కోల్‌కతా : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడేక్కుతోంది. ఈ పాటికే అభ్యర్థులు ప్రచారాలతో హోరేత్తిస్తూ.. అలవికానీ హామీలతో మభ్యపెడుతూ.. డబ్బులు, మద్యం పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతటితో ఆగక డబ్బులు తీసుకున్నారు.. ఓటేయ్యకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది.
తృణమూల్ పార్టీకి చెందిన ఓ నాయకుడు రైతులకు చెక్కులు పంచుతూ.. తమ పార్టీకి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. కెమరాకు చిక్కాడు. పైగా ఏ మాత్రం భయం లేకుండా ఇందులో తప్పేం ఉంది. మేం డబ్బులిచ్చాం.. బదులుగా ఓట్లు అడుగుతున్నాం అంటూ ఎదురు ప్రశ్నించాడు. మోదాసూర్ అనే వ్యక్తి రూ. 2 - 5 వేలు విలువ చేసే చెక్కులను రైతులకు పంచాడు. అంతేకాక ‘ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. దీదీనే ఈ చెక్కులిచ్చింది. కాబట్టి మీరు మా పార్టీకే ఓటు వేయాలి. ఒకవేళ మీరు గనక మా పార్టీకి ఓటు వేయకపోతే.. మీ మీద చర్యలు తీసుకుంటామ’ని రైతులను హెచ్చరించాడు.
అంతేకాక మీ ఒరిజన్‌ల ఓటర్ ఐడీ కార్డులు మా దగ్గరే ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకొండి అంటూ బెదిరింపులకు దిగాడు. ‘మన అభ్యర్థి మిమి చక్రవర్తి.. మన పార్టీ గుర్తుకే ఓటు వేయాలి. ఈ గురువారం మేళా గ్రౌండ్‌లో మిమి చక్రవర్తి మీటింగ్ ఉంది. దానికి మీరంతా తప్పక హాజరవ్వాలి’ అని తెలిపాడు. చెక్కుల పంపిణీ గురించి ప్రశ్నించగా.. చెక్కులు పంచి ఓట్లు అడుగుతున్నాను ఇందులో తప్పేం ఉంది అని ప్రశ్నించాడు.
Comments
Please login to add a commentAdd a comment