విజయనగరం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లిలో ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. శుక్రవారం కంపెనీలోని యూనిట్-8 లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కు తరిలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.