
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ ఉత్పత్తి చేస్తున్న హెల్త్ ఓకే మల్టీ విటమిన్, మినరల్ ట్యాబ్లెట్లకు సినీ నటులు మహేష్ బాబు, సుదీప్‌ను దక్షిణాది బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. త్వరలో హెల్త్ ఓకే ట్యాబ్లెట్ల ఉపయోగాలపై మహేష్, సుదీప్‌ల ప్రకటనలు దక్షిణాది ఛానళ్లలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది.
తద్వారా కస్టమర్లకు మరింత చేరువ అవుతామని మ్యాన్‌కైండ్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. హెల్త్ ఓకేతో జతకట్టడంపై ఇరువురు నటులు హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుల ప్రచారంతో అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ సేల్స్ మేనేజర్ జోయ్ ఛటర్జీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment