మెదక్ జిల్లా హత్నూరు మండలం బోరపట్లలోని అరబిందో ఫార్మా కంపెనీ ప్లాంటుకు అదనంగా భూమి కేటాయించవద్దంటూ గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై ఆందోళన నిర్వహించగా, సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు ఫ్యాక్టరీ ముందు ఒకరోజు ధర్నాకు దిగారు.
పొల్యూషన్ కంపెనీ మాకొద్దు, రోగాలు మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. సర్వే నెంబర్ 379లో 37 ఎకరాల భూమిని గతంలో పేదలకు కేటాయించారు. అనంతరం అదే భూమి పోలీసు శాఖకు ఆ తర్వాత టీఎస్‌ఐఐసీకి బదిలీ అయింది. ఇప్పుడు అదే భూమిని అరబిందోకు కేటాయించే ప్రతిపాదనను గ్రామస్తులు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఫ్యాక్టరీ కాలుష్యపు నీరుతో నిండి, కబ్జాకు గురైన కంసానికుంట, న్యారేటికుంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.