
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. సోమవారం మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి నష్ట పరిహారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన జరిగిన ఐదురోజుల వ్యవధిలోనే రూ. కోటి పరిహారం బాధితులకు పంపిణీ చేయటం జరిగింది.
చదవండి : ఆ అనుమతులిచ్చింది చంద్రబాబే
Comments
Please login to add a commentAdd a comment