జైడస్‌ చేతికి న్యులిబ్రీ ఔషధం | Zydus unit to acquire brand from US based Bridge Bio Pharma | Sakshi
Sakshi News home page

జైడస్‌ చేతికి న్యులిబ్రీ ఔషధం

Published Wed, Mar 9 2022 3:12 PM | Last Updated on Wed, Mar 9 2022 3:21 PM

Zydus unit to acquire brand from US based Bridge Bio Pharma - Sakshi

న్యూఢిల్లీ: యూఎస్‌ కంపెనీ బ్రిడ్జ్‌బయో ఫార్మా నుంచి ఫాస్డోనొప్టె రిన్‌(న్యులిబ్రీ) ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు అనుబంధ సంస్థ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెల్త్‌కేర్‌ దిగ్గజం జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ తాజాగా పేర్కొంది. సెంటిల్‌ థెరప్యూటిక్స్‌ ఇంక్‌ నుంచి ఈ ఇంజక్షన్‌ ఔషధ బ్రాండును సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు అసెట్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసినట్లు వెల్లడించింది.

ఎంవోసీడీ టైప్‌-ఏ వ్యాధిగ్రస్తుల చికిత్సకు వినియోగించగల ఈ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులున్నట్లు పేర్కొంది. శిశువుల్లో అత్యంత అరుదుగా కనిపించే జెనెటిక్‌ సంబంధ ఈ వ్యాధి మరణాలకు దారితీయవచ్చని కంపెనీ వివరించింది. ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం యూఎస్‌లో న్యులిబ్రీ ఔషధ అభివృద్ధి, కమర్షియలైజేషన్‌ బాధ్యతలతోపాటు.. అంతర్జాతీయంగానూ అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌ను సైతం సెంటిల్‌ చేపడుతుందని జైడస్‌ వివరించింది. 

(చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement