
మాజీ సీఎం పర్యటనతో ఆగమేఘాల మీద సిద్ధం చేసిన సర్కారు
అప్పటికప్పుడు 17 బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కుల పంపిణీ
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో దుర్ఘటన జరిగి 17 మంది మృత్యువాత పడితే 24 గంటల వరకు కనీసం ఘటనా స్థలానికే వెళ్లని అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మాజీ సీఎం వైఎస్ జగన్ రాకతో ఆగమేఘాల మీద చెక్కులు సిద్ధం చేశారు.
గడువులోగా పరిహారం అందకుంటే ధర్నా చేస్తామన్న వైఎస్ జగన్ హెచ్చరికలతో అప్పటికప్పుడు 17 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు స్థానిక తహసీల్దారుల చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.