సాక్షి, హైదరాబాద్: తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా చికిత్సనందించిన హెల్త్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలకు మ్యాన్‌కైండ్ ఫార్మా చేయూతగా నిలిచింది. అమరులైన ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.100 కోట్లు విరాళమిచ్చింది. కరోనా మహమ్మారి ప్రారంభ దశ నుంచీ మ్యాన్‌కైండ్ తన వంతు సాయమందిస్తూ వస్తోంది. 2020లో దాదాపు రూ.130 కోట్లు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్, సీఎం కేర్ ఫండ్, అమరులైన హెల్త్‌కేర్ వర్కర్లకు ఆర్థిక సహాయం అందజేసింది.
ఈ సందర్భంగా మ్యాన్‌కైండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్‌చైర్మన్ రాజీవ్ జునేజా మాట్లాడుతూ కరోనా సోకిన వారికి చికిత్స అందించడంలో ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి ఎనలేని కృషిచేస్తున్నారని, ఈ నేపథ్యంలో వారికి ఆర్థికంగా మద్దతుగా నిలుస్తున్నామని అన్నారు.
చదవండి: కరోనా కల్లోలం: సచిన్, ఐపీఎల్ జట్ల విరాళాలు ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment