Trinamool leaders
-
‘మా పార్టీకి ఓటేయ్యకపోతే మీ సంగతి చెప్తాం’
కోల్‌కతా : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడేక్కుతోంది. ఈ పాటికే అభ్యర్థులు ప్రచారాలతో హోరేత్తిస్తూ.. అలవికానీ హామీలతో మభ్యపెడుతూ.. డబ్బులు, మద్యం పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతటితో ఆగక డబ్బులు తీసుకున్నారు.. ఓటేయ్యకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి పశ్చిమబెంగాల్లో చోటు చేసుకుంది. తృణమూల్ పార్టీకి చెందిన ఓ నాయకుడు రైతులకు చెక్కులు పంచుతూ.. తమ పార్టీకి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. కెమరాకు చిక్కాడు. పైగా ఏ మాత్రం భయం లేకుండా ఇందులో తప్పేం ఉంది. మేం డబ్బులిచ్చాం.. బదులుగా ఓట్లు అడుగుతున్నాం అంటూ ఎదురు ప్రశ్నించాడు. మోదాసూర్ అనే వ్యక్తి రూ. 2 - 5 వేలు విలువ చేసే చెక్కులను రైతులకు పంచాడు. అంతేకాక ‘ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. దీదీనే ఈ చెక్కులిచ్చింది. కాబట్టి మీరు మా పార్టీకే ఓటు వేయాలి. ఒకవేళ మీరు గనక మా పార్టీకి ఓటు వేయకపోతే.. మీ మీద చర్యలు తీసుకుంటామ’ని రైతులను హెచ్చరించాడు. అంతేకాక మీ ఒరిజన్‌ల ఓటర్ ఐడీ కార్డులు మా దగ్గరే ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకొండి అంటూ బెదిరింపులకు దిగాడు. ‘మన అభ్యర్థి మిమి చక్రవర్తి.. మన పార్టీ గుర్తుకే ఓటు వేయాలి. ఈ గురువారం మేళా గ్రౌండ్లో మిమి చక్రవర్తి మీటింగ్ ఉంది. దానికి మీరంతా తప్పక హాజరవ్వాలి’ అని తెలిపాడు. చెక్కుల పంపిణీ గురించి ప్రశ్నించగా.. చెక్కులు పంచి ఓట్లు అడుగుతున్నాను ఇందులో తప్పేం ఉంది అని ప్రశ్నించాడు. -
తృణమూల్‌కు సినీ గ్లామర్
కోల్‌కతా: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఐదుగురు సినీ ప్రముఖులకు చోటు కల్పించారు. 2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ సినీ ఆర్టిస్టులకు ప్రాధాన్యమిస్తోంది. తాజాగా అదే ఒరవడి కొనసాగిస్తూ మంగళవారం విడుదల చేసిన జాబితాలో నటీమణులు నుస్రాత్ జహాన్(బసీరాత్), మిమి చక్రవర్తి(జాదవ్‌పూర్), శతాబ్ది రాయ్(బిర్భూమ్), మూన్‌మూన్ సేన్(అసాన్సోల్), నటుడు దేవ్(ఘటల్)లకు టికెట్లు ఇచ్చారు. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం మమతా బెనర్జీ 10 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్ ఇవ్వలేదు. 18 మంది కొత్త ముఖాలకు చోటు కల్పించారు. 17 మంది మహిళల(41 శాతం)కు సీట్లు కేటాయించారు. ముగ్గురు తృణమూల్ నాయకులు బీజేపీ గూటికి.. టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ అనుపమ్ హజ్రాతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో హజ్రా బోల్పూర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గతంలో బహిష్కరించారు. -
13 మంది తృణమూల్ నేతలపై సీబీఐ కేసు
నారదా స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో 13 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వారిలో పార్టీ సీనియర్ నాయకులు సౌగత రాయ్, ముకుల్ రాయ్, మదన్ మిత్రా సహా పలువురు ఉన్నారు. నెలరోజుల్లోగా ఈ కేసు విషయం తేల్చాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పలువురు తృణమూల్ మంత్రులు, ఎంపీలు అవినీతి నిరోధక చట్టం కింద నేరం చేశారని, దాంతోపాటు కుట్రలకు కూడా పాల్పడ్డారని ఈ కేసులో పేర్కొన్నారు. నారదా చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ తాలుకు వీడియో ఫుటేజిని కూడా సీబీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కేసులో ఇంకా.. సుల్తాన్ అహ్మద్, ఇక్బాల్ అహ్మద్, కకోలి ఘోష్, ప్రసూన్ బెనర్జీ, సుశేందు అధికారి, సోవన్ చటర్జీ, సుబ్రత ముఖర్జీ, సయ్యద్ హుస్సేన్ మీర్జా, ఫిర్హాద్ హకీమ్ తదితరులున్నారు. చిట్‌ఫండ్ స్కాంతో సంబంధం ఉన్న ఇద్దరు ఎంపీలు సుదీప్ బెనర్జీ, తపస్ పాల్ ఇప్పటికే సీబీఐ అదుపులో ఉన్నారు. తృణమూల్ నాయకులు తమ పదవులను అడ్డుపెట్టుకుని లంచాలు తీసుకున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని సీబీఐ అధికారులు తెలిపారు. త్వరలోనే వారిని ప్రశ్నిస్తామన్నారు. ఈ కేసును పూర్తిగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తారు. స్టింగ్ ఆపరేషన్ సమయంలో వాళ్లు డబ్బులు ఇచ్చిన నారద న్యూస్ ప్రతినిధి మాథ్యూ శామ్యూల్‌ను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది.