పారబోసుకుంటున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టి లో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం అందరి ప్రశంసలు పొందుతున్నది. ప్రముఖ ఎకానమిస్ట్ అశోక్ గులాటి తెలంగాణ అనుసరిస్తున్న విధానం అందరికీ ఆదర్శమని ప్రకటించారు. పంట పోయినా.. రైతులు నష్ట పోకుండా ఉంటా రు. కాబట్టే ఖర్చుకు వెనకాడకుండా రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున అందిస్తున్నాం. పంటల సాగులో అవగాహన కల్పించడానికి, శిక్షణ ఇవ్వడానికి, గిట్టుబాటు ధర రావడానికి వీలుగా.. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశాం. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున 2,638 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాం. ఒక్కో క్లస్టర్లో ఒక రైతు వేదిక నిర్మిస్తున్నాం. వీటన్నింటినీ రైతులు సద్వినియోగం చేసుకోవాలి. -
మే 10 నుంచి పెట్టుబడి చెక్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వం రైతు బంధు పథకం రైతులకు పెట్టుబడి చెక్కులను మే 10 నుంచి పంపిణీ చేయనుందని.. తొలిదశ చెక్కుల ముద్రణ పూర్తయిందని స్టేట్ బ్యాంకు తెలంగాణ సీజీఎం జె.స్వామినాథన్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. తొలిదశ చెక్కులను మే మొదటి వారంలో ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. నగదు కొరత వాస్తవమే.. బ్యాంకులలో నగదు లేదన్నది వాస్తవమేనని, పెట్టుబడి చెక్కులతో నగదు విత్‌డ్రా కోసం అవసరమైన రూ.1,600 కోట్లను మే మొదటి వారంలోగా సమకూర్చుకుంటామని స్వామినాథన్ పేర్కొన్నారు. ‘‘ఆర్బీఐ నుంచి తెలంగాణలోని బ్యాంకులకు 6 నెలల కాలానికి రూ.5,400 కోట్ల నగదు వస్తోంది. ఇప్పుడు రైతు బంధు పథకం కింద మూడు దశల్లో కలిపి మే 15లోపు రూ.5,400 కోట్లు రైతులకు ఇవ్వాలి. అంటే వచ్చిన నగదు అంతా ఈ ఒక్క పథకానికే కేటాయించాల్సి ఉంటుంది..’’అని చెప్పారు. 62 శాతం రెండున్నర ఎకరాల్లోపే..: పోచారం తెలంగాణలో 58 లక్షల మంది రైతులున్నారని.. వారిలో 62% రైతులు రెండున్నర ఎకరాల్లోపు భూమి ఉన్నవారేనని ఎస్ఎల్బీసీ భేటీలో మంత్రి పోచారం చెప్పారు. మరో 11–12% మందికి రెండున్నర నుంచి ఐదెకరాల వరకు భూమి ఉందని.. మొత్తంగా 0.28 శాతమే పెద్ద రైతులని పేర్కొన్నారు. పెట్టుబడి చెక్కుల పంపిణీ, ఇబ్బందులు, పరిష్కారాలపై రెండ్రోజుల్లో కలెక్టర్లతో సమావేశమవుతామన్నారు. ప్రతి జిల్లా, గ్రామీణ స్థాయిలోని బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలని.. చెక్కుల విత్‌డ్రాలో రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని బ్యాంకర్లకు సూచించారు. -
మే 10 నుంచి రైతు బంధు!
సాక్షి, హైదరాబాద్ : రైతు బంధు పథకం ద్వారా పంటల పెట్టుబడికి రైతులకు అందించే ఆర్థిక సాయం చెక్కులను వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పాస్ పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా అదే రోజు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రోజుకో గ్రామం చొప్పున వారం రోజులపాటు అన్ని గ్రామాల్లో రైతులకు అందివ్వాలని సూచించారు. ఖరీఫ్ పంట కోసం ఎకరానికి రూ.4 వేల చొప్పున, రబీ పంటకు రెండో విడతగా మరో రూ.4 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చెక్కులిచ్చిన రైతులు డబ్బు తీసుకునేందుకు బ్యాంకుల్లో కావాల్సిన నగదు నిల్వలు ఉంచేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని చెప్పారు. మొత్తం 58 లక్షల చొప్పున పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యాచరణకు ఈనెల 21న ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బి.గణేశ్ గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, పార్థసారథి, రాజేశ్వర్ తివారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, భూ పరిపాలన విభాగం డైరెక్టర్ వాకాటి కరుణ, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లు జరగొద్దు దేశంలో మరెక్కడా లేనివిధంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని అత్యంత చిత్తశుద్ధితో, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమకోర్చి భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టారని, దీని ఆధారంగా పాస్ పుస్తకాలు రూపొందించారని సీఎం చెప్పారు. వీటిని రైతులకు అందించటం ద్వారా భూ రికార్డుల ప్రక్షాళనకు సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. అన్ని భూ వివరాలతో ‘ధరణి’వెబ్సైట్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ‘‘రైతులు పంటల పెట్టుబడికి ఏటా ఎన్నో అగచాట్లు పడతారు. అప్పులకు తిప్పలు పడతారు. పంట చేతికి రాకపోతే పెట్టిన పెట్టుబడి నష్టపోతారు. దీంతో మరింత కుంగిపోతారు. ఈ దుస్థితిని నివారించడానికి, ఆర్థికంగా భారమైనప్పటికీ రైతులకు పంట పెట్టుబడి అందివ్వాలని నిర్ణయించాం. వర్షాకాలం పంట సీజన్ ప్రారంభం కాకముందే ప్రభుత్వం అందించే సాయం వారి చేతిలో ఉండాలి. అప్పుడే రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. కాబట్టి ప్రభుత్వ ఉద్దేశాన్ని, రైతుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’అని సీఎం పిలుపునిచ్చారు. పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన కార్యాచరణను వైద్య, ఆరోగ్య శాఖ రూపొందిస్తున్నదని చెప్పారు. చెక్కుల పంపిణీ, పర్యవేక్షణ ఇలా.. మే 10న ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, భూ పరిపాలన శాఖ డైరెక్టర్ వాకాటి కరుణతో కూడిన బృందం ప్రతీ రోజు నాలుగైదు జిల్లాల్లో పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. పాస్ పుస్తకాలు, చెక్కులను ఆయా గ్రామాలకు చేర్చడంతోపాటు, అధికార బృందాలు ఏర్పాటు చేస్తారు. కలెక్టర్లకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి ఈనెల 21న ప్రగతి భవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఇందులో పాల్గొంటారు. జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆహ్వానించారు. ఏ గ్రామంలో ఏ రోజు పంపిణీ జరుగుతుందో కలెక్టర్లు నిర్ణయిస్తారు. పత్రికా ప్రకటనలు, ఇతర ప్రచార సాధనాలు, డప్పు చాటింపు, ఫ్లెక్సీలు తదితర మార్గాల ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఆయా గ్రామాల పాస్ పుస్తకాల సంఖ్య ఆధారంగా ఏ గ్రామానికి ఎన్ని అధికారుల బృందాలను పంపాలనే దానిపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. 300 పాస్ పుస్తకాలకు ఒకటి చొప్పున బృందాన్ని నియమించి, ఒకే రోజు అందరికీ పంపిణీ చేస్తారు. రైతులకు పాస్ పుస్తకం, చెక్కులు ఇచ్చి వారి సంతకాలు తీసుకుంటారు. ఆ రోజు గ్రామంలో రైతులు లేకుంటే తర్వాత వాటిని మండల కార్యాలయంలో మూడు నెలల వరకు అందుబాటులో ఉంచి, అందజేస్తారు. -
‘పెట్టుబడి’కి పోలీస్స్టేషన్లలో భద్రత
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద రైతులకు పంపిణీ చేసే పెట్టుబడి చెక్కులను పోలీస్స్టేషన్లలో భద్రపరచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. పోలీసుస్టేషన్లతోపాటు ట్రెజరీ కార్యాలయాలు, బ్యాంకుల్లోనూ భద్రపరచాలని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. రెండు, మూడు రోజుల్లో కొన్ని బ్యాంకుల నుంచి చెక్కులు ముద్రితమై బయటకు వస్తాయి. వాటిని హైదరాబాద్‌లో ఆయా బ్యాంకు ప్రధాన కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్ల ద్వారా వ్యవసాయశాఖకు అందజేస్తారు. వాటిని ఆ శాఖ కమిషనర్ జగన్మోహన్ స్వీకరిస్తారు. అక్కడి నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారుల(డీఏవో)కు కమిషనర్ వాటిని అందజేస్తారు. వాటిని డీఏవోలు అత్యంత భద్రత నడుమ జిల్లాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల వారీగా బండిళ్లు ఈ నెల 20 నుంచి రైతుబంధు చెక్కులను పంపిణీ చే సేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చెక్కులను ముద్రించే బాధ్యత ఎనిమిది బ్యాంకులకు ఇచ్చిన సంగతి తెలిసిందే. చెక్కుల బండిళ్లను జిల్లాలు, మండలాలు, రెవెన్యూ గ్రామాలవారీగా సిద్ధం చేస్తారు. వాటిని వ్యవసాయశాఖ పంపిణీ చేస్తుంది. 60 లక్షలకు పైగా చెక్కులు ముద్రించే అవకాశముంది. వాటిని తరలించేందుకు వ్యవసాయశాఖ ట్రంక్ పెట్టెలను కొనుగోలు చేసింది. అయితే, చెక్కులు చోరీకి గురికాకుండా, దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగైదు రోజుల ముందే జిల్లాలకు పంపిణీ చేసే అవకాశమున్నందున వాటిని పోలీసు స్టేషన్లలో ఉంచాలని, అవిలేని చోట్ల ట్రెజరీలు, బ్యాంకుల్లోనూ దాచిపెట్టాలని నిర్ణయించారు. వాటి భద్రత బాధ్యత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కొందరు అధికారుల బృందానికి అప్పగించాలని నిర్ణయించారు. కాలాతీతమైన చెక్కులు ఏంచేయాలి? పెట్టుబడి చెక్కుల గడవు మూడు నెలలు. ఒకవేళ గ్రామసభలో పంపిణీ చేసిన చెక్కుల సొమ్మును మూడు నెలల్లోగా (గడువులోగా) రైతులు బ్యాంకుల నుంచి తీసుకోకపోయినా, రైతులు తీసుకోని చెక్కులు మూడు నెలల తర్వాత కూడా అలాగే ఉండిపోయినా వాటిని ఏం చేయాలన్న దానిపై వ్యవసాయశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే బాధ్యత ఆ శాఖ కమిషనర్‌కు అప్పగించింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. -
జర్నలిస్టు సంక్షేమ నిధి లబ్ధిదారులకు ఫిబ్రవరిలో చెక్కులు
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరిలో చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా గతేడాది 71 మందికి, తర్వాత 30 మందికి ఈ సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. బుధవారం తెలుగు వర్సి టీలో తెలంగాణ మీడియా అకాడమీ పాలక మండలి సమావేశంతో పాటు జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశం నిర్వహించారు. సంక్షేమ నిధి ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను ఈ సందర్భంగా కమిటీ ఆమోదించింది. ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్ష ణా తరగతులు, మోనోగ్రాఫ్స్ తదితర అంశాలపై పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు. -
ఖాతాలో వద్దు.. చెక్ ముద్దు
సాక్షి, హైదరాబాద్ రైతులకు పెట్టుబడి పథకం కింద అందించే సొమ్మును చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీజన్‌కు రూ.4 వేల చొప్పున ఖరీఫ్, రబీలకు కలిపి రూ.8 వేలు ఇవ్వనుంది. దీంతో అక్రమార్కులు చొరబడకుండా ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు పెట్టుబడి సొమ్ము ఎలా అందజేయాలన్న అంశంపై సీఎం కార్యాలయం రెండ్రోజుల కింద వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించింది. ఇందులో రెండు మూడు రకాల సలహాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో 45 లక్షల మంది రైతులకు రూ.4 వేల చొప్పున ఒక్కో సీజన్‌కు రూ.1,800 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క పైసా కూడా పక్కదారి పట్టకూడదన్న ఉద్దేశంతో సీఎం కార్యాలయం కసరత్తు చేసినట్లు సమాచారం. చెక్‌ల వైపే మొగ్గు ఎందుకంటే..? పెట్టుబడి సొమ్మును నేరుగా రైతు ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రైతులు పంట రుణాలు తీసుకుంటారు. అయితే అనేక కారణాలతో వాటిని చెల్లించనివారు అనేక మంది ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతు ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ చేస్తే బ్యాంకులు వాటిని బకాయిల కింద జమ చేసుకుంటాయి. దీనివల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదు సరికదా లక్ష్యం కూడా నెరవేరకుండా పోతుందని, ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా పెరుగుతుందన్న చర్చ జరిగింది. ఇక నేరుగా నగదు ఇచ్చే ప్రతిపాదనపైనా చర్చించారు. కానీ ఇది అక్రమార్కులకు వరంగా మారుతుందని గత అనుభవాల ప్రకారం అంచనా వేశారు. చివరికి రైతుకు చెక్కుల ద్వారానే పెట్టుబడి సొమ్ము పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది కూడా బ్యాంకుతో ముడిపడిన అంశమే అయినా.. రైతు ఖాతాలో వేయకుండా నేరుగా చెక్‌ను క్లియర్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తారని తెలిసింది. కరువు కాటకాల సమయంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సొమ్మును ఇలాగే ఇస్తారు. స్థానిక ఎమ్మార్వో ఖాతా ద్వారా రైతులు తీసుకునే ఏర్పా టు చేస్తారు. అందుకు రైతు పేరిటే చెక్ జారీ చేస్తారు. ఆ చెక్‌లను రైతు తన ఆధార్ కార్డు లేదా పట్టాదారు పాస్‌పుస్తకాన్ని తీసుకెళ్లి బ్యాంకులో చూపిస్తే నేరుగా రూ.4 వేలు ఇస్తారు. ఈ పద్ధతి ద్వారా రూ.20 వేల వరకు విత్‌డ్రా చేసుకునే వీలుందని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చెక్కుల్లోనూ అవకతవకలు జరగకుండా వాటిని గ్రామసభల్లో రైతులకు పంపిణీ చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
వివాహాల్లో కట్నకానుకలు ఇక అవేనట!
హైదరాబాద్ : ఏదైనా శుభకార్యానికి కానీ, పెళ్లి వేడుకలకు కానీ వెళ్లేటప్పుడు కట్నకానుకలుగా ఏం సమర్పించాలా.. తెగ తర్జనభర్జన పడుతుంటారు. ఇప్పుడు ఆ అవసరమే లేదు. పెద్దనోట్ల రద్దుతో పెళ్లి వేడుకలకు ఏదైనా కొని తీసుకెళ్దామన్నా.. కానుకలుగా సమర్పిద్దామన్నా సరిపడ నగదు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆలోచించకుండా పెళ్లి కొడుకు, కూతురికి కట్నకానుకలుగా బ్యాంకు చెక్‌లను, పాతనోట్లనే ఇస్తున్నారట. తర్వాత రోజు కట్నకానుకలు చూసుకుంటున్న పెళ్లికొడుకు కుటుంబసభ్యులకు డజన్ల కొద్దీ చెక్స్, రద్దుచేసిన పాత రూ.500 నోట్లు, రూ.1000నోట్లే గిప్ట్‌లుగా దర్శనమిస్తున్నాయట. వచ్చేవారం జరుగబోయే తన మేనకోడలు వివాహానికి ఏదైనా కొందామని మార్కెట్ వెళ్లిన తనకు ప్రతికూలతే ఏర్పడినట్టు నగరానికి చెందిన పొలిశెట్టి చిత్తరంజన్ అనే వ్యక్తి చెప్పాడు. కొంతమంది ట్రేడర్స్ మాత్రమే చెక్స్‌ను ఆమోదిస్తున్నారని, చాలామంది నగదునే అడుగుతున్నారని తెలిపాడు. కేవలం పెద్ద దుకాణాలు మాత్రమే డెబిట్, క్రెడిట్ కార్డులు ఆమోదిస్తున్నాయని, కానీ పెళ్లిళ్లో కావాల్సిన చిన్నచిన్న వస్తువుల కోసం కచ్చితంగా నగదు అవసరం పడుతుందని పేర్కొన్నాడు. కొన్ని ఫంక్షన్స్‌లో గతిలేక పాతనోట్లనే కానుకులుగా సమర్పించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. పాత నోట్ల రద్దుతో, కొత్తనోట్ల లేకపోవడంతో వినియోగదారులను కోల్పోలేక తప్పనిసరి పరిస్థితుల్లో చెక్స్‌ను అంగీకరించాల్సి వస్తుందని కొంతమంది వ్యాపారస్తులు చెబుతున్నారు. వాటిని మార్చుకుని, నగదును తీసుకోవడానికీ తెగ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. -
కార్మికులకు పునరావాస చెక్కుల పంపిణీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమిళనాడు నుంచి తిరిగివచ్చిన జిల్లాకు చెందిన ఆరుగురు కార్మికులకు కలెక్టర్ లక్ష్మీనరసింహం సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పునరావాస చెక్కులు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఒక్కొక్కరికి రూ.19వేలు చొప్పున బ్యాంకర్ చెక్‌లను మంజూరు చేసింది. అదేవిధంగా ఊపాధి కూలీలుగా జాబ్ కార్డులను జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు మంజూరు చేసినట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ధనుంజయరావు పేర్కొన్నారు. బాండెడ్ కార్మికులైన ఆరుగురు మెళియాపుట్టి మండలానికి చెందిన వారని చెప్పారు. అందులో కొసలి గ్రామం నుంచి ఓలేటి కుమారి, మిన్నారావు, దిమ్మిడిజోల ప్రాంతానికి చెందిన వి.ఆనంద్, బి.ఉమ, బి. వెంకటరమణ, కీసర గ్రామానికి చెందిన వి. తవిటినాయుడు ఉన్నారన్నారు. వీరంతా తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణానగర్ జిల్లాలో దొరికారని, వీరికి దారి ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ. 1000లు మంజూరు చేసి రప్పించినట్లు చెప్పారు. అదేవిధంగా పునరావాసం కింద రూ. 19వేలు వెరసి ఒక్కొక్కరికి రూ. 20వేలు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. -
స్కూలు బస్సు భాదితులకు చెక్కులు అందజేత
-
రూ.50వేల పైబడిన చెక్కులపై నగదు చెల్లింపులకు నో
ముంబై: మనీలాండరింగ్‌కి అడ్డుకట్ట వేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. రూ. 50,000 దాకా విలువ చేసే చెక్కులకు మాత్రమే నగదు రూపంలో చెల్లింపులు జరపాలని, అంతకు మించితే నగదు చెల్లింపులు జరపరాదని గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులను ఆదేశించింది. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి నగదు బదిలీ సర్వీసులను బ్యాంకులు వినియోగించుకోవాలని ఆర్బీఐ నోటిఫికేషన్లో సూచించింది. మరోవైపు, కరస్పాండెంట్ బ్యాంకింగ్ ఒప్పందాల విషయంలో బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.