కానరాని భద్రత చర్యలు... | Security measures do not fall into the molecule ... | Sakshi
Sakshi News home page

కానరాని భద్రత చర్యలు...

Published Mon, Sep 28 2015 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

Security measures do not fall into the molecule ...

ప్రమాదాల వెనుక భద్రతా ప్రమాణాల డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఏడాది జరిగిన అన్ని ప్రమాదాలూ భద్రత ప్రమాణాల లోటుపాట్లను ఎత్తిచూపుతున్నాయి. యాజమాన్యాలు, సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. చాలా కంపెనీలు కనీస నిబంధనలు పాటించడంలేదు. అగ్నిమాపక, పరిశ్రమల శాఖల నుంచి ఎన్‌వోసీలు కూడా లేకుండా కొన్ని కంపెనీలు నడుస్తున్నాయి. సంబందిత శాఖ అధికారులు మామూళ్ళకు కక్కుర్తి పడి ఆయా కంపెనీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తెలుస్తుంది.

కనీస అవగాహన లేని వందలాది మంది కార్మికులు ఫార్మాకంపెనీల్లో పనిచేస్తున్నారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో వీరిని విధుల్లో పెట్టడం వలన ఆపరేటింగ్, ఇతరాత్ర పనుల్లో తప్పులు దొర్లి ప్రమాదాలు సంబవిస్తున్నాయి.రసాయనాలు కలిపే సమాయాల్లో వేడి హెచ్చు తగ్గులు, నాసికరం పైపుల లీకేజీల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.రసాయనాలను ఒక దగ్గర ఉంచితే రియాక్షన్ ఏర్పడి మంటలు చెలరేగుతాయి. ఈ కారణంగానే ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి.విద్యుత్ ఉపకరణాలతో పనులు చేసేటపుడు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం.

వరుస ప్రమాదాలు:కొద్ది నెలల క్రితం గ్లొకెమ్ ఔషద కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు రూ.50 కోట్లకు పైగా ఆస్థినష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినా దాదాపు 200 మంది కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.ఈ కంపెనీలోనే విద్యుత్‌ఘాతం కారణంగా ఓ కార్మికుడు మరణించాడు.

ఐదు నెలల క్రితం ఇదే కంపెనీలో అగ్ని ప్రమాదంలో పది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కంపెనీలో భద్రత ప్రమాణాలు లేవన్న కారణంతో కొన్ని నెలలపాటు అధికారులు మూయించారు. ఆవ్రా, ఆక్టస్ ఫార్మాల్లో ఈ ఏడాది జరిగిన అగ్ని ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు.కనోరేయా పరిశ్రమలో స్టీమ్ పైప్‌లైన్ పగిలిపోయి మంటలు చెలరేగడంతో కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. అరబిందో కంపెనీలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.                                          
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement