అచ్యుతాపురం ఘటనపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్
ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
నేడు ఘటనాస్థలికి ముఖ్యమంత్రి
సాక్షి, అమరావతి: అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని, ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుదని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులతో బుధవారం రాత్రి ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి, బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతకు ముందు ఈ ఘటనపై ఆయన అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హెల్త్ సెక్రటరీని తక్షణమే అచ్యుతాపురం వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వినియోగించాలని సూచించారు. కాగా, గురువారం ఘటన స్థలికి చంద్రబాబు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment