pharma company
-
అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.వివరాల ప్రకారం.. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలో అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఎంబీ-2 బ్లాక్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే, రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఇక, రియాక్టర్ పేలిన ఘటన కారణంగా పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మా శవాలపైనే శంకుస్థాపన చేయాలి
కొడంగల్: తమ భూములు లాక్కుంటే.. తమ శవాలపైనే ఫార్మా కంపెనీలకు శంకుస్థాపన చేయాల్సి ఉంటుందంటూ రోటిబండతండా, లగచర్ల గ్రామ స్తులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రేవంత్‌రెడ్డికి సీఎం పదవి ఎంత ముఖ్యమో, తమకు తమ భూములూ అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. హుస్సేన్ నాయక్ సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడారు.కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు ఇతర అధికారులపై దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా ఫార్మా భూములకు సంబంధం లేని వ్యక్తులు ఒక్కసారిగా అధికారులపై దాడికి పాల్పడ్డారని ఈ సందర్భంగా బాధితులు ఎస్టీ కమిషన్ సభ్యుడికి వివరించారు. ఎవరో చేసిన తప్పిదాలకు తాము బలయ్యామని చెప్పారు. దాడి చేసిన రోజు అర్ధరాత్రి పోలీసులు మద్యం మత్తులో వచి్చ, మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలి: హుస్సేన్ నాయక్ పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డికి హుస్సేన్ నాయక్ సూచించారు. ఫార్మా బాధిత గ్రామాల నుంచి పోలీసులను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. లగచర్లలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామసభ ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. రైతులతో మాట్లాడడానికి కలెక్టర్ లగచర్లకు వెళ్తుంటే పోలీసులు ఎందుకు భద్రత కలి్పంచలేదని నిలదీశారు. భూములు తీసుకోవాలంటే రైతులతో శాంతియుతంగా మాట్లాడాలని సూచించారు. ఆయన వెంట ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. ఇలావుండగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ప్రతినిధులు గోవింద్, సురేందర్ సోమవారం ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.ఫార్మా పేరిట భూ దందా సంగారెడ్డి టౌన్: లగచర్లలో ఫార్మా పేరిట భూదందాకు తెరలేపారని హుస్సేన్ నాయక్ ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్టు అయ్యి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో సోమవారం సాయంత్రం జాతీయ ఎస్టీ కమిషన్ బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ విలేకరులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తాం..1,350 ఎకరాలు కావాలంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులు భూమిని వదులు కోవడానికి సిద్ధంగా లేరని, వారి భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మా జీవనాధారమైన భూముల్ని ఇవ్వలేమని తెగేసి చెబుతున్నవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు. కలెక్టర్‌పై దాడి జరిగిందనే సాకుతో పోలీసులు అర్ధరాత్రి మా ఇళ్లపై దాడులు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మా గొంతులు పిసికి, కళ్లకు బట్టలు కట్టి కొట్టారు. మాతో అనుచితంగా ప్రవర్తించారు. పిల్లలు ఏడుస్తున్నా విన్పించుకోకుండా మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లారు. కొందర్ని జైళ్లలో వేశారు. మరికొందరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. గత మూడ్రోజులుగా అన్నం తినలేదు. నిద్ర కూడా పోవడం లేదు. ఊళ్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చాం..’ అంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. సోమవారం ఆయా కమిషన్లను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు పేరుతో కేవలం గిరిజనుల భూముల లాక్కుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. మూడు పంటలు పండే భూములివ్వలేమని తొమ్మిది నెలలుగా అనేక అర్జీలు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. మంచి చేస్తడని రేవంత్‌కు ఓటేసినం: కిష్టిబాయి‘మాకు మంచి చేస్తడని రేవంత్‌రెడ్డికి ఓటేసినం. కానీ మమ్మల్ని రోడ్డుమీద కూర్చునేలా చేసిండు. మేము చావనికైనా సిద్ధం కానీ గుంటెడు భూమి కూడా ఇవ్వం. మా దగ్గరికొస్తే బాగుండదు. తొమ్మిది నెలల నుంచి దీనిపై కొట్లాడుతున్నాం. ఎన్నోమార్లు కలెక్టర్‌కు లేఖలిచ్చి కాళ్ల మీద పడ్డాం. ఎంతోమందిని వేడుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రైనా, ఆయన అన్న తిరుపతిరెడ్డి అయినా రాలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 500 మంది పోలీసోళ్లను పంపి మా గొంతుక పిసుకుతాడా?, మా ఆడోళ్ల దాడిమీద చేపిస్తవా? ఇదేనా మీ తీరు? మా కొడంగల్ ముఖ్యమంత్రివి అనుకుంటే పూర్తిగా కొడంగల్ పేరునే కరాబ్ చేశావ్. అరెస్టు అయిన మా పిల్లలను బయటకు తేవాలే. మా భూముల జోలికి రావొద్దు..’ అని గిరిజన మహిళ కిష్టిబాయి డిమాండ్ చేసింది.గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమంటున్నారు?: జ్యోతి‘ఆ భూములు మా ముత్తాతల నుంచి మాకు వచ్చాయి. అవన్నీ పట్టా భూములే. వాటిని గుంజుకుందామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మంచిగా పండే పంట పొలాలను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. అక్కడ ఫార్మా కంపెనీ వద్దని చెబుతున్నా వినడం లేదు. చావనైనా చస్తాం కానీ భూములివ్వం. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా రైతులపై ఎందుకు కేసులు పెడుతున్నారు? గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమని అంటున్నారు. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఊళ్లోకి వస్తే ఇద్దరు పోలీసులు కూడా రాలేదు కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి వస్తే రెండు బస్సుల పోలీసులు ఎందుకు వచ్చారు? తిరుపతిరెడ్డి వచ్చి భూములివ్వకుంటే బాగుండదని ఆడవాళ్లని బెదిరిస్తున్నాడు. కలెక్టర్‌పై దాడి జరిగిందని చెబుతూ తాగొచ్చి ఆడపిల్లలు అని కూడా చూడకుండా తప్పుగా ప్రవర్తించారు. మహిళలను కొట్టిన, తప్పుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జైల్లో ఉన్న నా భర్తను విపరీతంగా కొట్టారు. ఆయన్ను కొట్టిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని తొమ్మిది నెలల గర్భిణి జ్యోతి విజ్ఞప్తి చేసింది.మూడ్రోజుల నుంచీ ఏడుస్తూనే ఉన్నాం: దేవీబాయి‘తొమ్మిది నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు పోతున్నాయని మేము బాధపడుతుంటే రాత్రిళ్లు వచ్చి మా ఇంటోళ్లని, పిల్లలను పట్టుకెళ్లారు. వారెక్కడున్నారో కూడా తెలియదు. మూడ్రోజుల నుంచి తిండీతిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాం. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం..’ అని దేవీబాయి ఆశాభావం వ్యక్తం చేసింది.దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా అరెస్టులు చేశారు: సుశీల‘భూములు పోతున్నాయని తిండికూడా పోతలేదు. నిద్రపోవడం లేదు. చిన్నచిన్న భూములున్న మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కలెక్టర్ స్వయంగా దాడి జరగలేదని చెప్పినా రాత్రి 12 గంటలప్పుడు కరెంట్ ఆపేసి ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. జైల్లో ఉన్న మా వాళ్లను కలవకుండా చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇవ్వం..’ అని సుశీల తెగేసి చెప్పింది. -
న్యాయం కోసం ఢిల్లీ బాట పట్టిన లగచర్ల ఫార్మా బాధితులు
-
ఫార్మాపై రైతుల ఫైర్.. అధికారులపై దాడి
కొడంగల్/ దుద్యాల్: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు కన్నెర్ర జేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో 250 మందికిపైగా అదనపు బలగాలను మోహరించారు. అసలేం జరిగింది? ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియలో భాగంగా సోమవారం గ్రామసభ నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. భూములు తీసుకునే లగచర్లలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో దుద్యాల– హకీంపేట మార్గంలో సభ ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకించిన నిర్వాసిత రైతులు.. తమ గ్రామంలోనే సభ నిర్వహించాలని అధికారులను కోరారు. రైతుల పక్షాన ఓ వ్యక్తి గ్రామసభ వేదిక వద్దకు వచ్చి కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ఈ విషయాన్ని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గ్రామంలోనే సభ నిర్వహిద్దామంటూ లగచర్లకు బయలుదేరారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి కలెక్టర్ వాహనాన్ని అనుసరించారు. అధికారులు లగచర్లకు చేరుకోగానే గ్రామస్తులు భూసేకరణకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను సముదాయించడానికి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రయత్నించారు. కానీ కొందరు గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. పోలీసుల వైఫల్యం! గ్రామసభ కోసమని ఏర్పాటు చేసిన వేదిక వద్ద సుమారు 200 మంది వరకు పోలీసులు విధుల్లో ఉన్నారు. కలెక్టర్, ఇతర అధికారులు లగచర్ల గ్రామానికి వెళ్తున్నప్పుడు వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మినహా పోలీసులెవరూ వెంట వెళ్లలేదు. ఆగ్రహంతో దాడికి దిగిన గ్రామస్తులు, నిర్వాసిత రైతులను అదుపు చేయడం వీలుకాలేదు. నిఘా వ్యవస్థ, పోలీసుల వైఫల్యం కారణంగానే.. ఈ ఘటన జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న రైతులు దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, పులిచెర్లతండా, రోటిబండ తండాల్లో మొత్తం 1,358 ఎకరాల భూసేకరణ కోసం ఐదు నెలల క్రితం చర్యలు ప్రారంభించింది. ఇందులో 547 ఎకరాలు అసైన్డ్ భూమి, 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా.. 721 ఎకరాల పట్టా భూమి ఉంది. సుమారు 800 రైతులు భూములు కోల్పోనున్నారు. వారంతా పేద రైతులే. చాలా వరకు గిరిజనులే. ఈ భూముల్లో వ్యవసాయం తప్ప వేరే జీవనోపాధి లేదని వారు మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారని అధికారులు చెప్తున్నా... చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంట పొలాల్లో విషం చిమ్మే ఫార్మా కంపెనీలను అనుమతించేది లేదంటూ ఆందోళన చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భూసేకరణపై ముందుకు వెళ్తుండటం, ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో.. జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. రైతుల ఆగ్రహాన్ని గమనిస్తూనే భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకరం సగటు ధర రూ.30 లక్షలకుపైగా ఉందని రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం రూ.10 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, కోల్పోయే ఒక్కో ఎకరానికి 125 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నా.. భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అధికారులపై దాడి వరకు వెళ్లింది. అనుకోకుండా జరిగింది.. అందరూ మనవాళ్లే.. లగచర్ల ఘటనను కలెక్టర్ ప్రతీక్ జైన్ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఘటనా స్థలం నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వారందరూ మన ప్రజలే, మన రైతులే.. మాట్లాడుదామని మమ్మల్ని పిలిస్తేనే వెళ్లాం.. కొందరు వ్యక్తులు అనుకోకుండా తోసుకుని ముందుకు వచ్చి అలా చేశారు. దయచేసి ఈ ఘటనకు దాడి అనే పదం వాడకండి..’’ అని కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రతోనే దాడి: తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే అధికారులపై దాడి చేయడం హేయమైన చర్య అని.. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. ఫార్మా కోసం భూసేకరణపై అభిప్రాయ సేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కొందరు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు ఫార్మా కంపెనీలు తీసుకువస్తున్నారన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే అక్కసుతోనే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. -
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
సాక్షి,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. మెట్రో కమ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు. -
మానవ తప్పిదాల వల్లే ‘ఫార్మా’ల్లో ప్రమాదాలు
సాక్షి, విశాఖపట్నం: చిన్నచిన్న మానవ తప్పిదాలవల్లే ఫార్మా కంపెనీల్లో పెద్దపెద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయని హైలెవల్ కమిటీ చైర్పర్సన్ వసుధా మిశ్రా స్పష్టంచేశారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై, అనుసరించాల్సిన విధానాలపై, ప్రమాదాల అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై శుక్రవారం విశాఖలోని ఓ హోటల్లో జరిగిన ఉన్నతస్థాయి కమిటీ తొలిభేటీలో మేథోమథన చర్చ జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామికవాడలో ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఏర్పడిన కమిటీ తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్పర్సన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వానికి అందించాల్సిన నివేదికలో పొందుపరచాల్సిన అంశాలపై, భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు. కార్మిక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎంఎన్ హరేంధిర ప్రసాద్, విజయ్‌కృష్ణన్.. చెన్నై, తిరుపతి ఐఐటీల ప్రొఫెస ర్లు, ఇతర సభ్యులు సూచనలు ఇచ్చారు. అనంతరం మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ‘ఎసైన్షియా’ వంటి ప్రమాదాలు జరగకుండా సాంకేతిక సహాయంతో ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలను అవలంభించాల్సి ఉందన్నారు. ప్రమాదాలు జరగకుండా స్టాండర్డ్ ప్రోటోకాల్స్..ఇక ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పెట్టాలని సూచించినట్లు వసుధా మిశ్రా తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. ఇటీవల జరిగిన ఎసైన్షియా ప్రమాదంలో పూర్తిగా మానవ తప్పిదం ఉందన్నది తమ పరిశీలనలో స్పష్టమైందన్నారు. -
ఆ ఆత్రమే అగ్గిరాజేసింది
విశాఖ సిటీ: ఎసైన్షియా అడ్వాన్స్›డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో అనేక విస్మయకర విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది. కొత్త డ్రగ్ ఉత్పత్తిని వేగంగా ప్రారంభించాలన్న ఆత్రంలో ట్రయల్ రన్ నిర్వహించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వంటివే ఈ భారీ ప్రమాదానికి కారణమన్న విషయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.ప్రమాద కారణాలతో పాటు కంపెనీలో 6 లోటు పాట్లను హైలెవల్ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అత్యవసర ద్వారాలు, భవనానికి బాహ్య కారిడార్లు లేకపోవడం, ప్రీ స్టార్టప్ తనిఖీలు చేయకపోవడం, విద్యుత్ వైరింగ్ బహిరంగంగా ఉండడం, రసాయనం లీక్ అయిన వెంటనే దాన్ని నిలువరించకపోవడం వంటి కారణాలను నివేదికలో పొందుపరిచింది. ముందస్తు తనిఖీలు నిల్ ఎసైన్షియాలో కొత్త డ్రగ్ ఉతి్పత్తిని ఇటీవలే ప్రారంభించింది. వాస్తవానికి ఏ డ్రగ్ ఉత్పత్తి చేయాలన్నా ముందు తప్పనిసరిగా ట్రయల్ రన్ నిర్వహించాలి. ఈ ప్రక్రియలో అన్నీ సజావుగా ఉన్నట్లు నిర్థారించుకున్నాకే ఉత్పత్తిని ప్రారంభించాలి. సదరు కంపెనీ యాజమాన్యం మాత్రం ముందస్తు తనిఖీలు లేకుండానే, వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ఉపక్రమించింది. ఫలితంగానే ఈ ప్రక్రియలో నెలకొన్న అనేక లోటుపాట్లను గుర్తించలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నత స్థాయి కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. గతంలోనూ ఇదే వైఖరి ఈ కంపెనీ గతంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించినట్లు కమిటీ పరిశీలనలో గుర్తించింది. ప్రీ స్టార్టప్ తనిఖీలు లేకుండానే భారీ స్థాయిలో డ్రగ్ ఉత్పత్తిని చేపడుతున్నట్లు వెల్లడైంది. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో కంపెనీలో వరుసగా అదే తరహాలో ఔషధాల ఉత్పత్తి ప్రక్రియను నిర్వహిస్తోంది.తాజాగా అదే విధానాన్ని కొనసాగించగా.. మిౖథెల్ టెర్ట్ బ్యూటిల్ ఎథర్(ఎంటీబీఈ) రసాయనం లీకై గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎంసీసీ ప్యానల్ మీద పడడంతో భారీ ప్రమాదం సంభవించింది. 17 మంది మృత్యువాత పడ్డారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్న ఉన్నత స్థాయి కమిటీ ఇదే అంశాలపై నివేదిక తయారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. -
మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించని ప్రభుత్వం
-
బతికున్నోళ్లనే చంపేశారు.. ఈ ప్రభుత్వానికి ఓ దండం..
-
సినర్జిన్ ప్రమాదంలో మూడు చేరిన మరణాల సంఖ్య..
సాక్షి, అనకాపల్లి: పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సినర్జిన్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, సూర్యనారాయణ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.కాగా, ఈనెల 22వ తేదీన సినర్జిన్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా ప్రస్తుతం మృతుల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో జార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్ పూరి చికిత్స పొందుతూ ఈ నెల 23న, రొయా అంగిరియా 24న మృతి చెందారు. అదే రాష్ట్రానికి చెందిన ఓయబోం కొర్హకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా సూర్యనారాయణ మరణించారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించకపోవడంతో ప్రభుత్వ తీరును ఎండగడుతూ సాక్షి.. బాధితులకు అండగా నిలిచింది. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన యాజమాన్యం సోమవారం సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు రూ.కోటి చెక్కును అందించింది. -
అచ్యుతాపురం ఘటన రోజే మరో ఘటన.. ముగ్గురు మృతి, స్పందించని ప్రభుత్వం
-
5 సెకన్లలో 2 పేలుళ్లు
సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం సంభవించిందని, ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ వెల్లడించింది. తొలి పేలుడు జరిగిన 5 సెకన్లలోనే మరో పేలుడు సంభవించిందని తెలిపింది. భారీ పేలుళ్ల ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, మొదటి అంతస్తు శ్లాబు కొంత భాగం కూలడం, ఈ సంస్థ భవనాలకు అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేకపోవడంతో కార్మికులు తప్పించుకోలేక ప్రాణ నష్టం అధికంగా ఉందని వెల్లడించింది.ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఈ నెల 21న జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ, బాయిలింగ్, ఫైర్ సేఫ్టీ, ఏపీపీసీబీ అధికారులు, నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగింది, కారణాలేమిటో క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రాథమిక నివేదిక రూపొందించింది. వారం రోజుల్లో మరో నివేదిక ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.నివేదికలోని ప్రధానాంశాలు..⇒ కొత్త డ్రగ్స్ తయారీకి ప్రయోగాలు ఇక్కడే జరుగుతుంటాయి. బ్యాచ్‌ల వారీగా పరిశోధనలు చేస్తుంటారు. మూడు నెలల విరామం తర్వాత ఫస్ట్ బ్యాచ్ పరిశోధన ప్రారంభించింది. ⇒ఆ రోజు రియాక్టర్లో 500 లీటర్ల మిౖథెల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ (ఎంటీబీఈ) ద్రావకం తయారీకి వ్యాక్యూమ్ డిస్టిలేషన్ ప్రారంభించారు. ⇒ ఇక్కడ తయారయ్యే వ్యాక్యూమ్ డిస్టిలేషన్ని నైట్రోజన్ ప్రెజర్ ద్వారా రెండో ఫ్లోర్లో ఉన్న 5 వేల లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌కు పంపింగ్ చేస్తున్నారు. ⇒మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రెండో అంతస్తులో ఎంటీబీఈ లీకై ఘాటైన వాసన వస్తుండటాన్ని ప్రొడక్షన్ టీమ్ గుర్తించింది. ఇది క్రమంగా మొదటి అంతస్తుకూ వ్యాపించింది. ⇒ మొదటి అంతస్తులోని కార్మికులు ఆ వాసనను గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి రెండో అంతస్తుకు వెళ్తున్న ఎంటీబీఈ పైప్‌లైన్‌ను పరిశీలించారు. ట్రాన్స్ఫర్ లైన్లో ఎంటీబీఈ వ్యాక్యూమ్ లీకవుతున్నట్లు గుర్తించారు. ⇒ఈ కెమికల్ పైపుల నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విద్యుత్ కేబుల్స్ వెళ్తున్న కటౌట్స్ పైన పడి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎంసీసీ) ప్యానెల్‌పై పడుతున్నట్లు గుర్తించారు. ⇒ వెంటనే ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్షన్ సిబ్బందికి కార్మికులు సమాచారమిచ్చారు. లంచ్ టైమ్ కావడంతో ఆ సమయంలో ఆ సిబ్బంది అందరూ భోజనం చేస్తున్నారు. దీంతో లీకేజీని అరికట్టేందుకు ఎవ్వరూ రాలేదు. ⇒ బిల్డింగ్‌లో ప్రతి ఫ్లోర్‌ను అనుసంధానం చేసేలా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ (ఏహెచ్‌యూ) ఉన్నాయి. ఏహెచ్‌యూ ప్రధాన యూనిట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఏవైనా వాయువులు లీకైతే ఏహెచ్‌యూ ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. కానీ.. ఆ రోజు లీకైన ఎంటీబీఈ రసాయనం ఆవిరి ఏహెచ్‌యూ ద్వారా ప్రాసెస్ డెవలప్మెంట్ (పీడీ) ల్యాబ్, కార్యాలయం గదులు, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎస్యూరెన్స్ గదులు, యుటిలిటీ అండ్ మెటీరియల్ నిల్వ ప్రాంతాలకు వ్యాపించింది.⇒ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భోజనం అనంతరం వచి్చన బృందాలు లీకేజీని అరికట్టే ప్రక్రియ ప్రారంభించాయి. ⇒ కానీ.. అప్పటికే ఏహెచ్యూల ద్వారా కమ్ముకున్న ఆవిరి లోవర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్ (ఎల్‌ఈఎల్) స్థాయికి చేరుకుంది. దీంతో హఠాత్తుగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎంసీసీ ప్యానెల్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి గ్రౌండ్ ఫ్లోర్ ప్లెయిన్ సిమెంట్, కాంక్రీట్ (పీసీసీ) గోడలు కూలిపోయాయి. మొదటి అంతస్తు శ్లాబులో కొంత భాగం కుప్పకూలింది. ⇒ వెంటనే కార్మికులు, సిబ్బంది బయటకు వెళ్లిపోయేందుకు ప్రయతి్నంచారు. ⇒ 5 సెకెన్లలోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏహెచ్‌యూ మెయిన్ ప్యానల్లో రెండో పేలుడు సంభవించింది. దీంతో.. ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఉన్న మొదటి, రెండో అంతస్తుల్లోని అన్ని రూములూ తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ⇒ ఈ పేలుడు తీవ్రత పీడీ ల్యాబ్, యుటిలిటీ, ప్రొడక్షన్ ఏరియాలోనూ తీవ్ర ప్రభావం చూపింది. ⇒ వెంటవెంటనే పేలుళ్లు సంభవించడంతో అత్యవసర మార్గాలు లేక కార్మికులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. ⇒ ఎంటీబీఈ 28 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద లోవర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్ (ఎల్‌ఈఎల్) 1.6 శాతం, అప్పర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్ (యూఈఎల్) 15.1 శాతం ఉంది. ఈ ఎంటీబీఈ ఆవిరి అన్ని ప్రాంతాలకూ తీవ్రస్థాయిలో విస్తరించడమే ప్రమాదానికి ప్రధాన కారణం.⇒ దాదాపు బిల్డింగ్‌లోని అన్ని ప్రాసెసింగ్ ప్రాంతాలకూ ఏహెచ్యూల ద్వారా ఎంటీబీటీఈ వ్యాక్యూమ్ చేరుకుంది. దీనివల్ల పేలుడు తీవ్రత ఎక్కువైంది. ⇒ బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు కూడా ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణం. పీడీ ల్యాబ్, ఆఫీస్ బిల్డింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ పక్కపక్కనే ఉండకూడదు. కానీ.. అన్నీ ఒకేచోట ఏర్పాటు చేశారు. ⇒ అంతేకాకుండా ఈ భవనాలన్నింటినీ ఏహెచ్యూతో అనుసంధానం చేశారు. ప్రాసెసింగ్ ప్రక్రియ చేయని రూమ్లకూ వీటిని అనుసంధానం చేయడం కూడా ప్రధాన లోపమే. ⇒ ముఖ్యంగా.. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు ఒక్కటే మెట్ల మార్గం ఉంది. ఎలాంటి అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేవు. ఉన్న ఒక్క మార్గం మొదటి పేలుడు ధాటికే కూలిపోయింది. ⇒ భవనం చుట్టూ ఎక్స్టర్నల్ కారిడార్లు లేవు. అనుసంధానించే మెట్లు కూడా లేవు. దీనివల్ల కొందరు దూకేందుకు ప్రయతి్నంచినా.. భవన శిథిలాల కింద పడి నలిగిపోయారు. ⇒ ప్రతి ఫార్మా కంపెనీలోనూ ఉత్పత్తి ప్రారంభించే ముందు ప్రతి విభాగాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తారు. దీన్నే ప్రీ స్టార్టప్ చెక్స్ (పీఎస్ఎస్ఆర్) అంటారు. ఈ పరిశ్రమలో అది కూడా చెయ్యడం లేదు. ⇒ రసాయన మిశ్రమాలు, రసాయనిక ఆవిరి వెళ్లే లైన్లు సరిగ్గా విద్యుత్ కేబుల్స్ పైనే వేశారు. దీనివల్ల ఏ చిన్న సాల్వెంట్ లీకేజీ జరిగినా నేరుగా విద్యుత్ కేబుల్ కటౌట్స్పై పడటంతో పాటు ఎంసీసీ ప్యానెల్స్ దెబ్బతినేలా వ్యవస్థ ఉంది. ⇒ ఎంటీబీఈ లీకేజీని గమనించిన తర్వాత తక్షణమే స్పందించేందుకు ఎవ్వరూ లేకపోవడం వల్ల.. ఈ సాల్వెంట్ ఆవిరి వాసన పీల్చి ఉద్యోగులు, కార్మికులు ఇబ్బంది పడ్డారు. అయినా.. ఈ ప్రమాదం జరుగుతుందని ఎవ్వరూ ఊహించకపోవడంతో బయటకు వెళ్లకుండా పనిలోనే నిమగ్నమయ్యారు. ఫలితంగా ప్రాణనష్టం ఎక్కువగా సంభవించిందని ఉన్నతస్థాయి విచారణ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. -
తలోమాట.. అచ్యుతాపురంపై కూటమి నేతల తికమక
-
జగన్ వచ్చారు.. చెక్కులు అందాయి
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో దుర్ఘటన జరిగి 17 మంది మృత్యువాత పడితే 24 గంటల వరకు కనీసం ఘటనా స్థలానికే వెళ్లని అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మాజీ సీఎం వైఎస్ జగన్ రాకతో ఆగమేఘాల మీద చెక్కులు సిద్ధం చేశారు. గడువులోగా పరిహారం అందకుంటే ధర్నా చేస్తామన్న వైఎస్ జగన్ హెచ్చరికలతో అప్పటికప్పుడు 17 మంది మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు స్థానిక తహసీల్దారుల చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. -
మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
సాక్షి, అనకాపల్లి/పరవాడ: ‘అచ్యుతాపురం–పరవాడ’ సెజ్‌లో వరుస ప్రమాదాలు కార్మికులు, వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జరిగిన ఏడు ప్రమాదాల్లో 22 మంది మృతిచెందారు. రెండు రోజుల కిందట అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో 17 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే... పరవాడ సెజ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ సమీపంలోని జేఎన్ ఫార్మాసిటీలో సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్లో గురువారం అర్ధరాత్రి రియాక్టరు నుంచి రసాయనాలు వెలువడి పొగతో కూడిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు, విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన విశాఖపట్నంలోని ఇండస్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం జరిగింది ఇలా... సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్లో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టు కార్మికులు రొయా ఆర్జీ, లాల్‌సింగ్, ఆయూ ఖాన్, విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ కలిసి 6 కేఎల్ సామర్థ్యం ఉన్న రియాక్టర్‌ను చార్జ్ చేస్తున్నారు. రసాయనాలు కలిపేటప్పుడు రియాక్షన్ ఏర్పడి పొగతోపాటు మంటలు వ్యాప్తిచెందాయి. కొద్ది క్షణాల్లోనే మ్యాన్‌హోల్ నుంచి కూడా రసాయనాల రియాక్షన్ సంభవించి మంటలు మరింత వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హెల్పర్లు ఓఏ కోరా(24), లాల్‌సింగ్ పుర్తీ(22), రోయాన్ అంజీరియా(22), విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ కెమిస్ట్ సూర్యనారాయణ(34)కు తీవ్ర గాయాలయ్యాయి. ఫార్మా కంపెనీ యాజమాన్యం వెంటనే ప్రొడక్షన్ నిలిపివేసింది. తక్షణమే క్షతగాత్రులను ఇండస్ ఆస్పత్రికి ఎయిర్ బస్సులో తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓఏ కోరాకు 75 శాతం, లాల్‌సింగ్ పుర్తీ, రోయాన్ అంజీరియా(22)లకు 60 శాతానికి పైగా శరీరాలు కాలిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యనారాయణ(34)కు కాలిన గాయాలు తక్కువగా ఉన్నప్పటికీ రసాయనాలు పీల్చడంతో పొట్ట ఉబ్బిపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కూటమి నేతలు, అధికారులు సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్లో ప్రమాదం గురించి తెలుసుకున్న కూటమి నేతలు శుక్రవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎంపీ సీఎం రమే‹Ù, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ దీపిక పాటిల్, ఆర్డీవో మురళీకృష్ణ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. ఇండస్ ఆస్పత్రిలో క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని పరిశ్రమ యాజమాన్యాన్ని ఆదేశించారు. రెండు ఘటనలపై కేసులు నమోదు అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మాలో ప్రమాదానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సినర్జిన్ ఫార్మాలో ప్రమాదానికి కూడా కంపెనీ నిర్లక్ష్యమే కారణమని సెక్షన్ 125, 289 బీఎన్ఎస్ కింద పరవాడ సీఐ ఎస్.బాలసూర్యరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పరిహారంపై క్లారిటీ లేదు.. ఇది చంద్రబాబు ప్రభుత్వం తీరు
-
Big Question: జనం ప్రాణాలు పోయినా అక్కరలేదు.. మా టార్గెట్ జగన్..
-
నాడు తక్షణమే అందిన సాయం.. భరోసా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకేజీ ఘటనలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించిన తీరుకు.. నేడు ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన దుర్ఘటన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుకూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నాడు ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువులు (స్టైరిన్ గ్యాస్) లీకైన సంఘటన 2020 మే 7వ తేదీ వేకువజామున 3.40 గంటలకు జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామున 5 గంటలకు కలెక్టరు, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. » 6 గంటలకు అప్పటి ప్రజాప్రతినిధులు ముత్తంశెట్టి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్ తదితర నేతలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. » వేకువజాము నుంచే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి 11 గంటలకే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. » ఆ రోజుల్లో కోవిడ్ కేసులు భారీగా ఉండి.. బహిరంగంగా తిరిగేందుకు ఆందోళన చెందుతున్న పరిస్థితులున్నాయి. అయినా, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి నష్టపరిహారంగా రూ.కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. » ఆ తర్వాత బాధితులను గుర్తించి ప్రకటించిన నష్టపరిహారం అందించారు. అంతేకాక.. మూడ్రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు, చికిత్స పొంది వెంటనే డిశ్చార్జి అయిన వారికి రూ.లక్ష ప్రకటించారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే రూ.30 కోట్ల నిధులను విడుదల చేశారు. » విషవాయువులు వ్యాపించిన నేపథ్యంలో ప్రతీ కుటుంబ సభ్యుడికి రూ.10 వేల చొప్పున ఐదు గ్రామాల ప్రజలకు అందజేశారు. » నెలరోజులుభోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు 29 పునరావాస కేంద్రాల్లో 20 వేల మందికి వసతి కల్పించారు. » విష వాయువుల ప్రభావంలేదని ప్రకటించినప్పటికీ ఇంకా ప్రజల్లో భయాలు నెలకొనడంతో వారిలో భరోసా నింపేందుకు వీలుగా ప్రజాప్రతినిధులైన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి తదితరులు రాత్రి సమయాల్లో నిద్రించి ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. » ఏకంగా డీజీపీ స్థాయి అధికారి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడునెలల పాటు హెల్త్ క్యాంపులూ నిర్వహించారు. -
బాధితుల ఆక్రోశం.. ఫొటోలు దిగేందుకు వచ్చారా?
‘ఫొటోలు తీయించుకునేందుకు వచ్చేస్తున్నారు..! డబ్బులు మాకేం వద్దు..! మావాళ్లను బతికించి తీసుకురావయ్యా..! కనీసం మంచినీళ్లు.. వాటర్ ప్యాకెట్లైనా మీ ప్రభుత్వం ఇచ్చిందా? ఒక్కొక్కడూ వచ్చి ఫొటోలు నొక్కించేసుకుంటున్నారంతే! ఆ డాక్టర్ వచ్చారు..! చూసుకోవయ్యా మీ బాడీని అన్నారు. చూసుకున్నాం.. ఎవరూ కనీసం పట్టించుకోలేదు. ఆ కంపెనీవోడ్ని మా ముందుకు తెస్తే సచ్చిపోయినోడు బతికినట్టే..!’ – విశాఖ కేజీహెచ్‌లో సీఎం చంద్రబాబుని నిలదీసిన ఎస్.రాయవరం మండలానికి చెందిన మృతుడి మేనమామ తంబయ్యసాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ అలసత్వంపై బాధిత కుటుంబాలు నేరుగా నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన అనంతరం కేజీహెచ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఒకచోట నిలబెట్టి వారితో సీఎం మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. తమ బాధలు చెబుతున్న కుటుంబ సభ్యుల్ని సీఎం ఓదార్చి అంతా నేను చూసుకుంటానంటూ వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే బాధితులు చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ప్రమాదం జరిగి 20 గంటలు గడుస్తున్నా.. బాధిత కుటుంబాల్ని కనీసం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక చంద్రబాబు తిరిగి వారి దగ్గరికి వచ్చి మాట్లాడారు.మావాళ్లు చేసింది తప్పే...మాకు కనీసం సమాచారం ఎవరూ ఇవ్వలేదు.. ఎవర్ని అడగాలో తెలియక రాత్రి నుంచి అటు ఇటు తిరుగుతున్నాం. ఒక్కరూ పట్టించుకోలేదు. టీవీల్లోనూ, యూట్యూబ్‌లోనూ చూసి ప్రమాదం జరిగిందని తెలుసుకొని పరుగున వచ్చాం. అయితే అధికారులెవరూ మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ బాధిత కుటుంబాలు సీఎం వద్ద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. మా ప్రభుత్వాధికారులు సమాచారం ఇవ్వకపోవడం.. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తప్పేనంటూ ఒప్పుకున్నారు.బొత్స ప్రశ్నించడంతో..వాస్తవానికి చంద్రబాబు టూర్ షెడ్యూల్లో కేజీహెచ్ లేదు. మృతదేహాల్ని బుధవారం రాత్రి కేజీహెచ్‌కు తరలించినా కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గానీ స్థానిక ఎంపీ గానీ పరామర్శించలేదు. గురువారం ఉదయం మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కేజీహెచ్‌కు చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న వారిని పరామర్శించేందుకు సీఎం ఎందుకు రావడం లేదని నిలదీశారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాకపోవడం గర్హనీయమన్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పు చేసుకుని కేజీహెచ్‌కు వచ్చారు. -
ఏ గుండె తట్టినా ఆవేదనా స్వరాలే..
సాక్షి, విశాఖపట్నం/మహరాణిపేట: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా పరిశ్రమలో విస్ఫోటం 17 మంది ఊపిరితీసింది. యాజమాన్య నిర్లక్ష్యం మృత్యు రూపంలో చేసిన విలయతాండవం ఆ కుటుంబాల ఉసురుతీసింది. ఉత్సాహంగా ఉద్యోగానికి వెళ్లిన తమవారిని.. ఆఖరిచూపు చూసుకునేందుకు కేజీహెచ్‌కు వచ్చిన కుటుంబ సభ్యుల రోదనలతో.. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపించాయి. కన్నీటి చారికలతో కేజీహెచ్‌లో విషాద వాతావరణం అలముకుంది.ప్రేమ పెళ్లి చేసుకుని నిండుచూలాల్ని వదిలేసి వెళ్లిపోయిన భర్త కోసం ఆ గర్భిణీ పడుతున్న వేదన కంట తడిపెట్టించింది.. మూడ్రోజుల క్రితం రాఖీ కట్టించుకున్న అన్నయ్య భరోసా ఇకపై ఉండదా అంటూ సోదరి రోదన సాగర ఘోషని మించిపోయింది.. ఉద్యోగమొచ్చింది, కష్టాలు తీరిపోయినట్లే అమ్మా అని భరోసా ఇచ్చిన కొడుకు.. కళ్ల ముందు ఇకపై ఉండవా నాన్నా.. అంటూ తల్లడిల్లుతున్న తల్లిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు.ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మందిని పొట్టన పెట్టుకున్న మృత్యు పరిశ్రమ ఆ కుటుంబ సభ్యులకు అంతులేని వేదనని మిగిల్చింది. చివరికి.. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఆ కుటుంబాలు.. తమ వారి శవ పంచనామా కోసం, ప్రభుత్వం అందించే భరోసా కోసం కూడా ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితులు విశాఖ కేజీహెచ్‌లో సాక్షాత్కరించాయి. భారమైన గుండెలతో.. తమ వాళ్ల నెత్తుటి ముద్దల కోసం ఎదురుచూస్తున్న ఏ కుటుంబాన్ని చూసినా.. విషణ్ణ వదనాలే కనిపించాయి. ఏ గుండెను కదిలించినా ఆవేదనా స్వరాలే వినిపించాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం.రెండు కళ్లల్లో ఒక కన్ను పోయింది.. అన్నదమ్ములిద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకరు పని ముగించుకుని బయటకొస్తే ఇంకొకరు పనికి కంపెనీలోకి వెళ్లారు. ఎప్పుడూ జనరల్ డ్యూటీకి వెళ్లే పూడి మోహన్ దుర్గాప్రసాద్ బుధవారం బి.షిఫ్ట్‌కు వెళ్లాడు. కొద్దిసేపటికి భారీ విస్ఫోటం సంభవించి అన్న పూడి మోహన్ దుర్గాప్రసాద్ చనిపోయాడు. ఈ విషయం తెలిసిన ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ‘మాకున్న రెండు కళ్లలో ఒక కన్నుపోయింది. ఇప్పుడెలా?’.. అంటూ మృతుడి తల్లిదండ్రులు శ్యామల, సూర్యారావు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఒక్కో కథ.. కన్నీటి వ్యధ అనకాపల్లి జిల్లాలోని సెజ్ ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులు ఆస్పత్రి వద్ద రోదిస్తున్న తీరు అక్కడున్న వారికి కంటతడిపెట్టిస్తోంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోయే వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా...మరొక మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. వీరి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.. ప్రమాదంలో మరణించిన కొంతమంది మృతుల గురించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు.. – అనకాపల్లి/ఎస్.రాయవరంపెళ్లై ఆరు నెలలు.. భార్య గర్భవతి ఫార్మా ప్రమాదంలో మరణించిన ఎస్.రాయవరం మండలం దార్లపూడి యువకుడు జవ్వాది చిరంజీవికి 6 నెలల క్రితం పెళ్లయింది. అతని భార్య గర్భవతి. ఈ ఘటన ఆ కుటుంబాన్ని కోలుకోలేని స్థితికి తీసుకెళ్లింది. పెళ్లికి ముందు ఒడిశాలో ఉద్యోగం చేసుకుంటున్న చిరంజీవి, ఇటీవల అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ఫిట్టర్‌గా చేరాడు. ఎక్కువగా జనరల్ షిప్్టకి వెళ్లే చిరంజీవి, బుధవారం బి షిఫ్ట్‌కి వెళ్లాడు. విధుల్లో చేరుతుండగా ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే మరణించాడు. మృతుడిపైనే భార్య, తల్లి ఆధారపడి జీవిస్తున్నారు.కొండంత ఆసరా అనుకున్నాంఫార్మా ప్రమాదంలో మరణించిన బంగారంపాలేనికి చెందిన పూసర్ల వెంకటసాయి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. తండ్రి ఆటో నడుపుతూ, తల్లి టైలరింగ్ చేసుకుంటూ వెంకటసాయిని చదివించారు. చదువు పూర్తై, ఇటీవల ఫార్మా కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. అమ్మానాన్నలను తానే చూసుకుంటానని చెప్పేవాడు. అంది వచి్చన కొడుకు అనంత లోకాలకు చేరడంతో ఆ తల్లిదండ్రుల రోదన గ్రామస్తుల్ని కన్నీరు పెట్టిస్తోంది. మృతుడు వెంకటసాయికి ఇంకా వివాహం కాలేదు.సెపె్టంబర్ 5న పెళ్లి..ఇంతలోనే.. జావాది పార్థసారథి మా మనవడు. మాది పార్వతీపురం మన్యం జిల్లా, డోకిశిల పంచాయతీ, చలమలవలస. పార్థసారథికి సెపె్టంబర్ 5న వివాహం. నిన్ననే బట్టలు కొన్నాం. పావు తక్కువ రెండు వరకు మాతో మాట్లాడాడు. పనిలోకి వెళ్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెళ్లిన అరగంటలోనే ఇలా అయిపోయింది. రాత్రి 7 గంటలకు గానీ మాకు సమాచారం లేదు. యాజమాన్యం మాకు ఏమీ చెప్పలేదు. మా ఎమ్మార్వో ద్వారా వీఆర్వో మాకు చెప్పాడు. మా ఊరి నుంచి 6 గెడ్డలు దాటుకుని, పార్వతీపురంలో కారు బుక్ చేసుకుని బయల్దేరితే రాత్రి 11 గంటలకు ఇక్కడికి చేరుకున్నాం. మృతదేహం ఎక్కడుందో తెలీదు. అడిగితే.. ఎవరి నుంచీ సరైన సమాధానం రావట్లేదు. అధికారులు, నాయకులూ ఎవరూ పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. – జావాది శ్రీరాములనాయుడు, మృతుడి తాతయ్యఫ్యాక్టరీలో చేరి నెలన్నరే..మాది అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం పాశర్లపూడి లంక. నా భర్త సతీష్ ఈ ఫ్యాక్టరీలో చేరి నెలన్నరే అయింది. మా పెళ్లయి మూడేళ్లు. పిల్లలు లేరు. తొలి జీతం అందుకుని, ఇంటికి పంపించి ఇక నుంచి అంతా మంచిగానే ఉంటుందని సంతోషంగా చెప్పారు. ప్రమాద విషయాన్ని కంపెనీ యాజమాన్యం, అధికారులు చెప్పలేదు. నా భర్త ఫ్రెండ్స్ మా మరిదికి చెప్పారు. ముందు సీరియస్‌గా ఉంది వెంటనే వచ్చేయమన్నారు. మేము ఓ 20 కి.మీ. వచ్చాక ఫోన్ చేస్తే చనిపోయినట్లు చెప్పారు. కారు పురమాయించుకుని రాత్రి 1.30కు కేజీహెచ్‌కు వచ్చాం. ఇక్కడ అందరినీ బతిమాలగా 2.30కు లోపలికి పంపించారు. ఆయన చేతులు, ముఖం, తల బాగా కాలిపోయింది. భవిష్యత్తును తలచుకుంటే భయమేస్తోంది. – సాయిశ్రీ, మృతుడు సతీష్ భార్య, పాశర్లపూడిలంకప్రేమించి ఇప్పుడెలా వెళ్లిపోయావ్?‘ప్రేమించావ్.. పెళ్లి చేసుకున్నావ్.. ఒక్క క్షణం వదిలిపెట్టను అని అన్నావు కదా.. ఇప్పుడు నన్నొదిలి ఎలా వెళ్లిపోవాలనిపించింది నీకు. పిల్లలంటే ప్రాణమన్నావ్. మన బిడ్డ పుట్టకుండానే వెళ్లిపోయావా. రేపు మన బిడ్డ నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలి. టైర్ పంక్చరైందని ఫోన్‌చేస్తే వచ్చేసెయ్ అని చెప్పాను. కానీ, శాలరీ కట్ అవుతుందని వెళ్లిపోయావ్. ఇందుకేనా..’ అంటూ తన భర్త జవ్వాది చిరంజీవిని ప్రమాదంలో కోల్పోయి ఆరునెలల గర్భంతో కన్నీరుమున్నీరవుతున్న లీలాదేవిని ఓదార్చడం ఎవ్వరితరం కాలేదు.‘ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లాక ఫోన్‌చేసి మాట్లాడతాడు. కానీ, ఆ రోజు ఫోన్ రాలేదు. నేను చేస్తే ఎత్తలేదు. ఏం జరిగిందోనన్న ఆందోళనలో ఉన్నప్పుడు ఇంట్లో అందరూ టీవీ చూసి కంగారుపడ్డారు. ఎవరూ ఏం చెప్పలేదు. ఎందుకు ఫోన్ ఎత్తడంలేదని అడిగితే రకరకాలుగా చెప్పారు. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారంలేదు. ఏం జరిగిందో తెలీదు. ‘ఏమండి.. మా ఆయన్ని ఒక్కసారి చూడనివ్వండి. మీ కాళ్లు పట్టుకుంటాను’..పెళ్లి ముచ్చట తీరకుండానే.. ‘కన్నా.. మేమంతా నీ మీదే ఆధారపడి బతుకుతున్నామని తెలుసు కదా. ఉద్యోగం వచ్చింది. ఇక మనకు కష్టాలు తీరిపోయాయని చెప్పావు. ఇప్పుడేమో.. భగవంతుడు కూడా తీర్చలేని కష్టంలోకి మమ్మల్ని నెట్టేసి ఎలా వెళ్లిపోయావు? పెళ్లి చేసేద్దామని అనుకున్నాం కదా.. నువ్వు కూడా సరే అన్నావు. ఆ ముచ్చట తీరకుండా మమ్మల్ని అనాథలు చేసేశావా కొడుకా’.. అంటూ రాజశేఖర్ తల్లిదండ్రులు పైడి ధర్మారావు, తులసమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు.పైడి రాజశేఖర్ (22) స్కూలు, కాలేజీలో టాపర్. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చేసిన రాజశేఖర్ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాడు. ఇటీవలే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనా రెండింటికీ ఇంకా జాయినింగ్ ఆర్డర్ రాకపోవడంతో రెండునెలల క్రితమే ఎసైన్షియాలో ప్రాసెస్ ఇంజినీర్‌గా చేరాడు. మూడ్రోజుల క్రితం చెల్లెలు రాఖీ కూడా కట్టింది. నిజానికి.. రాజశేఖర్ బుధవారం మధ్యాహ్నం షిఫ్ట్‌కి వెళ్లాల్సి ఉంది. కానీ, రాత్రికి స్నేహితుడి పెళ్లి ఉండడంతో ఉదయానికి మార్చుకుని విగతజీవిగా మారాడు.మేమెలా బతకాలి కొడకా? ‘మాకు ఆధారం నువ్వే కదా నాయనా.. మీ అమ్మ, నేను ఇప్పుడెలా బతకాలి. నీ జీతం మీదే మన కుటుంబం ఆధారపడి బతుకుతోంది. నీ మీదే ఆశలు పెట్టుకున్న మేం ఇప్పుడెలా జీవించాలి’.. అంటూ మహంతి నారాయణ తండ్రి సత్యం కన్నీరుమున్నీరవుతున్నారు. ‘ప్రమాదంపై కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అక్కడ ఇక్కడ చూసి, టీవీల్లో వస్తున్న కథనాలను చూసిన తర్వాత రాత్రి తెలిసింది. ఇక్కడకొచ్చి విగతజీవిగా నిన్ను చూస్తుంటే బతకాలనిపించడం లేదు’..అంటూ రోదించారు.ఇప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు? నా భర్త ఏమైయ్యాడో తెలియని పరిస్థితి, విధి నిర్వహణకు వెళ్లిన వ్యక్తి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడంలేదు. ఏం జరిగిందో తెలీదు. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారంలేదు. నాకు నాలుగేళ్ల బాబు, రెండు నెలల పాప వుంది. ఏం జరిగిందో నాకూ, నా కుటుంబ సభ్యులకు తెలీక ఆందోళన చెందాం. రాత్రి 9 గంటల వరకు ఎలాంటి సమాచారం తెలీలేదు. భయపడి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. అర్థరాత్రి దాటిన తర్వాత ఎవరో చెప్పడంతో ఉదయం ఇక్కడకు వచ్చాం. తీరా వచ్చాక చూస్తే నా భర్త విగతజీవిగా పడి ఉన్నాడు. ఇప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు’.. అంటూ చనిపోయిన హంస ప్రశాంత్ భార్య హంస జ్యోతి రోదన కంటతడి పెట్టించింది.ఈ వయసులో ఒంటరిగా వదిలేశావా? ఏం భయంలేదే.. ఇంకొన్నేళ్లు పనిచేస్తే పింఛనొచ్చేస్తాది. దాంతో ఇద్దరం ప్రశాంతంగా బతుకుదాం. ఎవ్వరిమీదా ఆధారపడాల్సిన పనిలేదు అని చెప్పావు. ఇప్పుడేమో ఈ వయసులో ఒంటరిగా వదిలేశావా.. ఇప్పుడు నేనెలా బతకాలి.. ఎవరి కోసం బతకాలి.. ప్రమాదం జరిగిందని తెలీగానే నా గుండె ఆగినంత పనైంది. నీకేమైందో తెలీలేదు.ఎవర్ని అడిగినా రాత్రి 11 గంటల వరకూ చెప్పలేదు. ఇరుగుపొరుగు వారిని కనుక్కోమని కాళ్లావేళ్లా పడి బతిమాలి కంపెనీ దగ్గరికి వెళ్తే.. నన్నొదిలి వెళ్లిపోయావని చెప్పారు. ఎక్కడున్నావని అడిగితే కేజీహెచ్‌కు తీసుకొచ్చేశారని చెప్పారు. నిన్న డ్యూటీకెళ్లినప్పుడు నీ మొహం చూశాను. ఇప్పటివరకూ నువ్వు కనపడలేదయ్యా. నువ్వేసుకున్న బట్టలు చూసి నిన్ను గుర్తుపట్టాను. ఇంక నేనెలా ఈ జీవితాన్ని ఈడుస్తాను? అంటూ వేగి అచ్చియ్యమ్మ తన భర్త సన్యాసినాయుడు (55) కోసం తలచుకుంటూ కుమిలిపోతోంది.చాలా భయపడ్డాం..నా కుమారుడు మహేశ్ ఎసైన్షియా కంపెనీ ఏసీ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే వాడికి ఫోన్ చేసినా స్పందన లేదు. చాలా భయపడ్డాం. మా బంధువులు నేరుగా ప్రమాద స్థలం వద్దకు చేరుకుని వెతికితే నా కుమారుడు గాయాలతో ఉన్నాడు. దీంతో అతడిని అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మెడికవర్ ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదన్నారు. ప్రభుత్వం అన్ని వి«ధాలా ఆదుకోవాలి. –మహాలక్ష్మి, క్షతగాత్రుడు మహేశ్ తల్లిమెరుగైన వైద్యం అందించాలిమా బంధువు దేముడు తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాం. చాలా సమయం వరకు అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో భయపడ్డాం. రాత్రి 12 గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్టు తెలిసింది. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి. –అప్పలరాజు, క్షతగాత్రుడు దేముడు బంధువు -
నిలువెల్లా నిర్లక్ష్యం.. అచ్యుతాపురం ఘటనలో సర్కారు అలసత్వం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం... వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం... శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయకపోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది. ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే తాజా ఘటనలో అలాంటి చర్యలేవీ లేకపోగా కూటమి సర్కారు స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి విషాద సమయాల్లో ప్రజాప్రతినిధులు తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తోడుగా నిలవడం కనీస బాధ్యత. అయితే అధికార పార్టీ నేతలెవరూ అటువైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సీఎం చంద్రబాబుతోపాటు పర్యటనలో పాల్గొనడం, ఆయనతో పాటే కేజీహెచ్‌కు చేరుకుని తూతూమంత్రంగా కలవడం మినహా అధికార పార్టీ నేతలెవరూ బాధిత కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఘటన జరగగా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూటమి పార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ, మంత్రి గానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వారి తీరుకు నిదర్శనం.తనిఖీలకు తిలోదకాలు..పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లకు అలవాటుపడ్డ కూటమి నేతలు అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అన్ని విభాగాల అధికారులు కలసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఆడిట్ రిపోర్టు సమర్పించేవారు. ఈమేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఆయా కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తనిఖీలకు తిలోదకాలు ఇవ్వడంతో పరిశ్రమల్లో నిర్లక్ష్యం పొడచూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎసైన్షియా కంపెనీ ముందు మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యుల పడిగాపులు ‘20 పాయింట్ ఫార్ములా’ విస్మరించడంతో..విశాఖలో 2020లో ఎల్జీ పాలీమర్స్ ప్రమాద ఘటన తరువాత నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించేందుకు ‘20 పాయింట్ ఫార్ములా’ అమలులోకి తెచ్చింది. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ వస్తే ఆ సంస్థ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పరిగణించారు. కనీసం పది పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపి వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి 20 పాయింట్ ఫార్ములా అమలుపై పర్యవేక్షణ కొరవడటంతోపాటు తనిఖీలు నిర్వహించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అంచనాలకు అందని అసమర్థతవిశాఖ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాద తీవ్రతను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. రెడ్ కేటగిరీలో ఉన్న రసాయన పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించాల్సి ఉండగా, రెండు గంటల తర్వాత కానీ కలెక్టర్, ఎస్పీ అందుబాటులోకి రాలేదనే విమర్శలున్నాయి. మృతుల విషయంలో తొలుత ఇద్దరు ముగ్గురేనని చెబుతూ వచ్చిన అధికారులు రాత్రి 8 గంటల సమయంలో 14 అని తేల్చారు. చివరకు 17 మంది మరణించినట్లు ప్రకటించారు. ఇది అతి పెద్ద ప్రమాదమనే విషయాన్ని పసిగట్టడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో అంబులెన్సులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేదు. కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చింది. ఆందోళనకు దిగితేగానీ ఆలకించలేదు..తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే విషయం స్పష్టంగా తెలుస్తున్నా తొలుత అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. బాధితులను వెంటనే విశాఖకు తరలించాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకున్నా పట్టించుకోలేదు. చివరకు సహనం నశించిన బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగితేగానీ రాత్రికి విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించలేదు. రాత్రంతా వర్షంలోనే బాధిత కుటుంబాలు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. పట్టించుకునే దిక్కులేక..విపత్తులు, దుర్ఘటనల సమయాల్లో వివిధ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. తాజా ఘటనలో మాత్రం అది ఎక్కడా కానరాలేదు. మృతదేహాలు తరలించిన అంబులెన్సులు పోస్టుమార్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని కేజీహెచ్ సిబ్బంది సూచించగా మిగిలిన భౌతిక కాయాలను తెచ్చేందుకు తాము వెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. సమన్వయం కొరవడటంతో మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేవారు లేకుండా పోయారు. దీంతో న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియాలో వార్తలను చూస్తూ బాధిత కుటుంబాలు తల్లడిల్లాయి. బాధితుల బంధువులను మానవత్వంతో ఓదార్చేందుకు ఏ ఒక్క అధికారీ అందుబాటులో లేకుండా పోయారు. రాత్రి నుంచి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇక ప్రమాదం ఎలా సంభవించిందనే సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది.గంటలో పరిహారం ఇస్తామని చెప్పి..మృతుల కుటుంబ సభ్యులకు గంటలో రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామంటూ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే, ఆయన వెళ్లిపోగానే అధికారులు మాట మార్చేశారు. మృతదేహాలను తరలించి దహన సంస్కారాలు నిర్వహించాలని, దారి ఖర్చులకు ముందుగా రూ.10 వేలు ఇస్తామనడంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు నిర్దిష్ట హామీ లభించే వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. దీంతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రదేశం అనకాపల్లి జిల్లాలో ఉండగా విశాఖ కలెక్టర్ మాట ఎలా విశ్వసించాలని బాధిత కుటుంబాలు ప్రశ్నించాయి. అనంతరం అనకాపల్లి జేసీ జోక్యం చేసుకుని పరిహారానికి రెండు, మూడు, రోజులు పడుతుందని చెప్పారు. తమకు ప్రభుత్వంపై నమ్మకంలేదని బాధితులు తేల్చిచెప్పారు. ఆ తర్వాత కేజీహెచ్‌కు మ.1.45 గంటల ప్రాంతంలో సీఎం వచ్చి మరో గంటలో పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కానీ, సా.5 గంటల వరకు ఆ ప్రస్తావనే లేకపోవడంతో బాధితులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో అప్పటికప్పుడు రూ.కోటి పరిహారం ఇస్తున్నట్లు ప్రొసీడింగ్స్ కాపీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. రాత్రి 7 గంటలకు శవ పంచనామాలు పూర్తిచేశారు. -
రియాక్టర్ పేలలేదు.. ప్రమాదానికి కారణం ఇదే..
-
అచ్యుతాపురం ప్రమాదంపై బాధితులు కన్నీటి పర్యంతం
-
ఇందుకా మీకు ఓట్లేసి గెలిపించింది..
-
ఎసెన్షియా ఫార్మాపై కేసు
-
అచ్యుతాపురం ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఉదాసీన వైఖరి
-
అచుత్యపురం ఎసైన్షియా ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య
-
కాటేసిన కార్ఖానా
కుప్పకూలిన శిథిలాల్లో నలిగిన ప్రాణాలు... ఎగసిపడుతున్న మంటలు...పొగచూరిన పరిసరాలు శ్వాస ఆడక.. మాట రాక.. పగిలిన గుండెలు రసాయన మంటల్లో మసైపోయిన బతుకులు... తునాతునకలైన దేహాలు... రక్తాన్ని చెమటగా మార్చే కష్టజీవులు.. యంత్రాలకు చెట్లకు వేలాడే నెత్తుటి ముద్దలై... అక్కడంతా బీభత్సం...మాటలకందని విషాదం.. ఎవరిది కాలో...ఎవరిది చేయో...తెలియని హృదయ విదారక స్థితిలో.. ముక్కలైన దేహాలను మూటకట్టి విసిరేసిన దుర్మార్గం.. తమ వాళ్లకేమైందో...జాడ తెలియక...బతికున్నారో లేదో అంటూ లబలబలాడిన గుండెలతో పరిశ్రమ గేటు వద్దకు పరుగులు తీసిన వారికి సమాధానం చెప్పే నాథుడు లేక... అంతులేని నిర్లక్ష్యానికి, అనంత శోకానికి నిదర్శనంగా.. సెజ్‌లోని ఎసైన్షియా పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదం పెను విషాదం నింపింది. జిల్లాలో ప్రకంపనలు రేపింది..విశాఖ సిటీ/అచ్యుతాపురం/రాంబిల్లి (యలమంచిలి)/అనకాపల్లి/తుమ్మపాల: బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలు.. కొంత మంది భోజనానికి వెళ్లారు. మరికొంత మంది వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక్కసారిగా అణుబాంబు పేలినట్టు భారీ విస్ఫోటనం.. భూమి కంపించింది.. అచ్యుతాపురం సెజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 500 కిలోల సామర్ధ్యం గల రియాక్టర్ పేలడంతో ఆ ధాటికి ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భవనం కుప్పికూలిపోయింది. దాని నుంచి దట్టమైన పొగ క్షణాల్లోనే కిలోమీటర్ వరకు వ్యాపించింది. ఏం జరిగిందో ఎవరికీ అంతుచిక్కలేదు. ఎసైన్షియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఆ ప్రాంతం శవాల దిబ్బగా మారింది. పేలుడు ధాటికి కారి్మకుల శరీర భాగాలు వందల మీటర్ల వరకు చెల్లాచెదురయ్యాయి. చెట్లపైకి కాళ్లు, చేతులు ఎగిరిపడ్డాయి. మూడో అంతస్తులో రియాక్టర్ పేలడంతో ఆ భవనం నేలమట్టమైంది. కింద అంతస్తులో ఉన్న కారి్మకులపై శ్లాబ్ కుప్పకూలడంతో సజీవ సమాధి అయిపోయారు. కొందరి మృతదేహాలు పూర్తిగా చికితిపోయి మాంసపు ముద్దగా మారిపోయాయి. 17మంది దుర్మరణం పాలవ్వగా 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు పాతికేళ్ల క్రితం హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం తరువాత అతిపెద్ద పారిశ్రామిక విషాదంగా ఈ దుర్ఘటన నిలవనుంది.రక్తసిక్తంగా ఘటనా స్థలం కొంత ఆలస్యంగా సహాయక చర్యలు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సెజ్.. పేలుడు ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసే కారి్మకులు భయంతో పరుగులు పెట్టారు. సుమారు 15 నిమిషాల వరకు ఎసైన్షియా కంపెనీ వైపు వెళ్లడానికే భయపడిపోయారు. ఈ క్రమంలో ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. అధికారులు రావడానికి కూడా 30 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అప్పటి వరకు కనీసం ప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ముందుగా స్థానిక అధికారులతో పాటు అగ్ని మాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది. ఒకవైపు మంటలను అదుపు చేస్తూనే.. మరోవైపు భవనంపై చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కారి్మకులను క్రేన్ సాయంతో కిందకు దించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఎక్కువగా సమయం పట్టింది. మిన్నంటిన రోదనలు కొద్ది నిమిషాలకు అన్ని శాఖల అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. అయితే పేలుడు ధాటికి భవన శకలాలు, ఇతర సామగ్రి ఎగిరి అక్కడ పనిచేస్తున్న కారి్మకులకు బలంగా తగలడంతో అనేక మంది గాయపడ్డారు. అలాగే పేలుడు కారణంగా వెలువడిన రసాయనాలు పడి కొందరు క్షతగాత్రులయ్యారు. వీరందరినీ సహాయక బృందాలు బయటకు తీసుకువచ్చాయి. అయితే క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కారి్మకులకు గాయాలవడంతో వారిని అక్కడి నుంచి తరలించడానికి అధిక సమయం పట్టింది. దీంతో వారు ఆ గాయాల నొప్పిని భరించలేక చేసిన రోదనలు మిన్నంటాయి. అంబులెన్సులు లేకపోవడంతో.. ప్రమాదం జరిగిన గంటన్నర అయినా అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం. దీంతో క్షతగాత్రులను కంపెనీ బస్సుల్లోనే ఆస్పత్రులకు తరలించారు. ఆ తరువాత రెండు అంబులెన్సులు వచ్చినప్పటికీ.. అవి సరిపోలేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి 30, 40 కిలోమీటర్ల మేర ఆ నొప్పితోనే ప్రయాణించాల్సి వచ్చింది. మృతులు, క్షతగాత్రుల్లో ఉత్తరాంధ్రవారే ఎక్కువ ఈ ప్రమాదంలో 17 మంది కారి్మకులు మృత్యువాత పడ్డారు. వీరిలో భవనం శ్లాబ్ పడి చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. శిథిలాల కింద మరో 9 మంది వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొంతమంది మృతదేహాలు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనేక మంది శరీర భాగాలు ఎగిరిపడడంతో వాటిని ఏరుకోవాల్సి వచ్చింది. కొన్ని ఏకంగా ఛిద్రమై మాంసపు ముద్దలా మారిపోయాయి. వాటన్నింటినీ మూటల్లో చుట్టి ఉంచారు. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది. కేజీహెచ్‌కు మాంసపు ముద్దలుఘటనా స్థలం నుంచి 13 మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. ఇందులో మాంసపు ముద్దలే వచ్చాయి. ఎవరి కాలు, ఎవరి చేయి, ఎవరిది శరీరమో గుర్తించలేని పరిస్థితి ఉంది. శరీర భాగాలను మూటలు కట్టుకొని తీసుకువచ్చారు. హృదయ విదారకరమైన ఈ సంఘటన చూసిన వారంతా చలించిపోయారు. అంతా యువకులే...ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడినవారంతా యువకులే ఉండటం విషాదకరం. వివిధ జిల్లాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు. నైపుణ్యం లేకపోయినా దాదాపు ఫార్మా కంపెనీల్లోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ కారణంగానే యువకులు ఎక్కువ శాతం మంది ఫార్మా పరిశ్రమల్లో చేరుతున్నారు. ఎసైన్షియా ఫార్మా పరిశ్రమలో దాదాపు 70 శాతం మంది 40 ఏళ్లలోపు యువతే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృత్యు ఒడికి చేరిన వారిలో ఎక్కువ మంది 40 సంవత్సరాల్లోపు ఉన్న వారే కావడంతో అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరిలో కొందరికి వివాహం కాలేదని తెలుస్తోంది. మరికొందరికి చిన్న చిన్న పిల్లలున్నట్లు బంధువులు చెబుతున్నారు. నేడు సీఎం చంద్రబాబు రాక సాక్షి, విశాఖపట్నం: ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబునాయుడు గురువారం విశాఖ రానున్నారు. ఉదయం 10.50 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్లో కోస్టల్ బ్యాటరీకి రానున్నారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో మెడికవర్ హాస్పిటల్‌కు చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. అనంతరం కోస్టల్ బ్యాటరీకి చేరుకొని హెలికాఫ్టర్‌లో అచ్యుతాపురం సెజ్‌కి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం హెలికాఫ్టర్‌లో ఎయిర్‌పోర్టుకు చేరుకొని మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు. కేజీహెచ్‌కు మృతదేహాలుమహారాణిపేట(విశాఖ): ఎసైన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన 13 మంది ఉద్యోగుల మృతదేహాలను బుధవారం రాత్రి కేజీహెచ్‌కు మార్చురీకి తీసుకొచ్చారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్, డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్, ఏఎంసీ ప్రిన్సిపాల్ బుచ్చిరాజు, విశాఖ ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, సీతమ్మధార తహసీల్దార్ రమేష్ స్వయంగా పర్యవేక్షించారు. పలువురు క్షతగాత్రులను సెవెన్ హిల్స్, మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌కు తీసుకొచ్చిన మృతదేహాలు నీలపు రామిరెడ్డి, మహంతి నారాయణరావు, మొండి నాగబాబు, చల్లపల్లి హారిక, మారిశెట్టి సతీ‹Ù, యళ్లబిల్లి చిన్నారావు, పైడి రాజశేఖర్, మోహనరావు, బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు మృతదేహాలను తీసుకొచ్చారు. నాలుగు మృతదేహాల వివరాలు తెలియలేదు.మార్చురీ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన మహారాణిపేట : తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు కేజీహెచ్ మార్చురీ వద్ద బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున, యాజమాన్యం తరఫున కనీస స్పందన లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పంచనామాకు సంతకాలు పెట్టేదిలేదని భీషి్మంచుకుకూర్చున్నారు. సీఎం చంద్రబాబు గురువారం విశాఖ పర్యటనలో పరిహారం ప్రకటిస్తారని సంతకాలు చేయాలని అధికారులు కోరినా వారు వినలేదు. తమకు న్యాయం చేయకుండా పంచానామా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మెట్లు ఎక్కుతుండగా ప్రమాదం రెండో షిఫ్ట్ డ్యూటీలో చేరేందుకు కంపెనీ మెట్లు ఎక్కుతున్నా. అదే సమయంలో ఢాం అని సౌండ్ వచ్చింది. బిల్డింగ్ ఊగిపోయింది. దీంతో నేను కూడా తూలి కింద పడిపోయాను. నా మీద నుంచి రాళ్లు, శ్లాబ్ పెచ్చులు వెళ్లాయి. – బి.సూరిబాబు, వై.లోవ, రాంబిల్లిచుట్టూ చెల్లాచెదురు ఏడాదిగా పనిచేస్తున్నా. నేనుండేది ఇక్కడే సెజ్ కాలనీలో. ఈ రోజు మధ్యాహ్నం డ్యూటీకి వచ్చిన అరగంటలోనే ఈ ప్రమాదం జరిగింది. భయంకరమైన సౌండ్ వచ్చింది. చుట్టూ అంతా చెల్లాచెదురైంది. నా చేతికి, ముఖంపై గాయాలయ్యాయి. భయంతో తోచిన వైపు పరుగులు తీశా. – జె.వర్ధన్, హెల్పర్ఎవరూ పట్టించుకోవట్లేదు మాది గాజువాకలోని శ్రీనగర్. బి షిఫ్ట్ విధుల్లోకి వచ్చా. ఆఫీస్‌కు వచ్చిన వెంటనే ప్రమాదం జరిగింది. చేతికి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. ఆస్పత్రిలో చేర్చి గంటలు గడిచినా ఒక్క డాక్టరూ వచ్చి చూడలేదు. అడిగినా ఎవరూ పట్టించుకోవట్లేదు. – సీహెచ్ బంగారునాయుడు, కెమిస్ట్ఇక్కడ చేరి రెండు నెలలే.. ఉద్యోగం కోసం శ్రీకాకుళం నుంచి 2 నెలల క్రితం రాంబిల్లి వచ్చాను. కంపెనీలో ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నా. మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఏమీ కనిపించలేదు. అంతా పొగతో, మంటల్లో కాలిపోతోంది. నాకు ముఖం, చేతిపైన కాలిపోయింది. – కె.రాంబాబు, క్షతగాత్రుడు -
అచ్యుతాపురం ఘటన: దిగొచ్చిన చంద్రబాబు సర్కార్
అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ దుర్ఘటన అప్డేట్స్పరిహార ప్రకటన చేసిన చంద్రబాబుఎట్టకేలకు దిగొచ్చిన చంద్రబాబు సర్కార్బాధిత కుటుంబాల ఆందోళన, వైఎస్సార్సీపీ డిమాండ్‌కు తలొగ్గిన వైనంఅనకాపల్లి అచ్యుతాపురం సెజ్.. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వంవిశాఖపట్నం జిల్లా మెడికవర్ ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబుఅనంతరం మీడియాతో పరిహార ప్రకటనమృతుల కుటుంబాలకు కోటి రూపాయిలు పరిహారంఅవయవాలు కోల్పోయిన వారికి 50 లక్షలు,గాయాలు అయిన వారికి 25 లక్షలు పరిహారం ప్రకటించిన చంద్రబాబుచికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టీకరణపరిహారం ఎప్పటిలోగా అందిస్తామనేదానిపై ఇవ్వని స్పష్టతగత ప్రభుత్వాలు వ్యవస్థలను నిర్వీర్యం చేశాయంటూ అసందర్భోచిత వ్యాఖ్యలుప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందేనని, పరిహారంపై స్పష్టం చేయాలని జగన్ డిమాండ్ ప్రభుత్వ స్పందన సరిగా లేదు: బొత్స ఫైర్అచ్యుతాపురం ఘటన బాధాకరంప్రభుత్వం స్పందించిన తీరు సరికాదుబాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదుమంత్రులు, ఎమ్మెల్యేలు బాధితుల్ని పరామర్శించలేదుచంద్రబాబు కేజీహెచ్‌కు ఎందుకు రాలేదు?బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలిగతంలో మా ప్రభుత్వం ఈ తరహా ప్రమాదాలు జరిగితే సత్వరమే స్పందించిందిమా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చిందిసెజ్ ప్రమాద బాధితులకు కూడా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలిరేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారుపరిహార ప్రకటనపై బాబు సర్కార్ డ్రామాలుఅచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. పరిహారం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నాటకాలుగత ప్రభుత్వం మాదిరే పరిహారం ఇవ్వాలని కోరుతున్న బాధిత కుటుంబాలుఅటు విశాఖ, ఇటు అనకాపల్లి మార్చురీల వద్ద ఆందోళనపరిహారంపై స్పష్టమైన ప్రకటన తర్వాతే పోస్ట్‌మార్టానికి సహకరిస్తామని బైఠాయింపుపోలీసులు, రెవెన్యూ అధికారుల బుజ్జగింపులతో తలొగ్గని కుటుంబ సభ్యులుప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇస్తుందని ప్రకటించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్తక్షణం సాయం అందించాలని బాధిత బంధువుల డిమాండ్కాసేపటికే జాయింట్ కలెక్టర్ జాహ్నవి విరుద్ధమైన ప్రకటనపరిహారం ఇవ్వాలంటే ముందు బాధితుల బంధువుల్ని గుర్తించాలంటూ మెలికమూడు రోజుల సమయం పడుతుందని వ్యాఖ్యపరిహారం చంద్రబాబే ప్రకటిస్తారంటూ తెలిపిన జాహ్నవిజేసీ ప్రకటన తర్వాత.. ఆందోళన ఉధృతానికి సిద్ధమైన బాధిత కుటుంబాలు, బంధువులుమెడికవర్ ఆస్పత్రికి చంద్రబాబువిశాఖ మెడికవర్ ఆస్పత్రిలో ఏపీ సీఎం చంద్రబాబు ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరామర్శచికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబువైద్యం అందుతున్న తీరును వైద్యుల్ని అడిగి తెలుసుకున్న చంద్రబాబుకేజీహెచ్కు వైఎస్సార్సీపీ నేతలువిశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలుబాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరుల పరామర్శఅధికార యంత్రాగం, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని వాపోయిన బాధితులుఏ ఒక్కరూ పట్టించుకోలేదని కంటతడి పెట్టిన మహిళలుచలించిపోయి.. బాధితుల్ని ఓదార్చిన బొత్స ‘సీఎం రమేష్‌కు సిగ్గుందా?’అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతమార్చురీ గేటు ముందు నిరసనకు దిగిన మృతుల కుటుంబ సభ్యులుప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి అంటూ నినాదాలుమృతుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్.అచ్యుతాపురం ప్రమాద ఘటనపై కేంద్రం రూ. రెండు లక్షలు నష్టపరిహారం ప్రకటించడం దుర్మార్గంసీఎం రమేష్ కు సిగ్గుందా?బాధిత కుటుంబాలు రోదిస్తుంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చి పరామర్శించలేదు..:::ఘంటా శ్రీరామ్, వామపక్ష నేతఅచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరం ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది పరిశ్రమల కాలుష్య నియంత్రణ నా శాఖ పరిధిలో ఉంది కానీ, భద్రత వేరే శాఖ కిందికి వస్తుంది పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పాను అలా చేస్తే పరిశ్రమలు మూతపడతాయని నిర్వాహకులు భయపడుతున్నారుకానీ, ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాల్సిందేఇలాంటి ఘటనలప్పుడు సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరంసెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాంరాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తాం ఖర్గే దిగ్భ్రాంతిఅనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతిఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలిబాధితులకు న్యాయం చేసి, తగిన నష్టపరిహారం ఇవ్వాలిఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిపరిహారాన్ని సీఎం ప్రకటిస్తారు: విశాఖ జేసీవిశాఖ కేజీహెచ్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను కలిసిన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ మేడిద జాహ్నవి.మృతుల వారసుల్ని విచారణ చేసి గుర్తిస్తాం: జేసీ జాహ్నవిపరిహారం చెల్లించటానికి వారసుల గుర్తింపు కార్యక్రమానికే మూడు రోజుల టైం పడుతుంది: : జేసీ జాహ్నవిపరిహారం ఎంత అనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తారు : జేసీ జాహ్నవిప్రమాదానికి గల కారణాలు ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక వెల్లడిస్తాం : జేసీ జాహ్నవిజేసీ ప్రకటన నేపథ్యంలో.. మీడియా ముందుకు బాధిత కుటుంబాలుపరిహారం ప్రకటించేదాకా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనీయమని స్పష్టీకరణపరిహారంపై ప్రకటనేది?ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం.. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తతఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మృతుల బంధువుల వాగ్వాదం నష్ట పరిహారంపై స్పష్టత వచ్చే వరకూ మృతదేహలను తీసుకెళ్ళేది లేదని తేల్చేసిన బంధువులుమృతుల బంధువులను బుజ్జగిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బందివిశాఖ కేజీహెచ్ వద్ద ఇదే తరహా ఆందోళనఅందుకే ప్రమాదం!: అధికారుల వెర్షన్అనకాపల్లి ఎసెన్షియా కంపెనీ ప్రమాదంపై అంచనాకి వచ్చిన అధికారులురియాక్టర్ పేలడం వలన ప్రమాదం జరగలేదు అని క్లారిటీ తెచ్చుకున్న అధికారులు!ఒక రియాక్టర్ నుంచి మరొక రియాక్టర్ సాల్వెంట్ లో MTBE లిక్విడ్ లీక్ అవ్వడంతోనే ప్రమాదం?లీక్ అవుతున్న సాల్వెంట్ మీద ఎలక్ట్రికల్ స్పార్క్ పడటంతో పేలుడు సంభవించిందని అంచనాపేలుడు దాటికి కుప్పకూలిన బ్రిక్ వాల్మరో నలుగురి పరిస్థితి విషమంఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడ్డ మరో నలుగురి పరిస్థితి విషమంమెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు అధికారుల సూచన18కి చేరిన మృతుల సంఖ్య కొనసాగుతున్న ఉద్రిక్తతవిశాఖ కేజీహెచ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతపరిహారం విషయంలో ప్రభుత్వ ప్రకటనపై మృతుల బంధువుల ఆందోళన విశాఖ కలెక్టర్ హామీ తర్వాత కూడా వెనక్కి తగ్గని మృతుల కుటుంబ సభ్యులుఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరును తప్పుబట్టిన కుటుంబ సభ్యులుఅధికార ప్రజాప్రతినిధులెవరూ రాలేదని మండిపాటుఅధికార యంత్రాంగం కూడా ఆలస్యంగా స్పందించిందంటున్న బాధితులుకోటి పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే పోస్టుమార్టంకు సహకరిస్తామని స్పష్టీకరణగత ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే ఆదుకుంది కదా అని గుర్తు చేస్తున్న మృతుల బంధువులు అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబుఉదయం 11 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎంనగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న చంద్రబాబుతర్వాత నేరుగా రాంబిల్లి మండలం ఫార్మాసిటీలో ఉన్న ఎసెన్షియా పరిశ్రమకు వెళ్లనున్న సీఎంఘటనా స్థలాన్ని సందర్శించనున్న చంద్రబాబుఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు ఆస్పత్రిలో ఏడు మృతదేహాలు.. ఆరింటి గుర్తింపుమార్చురీ వద్ద ఉన్న మృతుల బంధువులపై ఆంక్షలువిశాఖ కేజీహెచ్ వద్ద పరిహారంపై స్పష్టమైన హామీ కోరుతూ బంధువుల ఆందోళనఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని ముందు జాగ్రత్తమృతదేహన్ని చూస్తామని చెప్పినా లోపలకు పంపించని పోలీసులుపోలీసులతో బంధువుల వాగ్వాదం.. పరిస్థితి ఉద్రిక్తత సాక్షి చేతిలో ప్రమాదంపై ఫిర్యాదు కాపీరాంబిల్లీ పోలీసులకి ఫిర్యాదు చేసిన రాంబిల్లి తహశీల్దార్ భాగ్యవతిమధ్యాహ్నాం 2:15 కి పేలుడు జరుగున్నట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్సాల్వెంట్ కెమికల్ పేలి ప్రమాదం జరిగినట్టు రిపోర్ట్ లో పేర్కొన్న తహశీల్దార్యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని రిపోర్ట్ఒకట్రెండు రోజుల్లో పరిహార ప్రకటన: విశాఖ కలెక్టర్కేజీహెచ్ వద్ద విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్‌ను ముట్టడించిన మృతుల బంధువులు.ప్రమాదం జరిగిన తరువాత యాజమాన్యం ఎందుకు స్పందించలేదని నిలదీసిన మృతుల బంధువులు.ప్రభుత్వం నుండి పరిహారం ప్రకటన స్పష్టం గా వచ్చేవరకు మార్చురీ వద్ద ఆందోళన చేస్తామంటున్న బాధిత కుటుంబాలు.ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తుంది అని చెప్పిన కలెక్టర్ కలెక్టర్ ప్రకటనపై బాధితుల కుటుంబాల అసంతృప్తి.. కొనసాగుతున్న ఆందోళనతగిన న్యాయం చేయాల్సిందే: బాధిత కుటుంబాల ఆందోళనకేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకేజీహెచ్ మార్చురీకి వచ్చిన జిల్లా కలెక్టర్.కలెక్టర్‌ను చుట్టుముట్టిన బాధితులుతమకు న్యాయం చేయాలని డిమాండ్జరిగిన ప్రమాదంపై ఇప్పుడు వరకు ప్రభుత్వ స్పందించలేదు: బాధిత కుటుంబాలుస్థానిక ఎమ్మెల్యే మంత్రి ఇప్పటివరకు కనీసం నోరు మెదపలేదు: బాధిత కుటుంబాలుకంపెనీ ప్రతినిధులు ఎవరూ రాలేదు: బాధిత కుటుంబాలుగతంలో జగన్ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది : బాధిత కుటుంబాలుఅదే తరహాలో ఇప్పుడు ఆదుకోవాలి: బాధిత కుటుంబాలుపరిహారంగా కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి: బాధిత కుటుంబాలుకేజీహెచ్ వద్ద ఉద్రిక్తతవిశాఖ కేజీహెచ్ ఆస్పత్రి వద్ద ఫార్మా కంపెనీ మృతుల బంధువుల ఆందోళననష్టపరిహారంపై స్పష్టమైన ప్రభుత్వం హామీ ఇవ్వాలని బంధువుల డిమాండ్కేజీహెచ్లో 12 మృతదేహాలుబంధువులతో రెవెన్యూ అధికారుల చర్చలు అచ్యుతాపురం సెజ్ వద్ద ఉద్రిక్తతనష్టపరిహారం పై స్పష్టమైన హామీ వచ్చేవరకు పంచనామాకు సహకరించేది లేదంటున్న మృతుల బంధువులు..మృతుల బంధువులను బుజ్జగిస్తున్న రెవెన్యూ అధికారులుపంచనామాకు సహకరించాలని మిగతా వివరాలు ఆపై మాట్లాడదామంటున్న రెవెన్యూ సిబ్బందిఎన్టీఆర్ ఆసుపత్రికి చేరుకున్న జాయింట్ కలెక్టర్మృతుల బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న జాయింట్ కలెక్టర్నష్టపరిహారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాని స్పష్టతఇదీ చదవండి: ప్రాణాలు తీసిన పాతకాలం రియాక్టర్!ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై కేసు నమోదు బీఎన్ఎస్ సెక్షన్లు 106(1), 125(b),125(a) కింద కేసులు నమోదుఎసెన్షియా ఫార్మా ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యం పై కేసునిర్లక్ష్యంతొ మరణానికి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన రాంబిల్లి పోలీసులుప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటనఅచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు చెప్పారు. మృతుల సంఖ్య 18!అచ్యుతాపురం సెట్ దుర్ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్యకేజీహెచ్ మార్చురీకి 12 మృతదేహాలుకొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్17 మృతదేహాల గుర్తింపు.. మరొకటి గుర్తించాల్సి ఉంది!విశాఖ కేజీహెచ్ మార్చురీలో ఉన్న మృతుల వివరాలు1)నీలపు రామిరెడ్డి అస్సోసియేట్ జెనరల్ మేనేజర్ 2)మహంతి నారాయణారావు అసిస్టెంట్ మనేజర్ 3)మొండి నాగబాబు అసిస్టెంట్ మేనేజర్ 4)చల్లపల్లి హారిక ట్రైనీ ఇంజినీర్ 5)మారిశెట్టి సతీష్ అసిస్టెంట్ మేనేజర్ 6)యళ్లబిల్లి చిన్నారావు పెయింటర్ 7)పైడి రాజశేఖర్ ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్ తండ్రి ధర్మారావు శ్రీకాకులం జిల్లా వంజంగి కులం కాలింగ 8) కొప్పర్తి గణేస్ కుమార్ M దుర్గా భవాని 9) ప్రశాంత్ హంస మేల్ W/o జ్యోతి 10) వేగి సన్యాసి నాయుడు11)పూడి మోహన్ దుర్గా ప్రసాద్ 12)జవ్వాది చిరంజీవిఅనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మృతదేహాలుఈ ఐదు మృతదేహలకు పంచనామా నిర్వహించనున్న అధికారులుఎన్టీఆర్ ఆసుపత్రికి వస్తున్న మృతుల బంధువులుఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉన్న మృతుల వివరాలు..జావేది పార్థసారిది, పార్వతీపురం మన్యంపూసల వెంకట సాయి, చిన గంట్యాడమారేణి సురేంద్ర, గాజువాకభి. ఆనందరావు, విజయనగరంబిఎన్. రామచంద్రరావుఎసెన్షియా (scientia) కంపెనీ ఎదుట రోదిస్తున్న బాధితుల బంధువులుఅచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం పేలిన రియాక్టర్ తమ వారి ఆచూకీ ఇంకా తెలియదు అంటూ రోదిస్తున్న బాధితులుఇంకా శిథిలాల కిందే చిక్కుకున్న కొంతమంది కార్మికులు?సహాయక చర్యల్లో జాప్యం చేస్తున్నారనే విమర్శఎవ్వరూ పట్టించుకోక పోవడంతో.. కంపెనీ ఎదుట బైఠాయించిన బాధితులుఅధికార యంత్రాంగం తూతు మంత్రంగా వ్యవహరిస్తోందిఅనకాపల్లి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని అన్నివిధాలా ఆదుకోవాలిబాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలిఅచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.గత కొంతకాలంగా విశాఖ సమీపంలోని కంపెనీలలో వరుస ప్రమాదాలునిరంతరం ఫ్యాక్టరీల్లో భద్రత, నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోంది:::సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ -
Atchutapuram: ప్రాణాలు తీసిన పాతకాలం రియాక్టర్!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలే ఉసురు తీస్తున్నాయి. ఫార్మా కంపెనీల్లోని రియాక్టర్లే ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నాయి. కార్మికుల భద్రతని గాలికొదిలేస్తూ.. భద్రతా ప్రమాణాల్ని పట్టించుకోకుండా.. కేవలం లాభాలు గడించేయాలన్న దురాలోచనతో పరిశ్రమలు వేస్తున్న తప్పుటడుగులతో కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోతున్నాయి. ఫార్మా కంపెనీల్లోని రియాక్టర్లలో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. రియాక్టర్ల తనిఖీలు పట్టించుకోవడం లేదు.. వీటిని పర్యవేక్షించాల్సిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో పేలుడుకు అది పాతకాలం రియాక్టర్ కావడమేనని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో తరచూ ప్రమాదాలకు పాత రియాక్టర్లే కారణమవుతున్నాయని అంటున్నారు. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లే అత్యంత కీలకం. వీటిలోనే రసాయనాలను మిశ్రమం చేస్తారు. ఈ కొలతల్లో తేడా వచ్చినా పీడనం, ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు సంభవించినా ఈ రియాక్టర్లు ఒక్కసారిగా పేలిపోతాయి. ఇప్పుడు ఎసెన్షియా ఫార్మా కంపెనీలో కూడా రియాక్టర్ పేలడానికి ఎక్సోథర్మల్ రియాక్షనే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకసారి రసాయనాల మిశ్రమంలో తేడా వస్తే దాని ఉధృతిని ఆపే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. రసాయన మిశ్రమాల పరిమాణంపై దీని నష్ట తీవ్రత ఆధారపడి ఉంటుందంటున్నారు. ఇప్పటికీ చాలా కంపెనీల్లో పాత రియాక్టర్లే.. విదేశాల్లో పోలిస్తే మన దేశ ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు తరచూ పేలడానికి సరైన నిబంధనలు, పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. చాలా కంపెనీలు ఇప్పటికీ అత్యాధునిక రియాక్టర్లను కాకుండా పాత కాలం నాటి రియాక్టర్లనే వాడుతున్నాయని.. ఇవే ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణమని విశ్లేíÙస్తున్నారు. అత్యాధునిక రియాక్టర్లలో ఎక్సో థర్మల్ రియాక్షన్ మొదలైతే దానికదే నీటిని వెదజిమ్ముకోవడం లేదా ఉష్ణోగతలను తగ్గించుకోవడం, తీవ్రతను బట్టి దానికదే ఆగిపోవడం జరుగుతుందంటున్నారు. కానీ మన రాష్ట్రంలో కొత్త రియాక్టర్లు ఖరీదైనవి కావడంతో పాతకాలం రియాక్టర్లనే కంపెనీలు కొనసాగిస్తున్నాయి. పాత రియాక్టర్ల స్థానే కొత్త రియాక్టర్లను బిగించుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. అప్పుడే ఇలాంటి ప్రమాదాలను అరికట్టగలమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎసెన్షియా ఫార్మాలో పేలుడు జరగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, విచారణలో ప్రమాద కారణాలు తెలియాల్సి ఉందంటున్నారు. ఇదీ చదవండి: మృత్యుఘోష.. అచ్యుతాపురం సెజ్‌లో భారీ విస్ఫోటంఅనుక్షణం అప్రమత్తత.. అచ్యుతాపురం సెజ్‌లో దాదాపు 208 ఫార్మా కంపెనీలు దాదాపు పక్కపక్కనే ఉన్నాయి. ప్రతి ఫార్మా పరిశ్రమలోనూ సామర్థ్యాన్ని బట్టి 2 నుంచి 10కి పైగా రియాక్టర్లు ఉంటాయి. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో హై టెంపరేచర్లో ద్రావకాలను మరిగించాల్సి ఉంటుంది. రియాక్టర్‌కు 140 డిగ్రీల సెల్సియస్ నుంచి 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకునే సామర్థ్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రియాక్టర్‌పై ఒత్తిడి పెంచే సమయంలో సంబంధిత నిపుణులు, కార్మికులు దానిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా.. రియాక్టర్లు వేడిని తట్టుకోలేక పేలిపోతుంటాయి. రియాక్టర్ టీమ్‌లో ఉండేవారు దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 140 డిగ్రీల నుంచి 180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పెరుగుతున్న సమయంలో వెంటనే దానిని చల్లబర్చాల్సి ఉంటుంది. రియాక్టర్లో రసాయనాల్ని బాయిల్ చేయడం ఆపివేయాల్సి ఉంటుంది. ఒత్తిడి తగ్గించే రప్చర్ డిస్్క, సేఫ్టీ వాల్వ్ రియాక్టర్ ప్రెజర్ కుక్కర్ మాదిరిగా పనిచేస్తుంటుంది. కుక్కర్లో ఎలా అయితే ఒత్తిడి పెరిగితే విజిల్ రూపంలో దాన్ని బయటికి పంపిస్తుంటుందో.. ప్రతి రియాక్టర్‌కు రప్చర్ డిస్్క, సేఫ్టీ వాల్వ్ ఉంటాయి. రియాక్టర్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఒత్తిడి ఎక్కువైనట్లు అనిపిస్తే.. రప్చర్ డిస్క్ ఓపెన్ అయి.. ప్రెజర్‌ని రిలీజ్ చేస్తుంటుంది. అది పనిచేయకపోతే సేఫ్టీ వాల్వ్ వెంటనే ఓపెన్ అయి.. ప్రెజర్‌ని బయటకు పంపించేస్తుంటుంది. ఈ రెండూ సక్రమంగా పనిచేస్తే ఏ రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉండదు. ఎసెన్షియాలో ఏం జరిగి ఉంటుంది? ఎసెన్షియాలో రియాక్టర్ నాణ్యమైనది కాకపోవడం వల్ల పేలిందా లేక రియాక్టర్లో ఒత్తిడి కారణంగా అనేది తెలియాల్సి ఉంది. రియాక్టర్లో రసాయనాలను మిశ్రమం చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతని బయట నుంచి పరిశీలించేందుకు టెంపరేచర్ గేజ్ ఉంటుంది. రియాక్టర్ తట్టుకునే ఉష్ణోగ్రతని దాటుతుందా లేదా అనేది ఇక్కడ పరిశీలిస్తుంటారు. అప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది దీన్ని పరిశీలించలేదా? లేదా ఆ సమయంలో ప్రెజర్ పెరిగితే రప్చర్ డిస్క్ ఓపెన్ అవ్వలేదా? పోనీ అది విఫలమయితే.. వెంటనే సేఫ్టీ వాల్ ఓపెన్ అవ్వాలి. ఈ మూడు జరగకపోతేనే రియాక్టర్ పేలుతుంది. ఇక్కడ అదే జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫార్మాలో నాలుగు రకాల రియాక్టర్లు ఫార్మా రంగంలో ప్రధానంగా చిన్న స్థాయి ఉత్పత్తి కోసం బాచ్ రియాక్టర్లు, ఉత్పత్తి నాణ్యతను నిరంతరం నిలిపి ఉంచడం కోసం కంటిన్యూ స్టిర్డ్–ట్యాంక్ రియాక్టర్లు, పెద్ద స్థాయి ఉత్పత్తి కోసం ప్లగ్ ఫ్లో రియాక్టర్లు, అధిక పీడనం, ఉష్ణోగ్రత అవసరం ఉండే వాటి కోసం ఆటోక్లేవ్ రియాక్టర్లను ఉపయోగిస్తారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయనాలను మిశ్రమం చేస్తున్నప్పుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణం, పీడనాన్ని నియంత్రించలేనప్పుడు, రియాక్టర్ల సరైన నిర్వహణ లేనప్పుడు, మానవ తప్పిదాలు ప్రమాదాలు జరగడానికి కారణమవుతున్నాయి. రియాక్టర్ల ప్రమాదాలను నియంత్రించాలంటే ఈ చర్యలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ డిజైన్– నిర్వహణ.. » రియాక్టర్లు, అవి ఉపయోగించే రసాయన ప్రతిక్రియలకు తగ్గట్టు డిజైన్ చేయాలి. అందుకు తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలి. » పరికరాల్లోని యాంత్రిక సమస్యలను గుర్తించడానికి, పరిష్కరించడానికి నిరంతర పరిశీలన, తగిన నిర్వహణ అవసరం. ఆధునిక నిఘా నియంత్రణ వ్యవస్థలు » ఉష్ణోగ్రత, పీడనం, ఇతర ముఖ్యమైన పారామితులను నిరంతరం ట్రాక్ చేసే ఆటోమేటెడ్ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను ముందే గుర్తించవచ్చు. » ‘ఎమర్జెన్సీ స్టాప్’ వ్యవస్థలు ఉండాలి. ఇవి ప్రమాదం సంభవించినప్పుడు ప్రతిక్రియలను సురక్షితంగా నిలిపివేయడానికి ఉపయోగపడతాయి. రసాయనాల నిల్వలో జాగ్రత్తలు » ప్రమాదకర రసాయనాల నిల్వ, నిర్వహణకు కఠినమైన ప్రోటోకాల్స్ పాటించాలి. » రసాయనాల లక్షణాలపై ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం లేదా అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు.నిరోధకాలు ఉపయోగించాలి.. » వేడిని గరిష్ట స్థాయి నుంచి తగ్గించే ఏర్పాట్లను వినియోగించుకోవడం అవసరం. ఉదాహరణకు కూలింగ్ జాకెట్లు లాంటివి వాడాలి. » కెమికల్ రియాక్షన్ వేగాన్ని తగ్గించడానికి నిరోధకాలు ఉపయోగించాలి. రియాక్షన్ కైనెటిక్స్ను సవరించడం ద్వారా అధిక ఉష్ణం ఉత్పత్తి అయ్యే పరిస్థితులను నివారించవచ్చు. ఉద్యోగ శిక్షణ, భద్రతా డ్రిల్లులు » రియాక్టర్ల ఆపరేషన్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానాలపై క్రమం తప్పకుండా సిబ్బందికి శిక్షణ అవసరం. అందుకు తగిన విధంగా శిక్షణ కార్యక్రమాలు ఉండాలి. » భద్రతా డ్రిల్లులు నిర్వహించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు వేగంగా, సమర్థంగా స్పందించవచ్చు. నెలకోసారి మెయింటెనెన్స్ డే నిర్వహించాలి ఫార్మా పరిశ్రమల్లో డ్రగ్స్ తయారీ సమయంలో వివిధ రసాయన మిశ్రమాలను రియాక్టర్లలో కలుపుతారు. ఈ సమయంలో ఆర్గానిక్ సాల్వెంట్స్ బాయిలింగ్ టెంపరేచర్ వద్ద త్వరగా ఆవిరైపోతుంటాయి. అప్పుడు రియాక్టర్లలో ఒత్తిడి పెరుగుతుంది. వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువైనా రియాక్టర్ పేలుతుంది. ఒక్కోసారి ప్రెజర్ మీటర్, సేఫ్టీ వాల్వ్ పనిచేయవు. ఆ సమయంలో సరిగా గమనించకపోతే రియాక్టర్ పేలిపోతుంది.అందుకే ప్రతి రోజూ సేఫ్టీ వాల్వ్ చెక్ చేస్తుండాలి. ఫార్మాలో పెద్ద పెద్ద రియాక్టర్లని స్థానికంగా స్టీల్ కొనుగోలు చేసి పరిశ్రమల్లోనే తయారు చేస్తుంటారు. ఈ సమయంలో జాయింట్స్‌ని వెల్డింగ్ చేస్తారు. రసాయన మిశ్రమాలు నిరంతరం జరుగుతున్నప్పుడు ఈ జాయింట్స్ వీక్ అవుతుంటాయి.ఒత్తిడి పెరిగినప్పుడు జాయింట్స్ సక్రమంగా లేకపోయినా పేలుడు జరుగుతుంది. అందుకే రియాక్టర్స్ జాయింట్స్‌ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రతి పరిశ్రమ నెలకోసారి మెయింటెనెన్స్ డే నిర్వహించి ఒకరోజు షట్‌డౌన్ చేయాలి. అప్పుడు ప్రతి విభాగాన్ని కచి్చతంగా తనిఖీ చేసుకోవాలి. అయితే పరిశ్రమలు ఇలా చేయడం లేదు. అందువల్లే ప్రమాదాలు తలెత్తుతున్నాయి. – ప్రొ.జి.నాగేశ్వరరావు,ఏయూ ఫార్మాస్యూటికల్ ప్రొఫెసర్, కోల్ ఇండియా డైరెక్టర్ -
బాధితులకు మెరుగైన వైద్యం అందించండి
సాక్షి, అమరావతి: అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని, ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుదని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులతో బుధవారం రాత్రి ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి, బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతకు ముందు ఈ ఘటనపై ఆయన అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హెల్త్ సెక్రటరీని తక్షణమే అచ్యుతాపురం వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వినియోగించాలని సూచించారు. కాగా, గురువారం ఘటన స్థలికి చంద్రబాబు వెళ్లనున్నారు. -
'అచ్యుతాపురం సెజ్' బాధితులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అచ్యుతాపురం సెజ్‌లో బుధవారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలాన్ని శుక్రవారం వైఎస్ జగన్ సందర్శించనున్నారు. గురువారం ప్రమాదస్థలానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో జగన్ శుక్రవారం ఘటనాస్థలికి వెళ్లనున్నట్టు వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం సాక్షి, అమరావతి: అనకాపల్లి ఫార్మాసెజ్ పేలుడు ఘటనలో క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేíÙయా అందించడంపై సదరు కంపెనీతో కలెక్టర్, ఇతర అధికారులు చర్చించామన్నారు. -
రియాక్టర్ ప్రమాదంలో కాకినాడ యువతి మృతి
కాకినాడ రూరల్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టరు పేలుడు ప్రమాదంలో కాకినాడ 2వ డివిజన్ సౌజన్యనగర్‌కు చెందిన చర్లపల్లి హారిక (22) మృతి చెందడంతో కాకినాడ నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హారిక బీటెక్ పూర్తి చేసి గత ఏడాది సెప్టెంబర్ నెలలో ట్రైనీ ఇంజినీర్‌గా ఫార్మా కంపెనీలో విధుల్లో చేరారు. ల్యాబ్‌లో పని చేస్తున్న ఆమె రియాక్టర్ పేలుడు ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందారు. హారిక తండ్రి తాపీమేస్త్రిగా పనిచేస్తూ చనిపోయారు. సోదరుడు పదేళ్ల వయసులోనే ఇంటి నుంచి తప్పిపోయాడు. తల్లి అన్నపూర్ణ, నాన్నమ్మ ఆదిలక్ష్మితో ఆమె కలిసి ఉంటోంది. కాకినాడ రమణయ్యపేట 2వ డివిజన్ మున్సిపల్ స్కూల్లో చదువుకున్న హారిక మెరిట్ స్టూడెంట్ కావడంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికై ంది. అక్కడ ఇంజినీరింగ్ చదివింది. కెమికల్ ఇంజినీరుగా ఫార్మా కంపెనీలో ఎంపికవ్వడంతో గత సెప్టెంబరు నుంచి ట్రైనీగా పని చేస్తోంది.ఉదయమే ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాని లోకాలకు..రెండు రోజుల పాటు సెలవుపై పరీక్షలు రాసేందుకు ఇంటికి వచ్చిన హారిక బుధవారం ఉదయం కాకినాడ నుంచి తిరిగి విధులకు వెళ్లింది. మధ్యాహ్నం విధుల్లో ఉండగా రియాక్టర్ పేలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లి అన్నపూర్ణ, నాన్నమ్మ ఆదిలక్ష్మి ప్రమాద స్థలం వద్దకు వెళ్లారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు సౌజన్య నగర్ చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ ఫార్మా సంస్థ ఉత్పత్తికి సిద్ధమైంది. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) స్కీం కింద లిఫియస్ పేరుతో అరబిందో గ్రూపు పెన్సులిన్ జి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెన్సులిన్ తయారీలో కీలక ముడిపదార్థంగా పెన్సులిన్ జి వినియోగిస్తారు. కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద 250 ఎకరాల్లో సుమారు రూ.2,205 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకొని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కర్మాగారంలో ఏటా 15,000 టన్నుల పెన్సులిన్ జి యూనిట్, 2,000 టన్నుల సామర్ధ్యంతో 7–ఏసీఏ యూనిట్‌ను అరబిందో గ్రూపు ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లో 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవడంతో లిఫియస్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ (బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ) కోర్సులు పూర్తి చేసిన వారిని వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు లిఫియస్ ప్రకటించింది. ఈ నెల 22న హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న మనోహర్ హోటల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫెర్మిటేషన్స్లో ప్రొడక్షన్, మైక్రోబయోలజీ రంగాల్లో నియామకాలకు తాజాగా కోర్సు పూర్తి చేసిన వారి (ఫ్రెషర్స్) దగ్గర నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తోంది. వాటర్ ట్రీట్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం నుంచి పదేళ్ల వారికి అవకాశం కల్పిస్తోంది. మరో రెండు ఫార్మా యూనిట్లు లిఫియస్కు సమీపంలోనే పీఎల్ఐ స్కీం కింద మరో రెండు ఫార్మా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. అరబిందో గ్రూపు క్యూలే పేరుతో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో 159 ఎకరాల్లో ఎరిత్రోమైసిన్ థియోసేనేట్ యూనిట్‌ని ఏర్పాటు చేస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 1,600 టన్నులు. దీనికి సమీపంలోనే దివీస్ సంస్థ ఓ ఫార్మా యూనిట్ ఏర్పాటు చేస్తోంది. దీని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూడు యూనిట్లతో కాకినాడ మేజర్ ఫార్మా హబ్‌గా ఎదగనుంది. -
అదిరిపోయే దివాలీ గిఫ్ట్: సంబరాల్లో కంపెనీ ఉద్యోగులు
హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ తన ఉద్యోగులకు రానున్న దీపావళికి కార్లను బహుమతిగా ఇచ్చింది. తన ఆఫీస్ హెల్పర్‌తో సహా 12 మంది ఉద్యోగులకు సరికొత్త టాటా పంచ్ కార్లను గిఫ్ట్‌గా అందించింది కంపెనీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు తన ఉద్యోగులే తనకు సెలబ్రిటీలు అని పేర్కొనడం విశేషంగా నిలిచింది. హర్యానా, పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్‌కార్ట్ ఛైర్మన్ కార్లను కానుకగా ఇచ్చారు. అంతేకాదు తమ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ఛైర్మన్ ఎంకె భాటియా. వారి అంకితభావం, కృషి తనను ముగ్ధుడ్ని చేసిందనీ, అందుకే వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కంపెనీ ఎన్నో ఒడిదుడుకులను చవి చూసింది అయినా ఉద్యోగులు తమతోనే ఉండి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని పేర్కొన్నారు. వాళ్లే తమ స్టార్స్ అంటూ భాటియా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అటు ఉద్యోగుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. కారు తాళాలను ఉద్యోగులిస్తున్న వీడియోను లింక్డ్ఇన్ పోస్ట్ చేశారు. కంపెనీ పట్ల వారి నిబద్ధతకు, విశ్వాసానికి గుర్తుగా నెల రోజుల క్రితమే కార్లు అంద జేశానని, అంతేకానీ దీపావళి సందర్బంగా ప్లాన్ చేసింది కాదంటూ వివరించారు. ఈ సమయంలో వార్తలు రావడం యాదృచ్చిక మన్నారు. అలాగే సమీప భవిష్యత్తులో మరో 38 మందికి కూడా ఈ గిప్ట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు మిట్స్‌కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే కలలో కూడా ఊహించని కార్లను బహుమతిగా అందుకోవడం పట్ల ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు.. వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా తెలియదట. టాటా పంచ్ టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్ 2021 లో లాంచ్ అయింది. టాటా పంచ్ అనేది ఎంట్రీ-లెవల్ మైక్రో SUV. ఈ వెహికల్ ప్రారంభ ధర సుమారు రూ. 6లక్షలు -
AP: సాగర తీరంలో ఐటీ వెలుగులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఐటీ సేవల హబ్‌గా మారేందుకు విశాఖపట్నానికి అన్ని అవకాశాలు, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టైర్ 1 సిటీగా విశాఖ రూపాంతరం చెందేందుకు ఇన్ఫోసిస్ రాక దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు 20 వేల మంది నేవీ ఉద్యోగులతో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా కూడా నిలిచిందని గుర్తు చేశారు. ఇక్కడ ఇప్పటికే రెండు పోర్టులున్నాయని త్వరలోనే మూడో పోర్టు సమీపంలోని శ్రీకాకుళంలో రానుందని తెలిపారు. మరో రెండేళ్లల్లో పూర్తిస్థాయి అంతర్జాతీయ పౌర విమానాశ్రయం కూడా సిద్ధం కానుందని చెప్పారు. పరిశ్రమలకు ఏ సహాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన సందర్భంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఫార్మా కంపెనీల నాలుగు యూనిట్లకు ప్రారంభోత్సవాలు, రెండు యూనిట్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. మొత్తం రూ.1,646 కోట్ల విలువైన ఐటీ కార్యాలయాలు, ఫార్మా యూనిట్ల ఏర్పాటుతో 3,450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో సముద్ర తీరం శుభ్రత కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలను కూడా ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖకు విశేష సామర్థ్యం.. విశాఖ నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్‌గా మారబోతోంది. ఆ స్ధాయిలో ఈ నగరానికి సహకారాన్ని అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం నగరానికి ఉన్నప్పటికీ అవన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయి. ఏపీలో విశాఖ అతిపెద్ద నగరం. టైర్ 1 సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం ఈ నగరానికి ఉన్నాయి. ప్రథమశ్రేణి నగరంగా ఎదగడానికి అవసరమైన తోడ్పాటును ఇన్ఫోసిస్ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నా. దాదాపు 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యం కలిగిన ఇన్ఫోసిస్‌తో పాటు టీసీఎస్, విప్రో లాంటి సంస్ధలు నగర ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి వేస్తాయి. విశాఖకు ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. విశాఖలో ఆదానీ డేటాసెంటర్ కూడా రాబోతుంది. సబ్‌మెరైన్ ఇంటర్నెట్ కేబుల్ మనకు ప్రత్యేకంగా సింగపూర్ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ రానుంది. క్లౌడింగ్‌తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. నీలాంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు లాంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీరంతా విశాఖ ఐటీలో కచ్చితంగా ఒకరోజు అద్భుతాలు సృష్టిస్తారని బలంగా విశ్వసిస్తున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇవాళ 1,000 మందితో ఇక్కడ ప్రారంభమైన ఇన్ఫోసిస్ రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఇన్ఫోసిస్‌తో కలసి ఐటీ రంగంలో విశాఖ బహుముఖ ప్రగతిని సాధిస్తుందన్న విశ్వాసం నాకుంది. రానున్న రోజుల్లో విశాఖలో పెట్టుబడులకు అనేక మంది ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటయ్యాయి. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 8 యూనివర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖ ఎడ్యుకేషన్ హబ్‌గా ఉంది. ఇక్కడి నుంచి ఏటా దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు డిగ్రీ పూర్తి చేసుకుని వస్తున్నారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖలో ఉన్నాయి. ఇదీ విశాఖ సామర్ధ్యం. ఇక్కడే ఐవోసీతోపాటు తూర్పు నౌకా దళం ప్రధాన కేంద్రం కూడా ఉంది. విశాఖ, గంగవరం లాంటి రెండు బలమైన పోర్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు శ్రీకాకుళంలో మూడో పోర్టు వస్తోంది. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత మధురవాడ ఐటీ హిల్స్‌లో రూ.35 కోట్లతో ఏర్పాటైన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్‌ని ప్రారంభించారు. సంస్థ ప్రాంగణమంతా పరిశీలించారు. అనంతరం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సముద్రతీర ప్రాంత శుభ్రత కోసం రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు. క్లీనింగ్ యంత్రాలపైకి ఎక్కి అవి ఎలా పనిచేస్తాయన్న వివరాలను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ తరువాత పరవాడ చేరుకుని రూ.500 కోట్లతో ఫార్మాసిటీలో 19.34 ఎకరాల్లో ఏర్పాటైన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ యూజియా స్టెరిలైజ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ ఏటా 420 మిలియన్ సామర్థ్యం కలిగిన జనరల్ ఇంజెక్టబుల్స్‌ను తయారు చేయనుంది. అనంతరం అచ్యుతాపురంలో లారస్ సంస్థ రూ.440 కోట్లతో నిర్మించిన ఫార్ములేషన్ బ్లాక్‌ను, రూ.191 కోట్లతో ఏర్పాటైన యూనిట్–2ను సీఎం ప్రారంభించారు. లారస్ రూ.240 కోట్లతో 450 మందికి ఉపాధి కల్పించేలా నిర్మించనున్న యూనిట్–3తో పాటు మరో రూ.240 కోట్లతో ఇదే సంస్థ పరవాడ వద్ద నిర్మించనున్న యూనిట్–7కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఫార్మా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా పరిపాలన రాజధానిగా శరవేగంగా ముస్తాబవుతున్న విశాఖకు అక్టోబర్‌కే తరలి వెళ్లాల్సి ఉన్నా కార్యాలయాలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం, విస్తృత భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల సూచనల మేరకు డిసెంబర్లో వెళ్లే అవకాశం ఉందని సీఎం సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్, వైస్ ప్రెసిడెంట్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, లారస్ సీఈవో సత్యనారాయణతో పాటు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజని, మేయర్ హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, కలెక్టర్ డా.మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 40 శాతం మహిళా ఉద్యోగులే 1981లో ఏర్పాటైన ఇన్ఫోసిస్ భవిష్యత్తు డిజిటల్ సేవలు, కన్సల్టింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉంది. 56 దేశాలలో 274 చోట్ల సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్ (నాస్డాక్) జాబితాలో భారత తొలి ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 71.01 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా 3,50,000 మంది ఉద్యోగులు పని చేస్తుండగా వీరిలో 40 శాతం మంది మహిళా ఉద్యోగులే కావడం గమనార్హం. 2023లో ప్రపంచంలో అత్యంత నైతికత (ఎథికల్) సంస్థలలో ఒకటిగా ఇన్ఫోసిస్ గుర్తింపు పొందింది. టైమ్ మ్యాగజైన్ టాప్ 100 ప్రపంచ అత్యుత్తమ సంస్థలు 2023 జాబితాలో ఉన్న ఏకైక భారతీయ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ 2023 సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకుంది. అలల ప్రేరణతో కార్యాలయం టాలెంట్ స్ట్రాటజీలో భాగంగా ప్రతిభా కేంద్రాలకు దగ్గరగా డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్దేశించుకుంది. మంగళూరు, మైసూర్, త్రివేండ్రం, నాగ్‌పూర్, ఇండోర్, జైపూర్, హుబ్లీ, చండీగఢ్, భువనేశ్వర్, కోయంబత్తూర్ లాంటి టైర్ 2 నగరాల్లో డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా విశాఖలో సేవలను ప్రారంభించింది. మధురవాడలోని ఐటీ హిల్ నం.2లో ఉన్న సిగ్నిటివ్ టవర్స్‌లో లీజుకు తీసుకున్న బిల్డ్ అప్ స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విశాఖకు సహజ అందాలను తీసుకొచ్చిన సముద్రపు అలల ప్రేరణతో కార్యాలయంలోని ఇంటీరియర్ డిజైన్ రూపొందించారు. జావా, జే2ఈఈ, శాప్, డేటాసైన్స్, డేటా అనలటిక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ – యుటిలిటీ, రిటైల్ సహా బహుళ పరిశ్రమలకు ప్రపంచవ్యాప్తంగా క్లెయింట్స్ సేవలను ఈ కేంద్రం నుంచి అందిస్తారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులలో సింహభాగం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కాగా మరింత మంది నియామకం కోసం విశాఖలోని వివిధ కళాశాలలతో ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ రాక విశాఖలో ఐటీ పరిశ్రమ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఉన్న బీపీవో/కేపీవో పరిశ్రమలతో పాటు కోర్ ఐటీ కంపెనీలతో కలసి ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ అడుగులు వేసేందుకు దోహదం చేయనుంది. -
కంపెనీలు తేవడం ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్ / శామీర్‌పేట / మర్కూక్ (గజ్వేల్): రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా తెలంగాణకు అనేక దేశ, విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే, దానివెనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు పడే శ్రమ చాలా ఎక్కువని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో గురువారం ఫార్మా కంపెనీ భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ జీవశాస్త్ర రంగ అభివృద్ధికి, ప్రోత్సాహానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితమే కొత్త కొత్త కంపెనీల రాక అని చెప్పారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న బీఎస్వీ కర్మాగారం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు తయారు కానుండటం హర్షణీయమైన అంశమన్నారు. జినోమ్ వ్యాలీలో అంచనాలకు మించి వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో దీనిని మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే 130 ఎకరాల భూమి అదనంగా సేకరించగా, 250 ఎకరాలతో మలిదశ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు ఈవీ నరసింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, బీఎస్వీ ఎండీ, సీఈఓ సంజీవ్ నవన్‌గుల్ పాల్గొన్నారు. యూరోఫిన్స్ కేంద్రం ప్రారంభం బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న యూరోఫిన్స్ బయో ఫార్మా సర్విసెస్ హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో తన కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది.వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధమైన ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు బయో అనలిటికల్ సర్విసెస్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, సేఫ్టీ టాక్సికాలజీ, డిస్కవరీ కెమిస్ట్రీ అండ్ డిస్కవరీ బయాలజీ వంటి సేవలు అందించే యూరోఫిన్స్ కేంద్రం 15 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరోఫిన్స్ కేంద్రం ద్వారా రానున్న కాలంలో రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారు అవుతున్నాయని, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఎక్కడికెళ్లినా ధైర్యంగా చెబుతానన్నారు. ఇక్కడ ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూరోఫిన్స్ రీజనల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్‌ఆర్‌వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్‌కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్‌లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్‌జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
ఫార్మసీ బిజినెస్‌లోకి అంబానీ: మందులు అమ్మనున్న రిలయన్స్!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని భారీ వ్యాపార సమ్మేళనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited) వివిధ రంగాలకు విస్తరిస్తోంది. పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్రాండ్లను భారత్‌కు తీసుకొస్తోంది. వాటితో భాగస్వామ్యం చేసుకుని విభిన్న వ్యాపారాల్లోకి అడుగు పెడుతోంది. ఈసారి యూకేకి చెందిన వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ (Walgreens Boots Alliance Inc) అనే భారీ ఫార్మాస్యూటికల్ కంపెనీతో ఒప్పందాన్ని చేసుకుంటోంది. భారీ మొత్తంలోనే ఆఫర్ వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ అనేది యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ. దీన్ని కొనుగోలు చేసి మెడికల్ స్టోర్లు, ఫార్మా వ్యాపారాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ మేరకు వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని దానికి సంబంధించిన అంతర్జాతీయ మెడిస్టోర్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందు కోసం యూకే కంపెనీకి అంబానీ భారీ మొత్తంలోనే ఆఫర్ చేసినట్లు తెలిసిందని బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది. కన్సార్టియం ఏర్పాటు ఔట్లుక్, ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్, యూఎస్‌లో ఉన్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ చైన్ స్టోర్లను కొనుగోలు చేయడానికి యూఎస్ ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఐఎన్‌సీ సంస్థతో ఒక కన్సార్టియంను ఏర్పాటు చేస్తోంది. ఫార్మా బ్రాండ్ స్టోర్లను కొనుగోలు చేయడానికి వాల్గ్రీన్స్తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న రిలయన్స్ ఇందు కోసం భారీ మొత్తాన్ని ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాల్‌గ్రీన్స్ కంపెనీ విలువ సుమారు 6.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 53,600 కోట్లు. కష్టాల్లో ఉన్న వాల్‌గ్రీన్స్ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని ఆన్లైన్ మార్కెట్లకు విస్తరించినప్పటి నుంచి వాల్‌గ్రీన్స్ కష్టాల్లో ఉంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఒప్పందం కుదిరితే, ఈ కంపెనీ తమ సంస్థలో స్వల్ప వాటాను మాత్రమే కలిగి ఉంటుంది. మెజారిటీ రిలయన్స్ నియంత్రణలో ఉంటుంది. రిలయన్స్-వాల్‌గ్రీన్స్ ఒప్పందం విజయవంతమైతే, ముఖేష్ అంబానీ ఈ యూకే కంపెనీని భారతదేశంలో కంపెనీని పరిచయం చేసి ఆన్లైన్ డ్రగ్ స్టోర్ల ద్వారా లాభాలను పెంచుతారని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న టాటా 1ఎంజీ, అపోలో ఫార్మసీ వంటి వాటికి గట్టి పోటీ తప్పదు. కాగా గత సంవత్సరంలోనే ముఖేష్ అంబానీ యూకే కంపెనీ ఈ ఆఫర్ చేశారు. దీనిపై వాల్‌గ్రీన్స్ బూట్స్ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: IPL 2023: ఫ్రీగా చూపించినా.. వేల కోట్లు సంపాదించారు! -
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఏడుగురికి గాయాలు
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. సాహితీ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులకు కింగ్‌జార్జ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంపెనీలోని రెండు రియాక్టర్లు పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. సాహితీ ఫార్మా కంపెనీలోప్రమాదం జరిగిందన్నారు. సమాచారం రాగానే తమ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కంపెనీలో 35 మంది కార్మికులు విధుల్లో ఉండగా.. 28 మంది బయటకు వచ్చేశారని పేర్కొన్నారు. ఏడుగురికి తీవ్ర గాయలవ్వగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో రెండు గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు. విషమంగానే పరిస్థితి సాహితీ ఫార్మా కంపెనీలో గాయపడిన వారందరి పరిస్థితి విషమంగా ఉందని కింగ్‌జార్జ్ ఆసుపత్రి సూపరిండెంట్ శివానంద తెలిపారు. మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వారందరికీ దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోయిందని చెప్పారు. మొదట ముగ్గురిని ఆసుపత్రికి తీసుకొచ్చారని తరువాత కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మిగతా నలుగురిని కూడా అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఇక్కడికి షిఫ్ట్ చేశారని తెలిపారు. క్షతగాత్రులను బర్నింగ్ వార్డుకు షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు. గాయపడిన వారి వివరాలు.. ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన రమేష్ (45),రాంబిల్లి మండలం జనగాలపాలేనికి చెందిన సత్తిబాబు (35), రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెం వాసి నూకి నాయుడు (40), విజయనగరానికి చెందిన తిరుపతికి(40)తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం రెబ్బాకకు చెందిన రాజుబాబు, నక్కపల్లికి చెందిన అప్పారావు (43), అనకాపల్లి జిల్లా కొండకొప్పాకకు చెందిన పిల్లా సంతోష్ కుమార్, గాయపడ్డారు. -
తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమన్! ఎవరీ మహిమా?
హైదరాబాద్‌కు చెందిన మహిమా దాట్ల, ఆమె కుటుంబం రూ.8,700 కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులుగా అవతరించారు. ఇంతకీ ఎవరీమె? వారి కుటుంబం చేస్తున్న వ్యాపారం ఏంటి? ఏ సంస్థకు వారు అధినేతలు? వంటి విషయాలు తెలుసుకుందాం... ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే.. స్ఫూర్తిదాయకమైన యువ వ్యాపారవేత్త మహిమా దాట్ల ఐఐఎఫ్ఎల్ (IIFL) వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యంత సంపన్న మహిళగా అవతరించారు. మహిమా దాట్ల, ఆమె కుటుంబ నికర విలువ రూ. 8,700 కోట్లుగా అంచనా. ఏపీ, తెలంగాణలోని సంపన్నుల జాబితాలో ఆమె 10వ స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ 2021 వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ఆమె నెట్‌వర్త్ రూ. 7,700 కోట్లు ఉండగా 2022లో ఆమె సంపద విలువ రూ. 1,000 కోట్లు పెరిగింది. ఫార్మా రంగంలో తిరుగులేని నాయకత్వం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ లిమిటెడ్ (Biological E Ltd)కి మహిమా దాట్ల ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. వారి కుటుంబంలో మూడవ తరం వ్యాపారవేత్త. వ్యాక్సిన్ వ్యాపారంలో ఆమె తనదైన ముద్రను చూపించారు. కరోనా మహమ్మారి సమయంలో Corbevax కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మహిమా నాయకత్వంలోని బయోలాజికల్-ఈ సంస్థ అప్పట్లో వార్తలో నిలిచింది. ఆమె కుటుంబం 1948లో ఫార్మా వ్యాపారాన్ని స్థాపించింది. హెపారిన్ ఔషధాన్ని భారతదేశానికి తీసుకువచ్చింది వీరి సంస్థే. అయితే లండన్‌లో వెబ్‌స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన మహిమా కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. తండ్రి మరణంతో.. 2013లో ఆమె తండ్రి విజయ్ కుమార్ దాట్ల మరణించడంతో ఆమె కంపెనీ పగ్గాలు చేపట్టారు. మహిమా దాట్ల ఆధ్వర్యంలో బయోలాజికల్-ఈ తన వ్యాక్సిన్లను 100 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తోంది. గత దశాబ్దంలో 200 కోట్లకు పైగా డోస్‌లను అందించింది. దీని పోర్ట్‌ఫోలియోలో మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫైడ్ వ్యాక్సిన్లు ఏడు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ల తయారీలో అతిపెద్ద సంస్థ. ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్
ప్రముఖ కండోమ్ బ్రాండ్ మేన్‌కైండ్ ఫార్మా ఏప్రిల్ 25న ఐపీఓకు రానుంది. దేశీయంగా మేన్‌ఫోర్స్ కండోమ్‌లు, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్ల విక్రయాలతో పాపులర్ బ్రాండ్‌గా పేరొందింది. మెడికల్ సేల్స్‌మెన్స్‌గా మొదలై రూ.43,264 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దిన జునేజా సోదరుల సక్సెస్ స్టోరీ.. ఢిల్లీకి చెందిన డ్రగ్ కంపెనీ, కండోమ్ మేకర్ మేన్‌కైండ్ ఫార్మా రూ. 4,326 కోట్ల పబ్లిక్ ఆఫర్‌ని ఏప్రిల్ 25న ప్రారంభించి, ఏప్రిల్ 27న ముగించడానికి సిద్ధంగా ఉంది. అనిశ్చిత ఆర్థికపరిస్థితుల మధ్య 2023లో ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన ఏడో ఐపీఓ ఇది. మెడికల్ సేల్స్మెన్లా ప్రయాణం మొదలుపెట్టి రూ. 43,264 కోట్లకు చేర్చారు రమేష్ జునేజా, రాజీవ్ జునేజా. జునేజా సోదరులుగా పేరొందిన వీరు ఒంటరిగానే మొదలు పెట్టారు. పట్టుదలతో, మొక్కవోని దీక్షతో కంపెనీని అద్భుత స్థాయికి తీసుకొచ్చారు. ముఖ్యంగా 90వ దశకంలో బాలీవుడ్ స్టార్లతో ఆకర్షణీయమైన ప్రకటనలతో మధ్య తరగతిని ఆకర్షించడంలో జునేజా సోదరుల మేనేజ్మెంట్ స్కిల్స్, కార్పొరేట్ వ్యూహం నిదర్శనంగా నిలిచింది. అతితక్కువ సమయంలోనే విక్రయాల్లో దూసుకు పోతూ దిగ్గజాలకు దడ పుట్టించారు. ఛైర్మన్ రమేష్ సీ జునేజా 1974లో కీఫార్మా అనే కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత ఫార్మా దిగ్గజం లుపిన్‌లో ఎనిమిదేళ్లు పనిచేశారు. 1994లో తను స్థాపించిన కంపెనీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1995లో తన సోదరుడు రాజీవ్ జునేజాతో కలిసి మేన్కైండ్ని ప్రారంభించారు. ఇందుకు వారి ప్రారంభ పెట్టుబడి రూ.50 లక్షలు మాత్రమే. 25మంది వైద్య ప్రతినిధులతో సంస్థను ప్రారంభించారు. ఇపుడు దేశవ్యాప్తంగా 25 తయారీ కేంద్రాలతో, 600 మందికిపైగా శాస్త్రవేత్తల బృందంతో పనిచేస్తోంది. అతిపెద్ద నెట్‌వర్క్‌తో నాలుగు యూనిట్లలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నడుపుతోంది. 2022లో ఫోర్బ్స్ డేటా ప్రకారం 34500 కోట్ల రూపాయల నికర విలువ జునేజా సోదరుల సొంతం. మేన్ కైండ్ ఫార్మా మార్కెట్ క్యాప్ రూ.43,264 కోట్లు. దేశీయ విక్రయాల పరంగా ఇది భారతదేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ. గత సంవత్సరం, డిసెంబర్ 2022 నాటికి, దాని ఏకీకృత లాభం రూ.996.4 కోట్లు. తొలి తొమ్మిది నెలల ఆదాయం రూ.6697 కోట్లు. మ్యాన్‌ఫోర్స్ కండోమ్ బ్రాండ్ రూ. 462 కోట్లకు పైగా దేశీయ విక్రయాలతో ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉందని పేర్కొంది. ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ల విక్రయం రూ. 184.40 కోట్లు. ముఖ్యంగా కంపెనీ నెట్వర్క్ విస్తరణకు, విజయానికి కారణం కంపెనీ సీఈవోగా రాజీవ్ జునేజా. రమేష్ జునేజా సైన్స్ గ్రాడ్యుయేట్ కాగా, రాజీవ్ కాలేజీ డ్రాప్ అవుట్. అలాగే జునేజా సోదరుల మేనల్లుడు అర్జున్, ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్యవేక్షిస్తుండగా. మరో మేనల్లుడు శీతల్ అరోరా, గైనకాలజీ, డెర్మటాలజీ డ్రగ్స్ మార్కెటింగ్ విభాగం లైఫ్స్టార్ను బాధ్యతలను చూస్తుండటం విశేషం.కంపెనీ వివిధ తీవ్రమైన, దీర్ఘకాలిక చికిత్సలకు సంబంధించి పలు ఫార్మ ఫార్ములేషన్స్తోపాటు, అనేక వినియోగదారు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఐపీఓ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా 40,058,844 ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్సీ రెండింటిలోనూ జాబితా చేయాలని ప్రతిపాదించింది. ప్రమోటర్లలో సహ వ్యవస్థాపకులు రమేష్ జునేజా , రాజీవ్ జునేజా, సీఈవో శీతల్ అరోరా, కెయిర్న్‌హిల్ CIPEF, కెయిర్న్‌హిల్ CGPE, బీజ్ లిమిటెడ్ ,లింక్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉన్నారు. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,026 1,080గా నిర్ణయించారు. కంపెనీ షేర్లు మే 3న ఇన్వెస్టర్లకు కేటాయించిన తరువాత మే 8న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. Autism is a development disorder where children have problems with social communication and interaction, restricted or repetitive behaviors or interests. Let's learn more about Autism and bridge the gap created by social stigma. #AutismAwarenessDay #MankindPharma #ServingLife pic.twitter.com/5WPKIqvIUi — Mankind Pharma (@Pharma_Mankind) April 2, 2023 -
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
-
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. -
తెలంగాణ ప్రభుత్వంతో బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ ఫార్మా కంపెనీ ఒప్పందం
-
సంగారెడ్డి: ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికులకు గాయాలు!
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని గడ్డిపోతారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. గడ్డిపోతారం ఇండస్ట్రీయల్ ప్రాంతంలో ఉన్న లీ ఫార్మా కంపెనీలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ల వద్ద మంటలు చెలరేగాయి. దీంతో, పరిశ్రమలో ఉన్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగిసిపడటంతో అదుపు చేసేందుకు స్థానికులు, కార్మికులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
వివాదాస్పద మైడెన్కు భారీ షాక్:అక్టోబరు 14 వరకు గడువు
సాక్షి,ముంబై: వివాదాస్పద దేశీయ ఫార్మ కంపెనీ మైడెన్ ఫార్మాకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీ ఉత్పత్తి చేసే దగ్గు మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ హరియాణా ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోనెపట్‌లోని దాని తయారీ ప్లాంట్‌లో తనిఖీల అనంతరం హరియాణా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్, లైసెన్సింగ్ అథారిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌తో సంయుక్త తనిఖీ తర్వాత హర్యానా డ్రగ్ అధికారులు మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు ఈ నోటీసులిచ్చింది. సంస్థ డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ ప్రొపైలిన్ గ్లైకాల్ నాణ్యత పరీక్షను నిర్వహించలేదని, సంబంధిత పత్రాలు కూడా సక్రమంగా లేవంటూ ఫార్మా కంపెనీ అక్టోబర్ 14 లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలి, లేని పక్షంలో దానిపై చర్య తీసుకుంటామని అక్టోబరు 7న జారీ చేసిన నోటీసుల్లో తెలిపింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, హర్యానా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 రూల్స్, 1945 రూల్ 85(2) ప్రకారం న్యూ ఢిల్లీలోని మైడెన్ ఫార్మాకు నోటీసులిచ్చింది. తమ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో కంపెనీ తయారీ లైసెన్స్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించిన రాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మైడెన్ ఫార్మాను ఆదేశించింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అథారిటీ, హరియాణా ఎఫ్‌డీఏ మన్మోహన్ తనేజా తెలిపారు.ప్రొపైలిన్ గ్లైకాల్ (బ్యాచ్ నంబర్ E009844) తయారీ తేదీ సెప్టెంబర్ 2021, గడువు తేదీ సెప్టెంబరు 2023ని ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌ల తయారీలో ఉపయోగించినట్టు కనుగొంది. అలాగే నవంబర్ 2024 నాటికి, ఉత్పత్తి షెల్ఫ్-లైఫ్ ముడి పదార్థం కంటే ఎక్కువ అని తేలింది. కాగా ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మైడెన్ దగ్గు సిరప్‌లపై హెచ్చరికలు జారీ చేసింది. మైడెన్ ఫార్మా ఉత్పత్తులు ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ సిరప్స్లోని నాణ్యత లేని, కలుషితమైన పదార్థాలే పిల్లల మరణాలకు కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్) -
మ్యాన్‌కైండ్ ఫార్మా: అతిపెద్ద ఐపీవో బాట
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా తాజాగా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా రూ. 5,500 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. (Akasa Air: వారానికి 250కి పైగా ప్లయిట్స్) కంపెనీ వివిధ విభాగాలలో ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల తయారీ, అభివృద్ధి, మార్కెటింగ్‌లను చేపడుతోంది. కన్జూమర్ హెల్త్‌కేర్ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. ప్రమోటర్లు రమేష్, రాజీవ్ జునేజాతోపాటు షీతల్ అరోరా కోటి షేర్లకుపైగా షేర్లను విక్రయించనుండగా.. ఇన్వెస్టర్ సంస్థ కెయిర్న్‌హిల్ సీఐపీఈఎఫ్ 1.74 కోట్ల షేర్లు, కెయిర్న్‌హిల్ సీజీపీఈ దాదాపు కోటి షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఇదీ చదవండి: లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. కాగా.. ఈ ఏడాది మొదట్లో మెక్‌లాయిడ్స్ ఫార్మా రూ. 5,000 కోట్ల సమీకరణకు ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అయితే కంపెనీ విలువ విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హెల్త్‌కేర్ విభాగం(2020 నవంబర్)లో గ్లాండ్ ఫార్మా రూ. 6,480 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోకు తెరతీసిన సంగతి తెలిసిందే. -
ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’
గచ్చిబౌలి: ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం లాల్గాడి మలక్‌పేట్‌లోని జినోమ్ వ్యాలీ, ఫార్మా లైఫ్ సైన్సెస్ నుంచి అల్వాల్ వరకు ఎస్సీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చిన 3వ షీ షటిల్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే భద్రత వ్యవస్థలో మహిళా ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం అల్వాల్ నుంచి లాల్‌గడీ మలక్‌పేట్, తుర్కపల్లి నుంచి జనోమ్ వ్యాలీ వరకు నడుస్తుందన్నారు. ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఏదుల మాట్లాడుతూ... ఐటీ, ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఇప్పటి వరకు 12 షీ షటిల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
‘ఫెమ్ టెక్’ గమ్యస్థానం.. హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఉన్న ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి వంద బిలియన్ డాలర్లకు చేర్చడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో జీనోమ్ వ్యాలీ.. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో పవర్‌హౌస్‌గా మారుతోందన్నారు. దీంతో ప్రపంచంలోని ప్రముఖ పరిశోధన, అభివృద్ధి సంస్థలు హైదరాబాద్‌కు పెట్టు బడులతో వస్తున్నాయని చెప్పారు. స్విట్జ ర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్ టీఎస్ఐఐసీ బయోటెక్ పార్క్ లో ఏర్పాటుచేసిన కొత్త సమీకృత పరిశోధన, అభివృద్ధి, తయారీ యూనిట్‌ను కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ఇటీవలి తన అమెరికా పర్యటనలో వివిధ రంగాల్లో రూ.7,500 కోట్ల పెట్టుబడులు సాధించగా, అందులో సగం లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాలకు చెందినవే ఉన్నాయన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ రంగంలో పరిశోధన, తయారీ పరిశ్రమలకు (ఫెమ్ టెక్) హైదరాబాద్ అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతోందన్నారు. పుణేకు చెందిన భారత్ సీరమ్ వాక్సిన్ కంపెనీ త్వర లో రూ.200 కోట్ల పెట్టుబడితో ఇంజెక్టబుల్, వాక్సిన్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఈ సంస్థ మహిళల ఆరోగ్య రక్షణ ఉత్పత్తులతో పాటు రేబిస్ వ్యాక్సిన్ తదితరాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. 30 మిలియన్ యూరో(సుమారు రూ. 245కోట్లు)ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ గర్భధారణ మొదలు ప్రసవం వరకు అవసరమైన ఔష ధాలు, చికిత్స విధానాలను అభివృద్ధి చేస్తుం దని చెప్పారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఫార్మా, హెల్త్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఫెర్రింగ్ ఫార్మా ఉపాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోసెట్టె, ఎండీ అనింద్య ఘోష్ పాల్గొన్నారు. ఆవిష్కరణలో ముందంజ.. ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ దూసుకుపోతోందని.. డిజైన్ థింకింగ్, ఆవిష్కరణలు, పరిజ్ఞానంలో కొత్త తీరాలను తాకుతోందని కేటీఆర్ అన్నారు. అడ్మినిస్ట్రేటవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో తెలంగాణ ‘వాష్ ఇన్నోవేషన్ హబ్’(డబ్ల్యూఐహెచ్)ను ఏర్పాటు చేసిందన్నారు. వాష్ ఇన్నోవేషన్ హబ్ లోగోను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. వాష్ ఇన్నోవేషన్ హబ్ నిర్వహించే ఐNఓఃగిఅ ఏ 3.0 వార్షిక ఉత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో జరిగే ఈ ఉత్సవంలో ఔత్సాహిక ఆవి ష్కకర్తలు పాల్గొనాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. స్టార్టప్‌లు, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వా మ్యంతో వాష్ ఇన్నోవేషన్ హబ్ పని చేస్తుం దన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్దేశిం చుకున్న ప్రమాణాలను చేరుకునేందుకు ప్రభుత్వం వాటర్, శానిటేషన్, హైజీన్ (వాష్)కు ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించారు. -
ట్రామాడోల్.. తరలింపులో గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ తరలింపులో ఫార్మా కంపెనీ బండారం బయటపడింది. పేరు లూసెంట్. అనుమతులు లేకుండా పాకిస్తాన్‌కు ట్రామాడోల్ డ్రగ్‌ను ఎగుమతి చేస్తున్న లూపెంట్ ఫార్మా కంపెనీ ఎండీతోపాటు మరో నలుగురిని బెంగుళూర్ రీజియన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డికి చెందిన లూసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ట్రామాడోల్‌ను ఉత్పత్తి చేసి డెన్మార్క్, జర్మనీ, మలేషి యాకు ఎగుమతి చేసేందుకు అనుమతి కలిగి ఉంది. కానీ, ఆ దేశాలకు తరలించిన ట్రామాడోల్‌ను అక్కడి నుంచి పాకిస్తాన్‌కు చేరవేస్తున్నట్టు ఎన్ సీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా బెంగళూర్ ఎన్సీబీ అధికారులు కేసు నమోదు చేసి.. సంగారెడ్డికి చెందిన ఫార్మా కంపెనీలపై రెండురోజుల క్రితం దాడులు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. గత ఏడాది ఈ ఫార్మా సంస్థ 25 వేల కిలోల ట్రామాడోల్‌ను జర్మనీ, డెన్మార్క్, మలేషియా ద్వారా పాకిస్తాన్‌కు చేరవేసినట్టు కనుగొన్నారు. ట్రామాడోల్ తయారీకి అనుమతి పొందిన అసిటిక్ అన్హైడ్రైడ్ డ్రగ్ లెక్కల్లో 3.5 కిలోల తేడా గుర్తించినట్టు ఎన్సీబీ అధికార వర్గాలు వెల్లడించాయి. దుష్పరిణామాలు ఇవీ..: ట్రామాడోల్ అనేది పెయిన్ కిల్లర్. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మూర్చ, స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉందని.. మెదడుతో పాటు హృదయం పై దుష్పరిణామాలు పడుతాయని ఎన్సీబీ అధికారులు చెప్పారు. హెరాయిన్ లాంటి ప్రమాదరకరమైన డ్రగ్స్ తయారీకి ఈ ఎసిటిక్ అన్హైడ్రైడ్ కీలక ముడిసరుకని ఎన్సీబీ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలోనూ ఇదే తరహా.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మూసేసిన, తక్కువ స్థాయిలో డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు ఇలాంటి దందాలకు పాల్పడుతున్నట్టు ముంబై, బెంగళూర్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విభాగాలు స్పష్టం చేశాయి. గత అక్టోబర్, నవంబర్‌లో గోవాలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఇదివరకు పిల్లో కవర్లలో భారీస్థాయి డ్రగ్స్ రవాణా చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రగ్స్ పట్టుబడటం సంచలనం రేపింది. నిఘా సంస్థలు, ఫార్మా విభాగపు దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యం వల్లే ప్రమాదకరమైన డ్రగ్స్ అనుమతి లేకుండా పాకిస్తాన్‌కు తరలుతున్నాయని వాదనలున్నాయి. -
జైడస్ చేతికి న్యులిబ్రీ ఔషధం
న్యూఢిల్లీ: యూఎస్ కంపెనీ బ్రిడ్జ్బయో ఫార్మా నుంచి ఫాస్డోనొప్టె రిన్(న్యులిబ్రీ) ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు అనుబంధ సంస్థ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెల్త్‌కేర్ దిగ్గజం జైడస్ లైఫ్‌సైన్సెస్ తాజాగా పేర్కొంది. సెంటిల్ థెరప్యూటిక్స్ ఇంక్ నుంచి ఈ ఇంజక్షన్ ఔషధ బ్రాండును సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు అసెట్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసినట్లు వెల్లడించింది. ఎంవోసీడీ టైప్-ఏ వ్యాధిగ్రస్తుల చికిత్సకు వినియోగించగల ఈ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులున్నట్లు పేర్కొంది. శిశువుల్లో అత్యంత అరుదుగా కనిపించే జెనెటిక్ సంబంధ ఈ వ్యాధి మరణాలకు దారితీయవచ్చని కంపెనీ వివరించింది. ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం యూఎస్‌లో న్యులిబ్రీ ఔషధ అభివృద్ధి, కమర్షియలైజేషన్ బాధ్యతలతోపాటు.. అంతర్జాతీయంగానూ అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌ను సైతం సెంటిల్ చేపడుతుందని జైడస్ వివరించింది. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
హైగ్రో కెమికల్స్ రూ.1.93 కోట్ల ఎఫ్‌డీల జప్తు
సాక్షి, హైదరాబాద్: ఫార్మా కంపెనీ పేరుతో మత్తు పదార్థాల తయారీ కోసం నిబంధనలకు విరుద్ధంగా ముడిసరుకును సరఫరా చేసిన హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ కంపెనీకి చెందిన రూ.1.93 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)ను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. మెదక్ జిల్లా బొల్లారంలో ఉన్న ఈ కంపెనీ డెక్స్ట్రో ప్రొపాక్సీపిన్ హైడ్రోక్లోరైడ్ అనే ముడిసరుకును ఢిల్లీకి చెందిన జేకే ఫార్మాకు అక్రమంగా నార్కోటిక్ డ్రగ్స్ తయారీకి తరలించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గతేడాది కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ లింకులో దర్యాప్తు చేసిన ఈడీ.. కంపెనీ అకౌంట్లోకి వచ్చిన రూ.1.93 కోట్లను గుర్తించింది. ఈ డబ్బును సంబంధిత కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా, ఆ డిపాజిట్‌ను జప్తు చేసినట్లు తెలిపింది. ఈ ముడిసరుకును కేజీ రూ.3 వేల చొప్పున జేకే ఫార్మాకు అక్రమ పద్ధతిలో అమ్మడంతో పాటు 26 ఎయిర్ వే బిల్లులను లెక్కల్లో చూపించలేదని ఈడీ స్పష్టంచేసింది. -
‘ఫ్లో కెమిస్ట్రీ’తో వినూత్న ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల పురోగతిని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దీనికోసం ఫార్మా దిగ్గజాలతో కలిసి ఫ్లో కెమిస్ట్రీలో కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రం స్థాపన వల్ల ఫార్మారంగంలో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణలు ఊపందుకుంటాయి. ఔషధ రంగ పరిశోధన, అభివృద్ధిలో ఫ్లో కెమిస్ట్రీ సాంకేతికతను చొప్పించడం ద్వారా ఔషధాల తయారీలో కీలకమైన ముడి రసాయనాల (ఆక్టివ్ ఫార్మా ఇంగ్రిడియెంట్స్)ను నిరంతరం తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది. సీఓఈ ఏర్పాటుకు ముందుకొచ్చిన కన్సార్టియంతో ప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై జీవీ ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్), డాక్టర్ సత్యనారాయణ చావా (లారస్ ల్యాబ్స్), శక్తి నాగప్పన్ (లైఫ్ సైన్సెస్ డైరెక్టర్)తోపాటు డాక్టర్ శ్రీనివాస్ ఓరుగంటి (డాక్టర్ రెడ్డీస్ లైఫ్‌సైన్సెస్ ఇనిస్టిట్యూట్) సంతకాలు చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ ఆవరణలో ఏర్పాటయ్యే ఈ కేంద్రానికి డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్ నుంచి నిధులు, ఇతర సహకారం లభిస్తుంది. సీఓఈలో జరిగే పరిశోధనలకు పేరొందిన శాస్త్రవేత్తలు మార్గదర్శనం చేస్తారు. ఫ్లో కెమిస్ట్రీలో నైపుణ్యం, నిరంతర ఉత్పత్తి ద్వారా లబ్ధిపొందేందుకు ఈ కన్సార్టియంలో మరిన్ని పరిశ్రమలు చేరి లబ్ధిపొందేలా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు: కేటీఆర్ పరిశోధన, అభివృద్ధి మొదలుకుని ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు అవలంబించడంతోపాటు కాలుష్యరహిత, సుస్థిర విధానాల వైపు దేశీయ ఔషధ తయారీ రంగం మళ్లేందుకు ‘ఫ్లో కెమిస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’పేరిట ఏర్పాటయ్యే హబ్ దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఓఈ ఏర్పాటులో డాక్టర్ రెడ్డీస్, లారస్ ల్యాబ్స్ ఎనలేని సహకారం అందించాయని కితాబునిచ్చారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యతను కాపాడుకుంటూనే మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఫ్లో కెమిస్ట్రీ సీఓఈ ఏర్పాటు మైలురాయి వంటిదని, రాష్ట్రంలో ఈ రంగాన్ని 2030 నాటికి వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లైఫ్ సైన్సెస్ విభాగం డైరక్టర్ శక్తి నాగప్పన్ అన్నారు. సీఓఈలో తమకు భాగస్వామ్యం కల్పించడం పట్ల రెడ్డీస్ ల్యాబ్స్ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్, లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా హర్షం వ్యక్తం చేశారు. -
Jhonson & Jhonson: ఇంతకాలం కలిసి మెలిసి.. ఇకపై వేర్వేరుగా
ఫార్మా, మెడికల్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇకపై రెండుగా విడిపోతుంది. ఇంత కాలం జాన్సన్ అండ్ జాన్సన్ కిందనే ఔషధాలు, వైద్య పరికరాలు, ఉత్పత్తులను అందిస్తోంది. ఇకపై ఔషధాలు, మెడికల్ ఉత్పత్తులను వేర్వేరు విభాగాలుగా చేయాలని నిర్ణయించింది. తమ గ్రూపు ద్వారా అందుతున సేవలను విడగొట్టడం ద్వారా మరింత నాణ్యమైన సేవలు వేగంగా అందుతాయనే నమ్మకం ఉందని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది. గ్రూపును రెండుగా విడగొట్టే ప్రక్రియ పద్దెనిమిది నెలల నుంచి రెండేళ్లలోపు పూర్తి చేస్తామని తెలిపింది. అన్ని వివరాలు పూర్తిగా సమీక్షించి తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రూపు సీఈవో అలెక్స్ గోర్కి వెల్లడించారు. జాన్సన్ అండ్ జాన్సన్‌కి ప్రపంచ వ్యాప్తంగా 1.36 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలను రెండుగా విడగొడుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, తోషిబాలు ఇటీవల తమ గొడుకు కింద అందున్న సేవలు, ఉత్పత్తులను రెండుగా విడగొడుతున్నట్టు ప్రకటించాయి. వాటి విభజన ప్రక్రియ పూర్తి కాకముందే అదే తరహా ప్రకటన జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి వెలువడింది. -
పంట పొలాల మధ్య ఫార్మా వద్దు..
నర్సాపూర్ రూరల్: పచ్చని పంట పొలాల మధ్య ఫార్మా చిచ్చు వద్దంటూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట మహిళలు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి కాళ్లు మొక్కి మొర పెట్టుకున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే, ఇన్చార్జి ఆర్డీఓ సాయిరాం గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫార్మా కంపెనీ వద్దంటూ ముక్తకంఠంతో చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమ నోట్లో మట్టి కొట్టొద్దని కోరారు. ఈ కంపెనీలతో చుట్టూ పంట పొలాలు, గ్రామాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను ఫార్మా కంపెనీ యాజమాన్యం తప్పుడు సర్వే చేయించి లాక్కున్నదని కొందరు దళితులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని ఆపేయిస్తానని హామీ ఇవ్వాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పారు. -
బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు
వాషింగ్టన్: అదేంటో వరుసగా రెండు రోజులు బాగా తింటే లావవుతాం.. ఇక వరుసగా నెలరోజులు వ్యాయామం చేస్తే తప్ప పెరిగిన బరువు తగ్గించుకోలేం. ఇక ప్రతి రోజు వ్యాయామం చేయడం అందరికి వీలు కాదు. కుదిరినా బద్దకం వల్ల దాని గురించి పెద్దగా పట్టించుకోం. అందుకే మార్కెట్లో వ్యాయమంతో పని లేకుండా బరువు తగ్గించే ట్రిక్కులకు, మందులకు డిమాండ్ అధికం. కానీ వీటి వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తుంటారు నిపుణులు. ఈ క్రమంలో అమెరికాలో తొలిసారి బరువు తగ్గించే ఔషధానికి అనుమతి లభించింది. దాంతో ఆ మెడిసిన్ కోసం అమెరికా వాసులు మెడికల్ షాపులకు పరుగు తీస్తున్నారు. ఆ వివరాలు.. బరువు తగ్గించేందుకుగాను నోవో నోర్డిస్క్ అనే ఫార్మ కంపెనీ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు అమెరికాలో భారీ ఆదరణ లభిస్తోంది. అయితే, గిరాకీకి తగ్గట్లుగా సరఫరా చేయలేకపోతున్నారు. ఈ మెడిసిన్ వినియోగానికి జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ మెడిసిన్‌కి అనుమతి లభించడం ఇదే తొలిసారి. గతంలో బరువు తగ్గించే మందులు అనేకం వచ్చినప్పటికీ.. వాటికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభించలేదు. ఇక ఆయా మందులు వల్ల తీవ్ర దుష్ప్రభావాలు ఉండేవి. పైగా అవి మంచి ఫలితాన్నిచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ క్రమంలో తాజాగా వీగోవీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో జనాలు దాని కోసం ఎగబడుతున్నారు. (చదవండి: ఎఫ్బీ అకౌంట్ డిలీట్ చేసింది.. భారీగా బరువు తగ్గింది) ఎలా వాడాలి అంటే.. వీగోవీ అనేది ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన ఓ మెడిసిన్. వారానికి ఒక డోసు చొప్పున తీసుకోవాలి. ఆకలిని నియంత్రించి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. దాదాపు 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందని కంపెనీ తెలుపుతోంది. ఈ ఔషధానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో డెన్మార్క్‌కు చెందిన నోవో నోర్డిస్క్ కంపెనీకి ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఎలా పనిచేస్తుందంటే.. ఈ మెడిసిన్ జీఎల్పీ-1 అనే హార్మోన్‌ను అనుకరించడం ద్వారా పనిచేస్తుంది. ఇది మెదడులోని ఆకలిని, ఆహారం తీసుకోవడం నియంత్రించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇక దీనివల్ల దుష్ప్రభావాలు లేవా అంటే ఉన్నాయి. ఈ మెడిసిన్ తీసుకున్న వారిలో వాంతులు, యాసిడ్ రీఫ్లక్స్ వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు సమాచారం. (చదవండి: ఇమ్యూనిటీ ఫస్ట్...పిండి వంటలు నెక్ట్స్) కోవిడ్ వల్ల పెరిగిన డిమాండ్.. ఈ మెడిసిన్‌కు ఇంత భారీగా డిమాండ్ పెరగడానికి కోవిడ్ కూడా ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికబరువుతో బాధపడుతున్న వారికి కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనాలు తేల్చడంతో.. అందరికీ బరువు తగ్గడంపై ధ్యాస పెరిగిందని నోవో నోర్డిస్క్ ఫార్మ కంపెనీ సీఈఓ లార్స్ జోర్గెన్సన్ తెలిపారు. వచ్చే ఏడాది ఆరంభం నాటికి డిమాండ్‌కు సరిపడా స్థాయిలో వీగోవీని ఉత్పత్తి చేస్తామన్నారు. (చదవండి: ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది) -
#trending: బీరువాలో ఇలాంటి దృశ్యం చూశారా..?!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఫార్మ కంపెనీలో జరిపిన సోదాలో ఐటీ అధికారులు 142.87కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉందంటే బీరువా. బట్టలు పెట్టుకునే బీరువా ఫోటో వైరల్ కావడం ఏంటంటే.. మనలాంటి సామాన్యులు బీరువాలో బట్టలు పెడతారు.. కానీ సదరు ఫార్మా కంపెనీ బీరువాను డబ్బు కట్టలతో నింపింది. ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా డబ్బు కట్టలను బీరువా నిండ పేర్చింది. (చదవండి: Hyderabad: ప్రముఖ ఫార్మా కంపెనీలో సోదాలు.. రూ.142 కోట్లు సీజ్) ఈ ఫోటో చూసిన నెటిజనులు వార్నీ మా బీరువాలో బట్టలు సర్దిని తరువాత కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది.. ఇదేందిరా నాయనా ఇన్ని డబ్బు కట్టలు.. అబ్బ ఒక్క కట్ట నాకు దొరికితే లైఫ్ సెటిల్ అవుతుంది.. నోట్ల రద్దు ఫలించలేదు.. నోట్ల రంగు ఆకారం మారింది అంతే.. అరే 2000 రూపాయల నోట్లు వాడి ఉంటే.. 75 శాతం జాగా మిగిలేది.. మరిన్ని డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఉండేది అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు. చదవండి: శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్ -
Hyderabad: ప్రముఖ ఫార్మా కంపెనీలో సోదాలు.. రూ.142 కోట్లు సీజ్
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఐటీ శాఖ ఫార్మా సంస్థలో సోదాలపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు సోదాల్లో 142.87కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. (చదవండి: బజ్జీల బండి.. కోట్ల ఆస్తులండీ!) కంపెనీకి సంబంధించి ఆరు రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. సదరు ఫార్మా కంపెనీ యూరప్, అమెరికాకు డ్రగ్స్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. సంస్థకు సంబంధించిన ప్రదేశాల్లోని పలు రహస్య స్థావరాల్లో లెక్కలకు సంబంధించిన పుస్తకాలు, నగదు, ఖాతాలు, నగదుకు సంబంధించిన రెండవ సెట్ పుస్తకాలు కనుగొన్నట్లు ఐటీ శాఖ తెలిపింది. (చదవండి: కరెన్సీ కట్టలు: రోడ్డుపై రూ.కోటి.. రూ.264 కోట్లు స్వాధీనం ) డిజిటల్ మీడియా, పెన్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్ల రూపంలో నేరపూరితమైన సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీశాఖ వెల్లడించింది. బోగస్, ఉనికిలో లేని సంస్థల నుంచి చేసిన కొనుగోళ్లలో వ్యత్యాసాలు వంటి విషయాలు బయటపడినట్లు తెలిపింది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువగా కొనుగోలు చేసిన భూముల వివరాలు, ఇతర అనేక విషయాలు బయటపడినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. చదవండి: తీసుకుంది రూ.117 కోట్లు.. చూపించింది రూ. 21 కోట్లు -
సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ వేయించుకున్నారా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క టీకా తయారీ కంపెనీ ఐనా వచ్చిందా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పుట్టడానికి ముందు నుంచే రాష్ట్రంలో, హైదరాబాద్‌లో పలు ఫార్మా కంపెనీలున్నాయన్న సంగతి గుర్తెరగాలన్నారు. ‘కేసీఆర్ వచ్చాకే తెలంగాణ ప్రజలు భోజనం చేస్తున్నారు. పోలియో టీకాలు వేసుకుంటున్నారు అన్న విధంగా టీఆర్ఎస్ వ్యవహారం ఉంది’అని రఘునందన్ ఎద్దేవాచేశారు. అసలు సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ వేయించుకున్నారా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణను అవమానపరిచినట్లు అని కేటీఆర్ మాట్లాడడడం సరైందికాదన్నారు. ఫార్మాసిటీకి సంబంధించి ముచ్చర్లలో పది వేల ఎకరాలు సేకరించినప్పుడు రాని ఇబ్బందులు మిగిలిన రెండు వేల ఎకరాలకు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. ఐటీఐఆర్ రీజియన్‌ని ఎందుకు ఏర్పాటు చేయలేదో గత యూపీఏ ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. పరిశ్రమల మంత్రిగా రేయాన్ ఫ్యాక్టరీ, నిజాంషుగర్, అజంజాహిమిల్, ప్రాగా టూల్స్, ఆల్విన్ కంపెనీలను తెరిపించే సంగతేంటో కేటీఆర్ చెప్పాలని డిమాండ్‌చేశారు. సిరిసిల్లకు ఎన్ని లక్షల బతుకమ్మ చీరలకు వర్క్ ఆర్డర్ ఇచ్చారో, దుబ్బాక నుంచి ఎన్ని తెచ్చారో చెప్పాలని రఘునందన్ డిమాండ్‌చేశారు. చదవండి: ‘కోదండరాంపై బట్టలు చినిగిపోయేలా దాడి చేయడం దారుణం’ కేటీఆర్ పుట్టకముందే రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేనిది చూసి మంత్రి కేటీఆర్ ఎగిరెగిరి పడ్డారని, ఆయన పుట్టకముందే తెలంగాణలో ఫార్మారంగం అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి హితవుపలికారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. మంగళవారం గాం«దీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాకముందే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారత్ బయోటెక్, ఐడీపీఎల్, రెడ్డి ల్యాబ్స్ లాంటి ఫార్మా పరిశ్రమలు హైదరాబాద్‌లో ఏర్పడ్డాయని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 36 లక్షల మంది పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని, అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, పఠాన్‌చెరు లాంటి ఇండ్రస్టియల్ జోన్లో 50 శాతం కాలుష్యం పెరిగిందని విమర్శించారు. కాలుష్య నియంత్రణ మండలిని పనిచేయనీయకుండా పరిశ్రమల యాజమాన్యాలను బెదిరించి టీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సు«దీర్‌రెడ్డి మాట్లాడుతూ మొన్న కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే హుజూరాబాద్ ఎన్నికలు ఆగిపోయాయని, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి రాగానే అదే హుజూరాబాద్‌కు నోటిఫికేషన్ వచి్చందని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే కేసీఆర్ చేతిలో బీజేపీ కీలు»ొమ్మ అయిందని, ఈ ఎపిసోడ్లో ఈటల రాజేందర్ బకరా అయ్యారని సు«దీర్‌రెడ్డి ఎద్దేవాచేశారు. కళాకారులు లేని పోరాటం లేదు: జూలకంటి దురాజ్‌పల్లి(సూర్యాపేట): కళాకారులు లేని పోరాటం లేదని, ప్రజా ఉద్యమాలకు పాట ఆయుధమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్హాల్లో ప్రజానాట్యమండలి రాష్ట్ర రెండో మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజా ఉద్యమాల కేంద్రమైన సూర్యాపేటలో ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం శుభసూచకమన్నారు. దేశంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్న సందర్భంలో ఈ సభల నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన ప్రభుత్వాలు ప్రజలకిచి్చన ఏ హామీనీ అమలు చేయలేదని ఆరోపించారు. దేశంలో బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత కవులు, కళాకారులు, రచయితలకు రక్షణ కరువైందన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి శాంతారావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి, వ్యవసాయ కారి్మక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బచ్చలకూరి రాంబాబు, వేల్పుల వెంకన్న పాల్గొన్నారు. -
హెల్త్ ఓకే అంబాసిడర్‌గా..బ్రాండ్ 'బాబు'
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ ఉత్పత్తి చేస్తున్న హెల్త్ ఓకే మల్టీ విటమిన్, మినరల్ ట్యాబ్లెట్లకు సినీ నటులు మహేష్ బాబు, సుదీప్‌ను దక్షిణాది బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. త్వరలో హెల్త్ ఓకే ట్యాబ్లెట్ల ఉపయోగాలపై మహేష్, సుదీప్‌ల ప్రకటనలు దక్షిణాది ఛానళ్లలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. తద్వారా కస్టమర్లకు మరింత చేరువ అవుతామని మ్యాన్‌కైండ్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. హెల్త్ ఓకేతో జతకట్టడంపై ఇరువురు నటులు హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుల ప్రచారంతో అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ సేల్స్ మేనేజర్ జోయ్ ఛటర్జీ తెలిపారు. -
త్వరలో అందుబాటులోకి మరో దేశీ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కట్టడికి ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను పంపిణీ చేస్తుండగా.. త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అది కూడా హైదరాబాద్‌కు చెందిన ఫార్మ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కావడం విశేషం. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్లతో భేటీ అయ్యారు. తమ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోర్బివాక్స్ పురోగతి గురించి మహిమా దాట్ల.. మంత్రికి వివరించారు. కోర్బివాక్స్ టీకా తయారీకి ప్రభుత్వం మద్దతిస్తుందని కేంద్రమంత్రి.. బయోలాజికల్-ఈ ఎండీకి హామీ ఇచ్చారు. ఈ మేరకు మన్సుక్ మాండవియా శుక్రవారం ట్వీట్ చేశారు. ఇప్పటికే బయోలాజికల్-ఈ కంపెనీకి కేంద్రం 1500 కోట్ల రూపాయలు చెల్లించింది. Met Ms Mahima Datla, MD of @Biological_E, who briefed me on the progress of their upcoming #COVID19 vaccine, Corbevax. I assured all the Government support for the vaccine. pic.twitter.com/QzRohNalhe — Mansukh Mandaviya (@mansukhmandviya) August 6, 2021 ఈ సందర్భంగా బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల మాట్లాడుతూ.. ‘‘మా వ్యాక్సిన్ ఉత్పత్తికి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈనెల నుంచే కోర్బివ్యాక్స్ ఉత్పత్తి ప్రారంభిస్తాం. డిసెంబర్‌లోగా కేంద్రానికి 30 కోట్ల వ్యాక్సిన్లు అందజేస్తాం’’ అని తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 557 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 29% క్షీణించి రూ. 557 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.781 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 4,336 కోట్ల నుంచి రూ. 4,608 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లా భం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 2,026 కోట్ల నుంచి రూ. 1,952 కోట్లకు తగ్గింది. అయితే, నికర అమ్మకాలు మాత్రం రూ. 16,357 కోట్ల నుంచి రూ. 18,420 కోట్లకు పెరిగాయి. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 25 మేర తుది డివిడెండ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ఉత్పత్తులపై మరింత దృష్టి.. ఉత్పాదకతను పెంచుకోవడం, కొంగొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్–వి టీకాను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే కోవిడ్–19 చికిత్సలో తోడ్పడే పలు ఔషధాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా అవినీతి నిరోధక చట్టాలకు విరుద్ధంగా పలు దేశాల్లో తమ కంపెనీ తరఫున హెల్త్‌కేర్ నిపుణులకు చెల్లింపులు జరిపినట్లు వచ్చిన ఆరోపణల మీద స్వయంగా విచారణ చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే విషయాన్ని అటు అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్‌కి, న్యాయ శాఖకు, ఇటు సెబీకి తెలిపింది. గ్లోబల్ జనరిక్స్ 6 శాతం అప్.. క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 3,639 కోట్ల నుంచి రూ. 3,873 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఔషధాల ధరల తగ్గుదల కారణంగా ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 1,750 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఉత్తర అమెరికా మార్కెట్లో డీఆర్ఎల్ 6 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టింది. మరోవైపు, యూరప్ మార్కెట్లో ఆదాయాలు 15 శాతం పెరగ్గా, భారత్‌లో 23 శాతం పెరిగాయి. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు క్యూ4లో వార్షికంగా 10 శాతం వృద్ధితో రూ. 790 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు 2% క్షీణించి రూ. 5,196 వద్ద ముగిసింది. -
వారి కుటుంబాలకు రూ.100 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్: తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా చికిత్సనందించిన హెల్త్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలకు మ్యాన్‌కైండ్ ఫార్మా చేయూతగా నిలిచింది. అమరులైన ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.100 కోట్లు విరాళమిచ్చింది. కరోనా మహమ్మారి ప్రారంభ దశ నుంచీ మ్యాన్‌కైండ్ తన వంతు సాయమందిస్తూ వస్తోంది. 2020లో దాదాపు రూ.130 కోట్లు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్, సీఎం కేర్ ఫండ్, అమరులైన హెల్త్‌కేర్ వర్కర్లకు ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సందర్భంగా మ్యాన్‌కైండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్‌చైర్మన్ రాజీవ్ జునేజా మాట్లాడుతూ కరోనా సోకిన వారికి చికిత్స అందించడంలో ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి ఎనలేని కృషిచేస్తున్నారని, ఈ నేపథ్యంలో వారికి ఆర్థికంగా మద్దతుగా నిలుస్తున్నామని అన్నారు. చదవండి: కరోనా కల్లోలం: సచిన్, ఐపీఎల్ జట్ల విరాళాలు ఎంతంటే! -
60 వేల రెమిడెసివిర్ వయల్స్ విదేశాలకు..
ముంబై: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండడంతో రెమిడెసివిర్ టీకాకు డిమాండ్ అదేస్థాయిలో పెరుగుతోంది. కరోనా చికిత్సలో రెమిడెసివిర్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఈ టీకా కొరత వేధిస్తోంది. కొరత నేపథ్యంలో టీకా ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, డామన్‌కు చెందిన బ్రూక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ 60,000 రెమిడెసివిర్ వయల్స్‌ను ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు తరలించినట్లు మంబై పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ డైరెక్టర్ రాజేశ్ డొకానియాను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు. విచారణ అనంతరం రాజేశ్ డొకానియా అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్లారు. బ్రూక్ ఫార్మా సంస్థ రెమిడెసివిర్ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. భారీ సంఖ్యలో వయల్స్‌ను విదేశాలకు అక్రమంగా తరలించినట్లు తేలడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బ్రూక్ ఫార్మా డైరెక్టర్‌ను పోలీసులు ప్రశ్నించడంపై మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారిని అధికార శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించింది. రాజేశ్ డొకానియాను తరలించిన పోలీసు స్టేషన్‌కు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజేపీ నేతలు చేరుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. బ్రూక్ ఫార్మా కంపెనీతో మాట్లాడి, మహారాష్ట్రకు రెమిడెసివిర్ టీకాలు ఇప్పించేందుకు తాము ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. బ్రూక్ ఫార్మా సంస్థ యాజమాన్యాన్ని ప్రభుత్వం వేధిస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి అత్యవసరమైన టీకాలను విదేశాలకు అక్రమంగా తరలించిన ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ను పోలీసులు విచారిస్తే బీజేపీకి అభ్యంతరం ఎందుకో చెప్పాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిలదీశాయి. రాజేశ్ డొకానియాను పోలీసులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది. -
జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా చేతికి సెలన్ ల్యాబ్స్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌కు చెందిన స్పెషాలిటీ జనరిక్స్ ఫార్మా కంపెనీ సెలన్ ల్యాబ్స్‌లో జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా2 మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. యూకే బయోఫార్మా కంపెనీ జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా ఇందుకు రూ. 364 కోట్లను వెచ్చిస్తోంది. తద్వారా సెలన్ ల్యాబ్స్‌లో 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా2లో సీడీసీ గ్రూప్, డెవలప్మెంట్ పార్టనర్స్ ఇంటర్నేషనల్, పునర్నిర్మాణ, అభివృద్ధి యూరోపియన్ బ్యాంక్ ప్రధాన వాటాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల మూడు ఇన్వెస్ట్మెంట్ సంస్థల ద్వారా జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా 25 కోట్ల డాలర్లను(రూ. 1,850 కోట్లు) సమీకరించింది. ఈ నిధులలో రూ. 200 కోట్లను సెలన్ ల్యాబ్స్ విస్తరణకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. 26 శాతం వాటా క్రిటికల్ కేర్, అంకాలజీ విభాగాలలో ఓరల్, ఇంజక్టబుల్స్ ఔషధాల తయారీకి వీలుగా హైదరాబాద్‌లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సెలన్ ల్యాబ్స్ ఎండీ మిద్దే నగేష్ కుమార్ తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో సెలన్ ల్యాబ్స్ రూ. 200 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రూ. 250 కోట్ల అమ్మకాలు నమోదుకాగలవని అంచనా వేస్తున్నట్లు నగేష్ పేర్కొన్నారు. సెలన్ విక్రయం నేపథ్యంలో కంపెనీ ప్రమోటర్లు విమల్ కుమార్ కావూరు, విజయ్ కుమార్ వాసిరెడ్డి తమ ఫార్మసీ బిజినెస్‌పై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. సెలన్‌లో 26 శాతం వాటాతో ప్రమోటర్లు కొనసాగనున్నట్లు నగేష్ తెలియజేశారు. జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా అజమాయిషీలో కంపెనీని ప్రొఫెషనల్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫార్మా సిటీలో సెలన్ ల్యాబ్స్ కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంటును హైదరాబాద్‌లోని షామీర్పేట లేదా త్వరలో ప్రారంభంకానున్న ఫార్మా సిటీ వద్ద ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు నగేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త రెగ్యులేటెడ్ మార్కెట్లపై దృష్టితో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీ ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, సీఐఎస్ తదితర 45 దేశాలకు ప్రొడక్టులను విస్తరించినట్లు తెలియజేశారు. అయితే కొత్త ప్లాంటు ద్వారా రెగ్యులేటెడ్ మార్కెట్లకు సైతం విస్తరించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పారిశ్రామికవాడలోగల రెండు యూనిట్ల ద్వారా కంపెనీ అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలలో ప్రొడక్టులను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
విష వాయువు.. ఉక్కిరిబిక్కిరి
సాక్షి, మెదక్: అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులోని కార్తికేయ ఫార్మా కంపెనీలో రసాయన లీకేజీతో ఒక్కసారిగా ఊరంతా పొగ కమ్మకుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో దుర్వాసనతో పొగ కమ్ముకోవడంతో ఊపిరి ఆడని పరిస్థితి నెలకొందన్నారు. కంట్లో మంటలతో పాటు ఊపిరిరాడని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు. దీంతో విషయం గమనించిన గ్రామ యువకులు కొందరు పరిశ్రమ వద్దకు పరుగుతీసి విషయంపై నిలదీయడంతో అప్రమత్తమైన పరిశ్రమ సిబ్బంది ఉత్పత్తిని నిలిపివేశారు. ఉదయం పరిశ్రమ వద్దకు చేరుకున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెట్పీటీసీ రమణ విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి ఫిర్యాదు అందించారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని రాత్రి మరోసారి జరగడంతో ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. ప్రజల ఫ్రాణాలతో ఆటలాడుతున్న పరిశ్రమను మూసివేయాలని కోరారు. ఈ విషయంపై పరిశ్రమ ఎండీ కార్తీకేయ మాట్లాడుతూ తమ పరిశ్రమలో ఉత్పత్తులు ప్రాణాంతకమైనవి కావని తెలిపారు. అమ్మోనియం సల్పేట్ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. స్టీమ్ పైప్ లీకేజీ అవడంతో సమస్య వచ్చిందని తెలిపారు. ఫార్మా కంపెనీ సీజ్‌కు అదనపు కలెక్టర్ అదేశాలు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామశివారులోని కార్తీకేయ ఫార్మా కంపెనీని సీజ్ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఫార్మా పరిశ్రమను పరిశీలించి కనీస జాగ్రత్తలు కూడ తీసుకోవడంలేదని మేనేజర్‌ను ప్రశ్నించారు. పరిశ్రమ మేనేజర్ నుంచి సరైన సమా«ధానం రాకపోవడంతో వెంటనే పరిశ్రమను సీజ్‌చేస్తున్నట్లు తెలిపారు. పీసీబీ అధికారులు వచ్చి పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు పరిశ్రమలో ఉత్పత్తులు నిర్వహించవద్దని హెచ్చరించారు. పరిశ్రమ రసాయన లీకేజీ విషయం అధికారులకు సమాచారం అందించడంలో విఫలమైన వీఆర్ఓకు మెమో జారీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. మెదక్ ఆర్డీఓ సాయిరామ్, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి గ్రామప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు. పీసీబీ అధికారుల పరిశీలన... విషవాయువు లీకైన కార్తీకేయ ఫార్మా పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవి కుమార్, ఏఈ శిరీష, పరిశ్రమల కేంద్రం జిల్లా అధికారి కృష్ణమూర్తి, కర్మాగారాల మేనేజర్ లక్ష్మి విచారణ నిర్వహించారు. పరిశ్రమలో ప్రమాదానికి కారణంతో పాటు కాలుష్యంపై పరిశీలనలు జరిపారు. ఈ సందర్భంగా పరిశ్రమలోని రసాయానాలను సేకరించి ల్యాబ్‌కు తరలిచనున్నట్లు తెలిపారు. -
వ్యాక్సిన్ తయారీలో దేశీ కంపెనీల స్పీడ్
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ కబళిస్తున్న కరోనా వైరస్ కట్టడికి దేశీ ఫార్మా కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు విదేశీ దిగ్గజాలు వ్యాక్సిన్లను రూపొందిస్తుండగా.. దేశీ కంపెనీలు సైతం ఈ రేసులో భాగం పంచుకుంటున్నాయి. గ్లోబల్ దిగ్గజాలతో ఒప్పందాల ద్వారా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. తద్వారా వేగంగా వ్యాక్సిన్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా వ్యాక్సిన్లను భారీ స్థాయిలో అందించేందుకు సైతం సన్నాహాలు చేస్తున్నాయి. ఈ అంశాలపై ఫార్మా వర్గాల విశ్లేషణ చూద్దాం.. నిజానికి వ్యాక్సిన్ల తయారీ ఏళ్ల తరబడి సాగుతుందని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. అయితే అతర్జాతీయ స్థాయిలో లక్షలకొద్దీ జనాభాకు సవాళ్లు విసురుతున్న కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్లను వేగంగా రూపొందించవలసి ఉన్నట్లు తెలియజేశారు. దీంతో అమెరికాసహా పలు దేశాల కంపెనీలు వ్యాక్సిన్లను రూపొందించేందుకు వేగవంత అనుమతులు పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో దేశీయంగా భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా, పనాసియా బయోటెక్, ఇండియన్ ఇమ్యునలాజికల్స్, బయోలాజికల్ ఈ తదితర దిగ్గజాలు వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. క్లినికల్ పరీక్షలు కోవిడ్-19 వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత్ బయోటెక్ ఔషధ నియంత్రణ సంస్థల అనుమతి పొందింది. తద్వారా కోవాగ్జిపై తొలి, రెండో దశల పరీక్షలను చేపడుతోంది. హైదరాబాద్ కేంద్రంలో రూపొందించిన ఈ వ్యాక్సిన్ పరీక్షలను గత వారమే చేపట్టింది. వ్యాక్సిన్ అభివృద్ధికి ఐసీఎంఆర్, ఎన్ఐవీలతో జత కట్టిన విషయం విదితమే. ఇదేవిధంగా 2020 చివరికల్లా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌ను తీసుకురాగలమని భావిస్తున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీనిలో భాగంగా ప్రస్తుతం యూకే కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలసి పనిచేస్తున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధంపై మూడో దశ క్లినికల్ పరీక్షలు నడుస్తున్నాయని.. తాము సైతం ఆగస్ట్‌లో పరీక్షలను చేపట్టనున్నామని తెలియజేసింది. వెరసి ఏడాది చివరిలోగా ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ నుంచి వ్యాక్సిన్ లభించగలదని భావిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు యూఎస్ కంపెనీ కోడాజెనిక్స్, ఆస్ట్రియా కంపెనీ థెమిస్కు సైతం వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకారమందిస్తున్నట్లు వెల్లడించింది. 7 నెలల్లో కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న జైకోవిడ్ వ్యాక్సిన్‌పై ఏడు నెలల్లోగా క్లినికల్ పరీక్షలను పూర్తిచేయగలమని ఆశిస్తున్నట్లు జైడస్ క్యాడిలా తెలియజేసింది. గత వారమే హ్యూమన్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు తెలియజేసింది. పరీక్షలు విజయవంతమైతే జనవరికల్లా వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. ఇక కరోనా వైరస్‌కు చెక్‌పెట్టేందుకు యూఎస్ సంస్థ రెఫనా ఇంక్‌తో భాగస్వామ్యంలో ఐర్లాండ్‌లో సంయుక్త సంస్థలను నెలకొల్పుతున్నట్లు జూన్‌లోనే పనాసియా బయోటెక్ పేర్కొంది. తద్వారా 50 కోట్ల డోసేజీలను తయారు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది మొదట్లో 4 కోట్ల డోసేజీలను అందించగలమని తెలియజేసింది. ఇదే విధంగా వ్యాక్సిన్ అభివృద్ధికి ఆస్ట్రేలియా గ్రిఫిత్ యూనివర్శిటీతో చేతులు కలిపినట్లు ఇండియన్ ఇమ్యునలాజికల్స్ ఇప్పటికే పేర్కొంది. ఈ బాటలో మిన్‌వ్యాక్స్, బయోలాజికల్ ఈ తదితర కంపెనీలు సైతం వ్యాక్సిన్‌ను రూపొందించడంపై దృష్టిపెట్టాయి. పరీక్షలు ఇలా ఫార్మా వర్గాల వివరాల ప్రకారం.. వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా తొలుత జంతువులపై పరీక్షలను నిర్వహిస్తారు. తదుపరి దశలో మనుషులపైనా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తారు. తొలి దశ క్లినికల్ పరీక్షలలో కొద్దిమందిపై వ్యాక్సిన్ ప్రభావాన్ని పరిశీలిస్తారు. తదుపరి మరింత మందిపైనా.. ఇవి విజయవంతమైతే వేలమందిపైనా పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి నిరోధక శక్తి పెంపు, భద్రత తదితర పలు అంశాలను క్లినికల్ ప్రయోగాలలో నమోదు చేస్తారు. తద్వారా నాలుగు దశలలో క్లినికల్ పరీక్షలను పూర్తి చేస్తారు. ఆపై వీటిని క్షుణ్ణంగా విశ్లేషిస్తారు. -
కలిపి కొడితే కరోనా ఫట్?
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని మట్టుబెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ప్రయోగాలు జరుగుతుండగా అమెరికాలో కొనసాగుతున్న ఓ వినూత్న ప్రయ త్నం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులకు సహజ స్పందనగా శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీలు రెండింటినీ కలిపి అందిస్తే కోవిడ్–19 కారక వైరస్‌ను నివారింవచ్చని రిజెనెరాన్ అనే ఫార్మా కంపెనీ ఆలోచిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా రెండు దశల ప్రయోగాలను పూర్తి చేసుకుని తాజాగా మూడోదశ మానవ ప్రయోగా లకు సిద్ధమవడం విశేషం. ఇవి సత్ఫలితాలిస్తే ఈ ఏడాది చివరికల్లా సరికొత్త అస్త్రం అందుబాటులోకి వచ్చినట్లేనని నిపుణులు భాస్తున్నారు. ప్లాస్మా థెరపీకి పరిమితుల దృష్ట్యా... కరోనా వైరస్ మనిషిలోకి ప్రవేశిస్తే రోగ నిరోధక వ్యవస్థ వై ఆకారంలో ఉన్న కొన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి కాస్తా వైరస్‌కు అతుక్కుపోయి నాశనం చేయాల్సినవిగా శరీరానికి గుర్తు చేస్తుంది. లేదా ఆ వైరస్ మళ్లీ ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయకుండా నిరోధిస్తుంది. కోలుకున్న కోవిడ్ రోగుల రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి ఇతర వ్యాధిగ్రస్తులకు అందించడం ఇందుకే. అయితే ఈ ప్లాస్మా థెరపీకి కొన్ని పరిమితులున్నాయి. ఆ ప్లాస్మాలో ఉండే వేర్వేరు రకాల యాంటీబాడీల్లో కొన్ని బాగా పనిచేస్తే మరికొన్ని అస్సలు పనిచేయవు. కొన్ని యాంటీబాడీలు వైరస్ కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. వీటినే న్యూట్రలైజింగ్ యాంటీబాడీలని అంటారు. ఇతర యాంటీబాడీలు వైరస్‌తో కూడిన కణాలను నాశనం చేయాల్సిందిగా రోగ నిరోధక వ్యవస్థకు సంకేతాలు మాత్రమే ఇవ్వగలుగుతాయి. యాంటీబాడీల తయారీ ఈ థెరపీలోని ఈ పరిమితుల దృష్ట్యా ఆ సంస్థ మోనోక్లోనల్ యాంటీబాడీలను ఎంచుకుంది. కరోనా వైరస్‌ను లక్ష్యంగా చేసుకోగల ఈ యాంటీబాడీలను పరిశోధనశాలలో భారీ మోతాదుల్లో ఉత్పత్తి చేయగలగడం విశేషం. ఇప్పటికే రెండు రకాల యాంటీబాడీలను ఉత్పత్తి చేయడమే కాకుండా జూన్ 12 నుంచి తొలిదశ ప్రయోగాలు మొదలుపెట్టింది. రెండు, మూడో దశల ప్రయోగాలను సమాంతరంగా చేస్తోంది. కోవిడ్ ఉన్నవారిని , లేనివారిపై ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, చిలీ ఆసుపత్రుల్లో ఉన్న 850 మంది రోగులుతోపాటు 1,050 మంది సాధారణ రోగులపై ఏకకాలంలో యాంటీబాడీల మిశ్ర మం అందించనున్నారు. రెజెన్–కోవ్2 పేరుతో సిద్ధమైన ఈ మిశ్రమంలోని యాంటీబాడీలు రెండూ వైరస్‌లో కొమ్ముకు అతుక్కొని కణంలోకి చొచ్చుకుపోతాయని, తద్వారా వైరస్‌ను నిర్వీర్యం చేస్తాయని రెజెనెరాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకోలా చెప్పాలంటే మన రక్తం లో ఈ యాంటీబాడీల మిశ్రమం ఉంటే.. వైరస్ ప్రవేశించిన వెంటనే నిర్వీర్యమైతా యి. ఒకవేళ అప్పటికే వైరస్ చేరి ఉన్నా వాటిని కూడా క్రమేపీ నిర్వీర్యం చేయవచ్చు. అంటే ఈ మిశ్రమం అటు వ్యాధి నివారణకు, ఇటు చికిత్సకూ ఉపయోగ పడుతుందన్నమాట. మూడో దశ ప్ర యోగాల్లో భాగంగా ఈ యాంటీబాడీల మిశ్రమాన్ని తీసుకున్న వారిని నెలపాటు పరిశీలిస్తారు. వారిలో ఎవ రైనా కోవిడ్ బారిన పడ్డారా అని విశ్లేషిం చడం ద్వారా ఈ మందు పనిచేస్తుందా? లేదా? అన్నది తేలుతుంది. -
దేశీ ఫార్మా పరుగు షురూ!
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా రంగం ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. ఈ రంగంలో మెరుగుపడుతున్న పరిస్థితులను కంపెనీలు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కరోనా నియంత్రణకు దేశంలో లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఫార్మా రంగం షేర్లు 40 శాతానికి పైనే రాబడులను ఇచ్చాయి. కొన్ని స్టాక్స్ అయితే మల్టీబ్యాగర్లుగానూ (రెట్టింపునకు పైగా పెరగడం) మారాయి. 2015లో ఫార్మా షేర్ల ర్యాలీ తర్వాత అవి క్రమంగా ఇన్వెస్టర్ల నిరాదరణకు గురయ్యాయి. దాంతో ఏవో కొన్నింటిని మినహాయిస్తే మెజారిటీ ఫార్మా స్టాక్స్ వాటి గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. కానీ, కరోనా రాకతో మార్కెట్ పరిస్థితులు ఫార్మాకు మళ్లీ అనుకూలంగా మారాయి. కంపెనీల మూలాలు కూడా బలపడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ధరల పరమైన ఒత్తిళ్లు తగ్గడం, యూఎస్ఎఫ్డీఏ నుంచి ఔషధ అనుమతులు పెరగడం దేశీయ కంపెనీలకు కలిసొచ్చాయి. ఫార్మా రంగం ఇక ముందూ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల పరంగా ఆకర్షణీయంగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూఎస్ఎఫ్డీఏ అనుమతులు... ఫార్మా కంపెనీలు ఉత్తమ తయారీ విధానాలను పాటించడం, దిద్దుబాటు చర్యల ద్వారా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నిబంధనల అమలు విషయంలో మెరుగుపడ్డాయి. మరోవైపు కరోనా మహమ్మారి కూడా యూఎస్ఎఫ్డీఏ వైఖరిలో మార్పునకు దారితీసింది. ఏప్రిల్‌లో కేవలం పది రోజుల వ్యవధిలోనే భారత ఫార్మా కంపెనీలకు చెందిన నాలుగు తయారీ కేంద్రాలకు యూఎస్ఎఫ్డీఏ వేగంగా అనుమతులు జారీ చేయడం ఈ కోణంలోనే చూడాలి. అమెరికా మార్కెట్లో దేశీయ కంపెనీలకు బలమైన వాటాయే ఉంది. కాకపోతే యూఎస్ఎఫ్డీఏ అభ్యంతరాలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇక ముందూ యూఎస్ఎఫ్డీఏ భారత ఫార్మా కంపెనీల యూనిట్లకు అనుమతుల జారీ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తుందన్న అంచనాలు ఈ కంపెనీలకు అనుకూలమే. రుణ భారం తగ్గింపు... అనేక కారణాలతో ఫార్మా కంపెనీలకు రుణ భారం సమస్యగా మారిపోయింది. లాభసాటి కాని జపాన్, దక్షిణ అమెరికా మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా కొన్ని ఫార్మా కంపెనీలు చేతులు కాల్చుకున్నాయి. వీటికితోడు అమెరికా మార్కెట్లో జనరిక్ ఔషధాల ధరల ఒత్తిళ్లు, నిబంధనల అమలు విషయంలో యూఎస్ఎఫ్డీఏ మరీ కఠిన వైఖరి అనుసరించడంతో కంపెనీలకు రుణ భారం దించుకునే అవకాశం లభించలేదు. కానీ, గత కొంత కాలంగా కంపెనీలు తమ బ్యాలన్స్ షీట్ల బలోపేతంపై దృష్టి పెట్టాయి. అరబిందో ఫార్మా బిలియన్ డాలర్లతో అమెరికాలోని శాండోజ్ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఇందులో భాగమే. 2022 నాటికి రుణ రహిత కంపెనీగా మారాలన్నది అరబిందో ప్రణాళిక. వ్యయ నియంత్రణలు: అమెరికా వంటి కీలక మార్కెట్లలో ధరలకు సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో కంపెనీలకు మరో మార్గం లేక తమ వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. క్షేత్రస్థాయి సిబ్బందిలో కోత, పరిశోధన, అభివృద్ధి బడ్జెట్ తగ్గించుకోవడం తదితర చర్యల ద్వారా ఔషధ తయారీ వ్యయాలను తక్కువ స్థాయిలో ఉండే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. వ్యూహాత్మక విధానాలు భారత ఫార్మా కంపెనీలు తమ విధానాలను సమీక్షించుకుంటున్నాయి. లుపిన్ జపాన్ మార్కెట్ నుంచి తప్పుకోగా, డాక్టర్ రెడ్డీస్ తన యూఎస్ స్పెషాలిటీ ఔషధాల వ్యాపారాన్ని తగ్గించుకుంది. యూనికెమ్ ల్యాబ్, వోకార్డ్ తమ ఔషధ పోర్ట్‌ఫోలియోను విక్రయించాయి. డాక్టర్ రెడ్డీస్, లుపిన్, బయోకాన్, గ్లెన్‌మార్క్ ముఖ్యమైన విభాగాల్లో విదేశీ నిపుణులను నియమించుకున్నాయి. వేల్యూషన్లు తక్కువగానే.. నిబంధనల అమలు, పరిపాలనా, న్యాయ పరమైన వివాదాల సమస్యలు ఫార్మా కంపెనీలను ఇంకా వీడలేదు. అయితే, ఫార్మా స్టాక్స్ ప్రస్తుత ధరలు ఈ అంశాలన్నింటినీ సర్దుబాటు చేసుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సన్‌ఫార్మా, లుపిన్, గ్లెన్‌మార్క్ స్టాక్స్ వాటి 2015 గరిష్ట ధరల నుంచి చూస్తే ఇప్పటికీ 50% పైనే తక్కువలో ట్రేడవుతున్నాయనేది నిపుణుల మాట. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అరబిందో ఫార్మా, టోరెంట్ ఫార్మా, క్యాడిలా 2015 గరిష్ట స్థాయిలకు చేరువలో 10–15% తక్కువకు ట్రేడవుతున్నాయి. -
విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై విచారణ
-
విష ప్రచారం చేయబోయి..అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రసాయన చర్య వికటించి వెలువడిన విషవాయువుల కంటే తెలుగుదేశం నేతల విష ప్రచారమే పెను ప్రమాదంగా కనిపిస్తోంది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ ఫార్మా కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన సాకుగా టీడీపీ నేత బండారు చేసిన నానాయాగీ అందరికీ ఏవగింపు కలిగించింది. సాయినార్ కంపెనీలో రెండు రియాక్టర్లలో ఉన్న వేర్వేరు బల్్కడ్రగ్ల మిశ్రమం వల్ల రసాయన చర్య వికటించి ప్రమాదవశాత్తూ వెలువడిన విషవాయువుతో ఇద్దరు మృత్యువాత పడటం, నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన తోటి ఉద్యోగులు వెంటనే యూనిట్‌ను షట్‌డౌన్ చేయడం, జిల్లా ఉన్నతాధికారులు అర్ధరాత్రి వేళ కూడా హుటాహుటిన ఘటనాస్థలికి చేరి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఈ ఘటనను కూడా రాజకీయం చేసేందుకు ప్రతిపక్ష టీడీపీ నేతలు చీప్ ట్రిక్స్‌కు పాల్పడటమే విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేతగా చెలామణీ అవుతున్న బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ జీవితం మసకబారుతుండడంతో తన ఉనికిని చాటుకునేందుకు దిజజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న వాదనలకు సాయినార్ ఫార్మా వద్ద ఆయన చేసిన నానాయాగీ బలం చేకూరుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడి వయసు ఉన్న అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన బండారు ఏడాదిగా అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా నోటికొచి్చనట్టు మాట్లాడుతూ వస్తున్నారు. బండారు బలవంతపు వసూళ్లు బండారు గతంలో ప్రజాప్రతినిధిగా చెలామణీ అయినప్పుడు.. పరవాడలోని ఫార్మా సిటీలోని కంపెనీల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. కంపెనీల్లో ఉన్న చిన్నపాటి లొసుగులను ఆసరాగా చేసుకుని యాజమాన్యాలను బెదిరించి దందాలు చేసేవారన్న వాదనలున్నాయి. మరోవైపు ఫార్మా, ఎన్టీపీసీ కంపెనీలోనూ, ఆర్ఈసీఎస్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ కుమారుడి ద్వారా నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటని్నంటినీ కప్పిపుచ్చుకోవడానికే ఏదైనా ఘటన జరిగేతే చాలు... పోరాటం ముసుగులో బండారు అధికారపక్షంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న వాదనలున్నాయి. అనుచరుల ముసుగులో భూ కబ్జాలు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో అనుచరుల ముసుగులో బండారు లెక్కలేనన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములతో పాటు దళితులు, బీసీల వద్ద ఉన్న అసైన్డ్, డీ–ఫారం భూములను సైతం చెరబట్టారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూములను లాక్కునేందుకు ఓ మహిళను స్వయంగా బండారు కుమారుడు డైరెక్షన్లో వివస్త్రను చేసిన ఘటన అప్పట్లో రాష్ట్ర స్థాయిలో కలకలం రేపింది. అందులో ప్రధాన నిందితురాలు అయిన టీడీపీ నాయకురాలు, మాజీ వైస్ ఎంపీపీ మడక పార్వతికి తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెందుర్తి జెడ్పీటీసీ టికెట్ కేటాయించారు. లాక్‌డౌన్‌కు ముందు ఆమె తరపున బండారు, ఆయన కుమారుడు అప్పలనాయుడు ప్రచారం కూడా చేశారు. ఇక 2014లో ముదపాక అసైన్డ్ భూముల కుంభకోణంలో ప్రధాన సూత్రదారి బండారు, అప్పలనాయుడు అనుచరులు స్థానికంగా ఉన్న పట్టాదారులను బెదిరించి వారికి రూ.లక్ష చొప్పున అడ్వాన్స్‌లు ఇచ్చి రూ.కోటి భూమిని అప్పనంగా కొట్టేయడానికి యత్నించారు. అలాగే పినగాడి సమీపంలో పెంటవాని చెరువుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ గయాళు భూమిని ఎన్టీఆర్ హౌసింగ్‌కు కేటాయించేందుకు బండారు 2017లో ప్రతిపాదించారు. కానీ సాంకేతిక కారణాల వలన ఆ ప్రయత్నం ఆగిపోయింది. అయితే అప్పట్లో వైఎస్సార్సీపీ కారణంగానే పేదలకు ఇళ్లు ఇవ్వడం కుదరలేదని బండారు అప్పట్లో ఆరోపించారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అదే భూమిని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధపడితే.. బండారు స్థానిక రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారు. హైకోర్టులో కేసులు వేయించి ఆ భూమిపై తాత్కాలికంగా స్టే తెచ్చారు. బండారు.. రెండు నాల్కల తీరు పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంపై రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నం చేసిన బండారు 2015లో ఇదే కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ అప్పుడు కనీసం కంపెనీపై ఈగ వాలనివ్వలేదు సరికదా.. ప్రభుత్వానికి, ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో వాదించారు. అదే బండారు ఇప్పుడు సోమవారం రాత్రి జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రమాదానికి ప్రభుత్వమే కారణమంటూ చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పెళ్లైన రెండు నెలలకే...
పెళ్లై రెండు నెలలైంది. ఇంతలోనే ఆషాఢం రావడంతో భార్యను పుట్టింటికి పంపారు. వారం రోజుల కిందట భార్య వద్దకు వెళ్లిన భర్త వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి తన విధులకు యథావిధిగా వెళ్లాడు. ఇంతలోనే తను పని చేస్తున్న విశాఖలోని పరవాడలోని సాయినార్ లైఫ్సైన్సెస్లో గ్యాస్‌లీక్‌తో సంభవించిన ప్రమాదంలో తనువు చాలించాడు. దీంతో ఇటు మృతుని కన్నవారింట, అటు అత్తవారింట విషాదం అలుముకొంది. పూసపాటిరేగ: ఆషాఢం కారణంగా కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్యకు వారం రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన భర్త గ్యాస్ లీక్ ఘటనలో మృత్యువాతపడ్డాడు. పెళ్లినాటి జ్ఞాపకాలు కూడా మరవక ముందే నవజంటపై దేవుడుకు కన్నుకుట్టిందా..! అంటూ మృతుడు స్వగ్రామం రెల్లివలసలో రోదనలు మిన్నంటాయి. రెండు నెలల క్రితమే వివాహమైన జంటలో భర్త మృతిని తట్టుకోలేని భార్య రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన మహంతి గౌరీశంకర్రావు (28) విశాఖ పరవాడలో సాయినార్ లైఫ్సైన్సెస్లో నాలుగేళ్లుగా కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. పరిశ్రమలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. మృతి చెందిన వారిలో రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్ వున్నారు. రెల్లివలస నుంచి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన వరకు తమ కుమారుడు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలియదని మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబంలో అన్నయ్య, అక్క తరువాత జన్మించి చిన్నవాడైన గౌరీశంకర్‌పై కుటుంబం ఆధారపడి వుంది. చిన్న కుమారుడు గౌరీశంకర్ మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు రమణ, నాగరత్నం బోరున విలపించారు. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని పుట్టెడు సంతోషంతో వున్న కుటుంబాన్ని అనాధ చేసావా.. అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. రెండు నెలలకే... రెల్లివలసకు చెందిన మహంతి గౌరీశంకర్రావుకు ఈ ఏడాది ఏప్రిల్ 8న శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మితో వివాహమైంది. ఈ నెల 21న ఆషాఢం కారణంగా పుట్టింటికి వెళ్లిన వెంకటలక్ష్మి వద్దకు గత బుధవారం గౌరీశంకర్ వెళ్లాడు. భార్యతో మూడు రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లిన నవ వరుడు గ్యాస్‌లీక్ ఘటనలో మృత్యువాత పడటంతో భార్య గొల్లుమంది. ఘటనతో మృతుడు అత్తవారి గ్రామం సంచాం, స్వగ్రామం రెల్లివలస గ్రామంలోను విషాదం నెలకొంది. గౌరీశంకర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామం తీసుకురావడానికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ
సాక్షి ప్రతినిధి విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ఓ రియాక్టర్ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ విషవాయువు లీకైంది. విషవాయువును పీల్చిన ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు కోలుకోగా.. ఒకరికి వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కంపెనీని షట్‌డౌన్ చేయించారు. ప్రమాద ప్రభావం ఫ్యాక్టరీలో ఒక రియాక్టర్ ఉన్న విభాగానికి మాత్రమే పరిమితమవ్వడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్ వి.వినయ్‌చంద్.(ఇన్సెట్) ప్రమాదంలో మృతి చెందిన నరేంద్ర (ఫైల్) ప్రమాదం జరిగిందిలా.. విశాఖకు 42 కి.మీ. దూరంలో ఉన్న పరవాడ ఫార్మాసిటీలో 60 వరకు కెమికల్ కంపెనీలున్నాయి. ఫార్మాసిటీ రోడ్ నంబర్–3లోని 59 ప్లాట్‌లో ఉన్న సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో రబీప్రజాల్ సోడియం, డోమ్పారిడోన్, ఓమోప్రజోల్ మొదలైన డ్రగ్స్ ఉత్పత్తుల తయారీ జరుగుతోంది. కంపెనీలో 137 మంది సిబ్బంది, కార్మికులు పనిచేస్తుండగా.. సోమవారం రాత్రి షిఫ్ట్‌లో 26 మంది ఉన్నారు. రాత్రి 11 గంటలకు షిఫ్ట్ ఇన్చార్జి రావి నరేంద్ర (33), కెమిస్ట్ మహంతి గౌరీశంకర్(26), హెల్పర్లు ఆనంద్‌బాబు, డి.జానకిరామ్, ఎం.సూర్యనారాయణ, ఎల్వీ చంద్రశేఖర్ కలసి ప్రొడక్షన్ బ్లాక్‌లోకి వెళ్లారు. 11.25 గంటలకు ఓమోప్రజోల్ అనే డ్రగ్‌కు సంబంధించిన బల్క్ రసాయనానికి చెందిన మదర్ లిక్కర్‌ను ఒక రియాక్టర్ నుంచి మరో రియాక్టర్‌కు పంపించడం ప్రారంభించారు. స్టేజ్–3 వద్ద సెంటర్ ఫేజ్ క్యాచ్ పాయింట్‌లోని వ్యర్థ రసాయనాన్ని మరో రియాక్టర్‌లోకి పంపించే క్రమంలో ఎస్ఎస్ఆర్–107 రియాక్టర్లో ఉన్న పాత కెమికల్‌తో కలిసి రసాయనిక చర్య వికటించింది. ప్రమాదకరమైన హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు వెలువడింది. షిఫ్ట్ ఇన్చార్జ్ నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ అదుపు చెయ్యలేకపోయారు. ఈలోగా విషవాయువు పీల్చడంతో కుప్పకూలిపోయారు. కాస్త దూరంలో ఉన్న నలుగురు హెల్పర్లు వెంటనే వీరి వద్దకొచ్చారు. వారు సైతం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది యూనిట్‌ను షట్‌డౌన్ చేశారు. బాధితులను రాంకీ సంస్థకు చెందిన అంబులెన్స్‌లో గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నరేంద్ర, గౌరీశంకర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో.. మృతదేహాల్ని కేజీహెచ్‌కి తరలించారు. ఆనంద్‌బాబు, జానకిరామ్, సూర్యనారాయణల ఆరోగ్యం నిలకడగా ఉంది. చంద్రశేఖర్(37) పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విశాఖ కేర్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించండి: సీఎం ఆదేశం ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై సీఎంవో అధికారులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. రియాక్టర్ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ ఉన్న విభాగానికి పరిమితమని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని నివేదించారు. పెళ్లయిన రెండు నెలలకే.. ప్రమాదంలో మృత్యువాత పడిన మహంతి గౌరీశంకర్(26)కు రెండు నెలల కిందటే వివాహం జరిగింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన ఈ యువకుడు మూడేళ్లుగా సాయినార్‌లో కెమిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్‌లో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని సంచాం గ్రామ యువతితో వివాహమైంది. కరోనా వల్ల సమీప బంధువుల సమక్షంలో సాదాసీదాగా పెళ్లి జరిగింది. లాక్డౌన్ తరువాత ఘనంగా రిసెప్షన్ చేయాలనుకున్నారు. అంతలోనే మృత్యువాతపడ్డాడు. ► మరో మృతుడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నరేంద్ర(33) ఏడాది కిందటే హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చి ‘సాయినార్’లో షిఫ్ట్ ఇన్చార్జిగా చేరాడు. భార్య, కుమార్తె తెనాలిలో ఉంటున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. తక్షణం స్పందించిన అధికార యంత్రాంగం ప్రమాద ఘటనపై అధికార యంత్రాంగం తక్షణం స్పందించింది. పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా హుటాహుటిన ఫార్మా కంపెనీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ వినయ్‌చంద్.. అధికారులను ఘటనాస్థలికి పంపించారు. అనంతరం ఘటనాస్థలికి వెళ్లిన కలెక్టర్ ప్రమాదం జరిగిన తీరుపై ప్రభుత్వానికి నివేదించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతులను పరామర్శించారు. ► గ్యాస్ ప్రభావం పరిసర కంపెనీలు, సమీప జనావాసాలపై ఎంతమేరకు ఉంటుందనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫోరెన్సిక్ విభాగ సిబ్బంది పరిశీలించారు. కంపెనీ నుంచి బయటకు గ్యాస్ లీకేజీ కాలేదని నిర్ధారించారు. ► గ్యాస్ లీకేజీ ఘటనకు కారణాలను అధ్యయనం చేయడానికి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎ.రామలింగేశ్వరరాజు, తదితరులతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాత్రి షిఫ్ట్‌లో సిబ్బంది తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం. ► ఫ్యాక్టరీలోని ఒక యూనిట్‌కు పరిమితమని, దీనివల్ల చుట్టుపక్కల ఉన్న కంపెనీలకు ఎలాంటి ముప్పు లేదని తేలడంతో ఆ చుట్టూ ఉన్న 12 ఫార్మా కంపెనీలు తమ యూనిట్లను యధావిధిగా నిర్వహించాయి. ► మంత్రి అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ వేర్వేరుగా ఘటనా స్థలిని సందర్శించి.. ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం.. అస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. -
ఫార్మా కంపెనీ ప్రమాదంపై కమిటీ విచారణ
-
రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ తన యాంటీ-వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ మార్కెటింగ్ అనుమతి కోరుతూ భారతదేశ డ్రగ్ రెగ్యులేటర్‌కు దరఖాస్తు చేసింది. ఇప్పటికే అమెరికా, జపాన్‌లో ప్రత్యేక అనుమతిని పొందిన ఈ సంస్థ తాజాగా తన మందును భారత్‌లో కూడా విక్రయించాలనుకుంటోంది. భారత్‌లో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో కోవిడ్-19 చికిత్సలో సమర్ధవంతంగా పని చేస్తుందని గిలియడ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెమెడిసివిర్ మార్కెటింగ్ అధికారాన్ని కోరుతూ కేంద్ర ప్రామాణిక ఔషధ నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ)కు గిలియడ్ దరఖాస్తు చేసింది. రెమెడిసివిర్ ప్రీ-క్లినికల్, క్లినికల్ అధ్యయనాల పూర్తి డేటా తమ వద్ద ఉందని, దీన్ని పరిశీలించి, సంబంధిత అనుమతులు మంజూరు చేయాలని రెమెడిసివిర్ పేటెంట్దారు అయిన గిలియడ్ కోరినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీడీఎస్ సీఓ నిపుణుల కమిటీ సహాయంతో దీన్ని పరిశీలించనుంది. ఈ సిఫారసుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని సంస్థ అధికారి వెల్లడించినట్టు సమాచారం. (అక్టోబరు చివరకు కరోనా వ్యాక్సిన్ : ఫైజర్) రెండు భారతీయ ఔషధ సంస్థలు సిప్లా, హెటెరో ల్యాబ్స్ భారతదేశంలో రెమిడెసివిర్ తయారీ, అమ్మకాలకు అనుమతి కోరుతూ డ్రగ్ రెగ్యులేటర్‌కు ఇటీవల దరఖాస్తు చేశాయి. అంతేకాకుండా రెమెడిసివిర్ క్లినికల్ ట్రయల్స్ రద్దు చేయాలని, తద్వారా రోగులకు వేగంగా అందుబాటులోకి తేవాలని కోరాయి. అయితే ఈ దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయని నియంత్రణ సంస్థ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు రెమిడెసివిర్ తయారీ, పంపిణీకిగాను సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ హెటెరోతో సహా కొన్ని దేశీయ ఫార్మా సంస్థలతో గిలియడ్ ప్రత్యేకమైన లైసెన్సింగ్ ఒప్పందాలను ఇప్పటికే కుదుర్చుకుంది. యుఎస్ క్లినికల్ డేటా ఆధారంగా , జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ డ్రగ్ వినియోగానికి మే 7న ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా 2019 న్యూ డ్రగ్ అండ్ క్లినికల్ ట్రయల్స్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక పరిస్థితులలో క్లినికల్ ట్రయల్స్‌ను రద్దు చేయడంతోపాటు రెమిడెసివిర్ వినియోగానికి అనుమతి లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు కరోనా వైరస్ రోగులలో రెమెడిసివిర్ మందు ఇచ్చినప్పుడు ఇద్దరిలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. అటు ఆసుపత్రిలో చేరిన రోగులకు రెమెడిసివిర్ వినియోగించాలని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ (యూఎస్ ఎఫ్‌డీఏ) ఇయుఎ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
కోవిడ్-19 : స్ట్రయిడ్స్ ఫార్మా మందు
సాక్షి, ముంబై: కోవిడ్ -19 చికిత్సలో కీలకమైన ఫావిపిరవిర్ ఔషధ ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభించామని దేశీ ఫార్మా కంపెనీ స్ట్రయిడ్స్ ఫార్మా సైన్స్ బుధవారం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 చికిత్సలో సానుకూల ఫలితాలనిచ్చిన ఈ యాంటి వైరల్ ఫావిపిరవిర్ టాబెట్లను వాణిజ్య ప్రాతిపదికన తయారీ, ఎగుమతులను ప్రారంభించినట్లు బుధవారం వెల్లడించింది. తద్వారా కరోనా వైరస్ సోకినవారి చికిత్సకు ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను ఎగుమతి చేస్తున్న తొలి దేశీ కంపెనీగా నిలవనున్నట్లు ప్రకటించింది. సౌకర్యవంత డోసేజ్ కింద 400 ఎంజీ. 200 ఎంజీబలంతో ఫావిపిరవిర్ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. అంతేకాదు ఈ ఔషధాన్ని దేశీయంగా వినియోగించేందుకు వీలుగా ఔషధ అధికారిక, నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేయనున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో 20 శాతం ఎగిసింది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ .3890 కోట్లకు పెరిగింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) తొలి దశలో భాగంగా గల్ఫ్ సహకార దేశాల (జీసీసీ)కు సరఫరా చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఆయా దేశాలలో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సలో వీటిని వినియోగించనున్నట్లు వివరించింది. ఈ ఔషధ తయారీకి అవసరమయ్యే ఏపీఐల సరఫరాకు వీలుగా ఓ దేశీ ఫార్మా కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కోసం వారి చికిత్సా కార్యక్రమం కింద రోగులకు చికిత్స చేయడానికి ఈ ఉత్పత్తిని ప్రస్తుతం జిసిసి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా జపనీస్ దిగ్గజం టొయమా కెమికల్ తయారీ ఎవిగాన్ ఔషధానికి జనరిక్ వెర్షన్. ఈ ఔషధాన్ని గతంలో జపాన్‌లో తలెత్తిన ఇన్ఫ్లుయెంజా నివారణకు రూపొందించారట. అయితే ఇటీవల ఈ ఔషధ వినియోగం ద్వారా కోవిడ్-19 రోగులలో ఊపిరితిత్తుల పరిస్థితి మెరుగుపడటాన్ని గుర్తించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. (ఈ ఏడాది ఐటీ కొలువులు లేనట్టే!) -
మహారాష్ట్ర కెమికల్ ఫాక్టరీలో ప్రమాదం
సాక్షి, ముంబై/పాల్ఘర్: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా బోయిసర్‌లోని కెమికల్ ఫాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఆంక్ అనే నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీలో శనివారం రాత్రి 7.20 గంటల సమయంలో కొన్ని కెమికల్స్‌ను పరీక్షిస్తున్న క్రమంలో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, పేలుడు ధాటికి కంపెనీ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల కిటికీలు బద్ధలయ్యాయని తెలిపారు. -
అంతా క్షణాల్లోనే..
సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం జిల్లా): ఉపాధి చూపిన పరిశ్రమే ఉసురు తీసింది.. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. నాన్న ఇంటికి వస్తాడని, తినుబండారాలు తెస్తాడని ఎదురుచూస్తున్న పిల్లలకు.. ఇక మీ నాన్న రాడన్న చేదు నిజం ఎలా చెప్పాలో తెలీక బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతి చెందిన కార్మికులిద్దరూ గుర్తు పట్టలేని విధంగా కాలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు అంతే లేదు. పరిశ్రమలోని కార్మికులు, పరిశ్రమ ప్రతినిధులు తెలిపిన వివరాలు ప్రకారం ఆదివారం పైడిభీమవరంలో ఉన్న అరబిందో పరిశ్రమలోని పవర్ ప్లాంట్‌లో సబ్ కాంట్రాక్ట్ అయిన త్రివేణి పవర్ కాంట్రాక్ట్‌లో పనిచేస్తున్న సేఫ్టీ ఆపరేటర్ రెడ్డి రాహుల్ (28), బాయిలర్ ఆపరేటర్ బొమ్మాలి రాజారావు (35)లు, మరో కార్మికుడు యందువ సన్యాసిరావు ఏ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో బాయిలర్ ప్లాంట్–3ని మండించేందుకు బొగ్గు సరఫరా చేరే కూలింగ్ పైపులను పర్యవేక్షిస్తున్న ముగ్గురిపైకి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో రాహుల్, రాజారావు అక్కడికక్కడే గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. యందువ సన్యాసిరావు కిందకు దూకేయడంతో కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. బాయిలర్–3లో ఈఎస్పీ సమస్య వల్ల టెంపరేచర్ పెరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ బాయిలర్ ప్లాంట్ సాంకేతిక సమస్యలతో గత 20 రోజులుగా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని అక్కడ పనిచేస్తున్న కార్మికులు చెబుతున్నారు. నైపుణ్యం కల్గిన ఇంజినీర్లను పిలిచి బాగు చేయాలని పరిశ్రమ యాజమాన్యానికి చెప్పినా వినిపించుకోలేనదని వారు ఆరోపిస్తున్నారు. రాజారావు అనే కార్మికుడికి అదే బాయిలర్ ప్లాంట్, అదే స్థలంలో రెండేళ్ల క్రితం చేయి కాలిపోయిందని, ప్రస్తుతం పూర్తిగా అతనే లేకుండా పోయాడని తోటి కార్మికులు చెబుతున్నారు. మృతుల పిల్లలంతా పసివారే.. ప్రమాదంలో మరణించిన రెడ్డి రాహుల్‌ది విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వివేకానందకాలనీ. ఇతనికి భార్య గాయత్రి, మూ డేళ్ల బాబు ఉన్నారు. బోమ్మాలి రాజారావుది శ్రీకాకుళం జిల్లా పలాస. ఇతనికి భార్య దేవి, ఇద్దరు చిన్నారి కుమార్తెలు ఉన్నారు. వీరు గత కొన్నేళ్లుగా రణస్థలంలో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. గాయాలపాలైన యందువ సన్యాసిరావుది రణస్థలం మండలంలోని నెలివాడ గ్రామం. సన్యాసికి విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన.. చనిపోయిన రాజారావు, రాహుల్ కుటుంబాలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాకే మృతదేహాలను ఇక్కడి నుండి శవపంచనామాకు తరలించాలని తొలుత కార్మికులు ఆందోళన చేశారు. పరిశ్రమలోనికి ప్రవేశించిన పోలీసులను, పరిశ్రమ ప్రతినిధులను అడ్డగించారు. శ్రీకాకుళం ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, డీఎస్పీ చక్రవర్తి ఎన్.వి.ఎస్ చక్రవర్తి నేతృత్వంలో జె.ఆర్.పురం సీఐ హెచ్.మల్లేశ్వరరావు, పొందూరు, నరసన్నపేట, రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు, తదితర ఎస్సైలు 150 మంది పోలీసులు కార్మికుల ఆందోళనను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మృతి చెందిన కార్మికులకు రూ.36 లక్షల పరిహారం రాహుల్, రాజారావుల కుటుంబాలకు రూ. 36 లక్షల వంతున పరిహారం ఇచ్చేందుకు యాజ మాన్యం అంగీకరించింది. పోలీసులు, కుటుం బ సభ్యులు, రెవెన్యూ అధికారులు, కార్మిక సంఘ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులతోపాటు పలువురు అరబిందో పరిశ్రమ యాజ మాన్యంతో చర్చలు జరిపారు. పరిహారంతోపా టు ఒకరికి ఉద్యోగం, పిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్య యాజమాన్యం అందించనుంది. చూస్తుండగానే కాలిపోయారు.. బాయిలర్‌లో ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. కాపాడమని ఆర్తనాదాలు చేస్తూనే రాహుల్, రాజారావు కాలిపోయా రు. నేను దిక్కుతోచక 20 అడుగుల పైనుం చి దూకేశాను. మేము పనిచేసే దగ్గర గత నెల రోజులుగా సాంకేతిక సమస్య ఉందని పరిశ్రమ యాజమాన్యానికి బాయిలర్ ఆ పరేటర్లు ఎన్నోసార్లు చెప్పారు. –గాయపడ్డ కార్మికుడు సన్యాసిరావు మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి ధర్మాన కృష్ణదాస్ పోలాకి: రణస్ధలం మండలం పైడిభీమవరం అరబిందో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఫార్మా పరిశ్రమలో ప్రమాదం గురించి మంత్రి ఆరా తీశారు. తక్షణం బాధితులకు అండగా వుండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం పూర్తిస్ధాయిలో అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని సైతం ఆదుకుంటామని చెప్పారు. మృతుడు రాజారావు ఇంటి వద్ద విషాదం కాశీబుగ్గ: అరబిందో ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు బోమ్మాళి రాజారావు ఇంటి వద్ద విషాదం నెలకొంది. అతని స్వస్థలం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉదయపురం. మున్సిపల్ కార్యాలయం అవుట్‌గేటు సమీపంలో కామాక్షమ్మ గుడి వద్ద ఉన్న రాజారావు ఇంటి వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు విషాద వదనాలతో దిగాలుగా కూర్చున్నారు. మృతదేహాన్ని పలాసకు ఆదివారం రాత్రి తీసుకువస్తున్నట్టు బంధువులు తెలిపారు. చిన్నమ్మడు, లక్ష్మణరావు దంపతుల ఇద్దరు కుమారులలో పెద్దవాడు రాజారావు. ఈ ఘటనలతో మృతుడి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు దీపిక, రష్మిత అనాథలయ్యారు.