బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త కాల్చివేత | BJP Activist Shot Dead In West Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త కాల్చివేత

May 27 2019 10:16 AM | Updated on May 27 2019 10:16 AM

BJP Activist Shot Dead In West Bengal - Sakshi

బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త కాల్చివేత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బట్పారాలో ఆదివారం రాత్రి బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. చందన్‌ సాహు అనే 36 సంవత్సరాల బీజేపీ కార్యకర్త రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు ఆయనను కాల్చి చంపారు. జగ్ధాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కలితల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని చౌసొట్టిపల్లి వాసిగా గుర్తించారు.

చందన్‌ తన ఇంటికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆయనను అడ్డగించి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. చందన్‌ను బట్పారా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అమేథిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనుచరుడు, బీజేపీ కార్యకర్త సురేంద్ర సింగ్‌ను దుండగులు కాల్చిచంపిన కొద్ది గంటల్లోనే బెంగాల్‌లో ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement